🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*🌷మన మహర్షుల చరిత్రలు🌷*
🌷🌷🌷
*🌹ఈ రోజు 40వ, దేవల మహర్షి గురించి తెలుసుకుందాం 🌹*
🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
🍁పూర్వం దేవుడనే మనువుండేవాడు . అతని కొడుకు ప్రజాపతి . ప్రజాపతి కొడుకు ప్రత్యూషుడు . ప్రత్యూష్యుడికి ఇద్దరు కొడుకులు .
☘️మొదటివాడు దేవలుడు రెండవవాడు విభువు . దేవలుడు నల్లగా ఉండేవాడు . అందుకే అతడిని ' అసితుడని ' కూడా పిలిచేవాళ్ళు .
🍁దేవలుడు పెద్దవాడయ్యాక విద్యాభ్యాసానికి వ్యాసుడి దగ్గరకి పంపాడు తండ్రి .
☘️దేవలుడు చక్కటి గుర్తుభక్తితో విద్య నేర్చుకున్నాడు .
వ్యాసుడు తాను రాసిన మహాభారతాన్ని వ్యాప్తి చెయ్యమని పితృలోకం పంపించాడు దేవలుడిని .
🍁గురువు గారు చెప్పినట్లే చేశాడు దేవలుడు . గురువు గారిని మించిన శిష్యుడని అందరూ మెచ్చుకున్నారు .
☘️దేవలుడు గొప్ప తపస్విగా , సత్యవ్రతుల్లో మొదటివాడుగా బ్రహ్మనిష్ఠ గలవాడుగా పేరుపొందాడు .
🍁ఒకసారి జైగీషవ్యుడు దేవలుడున్న చోటికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు .
☘️బృహస్పతి లాంటి పెద్దలందరు వచ్చి దేవల జైగీషవ్యులున్న ప్రదేశాన్ని దివ్యతీర్థంగా ప్రశంసించారు .
🍁దేవలుడు అందరి దగ్గర సెలవు తీసుకుని సింధునదీ తీరానికి వెళ్ళిపోయాడు .
☘️దేవలుడు ఒక చెఱువులో స్నానం చేస్తుంటే ' హూహూ ' అనే పేరుగల గంధర్వుడు అదే చెఱువులో తన భార్యలో స్నానం చేస్తూ దేవలుడి పాదాలు పట్టుకుని బాధపెట్టడం మొదలుపెట్టాడు .
🍁దేవలుడు కోపంతో గంధర్వుడిని మొసలిగా పుట్టమని శపించాడు . గంధర్వుడు దేవలుడిని రక్షించమని ప్రార్థించాడు .
☘️నువ్వు మొసలివై ఒక ఏనుగుని పట్టుకున్నప్పుడు ఏనుగుని రక్షించడానికి విష్ణుమూర్తి వస్తాడు . అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుందని చెప్పాడు దేవలుడు .
🍁మీరు గజేంద్రమోక్షం అనే కధలో తెలుసుకునే వుంటారు . ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్న మొసలే ఈ గంధర్వుడు .
☘️బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు గానీ , వస్త్రాలు తయారు చెయ్యడం రాక శివుడికి ఆపని అప్పగించాడు .
🍁శివుడు ఇది నావల్ల కాదు
నా ప్రియశిష్యుడు దేవలుడికి అప్పగిస్తానని చెప్పాడు .
☘️శివుడి ఆజ్ఞ ప్రకారం దేవలుడు వస్త్రాలు తయారుచేసి దేవతలకిచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందాడు.
🍁 దేవలుడు కఠోర దీక్షలో వుండి తపస్సు చేసుకుంటుంటే రంభ వచ్చి తనతో గడపమని అడిగింది .
☘️దేవలుడు అందుకు అంగీకరించలేదు . తన మాట వినలేదు గనుక శూద్రుడిగా పుట్టమని దేవలుడిని శపించింది .
🍁రంభ శాపం వల్ల దేవాంగ కులంలో పుట్టిన దేవలుడు రకరకాల వస్త్రాల్ని తయారు చెయ్యడం మొదలు పెట్టి తన కొడుకులు దివ్యాంగుడు ,
☘️విమలాంగుడు , ధవలాంగుడు ముగ్గురితో కలసి నేత పరిశ్రమని లోకంలో వ్యాపించేలా చేశాడు.
🍁దేవాంగుడు పై లోకాల కెళ్ళాడు . అక్కడ శేషుడి కూతురు చంద్రలేఖని , సూర్యుడి సోదరి దేవదత్తిని పెళ్లి చేసుకుని వంశవృద్ధి జరిగాక సన్యాసం తీసుకుని మోక్షాన్ని పొందాడు.
☘️ఒకసారి నారదుడు దేవలుడి దగ్గరకి వచ్చి ఈ ప్రపంచం ఎల్లా పుట్టిందీ , ప్రళయకాలంలో ఏమవుతోంది ? మొదలయిన విషయాలు అడిగి తెలుసుకున్నాడు .
🍁దేవలుడు తీర్థయాత్రలు చేస్తూ గంగాస్నానం చేసి విష్ణుజపం చేస్తుండగా అతడికి పితృదేవతలు కనిపించి
☘️పున్నామ నరకం నుంచి రక్షించమని వేడుకున్నారు . నాయనా !
బ్రహ్మచర్యం వలన ముని ఋణం తీరుతుంది .
🍁అగ్నిహోత్రానికి సంబంధించిన పనులవల్ల దేవ ఋణం తీరుతుంది .
పెళ్ళిచేసుకుని మంచి సంతానం పొందితేనే పితృదేవతల ఋణం తీరుతుంది .
☘️కాబట్టి నువ్వు పెళ్ళి చేసుకుని మాకు మోక్షంకలిగేలా చెయ్యమన్నారు పితృదేవతలు .
🍁అయ్యా ! నేను పెద్దవాడ్నయ్యాను .
ఈ వయస్సులో నాకు పిల్లనెవరిస్తారు ? అని అడిగాడు దేవలుడు .
☘️కౌండిన్యుడనే మహామునికి ఒక కుమార్తెవుంది . ఆమెని నువ్వు పెళ్ళి చేసుకో . ఆమెను నీ కోసమే బ్రహ్మ సృష్టించాడని చెప్పారు పితృదేవతలు .
🍁దేవలుడు బయలుదేరి కౌండిన్యుడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు .
☘️దేవలుడి గురించి తెలిసిన కౌండిన్యుడు తనకుమార్తెను దేవలుడికిచ్చి పెళ్ళి జరిపించాడు .
🍁కొంతకాలానికి దేవలుడికి సువర్చల అనే కూతురు కొంతమంది కొడుకులు పుట్టారు .
☘️పితృదేవతల ఋణం కూడా తీర్చుకున్నాడు దేవలుడు . సువర్చలని ఆమె కోరిక ప్రకారం శ్వేతకేతుడికిచ్చి పెళ్ళి జరిపించాడు .
🍁దేవల మహర్షి మహాధర్మశాస్త్రాన్ని ప్రతిపాదించాడు . ఈయన రాసిన ' దేవలస్మృతి ' ఇంకా పూర్తిగా దొరకలేదు .
☘️దేవల మహర్షి , దివ్యి , మహాతపస్వి , యోగీశ్వరుడు , ధర్మశాస్త్ర ప్రవక్త , మహా పురుషుడుగా ప్రసిద్ధికెక్కాడు .
🍁భారతదేశ మహర్షుల్లో గొప్ప ఋషిగా పేరు పొందాడు . ఇదండి దేవల మహర్షి గురించి మనం తెలుసుకున్న విషయాలు
☘️రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాము స్వస్తి..
సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి