ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ
చేద్దాము చేయిద్దాము
భగవద్గీత 1వ అధ్యాయం అర్జునవిషాద యోగం
32 వ శ్లోకం- నకాంక్షేవిజయం కృష్ణ, నచరాజ్యం సుఖానిచ |
కింనోరాజ్యేన గోవిందా, కింభోగైర్ జీవితే నవా ||
అర్థం- అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు ఓ కృష్ణా! నాకు విజయం కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరలేదు. గోవిందా!ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనం ఏమిటి?
-----------------------------------------------
అర్జునుడికి ఏదో ఒక విధంగా తీవ్రమైన వైరాగ్యము వచ్చింది. తీవ్రమైన వైరాగ్యము ఉన్న వారికే బ్రహ్మజ్ఞానం ఉపదేశించాలి అని శాస్త్రం చెబుతోంది.అర్జునుడికి ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగింది. రాజ్యాన్ని భోగాలను అతడు గడ్డి పరికలా చూస్తున్నాడు.ఇంతవరకు ఎప్పుడూ అర్జునుడికి ఇటువంటి భావనలు కలగలేదు. ఇప్పుడు కలగడం చూసిన శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో భగవద్గీతను అర్జునుడికి బోధించాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే మనకు కూడా అర్జునుడిలా భగవద్గీత మీద తీవ్రమైన భక్తి,శ్రద్ధ,కోరిక ఉండాలి. అప్పుడే భగవద్గీత అర్థం అవుతుంది బ్రహ్మజ్ఞానం సంప్రాప్తిస్తుంది.తద్వారా మనస్సు ప్రశాంతంగా,ఆరోగ్యంగా ఉంటుంది.
షేర్ చేసి మన వారందరికీ ప్రతిరోజు ఒక్కభగవద్గీత శ్లోకం పారాయణ చేసే అదృష్టాన్ని కల్పిద్దాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి