27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

*28, సెప్టెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🍁 *శనివారం*🍁

🌹 *28, సెప్టెంబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                  


          *ఈనాటి పర్వం* 

    *సర్వేషాం ఇన్దిరైకాదశి* 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి     : ఏకాదశి* మ 02.49 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* రా 03.38 వరకు ఉపరి *మఖ*


*యోగం  : సిద్ధ* రా 11.51 వరకు ఉపరి *సాధ్య*

*కరణం  : బాలువ* మ 02.49 *కౌలువ* రా 03.45 తె వరకు


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 08.00 - 09.00  మ 02.00 - 03.30*

అమృత కాలం  :*రా 01.53 - 03.38*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.22*


*వర్జ్యం          : మ 03.22 - 05.07*

*దుర్ముహూర్తం:ఉ 05.57 - 07.33*

*రాహు కాలం: ఉ 08.57 - 10.28*

గుళికకాళం      : *ఉ 05.57 - 07.27*

యమగండం    : *మ 01.28 - 02.58*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.57* 

సూర్యాస్తమయం :*సా 05.59*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.57 - 08.21*

సంగవ కాలం   :      *08.21 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.10*

అపరాహ్న కాలం:*మ 01.10 - 03.34*

*ఆబ్ధికం తిధి      : శూన్య తిథి*

సాయంకాలం  :  *సా 03.34 - 05.59*

ప్రదోష కాలం   :  *సా 05.59 - 08.22*

రాత్రి కాలం     :  *రా 08.22 - 11.34*

నిశీధి కాలం      :*రా 11.34 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*


వేదాంత-వేద్య భవసాగర-కర్ణధార

శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ 

లోకైకపావన పరాత్పర పాపహారిన్

శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్


🙏 *ఓం నమో వెంకటేశాయ*🙏

********************************


    🍁 *హనుమకృత* 🍁

      *సీతారామ స్తోత్రం..!!*


అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహదంపతీ|

ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతామ్


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

డస్ట్ అలర్జీ నివారణ కొరకు అద్బుత యోగం -

 డస్ట్ అలర్జీ నివారణ కొరకు అద్బుత యోగం  - 


      కొంతమంది కి ఉదయం నిద్రలేవడం తోనే తుమ్ములతోనే దినచర్య ప్రారంభం అవుతుంది.  విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. వారికోసం ఈ అద్బుత యోగం .


    తులసి , పుదీనా , రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని ఒక కప్పు కషాయం తీసుకొండి నెలరోజుల్లో మీ సమస్య తీరిపోతుంది. మీ తుమ్ములు కూడా మాయం అయిపోతాయి. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి . ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం మీకు పూర్తి ఉపశమనం ఇస్తుంది. 


     ఇది మా అనుభవపూర్వకమైన ఆయుర్వేద ఔషధ యోగం .


   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

జయదేవుని అష్టపది*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *జయదేవుని అష్టపది*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*హరిరిహ ముగ్ధవధూనికరే*

*విలాసిని విలసతి కేళి పరే..*

*ఆ ….. ఆ…….. ఆ……..*


*చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ*

*చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ*

*కేళి చలన్మణి కుండల మండిత గండయు గస్మిత శాలీ*


*హరిరిహ ముగ్ధవధూనికరే*

*విలాసిని విలసతి కేళి పరే..*


*కాపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం*

*ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ ఆ......*

*కాపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం*

*ధ్యాయతి ముగ్ధ వధూరధికం*

*మధుసూధన వదన సరోజం*

*ధ్యాయతి ముగ్ధ వధూరధికం*

*మధుసూధన వదన సరోజం*


*హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరే*


*శ్లిష్యతి కామపి చుంబతి కామపి*

*రమయతి కామపి రామా......*

*శ్లిష్యతి కామపి చుంబతి కామపి*

*రమయతి కామపి రామా*

*పశ్యతి సస్మిత చారుతరామ పరాయను గచ్ఛతి వామా ....*

*హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరే*


*చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శ్రీ కృష్ణాయ నమః ।*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

తీర్ధ ప్రసాదం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

            *తీర్ధ ప్రసాదం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ప్రసాదాలు ఎన్నిరకాలుగా ఉన్నా , సాధారణంగా ఆలయాలలో మనకి ఇచ్చే తీర్థము తులసీదళములతో ఉన్న తీర్థము, కొబ్బరి నీళ్లు లేదా పంచామృతాలతో నిండినది ఇవన్నీ కాకుంటే, అభిషేకజలము ఇస్తుంటారు. ఇది మంత్రపూరితమై దివత్వాన్ని పొంది ఉంటుంది.*


*అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం!*


*సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!*


*అంటూ మూడుసార్లు అక్కడి ఆచార్యవర్యులు తీర్థాన్నిస్తారు . ఈ విధంగా మూడుసార్లు తీర్థాన్నివ్వడంలోనూ గొప్ప ఆంతర్యం ఉంది.*


*మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటుంది . రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. పరివర్తన వలన దోషాలు పరిహరించబడతాయి. సర్వవ్యాధి బాధలు కూడా నివృత్తి అవుతాయి. ఇక, మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి. దీనివలన సమస్త పాపములు నశించి, భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది.*


*పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు స్వీకరించడం వలన  భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. ఇవి సాధారణంగా ఆలయాలలో అనుసరించే నియమాల ఆధారంగా నాలుగు రకాలుగా ఉండవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. అవేమంటే*


*1) జల తీర్ధం*

*2) కషాయ తీర్ధం*

*3) పంచామృత తీర్ధం*

*4) పానకా తీర్ధం*


*1) జల తీర్ధం:-*


*తీర్థాన్నిచ్చేప్పుడు ఆచార్యవర్యులు చెప్పినట్టు అకాలమరణం నివారించబడుతుంది . కష్టాలనుండి విముక్తి లభిస్తుంది .  సర్వరోగాలు హరించబడతాయి . బుద్ధి ధర్మ పరివర్తనని పొంది, చక్కని సత్యమార్గంలో వ్యక్తి ప్రయాణించే అవకాశం ఉంటుంది.*


*2) కషాయ తీర్ధం:-*


*ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం, కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం , అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనిపెంచే, కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.*


*3) పంచామృత అభిషేక తీర్థం:-*


*పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటమే కాకుండా, బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని శాస్త్రవచనం.*


*4) పానక తీర్ధం:-*


*శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి దేవునిగా వారు ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భగవంతునికి అర్పించిన పానకా తీర్ధాన్ని సేవిస్తే, దేహంలో ఉత్సహం పెరిగి, భగవానుగ్రహముతో  కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి, తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. రుమాటిజం, ఎముకలుకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు.*


*ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల బాధ ఉండదు.  బుద్ధి  చురుకుగా పని చేస్తుంది.  జ్ఞాపకశక్తి పెరుగుతుంది.*


*ఈ సారి ఆలయంలో కానీ, ఇంట్లోకానీ పూజానంతరం తీర్థాన్ని సేవించేప్పుడు ఈ విషయాలని జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రయత్నం చేయండి. శుభం !*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

జటాయువు – భీష్ముడు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *జటాయువు – భీష్ముడు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*రామాయణంలో జటాయువు...మహాభారతంలో భీష్ముడు..వీళ్లిద్దరికీ పోలిక ఏంటి అనుకుంటున్నారా...*


*జటాయువు మరణం:~*


*రామాయణంలో జటాయువు పాత్ర ఏంటో గుర్తుంది కదా..రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతున్నప్పుడు జటాయువు పోరాడి రావణుడి కత్తిపోట్లకు గురవుతాడు. ఈ జటాయువు ఎవరంటే.. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజుకి ప్రాణ స్నేహితుడు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ స్నేహితుడిగానే చూశాడు. అయితే రావణుడు...రెండు రెక్కల్ని విరిచేశాక నేలకూలిన జటాయువు తుదిశ్వాస విడుస్తున్నప్పుడు కూడా ఏమన్నాడంటే...*


*”నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా పోరాడాను..నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అనుకుంటారు అన్నాడు. అప్పుడు కూడా మృత్యువుకు సవాలు విసిరాడు “జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయొద్దు. నేను ఎప్పటివరకూ మరణాన్ని అంగీకరించనో.. అప్పటి వరకు నన్ను తాకవద్దు..నేను సీతమ్మ సమాచారం శ్రీరాముడికి చెప్పిన తర్వాతే ప్రాణం విడుస్తానని చెప్పాడు.. అలాగే . రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి ... సీతమ్మ వివరాలు చెప్పిన తర్వాతే ప్రాణం విడిచాడు. అంటే కోరుకోగానే మరణించే వరం జటాయువుకి వచ్చింది.*


*భీష్ముడు-జటాయువు:~*


*మహాభారతంలో భీష్ముడు ఆరునెలలు అంపశయ్యపై పడుకుని మరణం కోసం ఎదురుచూశాడు. ఆ సమయంలో భీష్ముడి కళ్లలో కన్నీళ్లున్నాయి.. భగవంతుడైన శ్రీ కృష్ణుడు మనసులోనే తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నాడు.*


*రామాయణంలో మాత్రం జటాయువు.. శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు.. రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటుంటే..జటాయువు చిరునవ్వు నవ్వుతాడు.*


*జటాయువుకు ప్రభువు “శ్రీరాముడి” ఒడి పాన్పుగా మారితే.. భీష్ణుడికి బాణాలు పాన్పు అయ్యాయి.*


*జటాయువు తన కర్మ బలం ద్వారా “శ్రీరాముడి” యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేశాడు... భీష్ముడు అంపశయ్య పై మరణం కోసం ఎదురుచూశాడు.*


*ఎందుకీ వ్యత్యాసం:~*


*ద్రౌపదిని నిండుసభకి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేసి అవమానిస్తుంటే చూస్తూ ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయిన వారిలో భీష్ముడు కూడా ఉన్నాడు. పరోక్షంగా దుశ్శాసనుడికి ధైర్యం ఇచ్చారు, దుర్యోధనుడి కి అవకాశం ఇచ్చాడు కాని ఏడుస్తున్నా, అరుస్తున్నా ద్రౌపదిని రక్షించలేదు. ఇందుకు ఫలితమే అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూడడం. వాస్తవానికి భీష్ముడికి కోరుకున్నప్పుడే మరణం వరించే వరం ఉంది... కానీ ఫలానా రోజు మరణించాలి అప్పటి వరకూ అంపశయ్యపై ప్రాణాలతో ఉండాలనుకున్నది కర్మ ఫలితం అనుభవించేందుకే.*


*జటాయువు స్నేహధర్మం పాటించాడు.. కష్టంలో ఉన్న స్త్రీకి అండగా నిలిచాడు.. తాను విజేతగా నిలవలేడని తెలిసినా ప్రయత్నం మానలేదు.. అందుకే మరణించేటప్పుడు శ్రీరాముడి ఒడి పాన్పు అయ్యింది.. కోరుకున్నప్పుడే మరణం వచ్చింది.*


*కళ్లముందు తప్పు జరుగుతున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన వారికి.. సాధ్యమో అసాధ్యమో తమవంతు ప్రయత్నం చేసిన వారికి మధ్య వ్యత్యాసం ఎప్పటికీ ఉంటుంది. మీరు పొందే కీర్తి-గౌరవానికి మీ ప్రవర్తన, కష్టాల్లో అండగా నిలిచే తత్వమే కారణం అవుతుంది.. మౌనం అవసరం లేని దగ్గర మౌనం వహిస్తే అందుకు తగిన కర్మఫలం అనుభవించక తప్పదు.*


*జై శ్రీ రామ్।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

*శత శ్లోకేన పండిత:*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *శత శ్లోకేన పండిత:*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*శత నిష్కో ధనాఢ్యశ్చ*

*శత గ్రామేణ భూపతి:।*


*శతాశ్వ: క్షత్రియో రాజా*

*శత శ్లోకేన పండిత:॥*


*భావం:~*


*వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

పూజ ఎందుకు చేయాలి

 జై శ్రీ రామ్ 

పూజ ఎందుకు చేయాలి?  లాభం?

పై ప్రశ్న చిన్న పిల్లలు అడిగారు అంటే అర్ధం ఉంది, కానీ నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా, ప్రపంచ వ్యామోహము లో మునిగి, అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా, ఇదే ప్రశ్న అడుగుతునారు. మనము వెంటనే, పూజ చేయక పోతే, కళ్ళు పోతాయి లేదా సంపదలు పోతాయి, లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాం. ఎందుకంటే, మనకు కూడా, పూర్తి అవగాహన ఉండదు, పూజ ఎందుకు అని. మనము పెట్టె ప్రసాదము దేవుడు ఆరగిస్తున్నారా? ఆరగిస్తే, ఇక నైవద్యం పెడతామా, ఆయన కడుపు నిండాలంటే, ఎన్ని గుండిగల ప్రసాదం పెట్టాలి, తిరుపతి వెంకన్న దగ్గర పెట్టిన విధముగా? అందుకే ఆయన తెలికగా తెలివిగా, బీదవారు కూడా పెట్టగలిగే విధముగా, కాణీ ఖర్చు లేకుండా, మన మనసు నైవేద్యంగా పెట్టాలి అని, ఎప్పుడో చెప్పారు. దేవుడు నిరాకారుడు నిరంజనుడు, ఈ ప్రపంచమంతా వ్యాపించిన వాడు నడిపిస్తున్నవాడు, నీలో నాలో ఉన్నాడు చైతన్యములా. ఆ చైతన్యము పోతే, మనిషి శవము తో సమానము. కాకపోతే, అది అర్ధం కావడానికి ఆచరణలో సాధన చేడానికి, మనసు నిలవాలి సహకరించాలి. దానికే పూజ మొదటి మెట్టు, మన కోసం.

కొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య  హి ధ్రువో మృత్యుః  ధ్రువం  జన్మ  మృతస్య చ ...’’ ..వెళ్ళవలసిందే. తప్పదు... వాడుంటే చాలు.. తనూభవుడు... ఒక ఊరట. ‘‘ఆత్మావై పుత్రనామాసి...’’ (ఓ పుత్రా! నేనే నువ్వు) ఈశ్వరుడు ఎంత ఊరట కల్పించాడో చూడండి!!! మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది...అంటే వివాహం వల్ల. ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం... ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తడవవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం.

తరువాత.. వైరాగ్య సుఖం... అదెట్లా రావాలి! రామకృష్ణ పరమహంస– ‘బొట్టుబొట్టుగా రాదు, వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది’..అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్ళీ మునుపటి జీవితంలోకి రాడు.. ‘‘యోగరతో వాభోగరతోవా/సం^గరతో వా సంగవిహీనః /యస్య బ్రహ్మని రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ...’’.. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం. ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం– కృతజ్ఞత కలిగి ఉండడం.‘‘బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా / నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః’’అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధ కాండలో. ఎవరికయినా నిష్కృతి ఉందేమో కానీ, పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు.

ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం... అందుకే..ఏష ధర్మః సనాతనః(ఇదీ మన సనాతన ధర్మం) అంటారు రామాయణంలో. బద్దెన గారు కూడా..‘‘ఉపకారికినుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’.. అన్నారు కదా! అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి... అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి.  ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చీరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం. హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడితో.. ‘అనుదిన సంతోషణములు జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్‌ తనయుల సంభాషణములు  జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‌‘ అంటాడు. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ ఐదు ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, అంటే మనము మనసు తో చేసే వ్యాయామం, అంటే మానసిక సాధన. మనసును స్థిరపరచుకోవడానికి ఇదొక మార్గము. అందుకే పూజలో భాగం ధ్యానము కూడా మొదట, తర్వాత, ధ్యానం లోనే దేవుని పూజ. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి, మన మెదడుని మనమే సక్రమమైన పద్దతిలో పెట్టుకునే, ఓ ప్రక్రియ. మనసు నియంత్రణ లేని వారు, ఎలా పతనమౌతున్నారో, చూస్తున్నారు కదా? ఆత్మహత్యలు, తాగుడు, జూదము, మత్తు మందు, కోపము, తల్లి దండ్రులను తూలనాడడము వదిలేయడము, ఇంకా ఎన్నో విచిత్రాలు చూస్తున్నాము, చూస్తాము. నూనే లేదా నెయ్యి దీపం వెలుగులు పెట్టడం అన్నది, త్రాటకం అనే ఓ యోగ ప్రక్రియ అంటారు. రోజూ ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే, కంటి జబ్బులను అరికట్టవచ్చు అని, పెద్దలు అంటారు.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే లేదా 108 నామాలు చదివితే, నాలిక మొద్దు బారదు, మాట స్పష్టత వస్తుంది. అది నాలికకు ఓ వ్యాయామము అనవచ్చు కదా? అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా, పలకగలిగే శక్తి వస్తుంది, ఉచ్చారణా అలాగే ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే, సభా లేదా పదిమంది లో మాట్లాడే, భయం కూడా‌ పోతుంది, ధైర్యం వస్తుంది. బెరుకుగా, గొంతు ఎత్తి మాట్లాడలేని బయటకు చెప్పలేని వాళ్ళను, పదిమంది లో మాట్లాడలేని వారిని, ఎంతో మందిని చూస్తున్నాము కదా? పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పగలరు, మనల్ని మనము సరిగ్గ మార్చుకునే విధానము అని చెప్పగలరు.

జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ

సత్సంగం

 🔔 *సత్సంగం* 🔔


ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది.

దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు.

త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు.

ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది.

ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది.

సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు.


సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి.

అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.


ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది.

శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు,

గోసూక్తం కూడా చెప్పబడింది.

గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.


 ఋగ్వేదంలో ఆవును “అఘణ్య” అన్నారు.


సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది.

సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి.

అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.

లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం.


ఆ సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి.

వాటి మగ సంతతి వృషభాలు.


“గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ”


ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది.

గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది.

అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.


క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది.

వీటినే కామధేనువులు అంటారు.


వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి.

ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను,బభ్రు వర్ణములోను,

శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు,

పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.  —స్కాంద పురాణము.


గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

“ధేనునా మస్మి కామధుక్” అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు.


గోవు లక్ష్మీ స్వరూపం.


దీనికి ఒక పురాణ గాధ ఉంది.

దేవతలందరూ వచ్చి గోవుతో “తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమ”ని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.


సురభి ఒక్కసారి తపస్సునారంభించనది.

బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు.

సురభికి అమరత్వమును ప్రసాదించారు.

త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు.

దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు.


గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు.


ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు.

శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!


స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి.

ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.


గోమయములో లక్ష్మీ దేవి, 

గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు.

గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది.


గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.


“ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు.


మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది.


గోమాత  కీర్తనం శ్రవణం - దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, 

గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… 

అన్నీ పుణ్యప్రదమైనవే.


గోమాత పాదాలకు శతకోటి వందనాలు

విన్నవారికి, చదివిన వారికి -

విష్ణు శివ లోక ప్రాప్తి

పంపిన వారికి - పుణ్యలోక ప్రాప్తి.....

నమామి గోమాతరమ్

రాణి రసమణి*

 *26 సెప్టెంబర్ - పుట్టినరోజు* 


 *సామాజిక కార్యకర్త - రాణి రసమణి* 


కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ ఆలయం దాని పూజారి శ్రీ రామకృష్ణ పరమహంస పేరు ప్రసిద్ధి చెందింది; కానీ ఆలయాన్ని నిర్మించిన రాణి రాస్మణి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాణి 26 సెప్టెంబర్ 1793న బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలోని హాలీ పట్టణంలో గంగానది ఒడ్డున ఉన్న కోనా గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి శ్రీ హరేకృష్ణ దాస్ ఒక సాధారణ రైతు. కుటుంబ ఖర్చుల కోసం వ్యవసాయంతో పాటు భూస్వామికి కొన్ని పనులు కూడా చేసేవాడు. రాత్రి సమయంలో ఆమె తండ్రి రామాయణం, భాగవతం మొదలైనవాటిని ప్రజలకు చెప్పేవారు. ఈ కారణంగా, రసమణి ఆధ్యాత్మికత, పేదలకు సేవ చేయడం ప్రారంభించింది.


రసమణి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అటువంటి పరిస్థితిలో, ఆమె అత్త ఆమెని చూసుకుంది. అప్పటి సంప్రదాయం ప్రకారం, 11 సంవత్సరాల వయస్సులో, బెంగాల్‌కు చెందిన పెద్ద భూస్వామి ప్రీతమ్ బాబు కుమారుడు రామచంద్ర దాస్‌తో ఆమె వివాహం జరిగింది. అలాంటి గొప్ప డబ్బున్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా రసమణి ఎప్పుడు గర్వపడలేదు. 1823 నాటి భయంకరమైన వరదల సమయంలో, ఆమె అనేక ధాన్యాగారాలు తెరిచి ఆశ్రయాలను నిర్మించింది. ఇది ఆమెకు అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది మరియు ప్రజలు ఆమెను 'రాణి' అని పిలవడం ప్రారంభించారు.


పెళ్లయిన కొన్నేళ్లకే భర్త చనిపోయాడు. అప్పటికి ఆమె నలుగురు కుమార్తెలకు తల్లి అయింది; ఆమెకి కొడుకు లేడు. ఇప్పుడు ఆస్తులన్నీ చూసుకునే బాధ్యత ఆమెపైనే పడింది. తన అల్లుడు మధురనాథ్‌తో కలిసి అన్ని పనులను నిర్వహించేది. మంచి నిర్వహణ కారణంగా వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. రాణి అన్ని పండుగలలో పేదలకు ఎప్పుడు సహాయం చేసేది. ప్రజల సౌకర్యార్థం గంగానది ఒడ్డున అనేక ఘాట్‌లు, రోడ్లు, జగన్నాథునికి రూ.1.25 లక్షలు ఖర్చుతో తయారు చేసిన వెండి రథాన్ని కూడా బహుకరించింది. 


రాణి బ్రిటిష్ సామ్రాజ్యంతో చాలాసార్లు ఘర్షణ పడింది. ఒకసారి బ్రిటీష్ వారు దుర్గాపూజ పండుగ స్థలం కోసం ఆమె పై దావా వేశారు. ఇందులో రాణి జరిమానా చెల్లించవలసి వచ్చింది; కానీ రాణి తరువాత ఆ ప్రదేశం, మార్గాన్ని మొత్తం కొనుగోలు చేసి అక్కడ బ్రిటిష్ వారు రాకుండా నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం రాణితో రాజీ కుదిర్చి జరిమానాను తిరిగి చెల్లించింది. ఒకప్పుడు ప్రభుత్వం చేపల వేటపై పన్ను విధించింది. మత్స్యకారుల కష్టాలు తెలుసుకున్న రాణి తీరం మొత్తాన్ని కొనుగోలు చేసింది. దీని కారణంగా, పెద్ద బ్రిటీష్ నౌకలు అక్కడి నుండి వెళ్ళడానికి ఇబ్బంది పడటం ప్రారంభించాయి. ఈసారి కూడా ప్రభుత్వం తలవంచి మత్స్యకారులపై అన్ని ఆంక్షలను తొలగించాల్సి వచ్చింది.


ఒకసారి కాళీమాత ఆమె కలలో భవతారిణి రూపంలో రాణికి కనిపించింది. దీనిపై రాణి హుగ్లీ నదికి సమీపంలో కాళీ మాత గొప్ప ఆలయాన్ని నిర్మించింది. ఐతే తర్వాత విగ్రహాన్ని పెట్టెలో ఉంచినట్లు చెబుతారు. ఎందుకంటే అప్పటికి ఆలయం అసంపూర్తిగా ఉంది. ఒకసారి రాణికి కలలో మాత దుర్గా, డబ్బాలో ఊపిరాడకుండా ఇబ్బందిగా ఉందని చెప్పింది. నన్ను త్వరగా బయటకు రప్పించండి అని మాత అన్నట్టు చెబుతారు. ఒక రోజు తెల్లవారుజామున రాణి, మాత విగ్రహాన్ని చూడగానే అది చెమటతో తడిసిపోయింది. దీనిపై రాణి ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేసి చివరకు మే 31, 1855న ఆలయంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.


ఈ ఆలయంలో ప్రధాన పూజారి రామ్‌కుమార్ ఛటర్జీ. పెద్దయ్యాక తమ్ముడు గదాధర్‌ని అక్కడికి పిలిచారు. ఈ గదాధర్ తరువాత రామకృష్ణ పరమహంస అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. పరమహంస్ జీ పరిపూర్ణమైన వ్యక్తి. అతనే ఆ తరువాత పూర్తిగా కాళీ మాత దేవాలయం పనులు చూసేవారు.


భవిష్యత్తులో మాత నిర్వహించే దేవాలయం, ఇతర సేవా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా రాణి తన ఆస్తిని ఖర్చు పెట్టేది. ముగింపు సమయం సమీపిస్తున్నందున, ఆమె గంగా ఘాట్‌ను, మిగిలిన పనులు చేయమని తన ఉద్యోగులను కోరింది. ఇవన్నీ పూర్తి ఐన తరువాత ఆమె, ఫిబ్రవరి 19, 1861న, సామాజిక కార్యకర్త రాణి రసమణి మరణించింది. దక్షిణేశ్వర్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రతిష్టించిన విగ్రహం ఆమె చేసిన సేవలను మనకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తుంది.

28. " మహాదర్శనము

 28. " మహాదర్శనము "--ఇరవై ఎనిమిదవ భాగము -- గురుకుల వాసము


28. ఇరవై ఎనిమిదవ భాగము -- గురుకుల వాసము



         ఆచార్యుడు కొడుకును ఒక సంవత్సరము ఇంటిలోనే ఉంచుకొని యుండి యజుస్సంహితను అధ్యయనము చేయించినాడు . ఏకసంత గ్రాహియైన శిష్యునికి వేదపాఠమును నేర్పించుట అదేమి కష్టము ? యజుస్సంహితలో గద్య, పద్య మంత్రములు , ఒక్కొక్కచోట బ్రాహ్మణమువలె ఉన్న మంత్రరాశి . అయిననూ కుమారుడు సునాయాసముగా ఒకే సంవత్సరములో సంహిత నంతటినీ నేర్చినాడు . 


         ప్రతిదినమూ ఆచార్యునికి , ఈ సంహితలో అక్కడక్కడా చేరిపోయి ఉన్న యజ్ఞ మంత్రముల నన్నిటినీ వేరు వేరుగా తీసి ఇచ్చిన , విద్యార్థులకెంత ఉపయోగపడును అనిపించెడిది . ఒక దినము , అధ్యయనము ముగిసినపుడు , తండ్రి , కొడుకుతో , " ఏమిటోనయ్యా , ఈ సంహిత అంతా ఒక కలగూరగంప. యజ్ఞభాగము , బ్రాహ్మణ భాగము , రహస్య భాగము అన్నీ కలసిపోయినాయి . ఎవరైనా ఒక పుణ్యాత్ముడు పుట్టి వీటన్నిటినీ వేరు వేరుగా విభజించి ఉంచితే ఎంతో ప్రయోజనము అయ్యెడిది " అన్నాడు. వెంటనే యాజ్ఞవల్క్యుడు లేచి , గురువైన తండ్రికి నమస్కరించి , " నేను పుట్టినది దానికోసమే . నా ఉద్దేశము సఫలమగునట్లు అనుగ్రహించండి " అన్నాడు .


         అదివిని ఆచార్యుడు అవాక్కైనాడు . " కుమారుడు ఇతరులకన్నా తేజస్వి అనునది నిజము , కానీ , తరతరాలుగా వస్తున్న సంహితను సమంజసముగా వర్గీకరణ చేయగలడా ? ఇదేమైనా సామాన్యమైన కార్యమా ? సుమారు ఇరవై ఐదు సంవత్సరాలనుండీ అవ్యాహతముగా , సతతమూ ప్రయత్నము చేయుచున్ననూ నా వంటి వాడికి సాధ్యము కాని కార్యము వీనివలన సాధింపబడునా ? ఈ కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదమగునా ? " అని సందేహములు అలలవలె ఎగయుచున్నవి . అయినా , ’ ఎవరికి తెలుసు ? వీడు అతి పితుడు , అతి పితామహుడు. మా తండ్రిగారికి కూడా ఈ ఆశ ఉండినది , నాకూ ఉంది . మాఇద్దరి ఆశలూ వీని వలన సఫలమగునేమో ? నేనెందుకు అడ్డు కావలెను ? ’ అనుకొంటూ సగము జ్ఞానము , సగము అజ్ఞానపు అవస్థలో , తెలిసీ తెలియకుండా ’ తథాస్తు ’ అన్నాడు . ఎదురుగా చేతులు జోడించి వినయ నమ్రుడైననూ , మహా విద్వాంసుడి తేజస్సుతో వెలుగుచున కుమారుని చూచి , మరలా స్పృహలోకి వచ్చి , ’ కావలసిన కార్యము , అదికూడ మా ఇంట్లో నా కొడుకు వలన అయితే మా వంశపు భాగ్యము ’ అనిపించి ఇంకొకసారి మనఃపూర్వకముగా , ఈ కార్యము జరగవలెను అన్న సదిఛ్చ మనసంతా నిండి పోగా ’ తథాస్తు ’ అన్నాడు . 


        అయితే , విఘ్నములన్నీ సత్కార్యములకే కదా ! అనిపించి , మరలా ఆ విఘ్నములన్నీ నివారణయై ఇష్టార్థము చేతికిరానీ యని మూడవ సారి ’ తథాస్తు ’ అన్నాడు . కుమారుడు మరలా నమస్కారము చేసి లేచినాడు . ఆచార్యునికి , వెనుకటి అభ్యాస కాలములో ’ సరస్వతీ గణపతుల వ్యూహములు నిరంతరముగా శరీరములో ఆడుచుండవలెను ’ అన్న ఆ మాట గుర్తుకొచ్చి , ఆ కార్యము అయినచో వీని వలననే కావలెను అనిపించెను . 


        అప్పటి నుండీ అధ్యయనమును ఇంకొక విధముగా చేయించినాడు . సంహిత వల్లెవేయుట ఉండనే ఉంది , అయితే , ముందు ముందు వర్గీకరణము నకు అనుకూలము కావలెనను ఉద్దేశముతో , క్రమాధ్యయనము అయిన తరువాత , ఈ కాండపు , ఈ ప్రపాఠకపు , ఈ అనువాకము చెప్పు అని అడిగేవాడు . మొదట్లో అది కుమారునికి కష్టమైననూ రానురానూ అదే అలవాటై , పాఠము నడచినది . 


        అయితే ఆచార్యుడు ఒకటి ఆలోచించలేదు . పావురమును ఎగురవేయువారు , అది పైకి పోనీ యని పట్టి ఎగరేస్తారు . కానీ అది మేఘములవరకే ఎగురగల పక్షి . దానికి , వీరి ఎగురవేత వలన ప్రయోజనమేమి ? అదే విధముగా , మనిషి మేధలో వేదము , కావలసిన ఎత్తుకు చేరవలెనంటే దానికి దైవానుగ్రహము కావలెను . అంతేకానీ కేవలము మానవ ప్రయత్నము తో అది సాధ్యము కాదు అనునది అతడి మనసుకు తోచలేదు . మనిషి , పొలమునకు నీరు పెట్టవలెనన్న , కొంత విస్తీర్ణమునకే పెట్టగలడు . ప్రవహింప జేయవలెనంటే , ఇంకొంత ఎక్కువ విస్తీర్ణము నకు పంపించగలడు . అయితే మానవ ప్రయత్నము వాన లాగా నేలను తడపగలదా ? 


        ఇలాగే సుమారు రెండు వర్షములు గడచినవి. ప్రథమోపాకర్మ జరిగి , ఇంకొక ఉపాకర్మ కూడా నడచినది . ఉపనయనమైన రెండు వర్షముల తరువాత కొడుకును గురుకులమునకు పంపించు ఆలోచన వచ్చినది . తనకు కావలసిన వారందరితో ఆలోచన చేసి కొడుకును వైశంపాయనుని గురుకులమునకు పంపవలెను అన్న సిద్ధాంతమునకు ఆచార్యుడు వచ్చినాడు . తత్ప్రకారముగానే , కులపతుల అనుమతి పొంది , ఒక శుభ దినమును చూచి , ఆచార్యుడు పత్నీ సమేతుడై కుమారుని తీసుకువచ్చి కులపతులకు అప్పజెప్పినాడు . 


        ఆచార్యుడు కులపతులకు విన్నవించుకున్నాడు , " కులపతులు ఒక దానిని కరుణించవలెను . కుమారుడు ఇంకే విషయములోనూ అవిధేయుడు కాలేదు , అయితే సంగీతము పైన వాడికి వ్యామోహము పెరుగుతున్నది . అదొకటీ తమరు మన్నించవలెను " 


         కులపతులు నవ్వి అన్నారు , " అదేమీ పెద్ద విషయము కాదు . మేము సంగీతమును వద్దనుటకు కారణము అది అతి త్వరగా కామ ప్రచోదనము చేయును అని . ఎవరెన్ని చెప్పినా , గంధర్వ శాస్త్రమును చూడండి , గంధర్వులకు కామము హెచ్చు . కానివ్వండి , దానిని నాదయోగముగా సరిదిద్దితే సరిపోవును . అప్పుడు బహిర్ముఖ కామనలు తప్పి , కామనలు అంతర్ముఖములగును . అప్పుడు ప్రణవము లక్ష్యమగును . దానివలన కూడా ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమగును . అటులనే చేయుదము . " 


" సరే " 


        ఆలంబిని నమస్కారము చేసి , " నేను చెప్పవలసినది కూడా కొంత ఉన్నది " అన్నది . కులపతులు ఆమె ఏమి చెప్పునన్నదానిని ఊహించుకొని ముసి ముసిగా నవ్వుతూ , " చెప్పండి " అన్నారు . ఆలంబిని , " ఇంతవరకూ కుమారుడు ఇల్లు వదలి బయట ఎక్కడా ఉండి ఉండలేదు . కాబట్టి వాడికి కష్టము కాకుండా కాపాడు భారము తమది . " అన్నది . 


       వైశంపాయనులు ఉత్తరమును చెప్పుటకు ఉద్యుక్తులై , అలాగే ఆగిపోయి , " యాజ్ఞవల్క్యా , మీ తల్లి చెప్పినది విన్నావా ? ఏమంటావు ? " అన్నారు .


         యాజ్ఞవల్క్యుడు , " నది ముందు ముందుకు ప్రవహించియే తీరవలెను . ఇంతవరకూ తల్లిదండ్రుల రక్షణలో , శిక్షణలో ఉండి విద్య నేర్చితిని . ఇప్పుడు తమరి సన్నిధానములో శిక్షణ పొందవలెను అని వచ్చినవాడను . తాను విశాలమూ , లోతూ కావలెనన్న , నది ముందు ముందుకు ప్రవహించవలెను , కదా ? " అన్నాడు . 


        వైశంపాయనులు ఆ ఉత్తరమును విని ఆమోదిస్తూ తల ఊపి అన్నారు , " ఈ ఉత్తరము చాలు . అయినా మీతృప్తి కోసము చెపుతాను . మా గురుకులములో ఉన్న వారి నందరినీ మా సొంత పిల్లలవలె , వారు మరలా తమ సొంత ఇళ్ళను గుర్తు చేసుకొని వ్యథ పడకుండా చూచుకొనుట మా కర్తవ్యము . మా ఆశ్రమములో నున్నవారు గంగానదికి నేరుగా వెళ్ళిన , అక్కడ పెద్ద చేపలు , మొసళ్ళనూ చూచి భీతి చెందెదరని , గంగా నదీ పైభాగము నుండీ ఒక కాలువను ఇక్కడికి తవ్వించినాము . దానిలో నడుము లోతు కన్నా ఎక్కువ నీరు ఎప్పుడూ ఉండదు . అయితే , ఒక మాట , మీ కుమారుడు చన్నీటి స్నానము చేయవలెను . తన వస్త్రములు తాను ఉతుకుకొనవలెను . ఏమయ్యా యాజ్ఞవల్క్యా ! ఈ కష్టమును సహించగలవా ? " 


        యాజ్ఞవల్క్యుడు పెద్దవానివలె మాట్లాడుతూ అన్నాడు , " అదేమీ కష్టము కాదు . మా ఇంటి వెనుక తటాకములో దినమూ స్నానము చేయుట నాకు అలవాటు . ఇంతవరకూ అక్కడ స్నానము చేయుచుంటిని , ఇప్పుడు ఈ కాలువలో స్నానము చేసెదను . బట్టలు ఉతుకుటకునూ కష్టము లేదు , అలవాటైనది . " 


        వైశంపాయనులు ఒప్పుకుంటూ అన్నారు , " ఆచార్యా , తమరి అనుమతి అయితే వీడిని రెండు ప్రశ్నలు అడిగెదను " . ఆచార్యుడు సరేనన్నాడు . కులపతులు అడిగినారు , " ఏమయ్యా , నీకు వేదాంగములలో దేనిపైన ఎక్కువ అభిమానము ? " 


          యాజ్ఞవల్క్యుడు ఆ ప్రశ్నకు ఏ వికారమూ లేకయే అన్నాడు , " కల్ప జ్యోతిష్యములు నేరుగా యజ్ఞమునకు సంబంధించినవి . నిరుక్తము వేదార్థమును వివరించునది . ఛందస్సు , మంత్రములలోని అక్షరములు సరిగా ఉన్నవో లేవో తెలుసుకొనుటకు సాధనము . శిక్ష , అక్షరోచ్చారణ యొక్క సాధుత్వ , అసాధుత్వములను చెప్పును . వీటన్నిటికన్నా నాకు వ్యాకరణము పైన అభిమానము ఎక్కువ. "


" అదెందుకయ్యా ? "


         " చూడండి , దానిలో ప్రకృతి , ప్రత్యయములు , పదములు అని విభాగములున్నవి . ప్రకృతి అనేది శబ్ద ఖండము . దానికి ప్రత్యయము చేరి , కృదంతమో , సదంతమో అయిన పదమును చేయును . ప్రత్యయమును తీసివేస్తే , పదము మరలా ప్రకృతి యగును . అటులనే , పూర్ణమైన ఈ జగత్తు పదము వంటిది . దానిలోనున్న ప్రత్యయమును తీసివేస్తే అది ప్రకృతి యై , ముందువలె పూర్ణమే అగును . ఇలాగు చూపించును యని ’ పూర్ణమదః ...’ మంత్రపు వ్యాఖ్యానము . అందుకే నాకు వ్యాకరణమనిన అభిమానమెక్కువ. " 


       " ఒకే శబ్దము , పరా -పశ్యంతి - మధ్యమా - వైఖరీ -రూపములలో ప్రకటమగును యని శిక్ష అంటుంది కదా ! దానికి కూడా ఇలాగే వ్యాఖ్యానమెందుకు చేయరాదు ? "


        " పరా స్థానము గోచరము కాదు అనునది ఆ శాస్త్రపు సాంప్రదాయము . అయితే ప్రకృతి గోచర మగునట్టిది . దీనిని ప్రయోగ పూర్వకముగా తెలుసుకొన వచ్చును . అందుకే వ్యాకరణమును చూస్తే నాకు అభిమానము . " 


         వైశంపాయనులు , కుమారుని బుద్ధి వైఖరులను చూచి సంతోషపడి , అభిమానము చూపకుండా జాగ్రత్త పడినారు . వారికి వెనుకటి దంతా గుర్తుకు వచ్చి , ’ ఔను , వీడి వలన లోకోద్ధారమగుటలో అతిశయమేమీ లేదు . వీడు మా శిష్య వర్గమును చేరినది మా అదృష్టము ! " అని సంతోషించి , తమ సంతోషమును ఆచార్య దంపతులకు మరీ దీర్ఘముగానూ , మరీ హ్రస్వముగా కాక ప్రకటించినారు . మరలా కుమారుని పిలచి , " అయ్యా , నీకు సంహితాధ్యయనమైనది . మీ తండ్రి గారి వెంట వెళ్ళి అక్కడక్కడా ప్రయోగమును చూచి తంత్రమును కూడా ఎంతో కొంత సాధించినావు . ఇలాంటపుడు , నీకు ఈ గురుకులము నుండీ కావలసిన ప్రయోజనమేమిటి ? " అని అడిగినారు . 


         కుమారుడు తల్లిదండ్రుల అనుమతి పొంది , చేతులు జోడించి అన్నాడు , " మాతా పితరుల దయ వలన కంకులనుండీ వడ్లు వచ్చి , ఎండి , బియ్యముగా మారు భాగ్యము కలిగినది. బియ్యము అన్నము కావలెనని తమరి దగ్గరకు వచ్చినాను . అన్నమైన తర్వాత , దానిని ఎలాగు వినియోగ పరచెదరో దానికేమి తెలుసు ? తమరు ఆ అన్నమును సద్వినియోగము చేసెదరనే నమ్మకముతో , తమ పాదమూలమును చేరి కృతార్థుడనగుటకు వచ్చినాను . అలాగు నన్ను కృతార్థుడిని చేయుట అన్నది మీకు చెందిన విషయము . "


         వైశంపాయనులు ఆ సమాధానము విని బహు సంతోషపడి వాడిని పిలచి దగ్గర కూర్చోబెట్టుకొని వీపు నిమురుతూ తమ సంతోషమును వ్యక్త పరచినారు , " అలాగే కానీవయ్యా , మన ఇద్దరినీ గురు శిష్యులుగా చేర్చిన దైవము ,నిన్ను కృతార్థుడను చేయనీ . నువ్వు మాత్రా శిష్టుడు , పితా శిష్టుడూ అయిన యోగ్యుని వలె మాట్లాడుచున్నావు . నీకు గుర్వాశిష్టుడు కూడా అగు భాగ్యము రానీ . ఇహములో అనన్య లభ్యమగు కీర్తీ , పరములో ఉత్తమోత్తమమైన సద్గతీ లభించనీ . " అని మనఃపూర్వకముగా ఆశీర్వాదము చేసినారు . కుమారుడు ఆ ఆశీర్వాదము సత్యమవనీ అని ఇంకొకసారి నమస్కరించినాడు . 

Janardhana Sharma

నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏     🏵️మనం చెప్పింది అబద్దం మాటలు ఐతే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి.. కానీ మనం  నిజం మాట్లాడితే  అదే నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది.. ఇదే అబద్దపు మాటలకు మరియు మంచి మాటలకు ఉన్న తేడా!!అందుకే మాటల విలువ తెలుసుకుని మంచి మాటలు మాట్లాడాలి 🏵️అనవసరంగా మాట్లాడే మాటలు అవసరమైన అవకాశాలను తగ్గిస్తుంది..మాట్లాడవలసిన విషయాలు మాట్లాడక పొతే సమస్యలు మరింత రెట్టింప్పు అవుతాయి.. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడకపోతే మాటలకు విలువ   ఉండదు🏵️మనసుకు అలజడి చేసే మాటలు తుఠాలు కంటే ప్రమాదకరమైనవి.. పెద్దలకు గౌరవం, పిల్లలకు ప్రేమను పంచే మాటలు ముత్యాల కంటే విలువైనవి.. మనసు శుద్ధంగా హృదయం పవిత్రంగా ఉండే వారి మాటలు మంత్రాలై అనేకుల మనోవేదనలను తొలిగిస్తాయి🏵️ *మాటలను మంత్రాలుగా చేసుకునేందుకు పరమాత్ముడు చెబుతారు.. మహోన్నతమైన మానవజన్మ ఎత్తినందుకు మధురంగా, తక్కువగా, ధైర్యంగా, సారవంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి*🏵️🏵️ మీ అల్లoరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510🙏🙏🙏

ప్రేమలూ - పలకరింతలూ

 💝  ఆహ్వానం  💝

  ☝️మన ఇళ్లల్లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు....ఇంకెన్నో శుభకార్యాలు 

జరుగుతుంటాయి. వాటికి బంధువుల్ని ,స్నేహితుల్ని, శ్రేయోభి లాషుల్ని, పిలుస్తుంటాం. ఇలా అందరూ ఓచోట కలుసుకోవాలను కోవడమే ఈ పిలుపుల్లోని సదుద్దేశం .💐

   👉కానీ.... రాను రానూ - ఈ ఫంక్షన్లలో ఆర్భాటాలు ఎక్కువై పోతున్నాయి . ఎంత ఎక్కువ మందిని పిలిస్తే - ఎన్ని వెరైటీల వంటకాలు పెడితే .... అంత గొప్పగా భావిస్తున్నాం!! కానీ ఆహ్వానించిన తర్వాత, వారందరినీ - కనీసం పలకరించడానికి కూడా తీరికలేని స్థితిలో ఉంటున్నాం !! అతిధే ఆహ్వానితుని దగ్గరకు వెళ్లి "నేను

వచ్చానోచ్" అని హాజరు వేయించుకుని బయటపడే దుస్థితి ఏర్పడుతోంది!! .. 🤦‍♂️😃

   ☝️పిలవకపోతే బాగుండదని పిలవడం - వెళ్లకపోతే బాగుండదని వెళ్లడం- తప్ప..... ప్రేమలూ - పలకరింతలూ లేకుండా పోతున్నాయని అందరికీ తెలుసు . 

పలకరించడానికి వీల్లేనంతమందిని 

పిలవడంవల్ల - ఆహ్వానించిన వారికీ,ఆహ్వానితులకూ కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది.😌

    👉ఇక భోజనాల దగ్గర కూడా - సీటుకోసం ..... తినేవారి వెనుక నిలబడటానికి కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ పిలుపులు - భోజనాలు..... అతి మూలంగా, ఒకరిని చూసి మరొకరు  దుబారా ఖర్చులు పెరిగిపోయి ,ముఖ్యంగా - మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలై బజారున పడుతున్న నేటి పరిస్థితుల్లో ఇవన్నీ తగ్గాలి !! హైరానా పడి ఖర్చుపెట్టి,అప్పులపాలు చేసే ఈ కార్యక్రమాలను ఉత్సవాలని ఎలా భావించాలి!? ఈ సాంప్రదాయం మారాలి!!🤔

   ☝️ఇకముందైనా శుభకార్యాలు చేసేటప్పుడు - ఎవరి పరిధిలో వారు .... ఎంత మందికి అతిధి సత్కారం చేయగలమో - అంతమందినే ఆహ్వానించి ... ఆ ఫంక్షన్ ముగించుకుంటే ఉభయ తారకంగా వుంటుంది . ఈ పద్ధతి అవలంబించినప్పుడే ఆ శుభ కార్యానికీ - "ఆహ్వానాని"కీ సార్ధకత !! 🙏

ప్రేమతో చూడాలని, గౌరవించాలని

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మధ్య తరగతి నిరాడంబరత, మర్యాద, పెద్దలు మరియూ ఉపాధ్యాయుల విషయంలో గౌరవం, నా చిన్నప్పటి జ్ఞాపకాలు. నా పిల్లలకి కూడా అంతా నేర్పలేకపొయాను. 100 రూపాయలు కావలసినచోట, 99 వుండాలి. అది చాలాఅణుకువని నేర్పుతుంది. మా మాటే కాదు, ఉపాధ్యాయులూ, పిన్ని, బాబాయి, మామయ్యా, అత్తా, ముఖ్యంగా తాతా, అమ్మమ్మ , నానమ్మ లనికూడా అంతే ప్రేమతో చూడాలని, గౌరవించాలని, మనము ఆచరిస్తూ, వాళ్ళకి చెప్పగలిగిన నాడే తిరిగి ఈ వ్యవస్థ తిరగబడుతుంది. ఊహకు అందని సంపాదనలూ, విచ్చలవిడి అలవాట్లూ, చదువుకున్నతర్కాలూ, మేము అనుభవించలేదూ, మా పిల్లలు ఎందుకు కష్టపడాలి అనే మన మధ్య తరగతి కొత్త అలోచనలూ, కనపడిన ప్రతీవారితో మైత్రి, అర్ధంలేని పోలికలూ, అహాలూ, వున్నదంతా (డబ్బు, శరీరం, భాష) చూపించేయాలన్న ఆత్రం, సమయా సమయాలను అనుసరించి తోటివారినీ, బంధువులనూ అభినందించాలి ( లేదా) పరామర్శించాలి అనే ఇంగితం కోల్పోవడం, కాకపొతే మూతిముడుచుకు కూర్చుని అస్సలు సంబంధాలే నిలుపుకోకపోవటం,   

తరచి చూస్తే.., 

అస్సలు మనిషికీ మనిషికీ మధ్య కనిపించని ధనంతో ముడివడిన పదవులూ, గోడలూ ....

అలోచించండి మిత్రులార..

ఇవిమారకుండా, మన విద్యావ్యవస్థని వేలెత్తి చూపితే, సమాజానికి ఏమి మంచి జరుగుతుందని మన ఆశ..?? 

కుటుంబ వ్యవస్థ, మన ఆచారాలూ, సంప్రదాయలూ, మన్ననతో మసలిననాడు, పెరుగుతున్న విజ్ఞానానికి తోడై, మన సత్సంప్రదాయాలు జోడై, ప్రపంచ పట శిఖరాగ్రాన నిలిచే మన భారత మాతని, సగర్వంగా చూడొచ్చు.. 🙏


స్వస్తి .. 🌹🌹

శ్రీ యంత్రోధారక హనుమాన్ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 449*


⚜ *కర్ణాటక : హంపి - విజయనగర* 


⚜ *శ్రీ యంత్రోధారక హనుమాన్ ఆలయం*



💠 హనుమంతుని ఎన్నో రూపాలను చూస్తుటం..పంచముఖ హనుమంతుడనీ, సప్త ముఖ హనుమంతుడనీ, బాల హనుమంతుడనీ, ధ్యానాంజనేయుడనీ ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని ఆలయాలు నిత్యం దర్శిస్తాం.

కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై, యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి.


💠 యంత్రోధారక హనుమాన్ ఆలయం, ప్రాణదేవ ఆలయం అని కూడా పిలుస్తారు, ఇది  హనుమంతుడికి అంకితం చేయబడింది, ఇది రామాయణ ఇతిహాసంలో కీర్తించబడింది. 

హంపి పట్టణం పరిధిలో అంజనాద్రి పర్వతానికి ఆనుకుని ఉన్న మలయవన్ కొండలో ఉంది.


💠 అంజనాద్రి హనుమంతుని జన్మస్థలం మరియు సీతను రావణుడు పంచవటి అడవుల నుండి అపహరించిన సమయంలో, అప్పటి కిష్కింద దగ్గరగా ఉన్న మలయవాన్ కొండ వద్ద రాముడు హనుమంతుడిని కలిశాడని చెబుతారు. 


💠 రాముడిని హనుమంతుడు మొదటిసారిగా కలుసుకున్న జ్ఞాపకార్థం,  అక్కడ కోదండరామ దేవాలయం అని పిలువబడే శ్రీరాముని ఆలయం ఉంది.  

యంత్రోధారక హనుమాన్ దేవాలయం అని పిలవబడే హనుమంతుని ప్రత్యేక దేవాలయం వెనుక ఉంది.  

ఈ రెండు దేవాలయాలు 14-15 శతాబ్దాలలో విజయనగర చక్రవర్తుల పాలనలో నిర్మించబడ్డాయి.  

యంత్రోధారక హనుమాన్ ఆలయంలో పూజించబడే విగ్రహం, ఒక గ్రానైట్ బండరాయిపై చెక్కబడిన హనుమంతుని చిత్రం, ఈ యంత్రం యొక్క బయటి వృత్తంలో 12 కోతుల చుట్టూ ఉన్న ఒక ఆధ్యాత్మిక రేఖాచిత్రం, నక్షత్ర ఆకారపు యంత్రం, ఒక శ్రీచక్రం,  ఒక ఆధ్యాత్మిక రేఖాచిత్రంలో చుట్టుముట్టబడిన ప్రత్యేకమైన  కూర్చున్న భంగిమలో ఉంది.


💠 ఈ చిత్రం తుంగభద్ర నది ఒడ్డున ఒక నిర్దిష్ట ప్రదేశంలో ధ్యానం చేస్తున్నప్పుడు మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత తత్వశాస్త్రానికి చెందిన మధ్వ శాఖకు చెందిన సన్యాసి వ్యాసతీర్థ 12 సార్లు నిరంతరం చూసిన మానసిక చిత్రం నుండి రూపొందించబడింది.  


💠 మధ్వసాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. 15వ శతాబ్దంలో సాళ్వ నరసింహరాయల పరిపాలనా కాలం లో వ్యాసరాయరు అనే ఒక గొప్ప తాత్వికుడు, మధ్వాచార్యుడు, హనుమద్భక్తుడు ఉండేవాడు.


💠 వ్యాసరాజు లేదా వ్యాస తీర్థ (1447-1539) నిర్మించిన 732 హనుమాన్ విగ్రహాలలో ఇది మొదటిది అని కూడా చెబుతారు. 

వ్యాసరాజు విజయనగర రాజగురువు. విజయనగరంలో ఉంటూ చక్రవర్తికి సలహాలు ఇచ్చే పదవిని కూడా నిర్వహించారు.

 

💠 అతను భారతదేశమంతటా సంచరించి 732 హనుమంతుని ఆలయాలను ప్రతిష్టించాడు. వాటిలో మొదటిది తుంగభద్రాతీరాన హంపి దగ్గర గల చక్రతీర్థం లోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం.

 అతను హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు.


💠 హంపిలో ఉన్న సమయంలో, వ్యాసతీర్థ  తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన మరియు సుందరమైన ప్రదేశానికి వెళ్లి చాలా గంటలు మౌన దీక్ష వహించేవారు.  

ఒక నిర్దిష్ట రోజున ధ్యానంలో ఉన్న సమయంలో అతను తన కళ్ల ముందు మెరుస్తున్న హనుమంతుని రూపాన్ని చూసే అవకాశం వచ్చింది.  కలవరపడి, అతను తన దీక్ష స్థానాన్ని మార్చాడు  కానీ అక్కడ అతను హనుమంతుని రూపాన్ని చూడలేకపోయాడు.   అతను ఎక్కడైనా కూర్చుంటే హనుమంతుని చిత్రం ఏదీ చూడలేకపోయాడు.  అతను ఆ నిర్దిష్ట ప్రదేశంలో కూర్చున్నప్పుడే అతని మనసులో ఉన్న చిత్రాన్ని చూడగలిగాడు. 


💠 ఒకనాడు హంపీ క్షేత్రం లో తుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థం లో ఒక బండరాయి పైన ఆంజనేయుని బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశాడు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయినుండీ బైటికి దూకి వెళ్లిపోయింది. ఇలా పన్నెండు రోజులు జరిగింది. ఇక వ్యాసరాయరు అలసి పోయి ఈ పరీక్షనుండి కాపాడమని ఆంజనేయునే ప్రార్థించాడు.


💠 రాయరు ప్రార్థనకు కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానం లో రాయరుకి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్ధుడై అందులో కూర్చున్నాడు.

అంతకుముందు బండరాయి నుండీ తప్పించుకున్న 12 కోతులనూ యంత్రానికి చుట్టూతా ఉంచాడు.


💠 మీరు విగ్రహాన్ని నిశితంగా పరిశీలిస్తే, 12 కోతుల శిల్పాలు కనిపిస్తాయి, అవి ఒకదానికొకటి తోకను పట్టుకుని వెనుకకు ఉన్నాయి. ఇది వాస్తవానికి శ్రీ వ్యాసరాజు భగవంతుడు తనను ఆశీర్వదించడానికి ముందు చేసిన 12 రోజుల ప్రార్థనలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.


💠 ఈ యాంత్రోద్ధారక హనుమ చిత్రపటం ఇంట్లో ప్రతిష్టించి, మహామహిమాన్వితమైన యాంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం భక్తి శ్రద్ధలతో, సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తాడు యంత్రోద్ధారక హనుమంతుడు 


💠 యంత్రోధారక ఆలయం నుండి దాదాపు 5 నిమిషాల నడకలో శ్రీనివాస భగవానుడికి అంకితం చేయబడిన ఒక చిన్న ఆలయం ఉంది , ఈ విగ్రహం శ్రీ వ్యాసరాజుచే స్వయంగా చెక్కబడింది.


💠 హంపినుంచీ 12 కిమీ దూరం

అద్భుత మహిమ🚩

 🔥అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ🚩


సాధు పరిత్రాణం కొరకు,దుష్టవినాశనం కొరకు, ధర్మసంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తు ఉంటానని చెప్పాడు. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.

దైవస్మృతి 

సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఆచమించి ఆరంభిస్తాం.


క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.


అచ్యుతానంత గోవింద

నామెాచ్ఛారణ భేషజాత్

నశ్యంతి సకలారోగాః

సత్యం సత్యం వదామ్యహ


ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా" !.ఇది పరమ ప్రమాణం. పద్మపురాణంలో ఈ నామ

మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది. దైవస్మృతి

శరన్నవరాత్రి మహోత్సవాలు*

 *శ్రీ మాత్రేనమః*

రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో గల *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం* లో 

*03-10-2024  నుండీ 12-10-2024 వరకూ* శ్రీ క్రోధి నామ సంవత్సర *శరన్నవరాత్రి మహోత్సవాలు* నిర్వహించబడును. ఈ సందర్భంగా దుర్గాష్టమినాడు బాలాకుమారీపూజలు, ప్రతి రోజు చండీ పారాయణం, చివరి రోజున చండీహోమం ,విజయదశమి నాటి సాయంత్రం శమీపూజలు నిర్వహించబడును. ఈ కార్యక్రమాలలో గోత్రనామాలు చెప్పించుకునే ఆసక్తి గలవారి వివరాలను మాకు వాట్సాప్ 

ద్వారా తెలుపగలరు.

మా UPI & WhatsApp number 9492050200,

*ఈ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చిన భక్తులు*

1. బ్రహ్మ శ్రీ కొంపెల్ల సూర్యనారాయణ శర్మ, శ్రీమతి లక్ష్మీ నరసింహం దంపతులు, కాశ్యపసగోత్రం...1,008₹,

2. 

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

వాసన

 ఏదైనా క్రియ లేదా అనుభవం వల్ల మనస్సులో మిగిలిపోయినదానికి వాసన అని పేరు. అది మంచి, చెడు అని రెండు రకములు. శాస్త్రాధారముతో ఏది మంచి, ఏది చెడు అని అర్థం చేసుకొని మంచి వాసనలను అలవరచుకోవాలి ధ్యానం ఫలించడం కొరకు. తరువాత నిరంతర శ్రమ చేత మంచి చెడులను మించిపోవచ్చు. ఇది సఫలం ఆవ్వాలంటే గురువు యొక్క అనుగ్రహం అవసరం. --- శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి #SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 24

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 24 వ భాగము* 

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*పద్మపాదుని కథ:*


పద్మపాదుడు గురువు లను రక్షించిన తెఱగు చూచి అద్భుత పడిన శిష్యులు శ్రీ నృసింహ స్వామి పద్మపాదునకు ఎలా ప్రసన్నుడయ్యాడో తెలుపమని కోరగా పద్మపాదుడు వారికి ఈ కథ చెప్పాడు. 


“అహెూబిలమనే పర్వతం మీద మహారణ్యముంది. ఆ అడవిలో చాల కాలం తపస్సు చేస్తున్నాను. అప్పుడు ఒక కిరాతుడు వచ్చి 'ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నా'వని అడిగాడు నన్ను. 'ఈ అడవిలో ఒక విచిత్రమృగ ముంది. ఎప్పటి నుండో వెదుకుతున్నాను. ఇప్పటి దాకా కన్పించ లేదు. అందు చేతనే ఎప్పుడయినా కనిపించకపోదా అనే నమ్మకంతో ఇక్కడే తపస్సు చేస్తున్నాను'.


అప్పుడు కిరాతునికి నాపై జాలి కలిగి నా కోసం ఆ అడవి అంతా వెదకి ఆ మృగాన్ని లతలతో బంధించి నా యెదుట నిలబెట్టాడు. నీకెలా దొరికింది అని  అడిగే లోపలే నేను చూస్తున్నది సాక్షాత్తు శ్రీనరసింహస్వామినే అని తెలిసి సాష్టాంగ వందనం చేశాను ఆ అపురూపమైన అవతారికి. అప్పుడు స్వామికి నమస్కరించి ఇలా అడిగాను: "పరమాత్మా! ఘోరమైన తపస్సు లాచరించే మహర్షులకు కూడ తమ దర్శన భాగ్యం దొరకదే! ఈ కిరాతు నకు ఎలా వశమయ్యా వో సెలవియ్యండి" అందుకు స్వామి మందహాసంతో “సనందనా! మునులు గాని, బ్రహ్మర్షులు గాని ఈ కిరాతుని వలె నా రూపమును నిశ్చలులై ధ్యానం చేసిన వారు లేరు. అందుచేత ఇతని నిర్మలచిత్తానికి మెచ్చి పట్టుబడ్డాను. ఇంక ఇతని గురించిన సంశయము వీడుము” అని చెప్పి అంతర్హితు డయ్యారు.పరమానంద భరితులైన శిష్యగణం ఈ కథకు ఫలశ్రుతి చెప్పమని కోరగా పద్మపాదుడుచెప్పాడు: 


"ఈ నృసింహస్వామి కథ చదివినా, విన్నా, చెప్పినా, వ్రాసినా స్వామివారి అనుగ్రహా నికి పాత్రులగుతారు. అట్టివారికి అసాధ్య మైన రోగములు, బ్రహ్మ రాక్షస, భూతప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిన్యా ది సర్వ దుష్ట గ్రహ బాధలు, ప్రయోగాది బాధలు తొలగి, సుపుత్ర ప్రాప్తి పొంది, కోరికలు సిద్ధించును. భక్తి జ్ఞాన వైరాగ్యము లు కలిగి ముక్తిని బడయుదురు.”


శంకరాచార్యులు శిష్యులతో కొన్ని దినములు శ్రీశైలములో గడపి పశ్చిమతీరాన గల గోకర్ణక్షేత్రమునకు బయలు దేరారు.


*గోకర్ణక్షేత్రము:*


గోకర్ణం ఆకారంలో సముద్రుడు భూభాగం లోనికి చొచ్చుకువచ్చి నందు వలన ఈ క్షేత్రానికి ఈ నామం కలిగింది, ఆ పేరు శివుడే పెట్టాడని అంటారు. పండ్రెండు తేజోలింగముల లోని దైన మహాబలేశ్వర లింగం ఇక్కడ ఉన్నది. ఈశ్వరుడు రావణాసు రునికి ఇచ్చిన లింగము లలోని భాగమే ఇది అంటారు. కాశీ క్షేత్రము కన్న ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమని అచ్చోట గల చిహ్నములను బట్టి యందురు. రావణ సంహారా నంతరం శ్రీ రాముడు ఈ క్షేత్రంలో కొన్నినాళ్ళు ఉండి ఆత్మలింగాన్ని అర్చించి నట్లు అందుచేత కొండ దరిని గల స్థలాన్ని 'రామతీర్థము' అని స్థలపురాణము. 


శ్రీశంకరాచార్యులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సంద ర్శించి అందు వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వ రులను స్తుతించారు. తరువాత హరిహర దివ్యక్షేత్రానికి బయలుదేరారు.


*హరిహర క్షేత్రము:*


ఈ క్షేత్రము చాలా  విశిష్టమైన పుణ్యస్థలం. ఒకప్పుడు ఈ ప్రాంతం లో వీరశైవమని ఒక తెగ, వీరవైష్ణవమని మరొక తెగ - రెండు తెగల 'భక్తులు’ పరస్పరం స్పర్థలతో ఒకరి నొకరు ద్వేషిస్తూ, దూషించుకొంటూ మితిమీరిన వైరాలతో చెలరేగుతూ ఉండే వారు. ఒకరి పొడ ఒకరికి గిట్టేది కాదు. బొట్టూ, కట్టూ వేరు వేరు. దేవుళ్ళు వేరు. ఆచారాలు వేరు. ఆగమాలు వేరు. పద్ధతులు వేరు. పేళ్ళు వేరు. మా దేవుడు అధికుడు, మా దేవుడే అధికుడు అని ఇరు తెగల వారూ తెగని తగని శత్రుత్వాలు పెంచి పోషించుకొనే వారు. ఇది చూచిన పరమాత్మ      దయామయుడై శివుడు, విష్ణువు కలిసి ఉన్న రూపంలో ప్రత్యక్ష మయ్యాడు. ఈ విషయం వేదం లోనే ఉందని అజ్ఞప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినదీ హరిహర నాధ రూపం. స్వామిని దర్శించుకొని అప్పుడు శంకరా చార్యుడు దశావతార స్తోతం చేశారు.


మొదటిగా మత్స్యావతారాన్ని, తరువాత వరుసగా కూర్మావతారాన్ని, వరాహావతారాన్ని, నరసింహావతారాన్ని, వామనావతారాన్ని, పరశురామా వతారాన్ని, రామావతారాన్ని, బలరామ కృష్ణా వతారాలను, బుద్ధావ తారము, కల్క్యవ తారమును సోత్రము చేశారు. ఈ విధంగా శంకరస్వామి శివ కేశవుల అభేదత్వాన్ని నిరూపించినారు. అక్కడినుండి ప్రయాణము మూకాంబికా క్షేత్రమునకు.


మూకాంబికా క్షేత్రము:


క్షేత్రం లోని ఏ క్షేత్రాన్ని దర్శించినా శంకరా చార్యులు మొదటగా ఆ ఆలయం ప్రవేశించి తరువాత మిగతా విషయాలను చూచుకొనే వారు. ఆ ఆచారాన్ని వీడకుండా మూకాంబికా క్షేత్రం వచ్చాక తిన్నగా ఆలయం లోనికి వెడలుచుండగా వారి కొక విషాద దృశ్యం కనిపించింది.


దేవాలయానికి ఎదురుగా చచ్చిన బిడ్డను ఒడిలో ఉంచుకొని తల్లిదండ్రు లు రోదన చేయుచున్న దృశ్య మది. శంకరులు అది చూచి జాలి నొందారు.


"వీరలను రక్షించుటకు ఎవడు సమర్థుడు కాడో వాడున్నూ ఏడ్చిన వాడగుచున్నాడు”అన్న ఆకాశవాణి వినిపిం చింది గట్టిగా. ఆ పలుకులువిన్న శంకరుడు అవి దేవి పలుకులుగా గుర్తించారు.


"పరమేశ్వరీ! దయా మయీ! తమ దయయే ఈలోకాన్ని పాలిస్తు న్నది. ఆ దయయే లోకాన్ని రక్షిస్తోంది. కనుక 'కటాక్షించు' అని శంకరుడు ఆ దేవికి బదులుగా పలికాడు. వెంటనే ఆ బాల శిశువు బ్రతికి లేచి కూర్చు న్నాడు.


తల్లిదండ్రుల ఆనందమునకు అవధి లేదు. ఆ దృశ్యం చూచిన వారందరూ చకితులై శంకరస్వామి ని వేనోళ్ళ కొనియాడి నమస్కరించారు. సాక్షాత్తు శంకరుడే అని భావించారు. శంకరాచార్యుడు ఆలయ ప్రవేశము చేసి, మూకాంబికాదేవిని స్తుతించారు. “అమ్మా! నీ మహిమలు కొని యాడడానికి మాటలు చాలవు. నిన్ను నుతించినా, దర్శించి నా, స్మరించినా మూగవాళ్ళు వాగ్ధార లతో వెలుగొందు తున్నారు. సృష్టి, స్థితి, లయములకు కారకు రాలివి. జగదంబా! బ్రహ్మాది దేవతలు నిన్ను తెలిసికొనజాలరు. పరిపూర్ణంగా నిన్ను తెలిసికొన్నవారు జీవన్ముక్తులే గదా!” అని స్తోత్రం చేశారు. ఈ క్షేత్రంలో కొన్నాళ్లుండి తత్త్వప్రచారం చేస్తూ తరువాత బల్యగ్రహారానికి బయలు దేరారు.


బల్యగ్రహారము:


రెండు వేల బ్రాహ్మణుల కుటుంబములు కలది బల్యగ్రహారము. అందున్నవారికి సత్కర్మలు చేయుటే గాని దుష్కర్మల జోలికి ఎన్నడూపోరు. అకుంఠితదైవభక్తితో, శ్రద్ధతో దీక్షతో ఎల్లపుడూ సత్కర్మా చరణలలోనే కాలం గడిపేవారు ఆ అగ్రహార వాసులు. యధావిధిగా ప్రతి యింట అగ్నిని ఆరాధించే వారే. ఎక్కడ చూచినా వేదఘోష, అట్టి పరమపవిత్రమైన ఆ అగ్రహారంలో మృత్యువు ప్రవేశించ డానికి భయపడి చుట్టూ తిరిగి వెళ్ళి పోవలసిందే! ఆ విప్రులను దర్శించి శంకరులు వారికి తత్త్వబోధ గావించి వారిని సంతుష్టులను చేశారు.


శృంగగిరిలో శారదా పీఠము:


ఇంక మధ్యలో ఎక్కడా ఆగక శంకరాచార్య స్వామి తిన్నగా శృంగ గిరి చేరుకొన్నారు. శృంగగిరి అతి విశిష్ట మైన చరిత్ర కలది. పూర్వము ఋష్యశృంగుడు అనే మహర్షి తపస్సు చేసిన పావన భూమి అది. తుంగభద్రా నదీతీరాన ఉన్నది ఈ గిరి. ఇది పండితులకు తపో ధనులకు నిత్యావాసము. సర్వకాల సర్వావస్థల యందు వేదఘోష వినబడుతూనే ఉంటుంది. ఈ ప్రాంత మందున్న వారు యజ్ఞయాగాది క్రతువు లాచరించిన వారు. వైదిక కర్మనిరతులై శాంతము, దయ, శమము, దమము కలిగి కరుణాంత: కరణలతో అతిథి అభ్యాగతులను ఆదరిస్తూంటారు. వితరణబుద్ధిలో కల్ప తరువు, కామధేనువు ను మించినవారు. దేవతలు కూడ అచ్చోట ప్రీతిగా వసింప నెంచేవారు. శృంగగిరి వాసులు విఘ్నాలు వచ్చియెఱుగరు. ఇటువంటి మేటి సజ్జనులకు నివాసమైన శృంగగిరిలో శంకరా చార్యస్వామి ఎక్కువ కాలము గడుపుతూ ఆ పండితజనులకు ప్రస్థానత్రయ భాష్యమును బోధిస్తూ ఉపనిషత్తుల సారాంశాన్నీ వేదాల సారాంశాన్ని పవిత్రులు, పాత్రులూ అయిన విద్వజ్జన సమాజాన్ని ఆకట్టుకొని అధ్యాపకు లయ్యారు. తృటికాలం లో కుశాగ్రబుద్ధులు శంకరునికి శిష్యులైపోయారు.


శంకరాచార్యులకు ఆ చోట శారదాపీఠంగా నెలకొల్పాలన్న సంకల్పము వచ్చి అనువయిన స్థలాన్ని ఎన్నుకొన్నారు. శుభ ముహూర్తాన శంకు స్థాపన గావించి ఆగమశాస్త్రరీత్యా అన్ని ఏర్పాట్లు చేసి ప్రవీణులయిన శిల్పు లతో మనోహర మైన మఠనిర్మాణం చేయిం చారు. ఇంద్రాది దేవతలు సర్వదా పూజించే శారదాదేవిని అందు ప్రతిష్ఠించారు. వేదవిహితంగా సకలోపచారాలు శాశ్వతంగా జరిగే విధంగా అమలు పరచారు.

శ్రీసురేశ్వరాచార్యులను ఆ పీఠమునకు అధిపతిగా నియ మించారు. నేటికిని ఆ పీఠము అద్వితీయము గా అలరారుచున్నది. చతురామ్నాయ పీఠములలో మిన్నగా ప్రతిభకెక్కి యున్నది.


తోటకాచార్యుడు:


ఆనందగిరి అనే పేరు గల ఒక బ్రహ్మచారి శృంగగిరికి వచ్చి

శ్రీశంకరాచార్యుల పాదపద్మములకు మ్రొక్కి క్రింది విధంగా ప్రార్థించాడు: 


"మహాత్మా! ఏమియు తెలియని వాడిని. చదువుకొన్నవాడిని కాను. మీ శిష్యుడనై మీ సేవ చేసి కోవాలని వచ్చాను. తాము ఎందరినో చదువులేని వారిని జేర దీసి విద్వాంసులను చేశారని విని పేరాసతో వచ్చాను. నాకు మీ సేవాభాగ్యం ఇప్పిం చండి. మీ సేవలు చేసుకుంటూ ధన్యుడి నవుతాను”.


అతడి వైఖరి, మాట పొందిక శ్రీశంకరులకు నచ్చి ఆ బ్రహ్మచారిని శిష్యునిగాతీసుకొన్నారు. ఆనందగిరి శాస్త్రాలు చదువక పోయినా, వేదాధ్యయనం చేయక పోయినా వేదాల్లో చెప్పినట్లే నడచు కొంటున్నాడు. వినయ విధేయతలతో, మృదు మధురమైన మిత భాషణలతో చక్కగా గురుసేవ చేస్తున్నాడు. వేకువనే గురువులు లేవక ముందే లేచి తన కాలకృత్యములు, అనుష్ఠానములు ముగించుకొని సిద్ధంగా ఉంటాడు. గురువులకు ఆసనం అమర్చడం, కాలకృత్యాదులకు అన్నీ సిద్ధం చేయడం, తానే గురువులకు స్నానం చేయించడం, వారికి శుభ్రమైన కాషాయవస్త్రం ఇవ్వడం వంటివి అతని దినకృత్యాలు. గురువులు విడచిన కౌపీనము, శాఠీలను ఉతికి ఆరవేసి భద్రపరచడం ఇవన్నీ తానే ఆనందంగా శ్రద్ధగా చేసే చర్యలు. తిరిగి పాఠము వినే వేళకు తన కార్య క్రమాలు ముగించుకొని వస్తాడు. గురువులను నీడ వలె వెంటాడుతూ, పరుండినపుడు పాదములుఒత్తుతాడు. ఈ విధంగా గురుసేవ లో తనను తానే మరచి ఉండే వాడు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్యచరిత్రము*

*24 వ భాగము సమాప్తము* 

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 23

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 23 వ భాగము* 

 💕💕💕💕💕💕💕💕💕💕💕💕


*దక్షిణ యాత్ర:*


మండనమిశ్రుని, ఆతని భార్య ఉభయభారతిని ఓడించి మండన మిశ్రునికి సన్న్యాసం ఇప్పించిన వార్త దేశం నలుమూలలా వ్యాపిం చింది. 


శంకరాచార్యులను ఎందరెందరో కలిసి జోహారులర్పించి వారికి శిష్యులయ్యారు. శంకరుల లక్ష్య సాధన ఇంతటితో పూర్తి కాలేదు. ఇది మొదలు మాత్రమే. అందుకు శిష్యసమేతంగా మాహిష్మతీపురం నుండి బయలు దేరారు దక్షిణ దిశగా. దారిలో అనేక ప్రాంతాలు దర్శించుచూ, వాటి స్థల మాహాత్మ్యాలను చెప్పుకొంటూ శాస్త్ర చర్చలతో నడుస్తూ, మధ్య మధ్య కనిపించిన పర్వతాలను, సెల యేళ్ళను, అరణ్యాలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యాల ను తిలకించుచూ మధ్య మధ్య గ్రామాల లో ఆగి ఆ జనులకు

దర్శనము ఇస్తూ సాగి పోతోంది వారి కాలి నడక ప్రయాణము. 


మొదట తగిలినది మహారాష్ట్రము. ఎందరో మహాభక్తులూ, మహా వ్యక్తులూ ప్రభ వించిన రాష్ట్రమది. మహా యతీశ్వరుడు వచ్చాడని తెలిసి శంకరుని కలిసి వారికి శిష్యులయిన వారు ఎందరో! మహారాష్ట్ర మంతటా పర్యటించాక ముందుకు వెళ్ళారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చారు.


*శ్రీశైలక్షేత్ర దర్శనము:*


అక్కడికి చేరుకొనే ముందు కుతూహ లంతో శిష్యులు అడుగగా శ్రీశైలమాహా త్మ్యము గురించి శంకరులవారు ఇట్లా సెలవిచ్చారు: 


“ద్వాదశ మహా లింగములు ప్రసిద్ధి కెక్కి యున్నవి. అందు బహు ప్రఖ్యాతి గాంచిన త్రిలింగముల లోను శ్రీశైలమందున్న దొకటి. క్షేత్రమందున్న దేవుడు శ్రీమల్లికార్జునస్వామి. శ్రీ భ్రమరాంబికఅమ్మవారు. ఈ క్షేత్రమహిమ వర్ణించుటకు అపూర్వమై వినుటకు తనివి తీరనిది. 'శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే' అని పురాణ వాక్కు. అంటే శ్రీశైలశిఖరం చూచినంత మాత్రాన జన్మ రాహిత్యం లభిస్తుందని. మన దేశం లోని పుణ్యక్షేత్రాలలో సాధారణంగా దేవునికో దేవికో లేదా క్షేత్రానికోమహిమ లుంటాయి. రెండింటికి మహిమలు గలవి అక్కడక్కడ కలవు గాని మూడింటికి మహత్తు గల పుణ్య క్షేత్రము ఇదొక్కటే. ఈ క్షేత్రము ముప్పది ఆమడల పొడవు, వెడల్పుకలిగి నాలుగుద్వారము లున్నవి. తూర్పున ఉన్న ద్వారము త్రిపురాంత కము, దక్షిణమున నున్నది సిద్ధవటము, పశ్చిమాన అలంపురం, ఉత్తర దిక్కున ఉమా మహేశ్వరము అనే ద్వారము. 


ఒకానొకప్పుడు ఈ క్షేత్రములో మూడువేల ఎనిమిది వందల నివాస మందిరములు, విశాలమైన వీధులు కలిగి ఉండెడిదని ఇటీవల ఆధారములతో తెలిసిన విషయము. క్షేత్రములోని రాళ్ళు, మట్టి, చెట్లు, దుంపలు, తీగలు, ఓషధులు, నీరు, గాలి మున్నగు సకల జడపదార్థములు మహా మహిమ కలిగి యున్నవి. సిద్ధులు, యోగులు మొదలగు వారు ఆకాశగమనము, స్వేచ్ఛా గమనము, అదృశ్యగమనము, భూగర్భదృశ్యము వంటి అద్భుతముల నెన్నో సాధించు చుంటారు. తప మాచరించుటకు బహు యోగ్యమైనతావిది. జ్యోతిర్లింగము నాశ్రయించు కొన్న శక్తి ఉండవలెను కదా! అష్టాదశ మహాశక్తులలో ప్రధానమైన భ్రమరాంబికాశక్తి ఇచటనే వెలసినది" అని ఆ పవిత్ర క్షేత్ర మహిమను వెల్లడించారు.


“గురుదేవా! ఈ క్షేత్రమునకు శ్రీశైలమనే పేరు ఎలా వచ్చింది?” శిష్యులు అడిగారు. శంకరులు ఇట్లా వివరిం చారు: 


“పూర్వకాలమందు వసుమతి అను పేరు కల ముని కన్య పరాత్పరుని గూర్చి తపస్సు చేసి తన పేరు స్థిరంగా ఉండవలెనని, తన పేరుకు బదులుగా శివుడు వేంచేసి యున్న శైలమునకు మొదట 'శ్రీ' చేర్చమని ప్రార్థించి నది. ఇదికృతయుగము నాటి కథ. మరియొక గాథ - కొన్ని యుగాల క్రితం శిలాదుడనే మహర్షికి పర్వతుడనే పుత్రుడు, శ్రీదేవి అనే కుమార్తె ఉన్నారు. ఈ యిరువురూ ఈశ్వరుని గూర్చి తపస్సుచేయగా పరమేశ్వరుడు ప్రత్యక్ష మై వరం కోరుకొమ్మ న్నాడు. పర్వతుడు తానొక పర్వతాకారములో నుండగా ఆ పర్వతంపై లింగాకార ముగా పరమేశ్వరుడుం డాలనీ అర్థించాడు. ఆ పర్వతం పేరులో ముందు 'శ్రీ' చేర్చమని అర్థించింది శ్రీదేవి.


భూమి పుట్టినప్పుడే ఈ క్షేత్రంలో మల్లికార్జునుడు వెలసెనని భక్తుల విశ్వాసం. హిరణ్యకశిపుడు, శ్రీరామచంద్రుడు, పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని అర్చించినట్లు పురాణ గాథ. వ్యాసభగవాను డు, ఘంటాకర్ణ శివా చార్యుడు ఇచ్చటనే తపమాచరించినట్లు ప్రతీతి.” స్నానం చేసినంత మాత్రాన సర్వపాపాలు హరించి శాంతిని చేకూర్చే పాతాళగంగలో శిష్యుల తోసహా స్నానాలాచ రించి మల్లికార్జున స్వామి ఆలయం లోనికి ప్రవేశించారు. అప్పుడు శంకరాచార్యుడు ఈ విధంగా స్తోత్రం చేశారు స్వామిని:


*సన్ధ్యారంభ విజృంభితం శ్రుతి శిరస్థానాన్తరాధిష్టితం*

*సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితం*

*భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం*

*సేవే శ్రీగిరి మల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ |*


*భృంగీచ్ఛానటనోత్కట: కరి మద గ్రాహీ స్ఫురన్మాధవా*

*హ్లాదో నాద యుతో మహా సితవపు: పంచేషుణాచాదృత:*

*సత్పక్ష స్సుమనో వనేషు సపున స్పాక్షాన్మదీయే మనో*

*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః |*


ఈ క్షేత్రంలో కొన్ని నాళ్ళు ఉన్నారు శంకరాచార్యులు.


ఆగమశాస్త్రానుసారము భ్రమరాంబికా దేవిని మహాశక్తిగా స్థాపన చేశారు. ప్రతిదినము పాతాళ గంగా తీరానికి పోయి గంగలో స్నానం చేసి, జప తపాదులు ముగించుకొని తత్తీరమందే శిష్యులకు పాఠాలు చెప్పేవారు.


చుట్టు ప్రక్కల గల పండితులు వచ్చి అప్పుడప్పుడు శంకరుని అద్వైత మార్గాన్ని బోధింప జేసుకొని వెళ్ళేవారు. పాశుపతాది మతస్థులువచ్చి అద్వైతమతాన్ని అంగీకరించక వాదాలకు దిగే వారు. అట్టివారితో పద్మపాదాది శిష్యులే ఎదుర్కొని ఓడించి పంపించే వారు. ఇలాంటి వారిలో తార్కికులు, సాంఖ్యులు, వీరశైవులు, వీరవైష్ణవులు, నాస్తికులు, న్యాయవాదులు, మీమాంసాదర్శకులు, జైనులు ఉన్నారు. వారందరు తుదకు శంకరతత్త్వం ముందు నిలబడలేక నిర్జితులై వెడలే వారు.


*కాపాలికుల కుట్ర:*


శంకరుని ప్రతిభా పాటవాలు, తేజో వైభవాలు అనన్య సామాన్యమైన శాస్త్ర వైదుష్యం అపార జ్ఞాన సంపద చూచిన ఇతర మతవాదు లందరూ ఆధాటికి నిలువలేక పాదా క్రాంతు లైన వారే. కాని కొందరు వివేకహీనులు కూడా ఉన్నారు ఆ పరిస్థితిని సహించక దురభిప్రాయంతో అప మార్గంలో అద్వైత వ్యాప్తిని అడ్డుకోకపోతే తమ మనుగడకే ముప్పు వస్తుందని. అందులో కాపాలికులు అనబడేవారు ప్రముఖులు. ఒక కాపాలికుని పంపిం చారు శంకరుని వద్దకు. అతడు అవధూతవేషం లో శంకరుని చేరాడు. వారు పాతాళ గంగా తీరంలో ఒంటరిగా ఉన్న సమయం చూచి. అతి వినయ విధేయతలు ఉట్టిపడు తుండగా బహు నమ్రభావంతో నిలబడి ఈ విధమైన వింత కోరికను వెలిబుచ్చాడు:


"స్వామీ! పరమపావన మూర్తీ! కృపాసాగరా! తమ దర్శనం కోసం నేను ఎప్పటి నుండియో ఎదురు చూస్తున్నాను. నేటికి సిద్ధించింది నా పుణ్యఫలంగా. మీరు సర్వశాస్త్రవిద్యా విజ్ఞాన స్వరూపులు. అపార కరుణా సముద్రులు. అహంకార మమ కారాలు ఏనాడో మీచే హతమైనవి.సర్వజ్ఞత్వం తో లీలామానుషమైన ఈ శరీరాన్ని ధరించి లోకోపకారం చేస్తున్న వారు. మీ దయ ఉండాలే కాని అసాధ్యములు సాధ్యము కాకపోవు. నాకొక కోరిక ఉన్నది. అది సిద్ధించడానికి మీ సహాయం తప్ప వేరు దారి లేదు. నేను కాలభైరవస్వామి అనుగ్రహం కోసం బహు విధములుగా ప్రయత్నించి విఫలుడ నయ్యాను. ఇప్పుడు ఆ కోరిక మీ కరుణతో సిద్దించవచ్చు. ఘోర తపస్సు చేయగా కాలభైరవుడు ప్రత్యక్ష మై నాతో ఈ విధంగా సెలవిచ్చాడు: 'నీ కోరిక సఫలం అవ్వాలంటే ఒక సార్వభౌముని శిరమును గాని, ఒక

యతీంద్రుని శిరస్సు గాని అగ్నిలో హెూమం చేయి' అని చెప్పి అంతర్ధాన మయ్యాడు. మహాత్మా! నాకు భూమండలంలో సార్వభౌముడన దగిన వాడు కాన రాడయ్యె. ఇక యతీంద్రుని కొరకే నా అన్వేషణ. కాని ఏ యతి నాకు శిరో దానం ఇవ్వడానికి సిద్ధ పడతాడు? అలా చేయడానికి తగిన విజ్ఞానపరిణతి, వైరాగ్య పరిపక్వత, మహాదాన సంకల్పం ఎవరికి ఉంటుంది? మీరు ఒకరే నాకు కనబడ్డారు ఇంద్రియముల మీద, దేహం మీద పూర్తిగా స్పృహ విడచిన వారు. మీ ఒక్కరికే నిజంగా అవగతమయింది ఈ జగత్తు అంతా అసత్య మని, సత్యమైనది వేరేదో ఉన్నదని. ఆ ఆత్మజ్ఞాన పరిపూర్ణు లైన మీరు నా ప్రార్థనను మన్నించి నన్ను ధన్యుణ్ణి చేయాలి. గతంలో దధీచి దేవతలకు తన ఎముకలను దానం చేసి అజరామరమైన కీర్తి సంపాదించాడు. అలాగే శిబి తన తొడను కడకు శరీరాన్నే ఇచ్చాడు డేగ ఆకలి తీర్చడానికి. మీ కరుణా కటాక్షం కోసం నిలబడ్డాను” ఆ కపట సన్న్యాసి కోరికకు తలయూపి శంకరుడు ఇలా అన్నాడు: “ఓయి సిద్ధపురుషుడా! ఎప్పటి కయినా విడువ దగినదే ఈ శరీరం. నా తల తీసికొని నీ పని కానిమ్ము. కాని ఒకటి గుర్తుంచుకో. ఇది చాల రహస్యంగా కావలసిన పని. కాబట్టి ఒక రహస్యప్రదేశం చూసుకో. నా శిష్యులు ఎవరి కయినా తెలిస్తే నీ పనికి అంతరాయం కలుగుతుంది" అని శంకరుడు కపాల దానానికి సిద్ధపడ్డాడు. అనుకొన్న రహస్య ప్రదేశంచేరి శంకరాచార్యుడు సుఖాసీనుడై, గెడ్డాన్ని కంఠం కుతుకున ఆన్చి, రెండు చేతులూ, మోకాళ్ళనూ తాకి, నిమీలిత నేత్రుడై, భ్రూమధ్యాన్ని చూస్తూ, సంకల్ప వికల్పములు లేనివాడై ఇంద్రియ వ్యాపారాన్ని అరికట్టి పరమాత్మను తానుగా భావిస్తూ అలా యోగసమాధి లోనికి వెళ్ళాడు. ఇక కాపాలి కుడు తన మనోరథం పూర్తి కానున్నదన్న ఆనందంతో ఒడలంతా ఎముకల బూడిదను పూసుకొని, మత్తుగా మద్యపానం చేసి,ఒకచేత కరవాలం వేరొక చేత త్రిశూలంతో కాలభైరవ వేషధారిగా వచ్చాడా చోటికి. వస్తూనే దూరాన నుండి కనబడినదా కండ్లు మిరుమిట్లు గొలిపే దివ్య దృశ్యం. ఏనాడో సుకృతం చేసికొని ఉండాలి ఆతడు. లేకపోతే ఎలా లభ్య మవుతుంది యోగ సమాధిస్థితుడై ఉన్న పరమేశ్వరుని దర్శనం!


*పద్మపాదుని నృసింహావతరణ:*


కాలకృత్యాలకు వెడలిన శిష్యులు స్నానాలు చేసి, సంధ్య నుపాసించి ధ్యానంలో ఉన్నారు. పద్మపాదుడు కూడా ధ్యాననిమగ్నుడై ఉండగా అతనికి గోచరించింది కరవాల ము ధరించి జగద్గురు వుల శిరమును ఖండించడానికి ఉద్యుక్తుడై ఉన్న కాపాలికుని దృశ్యం. వెంటనే పద్మపాదుడు తన ఇష్టదైవాన్ని తలచుకొన్నాడు. తలచిన మరు క్షణమే పద్మపాదునికి నృసింహ స్వామి రూపు వచ్చింది. కాపాలికుడు గురుదేవుడు ఉన్న రహస్య స్థలంలో అదే క్షణంలో ప్రత్యక్ష మయ్యాడు. అగ్నిజ్వాలలు కక్కు తున్న ముఖంతో, వాడి కోరలతో, చీల్చి చెండాడే కత్తుల వంటి గోళ్ళతో చింత నిప్పు వంటి నాలుకతో భీకర రూపందాల్చి సింహ గర్జనను మించిన గర్జనతో ఒక్క ఉరకలో కాపాలికుని మీదికి లంఘించినాడు పద్మపాదుడు. పృథివి దద్దరిల్లింది. 


సకలభూతములు భీతిల్లాయి. దేవతలు అడలి అవనికి దిగి వచ్చారు. హిరణ్య కశిపుని బారి నుండి ప్రహ్లాదుని కాపాడినట్లు కాపాలికుని సంహరించి శంకరుని రక్షించు కొన్నాడు.


ఇంతలో శంకరుడు యోగ సమాధి నుండి వెలువడి జరిగినది గ్రహించాడు. ఆకాశం విరిగి మీద పడినట్లు అట్టహాసంతో ప్రత్యక్ష మయిన ఆ ఉగ్ర నరసింహ స్వామిని చూచి ఇలా ప్రార్థించాడు:

*“కల్పంతో జృంభమాణ ప్రమథ*

*పరివృఢ ప్రౌఢ లాలాట వహ్ని*

*జ్వాలాలీఢ త్రిలోకే జనిత చటచటధ్వాన ధిక్కార ధుర్యః ॥*


*మధ్యే బ్రహ్మాండభాండోదర కుహర,* 

*మనైకాంత్య దుస్థా మనస్థాం*

*ప్రాప్తస్త్యానో మమాయం*

*దళయతు దురితం*


 శ్రీనృసింహాట్టహాస:


ఉగ్రరూపాన్ని ఉపసంహ రించమని శంకరులు అర్థించగా ఆ రూపం అదృశ్యమై పద్మపాదా చార్యుడు గోచరించాడు. పద్మపాదుడు ఆనందా శ్రువులతో గురువు పాదాలకు అభిషేకం చేశాడు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*

*23 వ భాగము సమాప్తము*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

హరికిం బట్టపుదేవి,

 



💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణముల ననుగ్రహించును గాక!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఔషధసేవనం బాచరించెడి వేళ

 ఔషధసేవనం బాచరించెడి వేళ

          వినుతించ వలయును 'విష్ణు' నెపుడు

భోజనమ్మును తాను భుజియించు వేళలో 

          తలచ తగును 'జనార్దను'ని మదిని

శయనించు సమయాన సంతృప్తి తోడను 

          ప్రార్తించ వలయును 'పద్మనాభు'

ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన 

          పరిణయ వేళందు భక్తితోడ

సమరంబు నందున 'చక్రధరా' యంచు

          జపియించ వలయును జయము పొంద

పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'

         యనుచు పలుకతగు న్నాత్మ యందు

తనువు నొదులు వేళ తా బల్క వలయును

         'నారాయణా' యంచు నయము గాను

ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని 

        'శ్రీధరా' యనుచును చెప్ప తగును

దుస్వప్నముల యందు దుఃఖించకను తాను

       'గోవింద' యని మది కొలువతగును

సంకటసమయాల సద్భక్తి తోడను

        'మధుసూద'ననతగు మదిని నరుడు 

విపినంబునందున వెఱవక మనుజుండు

         కోరి దల్చ తగును 'నారసింహు'

అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు 

         'జలశాయి' భజనమ్ము సల్ప తగును

పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'

        నెంచంగ వలయును నెపుడు నరుడు

గమనంబు నందున కల్కంగ నశ్రమ

        భక్తి నెంచ తగును 'వామనుడి'ని

సర్వకాలములందు సర్వేశు "మాధవున్"

        మదిదల్చ  వలెనెప్డు మానవుండు

శుభము లిచ్చు "విష్ణు షోడశనామమ్ము "

లుదయ వేళ యందు చదివి తేని

సర్వ పాపరాశి సమసియున్ మనుజుండు 

విష్ణునెలవు చేరు విమల మతిని.


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ॐపంచాంగం

 ॐపంచాంగం  ॐ

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

 *_సెప్టెంబరు 27, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *దశమి* సా4.19

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *పుష్యమి*

మర్నాడు తె4.46

యోగం : *శివం* తె3.52

కరణం: *విష్ఠి* సా4.19

&

*బవ* తె4.31

వర్జ్యం: *మ12.14-1.54*

దుర్ముహూర్తము: *ఉ8.16-9.04*

&

*మ12.16-1.04*

అమృతకాలం: *రా10.09-11.49*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *కన్య*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.53*

సూర్యాస్తమయం: *5.52*

 *లోకాః సమస్తాః *సుఖినోభవంతు*

ధారుణి రాజ్యపీఠములఁ

 ఉ॥

ధారుణి రాజ్యపీఠములఁ ధైర్యముఁ నీతియుఁ ధర్మపాలనం 

దీరిన నేతలుండిన నతీవముదావహమౌను ధాత్రికిం 

గూరిమి బెంపుగాంచు జనకోటులఁ దేశవిదేశరాశిలో 

భారము గాదు శాంతి యెడబాయని యుద్ధములెల్ల నశ్యమౌ 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - దశమి - పుష్యమి -‌‌ భృగు వాసరే* (27.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మగవాడు ఆడదానిలా

 *🍂మగవాడు ఆడదానిలా ఎలా మారతాడు🍂*


*మగాడికి_మగాడికి_పిల్లలు_ఎలా_పుడతారు?*


*

*మహా భారత రచయిత శ్రీ వేద వ్యాస మహర్షి చేసిన కొన్ని అధ్భుత ప్రయోగాలు...*

         

1. *కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.*

          

2. *నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*

         

3. *పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం : పంచ భూతాలు + కుంతి= పాండవుల జననం...*

          

4. *ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే... కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు... తద్వారా అశ్వత్థామ జననం...*

          

5. *ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం...*

        

6. *అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం...*

        

7. *సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి=ఘటోత్కచుడు*


8. *ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.*

         

9. *మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు అనే గంధర్వవుడు...*

          

10. *చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి...*

        

*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి... కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?*

      

*ఇవేమి, నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు... కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?*

              

*ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు... కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?*

         

*ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్... అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని, స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు...*

        

*కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని existency ఉండి తీరుతుంది...*

       

*ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం... మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం...*


*హిందూ సాంప్రదాయం చాలా గొప్పది*

     

*భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?*

      

*భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)*


*భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)*


*ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)*


*విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)*


*విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*


*భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే*


*గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే*


*రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*


*కాస్మోలజీ చెప్పిన కపిలుడు*


*అణువులు గురించి వివరించిన కణాదుడు*


*DNA గురించి చెప్పిన బోధిధర్మ*


*మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*


*మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు*


*సంగీతాన్ని (స.రి.గ.మ.ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని*


*ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.*


 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.*

*నా దేశం గొప్పది నా "సనాతన ధర్మం" గొప్పది నా హైందవ ధర్మం గొప్పది*

🙏🕉️🙏 🕉️🙏🕉️ 🙏🕉️🙏

హైందవం వర్ధిల్లాలి 13*

 *హైందవం వర్ధిల్లాలి 13*




*సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థను మెరుగు పర్చుకోవాలి* 

v):- యుక్త వయస్సులో పిల్లలు చూసిన వాటికి ఆకర్షితులు కావడం సహజం. ఈ తరం పిల్లలు ఉన్నత పాఠశాల స్థాయినుండే చాలా స్వేచ్చా, స్వాతంత్రాలతో కోరిన వాటిని పొందుతూ సంతోషపడ్తూఉంటారు. పొందిన స్వేచ్చా స్వాతంత్రాలతో దుర్గుణాల పాలయిన పిల్లల విషయంలో ఒక నిశ్చయానికి రావచ్చు. ఇది పూర్తిగా పిల్లలలో ఉండే లోపమని చెప్పడానికి వీలులేదు. వీటన్నిటికీ కారణాలు సరైన పెంపక లోపం, స్నేహితులు, పాఠశాల మరియు కళాశాల, ఇంట్లో వాతావరణం మరియు సామాజిక వాతావరణం కావచ్చును. *ఈ వాతావరణం దాదాపు గత దశాబ్దం నుండి మన దేశంలో అధికంగా నెలకొనిఉన్నది.*


ఇట్టి దుర్గుణాలకు లోనైన వారందరూ ధనవంతుల పిల్లలే అనుకోవడానికి లేదు. ధనవంతులకు పిల్లలతో చెట్టా పట్టాలేసుకుని తిరిగే సన్నిహిత పిల్లలు, యుక్త వయస్సులోనే చెడు అలవాట్లకు ( దొంగతనాలు, జూదాలు, గుట్కాలు ,మద్యం మున్నగు) లోనైన వారు ఇటువంటి అలవాట్లకు లోనవుతారు. 


*కొన్ని చెడు అలవాట్లు*:- పొగత్రాగడం, సిగార్, బీడీ. బార్లు, క్లబ్బులు, పబ్బులు, మాదక ద్రవ్యాలైన నల్లమందు, గంజాయి సేవించడం. హుక్కా, నార్కోటిక్ డ్రగ్స్, ఇన్ హేలర్స్, ఇంజెక్టిబ్ల్స్, హాలుసినోజెన్స్ ఇత్యాది. 


మన హిందూ సమాజంలో ముఖ్యంగా నగరాలలో, విదేశాలలో, ధనిక వర్గాలలో ఉండే తల్లి, తండ్రి ఆధునిక స్వేచ్ఛాప్రపంచంలో మేమూ భాగస్వాములమే అను భ్రమలో మధ్య రాత్రి వరకు ఇంటి బయటే గడిపి రావడం. సమయాసమయాలు పాటించకుండా ఆ మత్తులో , పిల్లల ముందే గొడవలు పడడం, ఇత్యాది కారణాలు ఎదుగుతున్న పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. *తల్లి, తండ్రి ఆప్యాయత కరువైన పిల్లలు, అమ్మా నాన్న అడుగుజాడలలో నడిచే పిల్లలు ఇటువంటి దురలవాట్లకు గురయ్యే అవకాశాలు హెచ్చు*. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలలో మొండితనం, దురలవాట్లు, చెడు సాంగత్యం, బాధ్యతా రాహిత్యానికి కారణాలు పెద్దల ప్రవర్తన, మిత్ర బృందం మరియు వారుంటున్న సామాజిక వాతావరణం కావచ్చును. *ఈ ప్రవర్తనలు అన్ని హిందూ ధర్మాన్ని బలహీన పర్చే అంశాలైనా ఇంకా విపులంగా చర్చించుటకు ఇది వేదిక కాదు*. సమాజంలో ఎన్ని రుగ్మతలో మననం చేసుకోవటానికి మాత్రమే ఈ అంశం ప్రస్తావించవలసివచ్చింది. *మంచైనా, చెడైనా పెద్దల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న విషయం జగద్విదితమే*. 


ఒక్కొక్క సారి అంగడిలో (market) కొన్ని కూరగాయలు దొరకవేమో గాని, దురభ్యాసాలకు అలవాటుపడిన పిల్లలకు ఈ మత్తు పదార్థాలు చాలా తేలికగా లభిస్తాయి. *ఇందుకు కారణం సమాజ ద్రోహులు మరియు వారు నిర్వహించే అక్రమ వ్యాపారాలు, అడిక్షన్ కేంద్రాలు*. ప్రతి విషయం చట్టం మాత్రమే చూడాలి అను భావన కూడదు. చట్టాన్ని నిందిస్తూ ఉండకూడదు. తల్లి తండ్రి మరియు కుటుంబంలోని ఇతర పెద్దలు జాగరూకులై ఉండాలి, చట్టానికి సహకరించాలి. 


*ప్రతి సారి భారత దేశంలోని హైంద ధర్మ మరియు సంస్కృతి, సంప్రదాయాల హానికి వీళ్లది తప్పు, వాళ్ళది తప్పు (పాశ్చాతులు, దుర్మార్గులు) అని వాపోయే దానికంటే... మనం ఆత్మ విమర్శతో ఉండాలి. హైందవ ధర్మం, సంస్కృతి, ముఖ్యంగా కుటుంబ గౌరవం దేశభక్తి సంప్రదాయాలను "విస్మరిస్తున్నామనేదే" ప్రబల కారణం*. కావున మన హిందూ ధర్మానికి సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి.


ధన్యవాదములు.

*(సశేషం)*.

మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

నమస్కుర్మః ప్రేఙఖన్ 

మణికటక నీలోపలమహః

పయోధౌ రింఖద్భిః 

నఖకిరణ ఫేనైః ధవలితే|

స్ఫుటం కుర్వాణాయ 

ప్రబల చల దౌర్వానలశిఖా

వితర్కం కామాక్ష్యాః

సతతమరుణిమ్నే చరణయోః ||18||

 

భావము:

కామాక్షీదేవి చరణమంజీరాలయందలి ఇంద్రనీలమణుల కాంతియనే నల్లని రంగుగల సముద్రమందు, దేవి చరణ నఖకాంతులనే తెల్లని నురుగు వ్యాపించగా, శ్రీచరణములయందలి అరుణిమ బడబాగ్ని జ్వాలగా తోచును. ఆ దివ్యచరణారుణిమకు నమస్కారము.

దేవి చరణ స్తుతిని చేస్తున్న మూకకవి ఇందు తెలుపు, నలుపు, ఎరుపు రంగులను ప్రస్తావించి త్రిమూర్త్యాత్మకతను ధ్వనింపచేసాడు. సత్వరజస్తమస్సుల వర్ణములును ఇవే. చరణారుణిమకు నమస్కారం అనుటచేత అగ్ని ఉపాసన వ్యక్తం అగుచున్నది.

 

*********

  

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

మనోహరమైన

 👆శ్లోకం

శుభాంగశ్శాన్తిదస్స్రష్టా                          

కుముదః కువలేశయః|.                    

గోహితో గోపతిర్గోప్తా.                       

వృషభాక్షో వృషప్రియః||


ప్రతిపదార్థ:


శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.


శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.


స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.


కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.


కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.


గోహిత: - భూమికి హితము చేయువాడు.


గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.


గోప్తా - జగత్తును రక్షించువాడు.


వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.


వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.

వ్యాధి సంభవించినట్లయితే

 శ్లోకం:☝️

*జాతమాత్రశ్చికితస్యః*

*స్యాన్నోపేక్షయోల్పతయా గదః |*

*వహ్నిశత్రువిషైస్తుల్యః*

*స్వల్పోఽపి వికరోత్యసౌ ||*


భావం: వ్యాధి సంభవించినట్లయితే, దానికి వెంటనే చికిత్స చేయాలి; కొంచం కూడ ఉపేక్షించవద్దు. లేకపోతే అగ్ని, శత్రువు మరియు విషం వలె విపరీతంగా పెరిగి నయం అది చేయలేనిదిగా మారుతుంది. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయ్యేంత వరకు వేచి చూడవద్దని భావం.

పంచాంగం 27.09.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 27.09.2024 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష దశమి తిధి భృగు వాసర: పుష్యమి నక్షత్రం శివ యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


దశమి మధ్యాహ్నం 01:23 వరకు.

పుష్యమి రాత్రి 01:22 వరకు.


సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:05


వర్జ్యం : పగలు 08:11 నుండి 09:54 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:20 వరకు తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 01:19 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:29 నుండి రాత్రి 08:12 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార: