27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ప్రేమతో చూడాలని, గౌరవించాలని

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మధ్య తరగతి నిరాడంబరత, మర్యాద, పెద్దలు మరియూ ఉపాధ్యాయుల విషయంలో గౌరవం, నా చిన్నప్పటి జ్ఞాపకాలు. నా పిల్లలకి కూడా అంతా నేర్పలేకపొయాను. 100 రూపాయలు కావలసినచోట, 99 వుండాలి. అది చాలాఅణుకువని నేర్పుతుంది. మా మాటే కాదు, ఉపాధ్యాయులూ, పిన్ని, బాబాయి, మామయ్యా, అత్తా, ముఖ్యంగా తాతా, అమ్మమ్మ , నానమ్మ లనికూడా అంతే ప్రేమతో చూడాలని, గౌరవించాలని, మనము ఆచరిస్తూ, వాళ్ళకి చెప్పగలిగిన నాడే తిరిగి ఈ వ్యవస్థ తిరగబడుతుంది. ఊహకు అందని సంపాదనలూ, విచ్చలవిడి అలవాట్లూ, చదువుకున్నతర్కాలూ, మేము అనుభవించలేదూ, మా పిల్లలు ఎందుకు కష్టపడాలి అనే మన మధ్య తరగతి కొత్త అలోచనలూ, కనపడిన ప్రతీవారితో మైత్రి, అర్ధంలేని పోలికలూ, అహాలూ, వున్నదంతా (డబ్బు, శరీరం, భాష) చూపించేయాలన్న ఆత్రం, సమయా సమయాలను అనుసరించి తోటివారినీ, బంధువులనూ అభినందించాలి ( లేదా) పరామర్శించాలి అనే ఇంగితం కోల్పోవడం, కాకపొతే మూతిముడుచుకు కూర్చుని అస్సలు సంబంధాలే నిలుపుకోకపోవటం,   

తరచి చూస్తే.., 

అస్సలు మనిషికీ మనిషికీ మధ్య కనిపించని ధనంతో ముడివడిన పదవులూ, గోడలూ ....

అలోచించండి మిత్రులార..

ఇవిమారకుండా, మన విద్యావ్యవస్థని వేలెత్తి చూపితే, సమాజానికి ఏమి మంచి జరుగుతుందని మన ఆశ..?? 

కుటుంబ వ్యవస్థ, మన ఆచారాలూ, సంప్రదాయలూ, మన్ననతో మసలిననాడు, పెరుగుతున్న విజ్ఞానానికి తోడై, మన సత్సంప్రదాయాలు జోడై, ప్రపంచ పట శిఖరాగ్రాన నిలిచే మన భారత మాతని, సగర్వంగా చూడొచ్చు.. 🙏


స్వస్తి .. 🌹🌹

కామెంట్‌లు లేవు: