27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ప్రేమలూ - పలకరింతలూ

 💝  ఆహ్వానం  💝

  ☝️మన ఇళ్లల్లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు....ఇంకెన్నో శుభకార్యాలు 

జరుగుతుంటాయి. వాటికి బంధువుల్ని ,స్నేహితుల్ని, శ్రేయోభి లాషుల్ని, పిలుస్తుంటాం. ఇలా అందరూ ఓచోట కలుసుకోవాలను కోవడమే ఈ పిలుపుల్లోని సదుద్దేశం .💐

   👉కానీ.... రాను రానూ - ఈ ఫంక్షన్లలో ఆర్భాటాలు ఎక్కువై పోతున్నాయి . ఎంత ఎక్కువ మందిని పిలిస్తే - ఎన్ని వెరైటీల వంటకాలు పెడితే .... అంత గొప్పగా భావిస్తున్నాం!! కానీ ఆహ్వానించిన తర్వాత, వారందరినీ - కనీసం పలకరించడానికి కూడా తీరికలేని స్థితిలో ఉంటున్నాం !! అతిధే ఆహ్వానితుని దగ్గరకు వెళ్లి "నేను

వచ్చానోచ్" అని హాజరు వేయించుకుని బయటపడే దుస్థితి ఏర్పడుతోంది!! .. 🤦‍♂️😃

   ☝️పిలవకపోతే బాగుండదని పిలవడం - వెళ్లకపోతే బాగుండదని వెళ్లడం- తప్ప..... ప్రేమలూ - పలకరింతలూ లేకుండా పోతున్నాయని అందరికీ తెలుసు . 

పలకరించడానికి వీల్లేనంతమందిని 

పిలవడంవల్ల - ఆహ్వానించిన వారికీ,ఆహ్వానితులకూ కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది.😌

    👉ఇక భోజనాల దగ్గర కూడా - సీటుకోసం ..... తినేవారి వెనుక నిలబడటానికి కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ పిలుపులు - భోజనాలు..... అతి మూలంగా, ఒకరిని చూసి మరొకరు  దుబారా ఖర్చులు పెరిగిపోయి ,ముఖ్యంగా - మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలై బజారున పడుతున్న నేటి పరిస్థితుల్లో ఇవన్నీ తగ్గాలి !! హైరానా పడి ఖర్చుపెట్టి,అప్పులపాలు చేసే ఈ కార్యక్రమాలను ఉత్సవాలని ఎలా భావించాలి!? ఈ సాంప్రదాయం మారాలి!!🤔

   ☝️ఇకముందైనా శుభకార్యాలు చేసేటప్పుడు - ఎవరి పరిధిలో వారు .... ఎంత మందికి అతిధి సత్కారం చేయగలమో - అంతమందినే ఆహ్వానించి ... ఆ ఫంక్షన్ ముగించుకుంటే ఉభయ తారకంగా వుంటుంది . ఈ పద్ధతి అవలంబించినప్పుడే ఆ శుభ కార్యానికీ - "ఆహ్వానాని"కీ సార్ధకత !! 🙏

కామెంట్‌లు లేవు: