27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

హైందవం వర్ధిల్లాలి 13*

 *హైందవం వర్ధిల్లాలి 13*




*సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థను మెరుగు పర్చుకోవాలి* 

v):- యుక్త వయస్సులో పిల్లలు చూసిన వాటికి ఆకర్షితులు కావడం సహజం. ఈ తరం పిల్లలు ఉన్నత పాఠశాల స్థాయినుండే చాలా స్వేచ్చా, స్వాతంత్రాలతో కోరిన వాటిని పొందుతూ సంతోషపడ్తూఉంటారు. పొందిన స్వేచ్చా స్వాతంత్రాలతో దుర్గుణాల పాలయిన పిల్లల విషయంలో ఒక నిశ్చయానికి రావచ్చు. ఇది పూర్తిగా పిల్లలలో ఉండే లోపమని చెప్పడానికి వీలులేదు. వీటన్నిటికీ కారణాలు సరైన పెంపక లోపం, స్నేహితులు, పాఠశాల మరియు కళాశాల, ఇంట్లో వాతావరణం మరియు సామాజిక వాతావరణం కావచ్చును. *ఈ వాతావరణం దాదాపు గత దశాబ్దం నుండి మన దేశంలో అధికంగా నెలకొనిఉన్నది.*


ఇట్టి దుర్గుణాలకు లోనైన వారందరూ ధనవంతుల పిల్లలే అనుకోవడానికి లేదు. ధనవంతులకు పిల్లలతో చెట్టా పట్టాలేసుకుని తిరిగే సన్నిహిత పిల్లలు, యుక్త వయస్సులోనే చెడు అలవాట్లకు ( దొంగతనాలు, జూదాలు, గుట్కాలు ,మద్యం మున్నగు) లోనైన వారు ఇటువంటి అలవాట్లకు లోనవుతారు. 


*కొన్ని చెడు అలవాట్లు*:- పొగత్రాగడం, సిగార్, బీడీ. బార్లు, క్లబ్బులు, పబ్బులు, మాదక ద్రవ్యాలైన నల్లమందు, గంజాయి సేవించడం. హుక్కా, నార్కోటిక్ డ్రగ్స్, ఇన్ హేలర్స్, ఇంజెక్టిబ్ల్స్, హాలుసినోజెన్స్ ఇత్యాది. 


మన హిందూ సమాజంలో ముఖ్యంగా నగరాలలో, విదేశాలలో, ధనిక వర్గాలలో ఉండే తల్లి, తండ్రి ఆధునిక స్వేచ్ఛాప్రపంచంలో మేమూ భాగస్వాములమే అను భ్రమలో మధ్య రాత్రి వరకు ఇంటి బయటే గడిపి రావడం. సమయాసమయాలు పాటించకుండా ఆ మత్తులో , పిల్లల ముందే గొడవలు పడడం, ఇత్యాది కారణాలు ఎదుగుతున్న పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. *తల్లి, తండ్రి ఆప్యాయత కరువైన పిల్లలు, అమ్మా నాన్న అడుగుజాడలలో నడిచే పిల్లలు ఇటువంటి దురలవాట్లకు గురయ్యే అవకాశాలు హెచ్చు*. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలలో మొండితనం, దురలవాట్లు, చెడు సాంగత్యం, బాధ్యతా రాహిత్యానికి కారణాలు పెద్దల ప్రవర్తన, మిత్ర బృందం మరియు వారుంటున్న సామాజిక వాతావరణం కావచ్చును. *ఈ ప్రవర్తనలు అన్ని హిందూ ధర్మాన్ని బలహీన పర్చే అంశాలైనా ఇంకా విపులంగా చర్చించుటకు ఇది వేదిక కాదు*. సమాజంలో ఎన్ని రుగ్మతలో మననం చేసుకోవటానికి మాత్రమే ఈ అంశం ప్రస్తావించవలసివచ్చింది. *మంచైనా, చెడైనా పెద్దల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న విషయం జగద్విదితమే*. 


ఒక్కొక్క సారి అంగడిలో (market) కొన్ని కూరగాయలు దొరకవేమో గాని, దురభ్యాసాలకు అలవాటుపడిన పిల్లలకు ఈ మత్తు పదార్థాలు చాలా తేలికగా లభిస్తాయి. *ఇందుకు కారణం సమాజ ద్రోహులు మరియు వారు నిర్వహించే అక్రమ వ్యాపారాలు, అడిక్షన్ కేంద్రాలు*. ప్రతి విషయం చట్టం మాత్రమే చూడాలి అను భావన కూడదు. చట్టాన్ని నిందిస్తూ ఉండకూడదు. తల్లి తండ్రి మరియు కుటుంబంలోని ఇతర పెద్దలు జాగరూకులై ఉండాలి, చట్టానికి సహకరించాలి. 


*ప్రతి సారి భారత దేశంలోని హైంద ధర్మ మరియు సంస్కృతి, సంప్రదాయాల హానికి వీళ్లది తప్పు, వాళ్ళది తప్పు (పాశ్చాతులు, దుర్మార్గులు) అని వాపోయే దానికంటే... మనం ఆత్మ విమర్శతో ఉండాలి. హైందవ ధర్మం, సంస్కృతి, ముఖ్యంగా కుటుంబ గౌరవం దేశభక్తి సంప్రదాయాలను "విస్మరిస్తున్నామనేదే" ప్రబల కారణం*. కావున మన హిందూ ధర్మానికి సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి.


ధన్యవాదములు.

*(సశేషం)*.

కామెంట్‌లు లేవు: