27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

నమస్కుర్మః ప్రేఙఖన్ 

మణికటక నీలోపలమహః

పయోధౌ రింఖద్భిః 

నఖకిరణ ఫేనైః ధవలితే|

స్ఫుటం కుర్వాణాయ 

ప్రబల చల దౌర్వానలశిఖా

వితర్కం కామాక్ష్యాః

సతతమరుణిమ్నే చరణయోః ||18||

 

భావము:

కామాక్షీదేవి చరణమంజీరాలయందలి ఇంద్రనీలమణుల కాంతియనే నల్లని రంగుగల సముద్రమందు, దేవి చరణ నఖకాంతులనే తెల్లని నురుగు వ్యాపించగా, శ్రీచరణములయందలి అరుణిమ బడబాగ్ని జ్వాలగా తోచును. ఆ దివ్యచరణారుణిమకు నమస్కారము.

దేవి చరణ స్తుతిని చేస్తున్న మూకకవి ఇందు తెలుపు, నలుపు, ఎరుపు రంగులను ప్రస్తావించి త్రిమూర్త్యాత్మకతను ధ్వనింపచేసాడు. సత్వరజస్తమస్సుల వర్ణములును ఇవే. చరణారుణిమకు నమస్కారం అనుటచేత అగ్ని ఉపాసన వ్యక్తం అగుచున్నది.

 

*********

  

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

కామెంట్‌లు లేవు: