4, సెప్టెంబర్ 2024, బుధవారం

Panchng



 

తెలుగు పెళ్లిళ్లు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 తెలుగు పెళ్లిళ్లు ఆ రోజుల్లో ఎలా ఉండేవో, పెళ్లి కుమార్తె లకు ఎటువంటి అలంకారాలు చేసేవారో, ఆ ముచ్చట్లు తెలియాలంటే సీతమ్మ పెళ్లి తెలుసుకోవలసిందే. తెలుగు రామాయణాల్లో సీతమ్మ పెళ్లి ముచ్చట్లు వింటే ఆనాటి ఆచారాలన్నీ అర్థమవుతాయి. రంగనాథ రామాయణం లోని విశేషాలు చెప్తూ ప్రముఖ సాహితీవేత్త డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు ఈ ఎపిసోడ్ లో

 సీతమ్మ పెళ్లి గురించి ఎంతో చక్కగా వివరించారు. మన సీతమ్మ కథ సీరియల్ లో ఇది 10వ భాగం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కరువాయను

 కరువాయను యజ్ఞ యాగము              

బరువాయను హవిస్సు అర్పణ                 

మరుపాయను   కర్మాచరణము                                      

చెరువాయను కన్నీటి కడగండ్లు

తురగా నాగేశ్వర రావు

5. " మహా దర్శనము

 5. " మహా దర్శనము "--- ఐదవ భాగము---దర్శనమైనది


5. దర్శనమైనది 



         శ్రావణ శుద్ధ పౌర్ణమి , సోమవారము . దేవరాత దంపతులు పూర్ణమాస యాగమును చేసినారు . యజ్ఞేశ్వరుడు మూడు కుండములలో కూర్చొని ప్రసన్నముగా హవ్యమును స్వీకరించినాడు . దేవరాతునికి ఏదో ఒక విచిత్రమైన ప్రసన్నత వచ్చింది . గడచిన తొమ్మిది పది రోజులనుండీ , దినదినమూ , " ఈ దినము తప్పక సంయమము చేసి గర్భస్థ శిశువును మాటలాడించవలెను " అనుకుంటాడు . కానీ ఏదో దిగులు వంటి భయము . తనకన్నా ఉత్తములు అని మనసు ఒప్పుకొన్న వారి సమక్షమునకు పోవుటకు బెదరునట్లు , దేవరాతుడు ఏవో కుంటి సాకులను ముందుంచుకొని ఊరికే ఉంటాడు . ఈ దినము దృఢముగా నిర్ణయించుకున్నాడు . " ఏమైనా కానీ , ఈ రోజు మాట్లాడించియే తీరవలెను . ఇంకెన్ని దినములు ఊరకే ఉండవలెను ? ఇంకెన్ని దినములు ఊరకే ఉండేది ? ఊరకే ఉంటే , బిడ్డకు ఏమి చెప్పాలన్నది భార్యకు తెలియక ఆమే , ఆమె వలన తానూ , ఇద్దరూ కర్తవ్య భ్రష్ఠులవుతాము . అది సరియైనది కాదు . " అయినా బెదురు పోలేదు . సంయమము చేస్తేనేమి ? చేయకున్ననేమి ? అనే సంశయము ఇంకా ప్రబలముగా నున్ననూ , సంయమము చేసే తీరవలెనన్న సిద్ధాంతమే ప్రబలమైనది . చలితో ఒణుకుతున్ననూ , చన్నీరన్న భయమున్ననూ , స్నానము చేసే తీరవలెనన్న హఠముతో , నీటిలోనికి దిగు వైదీక బ్రాహ్మణుని వలె అతడు కూడా సంయమానికి సిద్ధుడైనాడు . 


        పగలు గడచి సాయంత్రమైనది . స్నానమయినది , సంధ్యాకర్మ కూడా అయినది . అగ్నిహోత్రమయినది , ఫలహారమయినది . అప్పుడు దేవరాతుడు భార్యను పిలచి , " ఈ దినము ఇంటి పనులను వేగిరముగా ముగించుకో , వేరే పనిఉన్నది " అన్నాడు . ఆమె , " అటులనే , నాకు కూడా పొద్దుటి నుంచీ గిలకలా తిరుగుతూ పని చేసి , ఒళ్ళంతా పండినట్లైనది . మీ ఆజ్ఞ నాకు కూడా అనుకూలమే . ఎప్పుడెపుడు శయ్యపై వాలుదామా అన్నట్లుంది , అటులనే " అని , ఆత్రముగా చేతికి దొరికిన పనిని చేస్తున్నది . అంతలోనే దేవరాతుడు మళ్ళీ వచ్చి , ’ ఆతరపడి భోజనము వదిలేస్తావేమో , ఒద్దొద్దు , రెండు ప్రాణాల దానవు , " అంటాడు . ఆమె నవ్వుతూ , " మీ అనుజ్ఞ అయినాక ఇంకేమి ? ఏదో ఫలహారము చేసి రెండు అరటి పళ్ళుతిని , పాలు మాత్రమే తాగాలనుకున్నాను , ఇప్పుడు ఏకంగా భోజనమే చేసి , పళ్ళూ పాలూ స్వీకరించి వస్తాను " అని తన పనిలో తాను నిమగ్నమైంది .  . 


         దేవరాతుడు శయ్యా గృహములో భార్యకై వేచియున్నాడు . ఆమె కూడా వేగిరమే వచ్చినది . ఈ దినము భర్తకు తాంబూలపు ఉపచారము లేదు కాబట్టి , తాను వచ్చేటప్పుడే తాంబూలము వేసుకొనే వచ్చినది . తాను పడుకొనే వరకూ ఆమె పడుకోదని , దేవరాతుడు మంచానికి అడ్డము పడినాడు . " ఆమె పడుకోనీ , నిద్ర పోనీ , సుమారు అర్ధరాత్రికి సంయమము చేయవలెను " అనుకున్న దేవరాతునికి భార్య పరుండినపుడైతే మెలకువ ఉండినది , ఇంకో ఘడియలోపలే ఆమెకన్నా ఎక్కువగా గాఢనిద్రలోకి జారిపోయినాడు . 


        సుమారు మూడవ ఝాము . దానిలో కూడా సగము గడచినది . అప్పుడు దేవరాతునికి ఒక స్వప్నము . ఆ కలలో దేవరాతుడు అగ్నిగృహము నుండీ వచ్చి బచ్చలి ఇంటికి వెళ్ళి కాలూ చెయ్యీ కడుక్కుని వచ్చి శుద్ధాచమనము చేస్తున్నాడు . ఎవరో ముఖద్వారము నుండీ లోపలికి వచ్చి , " ఆచార్యా , అభివాదయే ! " అంటున్నారు . నోటిమాటకు తగ్గట్టుగా అభివాదము కూడా చేసినారు . వారిని  , " ఆయుష్మాన్ భో విధి " అని ఆశీర్వాదము చేయవలెను . అయితే వారి పేరు తెలియదు . కాబట్టి పేరు చెప్పవలసిన చోట ఏదో శక్తి వలన ప్రేరితుడై , తాను ఏమి చేయుచున్నానన్న దానిపై గమనమే లేకుండా , ’ యాజ్ఞవల్క్య విధి ’ అంటాడు . ఇతడు , ’ ఇదేమి నేను ఇలా చేసితిని ’ అనుకొనేలోపలే , ఆ అభివాదకుడు " తమరు చెప్పినది సరిగ్గానే ఉన్నది . అదే నా పేరు కానివ్వండి . నామ రూపములు సత్యము కాదు అని తెలిసినప్పుడు , వ్యవహారమునకు ఏ పేరైతేనేమి ? " అని నవ్వుతాడు . దేవరాతుడికి , ’ ఇతడేనేమో మా కడుపున వచ్చి పుట్టి మా పుత్రుడగువాడు ? ’ అని తోచినది . ఎవరో , ’ అవును , ఇతడే ! మొదట నమస్కారము చేయి . ఆ తేజస్సు చూచినావా ? యజ్ఞేశ్వరుని వలె ప్రకాశిస్తున్నాడు . ’ అంటారు . దేవరాతునికి బుడిలుడు చెప్పినది జ్ఞాపకమునకు వచ్చి , అతనికి మనసా నమస్కరిస్తాడు . ఆగంతకుడు అది తెలుసుకొని , ’ ఎంతైనా నేను మీ కొడుకుని . నాకెందుకు నమస్కారము ? మీ జ్యోతి వలన ప్రయోజనమును పొందుటకు వచ్చినవాడను ’ అంటాడు . దేవరాతుడు , ’ మీరు ఎక్కడి నుండీ వచ్చినారు ? " అని అడగవలె ననుకుంటాడు . మాట నోటి నుండీ వెలువడుట కన్నా ముందే , అతడు దానిని తెలుసుకున్నవాడివలె , ’ నేనే చెప్పవలెనని యుంటిని , మీరే అడిగినది మంచిదే అయినది . ఇకపైన నన్ను ఏకవచనములో యాజ్ఞవల్క్య అనియే సంబోధించండి . తమ బిరుదు ’ యజ్ఞవల్క్య ’ అని ! తమరి పుత్రుడనని నాకు ఆ పేరు కానివ్వండి . నేను తపో లోకమునందు ఉంటిని . అక్కడ ఎవరూ నామ రూపములను అంతగా గౌరవించరు . ఒక దినము , నేను తమ దంపతుల దర్శనము చేసి , గర్భమును చేరితిని కదా , దానికి ముందే దేవతలూ , ఋషులూ , తమరి పితరులూ మా ఆశ్రమమునకు వచ్చి , ’ నువ్వు భూలోకమునకు వెళ్ళి రావలసియున్నది . ’ అన్నారు . ’ నేను అక్కడ ఎన్ని దినములు ఉండవలెను ? ’ అని అడిగితిని . దానికి వారు , ఒక పురుషమానము ఉండవలెను . అక్కడ విశ్వోద్ధారమునకు ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు యొక్క అవతారము కావలసియున్నది . దానికోసమై నువ్వక్కడికి వెళ్ళవలెను ’ అన్నారు . ’ నేను ఇక్కడ ఒక రూపములోనుండి , అక్కడ ఇంకొక రూపముతో ఉండవచ్చు కదా ? ’ అని నేను అడిగితిని . వారు , " కాదు , మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అయిన దేమనగా నీ సంపూర్ణ తేజస్సుతో నువ్వు అక్కడ పుట్టవలెను అని ! అందుకే మేము ముగ్గురమూ వచ్చినాము ." అన్నారు . మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అన్న తర్వాత ,నేను మారు మాట్లాడక ఒప్పుకున్నాను . "  


         దేవరాతునికి ఈ వేళకు అతడి సామీప్యము వలన పరిచయము బలమై మాటలాడుటకు ధైర్యము వచ్చినది . " ఆ దినము ఎందుకో ఆత్రాత్రముగా వచ్చుచుంటిరి ? " అని అడిగినాడు . " అవును , దానికీ కారణము ఉన్నది . మొదట మీరు నన్ను బహు వచనములో సంబోధించుట మానవలెను . నేను , ఆరు నెలలు నిండినాయి , గర్భము పెరిగినది , అనుకొని వచ్చినాను . తపోలోకమున మేము పున్నమి నుండీ పున్నమికి లెక్క వేసుకుంటే , మీరు అమావాశ్య నుండీ అమావాశ్యకు లెక్క వేసెదరు . దానివలన పదునైదు దినములు వెనుక ముందు అయినది . దానివలన మీకేమీ ఇబ్బంది కాలేదు కదా ? నేను అటుల అకాలము నందు వచ్చినందు వలన మీతో మాట్లాడుటకు  మరలా తమరింటిలో సీమంతము జరుగు వరకూ వేచి ఉండవలసి వచ్చినది . ఆ దినము  తమరి పితృ పితామహులు నాతో పాటు వచ్చి నన్ను అనుగ్రహించినారు . ఆదినము ఆ వృద్ధులొకరు మమ్ములను చూచినారు . వారు మీ తండ్రిగారి స్నేహితులని తెలుస్తున్నది . వారుకూడా ’ నీపేరేమి ? ’ అని అడుగవలె ననుకొను లోపల మేము అంతర్థానమైతిమి . మీకది తెలిసియే ఉండవలెను . " 


దేవరాతుడు , " ఔను ,ఔను . " అని తలాడించినాడు . 


        యాజ్ఞవల్క్యుడు కొనసాగించి అన్నాడు , " అప్పటినుండీ మీరు నన్ను చూడవలెనని సంయమము చేయుచుండినదీ నాకు తెలుసు . నేనే వచ్చి మిమ్ములను చూచుట విహితము  కానీ అప్పటికింకా గర్భము నందున్న పిండములో ప్రాణము  సరిగ్గా చేతికి దొరకునట్లే లేదు , అక్కడున్న కరణములూ నాడులూ ఇంకా సమాహితముగా లేనందు వలన , నేనే మీకు ఈ గడచిన పది రోజులుగా అవకాశము ఇవ్వలేదు . అది తప్పయినచో మన్నించవలెను . " 


" ఒక వేళ అలాగ సంయమము చేసినచో యేమయ్యెడిది ? " 


" ఈ పిండము సడలి , పడిపోయెడిది . ఇంకొక గర్భ కాలము వరకూ వేచి ఉండవలసి వచ్చేది . " 


         " మంచిది , ఇంకొక సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు లను లోకానికి ఇవ్వవలెనని జన్మమెత్తుతున్నావు కదా ! అంటే అప్పుడు వేదములు అయిదు అవుతాయా ? " 


        " లేదు , ఎప్పటికీ వేదములు నాలుగే ! బహుశః నేను తేబోయే వేదము ఇప్పటి యజుర్వేదములో చేరిపోయి ఇంకొక పేరుతో వ్యవహరింప బడవచ్చు . బ్రాహ్మణములోనే ఉపనిషత్తు ఉండటము వలన , వాటివలన ఎట్టి బాధా కలుగునట్లు లేదు . " 


" ఇటుల సంహిత , బ్రాహ్మణోపనిషత్తులను కరుణించు నీకు మేము ఎటువంటి శిక్షణను ఇవ్వవలెను ? " 


          యాజ్ఞవల్క్యుడు నవ్వి అన్నాడు , " ఈ జన్మము దేవకార్యార్థమై కలుగుతున్నది . అటులన్ననేమి ? అని మీ సంశయము !  ఈ జగత్తు , కాల -దేశములకు అంకితమై నడుస్తున్నది . కాలము ఎప్పుడునూ పాకము చేయు స్వభావము కలది . దాని పాకము వలన ప్రతియొక్క చేతనమూ తన తేజస్సులోనూ , సామర్థ్యములోనూ క్షీణతను చూడవచ్చును . వీణను శృతి చేసి వదలితే , మ్రోగించినా , మ్రోగించకున్నా శృతి తగ్గుట లేదూ ? అటుల ! అప్పుడు దేవతలు ఆ క్షీణతను తీసివేసి మరలా మొదటివలె చేయుదురు . ఇప్పుడు జగత్తు అటులనే క్షీణతను పొందియున్నది . అది వక్రమగులోపల దానిని సరితూకము చేయు సాధనము నొకదానిని సిద్ధము చేయవలెనని దేవతలు ఆలోచించి , ఆ పనికి నన్ను దర్విగా చేసుకున్నారు . కాబట్టి ఈ జన్మమును , లేదా కర్మ కరణమును సరిగ్గా ఉంచుకొనుట దేవతల పని . అదీగాక , ’ వయమగ్నేర్హి మానుషాః ’ అంటే మేము అగ్నిని నమ్ముకున్నవారము . అయినా మీరు అడిగినందుకు చెప్పెదను , మా కాబోయే తల్లికి మీరు ’ పూర్ణమదః పూర్ణమిదం ’ అను ఒక మంత్రమును నేర్పండి . ఆమె అదొక్క దానినే ప్రసవమగు వరకూ జపము చేస్తూ ఉండనీ , ఆ తర్వాత నన్ను తొట్లలో వేసినపుడు , దానితో పాటు ’ భద్రం కర్ణేభిః ’ మంత్రమును చెప్పితే చాలు . ఆమె మడి , మైల యను ఆలోచనలే లేకుండా , సర్వ కాలము లందూ ఈ మంత్రములను వీలయినంతగా పారాయణము చేస్తూ ఉండనీ . " 


         దేవరాతుడు తన సంశయము గురించి అడుగవచ్చునో లేదో అని మనసులో ఆలోచించాడు . యాజ్ఞవల్క్యుడు దానికి కూడా ఉత్తరము నిచ్చాడు , " తమరు , ’ నా పుత్రుడు బ్రహ్మవాదియై బ్రహ్మను ఎంచుకొని కర్మలను వదలివేస్తే ఏమి గతి ? ’ అని సంశయము పడ నవసరము లేదు . నేను అప్పుడే చెప్పితిని కదా , సంహిత , బ్రాహ్మణములను జగత్తుకు ఇచ్చుటలో కర్మముల నన్నిటినీ అద్దము వలె స్వచ్ఛ పరుస్తాను . ఈ కురు , పాంచాల , కాశీ , మద్ర దేశము లన్నిటిలోనూ తమరి కీర్తి గర్జించునట్లు చేస్తాను . ఆ పిమ్మట ఇంకా అవకాశమున్న , సన్యాసమును తీసుకొనెదను , సమ్మతమే కదా ? " 


         దేవరాతుడికి ఏమి చెప్పుటకూ మాట రాలేదు . కొడుకు చెప్పిన దాంట్లో అతనికి కొంచము కూడా సందేహము రాలేదు . సూర్యుడిని చూసినపుడు అతడు తేజోరాశి యనుదానికి ప్రమాణాంతరము ఏమీ అవసరము లేనట్టే , అతని మాటలలోనే స్వతహాగా ఏదో ప్రమాణమున్నట్లే అనిపించి , అతడిని అది ఒప్పించినది . 


         యాజ్ఞ వల్క్యుడు లేచి , ’ నేను వెళ్ళి వచ్చెదను , కాలాతీతమగుతున్నది . నేను చెప్పినది నిజము అనుటకు సాక్షిగా కార్తీక శుక్ల సప్తమి దినము నా జననమగును . అప్పుడు తప్పకుండా మేధా జననమును చేయండి . మిగిలినదంతా శాస్త్ర ప్రకారము జరగనివ్వండి . " అని చెప్పి అభివాదనము చేసినాడు . దేవరాతుడు కూడా వేదోక్తముగా కొడుకుకు ఆశీర్వాదము చేస్తుండగా , మంత్రము ముగిసే దానికన్నా ముందుగనే మెలకువ అయినది . మెలకువ అయినా కూడా మంత్రము తానే పలుకుతూ పూర్తి అయినది . 


        ఆలంబినీ దేవి కూడా ఆ మంత్ర శ్రవణము చేత మేలుకొని , ’ ఇదేమి ? పడక పై పరుండియే మంత్రమును చెప్పుతున్నారు , బాగున్నది వరస ! ’ అంది . 


        దేవరాతుడు నవ్వుతూ , " అంతా నీ పుత్రుని ప్రభావము ! " అని కల గురించి చెప్పినాడు . ఆమె , ’ అదేమిటి , కల అంటారు ? మీరు ఎవరితోనో మాట్లాడుచుండుట నాకు అర్థమయింది . అదంతా నేను కూడా విన్నాను కదా ? " అని ఆశ్చర్యపోయింది . 


          దేవరాతుడు , ’ నువ్వే ముఖ్యముగా ధన్యురాలవు . కృతార్థురాలవు . నీ పుణ్యము వలన ఈ ఇంటిలో ఇంకా ఏమేమో విచిత్రములు , నమ్మశక్యము గానివి , జరుగుతాయి . నిన్ను చేపట్టి నేను కూడా ధన్యుడనైనాను  అను కాలము వచ్చినది " అని విచిత్రమైన తృప్తి ధ్వనించు పలుకు పలికాడు . 


       ఆలంబిని , ’ ఆ ? ఇదేమి చమత్కారము ? మీ చేయి పట్టి మీవంటి విద్వాంసుల ఇల్లు చేరి నేను కృతార్థురాల నైనానని రాత్రింబవళ్ళూ అనుకుంటున్నాను . " అంది .


         దేవరాతుడు భార్యపై విశ్వాసముతో ఆమెను ఆలింగనము చేసుకొని ,"  బీజము ఎంత మంచిదైతేనేమి ? దానికి తగ్గట్టు సంపన్నమైన క్షేత్రము కూడా కావలెను ." అని చుంబించాడు . ఆమె కూడా భర్త యొక్క ఆ స్తుతినీ , మోహన కార్యమునూ వద్దనకుండా విశ్వాసముతో  స్వీకరించినది .

పో త న కవి తా వై భ వం

 


పో త న కవి తా వై భ వం!!


*రచన:-శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు:--*


ఎండిన మ్రోడులే కిసలయించెనొ! యేకశిలాపురమ్ములో

బండలు పుల్కరించెనొ ! అపార ముదమ్మున తెల్గుతల్లికిన్‌

గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ ! 

పచ్చి పైరులే

పండెనొ ! 

జాలువారిన భవత్‌ కవితామృత భక్తిచారలన్‌ !


 భీష్మునిపైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి

కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు

ముడివీడి మూపు పై పడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి

వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు

కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు


ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి

 రయ్య ! యే రాత్రి కలగంటివయ్య ! రంగు

కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు !!

సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !!


ముద్దులుగార- భాగవతమున్‌ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము 

మహా కవి శేఖర ! మధ్య మధ్య నట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీచిన, తాటియాకులో

పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

     -జంధ్యాలపాపయ్య శాస్త్రిగారు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అష్ట దిక్కుల గాలులు

అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


 

         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బాధ్యతగా ఆలోచించండి.

 ..

నా పేరు శ్రీకాంత్ శర్మ. 

ప్రతి సంవత్సరం వినాయకచవితి ముందు నేను పొందే ఆవేదన మీ ముందు పెడుతున్నాను.

ఓపిగ్గా చదవండి... బాధ్యతగా ఆలోచించండి.


* ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ⁉️ 


* ఏసుక్రీస్తు ముందు సినిమా హీరోల ఐటం సాంగ్స్ కు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా ⁉️


* మరి జైన మతస్థులు, సిక్కులు, బౌద్ధులు తమ దేవుడి ముందు బూతు పాటలు పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ⁉️


* చూడలేదు కదూ !!! 


ఈ మతాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ మతాన్ని తమ ధర్మాన్ని గౌరవిస్తాయి. ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. 


మరి లాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి మరీ ఈ అసభ్య అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ⁉️


ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు ❓ లేక మనమే అలా చేస్తున్నామా ⁉️


డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి, ..... కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాము. 

ఎందుకు ❓❓❓


మన పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి. అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది. 


ఇతర మతస్తులు మనలా తమ మతపరమైన కార్యక్రమంలో ఎలాంటి వికృత చేష్టలు చేయరు.


ఏ ఏడాదిలో హిట్ సినిమా ఉంటే ఆ ఏడాది ఆ హీరో నమూనా తాలూకు వినాయక విగ్రహం పెడుతున్నారు. 

పోయిన ఏడాది క్రితంవరకు, బాహుబలి, గబ్బర్ సింగ్, పుష్ప వినాయకులను చూసాము. ఈ ఏడాది అంతకుమించి వికృత రూపాల వినాయకులు మండపాలలో దర్శనమిస్తే ❓❓


ఎటు పోతుంది సమాజం ❓ 

ఎటుపోతుంది మన సనాతన ధర్మం ❓ 


ఈ విష సంస్కృతి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మండపాలలో సాంప్రదాయ పురాణ గణపతి కనబడుతారా ❓


ఓ సినిమా హీరోల్లారా ? దర్శక నిర్మతాలరా ? మీకు బాధ్యత లేదా ? మీ అభిమానులను ఇలాంటి వికృత చేష్టలను చేయకుండా ఆపడానికి ❓ 

సినిమా ఈవెంట్లలో అభిమానులను ఉద్దేశించి ఇది తప్పని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ❓ 


ఓ ప్రవచన కర్తలరా ? 

ఓ పీఠాధిపతులారా ? 

ఓ సాదు పుంగవులారా ? 

ఓ రాజకీయ నాయకులారా ? 

ఓ మీడియా ప్రతినిధులారా ? 

ఈ పండుగ సమయాల్లో మీరంతా ఏమైపోతారు ? 

ఎందుకు మీ కంటికి ఇవి దారుణాలుగా కనిపించవు ? 

మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి.


మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి. 


మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే . 


చాలా జాగ్రత్తగా గమనించండి....ఒక మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు .


కనీసం ఇప్పటి నుంచైనా, గణేశోత్సవం, నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. మన సంస్కృతిని కాపాడుకుందాం. ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం.


 DJ లకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం. 


దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కతిని కాపాడే బాధ్యత మననుండే మొదలవ్వాలి.


                               ఇట్లు

               మద్దికుంట శ్రీకాంత్ శర్మ, భాగ్యనగరం. 

                హిందూ ధర్మచక్రం సేవా సమితి 

                             9849485645

https://whatsapp.com/channel/0029VaADSeK9mrGUJvH8io1o

https://www.youtube.com/hindudharmachakram

https://www.facebook.com/hindudharmachakramHDC/

https://twitter.com/HDC108

Whatsapp - 9849485645

సూక్ష్మం లో మోక్షం.*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *సూక్ష్మం లో మోక్షం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే.. మీకు  పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అని అర్ధం.*


*భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి.*


*ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత , ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.*


*నీవు అన్నం పెట్టడం కన్నా.. వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని..చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు.*


*ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది.. నీవు పిలవ కుండానే।వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును.*


*పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి,  నీ ఇంటికి వచ్చాడు. కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం.*


*ఏమో ఏ శంకరాచార్యులు మారురూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు  అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలగిపోతుంది.*


*మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలగించడానికి.  నీ పాప కర్మ తొలగించడానికి.. వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు.*


*నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకొన్నావా మరలా తిరిగి రాదు.*


*ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో.*


*జాగ్రత్త. అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి  లేదనకుండా వున్నది పెట్టండి, మీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి.*


*కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి*


*ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.*


*ఓం నమో నారాయణాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

రోజు (04-09-2024) రాశి ఫలితాలు

 ఈ రోజు (04-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

  04-09-2024 

వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి.  


వృషభం

  04-09-2024 

 ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. 


మిధునం

  04-09-2024 

ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.


కర్కాటకం

  04-09-2024 

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి . 


సింహం

  04-09-2024 

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.


కన్య

  04-09-2024 

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.


తుల

  04-09-2024 

అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.


వృశ్చికం

  04-09-2024 

కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.


ధనస్సు

  04-09-2024 

ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.


మకరం

  04-09-2024 

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.


కుంభం

  04-09-2024 

చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.


మీనం

  04-09-2024 

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

*శ్రీ మూకాంబికా క్షేత్రం*

 🕉 *మన గుడి : నెం 429*






⚜ *కర్నాటక  : కొల్లూరు _ ఉడిపి* 


⚜ *శ్రీ మూకాంబికా క్షేత్రం*



💠 శ్రీ మూకాంబిక ఆలయం భారతదేశంలోని ఆది శక్తిని ఆరాధించే అత్యంత పురాణ ఆలయాలలో ఒకటి మరియు  మహాలక్ష్మి, పార్వతి మరియు సరస్వతి యొక్క స్వరూపంగా నమ్ముతారు. 


💠 ఈ ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో ఉంది.  ఇది సౌపర్ణికా నది ఒడ్డున ఉంది.


💠 పరశురాముని సృష్టిలో 7 ముక్తి క్షేత్రాలలో కొల్లూరు ఒకటి. 

మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గోకర్ణ క్షేత్రాలు


💠 కేరళ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభువు లింగంతో కలిసి ముగ్గురమ్మల స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది. 

ఇక్కడ అలంకరణలూ పూజలూ అమ్మవారికి జరిపితే అభిషేకాలను మాత్రం లింగానికి చేస్తారు. 


🔆 *స్థలపురాణం* 🔆


💠 శివుని వరం పొందిన కామాసురుడు 

కూడచాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించేవాడు. 

శుక్రాచార్యుడు వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.


💠 కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది.


💠 మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరుకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని మూకాసురుడు అన్నారు. 

అప్పుడు కోల ఋషి ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిని సృష్టించింది.


💠 ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది.

మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని మారణ కట్టే అంటారు(మరణ గద్దె ). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర విలసిల్లమని కోరుకొన్నాడు.


💠 మూకాసురుడి.. సంహారం తరువాత పార్వతీదేవి అక్కడ మూకాంబికగా వెలసిందనీ, కోల మహర్షి కోరిక మేరకు త్రిమూర్తులు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారని ప్రతీతి. పార్వతిదేని కొలువైన ఈ క్షేత్రంలో శివుడు తన కాలి బొటనవేలితో శ్రీచక్రాన్ని గీశారని చెబుతారు


💠 ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.


💠 కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట.

ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. 

దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని,

అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.


💠 ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట.

అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట.


💠 అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి.

మూకాంబిక ఆలయంలోని పవిత్ర విగ్రహం పంచలోహాలతో అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం అనే ఐదు లోహాల కలయికతో రూపొందించబడింది.


💠 శ్రీ ఆదిశంకరాచార్యులు లింగం పైన మూకాంబిక విగ్రహాన్ని ప్రతిష్టించి, వారిద్దరినీ పూజించారు.  

చివరికి, ఈ విగ్రహం మరియు జ్యోతిర్లింగం చుట్టూ ప్రస్తుత ఆలయం నిర్మించబడింది.  

శ్రీ శంకరాచార్యులు మూకాంబిక ఆలయంలో "సౌందర్య లహరి" కీర్తనలను రచించారని చెబుతారు.


🔆 *ఆలయ వైశిష్ట్యం* 🔆


💠 శ్రీ కృష్ణుడు రుక్మిణి, సత్యభామ సమేతంగా కొల్లూరు మూకాంబిక ఆలయంలో సాంబవ్రతం ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.  ఇంద్రుడు, సురతుడు, కశ్యపుడు, భార్గవరాముడు, శుక్రాచార్యుడు, ఋషి బ్రహస్పతి ప్రద్యుమ్నుడు, లోకాదిత్య బ్రాహ్మణుడు, సమాధి వైశ్యుడు వంటి ప్రముఖ పురాణ పాత్రలు మూకాంబిక ఆలయంలో తపస్సు చేసి దైవత్వాన్ని పొందారు.


💠 ఈ ఆలయంలో జరుపుకునే అనేక ముఖ్యమైన ఆచారాలలో, నవరాత్రి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు  బ్రహ్మోత్సవాలు.

 రెండూ గొప్ప వైభవంగా జరుపుకుంటారు.  

🪷నవరాత్రులతోపాటూ, ఏడాదికోసారి అమ్మవారికి చైత్రమాసంలో రధోత్సవాన్ని నిర్వహిస్తారు. 

సౌపర్ణికా నదిలో 84 ఔషధ గుణాలున్నాయనీ, నీటిని తాగితే అనారోగ్యాలు దూరమవుతాయనీ ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం


💠 ప్రతి రోజు ఉదయం 5.00 గంటలకు "నిర్మల్య పూజ" జరుగుతుంది మరియు ఆ సమయంలో భక్తులకు స్వయంభూ లింగాన్ని దర్శించే అవకాశం ఉంటుంది.  

ఆలయంలో ప్రతిరోజూ త్రికాల పూజలు నిర్వహిస్తారు.  


💠 ప్రతి మంగళ, శుక్రవారాలు మరియు శ్రావణ మాసంలో లేదా ఫాల్గుణ మాసాల్లోని మూలా నక్షత్రం రోజున (ఇది శ్రీ దేవి జన్మదినం) వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు శ్రీ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. 


💠మంగళూరుకి  140 కి.మీ ,ఉడిపి 80 కి.మీ దూరం.