🕉 *మన గుడి : నెం 429*
⚜ *కర్నాటక : కొల్లూరు _ ఉడిపి*
⚜ *శ్రీ మూకాంబికా క్షేత్రం*
💠 శ్రీ మూకాంబిక ఆలయం భారతదేశంలోని ఆది శక్తిని ఆరాధించే అత్యంత పురాణ ఆలయాలలో ఒకటి మరియు మహాలక్ష్మి, పార్వతి మరియు సరస్వతి యొక్క స్వరూపంగా నమ్ముతారు.
💠 ఈ ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో ఉంది. ఇది సౌపర్ణికా నది ఒడ్డున ఉంది.
💠 పరశురాముని సృష్టిలో 7 ముక్తి క్షేత్రాలలో కొల్లూరు ఒకటి.
మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గోకర్ణ క్షేత్రాలు
💠 కేరళ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభువు లింగంతో కలిసి ముగ్గురమ్మల స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది.
ఇక్కడ అలంకరణలూ పూజలూ అమ్మవారికి జరిపితే అభిషేకాలను మాత్రం లింగానికి చేస్తారు.
🔆 *స్థలపురాణం* 🔆
💠 శివుని వరం పొందిన కామాసురుడు
కూడచాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించేవాడు.
శుక్రాచార్యుడు వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
💠 కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది.
💠 మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరుకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని మూకాసురుడు అన్నారు.
అప్పుడు కోల ఋషి ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిని సృష్టించింది.
💠 ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది.
మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని మారణ కట్టే అంటారు(మరణ గద్దె ). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర విలసిల్లమని కోరుకొన్నాడు.
💠 మూకాసురుడి.. సంహారం తరువాత పార్వతీదేవి అక్కడ మూకాంబికగా వెలసిందనీ, కోల మహర్షి కోరిక మేరకు త్రిమూర్తులు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారని ప్రతీతి. పార్వతిదేని కొలువైన ఈ క్షేత్రంలో శివుడు తన కాలి బొటనవేలితో శ్రీచక్రాన్ని గీశారని చెబుతారు
💠 ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.
💠 కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట.
ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట.
దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని,
అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.
💠 ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట.
అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట.
💠 అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి.
మూకాంబిక ఆలయంలోని పవిత్ర విగ్రహం పంచలోహాలతో అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం అనే ఐదు లోహాల కలయికతో రూపొందించబడింది.
💠 శ్రీ ఆదిశంకరాచార్యులు లింగం పైన మూకాంబిక విగ్రహాన్ని ప్రతిష్టించి, వారిద్దరినీ పూజించారు.
చివరికి, ఈ విగ్రహం మరియు జ్యోతిర్లింగం చుట్టూ ప్రస్తుత ఆలయం నిర్మించబడింది.
శ్రీ శంకరాచార్యులు మూకాంబిక ఆలయంలో "సౌందర్య లహరి" కీర్తనలను రచించారని చెబుతారు.
🔆 *ఆలయ వైశిష్ట్యం* 🔆
💠 శ్రీ కృష్ణుడు రుక్మిణి, సత్యభామ సమేతంగా కొల్లూరు మూకాంబిక ఆలయంలో సాంబవ్రతం ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు, సురతుడు, కశ్యపుడు, భార్గవరాముడు, శుక్రాచార్యుడు, ఋషి బ్రహస్పతి ప్రద్యుమ్నుడు, లోకాదిత్య బ్రాహ్మణుడు, సమాధి వైశ్యుడు వంటి ప్రముఖ పురాణ పాత్రలు మూకాంబిక ఆలయంలో తపస్సు చేసి దైవత్వాన్ని పొందారు.
💠 ఈ ఆలయంలో జరుపుకునే అనేక ముఖ్యమైన ఆచారాలలో, నవరాత్రి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు బ్రహ్మోత్సవాలు.
రెండూ గొప్ప వైభవంగా జరుపుకుంటారు.
🪷నవరాత్రులతోపాటూ, ఏడాదికోసారి అమ్మవారికి చైత్రమాసంలో రధోత్సవాన్ని నిర్వహిస్తారు.
సౌపర్ణికా నదిలో 84 ఔషధ గుణాలున్నాయనీ, నీటిని తాగితే అనారోగ్యాలు దూరమవుతాయనీ ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం
💠 ప్రతి రోజు ఉదయం 5.00 గంటలకు "నిర్మల్య పూజ" జరుగుతుంది మరియు ఆ సమయంలో భక్తులకు స్వయంభూ లింగాన్ని దర్శించే అవకాశం ఉంటుంది.
ఆలయంలో ప్రతిరోజూ త్రికాల పూజలు నిర్వహిస్తారు.
💠 ప్రతి మంగళ, శుక్రవారాలు మరియు శ్రావణ మాసంలో లేదా ఫాల్గుణ మాసాల్లోని మూలా నక్షత్రం రోజున (ఇది శ్రీ దేవి జన్మదినం) వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు శ్రీ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.
💠మంగళూరుకి 140 కి.మీ ,ఉడిపి 80 కి.మీ దూరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి