28, మార్చి 2020, శనివారం

కష్టాలు కలకాలం ఉండవ్. 


మనం సనాతన హిందూ ధర్మం నమ్మే వాళ్ళం. మనం చిన్నప్పటినుండి పెరిగిన వాతావరణం, మన ఆచార వ్యవహారాలు మనకు ఆశా వాదం మన అణువణువునా నెలకొలిపి వున్నది. ప్రతి కర్మ అంటే మనం చేసే పని ఒక శ్రద్ధతో, నియంత్రణతో, బాధ్యతతో, సర్వ లోక శ్రేయస్సు కోరి చేయటం మన సంప్రదాయం.  ఎప్పుడు ఈ కరొనకు నియంత్రణకు ఆచరించమంటున్న ప్రతి విషయం మన సంప్రదాయం, సంస్కారంకు ప్రతిరూపంగా వున్నాయ్. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమంటే మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఈ కరోనాకు భయపడ వలసిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఆచరించాల్సిన సమయం వచ్చింది. 
ధర్మో రక్షతి రక్షితః  ధర్మాన్ని ఎవరు కాపాడుతారో వారిని ధర్మం కాపాడుతుంది అని అర్ధం. ఏ మానవుడు స్థిర చిత్తుడై ధర్మ బద్ధుడై జీవిస్తాడో వానిని ఆ ధర్మం అంటి పెట్టుకొని ఉంటుంది. ధర్మంలో మొదటి పాదం సైచం  అంటే శుచిగా ఉండటం.  అది వేరై ఏదో కాదు ఇప్పుడు మనం పాటించాలని సూచించే నియమాలు . అందరం శుచిగా ఉందాం ఈ కరోనని పరద్రోలుదాం.  ధర్మాన్ని నిలపెడుదాం. సర్వ మానవ శ్రేయస్సుకి ప్రార్ధిద్దాం. 
ఓం శాంతి శాంతి శాంతిహి.