4, మార్చి 2022, శుక్రవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 42

 ప్రశ్న పత్రం సంఖ్య: 42 

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) కార్బురేటర్ అన్నది  ఇందులో ఉంటుంది

i ) రైలు ఇంజనులో

 ii ) మోటారుసైకిలు లో   

iii ) సైకిలుతో 

 iv ) రేడియోలో 

2) పిడుగు అనునది ఒక

i ) విదుత్ఘాతం 

ii ) అధిక వాయు పీడనం

 iii ) అధిక వర్షకారణం

 iv ) భూమినుంచి ఉద్భవించేది 

3) భగవత్గీతలో మొదటి శ్లోకం ఎవరు చెప్పారు

i ) శ్రీ కృష్ణుడు 

ii ) అర్జనుడు 

iii ) దృతరాష్ట్రుడు

 iv ) సంజయుడు

4) రామాయణంలో రాయబారిగా ఈయనవున్నాడు 

i ) సుగ్రీవుడు

 ii ) అంగదుడు 

iii ) హనుమంతుడు 

iv ) లక్ష్మణుడు 

5) సంస్కృత భాషలో తెలుగు భాషలో లేని ఇది వున్నది

i ) ఏకవచనం 

ii ) ద్వివచనం  

iii ) బహువచనం

 iv )అన్య వచనం 

 6) ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి ____

i ) నదీం

 ii ) ఘటం

 iii ) సాగరం

 |iv ) జల మార్గ . 

7) మనదేశంలో కారు నడిపే వారు అమెరికాలో

i)అదేవిధంగా నడపగలరు 

 ii ) అక్కడి ట్రాఫిక్ సిస్టం వేరు కాబట్టి తెలుకుకొని నడపాలి 

 iii ) ప్రపంచం మొత్తంలో ట్రాఫిక్ పద్దతి ఒకే విధంగా ఉంటుంది

 iv ) అక్కడి కార్లకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది.

8) మొట్టమొదటి సంస్కృత కవి ఎవరు .

i ) కాళిదాసు

 ii ) పోతన 

iii ) వాల్మీకి

 iv ) వ్యాసుడు

9)గాలిపటం(Kite) పైకి ఎగరటానికి కారణం 

i ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం కన్నా క్రింది భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,  

 ii ) గాలి పటం క్రింది భాగం మీద గాలి పీడనం కన్నా ఫై భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి.

.iii ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం క్రింది భాగం మీద పీడనం సమానంగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,

iv ) గాలిపీడనంకు  గాలిపటానికి సంబంధం లేదు కాబట్టి 

10) ఆంధ్రప్రేదేశ్ లో సాగర తీరంలో వున్నపట్టణం

i ) విజయవాడ 

 ii ) బందర్  

iii ) గుంటూరు 

 iv ) అమరావతి 

11)ఇది ఒక ఉత్తర  భారతదేశక్షేత్రం

i ) తిరుమల

 ii ) సింహాచలం

 iii ) కాశి

 iv ) కన్యాకుమారి

 12) ప్రపంచంలో అతిపెద్ద పర్వతం ఏది

i ) తిరుమ పర్వతం

 ii ) పడమటి కనుమలు

 iii ) కనుమలు   

iv )ఎవరెస్టు

13) ఈ వివాహం ఇప్పుడు అమలులో లేదు  

i ) రిజిస్టరు వివాహం ii ) ప్రేమ వివాహం iii )రాక్షస వివాహం iv ) బ్రహ్మ వివాహం  

14) క్రింద వున్న లోకాలలో ఈ లోకం లేదు  

i ) అతలం 

 ii ) సులత   

 iii ) తలాతల  

iv ) తపోలోకం 

15) అష్టైశ్వర్యాలలో ఇది వున్నది

i ) గరిమ  

ii ) గృహము 

 iii ) తాంబూలము 

iv ) సంతానము

16) యత్ర నార్యస్తు పూజ్యంతె  

i ) రమంతె తత్ర మనుష్య

ii ) రమంతె తత్ర దేవతాః    

 iii ) రమంతె యత్ర దేవతాః 

iv )రమంతె తత్ర దానవ 

17) భగవత్గీత కన్నా ముందు ఈ గీత వుంది 

i ) అష్టావక్ర గీత

ii ) రాఘవ గీత  

 iii ) విశ్వామిత్ర గీత 

iv ) ఏ గీత లేదు 

18) కృష్ణ పక్షంలో మరియు శుక్ల  పక్షంలో చంద్రుకు ఈ తిధినాడు ఒకే పరిమాణంలో ఉంటాడు

i ) నవమి 

ii ) సప్తమి

iii ) ఏకాదశి 

 iv ) తదియ 

19) పిండి కొద్దీ

i ) దోశ 

 ii ) రొట్టె 

 iii ) గారే 

iv )   పూరి 

20)  సుమతి శతకము వ్రాసిన కవి ఎవరు

i ) వేమన 

ii ) శ్రీనాధుడు 

iii ) బద్దెన 

iv ) పెద్దన

శ్రీశనగన నరసింహస్వామి గారు

 భీమవరం

------------

శ్రీశనగన నరసింహస్వామి గారు

----------- ----------------------------

చైత్రవంద్యాదికృతుల నీక్ష్మాతలాన

సత్కవిగ,లయోలనుకళాశాలవెలుగు

శనగనస్వామివర్యులజనియు విద్య

సాగె భీమవరంబున మ్రోగెజగతి.


భువనవిజయాదులన్ పాత్రపోషణమును

సాహితీసౌరభమున ప్రజానురక్తి

బలు సమస్యాదినిర్వహణలనుపెంచి

పత్రికల, నృసింహస్వామి,వంద్యులయిరి.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

చల్లనినీళ్ళును

తెప్పోత్సవము (వ్యాకరణవిరోధమై,మాప్రాంత జన వ్యవహారంలోఉన్న పదం)

--------------------  ------------------------

చల్లనినీళ్ళును సౌఖ్యపు గాలులు

      లాహిరి లాహిరి లాలసనిడ ,

మంచిసుగంధపు మల్లెలమాలలు

      మారుని సేవల మనసునిడ,

తాపముపెంచెడు దీపపు కోటులు

      విడివడిమసలని ప్రేమమునిడ ,

పారవశ్యముగొల్పుబాణసంచాకాల్పు

      సోత్సహచైతన్య శోభలనిడ,


పార్వతీ పరమేశ్వరుల్ పర్వమమర

తెప్పలను నుత్సవంబుగ తిరుగబూన

త్రిదినముమహోత్సవమ్మది త్రిదివమట్లు

జరిగె శివరాత్రి మూన్నాళ్ళుశివముగాగ.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .

స్ఫూర్తిగా విరాజిల్లే

 సకల జీవుల నిత్య సత్య చైతన్య స్ఫూర్తిగా విరాజిల్లే ప్రకృతి మహోన్నతం ! ప్రాతఃకాల కుక్కుట నాద స్వరంలో చరాచర జీవజగతికి సన్మత్రీ మేల్కొల్పు ! సువిశాల విశ్వ నిత్య జీవన గమనంలో నిరంతర తోడ్పాటు ! చక్కని రమణీయ, కమనీయ ఆలంబనతో తరతరాల సుహృద్భావ దృక్పథ దార్శనికత ! విశ్వ మానవాళికి మనోంతరంగ పరిశుద్ధికై అనునిత్యం, ప్రకృతి చేసెడి హెచ్చరిక వర్ణనాతీతం ! విశ్వ జగతి సుసంక్షేమమే మహత్తర ఆలంబనగా మున్ముందుకు సాగే సమైక్య దృక్పథ నేపథ్యం ! చక్కని జీవకారుణ్య ప్రేరణాత్మక భావుకత ఉట్టిపడే చరాచర జీవజగతికి సమున్నత వేదిక ! ప్రకృతి పరిరక్షణకై విశ్వ మానవాళి నిత్య నడవడికలో సుహృద్భావ జీవన దివ్య పథ నిర్దేశన స్ఫూర్తి ! పరిసరాల పరిశుభ్రతే అత్యంత ప్రధానాంశంగా, యావత్ విశ్వ సువికాస సంక్షేమ జీవన గమన చైతన్య దార్శనికత !                    ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

విషయం యొక్క తీవ్రత

 నిదానంగా చదివి, విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి. 


  ఒక "ముస్లిం" వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, అతని మరణానంతరం షరియా ప్రకారం 4 మంది భార్యలను కలిగి ఉంటే, అతనికి పెన్షన్ ఎలా మంజూరు చేయబడుతుంది? ఈ నిబంధనను ఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది?

  సమాధానం: -

  నామినేషన్లు ఎవరికి ఎంత శాతం అనే అంశాలను పరిశీలిస్తారు. నమోదు కాకపోతే, నలుగురిలో 25% పంపిణీ చేయబడుతుంది.

  భార్యలలో ఒకరు చనిపోతే, మిగిలిన ముగ్గురు 33.33% చెల్లించాలి.

  రెండవ భార్య చనిపోతే, మిగిలిన ఇద్దరికి 50%.

  మూడవ భార్య చనిపోతే, రెండో భార్య 100% పెన్షన్ పొందుతుంది.

  ఇప్పుడు దీనిని మొదటి భార్యకు వయస్సు 60 సంవత్సరాలు, రెండవ ఆమె కు 50 సంవత్సరాలు, మూడవ ఆమెకు 40 సంవత్సరాలు మరియు నాల్గవ ఆమెకు 30క సంవత్సరాలు వయస్సు అయితే వీరికి 70 వ సంవత్సర వయస్సు వరకు పెన్షన్ ఇచ్చే సంవత్సరాలుగా భావించండి - అప్పుడు 

  10 + 20 + 30 + 40 = 100 సంవత్సరాలు. అంటే ముస్లిం పురుషుడు ప్రభుత్వం నుండి 100 సంవత్సరాల వరకు పెన్షన్ పొందుతాడు, ఇతర మతానికి చెందిన భార్యకు(ఒకే భార్య ఉంటుంది కాబట్టి) గరిష్టంగా 10 లేదా 20 సంవత్సరాలు మాత్రమే!!

అంటే పదవీ విరమణకు ముందు జీవితాంతం ఉచిత పింఛను పొందేందుకు నాల్గవ భార్య ముస్లిం పెద్దలను పెళ్లాడుతోంది.

  ఇప్పుడు ముస్లిం లు షరియత్‌ను అడ్డం పెట్టుకుని  55 ఏళ్ల తర్వాత ఎంత మంది ముస్లింలు పెళ్లి చేసుకున్నారనేది సర్వే చేయాల్సిన అవసరం ఉందా? లేదా ? 

  ఈ శాతం ఎక్కువైతే ముస్లిం మహిళలకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు సమకూర్చడం పెద్ద విషయం కాదా?

మనకు "కామన్ సివిల్ కోడ్" ఎందుకు ఉండకూడదు? హిందువులు ఏం అన్యాయం చేశారు ?

                    ----------

జీవితంలో



        జీవితంలో ఎప్పుడూ అనుకోని *సమస్యలే* ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా *ఎదుర్కోవాలో* తెలుసుకోవడమే *జీవితం* దీనిలో *గెలువడాలు ఓడిపోవడాలు* ఉండవు *పాఠాలు* అనుభవాలు మాత్రమే ఉంటాయి , మనం *అవసరం* లేని వారి గురించి ఆలోచించి *ప్రయోజనం* లేదు వాళ్ళు *బంధువులైనా* సరే మన *విలువ* తెలియని వాళ్ళతో ఏం *మాట్లాడినా* వాళ్ళకు ఏం చేసినా మన *విలువ* తెలియదు .


        ముఖం పై *చేదుగా* మాట్లాడే వారు ఎప్పుడు *మోసం* చేయరు భయపడవలసింది *తియ్యగా* మాట్లాడే వారితోనే *మనసులౌ అసూయ* పెంచుకుంటారు *సమయం* వచ్చినప్పుడు మారిపోతారు *అద్దం* బలహీన మైనదే కానీ *నిజాన్ని* చూపడంలో ఎప్పుడూ *భయపడదు* విజయానికి కొన్ని సార్లు *శక్తి* కావాలి మరికొన్ని సార్లు *యుక్తి* ఉండాలి ఇంకొన్ని సార్లు *రెండు* వాడాలి *కానీ* చాలా సార్లు ఈ రెండిటికీ *అదృష్టం* తోడు కావాలి .


     జీవితంలో ఎదురు *దెబ్బలు* తగలడం మంచిదేనేమో *కాలికి* దెబ్బ తగిలితే *వెళ్లేదారిలో* ఎలా *నడవాలో* తెలుస్తుంది అదే *మనసుకు* తగలితే ఎటువంటి వారితో *ఎలా* ఉండాలో నేర్పిస్తుంది . జీవితంలో *డబ్బు* ఉంటేనే *బంధువులు ప్రేమ నమ్మకం* వస్తాయి డబ్బు లేకుంటే మన *సొంత* వారు కూడా *పరాయి* వారు అవుతారు *డబ్బుంటేనే* పరాయి వారు కూడా మన వారు అవుతారు *ఇది పచ్చి నిజం !*. 

        

       *మీ ... ప్రొద్దుటూరి. రవిందర్*

దేవుడి ప్రణాళిక

 Excellent msg I received in this year.

Must read 


దేవుడు 

v's

వీధులు ఊడ్చేవాడు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


  వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.  

దేవుడితో మొరపెట్టుకున్నాడు.

 "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.

 నా బతుకు చూడు. 

ఎంత కష్టమో.

 ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా," 

అని సవాలు విసిరాడు. 

 దేవుడు వినీ వినీ సరేనన్నాడు.  

"అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. 

నోరు మెదపకూడదు."

 అన్నాడు దేవుడు. 

"సరే" అన్నాడు మనోడు. 

 తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. 

 కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. 

"దేవా ... నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" 

అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. 

ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. 

అతను చూడకుండా వెళ్లిపోయాడు. 

 మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.

 కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.

 ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.

 "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" 

అంటూ మోకరిల్లాడు.

 కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.

 "ఇలా దయ చూపించావా తండ్రీ" 

అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.  

"ఒరేయ్ దొంగా.... " 

అని అరుద్దామనుకున్నాడు మనోడు. 

కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. 

ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. 

 "దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" 

అన్నాడు.  

అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. 

"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.

 పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

 ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.

 "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." 

అని అరిచేశాడు. 

దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.

 సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. 

దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.  

"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... 

నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.

 ఒక దోషిని అరెస్టు చేయించాను." 

అన్నాడు మనోడు. 

దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు." 

అన్నాడు నిష్ఠూరంగా.

 "అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను."

 అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా....

 "ధనవంతుడు మహాపాపాత్ముడు. 

వాడు అందరినీ దోచుకుంటాడు. 

వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. 

పేదోడికి కష్టాలు తీరేవి. 

వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. 

దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. 

వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.

 ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు...

 అన్నాడు దేవుడు. 


 దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. 

కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. 

తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు. 

ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

యోగి కళ్ళలో నీళ్ళు

 నిన్న ఇండియా టీవీ ప్రోగ్రామ్ లో యోగి కళ్ళలో నీళ్ళు రావడమే కాదు చెల్లి పేదరికం చూసి ఒళ్ళు మరచి ఏడ్చాయి . అధికారంలో ఉన్న మిగిలిన నాయకులు తమ కుటుంబాలను కోట్లకు అధిపతులుగా చేసినప్పుడు మీ సోదరి ఇంకా ఎందుకు పేదరిక జీవితం గడుపుతోంది అని రజత్ శర్మ యోగిజీని అడిగినప్పుడు . యోగి సోదరి పని చేస్తున్న పోటో చూపించారు . స్టేజి మీద అక్క పేదరికం ఫోటో చూసి అయిన యోగి . కొన్ని క్షణాలు యోగి ఏడుస్తునే వున్నాడు . కానీ తనను తాను హ్యాండిల్ చేసుకుంటూ నేను యోగిని 25 కోట్ల మంది ఉత్తర ప్రదేశ్ ప్రజల తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసానని... తన కుటుంబం గురించి ప్రమాణం చేయలేదు . ఇలా అంటుంటే యోగికి తన చెల్లి అంటే తనకు ప్రాణం , కానీ కుటుంబ పేదరికం చూసి ఏడ్చిన యోగి , ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే యోగి చేసిన ప్రమాణస్వీకారం , నిస్వార్థ కార్య యోగం . ఒక పక్క అఖిలేష్ కుటుంబవాది మరో పక్క యోగి లాంటి నిస్వార్థ కార్మికుడు ఇద్దరిని ఎలా పోల్చగలం . UP కి నిస్వార్థ , కరుడుగట్టిన ధర్మవీరుడు యోగి లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా అదృష్టం 🙏🙏

మహా అవతార్ బాబాజి

 మహా అవతార్ బాబాజి


అది 30 నవంబరు 203.వ సంవత్సరం, రోహిణి నక్షత్రం - ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి మగ శిశువు జన్మించి నాడు. తల్లిదండ్రులు ఇతనికి నాగరాజు అని పేరు పెట్టినారు. ఇతనికి ఒక చెల్లెలుకుడా జన్మించినది ఆమెకు నాగలక్ష్మి అని పేరు పెట్టారు. 


నాగరాజునకు ఐదు సంవత్సరాల వయసులో ఆ దేవాలయంలో పెద్ద ఉత్సవం జరిగి ఆ ఉత్సవంలో ఒక వ్యక్తి నాగరాజును అపహరించి తీసుకువెళ్లి కలకత్తాలో ఒక ధనవంతుల ఇంట్లో బానిసగా అమ్మేసాడు. ఆ ఇంటి యజమానికి చాలా దైవభక్తి ఎప్పుడూ ఇంట్లో పూజలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ చూసిన నాగరాజునకు విచారణ, దైవభక్తి బాగా అలవడ్డవి.కొన్నాళ్ళకు బానిసతనం నుండి ఆ పిల్లవాడిని యజమాని విడిచిపెట్టినాడు. బయటి ప్రపంచానికి వెళ్ళిన నాగరాజుకు ఒక సాధువుల బృందం ఎదురుపడింది, వారితో నాగరాజు వెళ్ళి బ్రతుకుతూ వారికి సేవ చెయ్యడం ప్రారంభం చేసాడు.


వారు ఆ బాలుని సేవకి మెచ్చి సకల పురాణములను ఇతిహాసములను వివరించి గొప్ప పండితుణ్ణి చేసినారు. విద్యాగోష్టిలల్లో ఆరితేరినా ఆధ్యాత్మికా తృష్ణ తీరలేదు ..కేవలం పాండిత్యంతో భగవానుడు ప్రత్యక్షం కాడు, దివ్యజ్ఞానం మరియు సిద్ధి కలుగదు కదా అని విచారిస్తూ ఉన్నాడు.ఒకసారి సాధువులతో కాశి వెళ్ళాడు ...అక్కడి నుండి శ్రీలంక చేరుకున్నాడు. 


అక్కడ సుబ్రమణ్యస్వామి దేవాలయంలో 

స్వామివారు సుబ్రమణ్య యంత్రముగ పూజలు అందుకోవడం చూసాడు , ఈ క్షేత్రం 'కతిర్గామ'. ఇక్కడే సుబ్రమన్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడు.ఈ దేవాలయం లో వటవృక్షం క్రింద భోగానాధుడు అనే సిద్ధపురుషుడు నాగరాజుకు సాక్షాత్కరించాడు.అక్కడే ఉండి నాగరాజు ఆరు నెలలు కదలకుండా ధ్యానం చేసాడు. దీర్ఘకాలం సమాధి స్థితిలో ఉండగా సుబ్రమణ్యస్వామి సాక్షాత్కారం జరిగింది. ఆయన తేజస్సు తనలోకి ప్రవేశించడం గమనించాడు నాగరాజు. ఆ పై మరల భోగనాధుడు ఇలా ఆదేశించాడు.


సాధన పరిపూర్ణము కావాలంటే ద్రవిడ దేశంలో కుర్తాలంలో అగస్త్యుడు ఉన్నాడు అతని అనుగ్రహం పొందాలి అప్పుడు సిద్ధి పొందగలవు అని ఆదేశించాడు. నాగరాజు బయలుదేరి కుర్తాలం వచ్చి, అగస్తుని గూర్చి తీవ్ర తపస్సు చేసాడు అన్నపానాలు మాని 47 రోజులు జపము ,ధ్యానము చెయ్యగా అగస్త్యుడు ప్రత్యక్షమై దివ్య ప్రసాదమును తన చేతులమీదుగా తినిపించి, యోగ రహస్యాలు తెలిపి సిద్ధిని అనుగ్రహించాడు అగస్త్యుని దివ్యానుగ్రహంతో నాగరాజు 'మహా అవతార్ బాబా' గా పరిణామం చెందాడు.


గమనించవలసిన సత్యం ఏమిటంటే ఇక్కడి నుండి బయలుదేరి బదిరికశ్రమం లో గురువులు ఉపదేశం మేరకు సాధనలు చేసి నిత్య యవ్వనునిగా, అమరునిగా మారినాడు మహా అవతార్ బాబాజి క్రీస్తు శకం 788 - 820 మధ్య జీవించిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబాజి. కేదార్నాథ్ పర్వత శిఖర ప్రాంతంలో ఉన్న సిద్దాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నము చెయ్యగా వీలుకాకపోతే అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనలు వారితో చేయించగా అప్పుడు శంకరులు వెళ్ళగలిగారు అని యోగులు, పెద్దలు చెప్తుంటారు. ఇట్లా సిద్ధాశ్రమ యోగులు కేదార్ ప్రాంతంలో అతి రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తూ ఉంటారు.ఉత్తమ సంస్కారం కలిగిన విశిష్ట వ్యక్తులల్లో ప్రవేశించి మానవాళికి మంచి చేస్తూ ఉంటారు. సిద్ధాశ్రమయోగులే రమణ మహర్షి, అరవింద యోగి, కావ్యకంట గణపతి ముని అని ధ్యాన యోగులు చెప్తున్నారు. 


అతనొక సాధారణ రైల్వే ఉద్యోగి. ట్రైనింగ్ లో ఉండగా తీరిక వేళల్లో సరదాగా ఒక కొండ ప్రాంతం చూడటానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఒక యోగి పుంగవుని రూపం దర్శనం జరిగింది. " నాతో రా " అని ఆదేశించాడు ఆ యోగి తీస్కుని వెళ్లి ఒకగుహ యొక్క మొదటి భాగంలో ఉన్న దర్భాసనం, జపమాల చూపి ..." ఇవ్వి నీవు పూర్వజన్మలో సాధన చేసిన ఆసనము మరియు జపమాల.." అని చూపాడు. హస్త మస్తిష్క స్పర్శతో పూర్వజన్మ మొత్తం ఆ ఉద్యోగికి జ్ఞప్తికి వచ్చింది.ఆ యోగి పూర్వజన్మలో తన సద్గురువుగా గుర్తించి పాదములపై బడి శరణు పొందాడు. గురువు గారి అనుగ్రహంతో క్రియయోగమును నేర్చుకుని సిద్ధ పురుషుడైనాడు. అతనే లాహిరిమహశయుడు.

ఆ సద్గురువే 'మహా అవతార్ బాబాజి ' లాహిరి మహాశయునికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 


ఎంతోమందికి క్రియయోగమును ఆయన నేర్పారు.

క్రియయోగము తొలుత శ్రీ కృష్ణుడు అర్జునునికి నేర్పాడు, తర్వాతి కాలం లో 'మహా అవతార్ బాబాజి' మరియు లాహిరిమహశయులు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. లాహిరి శిష్యులల్లో అతిముఖ్యుడు "యుక్తేశ్వరగిరి మహారాజ్"ఈ 'యుక్తేశ్వర గిరి మహారాజ్ ' శిష్యులల్లో అతి ముఖ్యమైన ఒక శిష్యుణ్ణి పాశ్చాత్య దేశములల్లో క్రియయోగ ప్రచారానికి పంపారు అతనే 'పరమహంస యోగానంద', ఇతనే 'ఒక యోగి ఆత్మకధ ' అనే పుస్తకమును రచించారు. 


#YoguluAvadhutalu 

#యోగులుఅవధూతలు