4, మార్చి 2022, శుక్రవారం

మహా అవతార్ బాబాజి

 మహా అవతార్ బాబాజి


అది 30 నవంబరు 203.వ సంవత్సరం, రోహిణి నక్షత్రం - ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి మగ శిశువు జన్మించి నాడు. తల్లిదండ్రులు ఇతనికి నాగరాజు అని పేరు పెట్టినారు. ఇతనికి ఒక చెల్లెలుకుడా జన్మించినది ఆమెకు నాగలక్ష్మి అని పేరు పెట్టారు. 


నాగరాజునకు ఐదు సంవత్సరాల వయసులో ఆ దేవాలయంలో పెద్ద ఉత్సవం జరిగి ఆ ఉత్సవంలో ఒక వ్యక్తి నాగరాజును అపహరించి తీసుకువెళ్లి కలకత్తాలో ఒక ధనవంతుల ఇంట్లో బానిసగా అమ్మేసాడు. ఆ ఇంటి యజమానికి చాలా దైవభక్తి ఎప్పుడూ ఇంట్లో పూజలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ చూసిన నాగరాజునకు విచారణ, దైవభక్తి బాగా అలవడ్డవి.కొన్నాళ్ళకు బానిసతనం నుండి ఆ పిల్లవాడిని యజమాని విడిచిపెట్టినాడు. బయటి ప్రపంచానికి వెళ్ళిన నాగరాజుకు ఒక సాధువుల బృందం ఎదురుపడింది, వారితో నాగరాజు వెళ్ళి బ్రతుకుతూ వారికి సేవ చెయ్యడం ప్రారంభం చేసాడు.


వారు ఆ బాలుని సేవకి మెచ్చి సకల పురాణములను ఇతిహాసములను వివరించి గొప్ప పండితుణ్ణి చేసినారు. విద్యాగోష్టిలల్లో ఆరితేరినా ఆధ్యాత్మికా తృష్ణ తీరలేదు ..కేవలం పాండిత్యంతో భగవానుడు ప్రత్యక్షం కాడు, దివ్యజ్ఞానం మరియు సిద్ధి కలుగదు కదా అని విచారిస్తూ ఉన్నాడు.ఒకసారి సాధువులతో కాశి వెళ్ళాడు ...అక్కడి నుండి శ్రీలంక చేరుకున్నాడు. 


అక్కడ సుబ్రమణ్యస్వామి దేవాలయంలో 

స్వామివారు సుబ్రమణ్య యంత్రముగ పూజలు అందుకోవడం చూసాడు , ఈ క్షేత్రం 'కతిర్గామ'. ఇక్కడే సుబ్రమన్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడు.ఈ దేవాలయం లో వటవృక్షం క్రింద భోగానాధుడు అనే సిద్ధపురుషుడు నాగరాజుకు సాక్షాత్కరించాడు.అక్కడే ఉండి నాగరాజు ఆరు నెలలు కదలకుండా ధ్యానం చేసాడు. దీర్ఘకాలం సమాధి స్థితిలో ఉండగా సుబ్రమణ్యస్వామి సాక్షాత్కారం జరిగింది. ఆయన తేజస్సు తనలోకి ప్రవేశించడం గమనించాడు నాగరాజు. ఆ పై మరల భోగనాధుడు ఇలా ఆదేశించాడు.


సాధన పరిపూర్ణము కావాలంటే ద్రవిడ దేశంలో కుర్తాలంలో అగస్త్యుడు ఉన్నాడు అతని అనుగ్రహం పొందాలి అప్పుడు సిద్ధి పొందగలవు అని ఆదేశించాడు. నాగరాజు బయలుదేరి కుర్తాలం వచ్చి, అగస్తుని గూర్చి తీవ్ర తపస్సు చేసాడు అన్నపానాలు మాని 47 రోజులు జపము ,ధ్యానము చెయ్యగా అగస్త్యుడు ప్రత్యక్షమై దివ్య ప్రసాదమును తన చేతులమీదుగా తినిపించి, యోగ రహస్యాలు తెలిపి సిద్ధిని అనుగ్రహించాడు అగస్త్యుని దివ్యానుగ్రహంతో నాగరాజు 'మహా అవతార్ బాబా' గా పరిణామం చెందాడు.


గమనించవలసిన సత్యం ఏమిటంటే ఇక్కడి నుండి బయలుదేరి బదిరికశ్రమం లో గురువులు ఉపదేశం మేరకు సాధనలు చేసి నిత్య యవ్వనునిగా, అమరునిగా మారినాడు మహా అవతార్ బాబాజి క్రీస్తు శకం 788 - 820 మధ్య జీవించిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబాజి. కేదార్నాథ్ పర్వత శిఖర ప్రాంతంలో ఉన్న సిద్దాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నము చెయ్యగా వీలుకాకపోతే అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనలు వారితో చేయించగా అప్పుడు శంకరులు వెళ్ళగలిగారు అని యోగులు, పెద్దలు చెప్తుంటారు. ఇట్లా సిద్ధాశ్రమ యోగులు కేదార్ ప్రాంతంలో అతి రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తూ ఉంటారు.ఉత్తమ సంస్కారం కలిగిన విశిష్ట వ్యక్తులల్లో ప్రవేశించి మానవాళికి మంచి చేస్తూ ఉంటారు. సిద్ధాశ్రమయోగులే రమణ మహర్షి, అరవింద యోగి, కావ్యకంట గణపతి ముని అని ధ్యాన యోగులు చెప్తున్నారు. 


అతనొక సాధారణ రైల్వే ఉద్యోగి. ట్రైనింగ్ లో ఉండగా తీరిక వేళల్లో సరదాగా ఒక కొండ ప్రాంతం చూడటానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఒక యోగి పుంగవుని రూపం దర్శనం జరిగింది. " నాతో రా " అని ఆదేశించాడు ఆ యోగి తీస్కుని వెళ్లి ఒకగుహ యొక్క మొదటి భాగంలో ఉన్న దర్భాసనం, జపమాల చూపి ..." ఇవ్వి నీవు పూర్వజన్మలో సాధన చేసిన ఆసనము మరియు జపమాల.." అని చూపాడు. హస్త మస్తిష్క స్పర్శతో పూర్వజన్మ మొత్తం ఆ ఉద్యోగికి జ్ఞప్తికి వచ్చింది.ఆ యోగి పూర్వజన్మలో తన సద్గురువుగా గుర్తించి పాదములపై బడి శరణు పొందాడు. గురువు గారి అనుగ్రహంతో క్రియయోగమును నేర్చుకుని సిద్ధ పురుషుడైనాడు. అతనే లాహిరిమహశయుడు.

ఆ సద్గురువే 'మహా అవతార్ బాబాజి ' లాహిరి మహాశయునికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 


ఎంతోమందికి క్రియయోగమును ఆయన నేర్పారు.

క్రియయోగము తొలుత శ్రీ కృష్ణుడు అర్జునునికి నేర్పాడు, తర్వాతి కాలం లో 'మహా అవతార్ బాబాజి' మరియు లాహిరిమహశయులు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. లాహిరి శిష్యులల్లో అతిముఖ్యుడు "యుక్తేశ్వరగిరి మహారాజ్"ఈ 'యుక్తేశ్వర గిరి మహారాజ్ ' శిష్యులల్లో అతి ముఖ్యమైన ఒక శిష్యుణ్ణి పాశ్చాత్య దేశములల్లో క్రియయోగ ప్రచారానికి పంపారు అతనే 'పరమహంస యోగానంద', ఇతనే 'ఒక యోగి ఆత్మకధ ' అనే పుస్తకమును రచించారు. 


#YoguluAvadhutalu 

#యోగులుఅవధూతలు

కామెంట్‌లు లేవు: