4, జులై 2020, శనివారం

నక్షత్రము – నాటాల్సిన వృక్షం

వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.


నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.

జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు – ఫలితాలు

అశ్వని నక్షత్రము
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.

భరణి నక్షత్రము
భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది


కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రము
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

మృగశిర నక్షత్రము
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.


పునర్వసు నక్షత్రము
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రము
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రము
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రము
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రము
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.


ఉత్తర నక్షత్రము
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రము
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రము
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రము
స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రము
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.


అనురాధ నక్షత్రము
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రము
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రము
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

పూర్వాషాడ నక్షత్రము
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఉత్తరాషాడ నక్షత్రము
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రము
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రము
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రము
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

వివరణాత్మకమైన సమాచారం. వాట్సాప్ ద్వారా లభ్యం 

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర

                                                                      శ్రీ గణేశాయ నమః

 శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం
 ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయేత్


 వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
 నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!


 శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-1


ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది?

శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి.

అంతట సూతులవారు – మునులారా!

భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును

తన  భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు.

అనగా విని శౌనకాదులు మహానుభావా

ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము,
 ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి.

అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను,

 కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన యేవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.

 అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. అనంతరము శౌనకాది మహర్షులతో యిట్లు చెప్పసాగినారు.

మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు.

నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును.

నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.

ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు.

పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది.

ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.

అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు.

నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!

 అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది.

అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను –

 కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు.

నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమన...

మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు.

తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి.

ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము యీ సర్వలోకము లకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే.

పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను.

దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.

 సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.

కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.
 యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను
 క్రతువు దేనికొరకు చేస్తున్నారు,
యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని

ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొనసాగిరి.

కొందరు మునులు ‘‘బ్రహ్మ గొప్పవాడని కొందరు ‘‘కాదు విష్ణువే గొప్పవా’’డనిరి. మరికొందరు ‘కాదు’ శంకరుడు గొప్పవాడనిరి.

 తుదకు ఆయన గొప్పవారు, ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువవారు ఆయన తక్కువవారని అనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన అయినది.

వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు ‘‘ఋషులారా! న్యాయా న్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతి సూత్రములు ప్రకటించు అర్హత గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు, ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు.

మనము కార్యశూరులమయి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్ధ వాదోపవాదములు కిది తగిన కాలము కాదు గదా అనిరి.

‘‘సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్త్వగుణమే మహోన్నతము కదా! అందువలన త్రిమూర్తులలో సత్త్వ గుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము.

మునులారా! మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వరో యాతనిని ఎంపిక చేసి పంపుడు, అందువలన మన సందేహము తీరుట జరుగును’’ అని కూడ ప్రవచించిరి.

మునులు దాని కంగీకరించినారు. కాని అది కత్తి పై సాము వంటిది అని వారికి తెలియకపోలేదు.

సరే ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు, అంతలో కొంతమంది మన మునులలో ఘనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే, అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు.


ఆయన మాత్రమే ఈ మహా కార్యమును నిర్వహించుటకు సమర్ధుడు అని వారు పలికినారు

ఇది అంతయు శ్రద్ధతో ఆలకించు చున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి ,విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయ వలసినదిగా కోరినారు

దానికి సూతమహర్షి చిరు మందహాసముతో ఆ వృత్తాంత మంతయు తెలియజేయుటకు సంకల్పించినారు


 శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,
 భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |

 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

Pratap

He is Pratap aged 21 years. He travels 28 days in a month to foreign countries.France has invited him to join their Organisations for which he will be provided with monthly salary of Rs 16 Lakhs, 5 BHK house and Car worth 2.5Cr.But he simply declined. 
PM Modi has honored him with suitable award and has asked DRDO to absorb him. 
Let us see what this boy from Karnataka has achieved. 
Part 1
He was born in a remote village in Kadaikudi near Mysore Karnataka. His father earns Rs 2000 as a farmer. Pratap was interested in Electronics right from childhood. While studying plus 2 he acquainted himself with various websites such as Aviation ,Space, Rolls Royce car, Boeing 777 etc from a nearby Cybercafe .He sent several  emails to Scientists all over the world in his Butler English about his interest to work but in vain . He wanted to join Engg but due to financial problems he joined BSc ( Physics) again unable to complete  the same. He was thrown out of hostel for not paying the hostel fees. He used to sleep in  Mysore Bus stand and used to  wash his clothes  in public toilet. He learnt computer languages such asC++JavaCore and Python on his own. He learnt about Drone through eWaste. After 80 attempts he succeeded developing one such Drone. 

Part 2
He went to IIT Delhi in rags in a unreserved compartment to participate in Drone model competition. He won Second prize.He was told to participate in a competition in Japan. To go to Japan an academic Professor in Chennai college has to approve his thesis .He went to Chennai for the first time and with great difficulty that Prof approved him with some comments that he is not qualified to write it. 

Pratap required Rs60000 to go to Japan ,a philanthropist from Mysore sponsored his flight ticket and balance money he made up by selling his mother's Mangala Sutra. Somehow he reached Tokyo after going in his maiden flight to Japan all alone. He had only Rs 1400 when he landed there. He didn't take Bullet train since it was very expensive so he went by normal train by changing trains at 16 different stations with his luggage to reach his last station. He walked another 8 km to reach the ultimate destination with his luggage. 

He participated in a Exposition where 127 nations were participating.The results were announced in a graded manner and finally top 10 . Pratap dejectedly started walking back and slowly the judges were inching to top 3,2, and finally the First prize was announced as Please welcome Mr Pratap Gold Medalist from India.He was crying with joy. He saw with his own eyes USA flag going down and Indian flag going up. He was rewarded with 10000$ and celebrations followed everywhere. He was called by PM Modi ,Karnataka MLA & MP and was honoured by all. France offered him a job with all the perks of very high order. He simply refused and now PM has honoured him and has asked DRDO to absorb him.

*తిరుమల \|/ సమాచారం ***

 ఓం నమో వేంకటేశాయ!!

• శుక్రవారం 9,841 మంది
   భక్తుల కు కలియుగ దైవం
   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
   దర్శన భాగ్యం కలిగింది...

• శుక్రవారం 3,715 మంది
   భక్తులు స్వామి వారికి 
   తలనీలాలు సమర్పించి 
   మొక్కులు చెల్లించుకున్నారు

• గురూవారం  స్వామివారికి
  హుండీలో భక్తులు
  సమర్పించిన నగదు
  ₹: 65 లక్షలు

•  కరోనా వ్యాప్తి నేపథ్యంలో
   పరిమిత సంఖ్యలో  రోజుకు 12 వేల మందిని
   శ్రీవారి దర్శనానికి
   అనుమతిస్తున్న టీటీడీ

• గంటకు 7 నుంచి 8 వందల
  మంది శ్రీవేంకటేశ్వరుని
  దర్శించుకునే విధంగా టీటీడీ
  ఏర్పాట్లు

• శ్రీ భూ వరాహ స్వామి వారి
  కైంకర్యాలు ఏకాంతంగా
  నిర్వహిస్తున్న టీటీడీ

•  ప్రత్యేక ప్రవేశ దర్శనం
 (ఆన్లైన్ ₹:300), టైం స్లాట్
  టోకెన్లను కలిగిన భక్తులు
  మాత్రమే తిరుమలకు
  రావాలని టీటీడీ విజ్ఞప్తి

• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద
   దర్శనం టిక్కెట్ల వేరిఫికేషన్
   కొరకు ప్రత్యేక కౌంటర్
   ఏర్పాటు 

• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద
  ర్యాండం విధానంలో 100
  కరోనా టెస్టులు

• టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక
  కౌంటర్లలో కరోనా పరీక్షలు

• మస్కులు ధరించిన భక్తులను
  మాత్రమే ఆలయంలోకి
  అనుమతి

• క్యూలైన్ లో భక్తులు
  సోసియల్ డిస్టెన్స్ పాటించే
  విధంగా చర్యలు

• ఆలయంలో తీర్థం, శఠారీ
  రద్దు చేసిన టీటీడీ

• తిరుమలలోని శ్రీవారి
  పాదాలు, పాపవినాశనం,
  జాపాలి, ఆకాశ గంగ
  తీర్థాలకు భక్తుల అనుమతి
  నిషేధం      అలాగే తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు నిషేదం

వాట్సాప్ గ్రూపు నుండి సేకరణ 

మంత్రం

ఏదైనా విషయాన్ని విన్నప్పుడు, విషయం మీద ఇది వాస్తవం అని నమ్మకం ఉండాలి, దానికి ముందు ఆ విషయం చెప్పిన వ్యక్తి మీద విశ్వాసం ఉండాలి. తర్వాత ఆ విషయం ప్రతిపాదించే అంశం పై విశ్వాసం ఉండాలి. అంటే వాక్యం, వాక్య తాత్పర్యం, ఆ వాక్యాన్ని పలికిన వ్యక్తిపై ఆదరం ఉన్నట్టయితే ఆ వాక్యం సరియైన అర్థాన్ని గోచరింపజేస్తున్నట్టు. 

పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి..... అంటే మూడింటి యందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.

మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.

మంత్రాలు రెండు రకాలు అవి 
1. స్వరం కల్గినవి, 
2. స్వరం లేనివి.

విష్ణు సహస్ర నామాలలో ఉన్నవి, ఎన్నో మంత్రాలు. ఒక్కోటి ఒక్కో ఋషి దర్శించినవి. ఇవన్నీ స్వరం లేనివి.... కానీ మననం చేస్తే కాపాడేవి, అందుకే అవి మంత్రాలు.

గాయత్రి మంత్రం లాంటివి స్వరం కల్గినవి. ఈ మంత్రాన్ని విశ్వామిత్రుడు అనే మహర్షి దర్షించాడు. దాన్ని తర్వాతి వారికి అందించాడు.
విశ్వామిత్రుడు ఆ మంత్రాన్ని ఒక స్వరంతో ఉపాసించాడు. అట్లా స్వరం కల మంత్రాలకి ఒక్కో వేదంలో ఒక్కో స్వరం ఉంటుంది.

కానీ ఈ మద్య కాలంలో గాయత్రి మంత్రానికి తోచిన స్వరాలు కల్పిస్తున్నారు. స్వరం మార్చి చదవడం తప్పు. అట్లా చేయడం ఆ మంత్రార్థమైన దేవతని హింసించినట్లు అవుతుంది. అపౌరుషేయం అయిన వేద రాశికి స్వరం మారిస్తే అది శుభం కాదు. 
విశ్వామిత్రుడు కూడా ఆ మంత్రాన్ని తయారు చేయలేదు. దాన్ని దర్శించి ఇచ్చాడు. మంత్రానికి స్వరమే ప్రాణం అని అంటారు. అట్లా మంత్రాలని పాటించడం అంటే దాని కున్న స్వరంతోనే ఉపాసించాలి. మంత్రం యందు భక్తి అంటే ఇది.

గాయత్రి మంత్రానికి తాత్పర్యం ఎవరు అనేది ఆ మంత్ర ద్రష్టని అడగాలి. 
ఆయన చేసిన గాయత్రి మంత్ర ప్రభావంచే ఆయన రాముడినే శిష్యుడిగా పొందాడు. ఇది తాను చేసిన మంత్ర మహిమ. ఆ మంత్రానికి తాత్పర్యం రాముడు అని గుర్తించాడు, తత్ ఫలితంగా శ్రీరామచంద్రుడిని సీతమ్మతో చేర్చి తాను ఆర్జించిన తపో శక్తిని స్వామి పాదాలయందు అర్పించాడు. ఇది ఫలితం అని అనుకున్నాడు. 

అందుకే సీతా రామ కళ్యాణం అయ్యాక ఆయన చరిత్రలో ఎక్కడ కనిపించడు, కారణం ఆ మంత్రానికి తాత్పర్యాన్ని పొంది సిద్ధుడు అయ్యాడు. 

మంత్రంలో అధిష్టాన మూర్తి ఉండాలి, ఆయన అలౌకికమై ఉండాలి, జగత్ కారణమై ఉండాలి. అప్పుడు సాత్వికం అవుతుంది. 
లోకంలో ఎన్నో మంత్రాలు ఉండవచ్చు, కానీ ఏది స్వీకరించతగునో వాటినే స్వీకరించాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం అంటే ఇది. దానికి తోడు మంత్రాన్ని ఒక గురువు ద్వారానే పొందాలి. ఈ మంత్రం వీడికి ఫలించుగాక అని గురువు సంకల్పించి ఉపదేశం చేస్తాడు కనక ఆ సంకల్పానికి ఒక శక్తి విశేషం ఉంటుంది. 
అయితే గురువు ద్వారానే ఎందుకు పొందాలి అంటే ఈ కాలంలో ఎందరో వారికి తోచిన మంత్రాలని వాటికి స్వరాలను కల్పించి చలామణి చేస్తున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో కూడా తెలియనంతగా స్థితిలో లోకం సాగుతోంది. 

అందుకే మంత్రం అనేది పొందాలి అంటే దాన్ని దర్శించినవాడై ఉండాలి. అది మనకు ఫలించాలి అనే వాత్సల్యంతో వారు అందించాలి. అట్లా మంత్రం,  మంత్రం తెలిపే దేవతా విశేషం, మంత్రాన్ని అందించే గురువు ఈ మూడు ఒక చోట చేరితే, ఈ మూడింటిపై విశ్వాసం ఉంటే అది మొదటి మెట్టు అవుతుంది, ఆ మంత్రం అనేది తప్పక ఫలిస్తుంది.

లక్ష్మీదేవి

లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని   వేడుకుంది. "స్వామీ.. మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా? సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను కనికరించండి" అని మొరపెట్టుకుంది. 

అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు.....

"నువ్వు భయపడకు. నీకు తోడుగా నలుగురుని పంపుతున్నాను. రాజు, అగ్ని, దొంగ, రోగం... 
ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. 

ధర్మంగా సంపాదించి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండే వారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతోకాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. 

ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో.. 
ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు. 

ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది. 
మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. 

ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలోనో, లేక దొంగ రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించేస్తారు.

ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకో, రొష్టులకో తగలబెట్టేస్తారు.  ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు.

కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు నలుగుురు నీకు తోడుగా ఉంటారు" అని వరమిచ్చి పంపించాడు

కలి ప్రభావం

*దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః పాపీచిరాయు స్సుకృతీగతాయుః*
*రాజాకులీన స్సుకులీచ భృత్యుః కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి*

తా ,, కలియుగము నందున దానగుణము కలవాడు పేదవాడగుట ,పిసినారి ధనవంతుడగుట పాపకర్మలను చేయువారు అధికాయువుకలవారుగా మంచివారికి ఆయూర్దాయము తగ్గిపోవుట రాజు లేదా రాజువంటిలక్షణములు గలవారు సేవకునిగాను సేవకులు లేదా అటువంటిలక్షణములు గలవారు అధికారులుగా చలామణి అగుచుందురు
ఈ ఆరుగుణములు కలియుగమును ఆశ్రయించి ఉండును


చట్టం తెలుసుకో హిందూ సోదరా...

1. మతం మారిన షెడ్యూలు కులాలకు చెందిన వ్యక్తి షడ్యూలు కులాల వ్యక్తిగా పరిగణింపజాలడని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు
1977 లో తీర్పునిచ్చింది. (AIt 1977,282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షడ్యూల్డు కులాల
ప్రయోజనాలను పొందజాలరని సుప్రీంకోర్టు 1986 లో తీర్పునిచ్చింది (Alt 1986,SC 733),

2. నీ భార్య గానీ, భర్త గానీ మతం పుచ్చుకున్నా లేదా కూటములు వెళుతున్నా నువ్వు ఆమె/అతని నుండి విడాకులు పొందవచ్చు.
సెక్షన్లు 13(1) ii (హిందూ వివాహ చట్టం).

3. నీ భార్య గాని, తల్లిగాని, కుమారై గాని క్రైస్తవ కూటములు వెళుతున్నారా? వీరికి మనోవర్తి చల్లించనక్కరలేదు సెక్షన్
18(3)of Act78of 1956.

4. నీ కొడుకు గానీ, కోడలు గానీ ఇతర మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలోగాని, మరి ఏ ఇతర హిందూ
బంధువుల నుండిగాని, వారసత్వపు హక్కుగాని, వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు.

5. తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్థికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు
(సెక్షన్ 6 హిందూ మైనార్టి & గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులు గాని,చుట్టు ప్రక్కల హిందువులు గాని స్వచ్చందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే
కాదు పిల్లలను మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే మైనర్లను మతం మార్చకుండా
సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

6. మతం పుచ్చుకున్న BC (A-B-D) గ్రూపులవారుంCలుగా పరిగణించబడతారు. అదే విధంగా మతం పుచ్చుకున్న SC,ST
లుBCC)లు గాను పరిగణించబడతారు . ముస్లిం మతం పుచ్చుకున్న SC లు OC లుగా పరిగణించబడతారు. అలాగే
ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 (Education
Depot. Dt. 23-09-1970),

7. మతం మార్చుకొని కూడా అబద్దాలు చెప్పి SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై
సెక్షన్ 420 IPC ప్రకారం బీటింగ్ కేసులు పెట్టి విచారించి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.

8. SC, ST, BC కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే BC(C) లుగా
అవుతారు. వారు ఇంకా మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా
తగిన ఆధారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగు
చర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.

9. మత విశ్వాసాలను కించ పరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత
విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమాన పరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ
శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే
అవకాశం ఉంది.

10. IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత సామరస్య వాతావరణాన్ని భగ్నం చేస్తూ
ఇతర మతస్తులు హింతూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/ పోస్టర్లు అంటించడం. రోడ్లపై సంచరిస్తూ మత్రపచారం.
బల ప్రదర్శన కూడా నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా
విధించే అవకాశం ఉంది.

11. IPC 153 (ఐ) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై
నమ్మకం విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు,
ప్రకటనలు చేసినా ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష
లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు.

12. అనుమతులు లేని సంఘానికి ప్రార్ధనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు
ఆ సంఘం/ ప్రార్ధనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.

13. GO Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత
సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి/ వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్ధనా మందిరాలు
నడిపితే సంబంధిత అధికార్లు వాటిని తొలడించవచ్చు.

14. హిందూ మతం వదలి క్రైస్తవ మతం పుచ్చుకున్న SC, ST లు రిజర్వు స్థానాల్లో పోటీ చేయరాదు. వారు BC ల రిజర్వు
స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా SC రిజర్వ్ స్థానంలో పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు.
ఫిర్యాదు కలెక్టరుకు మరియు సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలిస్ కు పంపించండి.

15. హిందూ మతం నుండి క్రైస్తవ మతం లోనికి మారిన SC, ST లు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.

16. విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం. క్రైస్తవ మత పరమైన ఉసన్యాసాలు చేయడం నేరం.
దేశద్రోహం. మన దేశం మత ప్రచారం కోసం వీసా ఇవ్వ్వవు. అలాంటి వారిపై పోలీస్ కేసు పెట్టవచ్చు.

17. 1976 సం॥ నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం(ACT 49/1976) అమలులో ఉంది. స్వచ్చంద సేవా
సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మా మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం. కాబట్టి
అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేయవచ్చు.

18. ప్రార్ధనలతో, కొబ్బరి నూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యక్ట్ ACT
No.21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 2008 ప్రకారం నేరం. క్రైస్తవులుగా మారి కూడా SC రిజర్వేషన్లు పొందుతున్న
వారి వివరాలు ఆధారాలతో ఉదా.|| ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోలోలు, బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయలకు
వస్తున్న ఫోటోలు, వీడియోలు, క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు, గృహప్రవేశ, పదవీ విరమణ, మరణ మొదలగు
శుభ, అశుభ కార్యముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్లు), వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు, ఫోటోలు, వీడియోలు |
మొదలగు వివరాలు సేకరించి ఈ 420 గాళ్ళపై పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖపై అధికారులకు (విధ్యాధి
అయితే విద్యాశాఖ / యూనివర్శిటీ / కళాశాల యాజమాన్యానికి) MRO గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ
ఎకనాలెడ్జిమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. ఒకవేళ పై అధికారులెవరూ వారిపై చట్టపరంగా చర్యలు
తీసుకొనకపోయినట్టయితే ఈ ఆధారాలు, ఎకనాలెడ్జ్మెంట్ ఫోటోస్టాట్ లు పూర్తి సమాచారము జతపరాచి కోర్టులో కేసు వేస్తే
విచారించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా కోర్టువారు సదరు అధికారులను ఆదేశిస్తారు.

కనుక రండి || కులాలకు వర్గాలకు అతీతంగా హిందువులంతా కలిసి పనిచేద్దాం. రాజ్యాంగ పరంగా, చట్ట పరంగా,
న్యాయపరంగా మన హిందు ధర్మంపై జరుడుతున్న దాడిని అడ్డుకుందాం...మనదేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత
ప్రతీ ఒక్కహిందూవుది...జై హింద్... జై సనాతన ధర్మం............

 #హిందువుగా_జీవుంచు_హిందువుగా_గర్వించు
              #భారత్_మాతాకీ_జై


*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక 

మా పోస్ట్ _లు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 నంబర్ కి " Jai Shree Ram " అని వాట్సప్ ద్వారా మెసేజ్ పంపండి

భూత, ప్రేత, గాలి, పీశాచాలను దగ్గరికి కుడా రాకుండా


భూత, ప్రేత, గాలి, పీశాచాలను దగ్గరికి కుడా రాకుండా చేసే మరియు క్షుద్ర భాదల నుండి కాపాడే శ్రీ పంచముఖ హనుమత్కవచం (శ్రీ సుదర్శన సంహితోక్తం)

శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!
ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య బ్రహ్మో ఋషిః, గాయత్రీ చందః, పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి: క్రౌం కీలకం క్రూం కవచం, క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బందః!! శ్రీ గరుడ ఉవాచ -
అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!
యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!
పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!
బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!
పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!
దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!
అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !
అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!
పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !
సర్వనాగా ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!
ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!
పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాడి కృన్తనమ్!!
ఊర్థ్యం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !
యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!
జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!
ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!
ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!
భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!
ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!
ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ భూషితం !
దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!
సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!
పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం 
వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం 
పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం 
పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!
మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం 
శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!
ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం 
పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే 
యది నశ్యతి నశ్యతి శత్రుకులం 
యది ముంచతి ముంచతి వామలతా!!
ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!
ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!
ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!
ఏవం హృదయాదిన్యాసః!
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!
ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం 
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం 
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!
అథ మంత్ర :-
శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!
ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా! 
ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!
హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!
ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!
ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా! ఇతి దిగ్బందః!
ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా! ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా! ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా! ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా! ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా! ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ  బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా! భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా! సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!

ఇతి శ్రీ సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్ర సీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణమ్!!

వేదాలు , శ్లోకాలు‌, మంత్రాలు ,



వేదాలు , శ్లోకాలు‌, మంత్రాలు , ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ మహాభారతాలు  అన్నియు ప్రప్రథమంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డవి.  సంస్కృతం రానివాళ్ళకు ఒక్క ముక్క కూడా అర్థం కాని పరిస్థితి. 

వీటి కారణంగా పెక్కుమంది వీటిని చదవటానికి వెనుకంజ వేయవచ్చు. 

యిప్పటి చదువులన్నీ పైపై చదువులే. భాషపై పట్టు తక్కువ. పై విషయాలన్నీ చదవాలంటే నోరు తిరగదు, తిరిగినా అర్థం కాదు. అందువల్ల వాటిని చదవటానికి ఒక విముఖత తయారుకాగలదు. 

కాని యెటువంటి యిబ్బందులున్నా వీటిని రోజుకు ఒక్క శ్లోకమైనా ఒక్క పేజీ అయినా చదవాల్సిందే. 

అర్థం కానక్కర్లేదు, నోరుగూడా సరిగ్గా తిరగనక్కర్లేదు. రోజూ చదువుతుంటే నోరు తనంతట తాను యెటువంటి కృషి లేకుండా తిరగగలదు. 

యిక అర్థానికి వస్తే మీకు ఒక చిన్న వివరణ యివ్వాలి. 

బ్రాహ్మణ వంశ చిన్న బాలురకు తొమ్మిది వయసులో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయనం చేయడం పరిపాటి. ఈ ఉపనయన కార్యక్రమంలో ఒక్క తతంగం గురించి మాట్లాడదలిచాను. 

అది యేంటంటే భిక్షాటన. యిది ఒక తంతు మాత్రమే.ఆ బాలుడు ప్రతి మహిళ దగ్గరకెళ్ళి భవతీ భిక్షాంధేహి అని అనాలి. సిద్దాంతి వటువును ప్రతి మహిళ దగ్గరకు  తీసుకెళ్ళి ఈ తతంగం కొనసాగిస్తారు. 

ఆ మహిళలు కూడా ఆ వటువుకు భిక్ష వేస్తారు. ఒక పది మంది దగ్గర యిలా అడుగుతూ భిక్ష పుచ్చుకంటే ఆ  వటువు దగ్గర వున్న భిక్ష పాత్ర నిండి పోగలదు. 

కాని ఒక్కటి మాత్రం నిక్కచ్చిగా చెప్పొచ్చు. పాపం ఆ బాబు యేమి తెలియని పసివాడు. పెద్ద వాళ్ళు సిద్దాంతి యె‌లా చెప్తే అలా చేయాలని అతనికి ముందే సూచించారు.ఆ ప్రకారమే ఆ అబ్బాయి కార్యక్రమాలు సాగిస్తున్నాడు. 

భిక్షాటన అంటే అతనికి యేమీ తెలియదు. భవతీ భిక్షాంధేహి అంటే అర్థం తెలియదు. పెద్దలు అలా చేయమన్నారు కాబట్టి చేసాడు. భిక్ష పాత్ర నిండి పోయింది. 

కాని ఆ ముత్తయిదువులకు తెలుసు. అలాంటి భిక్ష సమయంలో భిక్ష పాత్రలో భిక్ష యివ్వాలని. అందువల్లనే వాళ్ళు యివ్వగలిగారు. 

అంటే యిక్కడ గూడార్థం యేంటంటే తను అడిగిన దానికి అర్థం అడిగేవాడికన్నా యిచ్చేవాడికి అర్థమయితే చాలన్నట్టు. 

యిప్పుడు మనం ఈ వృత్తాంతాన్ని మన అర్థంకాని సంస్కృత భాషా శ్లోకాలకు మంత్రాలకు అన్వయిద్దాం. 

ఈ శ్లోకాల అర్థాలు మనకు తెలియనక్కర్లేదు. ఈ శ్లోకాలు యెవరిని ఉద్దేశించే చెప్పబడ్డది, వారు లలితాంబిక కావొచ్చు, హనుమంతుడు కావొచ్చు, శ్రీరాముడు కావొచ్చు లేదా శ్రీ కృష్ణుడు కావొచ్చు. 

ఆ దేవుళ్ళందరు వీటి అర్థాలు తెలిసినవాళ్ళే. ఈ శ్లోకాలు పఠించేవారిని ఆ దేవతలు నిరుపమానంగా సహాయపడగలరు. వారి సంకటాన్ని హరించి సదా శ్రేయస్సు సమకూర్చగలరు. 

అందువల్ల యెటువంటి మంత్రాలకు శ్లోకాలకు అర్థం తెలియటంలేదని యెవ్వరు భాధ పడనక్కరలేదు.

వాటిపై పట్టు ప్రయత్నం చేసిన కొద్దీ సమకూరగలదు. ఆ పట్టు ఒక్కటే కాదు. వాటివల్ల సత్పలితాలు పొందగలరు. 

అందువల్ల ప్రతియొక్కరు వారికి యిష్టమైన దైవాన్ని స్తుతించడం వెంటనే ప్రారంభించండి. విజయం సాధించండి.