ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
8, ఆగస్టు 2024, గురువారం
కాకస్య దంతః
కాకస్య దంతః
పూర్వం ఒక గ్రామంలో వీధి అరుగుమీద ఇద్దరు పండితులు కూర్చొని ఒక విషయాన్ని గురినిచి తర్కించుకుంటున్నారట అదేమిటంటే " కాకస్య దాంతః" అంటే కాకికి దంతాలు వుంటాయని రామశర్మ అనే పండితుడు కాకికి దంతాలు ఉండవని కృష్ణ శర్మ అనే పండితుడు చాలా ఆవేశంతో తర్కిస్తున్నారు. నారాయణ శర్మ అనే ఒక బ్రాహ్మడు అటువైపునుండి నడుచుకుంటూ వెళుతున్నాడట. అది వారి కంట పడింది. అప్పుడు ఆ పండితులు ఇద్దరు నారాయణ శర్మను ఆపి తమ తర్కమును విని సమాధానం చెప్పమన్నారు. నారాయణ శర్మకు కంఠంలో వెలగకాయ పడ్డట్లు అయ్యింది. ఎందుకంటె గ్రామంలో రామ శర్మ, కృష్ణ శర్మ ఇద్దరు కూడా ఉద్దండ పండితులని వేద, మీమాంస, తర్క, న్యాయ, జ్యోతిషాది శాస్త్రాలు కూలంకుషంగా చదివిన దిట్టలని ప్రతితీ కాబట్టి సామాన్యుడైన నారాయణ శర్మ వారి తర్కం విని వారి తగువు తీర్చటం అంటే మాటలా. అతని పని అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యింది..
కాకి కూడా ఘనాహారం అంటే పప్పులు, గింజలు మనుషులు తిన్నట్లే తింటాయి కాబట్టి కాకులకు తప్పకుండా దంతాలు వుంది తీరాలిసిందే అని రామ శర్మ తన తర్కాన్ని చెపితే దానికి కృష్ణ శర్మ కాకికి వుండే ముక్కే చాలా చిన్నగా ఉంటుంది అందులో చిన్న నాలుక ఉంటుండి ఇక దంతాలు పెట్టె అంట నోరే లేనప్పుడు ఇక దంతాలు ఉండటానికి అవకాశం ఎక్కడ వున్నది. నిజానికి కాకికి వున్న ముక్కుతోటె అంటే ఫై ముక్కు మరియు క్రింది ముక్కు మధ్యలో ఆహారాన్ని నమిలి తింటుంది అని కృష్ణ శర్మ వాదించాడు. ఇద్దరి వాదనలు విన్నతరువాట్ ఏమి మాట్లాడాలో తెలియక తెల్లమొహం వేయవలసివచ్చింది నారాయణ శర్మ. నిజానికి నారాయణ శర్మ వారిద్దరిలాగా పెద్దగా చదువుకొనక పోయినా కానీ చక్కటి యుక్తిపరుడు, ఎటువంటి సమస్యనయినా సాధించగల సాధకుడు. కొంచం ముందు బెరుకుగా ఉన్నకాని వారిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
పండితులారా పితృకార్యాలలో కాకులకు అదే వికిర పిండం ఎందుకు పెడతారో ముందు చెప్పండి అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేయగలను అని వారి మనస్సును ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం చేసాడు. అతని ప్రయత్నం కొంత ఫలిచిందనే చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో బాగా చదువుకున్నాం అనుకునే మేధావులు కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని వుండరు. ఇప్పుడు ఆ పండితుల ఇద్దరి పరిస్థితి అట్లానే అయ్యింది. పేలబోయిన వారి ముఖములను కనిపించకుండా తెలివిగా ఇద్దరు మేము అడిగినదానికి నీవు అడిగిన దానికి సంబంధం ఏమిలేదు ముందుగా మా సందేహం తీర్చమని నారాయణ శర్మ ను వత్తిడి చేశారు.
నారాయణ శర్మ కూడా ఏమి తక్కువ తినలేదు పండితులారా వికిర పిండం తినాలంటే కాకి ఎలా తినాలి. అందుకే నేను ఆ ప్రశ్నను వేసాను అని అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పండితులు కొంత వెనుకకు తగ్గవలసి వచ్చింది.. మాట మారుస్తూ వాళ్ళు ఇంతకూ నారాయణ శర్మ ఎందుకు ఇటువైపు వచ్చావు అని అన్నారు. అంటే మా గొడవ ఏదో మేము పడేవారం కదా మధ్యలో నీ వల్ల మేమిద్దరం తెలివిలేని వారిగా బయటపడవలసి వస్తున్నదే అన్నట్లుగా వున్నది వారి మాట.
నారాయణ శర్మ వారిద్దరిని ఉద్దేశించి పండితులారా మనం ఎన్నో లక్షల జన్మలనుంచి తపిస్తూవుంటే ఆ ఈశ్వరుడు మనకు ఈ జన్మను ప్రసాదించారు. ఏంటోజ్ఞ్యానం కలిగి వున్నాము ఇప్పుడైనా మనం కళ్ళు తెరువక ఇంకా శుష్క వాదనలతోటి కాలయాపన చేస్తే మన జన్మకు అర్ధం ఏముంది మనకు శంకర భగవతపాదులవారు చక్కగా భజగోవిందాన్ని బోధించారు. కాబట్టి కాలాన్ని వృధాచేయకుండా చక్కగా పరమేశ్వరుని చేరే మార్గం ఎంచుకోవాలి అని అంటే వారిద్దరికీ కనువిప్పు అయ్యింది.
నాటి నుండి రామ శర్మ కృష్ణ శర్మ శుస్క సంభాషణలు చేయకుండా చక్కగా సాధన చేతుష్టయాన్ని అవలంబీనించి ముముక్షుకత్వం వైపు పయనించారు.
కాబట్టి భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ఓ సాధక మిత్రమా మనకు సమయం తక్కువగా వున్నది మోక్షపదం చాలా దూరంగా వున్నది ఈ క్షణం నుంచే మనం సాధన మొదలుపెడితే కానీ మోక్షాన్ని పొందలేము. తస్మాత్ జాగ్రత్త
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ భార్గవశర్మ
భగవద్గీత పారాయణం
వందేమాతరం
*భారతీయులందరికీ భగవద్గీత పారాయణం అవశ్యం*
నేటి సామాజిక దేశకాల పరిస్థితుల్లో నిర్లప్తతతో నిద్రాణమై ఉన్న భారతీయులు మొదటిగా మానసికముగా శక్తివంతులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారు ఇంటా బయటా ముప్పెటి దాడికి గురవుతున్న హిందూ ధర్మము మరియు భారతజాతి పటిష్టతపై దృష్టి కేంద్రీకరించగలరు. ఈ సందర్భంగా మనము శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఎందుకు ఉపదేశించాడు అని ఆలోచిస్తే మనకు పరిష్కార మార్గం కనిపిస్తుంది.
శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన ఉపదేశానికి మూలం అర్జునుడు యుద్ధరంగం నుండి వెనుకకు మరలిపోకుండా యుద్ధం చేసేటట్లు చేయడమే. అందరూ నా వారే అన్న ఒక బలహీనమైన దృష్టితో అధర్మాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడు సంశయిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుని అధర్మంపై యుద్ధానికి మానసికంగా సిద్ధం చేయడం కోసం ఈ ఉపదేశం చేశాడు. భగవద్గీత తాత్విక గ్రంథమే కాదు మానసికమైనది కూడా. అయితే దానిని అర్జునుని ప్రభావితం చేయడం కొరకు శ్రీకృష్ణుడు అనేక విషయాలు క్రోడీకరించి చెప్పవలసి వచ్చింది. అర్జునుడు శోకసంవిగ్నమానసుడై యుద్ధం చేయనంటూ ధనుస్సూ బాణాలు దూరంగా పడవేసి రథంమీద చతికిలబడతాడు. అప్పుడు అతనిని మామూలు స్థితికి తీసికొని రావడంకోసం శ్రీకృష్ణుడు -
*"కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్.. క్షుద్రం హృదయదౌర్బల్యం త్వక్త్వోత్తిష్ఠ పరంతప"* అని ఉద్బోధించాడు.
అయితే - అర్జునుడు, శంకరభగవత్పాదుల మాటలలో చెప్పాలంటే- “శోకమోహ మహోదధిలో నిమగ్నుడై" ఉండడంచేత ఈ మాటలు అతని చెవికెక్కలేదు. అందుచేత అర్జునుని శోకమోహాలు సమూలంగా తొలగించడానికై ఆత్మ జన్మజరామరణాది రహితమైనది అని ఆత్మకు సంబంధించిన పరమార్థసత్యాన్ని ఉపదేశించవలసి వచ్చినది. ఈ పరమార్థ సత్యం నివృత్తిమార్గంతో ముడివడి ఉంది. "అయితే ఇంకేమి, నేను ఈ నివృత్తిమార్గంలోనే ఉంటాను; ఈ విధంగా కూడ నేను యుద్ధం చేయవలసిన పనిలేదు కదా? అని అర్జునుడు ఎక్కడ అనుకొని తన భావాలను సమర్ధించుకుంటాడో అన్న అనుమానంతో శ్రీకృష్ణుడు ఈ నివృత్తిమార్గం అందరికీ వర్తించేది కాదు, నీకు కూడ దీనియందు ప్రస్తుతం అధికారం లేదు. కొన్ని వేలమందిలో ఏ ఒక్కరికో తప్ప ఇది ఉపయోగించదు. దానికి అధికారం సంపాదించే వరకు నీతో సహా అందరూ కర్మయోగాన్ని అనుసరించవలసిందే అని స్పష్టీకరిస్తూ కర్మయోగాన్నీ, తత్సంబంధిత అనేక విషయాలనూ చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునకు ధర్మద్వయం (వైదికమైన ప్రవృత్తి - నివృత్తి మార్గాలు రెండింటినీ) ఉపదేశించాడు. దానితో అర్జునుణ్ణి యుద్ధప్రవృత్తుని చేయడం అనే ప్రయోజనం నెరవేరింది.
అధర్మ మార్గంలో నడుస్తున్న తనవారిని బంధానుబంధాలనే మోహాచక్రంలో పడి సహించడం సారి కాదని, వారిని శిక్షించడమే ధర్మమని, ధర్మరక్షణకై అది అనివార్యమనే భగవద్గీత సారాన్ని శ్రీకృష్ణుడు తెలియజేశారు.
భగవద్గీత గొప్పతనం ఏమిటంటే అది ఏ కాలానికి అయినా అప్పటి కాలమాన పరిస్థితులకు అన్వయింపుగానే ఉంటుంది.
కాబట్టి అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని గ్రంథాలు సమానమే అనేటువంటి ధోరణిలో స్వధర్మం వివక్షకు లోనవుతున్నా, విద్వేషాలకు గురౌవతున్నా స్పందించని హైందవ సమాజాన్ని మేల్కొలిపి సంఘటితం చేయాలి అంటే ప్రతీ ఒక్కరికీ భగవద్గీత పారాయణం అనివార్యం.
దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు ఈ విషయమే తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మృశి
07.07.2024
9849794167
ఇనుcడు దినాధినాథునకు నిచ్చె సహస్ర కరాభిధానమున్.*
*ఇనుcడు దినాధినాథునకు నిచ్చె సహస్ర కరాభిధానమున్.*
ఈ సమస్యకు నాపూరణ
*ప్రహ్లాదుడు హిరణ్య కశిపునితో*
కనవలె నంతటన్ హరిని కన్పడు నమ్మినవానికిన్ - సదా
వినవలె సూక్ష్మ ధర్మముల గాంచగ భక్తిశ్రద్ధలన్
ఘనమగు దర్శనం బిడును కాచును భక్త జనాళి - సృష్టికే
యినుcడు, దినాధినాథునకు నిచ్చె సహస్ర కరాభిధానమున్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
మకరముc బట్టి చుంబనము మాటికిc జేసెను ప్రేమ పొంగగన్*
*మకరముc బట్టి చుంబనము మాటికిc జేసెను ప్రేమ పొంగగన్*
ఈ సమస్యకు నాపూరణ.
పకపక నవ్వి దాగుకొను భార్యను కౌగిట జేర్చ కృష్ణుడున్
మకుటము పక్కనుంచి వనమాలను మూలన వేసి వేణువున్
ముకురము చెంత నిల్పి సతి మోమును ద్రిప్పుచు జూచి సత్యభా
మ కరముc బట్టి చుంబనము మాటికిc జేసెను ప్రేమ పొంగగన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
దత్తపది
**దత్తపది* ... *ఆది దాది వాది సాది*
*తే.గీ.*
*ఆది* నారాయణా!నిన్నునవనిలో గ
*దాది* యాయుధములును వేదయుత వాస
*వాది* దేవగణములును వసు మను సహ
*సాది* పరివారమెల్లను సన్నుతింత్రు!* ... *ఆది దాది వాది సాది*
*తే.గీ.*
*ఆది* నారాయణా!నిన్నునవనిలో గ
*దాది* యాయుధములును వేదయుత వాస
*వాది* దేవగణములును వసు మను సహ
*సాది* పరివారమెల్లను సన్నుతింత్రు!
సమస్యాపూరణము
సమస్యాపూరణము
డా. దీవి శ్రీనివాసాచార్యులు మంగళగిరి
సమస్య:-శ్రావణ మేఘముల్ గురించి రావట పంటలు పండునట్లుగన్.
ఉ. దోవయు డొంకలేవు మరి దుమ్మును తిన్నెలు గొడ్డుటెండయున్,
త్రావగ నీరు సున్న కడు దారుణమైనది జీవనంబహో
చావు యెడారి సొంతమట! జంటగ సాగును నష్టకష్టముల్,
శ్రావణ మేఘముల్ గురియ రావట పంటలు పండునట్లుగన్.
(రావు+అట)
ఇందిర రమణుడు
:
ఇందిర రమణుడు తిరుమల
మందిర సుందర సురుచిర మందహసితుడా
నందమయుడువేంకటనా
థుందరిచేరితివిదేవదుందువుమెురయన్
:
సరిలేని నర్తకీమణి..సాటిలేని యామిని
సీ...
నిటలాక్షు వరముతో నటరాజపదయుగ్మ
కింకిణీరవళిగా క్షితిజనించి
యామినీపూర్ణరో.. యాంధ్రావనికిబిడ్డ
నృత్యగగనతార, నిరుపమాన.
యాబాల్యమదియేమొ!నందెవేసినచేయి
నృత్యాభినయముల,నిత్యజతుల
భామాకలాపాల భామగా సత్యయై
ఆంగికాహార్యాలనామనౌచు
క్షీరసాగరరూపకేందువదన మోహి
నీవేషధారిణీ ఠేవగనుచు
నిత్యదీక్షావిధి నేర్చెభంగిమలెల్ల
చేర్చెనీవిద్య సుశిష్యతతికి
తేగీ..
కూచిపూడి వేదాంతాన్వయాచిరయశు
లాగురువరేణ్యశుశ్రూషనాచమించి
నాట్యరీతుల ధృవతార నాగనిలిచి
పద్మసువిభూషితయగుచు పరవశించి
పరమశివుజేరె యామిని చిరమునుండ.
: ఉత్పలమాల:
+++++++++++
పద్ధతులన్నిమారినవి,పాఠముజెప్పెడు ధోరణంతయున్!
ఉద్ధతిగోరుచున్ గురువు,నుత్తమమై వెలిగించగోరుచున్!!
రుద్దగసాగెవారినిట,రూఢిగవారలునీరసించగా!
ముద్దుగసాగవేవియును,మూర్ఖపురీతులు వేంకటేశ్వరా!!
----
" శార్దూల..
--
శ్రీమన్మంగళదాతృదేవుశివునిన్ శ్రీధారిభస్మాంగునిన్
శ్రీమాతంగవరేష్టచర్మధరునిన్ క్షేమాది కైవల్యదున్
శ్రీమీనాక్షిపతిన్ త్రినేత్రుఁడగునా క్షీరోద్భవేంద్వంశకున్
శ్రీమన్నీలగళున్ విషాహిలసితున్ సేవింతు నిత్యమ్ముగా !!! "
----
:
బాహుబలి రూప!వాగీశ!ఫల్గుణ సఖ!
పతితపావన!లక్ష్మణ ప్రాణదాత!
రామకార్య ఫలీకృత!రాక్షసారి!
అతులితబలధామ!హనుమ!ఆంజనేయ!
రచన: శనగల చంద్రశేఖర్
: స్వామి హనుమ!నినుదలచువారికెపుడు
గలుగవు భయములు,తొలగుకష్టమంత
భక్తితోడపిలువనిన్ను పరవశించి
అభయహస్తమందించెదవాంజనేయ!
రచన:శనగల చంద్రశేఖర్
: యం ధర్మమాచరత్ స్వామీ
రామరూపేణ జీవనే!
కృష్ణరూపధరోవిష్ణు
రబోధయత్తమేవహి!!
ధర్మమేమి ధరను తానాచరించెను
రాముడగుచుసుగుణ ధాముడగుచు
తెలియజెప్పెనదియె తెల్లముగ ప్రజకు
కృష్ణరూపమంది విష్ణుమూర్తి
ఆ.
దన్ను లేక యున్న ధరను సమర్థుండు
తెన్ను దొరకకున్న దీక్షపరుడు
మిన్ను మీద పడిన మేటి లక్ష్య విభుండు
వెన్నుచూపరెపుడు చిన్న సూరి
: ||శ్రీమాత్రేనమః || దేవీదాస శర్మ
" అళి ఝoకారపు నూపురధ్వనులతో నందాల బాలేందు మం
జుల రేఖా విలసత్కిరీట రుచితో , శూలాది సంపత్తితో
జిలుగుంబచ్చల కంకణ క్వణలతో , చిర్నవ్వు ముత్యాలతో
వెలుగుల్విచ్చిన దివ్య దీధితులతో వేణూదిత శ్రీలతో !
----------
కరుణా కల్పిత మందహాసములతో కంపించు హారాళితో
స్ఫురదిందీవర లోచనచ్చవులతో , సొంపారు భృంగాల ముం
గురు లుయ్యాలల నూగు నీలిమలతో , గోమైన నెమ్మోముతో
శరదిందు ప్రతిమాన భావలహరీ సామ్రాజ్య భారమ్ముతో !
: *నేటిమంచిమాట* *చక్రవర్తి*
ఆవె.
పత్రికాధిపతులు పార్టీలలోఁజేర
ప్రోచికోలె ప్రగతి సూచియగును.
భాయి భాయి యయినఁ బత్రికల్ -పార్టీలు
గుండకమ్మె ప్రజల తిండియగును
శ్రీరామ స్తుతి🙏
సీ. నీలమేఘశ్యామ ! నినుగన మది నెంతు
కాన రావేమయ్య కామితార్థ !
సంస్తుతి కెక్కిన చక్కని నీ నామ
మనయమ్ము దలతును మనమునందు
మునులు నీనామమ్ము ముదముగ కీర్తించి
బడసిరి ముక్తిని పరమపురుష !
వలదు పరాకయ్య పరమాత్మ ! రఘురామ !
భక్తులన్ బ్రోవు మో భవ్యచరిత !
తే. పాపసంహార ! రఘువరా ! బవరవీర !
ధర్మమార్గాననడచిన ధన్యచరిత !
జానకిరమణ ! శ్రీరామ ! శరణు శరణు !
దశరథాత్మజ ! రఘురామ ! ధర్మతేజ !
జయలక్ష్మి
:
*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!
17కం.
లీలలు చేసెడి భవుడా
శూలాయుధులైన రుద్ర శూరాళులతో!
ఏలా సైచుట వానిన్!
కాలుని నిజభటులవోలె కడతేర్చుడికన్!!
భావము:అనేకవింతలు చేసే పరమశివుడు శూలములు ధరించిన తన రుద్ర గణములతో వానియెడ నోర్పును వీడి యమకింకరులవలె వానిని చంపివేయుడు అని పలికెను.
[06/08, 6:59 am] +91 93475 37635: నిత్యపద్య నైవేద్యం-1571 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-206. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
జగ్రాహ్య సాధ్యం ఋగ్వేదాద్
సామజ్యో గీతమే వచ:l
యజుర్వేదాదభినయాన్
రసానే అధర్వణాపిll
తేటగీతి:
విశ్వసాహిత్య సుధను ఋగ్వేదమిచ్చు
విమల సంగీతమును సామవేదమిచ్చు
విపుల నటనను యజుర్వేదమిచ్చు
వివిధ రసము లధర్వణ వేదమిచ్చు.
భావం: ఋగ్వేదం నుండి సాహిత్యం అనగా మాటలు, పాటలు,పద్యాల లాంటివి, సామవేదం నుండి సంగీతం అనగా గానం, నేపథ్య సంగీతం లాంటివి, యజుర్వేదం నుండి చతుర్విధాభినయం అనగా ఆహార్యం, ఆంగికం, వాచికం, సాత్వికం లాంటివి, అధర్వణ వేదం నుండి శృంగార వీర రౌద్రాది నవరసాలు గ్రహించి విలసిల్లిందే నాటకం. కనుకనే నాటకం పంచమ వేదంగా పరిగణించబడుతోంది.
:
*వేణుగోపాల శతకం*
-గుడిసేవ విష్ణు ప్రసాద్.
9441149608.
12.
స్వప్నమందుననీవుకల్పనాస్వప్నమీవు
జాగరణమీవు జాగ్రత-జాగృతీవు
సుఖపునిద్రయునునీవు-సుషుప్తినీవుపతిత పావన!వేణుగోపాలదేవ!!
: *శ్రీకృష్ణ స్తుతి*
40)
వన్దేహ్యపారకరుణారసకృష్ణమూర్తిమ్।
వన్దే రమాధవ పరాత్పర రుక్మిణీశమ్।
వన్దే యశోగుణముఖాన్విత వీరబాలమ్।
వన్దే జగద్గురుపదాంచిత పాదపద్మమ్।
గురు చరణాంబుజా ధ్యాయీ
విజయ కుమార శర్మా
✍️విమల శ్రీ
:
మార్పుతో
పాహి మాం పరమేశ !
( పరమేశ వృత్తము - స న జ భ గ గా పదవ అక్షరము యతి.)
గిరిజాముఖకమలార్క ! ఖేచరపూజ్యా !
స్మరమర్దన శశిభూష ! సాంబ ! గిరీశా !
కరిచర్మధర ! కపర్ది ! కాలిమకంఠా !
సిరులిమ్ము పురనాశక ! శ్రీ పరమేశా !.. 1
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,
ధర్మపురి
శ్రిత భక్త క
:
దండక గర్భస్థ సీసము.
👇🏼
శ్రీయాంజనేయా! విశేషప్రభావా! నినున్ నమ్మితిన్ గాంచు నన్ను నీవు,
నీతోడు నాకున్న నే రామునిన్ గొల్చి నిత్యత్వమున్ బొంది నిశ్చయముగ,
శ్రీరామ భక్తిన్ ప్రసిద్ధంబటంచున్ రచింతున్ కవిత్వంబు చిత్రగతిని,
శ్రీరాముఁడున్ సీత చిత్తంబునందుండ నేరంబులన్ జేయ నేరనేను,
తే.గీ. భక్తి యన్నను నీదయ్య భజన జరుగు
చోటులందుందువెప్పుడున్ జొక్కి యచట,
నీదు కృపఁ జూపి నాపైన నిర్మమగు
భక్తినే గొల్పు నాలోన, ముక్తినిడగ.
సీసమునందలి దండకము.
శ్రీయాంజనేయా! విశేషప్రభావా! నినున్ నమ్మితిన్ గాంచు, నీతోడు నాకున్న నే రామునిన్ గొల్చి నిత్యత్వమున్ బొంది శ్రీరామ భక్తిన్ ప్రసిద్ధంబటంచున్ రచింతున్ కవిత్వంబు, శ్రీరాముఁడున్ సీత చిత్తంబునందుండ నేరంబులన్ జేయ నేరనే.
🙏🏼
చింతా రామకృష్ణారావు.
!
----
" కం.
--
శ్రీమాతంగముఖానుజ
కౌమారీనాథపుత్ర కావుము మమ్మున్
మామకశరణమునీవే
సోమోపమముఖ సతతము 'సుబ్రహ్మణ్యా' !!! "
----
:
భగవంతుడు
-------------------
సీ||
జాబిల్లి విసిరిన జలతారు వెన్నెల
వన్నె తగ్గినదన్న చిన్నె
లేక;
కొమ్మలో కూసెడు కోయిలమ్మకు గొంతు
రాపిడి యనుమాట
చూపబోక;
కనుచూపు మేరగా కనిపించు గగనమ్ము
కొంచెమ్మునైన
కుంచించనీక;
కెరటాల యుద్ధృతి కెరలుచు నున్నట్టి
కడలి
గాంభీర్యమ్ము
సడలనీక;
తే.గీ||
వేయి విధముల విలసిల్లు విశ్వమంత
కుంటువడకుండ నడిపించు నొంటిగాడు!
క్షణము విశ్రాంతి నెఱుగని స్వామి యనుచు
చోద్యమును గాంచి మనసార జోతలిడుదు!
--------కోడూరి శేషఫణి శర్మ
:
*ఛేకానుప్రాస తో చంద్రలేఖా వృత్తము లో శ్రావణం లో లక్ష్మీ స్తుతి*
శ్రుత్వా శ్రుత్వా కథానాం లీలాగుణాన్ శ్రావణీ శ్రీః।
ధ్యాత్వా ధ్యాత్వా గుహాయాం హృత్పద్మ పీఠే తవాంఘ్రిమ్।
మత్వా మత్వా కవిత్వం సంస్తుత్యగీతమ్ కృతోస్మి।
హృత్వా హృత్వా మదీయ క్లేశాన్ చ నిష్ఠాం తనోతు ।
గురు చరణాంబుజా ధ్యాయీ
విజయ కుమార శర్మా
✍️ విమల శ్రీ
:
కిశోర వాణి
-----------
ఉన్న దానితోడఁనూరకుండుట లెస్స
యాసపడిన కుక్క మోసపోయె;
నీటి నీడఁగాంచి నోటి మాంసపు ముక్క
కుడువలేక తుదకు కోలుపోయె......
: మహిళలు... మంగళగౌరులు
సీ..
భరతావనికె చెల్లు పరమపావన దృక్ప
థ సుపర్వ రీతులున్ ధార్మికములు తిథివారనక్షత్ర దినములామాసముల్
దివ్యములున్ మరి భవ్యదములు
మానవజన్మను నానాల్గు పురుషార్ధ
ములె సార్ధకపరుప ముఖ్యమెంచ
మహిళామణులునెల్ల మంగళ గౌరులై
తాదాత్మ్యభావనన్ తపమదెంచి
తేగీ...
కూడి నోములు నోచునో కొదువలేక
సకలసౌభాగ్యములునంద జరుపుచుండు
పసిడి కాంతులు భద్రముల్ పరగనింట
లక్ష్మి బిల్చుచు గొల్తురు లలనలెల్ల...
తొలి శ్రావణ మంగళవారం....శుభవేళ..
రాయప్రోలు జగదీశచంద్రశర్మ. తెనాలి
విశ్వామిత్ర మహర్షి రాముని తన వెంట పంపమనగా దశరథుడు మాట్లాడిన సందర్భం
తేటగీతి మాలిక
దశరథుడుపల్కె మునితోడ ధైన్యముగను
పాలుగారు మోమున పసిబాలు డితడు
అడవిపాలును చేయంగ తడుము చుంటి
నాదు లోపాలు మన్నించి నమ్ము దేవ !
నాకు కన్నుల దీపాలు నాదుసుతులు
జయలక్ష్మి పిరాట్ల
,
:
||గతకాల స్మరణ ||. దేవీదాస శర్మ
స్వస్త్యస్తు విశ్వవిశ్వంభరా ధారణో
ద్దామ దక్షిణభుజా స్తంభ నీకు
విజయోస్తుసకలపృద్వీపాల మస్తక
న్యస్త ప్రశస్త పాదాబ్జనీకు
శ్రీరస్తుప్రాక్ప్రతీచీసముద్రాంతస్థ
నాయకార్పిత భాగధేయ నీకు
నిర్విఘ్నమస్తువాణీప్రసాదాపూర్వ
కవితామహా చమత్కారి నీకు
నిత్యకళ్యాణమస్తు మానిత బుధాగ్ర
హారసంతతనహనశోభాఢ్యకంధ
రా వినమ్ర కర్ణాటక సామ్రాజ్య పద్మి
నీ వికస్వర హృదయాది నేత నీకు:
మ॥
గతకాలమ్మది జ్ఞప్తిఁ బొంద నుపయోగమ్మేది యిక్కాలమున్
స్తుతనీయమ్ముగుఁ గొన్ని సార్లు మరి యస్తోకానందమై నిల్చెడిన్
గతముందల్వఁ భీతిగొల్పు నొకచో కాఠిన్యదుఃఖావళిన్
ధృతితో నెగ్గగఁ జింతఁ జేయవలెఁ బ్రీతిం బొంద రాగాలమున్
*~శ్రీశర్మద*
: ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
శ్లో. హరణం చ పరస్వానాం - పరదారాభిమర్శనమ్ |
సుహృదశ్చ పరిత్యాగః - త్రయో దోషాః క్షయావహాః ||
(మహాభారతం)
కం. ఇతరులసొమ్మును దోచుట,
యితరుల స్త్రీలను చెరచుట,
నుతుఁడగు మిత్రుని విడుచుట,
క్షితిపైన వినాశ మొసగు, కీడును గొలుపున్.
భావము. ఇతరుల ఆస్తిని అపహరించడం, ఇతరుల భార్యలను రెచ్చగొట్టడం, స్నేహితులను విడిచిపెట్టడం - ఇవి మూడు పూర్తిగా నాశనం చేసే దోషాలు.
అమ్మదయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
చంద్రలేఖా వృత్తము లో
*చంద్రలేఖా వృత్తము లో చేస్తూన్న శ్రావణ లక్ష్మీ స్తుతి*
చిన్తాదూరజ్ఞచిత్తా చంద్రానుజా శ్రావణీ శ్రీః ।
ఇష్టాష్టైశ్వర్యరూపా శ్రీరాగరాగాలయా మా।
క్షీరాబ్ధేఃపౌర్ణిమాయాం సంజాత సౌదామినీ శ్రీః।
సా మాం పాయాత్ కటాక్షైః సౌభాగ్య భాగ్యోదయశ్రీః ।
గురు చరణాంబుజాధ్యాయీ
విజయ కుమార శర్మా
✍️విమల శ్రీ
అర్చనచేయలేను
అర్చనచేయలేనుఘనమైనవిమొక్కులుమొక్కలేనునీ
చర్చలఁబాలుపంచుకొనశాస్త్రములేవియునాకురావునీ
గూర్చినిరంతరంబుగనుకూరిమితోడజపంబుచేయుచున్
మార్చుకొనంగజూచెదనుమానసమందునిరాశనీశ్వరా
తపస్వివిజయవాడ
మంచి మాట
నేటి మంచి మాట
1) దగ్గరై బాధించేది ద్వేషం,దూరమై బాదించేది రాగం, ఈ రెండింటి మధ్య దొర్లిపోయే బ్రతుకు చెంతకు అడుగడుగునా దెబ్బలే.
2) గాలి నిచ్చేది తరువు,జాలి చూపేది గురువు,ఆశించదు దేనినీ తరువు, ఆశలెరగని వాడు గురువు.తరువు నీడ నిస్తే గురువు శ్రమిస్తూ చల్లని సుఖాన్ని పంచేవాడు గురువు.
3) చేత కాలేదు అని చింతంచకు, చేయూత నిమ్మని పరమాత్మని ప్రార్థించు, వేదనలకు స్వస్తి చెప్పు,బ్రతుకుని నివేదనగా మార్చుకో.
4) కాలాన్ని వాడుకోవాలే గానీ కాలంతో ఆడుకోకూడదు. వాడుకలో వుంది వేడుక.
5) ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులు తో సమానం.ఇప్పుడు పుస్తక పఠనం లేదు అనుకోండి.
శ్లోకం
👆శ్లోకం
వేద్యో వైద్యః సదాయోగీ
వీరహా మాధవో మధుః | అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
ప్రతిపదార్ధ:
వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
అతీంద్రయ: - ఇంద్రియములద్వార గ్రహించుటకు వీలులేనివాడు.
మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.
మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.
పంచాంగం 08.08.2024
ఈ రోజు పంచాంగం 08.08.2024 Thursday.
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాస శుక్ల పక్ష చతుర్ధి తిధి బృహస్పతి వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం శివ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.
చవితి రాత్రి 12:37 వరకు.
ఉత్తరఫల్గుని రాత్రి 11:34 వరకు.
సూర్యోదయం : 06:01
సూర్యాస్తమయం : 06:42
వర్జ్యం : తెల్లవారుఝామున 04:38 నుండి ఉదయం 06:26 వరకు.
దుర్ముహూర్తం : పగలు 10:15 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:19 నుండి 04:10 వరకు.
అమృతఘడియలు : మధ్యాహ్నం 03:27 నుండి సాయంత్రం 05:15 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
దేవాలయాలు - పూజలు 4*
*దేవాలయాలు - పూజలు 4*
సభ్యులకు నమస్కారములు.
ఇష్ట దేవతలను దర్శించడానికి, *భక్తి మరియు ధ్యాన పూర్వకంగా* పూజలు మరియు *భగవదవతార విశేషాల కీర్తనలకు సంబంధించి* భజనలు చేయడానికి దేవాలయాలకు వెళ్ళడం మన సంప్రదాయం. గత వ్యాసాలలో తెలుసుకున్నట్లుగా మన పూర్వీకులు *నిర్దేశిత ప్రాంతాలలోనే* దేవాలయ నిర్మాణాలకు ఉపక్రమించేవారు. కాని ప్రస్తుత కాలంలో భక్తి భావన పెరిగి నేతలు, దాతలు ముందుకు వచ్చి భక్తి ప్రపత్తులతో తమ తమ ప్రాంతాలలో వివిధ దేవాలయాలను నిర్మిస్తున్నారు. భగవత్ తత్వాన్ని తమ అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. అదే విధంగా ప్రఖ్యాత దేవాలయ సంస్థల వారు మరియు పీఠాధిపతులు గూడా తమ ఇష్ట దేవతా మూర్తుల ఆలయాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. *ప్రధాన దేవాలయ ప్రాంగణంలోనే వివిధ దేవీ దేవతల ఉప దేవాలయ సముదాయాలు గూడా ఉంటున్నవి*
ప్రతి రోజు దేవాలయం వెళ్లి పూజలు చేసే వారు అరుదనే చెప్పాలి. అవుతే వారానికి ఒకసారైనా దేవాలయానికి వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చును. హిందు మతారాధకులలో వేర్వేరు దేవుళ్ళను నమ్మేవాళ్ళు ఉంటారు. *పూజలలో రెండు ప్రమాణములు*.
1) భగవత్ పూజలు
2) క్షుద్ర పూజలు.
ఈ వ్యాసావళిలో *భగవత్ పూజల గురించి మాత్రమే తెలుసుకుందాము*.
ముందుగా పూజలు ఎందుకు చేయాలి అను అంశమును పరిశీలిద్దాము. పూజల వలన మానవులలో భక్తి ప్రపత్తులు (శ్రద్ధ) వర్ధిల్లి దేవుడి యందు ఏకాగ్రత బలపడుతుంది. ఏకాగ్రత వలన సంకల్ప బలం, మనో దృఢత్వం, ప్రశాంత లభిస్తాయి.
దేవాలయాలలో ప్రతిష్టింపబడిన *మంత్రశక్తి*, *యంత్రశక్తి* మరియు *తంత్ర శక్తి* ని
(శిల్ప నిర్మాణ సౌందర్యం, మంత్రానుగుణమైన ధూపదీప క్రియాకలాప *ముద్రల శక్తి*, తీర్థం, శఠగోపం మరియు ప్రసాదాలదైవత్వ శక్తి ని భక్తులు ఆస్వాదిస్తూంటారు.
హిందూ దేవాలయాలను రెండుగా విభజింవచ్చని తెలుసుకున్నాము.
1) గ్రామ దేవతా గుడులు.
2) శిష్టాచార దేవాలయాలు. హిందూ సంప్రదాయంలో *ముక్కోటి దేవతలు* అని శాస్త్ర వాక్యము. దేవుడొక్కడే కదా ఇంత మంది ఏల ? అని అన్యమతస్తుల / నాస్తికుల విమర్శలను గమనిస్తూనే ఉన్నాము. ఇందుకు ధీటైన సమాధానము ఋగ్వేదంలో లభిస్తున్నది.
ఋగ్వేద మంత్రము.
*ఇంద్ర మిత్రం వరుణమగ్ని మహురథో దివ్య సుపర్ణో గరుత్మాన్, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అగ్ని యమం మాత రిశ్వాన మాహు:*
అర్థం:- ఉన్నది ఒకే సత్ (శాశ్వతమైన సత్యం - పరమాత్మ). ఈ సత్యాన్నే విశేష ప్రజ్ఞ కలవారు...ఇంద్రుడని, మిత్రుడని, అగ్ని అని, దివ్యమైన పక్షాలు గల గరుత్మంతుడని, యముడని, వాయువని వర్ణిస్తూ ఉంటారు.
*ఒకే* పరమాత్మ *వివిధ శక్తుల వ్యక్తీకరణతో* వివిధ దేవతలుగా చెప్పబడుతున్నారు. ఏకత్వ వాదాన్ని ఋగ్వేదం స్పష్టం చేసింది. *బహు దేవతలు ఒకే పరమేశ్వరుని శక్తులు*. అందుకే భిన్నత్వంలో (అనేకత్వంలో) ఏకత్వాన్ని సమన్వయించే సంస్కృతి మనది.
*మాన్యులకు విజ్ఞప్తి*
*దేవాలయము - పూజలు* అను విషయముపై ధారావాహిక రచనా వ్యాసంగము బహు సున్నితమే గాక విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేశ్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.
*తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షేత్ జీవిత మాత్మనః*,
*ద్రవ్యాణి సంతతిశ్ఛైవ సర్వం భవతి జీవితః*
అర్థం :- సర్వకాల సర్వావస్థలలోనూ తన జీవితాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. బ్రతికి ఉంటేనే ద్రవ్యాలు, సంతానం మరియు ఏదైనా పొందే అవకాశం ఉంటుంది. = ఉపద్రవాలు రాక ముందే మేల్కోవాలి.
ధన్యవాదములు
*(సశేషం)*
కర్మణ్యేవాధికారస్తే
🙏
*శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా అంటున్నారు.*
శ్లో//కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన/
మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగో౽స్త్వకర్మణి// (భగవద్గీత అ.2.శ్లో 47).
*ఈ శ్లోకము, దీనికి సంబంధించిన ఇతర శ్లోకముల సారాంశము ఇది:*
*నీకు కర్మలు చేయుటయందే అధికారము ఉన్నది కానీ ఆ కర్మఫలముల యందు అధికారము లేదు.*
ఒక కర్మ ఫలించుటకు,
పంచభూతములు,
కాలము,
జీవుడు,
శరీరనిర్మాణము,
ఐదు జ్ఞానేంద్రియాలు,
ఐదు కర్మేంద్రియాలు,
బుద్ధి, మనస్సు,ప్రాణాపానాది పంచ వాయువులు,వాటి చేష్టలు,
దైవము అనబడే ఇంద్రియాధిష్ఠాన దేవతలు,
మొదలైన అనేక విషయములు కారణభూతములు అవుతాయి.
ఆ విధంగా కర్మఫలములు నీ ఆధీనంలో లేవు కాబట్టి, ఫలితములు ఆశించి కర్మ చేయవద్దు. ఫలితములయందు ఆశ ఉంటే ఆ కర్మఫలితములు లభించడానికి నీవు కూడా కారణం అయి,కర్మఫలములు అనుభవిచడానికి జన్మలు ఎత్తవలసి వస్తుంది.
కాబట్టి కర్మఫలములను ఆశించి, ఆ ఫలితములను అనుభవించుటకు నీవు కారణము గావలదు. ప్రకృతి ధర్మం వల్ల ఒక్క క్షణమైనా ఎవడూ కర్మ చెయ్యకుండా ఉండలేడు. జన్మ పునర్జన్మలను కలిగించే కర్మ బంధములనుండి విముక్తుడ వవటానికి ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యాలి. అందువల్ల కర్తవ్య కర్మలను చెయ్యకుండా సోమరిగా వుండాలనే బుద్ధి కూడా నీకు ఉండకూడదు). కర్మలు ఆచరించే విషయంలో పై బోధ మనకు మార్గదర్శకంగా ఉండాలి. ప్రజలు చేసిన పాపం, ప్రభుత్వానికి అంటే పాలకులకు సంక్రమిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ప్రజలు పాపకర్మలు చెయ్యకుండా,ధర్మమార్గంలో నడిచేటట్లు చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలలోను,పాలకులలోను పాపభీతి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్రస్తుతం పాపభీతి అనేది మృగ్యం అయిపోయింది.
కోరికలను తీర్చుకొనేందుకు, లేదా కష్టాలు వస్తే తొలగించుకొనేందుకు, గుళ్లు గోపురాలు చుట్టూ తిరగటం తప్ప, పాపభీతిగాని, భగవంతునియందు నిజమైన భక్తి శ్రద్ధలుగాని, చాలామందిలో లోపిస్తున్నాయి. దీనికి కారణం, పుణ్య, పాపాలు,జన్మ, పునర్జన్మలు,మొదలైనవాటిని గురించి ఏవో నోటిమాటలు చెప్పడం తప్ప,వాటిమీద దృఢమైన నమ్మకం ఎవరికీ లేక పోవడమే. మనం పోస్టులు పెట్టినంత మాత్రాన, లేదా ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు, పాలకులు మారుతారు అని మనం అనుకోనక్కర లేదు. మనం ఎవర్ని ఉద్ధరించడానికీ పుట్టలేదు. సత్యము, ధర్మములతో కూడిన సత్కర్మానుష్ఠానంద్వారా భగవంతుని అనుగ్రహం సంపాదించుకొని,
మానవజన్మను సార్ధకం చేసుకోటానికి జన్మించాము.
శక్తివంచన లేకుండా కృషి చెయ్యడం మాత్రమే మన కర్తవ్యం. ఫలితం భగవంతుడి చేతిలో ఉంది.
🕉️🙏