12, అక్టోబర్ 2022, బుధవారం

 ఢిల్లీ కి చెందిన ఓ వైద్యుడు మోకాలి కీళ్ల నొప్పుల నుండి వేలాది మంది రోగులను ఎలా నయం చేసి రక్షించాడో చూపిస్తున్నాడు ..! ఇప్పుడు అతని వీడియో వైరల్ అయ్యింది మరియు వేలాది మంది మోకాలి రోగులు ఈ క్లిప్ కోసం శోధిస్తున్నారు. కాబట్టి ఈ క్లిప్ చూడండి అతని ప్రతి మాట వినండి మరియు ఈ వ్యాయామం ప్రయత్నించండి లేదా మోకాలి నొప్పులు ఉన్నవారికి దీన్ని సూచించండి. చాలా మంది తమ వెన్నునొప్పి, మోకాలి నొప్పులు కేవలం 7 రోజుల్లోనే మాయమయ్యాయని పేర్కొన్నారు ....! గుర్తుంచుకోండి, మోకాలి కీలు మార్పిడి నిజమైన పరిష్కారం కాదు. ఇది మన ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే ఆహారం ఇస్తుంది.



గుండెపోటు

 ️ *గుండెపోటు* ️


 3000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో చాలా పెద్ద మహర్షి ఉండేవాడు.

 * అతని పేరు * * మహర్షి వాగ్వత్ జీ !!*


 *అతను ఒక పుస్తకం రాశాడు*

 * ఎవరి పేరు * * అష్టాంగ * * హృదయం !!*

 *(అస్తాంగ్ హృదయం)*


 *మరియు ఈ పుస్తకంలో అతను* *రోగాలను నయం చేయడానికి* *7000* * సూత్రాలు వ్రాసాడు!*

 *అందులో ఇది ఒకటి మాత్రమే!!*


 *వాగ్వత్ జీ వ్రాశారు, ఎప్పుడైనా గుండె చంపబడుతుందని!* *అంటే గుండె గొట్టాలలో అడ్డుపడటం మొదలవుతుంది!*


 అంటే రక్తంలో ఎసిడిటీ పెరిగిపోయిందని!

 *మీరు అసిడిటీని అర్థం చేసుకుంటారు!*

 *దీనినే ఇంగ్లీషులో అసిడిటీ అంటారు!!*

 అసిడిటీ రెండు రకాలు!


 *ఒకటి కడుపులోని ఆమ్లత్వం!*


 *మరియు ఒకటి రక్తం యొక్క ఆమ్లత్వం !!*


 * మీ కడుపులో ఆమ్లత్వం పెరిగినప్పుడు!* * అప్పుడు మీరు ఇలా చెబుతారు *

 ✔️* కడుపులో మంటగా ఉంది !!*

 ✔️*పులుపు పుల్లటి త్రేనుపు వస్తోంది!*

 ✔️*నోటి నుండి నీరు వస్తోంది!*

 *మరి ఈ ఎసిడిటీ మరింత పెరిగితే!*

 *కాబట్టి హైపర్‌యాసిడిటీ ఉంటుంది!*

 మరియు కడుపు యొక్క ఆమ్లత్వం పెరిగినప్పుడు మరియు రక్తంలోకి వచ్చినప్పుడు, అప్పుడు రక్తంలో ఆమ్లత్వం ఉంటుంది.

 * మరియు రక్తంలో ఆమ్లత్వం పెరిగినప్పుడు, ఈ ఆమ్ల రక్తం గుండె గొట్టాల నుండి బయటకు రాలేకపోతుంది!* * మరియు ట్యూబ్‌లలో అడ్డుపడుతుంది!*

 *అప్పుడే గుండెపోటు వస్తుంది!! అది లేకుండా గుండెపోటు వచ్చేది కాదు!!*

 * ఏ వైద్యుడూ చెప్పని ఆయుర్వేదంలోని అతి పెద్ద నిజం ఇదే!

 *ఎందుకంటే దీని చికిత్స చాలా సులభమైనది!!*


 *చికిత్స ఏమిటి ??


 *రక్తంలో అసిడిటీ పెరిగినప్పుడు వాగ్వట్ జీ రాసారు!* *అప్పుడు మీరు ఆల్కలీన్‌గా ఉండే వాటిని వాడండి!*

 *రెండు రకాల విషయాలు మీకు తెలుసా!*


 *ఆమ్ల మరియు ఆల్కలీన్!!*

 *ఆమ్ల మరియు ఆల్కలీన్*


 * ఇప్పుడు మీరు యాసిడ్ మరియు బేస్ కలిపితే ఏమవుతుంది! ,


 * మీరు యాసిడ్ మరియు ఆల్కలీన్ కలిపితే ఏమి జరుగుతుంది ?????**


 ️*తటస్థము*

‼️

 *అది అందరికి తెలిసిందే!!*


 *కాబట్టి వాగ్వట్ జీ రాశారు!* *రక్తంలో ఆమ్లత్వం పెరిగితే, క్షార పదార్థాలు తినండి!*

 *అప్పుడు రక్తం యొక్క ఆమ్లత్వం తటస్థంగా ఉంటుంది !!!*


 *రక్తంలోని ఆమ్లత్వం తటస్థంగా మారింది!*

 *కాబట్టి జీవితంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉండదు!!*


 *ఇదంతా కథ!!*


 ఇప్పుడు మీరు అడిగేవి ఏవి ఆల్కలీన్ మరియు మనం తినాలి ?????


 * మీ వంటగదిలో ఆల్కలీన్‌గా ఉండే ఇలాంటివి చాలా ఉన్నాయి!

*మరియు అది వచ్చినట్లయితే!*

 *మళ్లీ రాదు!!*


 *అత్యంత క్షార గుణాలున్నవి అన్నీ ఇంట్లో తేలిగ్గా దొరుకుతాయని మనందరికీ తెలుసు కనుక ఇది సొరకాయ!!*

 *దీనినే దూధి అని కూడా అంటారు!!*

 *ఇంగ్లీషులో బాటిల్ గార్డ్ అంటారు!!!*

 *మీరు కూరగాయగా తింటారు!* *ఇంతకంటే క్షారగుణం మరొకటి లేదు!*


 *కాబట్టి మీరు రోజూ సొరకాయ రసం తీసి తాగండి !!* *లేదా పచ్చి సొరకాయ తినండి !!*


 *రక్తంలోని అసిడిటీని తగ్గించే గొప్ప శక్తి సొరకాయకు ఉందని వాగ్వట్ జీ చెప్పారు. * *అప్పుడు మీరు చెంబు రసాన్ని తీసుకుంటారు !!*


 *ఎంత తినాలి?????????**


 *రోజుకు 200 నుండి 300 mg త్రాగండి!!*


 *మీరు ఎప్పుడు తాగుతారు?*


 * *ఉదయం ఖాళీ కడుపుతో (మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత) త్రాగవచ్చు !!* * లేదా అల్పాహారం అరగంట తర్వాత తాగవచ్చు !!*

 * మీరు ఈ సొరకాయ రసాన్ని మరింత ఆల్కలీన్‌గా చేయవచ్చు!*

 *దీనిలో 7 నుంచి 10 తులసి ఆకులు వేయండి * *తులసి చాలా ఆల్కలీన్!!* *దీనితో 7 నుంచి 10 పుదీనా ఆకులను కలపవచ్చు!* *పుదీనా కూడా చాలా క్షారమే!* *దీనితో మీరు బ్లాక్ సాల్ట్ లేదా సైన్ధవఉప్పు వేయండి!*

 *ఇది చాలా ఆల్కలీన్ కూడా!!*


 *అయితే గుర్తుంచుకో*

 * * ఉప్పు నలుపు లేదా రాయిని ఉంచండి !* * ఆ ఇతర అయోడైజ్డ్ ఉప్పును ఎప్పుడూ వేయవద్దు !!* * ఈ అయోడైజ్డ్ ఉప్పు ఆమ్లమైనది !!!!!*


 *కాబట్టి మిత్రులారా, మీరు తప్పకుండా ఈ సొరకాయ రసాన్ని తీసుకోవాలి !!*


 * 2 నుండి 3 నెలల వ్యవధిలో మీ హార్ట్ బ్లాక్‌లన్నింటినీ నయం చేస్తుంది !!*


 *21వ రోజు మీరు చాలా ఎఫెక్ట్‌ను చూడటం ప్రారంభిస్తారు!!!*


 *మీకు ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు!!*


 *దీనిని మన భారతదేశంలోని ఆయుర్వేదంతో ఇంట్లోనే చికిత్స చేస్తారు !!*


 *మరియు మీ విలువైన శరీరం మరియు లక్షల రూపాయలు ఆపరేషన్ నుండి ఆదా చేయబడతాయి !!*


 *మీరు పోస్ట్ మొత్తం చదివారు, చాలా ధన్యవాదాలు!!*


 * మీకు నచ్చితే, మీరు ఈ సమాచారాన్ని ఇతర వ్యక్తులందరికీ పంపాలి.*



 *కనీసం ఐదు గ్రూపులు పంపాలి*

 *కొందరు పంపరు*

 *అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను*

కాలం

 శ్లోకం:  కాలం


న కాలస్యాస్తి బంధుత్వం న హేతుర్న పరాక్రమః | న మిత్రజ్ఞాతి సంబంధః కారణం నాత్మనో వశః ॥


భావం: "కాలానికి బంధుత్వ మిత్రత్వ జ్ఞాతి సంబంధ భావాలు ఉండవు. ఎవరి అధికారమైనా, అహంకారమైన, పరాక్రమమైనా కాలం ముందు వ్యర్థమే. ఇసుకతో ఎంత ఎత్తు కట్ట కట్టినా జలప్రవాహవేగానికి కూలిపోవునట్లుగానే, మహాపరాక్రమ సంపన్నులు, బలశాలురు, సర్వశాస్త్ర పారంగతులు కూడా కాలపాశబద్ధులై నశించక తప్పదు. కాలము ఇతరుల పరాక్రమాలకు వశం కాదు." అని సుగ్రీవుడికి రాముడు చెప్పాడు. కాలంయొక్క వ్యుత్పత్తి: కలనాత్ కాలః ;


కలయత ఇతి కాలః కలనం అంటే గణనం. అన్నిటినీ, అన్ని లోకాలనీ, సమస్త జీవులనీ లెక్క పెట్టుకుంటూ కబళించి తనలో కలపుకుంటూ పోయేది కాలంట!


1 5:19 am

కథ

: 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 *🌷నాకు నచ్చిన శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ🌷*

                  🌷🌷🌷

పుత్రోత్సాహం( పాతకథే🙂)


"అమ్మా ! నువ్వు ఇలా నిర్లిప్తంగా కూర్చుని ...నీ ప్రమేయం లేదు అన్నట్టుంటే ...నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు! నాన్నలేని లోటు పూరించడం కష్టమే కానీ ,నీ మౌనం భరించడం ఇంకా కష్టంగా ఉంది !అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏదైనామిస్ అయ్యామేమోనని మనసు పీకుతోంది. 12వ రోజు సమారాధన కోసం నాన్నకు ఇష్టమైన ఐటమ్స్ కొన్నిపురమాయించాను! నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్తే నాకు బాగుంటుంది!....".... కొడుకు సురేంద్ర మాటలకు దీర్ఘంగానిట్టూర్చింది వర్ధని!


" నాకేం తెలుసురా ఏం చెప్పాలో !ఇన్నాళ్లు నాన్న ఏది చెప్తే అదే మనం చేసాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పోయినాఆయన ఇష్టాయిష్టాలు ఇంకా నువ్వు గౌరవిస్తున్నావ్ అంటే ,అది మా పూర్వజన్మ సుకృతం! నీకు ఏది బాగుంది అంటేఅదే చెయ్యి నాయనా!"


" ఆయనతోనే నా జీవితం అయిపోయింది. 45 ఏళ్ల దాంపత్యంలో చిన్నపిల్లలా ఆయన చిటికెన వేలు పట్టుకునితిరుగుతూనే ఉన్నాను. ఆయన ఏది మంచిది అంటే అదే చేశాను. నాకంటూ ప్రాథమ్యాలు ,ప్రాధాన్యతలు ఉంటాయనికూడా నాకు తెలియదు !సుమంగళి గా ఉండాలని పూజలు చేశాను ,నోములు నోచాను. ఇహ ఆ భాగ్యములేకుండాపోతోంది !నన్ను బోడమ్మను చేసి ఇంట్లో కూర్చో పెడతారు! ".. ‌ ఆఖరి మాటలు అంటుంటే దుఃఖం తన్నుకొచ్చిందివర్ధనికి! 


తల్లి మాటలకు కలతచెంది ఆర్ద్రతతో ఆమె తలను తన చేతులతో చుట్టి, గుండెకు పొదువుకున్నాడు కొడుకు! " నాన్నలేకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా నీకు !నేను అన్నీ చూసుకుంటాను !బెంగ పడకు!"... అంటూ మాటిచ్చాడు సురేంద్ర!


బంధుమిత్రులు ,ఇరుగుపొరుగు లు ఎంత ముఖం చిట్లించినా... తన తల్లి తన మంగళ చిహ్నాలను తీయడం లేదనిసుస్పష్టం చేశాడు!. ఎందుకో ఆమెకే మనసొప్పక మంగళసూత్రాలు ,నల్లపూసలు ,మట్టెలు తీసేసింది వర్ధని! 


తల్లిని దర్జాగా తీసుకువచ్చి తండ్రి కూర్చునే సోఫా లో కూర్చోబెట్టాడు సురేంద్ర! వచ్చినవారు చేసేదిలేక కాస్త జీలకర్ర నోట్లోవేసుకుని ,ఆమెను పలకరించి భోజనాలకు లేచారు! 


సురేంద్ర అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ గా ప్రభుత్వంలో లో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతనితో పనులు చేయించుకున్న వారు,పనులు ఉన్నవారు ,ఉపకారాలు పొందినవారు అతని దృష్టిలో పడడానికి...ఇదో ఒక మంచి అవకాశంగా భావించారు! బస్తాలతో కూరలు బుట్టల తో పళ్ళు డబ్బాలతో నేతి స్వీట్లు, మిఠాయిలు,

కేన్ల కొద్దీ పాలు ,పెరుగు లు ,నెయ్యి లు, బస్తాలతో బియ్యం ,అపరాలు ఒక్కటేమిటి అవసరానికి మించి వంద రెట్లు తెచ్చిపడేసారు ఇంటినిండా! ఎవరేంటి తెచ్చినా కాదనలేదు సురేంద్ర! పరోక్షంగా అవి కొందరు అసహాయుల పోషణార్ధం పనికి వస్తాయనుకున్నాడు! 


     దాన ధర్మాలు ,బ్రాహ్మణ దక్షిణలు ...భూరిగా ఇచ్చుకుని...నలుగురు ‘ఆహా ‘అని అనుకునే లాగా పూర్తిచేశాడు పితృకార్యాన్ని సురేంద్ర! ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా సంతర్పణ భోజనం చేశారు! మరో వెయ్యిమందికి వండించి, శివార్లలో ఉన్న వృద్ధాశ్రమాలకు పంపించాడు సురేంద్ర! మిగిలిన సామానులు...కొంత విరాళం జోడించి..‌పిల్లలహోమ్ కు పంపేసాడు! 


     


రెండు రోజుల్లో ...బంధువుల నిష్క్రమణతో... ఇల్లు ఖాళీ అయిపోయింది! సెలవు అయిపోవడంతో కూతురు ఢిల్లీకిప్రయాణం కట్టింది! వెళ్లేముందు పదేపదే తల్లి చుట్టూ తిరుగుతూ..." నాన్న నా గురించి ఏదైనా చెప్పారా ?నువ్వుచెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ.. ".. అంటూ అన్యాపదేశంగా ఏదో అడగాలని అని ప్రయత్నిస్తోంది! తల్లిని తనతోరమ్మని అడిగే ధైర్యం ఆమె చేయలేకపోతోంది! ఆ మహానగరంలో తల్లికి అదనపు సౌకర్యాలు కలగజేసే పరిస్థితులుఆమెకు ప్రస్తుతం లేవు! పైగా కొండంతా కొడుకు అండ వదిలి తల్లి తనతో వస్తుందన్న ఆశ కూడా ,ఆమెకు లేదు! 


వర్ధనికి కూతురు ఆంతర్యం అర్థమయ్యింది! కోడల్ని పిలిచింది! " స్వర్ణా! లాకర్ లో ఉన్న నా బంగారాన్ని నువ్వు సగంతీసుకుని , మిగిలిన సగం మీ ఆడపడుచు కియ్యి".. ‌ అంటూ బ్యాంకు లాకరు తాళం కోడలు చేతిలో పెట్టింది! " బంగారంలో సగమే అంటే.. ఈ ఇంట్లో కూడా నాకు సగం ఇచ్చి తీరాలి".... అంటూ... మొహం గంటు పెట్టుకుంది కూతురుధరణి! 


వర్థని జవాబిచ్చే లోగానే, సురేంద్ర అక్కడ ప్రత్యక్షమయ్యాడు! స్వర్ణా! అమ్మ కు తాళం ఇచ్చేసేయ్! ధరణి! అమ్మ ఇప్పుడుబంగారం పంచేసేది ఏమీ లేదు! అవన్నీ అమ్మకు కావాలి! నాన్న పోవడంతో, అమ్మ జీవితమేమీ ముగిసిపోలేదు! ముందు ముందు... తన చేతుల మీద జరగాల్సిన శుభకార్యాలు ఉన్నాయి! ఈ ఇల్లు కానీ, ఈ నగలు కానీ ...అమ్మ తనచివరి క్షణం వరకు అనుభవించి ..తన తదనంతరం ఆమె కోరుకున్న వారికి ఇచ్చే హక్కు... పూర్తిగా తనదే! ఢిల్లీలో నీ ఫ్లాట్కోసం పదేళ్ల క్రితమే డబ్బు తీసుకున్నావు! ప్రస్తుతం అమ్మకు మిగిలి ఉన్న ఈ కాస్త ఆస్తి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు! ఇంటి ఆడపిల్లగా నీకు న్యాయమే చేస్తాం! నీ పుట్టింటి మీద నీకున్న హక్కులన్నీ అలాగే భద్రంగా ఉంటాయి! ఆనందంగావస్తూ పోతూ... పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళు! అమ్మని మాత్రం బాధ పెట్టొద్దు ఏవిధంగాను!".... కాస్త గట్టిగాచెప్పాడు సురేంద్ర! 


పక్క గదిలో పెట్టెలు సర్దుకుంటున్న అల్లుడికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి! వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు... సురేంద్ర ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసాడో, ఎంత ఆత్మీయంగా తల్లినీ, ఇతర బంధువులనూ ఆదరిస్తున్నాడో! తల్లి పట్లసురేంద్ర చూపిస్తున్న ప్రేమ... తన నిబద్ధతను నిలదీసినట్టు గా అనిపించింది అల్లుడికి! 


ఉద్యోగంలోనూ ,హోదా లోను ,ఆస్తి లోనూ సురేంద్ర కు ఏ మాత్రం తక్కువ కాదు తను! కానీ ,తండ్రి పోయినపుడుఅపరకర్మలన్నీ “ మమ” అనిపించి, గయలో పిండం పెట్టి చేతులు దులుపుకున్నాడు! ఒక్కగానొక్క కొడుకు గా తన తల్లినిఆదరించక పోగా, అన్ని వసతులు ఉన్న రిటైర్మెంట్ హోమ్ లో పెట్టి తన బాధ్యత తీరింది అనుకుంటున్నాడు! భార్య చేతిలోతోలు బొమ్మలా ఆడుతూ తల్లిని దూరం చేసుకున్నాడు తను! 


ఈరోజు సురేంద్ర మాటలు వింటుంటే, అతనిలో..మాతృ వాత్సల్యం నిద్ర లేచింది !ఏదో దిశానిర్దేశం జరిగినట్లుఅనిపించింది! 


దిగ్గున లేచి పక్క గదిలోకి వెళ్ళాడు! సురేంద్ర భుజంమీద స్నేహంగా చేతితో తట్టి ,” సురేంద్ర నువ్వు చెప్పింది అక్షరాలనిజం !నీ లాంటి కొడుకు ఉంటే ,ఏ తల్లి అయినా భర్త లేకపోయినా...నిబ్బరంగా గుండెల మీద చెయ్యి వేసుకునిబ్రతకగలదు! చెప్పాలంటే ధరణికి ఏమి లోటు లేదు! ఇలా తండ్రి పోయిన వెంటనే పుట్టింట్లో తన హక్కులనుసాధించుకోవడం అంత మంచి పని కాదు! తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను! అత్తయ్య గారు! మీరు ఎలాంటిబెంగ పెట్టుకోకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండండి !మేము ప్రతి రోజు మీతో మాట్లాడుతూ ఉంటాం! ఏ అవసరం వచ్చినా,ధరణి మీకు సహాయం గా వస్తుంది !ఇది నా మాటగా తీసుకోండి!".. ‌‌ మనసు నిండుగా, ఆదరంగా మాట్లాడిన అల్లుడినిచూసి చాలా నిశ్చింతగా అనిపించింది వర్ధనికి! 


మర్నాటి కల్లా ధరణి వెళ్ళిపోయింది! తల్లికి... తమ ఇంట్లో ..గాలి ,వెలుతురు ధారాళంగా వచ్చేటటువంటి ..మంచిగదినిఅన్ని సౌకర్యాలతో... తయారుగా ఉంచమని ...స్వర్ణను, పిల్లలను ఇంటికి పంపేసాడు సురేంద్ర! తల్లి కొడుకుల మాత్రమేమిగిలారు ఆఇంట్లో! ఆ రాత్రంతా తండ్రి స్మృతులను తల్లి తో వల్లె వేశాడు సురేంద్ర! మౌన శ్రోతగా అన్నీ వింటూకూర్చుంది వర్ధని! ఆ స్మృతులలో వీలయినన్ని మంచివే ఏరి మాట్లాడుతూ, ఎన్నో చేదుజ్ఞాపకాల ప్రసక్తే తేని కొడుకుసంస్కారానికి ముగ్దురాలయింది ఆమె! 


    ఆమె మరో ప్రస్థానం లో మొదటి ఉషోదయం అయ్యింది! ఆరింటికి తల్లి ఇచ్చిన కాఫీ తాగి....


" అమ్మా! కావలసినవన్నీ సర్దేసు కొన్నావు కదా! మరో గంటలో బయలుదేరాలిమనం! ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనాఆఫీస్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది! "... అన్నాడు సురేంద్ర! 


కొన్ని క్షణాల మౌనం తరువాత...." నేను కొన్నాళ్ళు ఇక్కడే , మన ఇంట్లో ఉందామని అనుకుంటున్నానురా! ఇల్లుపాడుపెట్టడం నాకు ఇష్టం లేదు"... తడబడుతూ చెప్పింది వర్ధని కొడుకుతో! 


" ఇల్లేమీ పాడవదు అమ్మా!పని వాళ్ళని పంపి బాగు చేయిస్తూ ఉంటాను! నువ్వు ఒక్కతివే ఒంటరిగా ఇక్కడ ఉండలేవు !నాన్న జ్ఞాపకాలు నిన్ను వదలవు !నువ్వు మాతో ఉండడమే సరి !నాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది!"...అన్నాడుసురేంద్ర! 


" లేదు నాన్నా.. నన్ను అర్థం చేసుకో! నేను ఉండగలను! కొత్తమార్పులను వెంటనే తీసుకోలేను! నాకు కొంచెం సమయంకావాలి! ప్లీజ్!".... అంటూ బేలగా అభ్యర్ధించింది కొడుకును! 


బేలగా అన్నా...తల్లి మాటల్లోని దృఢత్వాన్ని గుర్తించాడు అతను! తన మాటలతో ఆమె నిర్ణయం వీగిపోదని అర్థంఅయింది! ఎక్కువ రెట్టించకుండా..." సరే అమ్మా! నీ ఇష్టం! ఏ అవసరం ఉన్నా క్షణాల్లోనే నీ ముందుంటా!".... అని, తల్లికిమాటిచ్చి సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు! 


     ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది! పెద్దగా దిగులు అనిపించలేదు వర్ధనికి!తోటలోకి వెళ్ళింది. అడ్డదిడ్డంగాపెరిగి, వ్యాపించిపోయిన కొమ్మలతో... రకరకాల మందారాలూ, నిత్యమల్లిచెట్లు! వందేళ్ళనాటి ఫలసాయం లేని చెట్లు... తోటంతా నీడలు పరుస్తూ! ఆ చెట్ల వలన ఇరుగుపొరుగులతో శాశ్వత శతృత్వాలు! అయినా మారని భర్త మొండివైఖరితలుచుకుని భారంగా నిశ్వసించింది వర్ధని. 


      ఎంత విచిత్రమయిన మనిషో ఆయన. తా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే వ్యవహారం! పురాతనమయినభావాలూ, ఆచారాలు! పొదుపు పేరిట అతికూడిక... ఇంటి ఆడపడుచులకు కూడా పూతికపుల్ల ఇవ్వనంత! అత్తగారిఇత్తడిసామాన్లు, రాచ్చిప్పల్లోవంట. పెళ్ళయిన ఇరవై యేళ్ళకు వరకూ కుంపటి వంటే! ఆరోగ్యం పేరుచెప్పి పత్యపు తిండి. నెలకు కేజీ నూనె వాడకం కూడా ఎక్కువే! తన పుట్టిల్లు మధ్యతరగతయినా... సుష్టుగా అన్ని అధరువులతో భోంచేసేభోజనప్రియులు! “


“కొడుకు చేతికందే వరకూ ..ఏడాదికి మూడుచీరలే! పోనీ లేదా పోదా అంటే... ఎగువమధ్యతరగతి నేపధ్యం. మంచిజీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగం! తన అభిప్రాయాలసాధనలో ఒకరకమైన నిరంకుశత్వం ఆయనది! తనకంటూబంధువులూ, స్నేహబాంధవ్యాలూ నెరిపే అవకాశం ఇవ్వకుండా... ఇంటిని పుస్తిని చేసిన మహానుభావుడు ఆయన!”


          “మెరిట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్న సురేంద్రను , డాక్టర్ అవ్వడానికి పదేళ్ళు పడుతుందని, మెడిసిన్చెయ్యనివ్వకుండా, బలవంతంగా బీ. ఫార్మసీ లో పెట్టారు. ఇరవై యేళ్ళకే ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి, స్కాలర్ షిప్స్, పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తండ్రి నుండి ఆర్ధికసహాయం ఆశించకుండా ఎంతో పైకి వచ్చాడు కొడుకు. తండ్రి దూరంచేసుకున్న బాంధవ్యాలను తన ఆత్మీయతతో దగ్గర చేసుకున్నాడు. తను జీవితంలో ఎదుగుతూ, ఎందరికో చదువులకూ, ఉద్యోగాలకూ చేయూతనిచ్చాడు. “


“చెప్పాలంటే కొడుకుని చూసే ఇప్పుడు తమను బంధువులు గౌరవించే స్థాయికి , నైతికంగా , సామాజికంగా ఎదిగాడుసురేంద్ర! కూతుర్ని నెత్తిమీద దేవతలా చూస్తూ, ఆడింది ఆట పాడింది పాటగా సాగించి... కొడుకును మాత్రం ఆంక్షలసంకెళ్ళతో అనుక్షణం క్రమశిక్షణ పేరిట దండిస్తూ, అవమానిస్తూ ఉన్న తండ్రికి ఎప్పుడూ గౌరవం తక్కువ చెయ్యలేదు ! తండ్రి మూర్ఖత్వం, నిరంకుశత్వం వలన తను ఎన్నో కోల్పోయినా, ఒక్కరోజూ తండ్రిని ద్వేషించలేదు! ఆయన ఇన్నేళ్ళకుకళ్ళుతెరిచి, వాడి మంచితనం అర్ధమయ్యి, కాస్త మృదుత్వం అలవాటుచేసుకుని, కొడుకుతో అనుబంధం పెంచుకునేసమయానికి ... మనిషే లేకుండా పోయారు! “....వర్ధని ఇలాంటి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది. 


“ఇప్పుడు తనకు కావలసినది వండుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తినడానికి మనసే లేదు. ఎక్కడికయినా వెళ్ళే స్వతంత్రంఉంది. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. “ఎంత పరాధీన తను! “.... వేము తిన్నంత చేదు ఆమె మనసులో! వారం కన్నాఎక్కువ ఉండలేకపోయింది ఆ ఇంట్లో ఒంటరిగా! దానికి పరిష్కారమూ సురేంద్రే చేసాడు. 


మంచి ప్రణాళికతో... అన్ని ఏర్పాట్లూ చేసి, వర్ధనినీ, తమతోనే వుండే అత్తగారినీ, ధరణి అత్తగారినీ, ఇద్దరుమేనత్తలనూ...కాశీ, ప్రయాగ, చార్ ధామ్, వైష్ణోదేవి యాత్రలకు పంపించే ఏర్పాటుచేసాడు! 


        భర్త పోయి నెలరోజులవ్వక మునుపే యాత్రలంటే లోకం నవ్వుతుందని... వర్ధని ససేమిరా అనేసింది. సురేంద్ర తల్లితోఒకటే అన్నాడు! “ అమ్మా! జీవితం చాలా చిన్నది. ఇప్పటికే అరవైయేళ్ళు అసఫలంగా , పంజరంలోచిలుకలా...గడిపేసావు. . ఇక నుంచి ప్రతిక్షణం, నువ్వు కోల్పోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవాలి! చేద్దామనుకున్నవీ, చూద్దామనుకున్నవీ మొదలుపెట్టాలి! నీకు నేనున్నానమ్మా! జీవితం మళ్ళీ మొదలుపెట్టు!!వెళ్ళిపోయిన వారి గురించివగస్తూ కూర్చుని లాభం లేదు! “..... అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు! వర్ధనికి తన జీవితంలో రెండవ అధ్యాయంమొదలయ్యింది! 


      రెండునెలల యాత్రలు, మరో రెండునెలలు ధరణి దగ్గర గడిపాకా.... సంతృప్తి చెందిన మనసు, మొట్టమొదటిసారిలోకాన్ని చూసిన ఆనందం, తన చుట్టూ ఇంత నాగరికత ఉందా అన్న విభ్రమంతో తిరిగివచ్చింది వర్ధని. 


ఇల్లు బాగుచేయిస్తున్నానని, తల్లిని తమింట్లోనే పెట్టాడు సురేంద్ర! స్వర్ణతల్లి విద్యావంతురాలు, మంచి క్రియాశీలకురాలు. వర్ధనికి ఓపిగ్గా వివరిస్తూ...ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సప్ పరిచయం చేసింది. ఎందరో పరోక్ష మిత్రబృందాలతో, సాహితీసౌరభాలతో వెల్గులీనే ఫేస్ బుక్ వర్ధనికి చక్కని కాలక్షేపంగా మారింది. కొడుకు సేకరించిన ఎన్నో అపురూపమయినపుస్తకాల నిధి మరో పెన్నిధి అయ్యింది ఆమెకు. భర్త తనలో పెంచి, పోషించిన నిర్లిప్తత, నిరాశ, విరక్తి.... మెల్లమెల్లగాకరిగిపోతున్నాయి! జీవితం నవనవోన్మేషంగా మారుతోంది. పిల్లలూ, పువ్వులూ, పుస్తకాలూ, పరిసరాలూ ఎన్నోనేర్పుతున్నారు! 


          తండ్రి సంవత్సరీకాలు కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసాడు సురేంద్ర! మాఘమాసం రాగానే, “ రా అమ్మా! నీ ఇల్లుచూసుకుందువు గాని”.... అంటూ వర్ధనిని బయలుదేరదీసాడు! ఆ వీధిలో బీటలువేసిన , నాచుపట్టిన గోడల్లోంచిరావిచెట్లు తొంగిచూస్తూ, అడవిలాంటి తోటతో , దిష్టిబొమ్మలా ఉండే తమ ఇల్లు.... ఎంతో అందంగా, అధునాతనంగా, విశాలంగా తయారయ్యి ఉండడం చూసి, ఆమె సంభ్రమమొందింది. ముందుగా ఆమెను ఆకర్షించినది నందన వనంలాంటి తోట. 


“ అయ్యో! మామిడిచెట్టు, చింతచెట్టు ఏవిరా?”.... అంది కొడుకుతో! “ అమ్మా! నేను కొన్నిరోజులు వాటితో మాట్లాడాను అమ్మా. మీరు పెద్దవారయిపోయారు. మీవలన ఈ స్వార్ధపూరిత అనాగరికులకు ఇబ్బందిగా ఉంది. మీ అనుమతితోమిమ్మల్ని తొలిగించవచ్చా! మీ కొమ్మలకు అంట్లు కట్టించి... నా తోటలో మీ వంశాన్ని కొనసాగిస్తా!”.... అంటూ వాటినిప్రార్ధించేవాడినమ్మా! నమ్మూ, నమ్మకపో.... అవి రెండునెలల్లో వృద్ధాప్యం వచ్చినట్టు పూర్తిగా వడలిపోయి, మోడులయ్యాయి! అప్పుడే వాటిని కొట్టించి, ఆ కలపంతా మనింటికే వాడాను. “ అన్నాడు సురేంద్ర! వర్ధనికి ఏమీఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు అచ్చం తన పోలికే! కష్టమొచ్చినపుడు ఆ మాకులతోనే పంచుకునేది. అవి కూడా విన్నట్టేఉండేవి! 


          క్రింద మూడు, పైన మూడు అత్యంత సౌకర్యకరమైన పడకగదులు వేయించాడు. లేలేత భానుకిరణాలుపడుతుంటే ధ్యానం చేసుకోవడానికి అనువుగా చక్కని సన్ రూమ్ , తను కోరుకునే విధంగా... విశాలమయినపూజామందిరం, అందమైన తంజావూరు దేవతామూర్తుల పటాలతో మనోజ్ఞంగా చేయించాడు! అన్నిటికన్నా మిన్న వంటగది! మొత్తం అధునాతనంగా, సౌకర్యంగా! ఆనుకున్న పాంట్రీలో.... అన్ని వరుసల్లో... రకరకాల సైజుల్లో... అమర్చినస్టీలుడబ్బాలను, గాజుసీసాలను చూసి... వర్ధని కళ్ళలో మెరుపు, పెదాల మీద చిన్నచిరునవ్వు మెలిచాయి! ఇవన్నీభర్తహయాంలో తన తీరని కోరికలు!సరుకులన్నీ చిన్నచిన్న పొట్లాలు కట్టించి,చెక్కబీరువాలో పెట్టించి తాళం వేసే వారాయన...తను దానధర్మాలు,దుబారా చేస్తుందని! 


  “నా కొడుక్కు అన్నీ తెలుసు తన గురించి! తన మనసులోని ప్రతి భావన, స్పందన, కోరిక, ఉద్వేగం...సమస్తం ఎరుకే ఈ పిల్లవాడికి!”... అనుకుంటూ ఆ అమ్మమనసు పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోయింది! 


         ఒక మంచిరోజు తల్లిని యజమానురాలి హోదాలో... గౌరవంగా ...తమజంటతో సమానంగా ,పీటలమీదకూర్చుండపెట్టి గృహప్రవేశం చేయించాడు సురేంద్ర! తండ్రి తదనంతర ఆస్థులన్నీ తల్లి పేరిటకు మార్పించాడు! వర్ధని, స్వర్ణ తల్లితో పాటూ... ధరణి అత్తగారు కూడా ఆ ఇంటికే మారిపోయారు! ఇంట్లో పనులకు, వంటకు హెల్పర్స్ ను పెట్టాడు. వారికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కారు కొని, డ్రయివర్ తో సహా, గుమ్మంలో పెట్టాడు! మేడమీద కు స్వర్ణా,పిల్లలతో... దిగిపోయాడు! 


       గృహప్రవేశం నాడు మేనత్తలు ముగ్గురినీ పిలిచి, వారు గతంలో అన్నగారిని అడిగి, భంగపడ్డ తమ తల్లిగారిబంగారం, మూడెకరాల భూమిపత్రాలు వారి చేతిలో పెట్టి,...” అత్తా! ఇది మీ అందరి ఇల్లూ కూడా! మీకు కావలసినన్నిరోజులు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. మీకు ఏ అవసరానికయినా ఈ మేనల్లుడు ఉన్నాడని మర్చిపోకండి!”.... అంటూ ఆప్యాయంగా చెప్తుంటే.... వాళ్ళు కన్నీటితో...పరమానందభరితులయ్యారు! 


“ వదినా! నీ కడుపున రాములవారే పుట్టారు వీడి రూపాన! మా అన్నయ్యకు ఈ పుత్రోత్సాహం చూసే యోగం లేదు. వీడిని రాముడని ఎందుకు అన్నామంటే, ఒకవేళ దశరధుడు , కౌసల్య తన తోనే ఉండివుంటే....సంపద ఉన్నా, లేకపోయినా... అయోధ్యలో నయినా , అడవిలోనయినా రాములవారు తల్లితండ్రులను ... అదే ప్రేమతో, వైభవంతో,అక్కరతో....లోటనేది రానీయకుండా చూసుకుని వుండేవారు నీ కొడుకులా!”...అంటూ... ఆ కన్నతల్లి కడుపుసంతోషంతో నింపేసారు! 


     ఆ విధంగా తల్లికి స్వయంప్రతిపత్తిని కల్పించి, సాధికారంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి మార్గం సుగమంచేసిపెట్టాడు సురేంద్ర! తల్లి మనసులో తండ్రిచేసిన ప్రతి అవమానాన్ని, ప్రతిగాయాన్ని తన బాధగా అనుభవించాడుఅతను ఇన్నాళ్ళూ! తనకు శక్తి ఉన్నా... కొడుకు స్వార్జితంతో పూతికపుల్ల కూడా ముట్టననే తండ్రిఅసహనంతో,విచిత్రవైఖరితో సర్దుకుంటూ...అతను పడ్డ మనక్షోభ ఇన్నాళ్ళకు ఉపశమించింది. ఆయనకు సజీవంగా ఏమీచెయ్యలేకపోయినా , ఆయన మరణానంతరం ఆయన పేరిట పేదవిద్యార్ధులకు స్కాలర్ షిప్, వృద్ధాశ్రమాలకు విరాళాలరూపంలో ఇస్తూ... పితృూణం తీర్చుకుంటున్నాడు! 


          ఇది మలుపులున్న కధ కాదు! కానీ ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ! తల్లిదండ్రులు, సమాజం నాకేమిచ్చిందని... ప్రశ్నించకుండా... ‘వీరికి నేనేమి చెయ్యగలను’... అని ఆలోచిస్తూ , బాధ్యతలు సక్రమంగా, సంతోషంగా నిర్వహిస్తూ, కార్యాచరణలో పెట్టే క్రియాశీలి కధ! 


పుత్రోత్సాహము తండ్రికీ


పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా


పుత్రుని కనుగొని బొగడగా


పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!


శుభం!


ధన్యవాదాలతో!

శశికళ ఓలేటి.


*🌷శ్రీ జగదీశ్ కొచ్చెర్లకోట గారి కథనం🌷*

                   🌷🌷🌷

ఈ తెల్లపంచెల బ్రాహ్మలకీ, తెల్లకోట్ల డాక్టర్లకీ అమావాస్యలవీ కాస్త తెరిపినిస్తాయి. ఏ పిల్లకీ నొప్పులవీ రావు. వచ్చినా ఇల్లు కదుల్తానంటే అత్తమ్మ ఊరుకోదు. అంచేత ఇంటిపట్టునే ఉంటాను ఆరోజుల్లో! 


మొన్న అమావాస్యనాడు మా హాస్పిటల్లో బెడ్సన్నీ ఖాళీ! వచ్చే నొప్పుల్ని కూడా ఓర్చుకుని ఇళ్లలోనే పడుంటారు. ఇలా అమావాస్య వెళ్లిందనగానే పోకిరిలో పాటుంది చూశారూ... నొప్పి నొప్పీ ఒళ్లంత నొప్పీ అని! ఆపాట పాడుకుంటూ వన్నాటెయిట్లలో వాయసాల్లా వాలిపోతారు. 


ఆరోజిక మా పని రైల్వేస్టేషన్ రోడ్లో పైడ్రాజు ఇడ్లీ కొట్టే! అలా వాయలకి వాయలు ఎక్కించనూ దింపనూ! 


మావాళ్లకి కోపాలొస్తాయంటే రావూ మరి? అయినా పనిచేసేటప్పుడు మొహం మమతా బెనర్జీలా పెట్టుక్కూర్చోవడం ఎందుకని సెల్ఫీల కోసం నవ్వినట్టు బలవంతపు నవ్వులు నవ్వుతూ పనిచేస్తుంటారు. పాతికేళ్లుగా ఇదే వరస. 


ఇక నాగులచవితికి చూడాలి. బందిపోట్లకి భయపడి ఊరంతా ఖాళీచేసి వెళిపోయారా అని అనుమానమొస్తుంది. పొద్దున్నే పుట్టలో పాలు పోసేసి, టపాకాయలవీ కాల్చేసి, ఇళ్లకి బయల్దేరినవాళ్లందరూ ఏ పుట్టలో దూరిపోతారో, మూడురోజులపాటు కనబడరసలు. అంగట్లో సరుకంతా అంగుట్లో వేలెడితే తగిలేంతవరకూ తాగేస్తారు. ఇక పేకాటైతే టోర్నమెంట్ల లెక్క ఆడతారు. 


నెలలు నిండి, నొప్పులొస్తున్నవాళ్లు సైతం చవితినాడు హాస్పిటల్‌కి రారు. ఒకవేళ వద్దామన్నా మొగుళ్లు ‘కోమా’లో ఉండడంవల్ల వీళ్లని హాస్పిటల్‌కి తీసుకొచ్చే నాథుడులేక ఏ మూడురోజులకో ప్రాణాలమీదకొచ్చాక దిగుతారు. 


ఊళ్లో రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉంటాయి. ప్రధాన కూడళ్లలో సైతం మనం థర్డ్ గేర్‌లో వెళిపోవచ్చన్నమాట! 


ఓసారిలాగే ‘తను’ నన్నొక్కణ్ణీ వదిలిపెట్టి ఊరెళ్లింది. మొదటి రెండురోజులూ హొటల్లో ఏదో ఒకటి కతికి బతికాను. ఆ మర్నాడు నాగులచవితి. ఊళ్లో ఒక్క హొటల్ కూడా తెరవలేదు. హాస్పిటల్ నుంచి బయల్దేరినవాణ్ణి ఊరంతా తిరిగాను ఎవరైనా పట్టెడన్నం పెట్టకపోతారా అనుకుంటూ! అబ్బే! 


ఆవేళ ఊళ్లో పాములన్నీ సుష్టుగా పాలు తాగి, మత్తుగా ముడుచుకు పడుకున్నాయిగానీ గోవులాంటి నాకుమాత్రం గడ్డికూడా దొరకలా!


అప్పటికి ఈ ఫేస్‌బుక్కదీ లేదు మనకి. లేకపోతే ‘ఫీలింగ్ హంగ్రీ ప్రెండ్స్!’ అని పోస్టొకటి పెట్టేసి మీ అందరి దగ్గరా బోల్డంత సింపతీ, బోల్డన్ని కామెంట్లూ కొట్టేసేవాణ్ణి. దాంతో కొంత ఆకలి తీరేది 😝😝


ఇహ చేసేదేంలేక ఇంటికొచ్చి ఓ డొక్కుడు బియ్యం పడేసుకుని, కుక్కరు ఈలేసేలోపు ‘తానాలు ఆడావే ఓలమ్మీ.. నా పానాలు తీసావె చిన్నమ్మీ...’ పాట ఈలేసుకుంటూ స్నానం చేసి, వేడివేడన్నంలో కాస్తంత వాము, ఉప్పూ వేసుకుని అందులో అంత నెయ్యి కలుపుకు తిన్నాను. ఆనక ఓ నాలుగు ముద్దల పెరుగన్నంతో ప్రాణం నిలబడింది. అట్లుంటది మావాళ్లతోని!


అదే ఇప్పుడైతేనా, మా రింగ్‌రోడ్డులో ఉన్న అన్ని షాపుల్లోనూ బిర్యానీ దొరుకుతోంది, ఒక్క రెండుచోట్ల తప్ప. ఒకటి స్టేట్ బ్యాంకు, ఇంకోటి అపోలో ఫార్మసీ. అపోలోవాడు కూడా ఈమధ్యే తీసేశాడు. అక్కడేదో మాంఛి బిర్యానీ సెంటర్ ఓపెనవుతోందిట. రాజుగాడు చెప్పాడు.


‘బిర్యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ...’ అని చదువుకుంటూ పట్టెడన్నంకోసం రింగ్‌రోడ్డంతా ప్రదక్షిణ చేసినా బిర్యానీయే దొరుకుతుందితప్ప అన్నం అనుమానమే!


అయినా ఈమధ్య తనసలు నన్నొదిలి ఎక్కడికీ వెళ్లనే వెళ్లట్లేదు! 😩


ఆవంకనైనా వంటచేసుకుని, వంటిల్లంతా పెంటచేసుకుని, ఓ దుర్ముహూర్తాన తను ఏ వీడియో కాలో చేసి ‘ఏదీ, ఓసారి వంటిల్లు చూపించూ?’ అనంటే నా సామిరంగా...!


చూద్దాం! ఉందిలే మంచీకాలం ముందూముందూనా... అని ఆశపెట్టుండ్లా కవిగారు?


.........కొచ్చెర్లకోట జగదీశ్

చంద్రోదయఉమావ్రతం

 💐💐అమ్మాయిలు తమ కలలు పండాలని.. అనుకూలవంతుడైన..,,

జీవిత బాగస్వామి భర్త గా లభించాలని..

.ఆచరించే ఈ అట్లతదియ వ్రతానికి అసలు పేరు "చంద్రోదయఉమావ్రతం" 


**అశ్వయిజ బహుళ తదియ నాడు చంద్రుడు ఉదయించిన పిదప ఉద్యాపన చేసి తమ ఉపవాసాలకు, స్వస్తి పలికి "అట్ల" ను ముత్తయిదువలకు వాయనం  గా "తదియ" నాడు ఇస్తారు కనుక ఈ నోమును "అట్ల తద్దె"ని అనటం వాడుకలో వచ్చింది.


.. ** కొన్ని ప్రాంతాలలో అట్ల తదియ నాడే 'ఉండ్రాళ్ళు తదియ' వ్రతం కూడా ఆచరిస్తారు.

."బృహత్ ఉమా వ్రతం " గా చెప్పబడు ఉండ్రాళ్ళతద్దె /ఉండ్రాళ్ళ తదియ ను వాస్తవానికి భాద్రపద బహుళ తదియ నాడు ఆచరించి పేరంటాళ్లకు ఉండ్రాళ్ళు వాయనం గా ఇచ్చేవాళ్ళు..


** ఇప్పుడేమో ఉండ్రాళ్ళతదియా,అట్ల తదియా వ్రతాలను కలిపి ఆచరిస్తున్నారు..


** పూర్వము పెళ్లి కానీ పిల్లలు ఆచరించే ఈ వ్రతాన్ని..నేడు మంచి భర్త లభించినందు కు / భర్త తో అన్యోన్య జీవితం ఇవ్వమని..గౌరీ దేవతను ప్రార్థించే పూజ గా ఈ వ్రతాన్ని చెప్పవచ్చు..


** ఈ వ్రతాన్ని తొలుత పార్వతీ దేవి ఆచరించి శివుని తన భర్త గా పొందినదని..చెప్పుట ఈ వ్రత ప్రాధాన్యాన్ని సూచిస్తుంది..


అట్లతదియ రోజున అనుకూల దాంపత్య సిద్ధికి అర్ధనారీశ్వర స్తోత్రంతో ఆరాధన చేయడం మంచిదని పెద్దల అభిప్రాయం....


"అర్థనారీశ్వర స్తోత్రము"


చాంపేయ గౌరార్థ శరీరకాయై

కర్పూర గౌరార్థ శరీరకాయ

ధమిల్ల కాయైచ జటాధరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


కస్తూరికా కుంకుమ చర్చితాయై

చితారజః పుంజ విచర్చితాయ

కృత స్మరాయై వికృత స్మరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


ఝణత్క్వణత్కంకణ నూపురాయై

పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ

హేమాంగదాయై భుజగాంగదాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


విశాల నీలోత్పల లోచనాయై

వికాసి పంకేరుహ లోచనాయ

సమేక్షణాయై విషమేక్షణాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


మందార మాలా కవితాలకాయై

కపాల మాలాంకిత కంథరాయ

దివ్యాంబరాయై చ దిగంబరాయై

నమశ్శివాయై చ నమశ్శివాయII


అంభోధర శ్యామల కుంతలాయై

తటిత్రభా తామ్ర జటధరాయ

నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై

సమస్త సంహారక తాండవాయ

జగజ్జనన్యై జగదేక పిత్రే

నమశ్శివాయై చ నమశ్శివాయII


ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై

స్ఫురన్మహా పన్నగ భూషణాయ

శివాన్వితాయై చ శివాన్వితాయ

నమశ్శివాయై చ నమశ్శివాయII


ఏతత్పఠే దష్టక నిష్టదం యో

భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ

ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం

భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః


ఇతి శ్రీ శంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్ 🙏


ఊయలలు....ఊపిన చేతులు...ఉర్వి ని

 పాలించగలవని... నిరూపిస్తున్న మహిళా మణులకు వినమ్రపూర్వక నమస్కారాలు/ శుభాశీస్సుల తో...

సుశర్మ...

గంగకు సముద్రమే

శ్లోకం:☝️
  *అంబాకుప్యతి తాత మూర్ధ్ని*
*విలసద్గంగేయ ముత్సృజ్యతాం*
  *విద్వన్ షణ్ముఖ కాగతిః మయి*
*చిరా దస్యాస్థితాయా వద l*
  *కోపావేశవశాదశేషవదనైః*
*ప్రత్యుత్తరం దత్తవాన్*
  *అంబోధిః జలధిః పయోధిః*
*ఉదధి ర్వారాన్నిధి ర్వారిధిః ll*

భావం: "ఓ తండ్రీ! అమ్మ కోపిస్తుంది. మీ తలపైనున్న ఆ గంగను విడువరాదా!" అన్నాడు కుమారస్వామి. 'ఓ షణ్ముఖా! చిరకాలంగా నన్నాశ్రయించుకున్న ఆమెకి గతియేది?' అని ఈశ్వరుడు జవాబివ్వటంతో కోపావేశవశుడైన కుమారుని ఆరు ముఖాలనుంచీ యీ విధంగా జవాబు వచ్చింది. 'అంబోధిః జలధిః పయోధిః ఉదధిః వారాంనిధిః వారిధిః' అనగా "గంగకు సముద్రమే గతి" యన్నాడని భావం.

ధర్మాకృతి

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 1


ఇరువదవ శతాబ్దము బహు విధములుగా చాలా గొప్పది. ఆధ్యాత్మిక రంగమున దీని ముద్ర శాశ్వతమైనది. ఈ శతాబ్దములో ఆధ్యాత్మికాకాశమున దివ్య జ్యోతులు అనేకము వెలుగొందినవి. అందులోనూ దక్షిణ భారత దేశము ఈ విషయమున ఎంతో ముందున్నది. శృంగేరీ చంద్రశేఖర భారతీ స్వామి వారొకరు తిరువణ్ణామలై రమణులొకరు కంచి మహాస్వాము లొకరు ధగద్ధగాయమానముగ ప్రకాశించిన మహాజ్యోతులు. ఒకరు తెలుగు వారు, వేరొకరు తమిళులు, ఇంకొకరు కన్నడిగులు. ముగ్గురూ జీవన్ముక్తులు. ముగ్గురూ ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతమును అనుభవములో నిరూపించిన మహామహులు. వీరు మువ్వురూ కారణములేమైననూ ఒకరినొకరు కలుసుకొనలేదు. శృంగేరీ స్వామి, రమణ భగవానులు కలిసే అవకాశం లేదు. శృంగేరీ స్వామి తిరువణ్ణామలై పోలేదు. రమణులు ఆ వూరు వదలలేదు.


అయితే కంచిస్వామి రమణులు ఉండగా తిరువణ్ణామలై రెండుసార్లు వెళ్ళారు. తిరువణ్ణామలై ఏమిటి – రమణాశ్రమం ముందుగనే నడుస్తూ గిరి ప్రదక్షిణానికి వెళ్ళారు. బౌద్ధమత ప్రవక్త అయిన గౌతమ బుద్ధుడు. జైన మత ప్రవక్త అయిన మహావీరుడు చాలాకాలం ప్రక్క ప్రక్క వీధులలో ఉండి కూడా కలుసుకోలేదుట. వారు కలుసుకోపోవడానికి కారణం చరిత్ర మనకు తెలపలేదు. వీరు కలుసుకోపోవడానికి మాత్రం కారణం పీఠనియమాలే. పీఠాధిపతులు అనాహుతులుగా ఇంకొక చోటికి పోవడానికి వీలులేదు. అందులో స్వామివారు తాము మానాభిమానాలకు అతీతులైనా, ఆదిశంకరులు అధిష్ఠించిన పీఠగౌరవ విషయంలో మాత్రం ఎంతో పట్టుగా ఉండేవారు.


ఒక సందర్భంలో ఒక ముఖ్య విషయంపై మంతనాలు జరపడానికి ఒక వైష్ణవ మఠాధిపతి ఆహ్వానంపై తాము పోతున్న దారిలో ఉన్న ఆ మఠానికి పోవడానికి శ్రీవారు సమ్మతించారు. తీరా ఒప్పుకొన్న తరువాత శ్రీమఠపు మేనేజరు ఆ వైష్ణవ మఠయాజమాన్యం వారు ఆ మఠాధిక్యత పైన నమ్మకం కలవారు అవడాన ఏదైనా అవమానం జరుగుతుందేమోననే సందేహాన్ని శ్రీవారి ముందు వెలిబుచ్చారు. 

అయితే అలాంటి సంఘటనేమీ జరగకుండానే సమావేశం సాఫీగా జరిగిపోయింది. స్వామివారి సన్నిధిలో మేనేజర్ విశ్వనాథ అయ్యర్ తమ సంతృప్తిని వెలిబుచ్చారు. "అవునయ్యా! మీ పీఠగౌరవాన్ని నిలబెట్టడానికే నేను ఒంటికాలు మీద కూర్చోవలసి వచ్చింది" అన్నారట స్వామివారు.


అసలు ఏమిజరిగిందంటే స్వామివారు లోపలికి ప్రవేశించగానే తమకు కూర్చోవడానికి చూపే ఆసనం వైపు చూశారు. వైష్ణవ ఆచార్యుల వారు కూర్చోబోయే ఆసనం కంటే రెండంగుళాలు తక్కువ ఎత్తులో ఉంది. స్వామివారు కూర్చోగానే ఫోటోలు తీస్తారు. వారు ప్రచారం చేసినా చేయకపోయినా శంకర పీఠాధిపతులు రెండంగుళాలు క్రింద కూర్చుని ఉన్నట్లు తెలుస్తుంది. ఇది గ్రహించిన స్వామివారు తనకే చేతనైన విధానంలో మడమపై కూర్చుని రెండవ కాలు పైన వేసి నేలమీద కూర్చున్నారు. వైష్ణవస్వామికి ఈ ఆసనం రాదు కదా! నేలమీద చతికిల పడవలసి వచ్చింది. మఠగౌరవ విషయంలో స్వామివారు అంత గమనంగా ఉంటారు.


అంత గమనం అవసరమా అని చదువరులకు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ మధ్యకాలంలో మన విజయవాడలోనే జరిగిన ఒక సంఘటన చెబుతాను. శంకర విజయేంద్రసరస్వతీ స్వామివారు కృష్ణా పుష్కర సందర్భంలో కృష్ణ గట్టు అవతల జరిగిన ఒక యజ్ఞానికి నిర్వాహకుల ఆహ్వానంపై వెళ్ళారు. అప్పటి జీయర్ స్వామి ఉపన్యాసం నాకు ఆశ్చర్యం కలగజేసింది. “మా గురువులను కంచి మహాస్వామివారు కలసినప్పుడు...’ అని చెబుతున్నారు. యదార్థానికి జియ్యర్ గారే అనేక సందర్భాలలో పెద్ద శ్రీవారి దర్శనం చేసినట్లు మహాస్వామివారిని ఎంతో ఆదరించినట్లు మనందరికీ తెలుసు. చిన్నజియ్యర్ గారి ఎదురుగా కూర్చున్న పామర జనానికి అది తెలియదు కదా! శంకరాచార్యుల వారే వచ్చి మన గురువులను కలుసుకొంటారట అని చెప్పుకొంటారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పరిపూర్ణలు

 పరిపూర్ణలు కాంచీ పరమాచార్య స్వామి ప్రముఖ వార్తా సంస్థలో పనిచేస్తున్న రఘురామన్ ఒకరోజు తనతో పశ్చిమ జర్మనీకి చెందిన ఇంధాలజీన్టునోకొడిని మహాస్వామి వారి వద్దకు దర్శనార్ధమై తనతో తోడోక్కని వచ్చారు... ఆ వచ్చిన ఇందాలజిస్ట్ కి భారతీయ అందాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై అమితమైన వ్యామోహం, స్వయంగా మంచి సంస్కృత పండితులు. శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు. శంకరులవారు చెప్పిన అపరోక్షానుభూతి పొందిన జీవన్ముక్తులను దర్శించాలనే ఉత్సుకతతో భారతదేశ పర్యటన ఆరంభించాడు. అతనికి కంచి మహాస్వామి అటువంటి మహాపురుషులని ఎవరో చెప్పారు.

స్వామివారాళోజెంతో ఉల్లాసంగా ఉన్నారు. అతడిగురించిన విషయాలన్నీ అడిగి తెలుసుకొన్నారు. పశ్చిమ జర్మనీ అభివృద్ధిగురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అతడి స్వంత విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ దేశంలో అతడు మంచి స్థితిపరుడు. సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. పేరు వసంతరాయ్ మార్చుకున్నారు. వారి ఇద్దరి కూతుర్లకు |అనిందిత పార్వతి అనే పేరుంచాడు.

అతడు స్వామివారిని ఆత్మతత్వంపై తన సాధనపై అనేక

ప్రశ్నలు చేశాడు. స్వామివారు ఒకప్పుడు చిరునప్పుతో, కొన్ని సార్లు ఒకటిరెండు మాటలతో సమాధానం చెబుతున్నారు. అతడు ఆ సమాధానాలకు మహదానందమగ్నుడవుతున్నాడు. తరువాత అందరితో చెప్పుకొన్నాడు. ఆరోజు అతడి చిరకాల వాంఛ ఈదేరిన శుభదినమనీ, కలలు పండిన రోజు అని.

వేయవలసిన ప్రశ్నలు అయిపోయాయేమో చాలాసేపు కనులు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు. స్వామివారూ మౌన ముద్రాంకితులై ఉన్నారు. హఠాత్తుగా అతడు స్వామివారి ముందు సాష్టాంగంగా నమస్కరిస్తూ తాను స్వామి సన్నిధిలో కంచిలోనే స్థిరపడిపోతానని మారాము చేయసాగాడు.స్వామివారు మనోహరమైన చిఱుమందహాసం చేశారు. "ఆ దేశంలో ఎంతో సుఖమయమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావు. బాగా ఉన్నదికదా జీవితం, అదంతా వదిలి ఏ వసతులూ లేని ఈ చిన్నపట్టణంలో ఎందుకు స్థిరవడదామను కొంటున్నారని ప్రశ్నించారు. అతడి సమాధానం ఈ రోజుకీ నా రెప్పలలో గింగురుమంటోంది. ఇప్పటికీ అతని హృదయం నుండి పొంగివచ్చిన మాటలు తలచుకొన్నప్పుడు నా శరీరం |

పులకాంకితమవుతూ ఉంటుంది. అతడెంతో ఆర్తితో అన్నాడు. "మరి అక్కడ తమవంటి పరిపూర్ణులైన మహాస్వామి లేరుకదా!!!

వారు పరిపూర్ణులనే విషయం పశ్చిమ జర్మనీవారు చెబితేకానీ మీకు అర్థంకాలేదా? అని ప్రశ్నించవచ్చు. శ్రీనీలంరాజు మురళీధర్ ఒక సంఘటన తెలిపారు. మద్రాస్ విశ్వవిద్యాలయం లో ఆచార్యులుగా ఉన్న రాఘవన్ గారు అనేకమంది విదేశీయుల తోపాటు శ్రీవారిని దర్శించేరు. ఆ విదేశీయుల సంభాషణలన్నీ చేర్చి ఒక గ్రంథంలో వ్రాశారు. స్వామివారిని ఆ గ్రంధాన్ని ఆవిష్కరించమన్నారట. స్వామివారు "ఏదో హిందూ ధర్మంపై  మిడిమిడి జ్ఞానం ఉన్న విదేశీయులతో, నా సంభాషణలన్నీ వ్రాసి నన్ను ఆవిష్కరించమంటున్నావే! ఇక్కడి మహాపండితులతో చేసిన శాస్త్రార్థాలుకదా పుస్తకంగా రావలసింది" అన్నారట. నిజమే! మన మనస్తత్వాలకు తెల్లవారిని చూస్తే ఆకర్షణ. అయితే ఆ స్వామివారి పరిపూర్ణత్వాన్ని అనుభవించినట్లున్న అతని కంఠధ్వని మమ్ములను కదిలించివేసింది.

అతఃపూర్వమే స్వామివారి పరిపూర్ణత్వం గురించిన పరోక్షం జ్ఞానము మాకున్నది. మహామహులు చందోలు శాస్త్రులుగారు, అవధానిస్వామి, కుప్పాలక్ష్మణావుదానులు వారనుభవించి మాకు చెప్పారు. ఏ కారణం చేతనో నేస్పష్టంగా చెప్పలేదుకానీ మహాస్వామి వారిపై మాకు వల్లమాలిన ఆకర్షణ వారులేని జీవితాల ను ఊహించలేము. వారేమైనా మాతో ఎల్లప్పుడూ మాట్లాడే వాడా? లేదే! వారి మనోసారమైన మందస్కిృతముఖారవిందము, కరుణాన్ని చిలకరించే చూపులు మా మనసుల్ని పట్టిలాగి వేసేవి

ఎ.రూంలు, పట్టుపరుపులు వదలి కాంచీపురం, ఉక్క పోతలో దోమల కాటుతో స్వామివారు తలుపులు మూసు కొని పడుకున్న మేనా ప్రక్కన కటికనేలపై పడుకొనేలా చేసేది. ఎందుకీ పడికాపులు? తెల్లవారుఝామున స్వామి సలకరింతగా ఒక చిరునవ్వు నవ్వుతారే, వెన్నెలలు విరిసినట్లు, మల్లెలు విచ్చినట్లు, అదిగో చిరునవ్వు కోసం చిరునవ్వే అక్కరలేదు. వారి శరీరంలో వచ్చిన చిఱుకదలిక మమ్ములను ఆనందాంబుధిలో ముంచివేసేది. ఎందుకీ ఆకర్షణ. స్వామివారు నిరంతరము 'ఆత్మతత్త్వంలో ఆనందస్థితిలో ఉండటం చేతనేమో! గోపి కలంటారు. "నీ మృదుగీతరవంబు వీనులన్ వెక్కసమైన వచ్చి తిమి వేగమె మోహమునొంది నాథ నీవెక్కడ పోయితో ఎఱుగమాక్రియ నిర్దయుడిందు కల్గునే"ఆ పరిపూర్ణమూర్తి 8-1-94న సిద్ధి పొందారు. మేము యధాప్రకారం జీవితాన్ని కొనసాగిస్తున్నాము. మహానుభావుడు పోతనగారు తన ప్రాణంలో ప్రాణం హృషీకేశుడు వెళ్ళిపోయినా అర్జునుడు జీవించి ఉన్న సందర్భంలో అర్జునినితో చెప్పిస్తారు. "పటుతర దేహలోభమున ప్రాణములున్నవి కూడబోక - దేహ జీవిస్తున్నాము. స్వామివారున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ భౌతిక సుఖాలనుభవిస్తున్నామేమో? కనీసం కాంచీపురం లో పడుకోనక్కరలేదు కదా! అయితే వారి సన్నిధికి కూర్చున్న ప్పటి శాంతి, తృప్తి మాకెక్కడ లభిస్తుంది. ఏదో తెలియని వెలితి, శూన్యత్వం- అయినా నాకింకా ఎక్కడో మినుకు మినుకుమంటున్న ఆశ

"మక్కువ శాంతి సేయుటకు, మన్నన చేసి ప్రసన్నుడౌటకున్ జక్కన నా విభుండు గుణశాలి తిరోహితుడయ్యె" అంటారు నుండి మాయమయిన కృష్ణుని గురించి పోతనగారు. గోపికలు గోపికాగీతలు పాడగానే శ్రీహరి మనోజ్ఞాకారియై ఆకాంతా సమీపంలో పొడచూపాడు. | మహాస్వామి! ఏ గీతాలు పొడితే మళ్ళీ మాకు దర్శనమిచ్చి ఆ తృప్తిని శాంతిని కలగ చేస్తారు?అసలేమిటి ఈ స్వామి గొప్పదనం, శూన్యం నుండి పోదాలు సృజించి ఈయగలరా? ప్రకృతిని అద పెట్టగలరా? జరగబోయే విషయాలు కన్నులకు సరిగ వివరించగలరా? రోగుల రోగాలను చేతితో | తొలగించగలరా? మహదైశ్వర్యమును ప్రసాదించ స్వామివారు ఇవన్నీ చేయగలరని చెప్పేవారు లక్షలు ఉన్నారు. యోగులు ఆయనను యోగీశ్వరశరధున్నార ధార్మికులు ఆయనను మూర్తీభవించిన ధర్శమన్నారు. మంత్రవాదులు సర్వతంత్ర స్వతంత్రుడన్నారు. నైతికుతూ ఆయనను నైతిక సార్వభౌముడన్నారు. వేదాంతుల జీవన్ముక్తుదన్నారు.

లక్షలాది సామాన్య ప్రజ ఆయనను నడిచేదేముడున్నాడు. శ్రీ శివానందమూర్తిగారు "శ్రీకృష్ణుని తరువాత హైం సంస్కృతిని సమగ్రంగా అర్ధం చేసుకొని ఆచరణలో బోధించిన అతికొద్దిమంది మహా పురుషులలో కంతి : స్వామి వారొకరు" అంటారు. బంగాళా నాధువాపేరు | స్వామివారు త్రికాలములు ఎఱిగిన సర్వజ్ఞులంటున్నారు.ఈ విషయం శ్రీ త్యాగరాజన్ చెప్పారు. స్వామివారపుకు వేంకటాద్రి అగ్రహారంలో ఉన్నారట. మాధ్యాహ్నిక పూజ ముగించి అక్కడికి ఒక మైలు దూరంలో వున్న "సామియాన్ మేడు" గ్రామంలో ఉన్న తమ పూర్వ గురువుల అధిష్టానం వద్దకు భాషశాంతికై వెళ్లారు. స్వామివారు భాష్యం చూడటం మొదలుపెడితే అది గంటలతరబడి కొనసాగవచ్చు- పరి రకులంతా విశ్రాంతిగా పనులు ముగించుకొని నడుంవాలు స్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలయింది. బంగాళా సాధువొకరు వచ్చి ఎంతో అధికారికంగా స్వామివారెక్కడ అని ప్రశ్నించారు. పరిచారకులు (త్యాగరాజన్) స్వామివారు ప్రక్కగ్రామానికి వెళ్ళారు. రావడానికి ఎంతసేపవుతుందో చెప్పడానికి వీలుకాదని మరుసటిరోజు ఉదయం దర్శనానికి. రమ్మన్నారు. సాధువు కోపంగా "నన్ను ఈ సమయానికి రమ్మని పిలిచి తీరా వస్తే పీఠంలో లేకపోవడం న్యాయమా" అని రంకెలు వేశాడు. త్యాగరాజన్కు ఆశ్చర్యం వేసింది. కోసం కూడా వచ్చింది. "ఎవరయ్యా నువ్వు ఎవరు నిన్ను ఆహ్వానం చారు. నువ్వేమైనా లార్డ్ సావ్వా? కాషాయం ధరించావు | గడ్డం వేరే పెంచుకొన్నావు. సాధువులకు ఇంత కోపమా???అష్టముంటే వేచివుండు. లేకపోతే పో! నీప్రతాపం నాపైన మయా! సర్వజ్ఞులాయన. అది అనుభవించవలసిన విషయం, తెలుసుకోవడానికి ప్రయత్నించు" అన్నాడట.


చూపవద్దు" అని తెగేసి చెప్పాడు, "నీతో నాకేమి పని? బంగాళా సాధువు మీరు చెప్పిన సమయానికి వచ్చి, మీరు లేనందున తిరిగి వెళ్ళిపోయాడ'ని వారి స్వామివారితో చెప్పు- అంటూ గట్టున వెనుతిరిగి చెఱుకు తోటలకు అడ్డంపడి వడివడిగా నడుస్తున్నాడు. త్యాగరాజస్క పోకడ అర్ధం కాలేదు. ఇంతలో పారావాదు పరుగెత్తుకొని వచ్చాడు. స్వామివారు చెఱుకుతోటలకు అడ్డుగా వడివడిగా వస్తున్నారని తెలియజేశారు. పరిచారకులు ఆశ్చర్యంగా స్వామి వారికి ఎదురు వెళ్ళారు. సాధువు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు.


స్వామివారు చెఱుకుతోట గట్టుపై కూర్చొని అతనితో గంటకుపైగా మాట్లాడారు. అతడు ఆనంద భాష్పాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. స్వామివారు అతనిని సంపూర్ణంగా అనుగ్రహించి త్యాగరాజను పిలిచి "వీరిని జాగ్రత్తగా రైలు ఎక్కించిరా! ఈతడాహారం ఏమీ తీసుకోడు. దారిలో మంచి టీ ఇప్పించు. చేతిలో డబ్బు ఉంచుకొన్నావా?" అన్నారు.

దారిలో అంతా ఆనందాంబుధిలో ఓలలాడుతున్న సాధువు స్వామి వారి గుణానుకీర్తనలు చేశాడట. "స్వామివారి సమీప వర్తుడవై ఉన్నావే- వారిగురించి నీకేమి తెలుసు. సాధువులను గెంటడం మాత్రం తెలుసు. నాకు సమయం ఇచ్చారని చెబుతున్న సాయంత్రం వరకూ తిరిగి రారంటివే? ఆయన సత్యవాక్పరిపాలనలో రాముడంతటివాడు. స్వామివారి సేవ చేస్తున్నావు. అంచేత నీపై నాకు ప్రియం ఏర్పడింది. నీకో రహస్యం చెబుతున్నాను. ఈ స్వామి నడుస్తున్న పరబ్రహ్మ

తరువాత స్వామివారు ఆ సాధువు గురించి చెప్పారు. స్వామి) ఉత్తరదేశయాత్రలో ఈ సాధువు కలిశాడట. మంచి యోగి సాధకుడు, చాలాకాలం స్వామివారితో నడిచాడు. విడిపోనూ పునర్దర్శనంకై ప్రార్ధించాడు. స్వామివారు సరిగా 15సంగ తరువాత ఇదే సమయానికి పీఠం ఎక్కడుంటే అక్కడకు రమ్మన్నారట. తిధులు లెక్కపెట్టుకొని సరిగా ఆ సమయానికి: మఠానికి వచ్చాడు సాధువు. ఆ సాధువు వచ్చింది పెద్ద విశేషం కాదు. వారికి శ్రీవారి దర్శనమే పరమావధి కాబట్టి క్షణం క్షణం! అదే స్మరణతో సమయం లెక్కించుకొని వచ్చాడు. అయితే ఈ భక్తవత్సలుడు సమయానికి తన భక్తునికై ఎలా పరుగెత్తుకొచ్చారో. చూడండి.

ఈ విధంగా స్వామివారి పరిపూర్ణత్వం గురించి, సర్వజ్ఞత్వం గురించి అనేకసార్లు విని ఉన్నాము. దానిని అనుభవంలోనికి తెచ్చుకోమంటున్నాడే ఈ సాధువు, అదెలా సాధ్యం. ఇప్పుడు ఆలోచిస్తుంటే వారి సన్నిధిలో మేమనుభవించిన ఒకానొక శాంతి, ఆనందం, ఒకానొక పూర్ణత్వం ఆ పరిపూర్ణ స్వరూపుని లక్షణమేనని లీలగా ద్యోతకమవుతోంది.

ఏది తెలిస్తే అన్ని విషయాలు ఎరిగిన వాడవుతున్నాడో అట్టి విషయాన్ని అనుభవం లోనికి తెచ్చుకొని అదే అనుభవంలో ఓలలాడినవారు మహాస్వామి. దీనినేకదా శంకరులు తైత్తీరియ భాష్యంలో సర్వజ్ఞత్వం అన్నారు. శివునికి సర్వజ్ఞుడని పేరు. శంకరులకూ సర్వజ్ఞులని పేరు. నాకు అత్యంత ప్రియమైన మా చల్లా విశ్వనాథ శాస్త్రి గారు రాసిన వ్యాసం

మేము రాజకీయాలు చేస్తాము.

 సమాజానికి ఉపయోగపడని సినీ నటులను సినీ క్రికెట్ రాజకీయం రంగాన్ని ప్రజలు నెత్తిన మోసుకుంటుంటే సమాజం ఎటుపయనిస్తుంది సంపద అంతా పనికిరాని వారి దగ్గరే క్రూడికృతం అవుతుంది సమాజానికి వీరి నుంచి ఎటువంటి ఉపయోగం లేదు. ఆధ్యాత్మికవేత్తలు విద్యారంగం విజ్ఞానులు వైద్యరంగం ఆధ్యాత్మికవేత్తల్ని శాస్త్రవేత్తల్ని విద్యావేత్తలను వైద్య నిపుణులను పరిసర ప్రేమికులను ఖగోళ శాస్త్రజ్ఞులను భుజానమోయండి వీరివల్ల సమాజం ఉపయోగపడుతుంది. ఇటువంటి వారికి దేశంలో సరైన ఆదరణ లేక ఇతర దేశాలకు వలస వెళ్లవలసి వస్తుంది మోయాల్సిన వారిని వదిలేసి సమాజానికి భారమైన వారిని మోస్తున్నారు ప్రజలు దీనివల్ల ఈ దేశం అభివృద్ధి పథంలో ఎదగడానికి ఇటువంటివే బాలారిష్టాలు చాలా ఉన్నాయి ఈ విధంగా చాలా విభాగాల్లో వీరి సంపాదనలో తేడా ఎందుకు ?ఉంది సమాజానికి ఎటువంటి ఉపయోగం లేని వారిని అనవసరంగా ప్రజలు మోస్తున్నందుకేనా?


Cost of Mangalyan 447 cr

Cost of Brahmastra movie 450 cr


#మంగళయాన్ ధర 447 కోట్లు

#బ్రహ్మాస్త్ర0 సినిమా ఖర్చు 450 కోట్లు


ఆలోచింపజేసే సందేశం.

అద్భుతంగా రాశారు.

ఎవరిని కించపరచాలి అనే ఉదేశం కాదు.

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అనే...........


ఒక్కో సినిమాకి 50 కోట్లు లేదా 100 కోట్లు వసూలు చేసే ఈ సినిమా నటులు లేదా నటీమణులు ప్రజలకు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు.


అగ్రశ్రేణి సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అధికారులు తదితరులకు ఏడాదికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమే సంపాదన ఉంటే, అదే దేశంలో ఒక సినిమా నటుడు ఏడాదికి 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు!


అతను ఏమి చేస్తాడు అసలు?


దేశాభివృద్ధిలో వారి సహకారం ఏమిటి? అంతెందుకు, దేశంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సంపాదించడానికి 50 ఏళ్లు పడితే కేవలం ఒక్క సంవత్సరంలోనే అంత సంపాదించడానికి వారు ఏమి చేస్తారు!


నేడు దేశంలోని కొత్త తరాన్ని ఆకట్టుకున్న మూడు రంగాలు సినిమా, క్రికెట్ మరియు రాజకీయాలు.


ఈ మూడు రంగాలకు చెందిన వ్యక్తుల సంపాదన, పలుకుబడి అన్ని హద్దులకు అతీతం.


ఈ మూడు ప్రాంతాలు ఆధునిక యువతకు ఆదర్శాలు, అయితే వారి విశ్వసనీయత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.


కనుక ఇది దేశానికి, సమాజానికి పనికిరాదు.


బాలీవుడ్‌లో డ్రగ్స్ మరియు వ్యభిచారం, క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, గూండాయిజం మరియు రాజకీయాల్లో అవినీతి. వీటన్నింటికీ డబ్బు ప్రధాన కారణం మరియు ఈ డబ్బును వారికి అందించేది మనమే.


మన డబ్బును మనమే తగులబెడుతూ మనకు హాని చేసుకుంటున్నాం. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట.


70-80 ఏళ్ల క్రితం వరకు ప్రముఖ నటీనటులు సాధారణ జీతం పొందేవారు.


30-40 ఏళ్ల క్రితం క్రికెటర్ల సంపాదన కూడా ఎక్కువగా ఉండేది కాదు.


30-40 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ఇంత దోపిడీ ఉండేది కాదు.


మెల్లగా వాళ్ళు మనల్ని దోచుకోవడం మొదలుపెట్టారు మరియు మనం వాళ్ళు దోచుకోవడానికి సహకరిస్తున్నాం.

 

ఈ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుని మన పిల్లల భవిష్యత్తును, మన దేశాన్ని నాశనం చేసుకుంటున్నాం.

 

50 ఏళ్ల క్రితం ఇంత అసభ్యంగా, సినిమాలు తీయలేదు. క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఇంత అహంకారంతో ఉండేవారు కాదు. ఈరోజు వాళ్ళు మన దేవుల్లయ్యారు(?). ఇప్పుడు వాళ్ల నిజమైన స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా వాళ్ల తలని పైకెత్తి చెంపదెబ్బ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది.


*ఒకసారి, అప్పటి వియత్నాం అధ్యక్షుడు హో-చి-మిన్, భారత మంత్రులతో సమావేశానికి భారతదేశానికి వచ్చినప్పుడు "మీరు ఏమి చేస్తారు?" అని అడిగారు.*


వారు చెప్పారు - "మేము రాజకీయాలు చేస్తాము."


ఈ సమాధానం అతనికి అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ అడిగాడు - "అంటే, మీ వృత్తి ఏమిటి?"


వీళ్ళు చెప్పారు - "రాజకీయం మా వృత్తి."


*హో-చి మిన్‌కి కొంచెం చిరాకు వచ్చి ఇలా అన్నాడు - "మీకు నా ప్రశ్న అర్థం కాకపోవచ్చు. నేను కూడా రాజకీయాలు చేస్తాను, కానీ వృత్తి రీత్యా నేను రైతును మరియు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం నా జీవనాధారం. ఉదయం మరియు సాయంత్రం నేను నా పొలాలకు వెళ్లి పని చేస్తున్నాను. పగటిపూట రాష్ట్రపతిగా దేశం కోసం నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను."*


అదే విషయాన్ని హో-చి-మిన్ మళ్లీ అడగ్గా, ప్రతినిధి బృందంలోని ఒక సభ్యుడు భుజం తట్టి చెప్పాడు - "రాజకీయాలు మా వృత్తి."


దీనికి భారత నాయకుల వద్ద సమాధానం లేదని స్పష్టమైంది. తరువాత, భారతదేశంలో 6 లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధి రాజకీయాల మద్దతుతో ఉందని ఒక సర్వే వెల్లడించింది. నేడు ఈ సంఖ్య కోట్లకు చేరింది.


కొన్ని నెలల క్రితం, యూరప్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు, వైద్యులు వరుసగా చాలా నెలలు కొంచెం కూడా విశ్రాంతి తీసుకోలేదు, అప్పుడు ఒక పోర్చుగీస్ వైద్యుడు కోపంగా అన్నాడు - *"రొనాల్డో దగ్గరికి వెళ్ళు, అతనికి మిలియన్ డాలర్లు ఇస్తారుగా అతని ఆట చూడటానికి. నాకు మాత్రం కొన్ని వేల డాలర్లు మాత్రమే లభిస్తాయి."*


*ఏదైనా ఒక దేశంలో యువ విద్యార్థుల ఆదర్శం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు కాకుండా నటులు, రాజకీయ నాయకులు మరియు క్రీడాకారులు అయితే అది వారి స్వంత ఆర్థిక పురోగతికి మాత్రమే దోహద పడవచ్చు కానీ దేశ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగ పడదని నేను గట్టిగా నమ్ముతున్నాను.*


సామాజికంగా, మేధోపరంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా దేశం ఎప్పుడూ వెనుకబడి ఉంటుంది. అటువంటి దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటుంది.


*ఏ దేశంలో అనవసర, అప్రస్తుతమైన రంగాల ఆధిపత్యం పెరుగుతుందో, ఆ దేశం రోజురోజుకూ బలహీనపడుతుంది. దేశంలో అవినీతిపరులు, దేశ వ్యతిరేకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిజాయితీపరులు అట్టడుగున ఉంచబడతారు మరియు కష్టతరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది.*


ప్రతిభావంతులైన, నిజాయితీ గల, మనస్సాక్షి ఉన్న, సామాజిక కార్యకర్తలు, పోరాట యోధులు మరియు దేశభక్తి గల పౌరులను పెంపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించాలి..... ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి🙏

అట్ల తద్ది*

 _*అట్ల తద్ది*_



సౌభాగ్య‌దాయిని *‘అట్ల‌త‌ద్ది’*

అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. *‘తదియ’* నే *‘తద్దె’* అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. *అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌* అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో  కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.


*అట్ల తద్ది కథ*


అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి *‘చంద్రోదయ ఉమావ్రతం’* అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.


కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.


*అట్లతద్ది అంతరార్థం*


*త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది.* స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి     వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.


ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.

రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.


ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు *‘అట్లతద్ది’* అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.


సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.


*అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం*



చాంపేయ గౌరార్థ శరీరకాయై

కర్పూర గౌరార్థ శరీరకాయ

ధమిల్ల కాయైచ జటాధరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ II


కస్తూరికా కుంకుమ చర్చితాయై

చితారజః పుంజ విచర్చితాయ

కృత స్మరాయై వికృత స్మరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ II


ఝణత్క్వణత్కంకణ నూపురాయై

పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ

హేమాంగదాయై భుజగాంగదాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ II


విశాల నీలోత్పల లోచనాయై

వికాసి పంకేరుహ లోచనాయ

సమేక్షణాయై విషమేక్షణాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ II


మందార మాలా కవితాలకాయై

కపాల మాలాంకిత కంథరాయ

దివ్యాంబరాయై చ దిగంబరాయై

నమశ్శివాయై చ నమశ్శివాయ II


అంభోధర శ్యామల కుంతలాయై

తటిత్రభా తామ్ర జటధరాయ

నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ II

 

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై

సమస్త సంహారక తాండవాయ

జగజ్జనన్యై జగదేక పిత్రే

నమశ్శివాయై చ నమశ్శివాయ II


ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై

స్ఫురన్మహా పన్నగ భూషణాయ

శివాన్వితాయై చ శివాన్వితాయ

నమశ్శివాయై చ నమశ్శివాయ II


ఏతత్పఠే దష్టక నిష్టదం యో

భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ

ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం

భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః


*ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్*

మనసు* కు శిక్షణ ఇచ్చుకోవాలి

 నేటి ఆణిముత్యాలు. 


జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు, కేవలం నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది.*_

 *కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు*

 *కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు,*

 *కొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు,*

 *ఇంకా కొందరు పడిపోయి ఎలా నిలబడలో నేర్చుకుంటారు,*

 *జీవితం అనేది ఒక పాఠశాల, ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది*.. 


*మనిషి జీవితంలో, ఆపదలకు మూలం అజాగ్రత్త, పతనానికి మూలం అహంకారం,,*_


_*జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి, మనకు మంచి చేసిన వారిని మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి,,*_


_*కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది,, అందుకే దుష్టులతో స్నేహం మంచిది కాదు,,*_


_*ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు, ఇది సత్యం,,*_


_*మనసు చెడు ఆలోచనలతో నిండిపోయినప్పుడు, మంచి చెప్పేవారు శత్రువులు గాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు,,



మీ *పెదవుల* మీద అతికించుకున్న *చిరునవ్వు* ను చూసి *నువ్వు* ఆనందంగా *ఉన్నావని* అందరు అనుకుంటున్న *క్షణంలోనే* నీ *కళ్ల* లోని భాదను *పసిగట్టగలిగినవారే* *స్నేహితులు*


       మన *జీవితంలో* ప్రతి మలుపులోను *ప్రమాదాలుంటాయి*.. వాటినీ మనం *దైర్యంతో* ఎదురుకుంటూ *ముందుకు* వెళ్ళాలి, కానీ వాటికీ బయపడి *ప్రయాణమే* ఆపితే *జీవితానికి* అర్థం లేదు


          ప్రస్తుత *పరిస్థితులబట్టి* మనం కొన్ని *అలవాటు* చేసుకోవాలి.అది *బంధమైన* వస్తువులైన *మనుషులైనా*, అందుకే అన్నిటికీ మనము *సిద్ధంగా* ఉండేలా మన *మనసు* కు శిక్షణ ఇచ్చుకోవాలి


        జీవితం ఎంతో *చిత్రంగా* ఉంటుంది.. ఎవరు తెలియని ఈ *ప్రపంచంలోకి* ఏమి *తెలియకుండా* వస్తాము.. తెలియకుండా వచ్చినా *మననే సర్వస్యం* అయ్యేలా ఎన్నో *బంధాలు* కలుపుకుంటాము.. చివరికి *ఎవరికీ చెప్పకుండానే* అన్నిటిని *తెంచుకొని* పోతాము


సేకరణ.మీ రామిరెడ్డి మానస సరోవరం.

సూర్యగ్రహణం

 *అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం*


*ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత*

................


తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో *అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు*. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. 

.............

*సూర్యగ్రహణం రోజు*

...............

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం *సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు* సూర్యగ్రహణం ఉంటుంది. 


ఈ కార‌ణంగా *ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి* ఉంచుతారు. అనంత‌రం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

.................

*చంద్రగ్రహణం రోజు*

....................

 న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం *మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు* చంద్ర‌గ్రహణం ఉంటుంది. 


ఈ కార‌ణంగా *ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌ వరకు* శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఆ తర్వాత  స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

...............

*తిరుమల లో టీటీడీ అన్నదానం ఉండదు*

................

 గ్రహణం రోజుల్లో గ్రహణం తొల‌గిపోయే వరకు వంట చేయరు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ *అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో కూడా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు*. 


భ‌క్తులు ఈ విషయాన్ని గమనించి, *రెండు గ్రహణాలు ఉన్న రోజుల్లో అసౌకర్యానికి గురికాకుండా* త‌మ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ  విజ్ఞప్తి చేస్తోంది.

................