*అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం*
*ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత*
................
తిరుమల శ్రీవారి ఆలయంలో *అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు*. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
.............
*సూర్యగ్రహణం రోజు*
...............
అక్టోబరు 25న మంగళవారం *సాయంత్రం 5.11 గంటల నుండి 6.27 గంటల వరకు* సూర్యగ్రహణం ఉంటుంది.
ఈ కారణంగా *ఉదయం 8.11 నుండి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి* ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
.................
*చంద్రగ్రహణం రోజు*
....................
నవంబరు 8న మంగళవారం *మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు* చంద్రగ్రహణం ఉంటుంది.
ఈ కారణంగా *ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటల వరకు* శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఆ తర్వాత సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
...............
*తిరుమల లో టీటీడీ అన్నదానం ఉండదు*
................
గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ *అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు*.
భక్తులు ఈ విషయాన్ని గమనించి, *రెండు గ్రహణాలు ఉన్న రోజుల్లో అసౌకర్యానికి గురికాకుండా* తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి