19, మే 2021, బుధవారం

నివేదనల పేర్లు

 🍓🍒🍎🍉🍑🍊🥭🍍🍌🍋🍈🍏🍐🥝🍇

నివేదనల పేర్లు

🍈🍋🍌🍏🍐

1)చూతఫలం=మామిడిపండు

 2)ఖర్జూర= ఖర్జూరం.              

3)నింబ=వేప

4)నారింగ=నారింజ

5)భల్లాతకీ=జీడిపప్పు

6)బదరీ=రేగు

7)అమలక=ఉసిరికాయ

8)శుష్కద్రాక్ష=కిస్మిస్ 

9)అమృత లేక బీజాపూరం= జామపండు

10)ఇక్షుఖండం=చెఱకుముక్క

11)కదళీఫలం,రంభా ఫలం=అరటిపండు

12)నారికేళం=కొబ్బరికాయ

13)జంభీర= నిమ్మ పండు

14)దాడిమీ=దానిమ్మపండు

15)సీతాఫలం= సీతాఫలం

16)రామఫలం= రామఫలము

17)కపిత్త=వెలగ పండు

18)శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు

19)మాదీ ఫలం=మారేడు పండ్లు

20)జంభూఫలం=నేరేడు

 ప్రసాదములు.  

21)వాతాదం= బాదము పప్పు


1)కుశలాన్నం =పులగం


2)చిత్రాన్నం=పులిహోర


3)క్షీరాన్నం=పరమాన్నం


4)పాయసం=పాయసం 


5)శర్కరాన్నం= చక్కెరపొంగలి


6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి


7)దధ్యోదనం= పెరుగు అన్నము


8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం


9)శాకమిశ్రితాన్నం=కిచిడీ


10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం


11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం


 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)


12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు


13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి


14)మధురపానీయ=పానకం


15)పృథక్=అటుకులు


16)పృథకాపాయస=అటుకుల పాయసం


17)లాజ=పేలాలు


18)భక్ష్యం= పిండివంటలు


19)భోజ్యం= అన్నము మొదలగునవి


20)వ్యంజనం=పచ్చడి


21)అపూపం=అరిసెలు లేదా అప్పములు


22)మాషచక్రం= గారెలు


23)లడ్డుక,= లాడూలు


24)మోదకం= ఉండ్రాళ్లు

🍓🍒🍎🍉🍑🍊🥭🍍🍌🍋🍈🍏🍐🥝🍇

ఈ పూర్తి విశ్వం... నాద మయం.

 ఈ పూర్తి విశ్వం... నాద మయం. 

సృష్టిలోని ప్రతీ వస్తువూ, జీవి ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే Vibrating Frequency ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న Covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz vibrating frequency దగ్గర మనలేదు. 


ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో covid పెద్ద ప్రమాదకారి కాదు. 

కేవలం కాస్త ఆనారోగ్యం కలిగించ గలదు అంతే. 

చాలా త్వరగా కోలుకుంటారు. 

అంటే ఇప్పుడు పెంచుకోవాల్సింది vibrating frequency. 


ముందు మనుషుల్లో vibrating frequency ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. 

భయం, ఫోబియా, అనుమానం, ఆందోళన, ఒత్తిడి, కోపం, ద్వేషం, దురాశ, మోసం, బాధ, విపరీతమైన మోహం వంటివి మనలోని ప్రకంపనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.


ప్రస్తుతం భూమండల సగటు vibrating frequency 27.4 Hz. Hospitals, Cellular, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది. లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. 

ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది. 


*భావోద్వేగాల frequency:*

మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీ తో vibrate అవుతాయో ఒక సారి చూద్దాం.


బాధ - 0.01 Hz

భయం - 0.2 - 2.2 Hz

చికాకు -  0.9 - 6.8 Hz

చప్పుళ్ళు - 0.6 - 2.2 Hz

గర్వం - 0.8 Hz

దర్పం - 1.9 Hz


ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. 

వీటి వల్ల మనుషుల vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం. 


*ఏదీ మంచిది ?*

ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం. 


దయ - 95 Hz

కృతజ్ఞత -250 Hz

సానుభుతి - 150 Hz

బేషరతు ప్రేమ - 250 Hz


So... Comeon let's vibrate higher. 

ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్య రస్మి లో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం high frequency లో vibrate కావచ్చు. 


సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన vibrating frequency ని పెంచుకోవచ్చు. 


కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యం లో గడపడం, ధ్యానం చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీ ని పెంచుకోవచ్చు. 


ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... 

నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుదాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టి తో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. 

మన vibrating frequency ని పెంచుకుందాం. 


Note: ఈ సమాచారం మొత్తం Power vs Force అనే పుస్తకం నుంచి సేకరించింది. 

ఇది డేవిడ్ హాకిన్స్ రాసిన Doctoral Thesis లోనిది.

వాల్మీకి కవిత్వం

 వాల్మీకి కవిత్వం అంటే... 


సుకుమారీం సుజాతాంగీం

రత్న గర్భ గృహోచితాం. 

సుందరాకాండ 19 వ సర్గ 18 వ శ్లోకం మొదటి 2 పాదాలు. 


హనుమంతుడు సీతను చూచి ఆవిడ సీత  అని గుర్తు పట్టే సదర్భం. 


ఇందులో మొదటి పాదం అర్థం చేసు కోవడం లో పెద్ద ఇబ్బంది లేదు. ఆమె లావణ్యం సౌకుమార్యం చూసి గొప్ప వారి ఇంట్లో పుట్టిందని  నిర్ణయిస్తాడు. 


ఇక రెండో పాదం వాల్మీకి శ్లేష  కవిత్వం.


రత్న గర్భ గృహోచితాం. :- 


ఇది మొత్తం ఒకటే సమాసం.


ఈ సమాసం పూర్తి గా తెలియాలంటే క్రింది పదాలకు నానార్థాలు తెలియాలి. 


1. రత్న గర్భ:- పుంలింగం లో సముద్రుడు. స్త్రీ లింగంలో భూమి. 


2. గృహం :- ఇల్లు / భార్య.


ఈ సమాసానికి వచ్చే అర్థాలు:


A. సముద్రుడి ఇంట్లో వుండదగినది. (సముద్రుడి కూతురు)

B.భూదేవి  ఇంట్లో వుండదగినది (భూదేవికూతురు).

C. సముద్రం ఇల్లుగా కలవాడు విష్ణువు. అతనికి ఉచితా అతనికి భార్యగా తగినది. 

D. భూదేవిని భార్యగా కలవాడు విష్ణువు. అతనికి ఉచితా అతనికి భార్యగా తగినది. 


సుందరాకాండ 15 వ సర్గ 33 & 34 శ్లోకాలు. ఈ రెండు శ్లోకాలలో వాడిన ఉపమానాలు అన్నీ "యా దేవీ సర్వ భూతేషు ... రూపేణ సంస్థితా" అని చెప్పిన పరదేవతా నామాలు. 


ఆంజనేయుడు ఆమెను కేవలం సీతా దేవి అని మాత్రమే చూడలేదు. ఆమె పరతత్వా న్ని కూడా  నిర్ణయించాడు.


సుందరాకాండ 15 వ సర్గ శ్లోకం: 51.

అస్యా దేవ్యా యధా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం 

రామస్య చ యధా రూపం తస్యేయ మసితేక్షణా.


ఈ శ్లోకం లో  నానార్ధాలు లేవు. కానీ

తాత్విక మైన రహస్యం ఉంది. 


దేవతా జంటలలో పంచ సమ్యాలు ఉంటాయి. రూప సామ్యము అధిష్టాన సామ్యము మంత్ర సామ్యము మొదలైనవి. వీటి గురించి ఆది శంకరుల అర్ధ నారీశ్వర స్తోత్రం వ్యాఖ్యానం లో చూడవచ్చు.  ఈ శ్లోకం లో సీతా రాముల రూప సామ్యం గురించి వాల్మీకి వ్రాశాడు. 


సంస్కారము అర్హతా ఉన్న జ్ఞానులకు ఈ సామ్యం కనపడుతుంది. అంటే అంత జ్ఞానం ఉన్న వాళ్ల కు ఈ జంటలో ఒకరిని చూస్తే రెండో వాళ్ళు గుర్తు వస్తారన్న మాట!!..


సంస్కారము అర్హతా ఉన్న జ్ఞానులకు ఈ సామ్యం కనపడుతుంది. అంటే అంత జ్ఞానం ఉన్న వాళ్ల కు ఈ జంటలో ఒకరిని చూస్తే రెండో వాళ్ళు గుర్తు వస్తారన్న మాట.

ఈ శ్లోకం లో ఉన్న భావం నచ్చి వేద వ్యాస మహర్షి భాగవతం లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం లో చిన్న వ్యాఖ్యానం లాంటి వర్ణన చేశాడు. దశమ స్కంధం  53 అధ్యాయం 37 &  38 శ్లోకాలు.  పోతన గారు దానికి "తగు నీ చక్రికి"  పద్యం వ్రాశారు. అందులో విశేషం ఆ సమయానికి రుక్మిణీ కి కృష్ణునికి పెళ్ళవుతుందని ఎవరికీ తెలీదు. పైగా శిశుపాలుడు తో పెళ్ళి కి అన్నీ ఏర్పాట్లు జరుగు తుంటాయి.... కుండిని నగర వాసులు కృష్ణుడిని చూడగానే రుక్మిణీ పెళ్ళి కృష్ణుడి తో నే జరగాలని కొరుకున్నారట. ... కుండిని నగర వాసులు మరీ జ్ఞానులు. 


త్రిజటా స్వప్నం లో గాయత్రీ మంత్ర పూర్ణ రూపం 32 అక్షరాలది సూచన గా ఉంది. అది సన్యాసులు జపించేది. మనం చేసే సంధ్యా వందనం లో ఆఖరి పాదం  8 అక్షరాలు ఉండవు. 


సుందరాకాండ లో ఈవిధ మైన కవితా చమత్కారాలు బోలేడున్నాయి. 


మిగతా కాండల లో కూడా వున్నాయి. 

సుమిత్ర వనవాసానికి వెళ్ళే ముందు లక్ష్మణుడికి చెప్పే మాట " రామం దశరథ విద్ది" అద్భుతమైన శ్లోకం. కొన్ని సుందరాకాండ శ్లోకాల లాగా దీన్ని కూడా మంత్రం గా వాడతారు. దాన్ని గురించి ఒక వ్యాసం వ్రాయ వచ్చు.   

లోకోత్తర శ్లేష లూ వర్ణన లూ వేదాంత, మంత్ర శాస్త్ర రహస్యాలు జీవితా నికి పనికివచ్చే మంచి మాట లూ  అన్నీ రామాయణం లో ఉన్నాయి. అవి అన్నీ కనిపెట్టడానికి ఒక జీవితం చాలదు!!


*పవని నాగ ప్రదీప్*

*98480 54843*

కంటేనే అమ్మ అని అంటే ఎలా:-

           🌷🌷🌷

కంటేనే అమ్మ అని అంటే ఎలా:-( విషయానికి రాసిన కథ)


" బాబ్జీగోరిని పొలాలంబడి యెల్తుంటే కోడెతాచు కరిసిందంట. మనూరి నుండి మంత్రాల మల్లయ్యకోసం వొచ్చారు ఆళ్ళ బామ్మరుదుల మడుసులు! పేణాలుంటాయో పోతాయో తెల్దంట."


" యేటి రంగమ్మా నువ్వుచెప్తున్నావు? నిన్నేకదా నన్ను పెద్దాసుపత్రిలో చూపించి ఆయనెళ్ళారు. వారం పోయాకా వస్తానన్నారు. నిజవేనా నువ్వు చెప్పేది! దేవుడా ఏటీ ఘోరం".....నూకరత్నం బిగ్గరగా తలబాదుకుంటూ ఏడవసాగింది. 


" రత్నంగోరూ! మనకి ఒద్దే టయాం లేదు. నడండి. ఇంట్లో డబ్బూ, నగలూ గట్రా ఏటుంటే అది మూటకట్టండమ్మా! మందులూ, నూలుసీరలూ పెట్టుకోండి. మనం బయలెల్లిపోవాలి. ఏటయానికయినా సరోజినీగోరు మడులుల్ని పంపచ్చు. లెగండమ్మా! లెగండి! "


" ఆయన లేని బతుకు నాకూ వద్దు. ఆళ్ళు చంపేత్తే ఆనందంగా చచ్చిపోతా! నువ్వెళ్ళిపో రంగా" 


" ఊరుకోమ్మా తల్లే! ఈ యేళో రేపో పెసవించడానికి రెడీగున్నవు! నువ్వనాలిసిన మాటలేనా! లెగు లెగు! గట్టవతల మా యక్క మంత్రసాని. దానింటికి పోదాము. బిడ్డపుట్టాకా ఆలోసిద్దాం ఏం చేద్దారో! ఇదిగో ఈ తురకోల్ల బురకాలు తెచ్చేను. బేగా సద్దమ్మా" 


ఆ మిట్టమధ్యాహ్నం గుట్టమీద దర్గా దగ్గర .... నెత్తిన మూటలు దించుకుని ...వేపచెట్టుకింద కూచుని సేదతీరుతున్న ఆ ఆడోళ్ళిద్దరూ .... దూరంగా పొలాల్లోంచి పైకి లేస్తున్న మంటలూ, పొగనూ చూస్తూ నిలువునా వణికిపోయారు! 


                      *****^******


" సరోజినమ్మా! సరోజినమ్మా! " ..... బయటితలుపు దబాదబా బాదుతోంది చాకలమ్మ! 

తలుపు తీసిన పాలేరుతో.... " బావూ! గొల్లపూడి నుండి వచ్చా! అమ్మగారికి సొమ్ములప్పగించడానికొచ్చా! " .... ఆమె చేతిలో వున్న పెద్ద వెదురుబుట్టను చూసి... పక్కకు తప్పుకుని దారిచ్చాడు పాలేరు. పూలమొక్కలతో ఉన్న పెద్దవాకిలిని దాటి... పక్కసందులోండి పెరట్లోకి తీసుకెళ్ళాడు. 


బయటకొచ్చిన సరోజినికి... రంగమ్మ చెప్పిన వూరుపేరు వినగానే మొహం కోపంతో జేవురించింది. పాలేరును పొమ్మనమని సైగచేసి.... " ఎవతివే నువ్వు. నా సయితి వూరునుండి ఏటి సొమ్ములు తెచ్చావు? అంత పెద్దదానివా! "..।. అంటూ రౌద్రంగా అరిచింది. 


      రంగుమనిషయినా.... ఒడ్డూపొడవుగా.... నడుముదాటిన దుబ్బలాంటి ఉంగరాలజుట్టుతో, పెద్దపెద్ద పొడుచుకొచ్చినట్టు ఉండే కళ్ళతో, చెంపలంతా రోమాలతో.... చూడగానే భీతికొల్పేట్టు ఉంటుంది సరోజిని రూపం! 


ఉలికిపాటు కప్పుకుని...." బిడ్డడమ్మా! అయ్యగోరి బిడ్డ! కనేసీ.... మూన్నెల్లు నిండగానే...మా యప్ప దగ్గరే ఒగ్గేసీ... రాత్రికి రాత్రి పారిపోనాది. యెలయాలు బుద్ధి గందా. మావెక్కడ ఈ బుడ్డోడిని పోసించగలం? మీకే అప్పగించేద్దారి అని తెచ్చా! పెద్దమనసు చేసుకుని అయ్యగారి బిడ్డడని ఉంచుకుంటారో.... సీ! నా సయితి సంతానమని సంపుకుంటారో మీ ఇట్టం! " ...... ఆవిడిచ్చిన మజ్జిగ గటగటా తాగేసి..." వత్తానమ్మా! పెద్దమనసు సేసుకోండి అమ్మగోరూ!".... అంటూ వెళ్ళిపోయింది రంగమ్మ! 


             లోపలినుంచి అంతా వింటున్న సరోజినీ అత్తగారు వాకర్ సాయంతో బయటకొచ్చింది. " పెంటకుప్పల్లో పడేయ్ ....కొడుకుని! ఈడు మన రత్తమూ కాదూ మన వొంసెమూ కాదు! దాని యాపారం అది చేసుకోడానికి పోయుంటాది ఈడిని మనకు అంటగట్టి! ఈడొద్దు మనకి! నీ ఆడబొట్టి రెండో కొడుకును పెంచుకో! "..... అంటూ గదిలో పడుకున్న కొడుకు వినకుండా మెటికలు విరుస్తూ శాపనార్ధాలు పెట్టి... ఉచితసలహా ఇచ్చింది! 


సరోజిని అప్రయత్నంగా వెదురుబుట్ట మూత పైకెత్తింది. పొత్తిళ్ళలో రెండుచేతులూ గుండెమీద పెట్టుకుని ఆదమరచి నిద్రోతున్న మూడునెలల బిడ్డడు. ఒక్కసారి కళ్ళలో పడ్డ వెలుగుకు విసుగ్గా కళ్ళుతెరిచాడు. సరోజిని గండుమొహం చూసి మరొకరయితే దడిచిపోదురు.... వీడు బతకనేర్చిన వాడిలా ఆమెను చూస్తూనే నోరారా నవ్వాడు. 


పిల్లాడిని చూడగానే ... కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న బాబ్జీపోలికలు... ఆమె మనసులో కోపాన్ని చివ్వున ఎగదోసాయి! సంభాళించుకుని.... పిల్లాడిని పొత్తిళ్ళలోంచి పైకి తీసింది సరోజిని. పెళ్ళయి పద్దెనివిదేళ్ళు. తన నోటికి, తన అంతస్థుకూ జంకి పైకి అనడానికి సాహసించరు కానీ .... నిస్సంతు అని ముద్ర పడిపోయింది జనాల్లో! 


"ఇప్పుడీ బిడ్డను చేరదీయాలా? ఒదిలించుకోవాలా? తన అన్నలకు తెలిస్తే...అగ్గిమీద గుగ్గిలం అవుతారు. నిండుచూలాలితో  ఉన్న ఇల్లు నిప్పెట్టించారని తెలిసీ... ఇంత గయ్యాళిదీ... తనే పాపభీతితో తల్లడిల్లిపోయింది. ఒకపక్క పాముకాటుకు విషమెక్కి కాలూ చెయ్యీ పడిపోయి మంచమ్మీదున్న మొగుడు! మరో వేపు అన్నలు చేసిన మారణహోమం! 


పిల్లాడిని అలా జీవంతో చూసేసరికి సరోజిని మనసెందుకో చాలా తేలికయింది. " చూద్దాం! ప్రస్థుతానికి ఉండనిచ్చీ... తరవాత ఏం చెయ్యాలో చూస్తే పోతుంది! 


"..... అనుకుంటూ పాలేరునీ, అతని భార్యనూ పిలిచి " తెలిసినోళ్ళు పెంపకానికి పంపారు! అందాకలకు మీదగ్గర ఉంచండి " అని అప్పగించింది.... మళ్ళీ తనను చూసి ముఖమంతా పాకేలా నవ్వుతున్న ఆ బుజ్జిపాపడిని తనివితీరా చూసుకుంటూ! 


                        ************


"#ఆరహస్యంనీవద్దఉన్నంతసేపేవాడునీమాటవింటాడు"!గుర్తుంచుకో!  " అత్తగారి మాటలకు మ్రాన్పడిపోయింది సరోజిని. 


"పాతికేళ్ళు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తనమాట వినకుండా పోతాడా? పెంచిన ప్రేమ కన్నప్రేమ కన్నా గొప్పదంటారే! కిషోర్ అంత తొందరగా మారిపోతాడని తనకస్సలు సందేహమే లేదు. అతని కన్నతల్లి ఎవరో అతనికి తెలుసుకునే హక్కేలేదా! పదేపదే తన మూలాల గురించి కిశోర్ అడుగుతుంటే.... ఏమీ చెప్పకుండా ఎన్నాళ్ళని!? 


వాడు చెన్నైలో చూసిన ఒకామె... తనను పట్టిపట్టి చూసి వివరాలడిగిందని, ఆమెను మళ్ళీ తమ వూరిలో గుడిదగ్గర కారాపుకుని వివరాలడుగుతుంటే....చూసానని చెప్తుంటే... ఆమె నూకరత్నమే అయుంటుందని తెలిసినా నోరిప్పలేకపోయింది తను ! ..... 


కిశోర్ రాకతోనే ....తన జీవితంలో, తన మనసులో కప్పెట్టేసిన గతమంతా మళ్ళీ సరోజిని బుర్రలో గిర్రున తిరుగసాగింది! 


           గొల్లపాలెం సూర్రావుగారి అబ్బాయి  సంబంధమని తండ్రీ, అన్నలూ ఎంత మురిసిపోయారో! ఒక్కడే కొడుకూ.... పెద్ద ఆస్థి వాళ్ళకు నచ్చితే... తనకు అతని అందం మహానచ్చేసింది. తన అదృష్టవశాత్తు తన తండ్రి వాళ్ళతో తూగగలిగాడు... బాబ్జీ తనవాడయ్యాడు. 


అతనికది మొక్కుబడి కాపురమే అయినా తాపత్రయమంతా తనదే! మొగుడిమీద మోజుతో తనే ఎన్ని కొనిపెట్టేదో కారుతో సహా! ఐదేళ్ళు సజావుగానే సాగిన కాపురం... ఇద్దరిమధ్యా బంధం గట్టిపరచడానికి పిల్లలు లేకపోవడం వలన పలుచన అయిపోసాగింది. 


        దానిమీద మావగారి మరణం ! బాబ్జీని బాధ్యతలనుండి దూరం చేసి.... అక్కరలేని ఆస్థులపెత్తనం తనకు చుట్టుకుంది. అజమాయిషీకోసం... ఉన్న కరుకుతనానికి గడుసుతనం కలుపుకుని.... గయ్యాళిది, గట్టిపిండం అని పేరుపడిపోయింది. 


ఆపై తన అన్నగార్లు వ్యవహారాల్లో కల్పించుకుని జులుం చెయ్యడం... మెల్లమెల్లగా బాబ్జీగారిని ఇంటికి దూరం చేసి... చిన్నిళ్ళ చుట్టూ తిరిగేట్టు చేసింది. నయానా భయానా చెప్పినా .... ఆయన తిరుగుళ్ళు మానలేదు. 


చివరగా కత్తిపూడిలో రికార్డింగు డాన్సు ట్రూపులో... ఈ నాగరత్నం డాన్సాడనని ఏడుస్తుంటే.... డబ్బిచ్చి విడిపించి... గొల్లపూడిలో పెట్టాడు. తను ఆ అమ్మాయిని వదిలేసి ఇంటిపట్టునుండండని మొత్తుకుంటే..... " ఆ నూకరత్నాన్ని ప్రేమిస్తున్నా! పెళ్ళాడతా" నన్నాడు! ఆఖరికి మంచం పట్టి తనకు పుస్తై కూచున్నాడు! 


            కిశోర్ ను నాగరత్నం మీద కోపాన్నంతా మర్చిపోయి తన బిడ్డలాగే గారంగా పెంచుకుంది. వాడి నవ్వులతో, ఆటపాటలతో ఇల్లంతా కలకలలాడిపోయింది. రెండేళ్ళకు భర్త మెల్లగా కోలుకోసాగాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు! 


కిషోరు కూడా మంచిచదువులు చదువుకున్నాడు. ఆస్తుల కంజాయింపు, అందరితో వ్యవహారంలో తలలో నాలుకలా ఉంటూ మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. తనంటే పంచప్రాణాలు! కొడుకూ, మారిన భర్తతో తన జీవితం సాఫీగా సాగిపోతుంటే మళ్ళీ ఇప్పుడొక కుదుపు! ........


       ఆరోజు సాయంత్రం కొడుకును ఆరుబయట మల్లెపందిరి పక్క... తులసికోట గట్టుమీద కూచోపెట్టి.... పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసింది సరోజిని! తల్లిమాటలు వింటున్న కిశోర్ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. 


ఆమెమాటలు పూర్తవడంతోనే.... ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. ఏదో నిర్ణయించుకున్నట్టు....." అమ్మా! ఆమె జన్మనిచ్చిందేమో కానీ నువ్వు బతుకునిచ్చావు. రంగమ్మ నన్ను నీ దగ్గరకు చేర్చకపోతే నా జీవితం ఎలా ఉండేదో! ఆమె వలన నువ్వెంత కోల్పోయినా.... ఆమె సంతానాన్ని ద్వేషించకుండా కడుపులో పెట్టుకున్నావు. నీతో ఋుణాల గురించి మాట్లాడను. ఎందుకంటే నువ్వు నా అమ్మవి! పైగా ఆమె మంచిస్థితిలోనే ఉన్నట్టుంది. ఆమె దారిని ఆమెను పోనిద్దాం! నాన్నకు ఎట్టి పరిస్థితుల్లో ఆమె విషయం చెప్పద్దు. #ఈరహస్యంనీదగ్గరవున్నంతవరకేఆయననీమాటవినేదన్నదిగుర్తుంచుకో! తను బతికుందని తెలిస్తే.... ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు! అనుకోని అతిథులకు మన జీవితంలో స్థానంలేదు!" ..... కొడుకు దృఢంగా చెప్తుంటే చిత్తరువులా వింటూ వుండిపోయింది సరోజిని! 


" నాన్నా! ఆ చెప్పేదేదో నువ్వే స్వయంగా వెళ్ళి ఆమెతో చెప్పు. ఒక అమ్మగా ఆమెకు ఆపాటి ప్రేమనేనా పంచు! " .... తల్లిమాటలకు బుర్రూపాడు కిశోర్! 


             చీకట్లో నిలబడి... తల్లీకొడుకుల సంభాషణంతా వింటున్న బాబ్జీగారి తల సిగ్గుతో వంగిపోయింది....జీవితంలో తను వేసిన తప్పటడుగులను తలుచుకుని! 


ధన్యవాదాలతో

శశికళా ఓలేటి.

పిశాచ మోక్షము* వైశాఖ పురాణం - 8 వ అధ్యాయము*_

 _*వైశాఖ పురాణం - 8 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*పిశాచ మోక్షము*



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన , ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.


పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి ?  వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు , నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.


అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా ! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా , వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.


నేనును నా తండ్రి యజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.


కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా ! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు  శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.


ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*దత్తాత్రేయుడు..అవధూత..*


*(ముప్పై రెండవ రోజు)*


శ్రీ స్వామివారి ఉపన్యాసం, ఆ సాయంత్రం వేళ అనర్గళంగా సాగిపోతున్నది.. మొగలిచెర్ల గ్రామస్థులకు కూడా బాగా అర్ధమయ్యే రీతిలో సరళంగా బోధించసాగారు..అన్నదానం గురించి వివరిస్తూ..


"అందుచేతనే..ఇంటికి ఏ అతిధి వచ్చినా.. అన్నం పెట్టమంటారు మన పెద్దలు..ఇక చాలు!..ఒద్దు!..అనగలిగేదీ..అనిపించగలిగేదీ..ఒక్క అన్నం మాత్రమే!..ధన, కనక, వస్తు, వాహనాలు ఎన్ని ఇచ్చినా మనిషి తృప్తి పడడు.. కానీ కడుపునిండా అన్నం పెడితే..ఇక చాలు..తినలేము..తృప్తి గా ఉంది..అంటారు..అలా అతిథులకు పెడుతూ వుంటే..ఎప్పుడో ఒక మహాత్ముడు వస్తాడు..ఆ మహాత్ముని దీవెన ఆ వంశాన్ని తరతరాలూ కాపాడుతుంది.."


"ఇక..దత్తాత్రేయుడి అవతారం..ఆ అవతారమంటే నాకు ప్రత్యేకమైన భక్తి.. గౌరవం!..అదీ వివరిస్తాను..అత్రి, అనసూయ మాత దంపతులు..అనసూయ పేరు లోనే అసూయ లేని స్ర్రీ మూర్తి అని అర్ధం ఉంది..ఆ మహాసతి త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి..వాళ్ళ కోరిక మేరకు..వారిని తన ఒడిలో లాలించింది..తరువాత త్రిమూర్తిరూపంతో వారినే ఒక బిడ్డగా తనకు దత్తతగా రమ్మని కోరింది..ఆ అవతారమూర్తే..దత్తాత్రేయుడు..అత్రి, అనసూయ దంపతుల బిడ్డగా అవతరించిన దత్తాత్రేయస్వామి..వారికి గురువై, వారిని తరింపజేసాడు.. ఆయన అవతార లక్షణమే అవధూత లక్షణం!..ప్రేమమూర్తి ఆయన!..ద్వేషం ఎరుగని తత్వం ఆయనది..శిష్టరక్షణ ఆయన కర్తవ్యం..దుష్టులను సన్మార్గంలోకి మరలించటమూ..అందుకు అవసరమైన అపారమైన ప్రేమ, కరుణా కురిపించటమూ ఆయన తత్వం!..నాలుగు వేదాలూ ఆయన పెంపుడు కుక్కలుగా మారిపోయాయి..ధర్మం గోమాతాగా మారి, ఆయన చెంత చేరింది..త్రిమూర్తి స్వరూపంతో వుండి.. త్రిముఖాలతో చేతదండం..కమండలంతో నిలచినమూర్తి దత్తాత్రేయుడు.."


"విగ్రహారాధనకు అనువైన మూర్తి..మాలాంటి యోగులకు ఆ దత్తాత్రేయుడు అవధూత..సద్గురువు..భగవద్గీత లో చెప్పినట్లు..శీతోష్ణస్థితులకు చలించక, రాగద్వేషాలకూ అతీతమై..సర్వప్రాణికోటిలో దైవాన్ని దర్శించే తత్వమే ఈ అవధూత తత్వం!..అదే ఆ దత్తాత్రేయుడి తత్వం..ఆ దత్తుడు ఈ ప్రకృతి లోని ఇరవై ఒక్క లక్షణాలను గురువులుగా భావించాడు..అందులో..తుమ్మెద, స్త్రీ చేతి గాజులు..ఇలా ఉన్నాయి..ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సందేశాన్ని గ్రహించాడు..ఆ గురువుల గురించి మరలా వివరిస్తాను.."


"నాకు ఆరాధ్యదైవం దత్తాత్రేయ స్వామి..నాది అవధూత లక్షణం..నేను దిగంబరంగా ఉండటం కూడా ఆ స్వామి తత్వం లో ఒక భాగమే..దిగంబరత్వం అన్నది సామాన్యమైన విషయం కాదు..ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగల కఠోర మానసిక దీక్ష!..మానాభిమానాలకు అతీతమైన తపశ్శక్తి ఉన్నప్పుడే దిగంబరత్వం చేరుకోగలడు యోగి!..ఉత్తినే దిగంబరంగా తిరుగుతూ ..లోలోపల మానాభిమానాలకు లోనయ్యే వ్యక్తి..కపటి అయినా కావాలి..లేదా..పిచ్చివాడైనా కావాలి..అనుకరణతో అవధూత తత్వాన్ని ఎదుటివారిచేత నమ్మింపజేసేవాడైనా కావాలి.."


"అవధూత ..సద్గురువు..అయిన ఆ దత్తాత్రేయుడిని గురువుగా భావించాను కాబట్టే..నా పూర్వనామాన్ని వదిలేసి..దత్తాత్రేయుడిగా నాకు నామకరణం జరిగింది..నన్ను దత్తాత్రేయుడిగా నే పిలవండి.." 


అప్పటికి శ్రీధరరావు దంపతులకు అర్ధమైంది..శ్రీ స్వామివారిని తాము ఏనాడూ పేరుతో పిలవలేదు..ఈరోజు ఆయనే తన నామాన్ని చెప్పేసారు..తాము సాక్షాత్తూ ఆ త్రిమూర్తి స్వరూపుడిని ఇన్నాళ్లూ స్వామిగా కొలుస్తున్నామని అనుకున్నారు..


మళ్లీ స్వామివారు కొనసాగిస్తూ.."ఆ దత్తాత్రేయుడి స్వరూపంగా శిరిడీ లో ప్రకటమైన సాయిబాబా ను భావించవచ్చు..ఆయనది కూడా అవధూత సంప్రదాయమే!..నూటికో కోటికో ఒక్కరు ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అర్ధం చేసుకుని..అవధూతగా మారి..ఈ కలియుగంలో మానవాళిని ఉద్ధరించడానికి ప్రకటం అవుతుంటారు..ఈ మానవలోకం.. ముందుగా వారిని గుర్తించదు.. అంతమాత్రం చేత..ఆ అవధూత నిరాశ చెంది వెనక్కు వెళ్ళిపోడు.. తన జీవన పర్యంతమూ సమాజానికి దైవానికి వారధిగా వుండి.. ఎంతో మందిని ఉద్ధరించి..ఆ తరువాత మాత్రమే తమ అవతారాన్ని చాలిస్తారు..వారు తమ దేహ త్యాగం చేసినా.. వారి తపోశక్తి మరికొంతకాలం పాటు  ఈ మానవాళిని తరింపచేస్తూ ఉంటుంది..అవధూత అడుగు పెట్టిన భూమి క్షేత్రంగా మారుతుంది..ఇది సత్యం.." అంటూ కళ్ళు మూసుకున్నారు..


శ్రీ స్వామివారి ఉపన్యాసం ఆగింది..అప్పటిదాకా వింటున్న గ్రామస్థులు..శ్రీ స్వామివారికి మ్రొక్కి..ఇళ్లకు వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు కూడా ముగ్ధుల్లా వింటూ వున్నారు..శ్రీ స్వామివారు చెప్పిన చాలా విషయాలు ఎన్నో సార్లు ఎక్కడో ఒకచోట పుస్తకాలలో చదివినవే.. కానీ ఇప్పుడు ఆయన చెపుతున్నప్పుడు..తపస్సు..సాధన..ఆచరణ..అన్న ముప్పేట గొలుసు మంత్రం లాగా వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయింది..తమ ఎదురుగ్గా మూర్తీభవించిన అవధూత తత్వం నిలిచిఉంది అనే స్పృహ వారికి కలిగింది..తమ జన్మకు ఈ అదృష్టం చాలు అని వారిద్దరూ మనస్ఫూర్తిగా భావించారు..


శ్రీ స్వామివారు తనను దత్తాత్రేయుడి గా పిలువమని తేల్చి చెప్పిన తరువాతి రోజునుంచి..మొగలిచెర్ల గ్రామస్థులు ఆయనను దత్తాత్రేయ స్వామి  గా పిలవడం అలవాటు చేసుకున్నారు..శ్రీధరరావు దంపతులు కూడా శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు..దత్తాత్రేయ స్వామి అనే చెప్పేవారు..అలా ఆ పేరు స్థిరపడిపోయింది..


శ్రీ స్వామివారి దూరదృష్టి..ఆచారాల గురించిన అవగాహన..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).