13, ఏప్రిల్ 2022, బుధవారం

శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో.

 రాజస్థాన్‌ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.


అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.


సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్‌ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.

 

కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు...

అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు," నాయనా, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ  ఒక్క మాట విని, పాటిస్తావా?"

 

కొడుకు,“అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు.

తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు." కొడుకు ఒప్పుకున్నాడు.


కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది...

ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి "అన్నా .. ఈ మందు కావాలి.. మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది .. వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు  వేస్తేనే ... అమ్మ  బతుకుతుందని  డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?" అని అడిగాడు.


రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ ... నా దగ్గర ఉంది” అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.


అయితే ఇది ఏమిటి!! 

అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో  లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు.. ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.


" ఓరి భగవంతుడా !!" అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, "ఏమిటి ఈ విపత్తు!!" అనుకుని, అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ... ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!!"


"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... "అన్నా, నేను బురదలో  జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.


 ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!


ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది...కొందరు ఆయన్ని భగవంతుడంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!

                          ♾️

ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది. 🌼

పసిపిల్లలు పుట్టగానే

 పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 


  పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని - 


      సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.


  పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం -


     

      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 


        ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .


           వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి .


     మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి . మరిన్ని సులభయోగాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

తెలంగాణ ఘన కీర్తి*

 *తెలంగాణ ఘన కీర్తి*


నరనారాయణులు ఉన్నది రెండే క్షేత్రాలలో.... 

1). బద్రినాథ్ మరియు  *లింబాద్రి గుట్ట*, భీంగల్, నిజామాబాద్ జిల్లా. ఇది బ్రహ్మ దేవుడే తపస్సు చేసి నృసింహ స్వామిని మెప్పించిన క్షేత్రం. 

2) సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*

3) బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

4) త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*

5) ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*


*లింబాద్రిగుట్ట*

తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలో లింబాద్రిగుట్ట కు ప్రత్యేక స్థానం వుంది. ఉత్తరఖండ్, బద్రీనాథ్ తర్వాత ఆంతటి విశిష్ఠత కలిగిన క్షేత్రం లింబాద్రిగుట్ట.

యావత్ భారత దేశంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మరియు "నర నారాయణులు " ఓకే గర్బలయంలో స్వయంభువు  గా కొలువుదీరిన మహపుణ్యక్షేత్రం.  


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా) బ్రహ్మదేవుడు (సృష్టి) నరసింహుడు, (స్థితి) శివుడు, (లయం) యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 




*జై శ్రీ రామ్* 🙏🙏




🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*రోడ్ హిప్నాసిస్

 *రోడ్ హిప్నాసిస్ అంటే ఏమిటి?*

                 ➖➖➖✍️


*రోడ్ హిప్నాసిస్ అనేది చాలా మంది డ్రైవర్లకు తెలియని శారీరక స్థితి.*


*రోడ్డుపైకి వచ్చిన 2.5 గంటల తర్వాత ROAD హిప్నాసిస్ ప్రారంభమవుతుంది.*


 *హిప్నాసిస్ డ్రైవర్ కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ మెదడు కంటికి కనిపించే వాటిని రికార్డ్ చేసి విశ్లేషించదు.*


*రోడ్ హిప్నాసిస్ అనేది మీ ముందు పార్క్ చేసిన వాహనం లేదా ట్రక్కు వెనుకవైపు క్రాష్‌లకు మొదటి కారణం.* 


*రోడ్ హిప్నాసిస్ ఉన్న డ్రైవర్‌కు ఢీకొనే వరకు చివరి 15 నిమిషాలలో ఏదీ గుర్తుండదు.  అతను ఏ వేగంతో వెళ్తున్నాడో, లేదా అతని ముందు ఉన్న కారు వేగాన్ని విశ్లేషించలేడు.*


*సాధారణంగా తాకిడి 100 కిమీ పైన ఉంటుంది.*


 *రోడ్ హిప్నాసిస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ప్రతి 2.5 గంటలకు ఆగి, నడవడం, టీ లేదా కాఫీ తాగడం అవసరం.*


*డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రదేశాలు మరియు వాహనాలను గమనించడం మరియు గుర్తుంచుకోవడం ముఖ్యం.*


*గత 15 నిమిషాల నుండి మీకు ఏమీ గుర్తులేకపోతే, మీరు మిమ్మల్ని మరియు సహ ప్రయాణీకులను మరణం వైపు నడిపిస్తున్నారని అర్థం.*


*రోడ్ హిప్నాసిస్ రాత్రిపూట ఎక్కువగా జరుగుతుంది మరియు సహ ప్రయాణీకులు కూడా నిద్రపోతున్నట్లయితే, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది.*


*డ్రైవర్ ఆపి, విశ్రాంతి తీసుకోవాలి, ప్రతి 2.5 గంటలకు 5-6 నిమిషాలు నడవాలి మరియు అతని మనస్సును తెరిచి ఉంచాలి.*


*కళ్లు తెరిచినా మనసు మూసుకుపోయినా ప్రమాదం తప్పదు.*


*సురక్షితంగా ఉండండి మరియు సురక్షితంగా డ్రైవ్ చేయండి.*✍️

                           …సేకరణ

ఏవేళ న్నిను

 శా.

ఏవేళ న్నిను వేడుకొంటినొ గదా! యిష్టార్థ మీడేర్చి యీ 

జీవత్కాయుని కింత తెల్వి నిడి సుశ్శ్రేయమ్ము చేకూర్చితే...

యో వింధ్యాచల గేహినీ! విమలమౌ యుల్లమ్ము నాకిచ్చి నిన్ 

భావాతీతగుణోన్నతీస్తుతుల సంభావింపనీ మాతరో..!

*~శ్రీశర్మద*

శనీశ్వరునికి పట్టిన శని*

 P*శనీశ్వరునికి పట్టిన శని*

🌹🌹🌹🌹🌹🌹


ఎవరి జాతకంలో నైనా శనీశ్వరుడు ఏడున్నర  సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని *ఏలిన నాటి శని* అంటారు. ఆ ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పని సరిగా వుంటుంది.


ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయంలో శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.


వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు ఆ బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు.


అప్పుడు శనీశ్వరుడు శ్రీరాముని వద్దకు వచ్చి "నేను హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చింది" అని అనుమతి అడిగాడు. "నన్నెందుకు అనుమతి అడగడం. నీ విధిని నీవు చెయ్యి" అని అంటాడు శ్రీరాముడు.


నేరుగా హనుమంతుని వద్దకు వెళ్ళిన శని "నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండ బోతున్నాను" అన్నాడు. "నేను రామ కార్యంలో నిమగ్నమై యున్నాను. ఇపుడంత కాలం కుదరదు" అన్నాడు హనుమంతుడు.


"అయితే ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు వుంటాను.. సరేనా" అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. "ఏడున్నర వారాలు" అంటూ కాల ప్రమాణం తగ్గించాడు శనీశ్వరుడు.


హనుమ రామ నామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు గంటల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు. అదే అదనుగా శని "నీ కాళ్ళలో ప్రవేశించనా" అని అడిగాడు. 

హనుమంతుడు "వద్దు, సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి".


"సరి, నీ చేతులు పట్టుకోనా." రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. "అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? నీ భుజాల పైన ఎక్కమంటావా"...


"రామ లక్ష్మణులను నా భుజాల మీదనే కదా ఎక్కించుకుని తీసుకువెళ్ళేది, అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు" అన్నాడు హనుమంతుడు. "పోనీ.. నీ  హృదయం."


"హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయిన తల్లి సీతాదేవి, నా శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ వున్నారు. అక్కడ నీకు చోటు లేదు" అన్నాడు హనుమ.


"సరే.. చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను" అని హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు శని.


హనుమంతుడు పెద్ద పెద్ద బండ రాళ్లను తన శిరస్సుపై (అంటే శనీశ్వరుని మీద) పెట్టుకుని సముద్రంలో వేయడం మొదలెట్టాడు. ఆ బండ రాళ్ళ బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేసి, ఊపిరి సలపక గిలగిల లాడాడు.


మరుక్షణం హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకి "మారుతీ... నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు. నిన్ను నేను పట్టలేను" అంటూ  చేతులెత్తేసి వెనుతిరిగాడు శనీశ్వరుడు.

🌹🌹🌹🌹🌹🌹


*నిర్మల భక్తితో, నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై యున్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు.*


*పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది.*

🌹🌹🌹🌹🌹🌹

ఉగాదిని

 🌴🎋🌾🌹🌹🌾🎋🌴


_*🚩ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?🚩*_


🌴🎋🌾🍁🍁🌷🎋🌴


*''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది''* అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.

అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు *"చిత్రా''* నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు *"చైత్రమాసం''* అనే పేరు వచ్చింది.


*ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?*

ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు ? విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో  మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది ? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు ? ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. *''మాసానాం మార్గశీర్షోహం''* అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును , లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు ? ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో , భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి , కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు , తెలివి డబ్బు , ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. పోనీ శ్రీరామనవమి , శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము ? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో , ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము ? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు , పర్వదినాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా , సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..

చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం , పగుళ్ళు , పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత , పిందెలు , పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో , వర్షాకాలంలో ఉండే మందగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.


*ఉగాదిరోజున ఏం చేయాలి ?*


*నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి* *గృహ ధ్వజారోహణం   నింబ పత్రాశనం* *సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః*

సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది. ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి. కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.


*ఉగాది పచ్చడి తినడంవల్ల ప్రయోజనం ఏమిటి ?*


*శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ*

*సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం*

వేపపూత , బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి.

శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి , ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత , బెల్లం తోడ్పడతాయి.

అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది.

చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.


     🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

*చైత్ర మాసం విశిష్టత*

 _*🚩ది.2.4.22నుండి చైత్ర మాసం ప్రారంభం,🚩*_


🕉️🌿🕉️🌿🕉️🌿🕉️


*చైత్ర మాసం విశిష్టత*


*“ఋతూనాం కుసుమాకరాం”* అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.


చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.

ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.


ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.


పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.


చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు

సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 


చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.


చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.


చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు 

పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.

అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.


చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.


చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.


చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.


చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.


చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.

ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాము.


🌴🎋🌾🌹🌹🌾🎋🌴

🌴🎋🌾🍁🍁🌾🎋🌴

🔔🔔🔔🔔🔔🔔🔔🔔

      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴

తెలుగు భాషను

 To those who love Telugu poems:


*శ్లేష తో  చమత్కారం !*

కవుల మాటలేకాదు. కవిత్వభాష వంటబట్టినవారు కూడా చమత్కార భాసురంగా మాటలాడగలరు. ఆమాటలలోని  చమత్కారం ఆభాష తెలిసినవారికే అర్థమవుతుంది!


ఈ కింద కంద పద్యం చిన్నదే కానీ చమత్కార రంజితమై, సరసుల హృదయరంజకంగా మారింది.


క: *చవిగొని ఫలములుఁ గొననా?*

*చవిజూచిన పండ్లురాలు; చక్కగ బొమ్మా!!*

*కవినేను, కనులఁ గనవా?*

*కవి వైనచొ ,చంకనాకు, ఘంటంబేదీ?*


పూర్వం కవులకు సంఘంలో మంచి గౌరవముండేది. వారెక్కడికి వెళ్ళినా అందరూ వారిని గౌరవించి అడిగినవి సమర్పించేవారు.


ఒక కవిగారు అరటిపండ్ల కోసం బజారుకు వచ్చారు. కొట్టు దగ్గర నిలబడ్డారు. పాపం వచ్చేటప్పుడు *ఘంటం. తాటియాకులు* మరచారు.(అవి వారు కవులని సూచించే గుర్తులు. *బొడ్డు దగ్గర ఘంటం, చంకలో నాలుగు తాటాకులు* ఇదీవారి ఆహార్యం).


కవిగారుదుకాణదారునితో, "చవిగొని ఫలములుఁ గొననా?" అన్నారు. రుచిచూచి నచ్చితే పండ్లు కొంటానయ్యా! రుచికి పండ్లు తీసికోనా?అన్నారు.


దానికాదుకాణదారు,

"చవిజూచిన పండ్లురాలు, చక్కగబొమ్మా?" అన్నాడు. రుచి కోసం చేతులేస్తే పళ్ళు రాలుతాయి, చక్కగా పో!అన్నాడు. ఒక అర్దం పళ్ళురాలుతాయి అని తిట్టినట్టు. మరొకఅర్ధం గెలకున్న పళ్ళు రాలిపోతాయి కెలకవద్దు అని.


కవిగారికికోపంవచ్చింది. "కవి నేను కనుల గనవా?" అన్నారు. ఓ ఆసామీ యెవరనుకుంటున్నావు నన్ను, నేను కవిని, ఆమాత్రం మర్యాద తెలియదా? అని;


దుకాణదారుకూడా తక్కువవాడు కాదు మరి, "కవివైనచొ చంకనాకు", అన్నాడు. అదిపెద్ద తిట్టు మరి! వెంటనే నాలిక కఱచుకొని, "ఘంటంబేదీ?" అన్నాడు. పోవయ్యా నీవు కవివైతే ఏమి గొప్ప చంకనాకవయ్యా? అని దూషించినట్టు ఒకఅర్ధం. తమరు కవియైతే చంకలో ఆకులు, ఘంటమూ కనబడవేం? అని మరో అర్ధం.


చూశారా? శ్లేష సాయంతో  కవి తన మాటలలో రెండర్ధాలను జోడించాడు. ఇదీ ఈ కందం లోని చమత్కారం! 


*తెలుగు భాషను ఆదరించండి, పోషించండి, రక్షించండి!*

ప్రపంచాన్ని నడిపించేది

 *ఈ ప్రపంచాన్ని నడిపించేది ఎవరు?*


*ఒక ఔషధపు  సీసా* 


*రాజస్థాన్‌ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.*


*అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.*


*సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్‌ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.*


*తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.*

 

*కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు... అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు," నాయనా, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ  ఒక్క మాట విని, పాటిస్తావా?"*

 

*కొడుకు,“అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు." కొడుకు ఒప్పుకున్నాడు.*


*కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది... ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి "అన్నా... ఈ మందు కావాలి... మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది... వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు  వేస్తేనే ... అమ్మ  బతుకుతుందని  డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?" అని అడిగాడు.*


*రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ... నా దగ్గర ఉంది” అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.*


*అయితే ఇది ఏమిటి!!* 

*అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో  లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు... ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.*


*" ఓరి భగవంతుడా !!" అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, "ఏమిటి ఈ విపత్తు!!" అనుకుని, అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ... ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!!"*


*"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... "అన్నా, నేను బురదలో  జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.*


*ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!*


*ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది... కొందరు ఆయన్ని భగవంతుడంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!*


                            ♾️


*ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది*

🚩👏🚩👏🕉️🕉️👏🚩👏🚩

శంకర విజయాలు-3*

 *#శంకర విజయాలు-3*


*ఆది శంకరాచార్యుల జయంతి - 6 మే, 2022*


*శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు సనాతన ధర్మం లేదు*


1) శంకరాచార్యులు క్రీ.శ 788 నుంచి క్రీ.శ.820 మధ్య జీవించారు

2) కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురువు పుణ్య దంపతులకు వారు జన్మించారు

3) కాలడి - కొచ్చిన్ విమానాశ్రయంకు చాలా దగ్గరగా ఉంటుంది. కాలడి - త్రిస్సూర్ కి పంచ క్రోశం దూరంలో ఉంటుంది. 

4) ఎనిమిదేళ్ల వయసులో గురువు కోసం అన్వేషిస్తూ చివరికి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు. 

5) ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన వారు ఆది శంకరాచార్య 

6) అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని మూడుసార్లు చుట్టి వచ్చారు. 

7) భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన

8) వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని తలపోశారు. 

9) అందుకే దేశంలోని నాలుగు దిక్కుల్లో శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం పీఠాలను స్థాపించారు. 

10) ఇవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలు దిక్కులా దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి.

11) దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆనాడే ఆయన విశదీకరించారు.

భూమి మీదకు అవతరించారు

 [11/04, 23:06] +91 97010 33355: *#శంకర విజయాలు-1*


*ఆది శంకరాచార్యుల జయంతి - 6 మే, 2022*


1) ప్రతి హిందువు శంకర విజయాలు చదవాలి/వినాలి

*2) ఈరోజు సనాతన ధర్మం బ్రతికి ఉండటానికి కారణం ఆదిశంకరాచార్యులు*

3) సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు

4) శంకరులు రాకముందు 70కి పైగా అవైదికమైన మతాలు సనాతన ధర్మాన్ని కబలిస్తున్నాయి

5) సనాతన ధర్మం చిన్న లేగ దూడ అయితే, 70కి పైగా అవైదికమైన మతాలు వేట కుక్కలుగా చుట్టు ముట్టాయి

6) శంకరులు ఎంతో శ్రమించి, ఎంతో ప్రేమగా అందరితో వాదించారు

7) శంకరులు యావత్తు భారత దేశం ఎన్నో సార్లు సంచరించి సనాతన ధర్మాన్ని రక్షించారు

8) శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు


పూజలు లేవు

పండుగలు లేవు

నోములు లేవు

వ్రతాలు లేవు

దేవాలయాలు లేవు

ఏవీ లేవు


*9) ఆది శంకరాచార్యుల జయంతి మనం చేయక పోతే - మన జన్మం వృథా*


*ఈ రోజు నుండి, 6 మే వరకు ప్రతి రోజు శంకర విజయాలు తెలుసుకుందాం*

[11/04, 23:06] +91 97010 33355: *#శంకర విజయాలు -2*


*ఆదిశంకరాచార్యుల జయంతి - 6 మే, 2022*


*శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు సనాతన ధర్మం లేదు*


1) శంకరులు ఈ ప్రపంచానికి ఎంతో ఉపకారం చేసారు. 

2) ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసారు

3) ఎన్నో దేవాలయాలలో శ్రీచక్రాలు/యంత్రాలు వేసారు

4) ఎన్నో స్తోత్రాలు రచించారు 

5) ఎన్నో భాష్య గ్రంధాలు రచించారు

6) ఎన్నో ప్రకరణ గ్రంధాలు రచించారు

7) తన తల్లి కోసం పూర్ణా నది యొక్క దారి మళ్లించారు

8) తన తల్లి మరణించే సమయంలో ఆకాశం/యోగా మార్గమున వచ్చారు

9) భారత దేశంలో సనాతన ధర్మం కోసం 4 పీఠాలను స్తాపించారు

10) భారత దేశమంతటా 3 సార్లు సంచరించారు


*సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు*


హర హర శంకర !!  జయ జయ శంకర !!

మోక్షం కావాలి

 మోక్షం కావాలి 


ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక గూర్ఖా వచ్చాడు. మనుసులోని కష్టాల భారం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. “విషయమేంటో అడుగు అతణ్ణి అడుగు” అని పక్కనున్న శిష్యునితో చెప్పారు స్వామివారు. 


ఆ గూర్ఖా స్వామివారితో, “నేను పుట్టినప్పడినుండి నాకు కష్టాలు తప్ప ఏమి తెలియవు. ఏదో నా పురాకృత పుణ్యకర్మ వల్ల దైవస్వరూపులైన పరమాచార్య దర్శనానికి రాగలిగాను. నేను మళ్ళీ పుట్టకుండా మీరు నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నాడు. 


”అహా! అలాగే అవ్వని. ఇక నువ్వు మరలా పుట్టవు. నీకు మోక్షం ఇచ్చేస్తా” అని అనలేదు మహాస్వామివారు. చాలా ప్రేమతో అతనితో మాట్లాడారు. 


”అటువంటి వరాన్ని ఇచ్చే శక్తి నాకు లేదు. కాని నేను నిత్యం కొలిచే త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరునకు ప్రార్థిస్తాను నీ కోరిక పూర్ణం అవ్వాలి అని” అని చెప్పారు. 


ఆ గూర్ఖా ఈ జవాబు చాలు అనుకున్నాడు. ప్రసాదం తీసుకుని వెళ్ళబోతూ, “నేను ఇక మళ్ళా పుట్టను. నాకు మరుజన్మ లేదు. ఇది ఈశ్వర శాసనం” అంటూ సంతోషంతో వెళ్ళిపోయాడు. 


జ్ఞానమనే వెలుగును పంచే మెరుస్తున్న కళ్ళతో స్వామివారు, “చాలాకాలం తరువాత పునావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యం కావాలని కోరినవాడు ఇతనొక్కడే” అని తెలిపారు. 


నేను విన్న ఒక విషయం నాకు స్ఫురణకు వచ్చింది. ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చెబుతూ, “రాముడు సాక్షాత్ మనవావతారం. మనుష్యుడిగానే పుట్టాడు, మనుష్యుడిగానే కదిలాడు. మరి జటాయువుకు మోక్షాన్ని ఎలా ఇవ్వగలిగాడు అంటే అది కేవలం స్వధర్మాచరణ వల్ల మాత్రమే సాధ్యపడింది”


శ్రీమఠం ఉద్యోగులు, శిష్యులు ఎవ్వరూ స్వామివారు అపర శివావతారులు అని గ్రహించలేదు. కాని ఆ గూర్ఖా దాన్ని గ్రహించాడు. 


[సరస్సులో ఉన్న పద్మంయొక్క విలువ అక్కడే ఉన్న కప్పలకు కాని చేపలకు కాని తెలియదు. కాని ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మెదకు దాని విలువ తెలుసు. అందులో ఉన్నది మకరందమని తెలుసు. దాన్ని గ్రోలడానికి పద్మం ఎక్కడ ఉన్నా తుమ్మెద వెతుక్కుని వచ్చి మరీ ఆస్వాదిస్తుంది]


--- శ్రీమఠం బాలు మామ, ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

విశ్వమ్

 kgm Indraganti sankar 3:

*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.*       >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                       *1. విశ్వమ్.*                         

                                                                                      ఇది మూడు అక్షరములనామము ఈ నామమును మనముచెప్పుకొని భక్తితోనమస్కరించేటప్పుడు.                                                                                                                                                                         

 *ఓంవిస్వస్మైనమః.* అనిపలుక వలెను.                                                                                                         విశ్వము (నామరూపాత్మకమై,చిత్రా తి చిత్రమై - వికసించి, విస్తరించి, వి రాజిల్లుచు కానవచ్చు సకల చరాచ ర చైతన్యసహితమగు ప్రపంచమేవి శ్వము) - లేదా,విశ్వమునకుమూల కారణమైనవాడు. - సకల విషయ ములందును సంపూర్ణమైనవాడు. 


*ఓం విశ్వాయ నమః*                           

'విశ్' - ప్రవేశించుట - అనే ధాతువు నుండి *'విశ్వమ్'* అనే పదంవస్తుం ది. శ్రీ భట్టులు,మోక్షధర్మము,నుండి ఈ శ్లోకాన్ని ఉదాహరించారు. *వేషణాత్ విశ్వమిత్యాహుః లో కానామ్ కాశిసత్తమమ్!                                                                        లోకాన్ శ్చ విశ్వమేవ ఇతి ప్రవద ని నరాధిప!!.*                                                             సకల లోకములందును ప్రవేశించి యున్న వాడగుటచే భగవానుడు *'విశ్వమ్'* అని చెప్పబడును. (అందువలననే లోకములన్నింటిని కలిపి *'విశ్వము'* అంటారు.) శ్రీ భ ట్టులు *'విశ్వమ్'* అనేనామమును *'సంపూర్ణము'* అనే భావము లో వ్యాఖ్యానించారు.


శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రములోని ప్రధమ నామము అయిన *'విశ్వ ము'* ఆ సర్వేశ్వరుని అనంత గుణ స్వరూప వైభవమును, ఆయన పర మ పావన దివ్యమంగళ శుభకర అ నితరతత్వమునుగానముచేయుట ఎంతో ఉచితముగా ఉన్నదని శ్రీ భ ట్టులువారు వ్యాఖ్యానించినారు.              ఈ పరిపూర్ణత ఆయన సకలరూప, స్వరూప,గుణాది సకల సంపదలకు వర్తించునని వివరిస్తూ శ్రీ వి.వి.రా మానుజన్ గారు శ్రీ నమ్మాళ్వార్ ను

“తిరువైమోళి' (1.1.1.) నుండిఉదా హరించినారు. అందుకే భగవంతుని పరిపూర్ణతను ఉపదేశించే *'విశ్వ మ్'* అనే పుణ్యనామము తక్కిన 999 పుణ్యనామములకు ముందు గా గానము చేయబడినది.                  

శ్రీ ఆది శంకరుల భాష్యమునందు - సర్వేశ్వరుడైన బ్రహ్మము విశ్వము ను సృష్టించినందున *‘విశ్వమ్'* అ ని,ఆభగవానుడే,చెప్పబడుచున్నాడు. సృష్టించిన బ్రహ్మ కారణము.                   సృష్టింపబడిన విశ్వము కార్యము. అద్వైత సిద్ధాంతానుసారము కార్య కారణముకు భేదము లేనందున, స మస్తమూ బ్రహ్మమే అయినందున, విశ్వ సృష్టికర్తయైన విష్ణువును *'వి శ్వమ్'* అని ధ్యానించనగును.                  

శ్రీ భట్టులు మాత్రము - తక్కిన 999 నామములవలెనే - *'విశ్వమ్'* అ ను నామముకూడావిష్ణుభగవానుని ఒకానొక గుణస్వరూపవైభవమును సూచించునని వివరించారు.                     


తమ *'తిరువైమోళి'* వ్యాఖ్యాన ములో శ్రీ వేదాంతదేశికులు ఇలా అభిప్రాయపడ్డారు – *'బ్రహ్మము'*, *‘విశ్వము'* ఒకటే అనుటసమానా ధి కారణ్య సిద్ధాంతము కాన దీనిని ఆళ్వారులు అంగీకరించుటలేదు.           విశ్వము లేదా లోకములు లేదా ప్ర పంచము - అనునవి భగవానుని వి భూతి, ప్రకారములు. సకలలోకము లు, జీవములు, జడ చైతన్య స్వభా వములు - సమస్తమునకు ఆయనే కారణము, పోషకుడు, అధికారి, ని యంత్రణకర్త.                                                    శ్రీ చిన్మయానంద,*'విశ్వరూపము'* లేదా *'విరాడ్రూపము'* ఆధారము గా *'విశ్వమ్'* అనుపదము(నామ ము)ను వివరింపవచ్చును.                        *“స ఏవ సర్వ భూతాత్మా విశ్వ రూపో యతో అవయవ”* (విష్ణు పురాణము: 1-2-69). ఆ విశ్వ రూ పుడే సకల భూతములకును ఆత్మ. సమస్తమును ఆయన శరీరమే.                

శ్రీ సత్యదేవోవాసిష్ఠ - ఈ విశ్వమంత యును ఆయననుండియే ఉద్భవిం చినది మరల సమస్తమును ఆయ నయందే లయమగును. కనుకనే ఆయన *'విశ్వమ్'*.                             

ఇక్కడ మనం గమనించవలసిన వి షయము - వ్యాకరణ పరంగా *'వి శ్వమ్'* అనే పదము నపుంసక లిం గవాచకము. కాని ఈ నామముభగ వానుని సకల గుణశక్తివైభవపరిపూ ర్ణతను పొందుపరచినందున *“వి శ్వాయ నమః”* అని శ్రీ భట్టులవా రు, విశిష్టాద్వైతమార్గాను వర్తులు అర్చించుచున్నారు.                                                    నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వమును ప్రతిపాదించే శ్రీఆదిశంకరులు,అద్వై త వేదాంతులు *"విశ్వస్మైనమః”* అని ధ్యానించుచున్నారు.                       

క్లుప్తముగా - భగవానుడుపరిపూర్ణు డు. ఆయననుండి ఈ విశ్వమంతా సృజింపబడినది. ఆయనవల్లనే, ఆ యనయందే ఈవిశ్వమునిలచియు న్నది. విశ్వమంతయును ఆయన యందే లయమగును.


మరికొన్ని ప్రమాణములు *"బ్రహ్మ వేదం విశ్వమిదం వరిష్ఠమ్. పురు ష ఏ వేదం విశ్వమ్ - ఈవిశ్వము పరబ్రహ్మమే".* ఈ విశ్వముపరమ పురుషుడే!.                                                      *"విశతీతి విశ్వం బ్రహ్మ".*             *'హరి మయము విశ్వమంతయు హరివిశ్వమయుండు - సంశయిం ప బనిలేదు - హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు. అని భాగవతము.                                        మత్తః పరతరం నాన్య తకించి దస్తి ధనంజయ'* - గీత: 7-7.    *'వాసు దేవస్సర్వమితి స మహా త్మా సుదుర్లభః'* - గీత: 7-19

 కావునసృష్ఠియందు సర్వవ్యాపకు డు శ్రీ విష్ణువే సంసయములేదు.                                                                                                   *ఓంనమోభగవతేవాసుదేవాయ.                             ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః.                                                ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః.    (మానవసేవయేమాధవసేవ.)             .      సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                              *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*