*#శంకర విజయాలు-3*
*ఆది శంకరాచార్యుల జయంతి - 6 మే, 2022*
*శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు సనాతన ధర్మం లేదు*
1) శంకరాచార్యులు క్రీ.శ 788 నుంచి క్రీ.శ.820 మధ్య జీవించారు
2) కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురువు పుణ్య దంపతులకు వారు జన్మించారు
3) కాలడి - కొచ్చిన్ విమానాశ్రయంకు చాలా దగ్గరగా ఉంటుంది. కాలడి - త్రిస్సూర్ కి పంచ క్రోశం దూరంలో ఉంటుంది.
4) ఎనిమిదేళ్ల వయసులో గురువు కోసం అన్వేషిస్తూ చివరికి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు.
5) ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన వారు ఆది శంకరాచార్య
6) అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని మూడుసార్లు చుట్టి వచ్చారు.
7) భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన
8) వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని తలపోశారు.
9) అందుకే దేశంలోని నాలుగు దిక్కుల్లో శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం పీఠాలను స్థాపించారు.
10) ఇవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలు దిక్కులా దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి.
11) దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆనాడే ఆయన విశదీకరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి