kgm Indraganti sankar 3:
*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.* >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<< *1. విశ్వమ్.*
ఇది మూడు అక్షరములనామము ఈ నామమును మనముచెప్పుకొని భక్తితోనమస్కరించేటప్పుడు.
*ఓంవిస్వస్మైనమః.* అనిపలుక వలెను. విశ్వము (నామరూపాత్మకమై,చిత్రా తి చిత్రమై - వికసించి, విస్తరించి, వి రాజిల్లుచు కానవచ్చు సకల చరాచ ర చైతన్యసహితమగు ప్రపంచమేవి శ్వము) - లేదా,విశ్వమునకుమూల కారణమైనవాడు. - సకల విషయ ములందును సంపూర్ణమైనవాడు.
*ఓం విశ్వాయ నమః*
'విశ్' - ప్రవేశించుట - అనే ధాతువు నుండి *'విశ్వమ్'* అనే పదంవస్తుం ది. శ్రీ భట్టులు,మోక్షధర్మము,నుండి ఈ శ్లోకాన్ని ఉదాహరించారు. *వేషణాత్ విశ్వమిత్యాహుః లో కానామ్ కాశిసత్తమమ్! లోకాన్ శ్చ విశ్వమేవ ఇతి ప్రవద ని నరాధిప!!.* సకల లోకములందును ప్రవేశించి యున్న వాడగుటచే భగవానుడు *'విశ్వమ్'* అని చెప్పబడును. (అందువలననే లోకములన్నింటిని కలిపి *'విశ్వము'* అంటారు.) శ్రీ భ ట్టులు *'విశ్వమ్'* అనేనామమును *'సంపూర్ణము'* అనే భావము లో వ్యాఖ్యానించారు.
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రములోని ప్రధమ నామము అయిన *'విశ్వ ము'* ఆ సర్వేశ్వరుని అనంత గుణ స్వరూప వైభవమును, ఆయన పర మ పావన దివ్యమంగళ శుభకర అ నితరతత్వమునుగానముచేయుట ఎంతో ఉచితముగా ఉన్నదని శ్రీ భ ట్టులువారు వ్యాఖ్యానించినారు. ఈ పరిపూర్ణత ఆయన సకలరూప, స్వరూప,గుణాది సకల సంపదలకు వర్తించునని వివరిస్తూ శ్రీ వి.వి.రా మానుజన్ గారు శ్రీ నమ్మాళ్వార్ ను
“తిరువైమోళి' (1.1.1.) నుండిఉదా హరించినారు. అందుకే భగవంతుని పరిపూర్ణతను ఉపదేశించే *'విశ్వ మ్'* అనే పుణ్యనామము తక్కిన 999 పుణ్యనామములకు ముందు గా గానము చేయబడినది.
శ్రీ ఆది శంకరుల భాష్యమునందు - సర్వేశ్వరుడైన బ్రహ్మము విశ్వము ను సృష్టించినందున *‘విశ్వమ్'* అ ని,ఆభగవానుడే,చెప్పబడుచున్నాడు. సృష్టించిన బ్రహ్మ కారణము. సృష్టింపబడిన విశ్వము కార్యము. అద్వైత సిద్ధాంతానుసారము కార్య కారణముకు భేదము లేనందున, స మస్తమూ బ్రహ్మమే అయినందున, విశ్వ సృష్టికర్తయైన విష్ణువును *'వి శ్వమ్'* అని ధ్యానించనగును.
శ్రీ భట్టులు మాత్రము - తక్కిన 999 నామములవలెనే - *'విశ్వమ్'* అ ను నామముకూడావిష్ణుభగవానుని ఒకానొక గుణస్వరూపవైభవమును సూచించునని వివరించారు.
తమ *'తిరువైమోళి'* వ్యాఖ్యాన ములో శ్రీ వేదాంతదేశికులు ఇలా అభిప్రాయపడ్డారు – *'బ్రహ్మము'*, *‘విశ్వము'* ఒకటే అనుటసమానా ధి కారణ్య సిద్ధాంతము కాన దీనిని ఆళ్వారులు అంగీకరించుటలేదు. విశ్వము లేదా లోకములు లేదా ప్ర పంచము - అనునవి భగవానుని వి భూతి, ప్రకారములు. సకలలోకము లు, జీవములు, జడ చైతన్య స్వభా వములు - సమస్తమునకు ఆయనే కారణము, పోషకుడు, అధికారి, ని యంత్రణకర్త. శ్రీ చిన్మయానంద,*'విశ్వరూపము'* లేదా *'విరాడ్రూపము'* ఆధారము గా *'విశ్వమ్'* అనుపదము(నామ ము)ను వివరింపవచ్చును. *“స ఏవ సర్వ భూతాత్మా విశ్వ రూపో యతో అవయవ”* (విష్ణు పురాణము: 1-2-69). ఆ విశ్వ రూ పుడే సకల భూతములకును ఆత్మ. సమస్తమును ఆయన శరీరమే.
శ్రీ సత్యదేవోవాసిష్ఠ - ఈ విశ్వమంత యును ఆయననుండియే ఉద్భవిం చినది మరల సమస్తమును ఆయ నయందే లయమగును. కనుకనే ఆయన *'విశ్వమ్'*.
ఇక్కడ మనం గమనించవలసిన వి షయము - వ్యాకరణ పరంగా *'వి శ్వమ్'* అనే పదము నపుంసక లిం గవాచకము. కాని ఈ నామముభగ వానుని సకల గుణశక్తివైభవపరిపూ ర్ణతను పొందుపరచినందున *“వి శ్వాయ నమః”* అని శ్రీ భట్టులవా రు, విశిష్టాద్వైతమార్గాను వర్తులు అర్చించుచున్నారు. నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వమును ప్రతిపాదించే శ్రీఆదిశంకరులు,అద్వై త వేదాంతులు *"విశ్వస్మైనమః”* అని ధ్యానించుచున్నారు.
క్లుప్తముగా - భగవానుడుపరిపూర్ణు డు. ఆయననుండి ఈ విశ్వమంతా సృజింపబడినది. ఆయనవల్లనే, ఆ యనయందే ఈవిశ్వమునిలచియు న్నది. విశ్వమంతయును ఆయన యందే లయమగును.
మరికొన్ని ప్రమాణములు *"బ్రహ్మ వేదం విశ్వమిదం వరిష్ఠమ్. పురు ష ఏ వేదం విశ్వమ్ - ఈవిశ్వము పరబ్రహ్మమే".* ఈ విశ్వముపరమ పురుషుడే!. *"విశతీతి విశ్వం బ్రహ్మ".* *'హరి మయము విశ్వమంతయు హరివిశ్వమయుండు - సంశయిం ప బనిలేదు - హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు. అని భాగవతము. మత్తః పరతరం నాన్య తకించి దస్తి ధనంజయ'* - గీత: 7-7. *'వాసు దేవస్సర్వమితి స మహా త్మా సుదుర్లభః'* - గీత: 7-19
కావునసృష్ఠియందు సర్వవ్యాపకు డు శ్రీ విష్ణువే సంసయములేదు. *ఓంనమోభగవతేవాసుదేవాయ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః. ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః. (మానవసేవయేమాధవసేవ.) . సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి