13, ఆగస్టు 2020, గురువారం

పరమేశ్వరుని కి ఇష్టమైన పుష్పాలు ఏమిటి?


శివపురాణంలో విశ్వేశ్వర సంహితలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. చంపకం(సంపంగి) కేతకం(మొగిలి పువ్వు) ఈ రెండూ తప్ప భక్తి తో ఏది సమర్పించినా తనకు ఆనందమే అన్నాడు పరమేశ్వరుడు. పరిమళ పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తే ఋణాలు తీరతాయి అంటారు పెద్దలు. తెల్లతామర పూలతో పూజిస్తే ఙ్ఞానం లభిస్తుంది. అలాగే ఐశ్వర్యం కావాలంటే బిల్వపత్రాలతో
పూజించాలి. మందార పుష్పాలతో పూజిస్తే దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఏ రంగు గన్నేరు పూలతో పూజించినా కుటుంబం వ్రుద్ధి, ధనధాన్యములు వ్రుద్ధి కలుగుతాయి. పుష్ప పూజ వలన మనిషికి వికాసం కలుగుతుంది. పరమేశ్వరుని కి గరిక కూడా ఇష్టమే. శంకరభగవానులు చెప్పినట్లు గా ఎక్కడెక్కడి అరుదైన పుష్పాలతో పరమేశ్వరుని పూజించాలి అని భక్తులు తాపత్రయపడతారు. నిజం చెప్పాలంటే పరమేశ్వరుని కి ఇన్ని పుష్పాలు కంటే హ్రదయ పుష్పాన్ని సమర్పించేవారినే ఆయన ఎక్కువ ఇష్టపడతారు. ముందుగా మనస్సు అనే కుసుమాన్ని మహాదేవునికి సమర్పించాలని పూజ్యులు చెబుతారు. అందుకే భక్తకన్నప్ప అంటాడు. ఏ పూలు తేవాలి నీ పూజకు అని. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలు సేకరణ మాత్రమే
****************

సత్యభామ సందేహం

ఒకప్పుడు శ్రీ క్రుష్ణుడు సత్యభామా సమేతుడై వనంలో నివసిస్తున్న పాండవులను కలుసుకోవడానికి వచ్చేరు. ఆ సమయంలో మాటల సందర్భంలో అంటే ఆడవారు చీరలు దగ్గర నుంచి నగలు అలాగే కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! అలాంటి సమయంలో సత్యభామ కు ఒక సందేహం వచ్చింది. ఆ విషయాన్నే ద్రౌపది తో ఇలా అడిగింది అట. నిన్ను ఒక విషయం అడుగుతాను చెబుతావా! అని ఆ చెప్పు అక్కా దానిదేముంది అందట ద్రౌపది. శూరులు, వీరులు, మహాబలశాలు లూ అయి ఉండి కూడా నీ భర్తలు నీకు లోబడి ఉండడాన్ని నేను చూస్తున్నాను. ఏమిటి కారణము? నీవు ఏమైనా మంత్రతంత్రాలు, తాయెత్తు లు, ఓషధీప్రయోగాలు ఏమైనా చేసావా? లేక పోతే నీవు ఏమైనా జపాలు, వ్రతాలు, హోమాలు, వశీకరణ విద్యావిధానాలు ఆచరించి నీ భర్త లను లోబరచుకున్నావా! అలాంటి ఉపాయాలు, విధానాలు ఏమైనా ఉంటే నాకూ చెప్పు. నేను నా శ్యామసుందరుని వశీకరించుకొనుటకు ప్రయత్నిస్తాను. అని అడిగిందట. దానికి ద్రౌపది ఆమెకు ఇలా బదులు ఇచ్చింది. సోదరీ! నీవు శ్యామసుందరుని పట్టమహిషివి, ప్రియతమురాలవూ అయి ఉండి కూడా ఏమి మాట అంటున్నావు. పాతివ్రత్య నిష్ఠ గల సాధ్వీమ తల్లులు తేళ్ళకు, సర్పాలకూ ఎంత దూరంగా ఉంటారో మంత్ర తంత్రాదులకు కూడా అంతే దూరంగా ఉంటారు. మంత్రతంత్రాలు తో భర్త ను వశీకరించుకొనుటకు సాధ్యమవుతుందా? అమాయకంగా ఉండే స్త్రీలూ, దురాచారపరాయణులైన స్త్రీలు మాత్రమే నీవు అనుకున్న విధంగా మంత్రతంత్రాదులను ప్రయోగిస్తారు. అలా చేసి వారు తమకు, తమ భర్తలు కు కూడా అనర్థాన్ని కల్పించుకున్నవారు అవుతారు. అలాంటి స్త్రీ ల చెంత కు మనం చేరరాదు. మన చెంతకు వారిని చేరనీయరాదు. సేకరణ దీనివలన ద్రౌపది ఎంత పతివ్రతో ఎంత ఉన్నతురాలో తెలుస్తోంది. (సశేషం)
*******************

ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయట

సందేహం;- ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయట. ఎలా తెలుస్తాయో చెప్పండి.

సమాధానం;- ఇది మనవంటి మామూలు మనుషుల్ని తికమకపెట్టే పొడుపుకథ వంటిదే. బ్రహ్మ జ్ఞానులే దీనికి సమాధానం చెప్పగలరు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం దీన్నే అంటారు. ఈ ప్రపంచానికంతా మూలకారణం బ్రహ్మ అని నిరంతర ధ్యానం వల్ల తెలుసుకునే వాడే బ్రహ్మజ్ఞాని అని, ఆ బ్రహ్మ సకల జగత్కారణమని, మనం చూసే ఈ ప్రపంచమంతా ఆయన్నుంచే వస్తుందని, ఆయనలోనే లీనమవుతుందని, ఇదంతా విరాట్ పురుషుడైన ఆయన రూపమేనని, ఆయనకానిదీ, ఆయనకు చెందనిదీ ఏదీ వేరే ఉండదనీ, ఆయన్ను తెలుసుకుంటే కార్య రూపమైన, స్థూలరూపమైన ప్రపంచం అంతా తెలుస్తుందనీ, ఆ బ్రహ్మమే అక్షరుడని పిలువబడ్డాడని ముండకోపనిషత్తు తెలియజేస్తుంది. ఇదంతా, మనకు అర్ధం కావడానికి ఉపనిషత్తు ఒక చక్కటి సామ్యం చెప్పింది.

యథోర్ణ నాభిః సృజితే గృహ్ణతేచ
యథా పృథి వ్యామోష ధయస్సంభవంతి
యథా సతః పురుషాత్కేశ లో మాని
తథాక్షరాత్ సంభవతీహ విశ్వమ్

ఏ విధంగా అయితే సాలె పురుగు తనలోంచి జిగురును వెలుపలికి తీసేసుకుంటుందో అలాగే అక్షర పరబ్రహ్మ సృష్టి, స్థితి, లయాలను చేస్తున్నాడు. భూమిలోంచి ఓషధులు, మనలోంచి కేశాలు, గోళ్ళు ఎలా వస్తున్నాయో అలాగే ఆయన్నుంచి సృష్టి జరుగుతున్నది. అందుచేత ఈ మూలకారణం తెలుసుకుంటే కార్యాలన్నీ తెలుస్తాయి.

శుభంభూయాత్

**********************

పగిలిన పెదవులు :

వేద స్వరూపమైన పరమాచార్య స్వామివారు వేదాంత సారమైన అద్వైతాన్ని లీలగా ప్రదర్శించిన వేళ.

చాలా సంవత్సరాల క్రితం శీతాకాలంలో తీవ్రమైన చలి వల్ల పరమాచార్య స్వామివారి పెదవులు ఎండిపోయి, పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్ళ వల్ల చాలా బాధ కలిగేది. కానీ, ఆ దయామయుడు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారిని అనుగ్రహించేవారు.

చలికాలంలో పెదవులు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడినప్పుడు, పెదవులకు వెన్న రాయడం వల్ల అవి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది. మరలా పెదవులు కోమలంగా అవుతాయి. తరతరాలుగా మనవాళ్ళు పాటిస్తున్నది ఇదే.

కాని సాంప్రదాయం పాటించే స్వామివారు బయట అంగళ్ళలో అమ్మే వెన్నను వాడారు, దాన్ని పెదవులకు పూసుకోరు. మరి ఏమి చెయ్యాలి?
ఒక ముసలావిడ దీన్ని గ్రహించి ఐదు శేర్ల ఆవుపాలు తీసుకుని, వాటిని మరిగించి, మజ్జిగ చేసి బాగా చిలికి వెన్నను తీసింది. దాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి, “పెరియవా పెదవులు పగిలి ఇబ్బంది పెడుతున్నాయి. నిష్ఠతో మడిగా పాలు చిలికి ఈ వెన్నను తీసాను. పెరియవా పెదవులకు ఈ వెన్న పూసుకోవలసింది” అని ప్రార్థించింది.

మహాస్వామివారు ఆ వెన్నను ఒకసారి చూసారు. బహుశా వారికి ద్వాపర యుగపు సంఘటనలు గుర్తుకు వచ్చాయి ఏమో, చూడగానే చిన్నగా నవ్వారు.

ఆ వెన్నని కేవలం పరమాచార్య స్వామివారి కళ్ళే కాదు మరో రెండు కళ్ళు కూడా అంతే అమితానందాలతో చూస్తున్నాయి. అప్పుడు బహుశా స్వామివారి దర్శనానికి వచ్చిన ఒక బాలుడు ఆత్రుతగా స్వామివద్దకు వచ్చి వెన్న కావలన్నట్టుగా తన చిన్ని చేయి చాచాడు. బాలగోపాలుడే అక్కడకు వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో.

అడగకుండానే మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన కరుణాసముద్రులైన మహాస్వామివారు వెంటనే ఆ వెన్న జాడిని ఆ బాలునికి ఇచ్చేశారు. ఇది చూసిన అక్కడివారందరూ కాస్త ఖేద పడ్డారు. “ఎంత పిల్లాడే అడిగినా నిమ్మపండంత వెన్నను ఇచ్చుంటే సరిపోయేది కదా మొత్తం వెన్నను ఇచ్చేయ్యకుండా” అని అనుకున్నారు.

వారి ఆలోచనల్ని పసిగట్టిన మహాస్వామివారు అక్కడున్న వారితో, “ఎందుకు అందరూ అంత చింతిస్తున్నారు? ఆ వెన్నను ఆ బాలుడు తింటే నా పెదవులు సరిపోతాయి. దిగులు పడకండి” అన్నారు. ఆ సాయంత్రానికే స్వామివారి పెదవుల పగుళ్ళు నయమై మునుపటి వలె అయ్యాయి. బహుశా బాలగోపాలుడు ఆ వెన్నాను తినేశాడేమో.

శరీరములు వేరైనా ఆత్మా ఒక్కటే కదా. అదే కదా అద్వైతం.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
*********************

రామాయణమ్ .29


.
లీలగా విల్లందుకున్నాడు అవలీలగా ఎక్కుపెట్టాడు! అంతే ఒక్కసారిగా
భూనభోంతరాళాలాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫేళారావంతో విరిగిపోయింది! .
.
తస్యశబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః.
.
ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్పశబ్దం వచ్చెనట,పర్వతాలు బ్రద్ధలయితే భూమి ఎలా అదురుతుందో అలా అదిరిందట .
.
విశ్వామిత్రుడు, జనకుడు,రామలక్ష్మణులు తప్ప తక్కినవారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారట.
.....
.
ఈ సందర్భంలో కవిసామ్రాట్ విశ్వనాధసత్యనారాయణగారు చక్కటి పదాలు వాడి ఆ సందర్భాన్ని ఎంత అద్భుతంగా మన కన్నుల ముందు ఆవిష్కరించారో చూడండి .ఆ పద్యం అర్ధం మనకు వెంటనే తెలియకపోయినా ! శబ్దచిత్రం మాత్రం కన్నుల ముందు ప్రత్యక్షమవుతుంది
.
నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జదుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్!
.
ఇది మీ కనుల ముందు ఊహించండి!
.
నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైనమబ్బులలో అగ్నికణాలమాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మండమైన శబ్దంతో పిడుగులు అదేపనిగా ఒకదానివెంట మరొకటి (series) గా వస్తే ఎలా ఉంటుందో ! అలాంటి శబ్దం ఆ విల్లు విరిగి నప్పటి ఫెళఫెళారావాలు అంత తీవ్రంగా వచ్చినవట !
అంతేనా ఈ పద్యంలో ఇంకొక చమత్కారం కూడా వున్నది! రాముడు నీలమేఘశ్యాముడు ,"మేఘపటలీ నిర్గచ్చ "అని వ్రాశాడాయన .
.
మేఘమండలం నుండి వెలువడిన అని అర్ధం ! నీలమేఘశ్యాముడి చేతిలో విరిగి అంత ధ్వని పుట్టిందట!.
.
భాస్కర రామాయణం లోని పద్యమొకటి చూడండి!
.
కులగిరులెల్ల బెల్లగిలె గుంభిని యల్లలనాడె దిగ్గజం
బులుబెదిరెన్ భుజంగపతి బొమ్మరవోయె బయోధులన్నియుం
గలగె దిగంతముల్ వగిలె గన్కనిదారలు రాలె సూర్యచం
ద్రుల గతులు తప్పె మేఘములు దూలె నజాండముమ్రోసె నయ్యెడన్.
.
ఆ శబ్దానికి పర్వతాలు పెళ్లగింపబడినవట,దిక్కులుమోసే ఏనుగులు బెదిరిపోయినవట,ఆదిశేషువుకు దిమ్మతిరిగి పోయిందట,సముద్రాలు క్షోభించినవట ,భూమి అల్లల్లాడి పోయిందట ,దిక్కులు పిక్కటిల్లినవట,నక్షత్రాలు రాలిపోయినవట ,సూర్యచంద్రులు గతులు తప్పారట ..
.
అంత భయంకరమైన శబ్దం పుట్టినదట!
.
ఒక్కక్క కవి యొక్క ఊహా వైభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

సింధూరపు పూజ - తమలపాకుల పూజ

హనుమత్పూజలో చాలామందికి తెలిసిన అంశమే సింధూరపు పూజ అని. అదేవిధంగా తమలపాకుల పూజ అని. ఇవన్నీ ప్రసిద్ధి చెంది ఉన్నాయి అని మంత్రశాస్త్రం చెప్తున్నది. అంతేకాదు. ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని అర్కముతో చేసి అదీ శ్వేతార్కంతో చేసి గానీ పూజిస్తే ఇది ఉమాసంహిత అని మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అంశం. 
అర్కమూలేన కుర్వీతా హనుమత్ ప్రతిమాన్ సుధీః!
యః కరోతి నరో భక్త్యా పూజాం శక్త్యా హనూమతః!
నశస్త్ర భయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం!
పుత్రపౌత్రాది సహితః సర్వసౌఖ్యమవాప్నుయాత్!!
 దీని అర్థం అర్కమూలేన - తెల్లజిల్లేడుయొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారుజేసి (విగ్రహంగా చెక్కి) దానిని నిరంతరం పూజించినట్లైతే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదమూ జరుగదు. అలాగే ఉపద్రవాలు, ఉత్పాతాలు అతనికి ఎదురుకావు. పుత్రపౌత్రాది సంపదతో అన్ని సౌఖ్యములు పొందుతాడు అని ఉమాసంహిత అనే మంత్ర శాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది. అయితే తెల్లజిల్లేడుతో హనుమంతుడికి పూజ అనేది చాలామందికి తెలియదు. తెల్లజిల్లేడుతో గణపతి పూజ చాలామందికి తెలుసు. రెండూ ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహదోషాలకి పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్న హనుమంతునికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని గానీ ధారణ చేసినట్లైతే ఎలాంటి శని దోషమైనా పోతుంది. శనిదోషాన్ని పోగొట్టేశక్తి తొండంరాయుడికీ, తోకరాయుడికీ ఉంది. వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట. గ్రహాన్ని control చేయగలరు. గ్రహాలు, జ్యోతిష్యము అన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి. విరాడ్రూప ఆంజనేయ మూర్తి వర్ణన కూడా మనకి కనపడుతోంది. బ్రహ్మదేవునికి చూపిస్తాడట తన విరాడ్రూప స్వరూపాన్ని. ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు. అప్పుడు స్వామియొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది. అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనపడుతుంది. ఆశ్చర్యం. "జ్యోతిర్మండల లాంగూలః" అని ఒకమాట అన్నారు. అయితే ఆ తోక హనుమంతుడిదా? గణపతిదా? - గణపతియొక్క హనుమద్రూపానిది. ఇదొక రహస్యం. కథలు చెప్పేవాడికి తెలియదు. ఉపాసన చేసేవాడికి తెలుస్తుంది. అటువంటి ఉపాసకులలో గొప్పవాడు, నాదోపాసక చక్రవర్తి త్యాగరాజస్వామి వారు. ఆయన గణపతిని స్తుతిస్తూ ఒక కీర్తన వ్రాస్తారు. శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో కుంజరముఖం ఆంజనేయావతారం గుడాకరం అని చూపిస్తారు.  అందులో ఆంజనేయావతారం అని గణపతిని స్తుతించడంలోనే ఆంతర్యాన్ని చూపించాడా మహానుభావుడు.

ద్రౌపది గురించి

మహాభారతం లోని కొన్ని ఆదర్శ పాత్రలు వాటిలో ద్రౌపది గురించి
            ద్రౌపది దేవి పాంచాల రాజైన ద్రుపదుని కుమార్తె. ఈమె అయోనిజ యఙ్ఞకుండము నుండి ఈమె ఆవిర్భవించింది. ఈమె రూప లావణ్యాలు అనుప మానములు అయినవి. ఈమె వంటి సౌందర్య రాశి ఆ కాలంలో భూమి మీద మరెవ్వరునూ లేరు. ఈమె శరీరము నుండి తత్కాలమందు వికసించిన తామరపువ్వు యొక్క పరిమళము వంటి పరిమళం వెలువడి ఒక క్రోసు దూరం దాక విస్తరించేది. ఈమె జననకాలంలో ఆకాశవాణి _ఈమె దేవతా కార్యసిద్ధి కై క్షత్రియ లోక సంహారం లక్ష్యంగా చేసుకుని ఆవిర్భవించింది అని, ఈమె మూలంగా కౌరవ వర్గానికి భయం కలుగుతుంది అని పలికింది. ఈమె శరీరచ్ఛాయ నల్లనిది అయిన కారణంగా ఎల్లరూ ఈమెను క్రుష్ణ అని పిలిచేవారు. పూర్వ జన్మ లో పరమ శివుడు ఒసగిన వరం కారణంగా ఈమెకు ఈ జన్మ లో అయిదుగురు భర్తలు ప్రాప్తించారు. ఈమె ను స్వయంవరంలో అర్జునుడు ఒక్కడే గెలుచుకున్నాడు. అయినా కుంతీదేవి ఆదేశానుసారం ఆమె తనయులు అయిదుగురు నూ కూడి పెండ్లి చేసుకున్నారు.
        ద్రౌపది ఉత్తమ శ్రేణి కి చెందిన పతివ్రామతల్లి. భగవద్బక్తురాలు, ఈమెకు శ్రీకృష్ణ భగవానుని పాదారవిందముల మీద అచంచలమైన ప్రీతి ఉండేది. ఈమె ఆయన్ని తన హితైషి యని, పరమాత్మీయుడని భావించు కునేది. ఆయన సర్వవ్యాపకుడు, సర్వశక్తియుక్తులు కలవాడు అని ఈమె ద్రుఢంగా విశ్వసించేది. కౌరవుల సభలో దుష్టుడైన దుశ్శాసనుడు ఈమె శరీరంపై ఉన్న వలువలను ఒలిచివేయ పూనుకున్నపుడు సభాసదులు ఎవ్వరూ అతని అత్యాచారాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేకపోయారు. అప్పుడు ఆమె ఈమె తన లజ్జ ను కాపాడుకోవడానికి మార్గము ఏదీ కానక ఎంతో ఆర్తితోను, ఆరాటంతోను శ్రీకృష్ణ భగవానుని ఈ విధంగా ప్రార్థించింది-
పురాణపురుష ప్రాణమనోవ్రత్యాద్యగోచర!
సర్వాధ్యక్చ పరాధ్యక్చ త్వా మహం శరణం గతా!!
పాహి మాం క్రుపయా దేవ శరణాగతవత్సల!
నీలోత్పలదళశ్యామ పద్మగర్భారుణేక్చణ!!
పీతాంబరపరీధాన  లసత్కౌస్తుభభూషణ! త్వమాది రంతో భూతానాం చ పరాయణమ్!!
పరాత్పరతరం జ్యోతి రిశ్వాత్మా సర్వతోముఖహ!!
త్వామేవాహు పరం బీజం నిధానం సర్వసంపదామ్!! త్వయా నాధేన
సర్వపద్భ్యోభయం న హి!!
దుశ్శాసనా దహం పూర్వం సభాయాం మోచితా యథా! తథైవ సంకటాడస్మాన్మాముద్దర్తు మిహర్హసి!! (సశేషం)

*తమలపాకులు - హనుమ*



హనుమకు తమలపాకులతో పూజ చేయడం అన్నది సర్వ సాధారణం. దీనికి గల కారణము తెలుసుకొని తరించెదము.
*తమలపాకుకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు.* *అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని ఒక నిర్ధారణ. ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తనయొక్క వాహనమైనటువంటి ఐరావతం అనబడే ఏనుగును ఏ స్తంభానికి వేసి కడతాడో ఆ స్తంభానికి ఒక లత పుట్టింది తనంత తానుగా. ఆ పుట్టిన లత నాగవల్లి. నాగ అంటే ఏనుగు. ఏనుగును కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు.* తాంబూలము ఇచ్చినప్పుడు ఆకులను బేసి సంఖ్యలో ఇవ్వాలి. అందుకనే కనీసము మూడు ఆకులు పెట్టండి అని తెలిపెదరు.  ఈ ఆకు అపురూపంగా పుట్టినటువంటిది అయిన కారణం చేత దానిని పరమ పూజనీయ స్థానములు వద్ద యుంచవలెను.ఎదుటివారిపై పరమ మర్యాద, పరమ గౌరవం  వ్యక్తం చేయాలి అని తలంచినప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు. అందుకే ఇంటికి ఎప్పుడైనా పెద్దలు వస్తే తాంబూలం ఇస్తారు. విరాటపర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వచ్చినప్పుడు విరాట రాజు గారికి అనుమానం వస్తుంది. చూడడానికి పేడి వాడు, కానీ తేజస్సు సామాన్యంగా లేదు. అరివీర భయంకరుడిగా ఉన్నాడు. విశేషమైన పరాక్రమ వంతుడిలా ఉన్నాడు అని ఉత్తరను పిలిచి అర్జునునికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు. బృహన్నలను చూడగానే అంత గౌరవం వచ్చింది.
మరియు  ఉత్తరకు నాట్యాచార్యుడు కాబోతున్నాడు. ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం. అదే విధముగా  ఏ మంగళకార్యం అయినా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది. తాంబూలాలు పుచ్చుకున్నారు అన్న మాటకు అర్థం మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు.
*అటువంటి తమలపాకులతో హనుమకు పూజ చేస్తారు విశేషంగా. ఎందుచేత అంటే హనుమ యందు ఉండేటటువంటి గుణాలు అన్నీ కూడా ఏ గుణాన్ని చెప్పినప్పటికీ ఆ గుణానికి చిట్టచివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒక్కడే అయి ఉంటాడు.*
 ఏ మంచి గుణమైనా సరే దాని చిట్టచివరి హద్దు ఏదో అదే హనుమ. 1.అపారమైన వేగం ఉన్నవారు  2.ఎప్పుడూ భక్తులను రక్షించేవారు *‘పరిత్రాణాం భయంకరో మిత్రాణాం అభయంకరః”* అంటే హనుమ.
3.చాలా తేలికగా ప్రసన్నం అయ్యేవారు హనుమ. 4.ఎంతో వేగంగా వెళ్ళగలిగిన వారు మరియు అంత నిశ్చలంగా కూర్చుని జపం చేయగలిగిన వారు కూడా హనుమ. 5.ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వారు హనుమ. 6.గొప్ప బుద్ధిమంతుడు హనుమ. 7.నవ వ్యాకరణ పండితుడు హనుమ. 8.గురువుగారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడిన వారు ఎవరూ లేరు. సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు. సూర్యుడు భూమికి ప్రదక్షిణగా వెళ్తున్నప్పుడు తానూ వెళ్ళి చదువు నేర్చుకున్నారు. సూర్యుని యొక్క తేజస్సును భరించిరి. అందుకే ఆయనంత గురు భక్తి తత్పరుడు మఱియొకరు లేడు. గురుభక్తి అంటే హనుమ పేరే చెప్పాలి. 9.ఎదుటివారికి ఉపకారము చేసినచో దానివలన నాకు ఏమి పరోపకారము లభించును  అని తలంచకుండా ఎంత ఉపకారం అయినా చేయాలి అంటే ఆయనే. 10.తీవ్రమైన స్థితి హనుమ.
*రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం.*
*సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి!!*
అంటారు వాల్మీకి మహర్షి. ఎవరికోసం నూరు యోజనాల సముద్రం దాటాలి? ఎవరికోసం అంత కష్టపడి అన్వేషణ చేయాలి? అంటే రాముడికోసం, వానరుల కోసం.నాకు ఏమి లభించును అని ఆశించకుండా పరోపకారం కోసం ఆనందముగా కష్టపడిన వారు ఎవరు   అంటే హనుమ. 12.అద్భుతమైన వాగ్వైభవం అంటే హనుమ. 13.బుద్ధిని ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే హనుమ. 14.రోగనాశనం చేయగలిగిన వారు ఎవరు అంటే హనుమ. 15.అసలు ప్రాణం అంటేనే హనుమ. దానికి ఉదాహరణ మన పవిత్ర గ్రంధమైన రామాయణము. రామాయణంలో హనుమ ఎక్కడ కనపడితే అక్కడ ప్రాణాలు నిలబడ్డాయి. అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వాడు హనుమ. 16.అంత బలపరాక్రమాలు ఉండీ, అంత బుద్ధి ఉండీ తనకోసమని తాను ఒకపని కూడా చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కరే.
17.ఇవన్నీ ఒక ఎత్తు అయితే భార్యను స్వీకరించి కూడా కామం కోసం భార్యను స్వీకరించని ఏకైక వ్యక్తి సృష్టిలో హనుమ మాత్రమే. లోకంలో ఎవరు భార్యను స్వీకరించినా కామము ధర్మ బద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు. సువర్చలా మాత  వరం అడిగింది. కామం లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్న వాడు ఎవరైనా ఉంటే వానికి ఇల్లాలు అవుతాను అన్నది. భర్త అనగా ధర్మబద్ధమైన కామము కొరకు మరియు  సంతానము పొందుటకు అని కాకుండా లోకంలో కామం లేనివాడు, సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు గనుక అందుకొరకు భార్యను స్వీకరించాలి అనుకున్నవాడు తనకు భర్తగా కావాలి అని వరము అడిగిన మహాసాధ్వి సువర్చలమాత. భార్యకు గాని,భర్తకు గాని మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి వివాహము చేసుకొని  సంతానాన్ని పొందకపోతే మళ్ళీ అది మహా పాపమై హింస క్రిందకి వస్తుంది. ఒకే దీక్ష,ఒకే  ప్రవృత్తి గల సువర్చలా హనుమలు పవిత్రులు. ఆమెకూ సంతానాపేక్ష లేదు, కామము లేదు. ఆయనకూ కామము లేదు, సంతానాపేక్ష లేదు. గృహిణిగా, ఒకరికి ధర్మపత్నిగా ఆయనకు యజ్ఞాధికారం కల్పించాలి. ఆవిడ కోరిక. గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక. ఈ కలియుగములో అటువంటి ప్రవృత్తి గల దంపతులు శ్రీరామకృష్ణ పరమహంస శారదా మాత. ఇద్దరూ కలిసి ఉన్నారు. అసలు కామం అన్న మాటకు జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ. అందుకే ఏ గుణమును చూసినప్పటికీ ఆ గుణములు అన్నింటిలో కూడా చిట్టచివరి స్థితిని ఇన్ని గుణములు కలిగిన వాడు ఎవరు? అని అడిగితే చెప్పడం చాలా కష్టం. ఏ మంచి గుణం అయినా దానికి చిట్టచివరి హద్దుగా నిలబడే వారు హనుమ. అంతటి మహానుభావుడు, అంతటి త్యాగనిరతి కలిగిన వాడు, అంతటి స్వామిభక్తి పరాయణుడు. 18.ఇంత గొప్పవాడు అయిన ఆయనను పిలిస్తే ఆయన వస్తారా అంటే చెప్పడం కష్టం. ఆయనను పొగిడితే సంతోషిస్తారా? అంటే చెప్పడం కష్టం. కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరుగెత్తుకు వచ్చేస్తారు.
*యత్ర యత్ర రఘునాథ కీర్తనం.*
*తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్.*
*భాష్పవారి పరిపూర్ణ లోచనం.*
*మారుతిం నమత రక్షసాంతకమ్!!*
అందుకే ఆయనకు మహావీరుడు అని పేరు. వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు. వీరుడు అంటే అంతటి వేదాంతి. ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు.
*వైదేహీ సహితం సురద్రుమతలే హైమే* *మహామంటపే*
*మధ్యే పుష్పకమాసనే* *మణిమయే వీరాసనే సంస్థితమ్*
*ఆగ్రేవాచయతి ప్రభంజసుతే తత్త్వం* *మునిభ్యాం పరం*
*వ్యాఖ్యాంతం* *భరతాదిభిహి పరివృతంరామం భజే శ్యామలం !*
అంటారు. అనేకమంది మునులు ఉన్న సభ. భరతాదులు కూడా ఉన్నారు. భరతుడు యువరాజు. కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి. కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్త్వ ముద్రలో ఉన్నారు అంటే వేదాంతం చెప్తున్నారు అని గుర్తు. అంటే రాముడు గురు స్థానంలో ఉన్నారు. గురువుకీ, గురు పత్నికీ, గురు పుత్రుడికీ అభేదం. మూడూ గురు స్థానముల క్రిందే నిర్ణయింపబడ్డాయి. అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చుని ఉంటే సాంసారిక బుద్ధితో గురు పత్ని ఉండదు. సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది. అందుకే జానకి, సీత అనలేదు. వైదేహీ సహితం –విదేహవంశంలో పుట్టినది. అంటే దేహ భ్రాంతి లేనిదై ఆమె ఉన్నది. అంటే ఆత్మగా ఆవిడ కూర్చుని ఉంది. ఆత్మారాముడై రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నారు. అప్పుడు యువరాజు అయినా భరతుడు కూర్చోడు. ‘ఆగ్రేవాచయతి ప్రభంజసుతే’ – వాయు పుత్రుడు అయిన హనుమ కూర్చుంటారు. అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు. రాముడిని సేవించిన వారెందరో ఉంటారు. కానీ ఎప్పుడూ రామ పాదాల దగ్గర నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే. అందుకే ఆయనకు మహావీరుడు అని ఒక పేరు. మహావీరుడు అంటే  అంతటి వేదాంత ప్రజ్ఞకలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనస్సు ఉన్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, ఇంద్రియములను గెలిచిన వాడు, ఇన్ని గుణములు కలిగిన  మహా వీరునికి తమలపాకుతో పూజ చేస్తారు. ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్ధం గనుక, నాగవల్లి అని పేరు ఉంది గనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ. అందుకే హనుమ ఒక్కరికీ తమలపాకులతో పూజ చేయుట అనే ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అయింది. *తమలపాకుతో ఆయనను పూజ చేశాము అంటే ఆయనకు ప్రీతి అయినవి అని కాదు అర్ధము,అంతటి పవిత్రమైన తమలపాకులుతో,అతి పవిత్రమైన హనుమ యొక్క పవిత్ర గుణముల యందు మనకు ప్రీతి యుండుటవలన పవిత్రమైన మనస్సుతో పూజ చేసెదము. ఎవరు హనుమ యందు, రాముని యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళను ఆయన సర్వ కాలముల యందు రక్ష చేస్తూ ఉంటారు.  ఆయన అటువంటి గుణముల పట్ల తాదాత్మ్యత పొందారు. కనుక అటువంటి గుణములను ప్రసాదించమని కోరుతూ   తమలపాకులతో హనుమను పూజించవలెను.

సేకరణ

కుమారచరిత్ర

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా౹౹

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ||
                   

తనచుట్టూ పరివేష్ఠితులై యున్న మహాముని జనావళిని దయా దృక్కులతో వీక్షిస్తూ, శ్రీ మహా శిపురాణాంతర్గతమైనదీ - ముచ్చటైనదీ అనదగ్గ  సంహితను, సమ్మోహ - సమ్మోదాలతో ప్రారంభించాడు సూతమహర్షి.

అంతా శ్రద్ధాళువులై వినసాగారు.

సూత మహర్షిని శౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు. ....

ఓ మహర్షీ! ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవుచున్నారు. కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక ఋణములతోను ఇంకొందరు వ్రణములు ; ప్రమాదములు, అగ్ని బాధలు, శత్రు బాధలు పొందుచున్నారు.
 అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి? అని అడుగగా,

సూత మహర్షుల వారు ఋషులారా! శ్రద్ధగా వినండి, పై దోషములు గలవారుఅపర్ణాదేవి దేవి పూజ , సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనా చేసి, కుజ జన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా భక్తి తోపారాయణ చేస్తారో వారికి జన్మలగ్నవసాత్తు గాని, గోచారలగ్నవసాత్తు గాని, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును.
ముందుగా కుజ జన్మ వృత్తాంతము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలెను, అని సూతులవారు ఈవిధంగా ప్రారంభించిరి.

శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు.
దక్షుడు అనగా సమర్ధుడు అని అర్ధము. ఆ దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని "అశ్వని" (నక్షత్రములు) మొదలగువారిని చంద్రునకు ఇచ్చి వివాహము చేసినాడు.
 ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయణి, శ్రీమాత. పరమశివుడు ప్రతీరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు.
దక్షుడు మామగారు ఐనప్పటినుండి శివుడు నాట్యం పూర్తైన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు.
ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుని సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్దయజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. (కొన్ని పురాణాలలో దక్షుడు చంద్రునికి ఇచ్చిన శాప నివారణకు మహా శివుడు సాయపడ్డాడని దక్షుని కి కోపం వచ్చిందని చెప్పబడినది)
మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయణి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు.
 ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమథగణాన్ని పంపించాడు. దాక్షాయణి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను (దాక్షాయణిని) చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు.
"అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం" అన్నాడు. దాక్షాయణి తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికి పరమశివుని గొప్పతనం చెప్పి, శివనింద చేసినవాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది.
యజ్ఞకుండము దగ్గరకి వెళ్ళి యోగాగ్నిచే దగ్థమైంది. ఆవార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీవిరహమును పొందుచూ తిరిగి హిమవత్ పర్వతము నందు తపస్సు చేయుచుండెను.
అటుల తపస్సు చేయుచుండిన శివుని మూడవ నేత్రమునుండి శ్వేద బిందువులు నేలపై పడి, ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిచాడు.
ఆ ధ్వనికి భూమి, ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూప ధారిణి అయి ఆబాలుడిని ఎత్తుకుని స్తన్యమిచ్చినది.
శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీకుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు.
ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక, తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును, అని చెప్పాడు. శివలలాటజలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే (కు-భూమి యందు, జ-జన్మించినవాడు) కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను.

భూమి కుమారుడు గాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు (సర్వాంగములను పీడించువాడు) గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వమునొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను.
 నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది. అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను.

ఈ వృత్తాంతమంతయు శ్రద్దగా ఆలకించుచున్న మునిపుంగవులు సూత మహర్షిని :
మహానుభావా కుజ దోష నివృత్తికి ఏ దేవతా ఆరాధనా చెయ్యవలెనో తత్ విధానము తెలియచేయ వలసినిదిగా ప్రార్ధించగా సూత మహర్షి మందహాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రమణ్య చరిత్ర తెలియ చేయ గలదు అని సెలవీయగా మునులందరూ ఎంతో ఉత్సుక తతో అయ్యా ఆ వృత్తాంత మంతయు మాకు సెలవీయవలసినిదిగా కోరారు . 
     
సూత మహర్షి అప్పుడు శివపుత్రుడు గాంగేయుడు అగ్నిసంభవుడు , కార్తికేయుడు , మరియు శ్రీ మహావిష్ణువు కు మేనల్లుడు గా మురుగన్ అనే నామ ధేయాలతో దేవతల సేనాని గా తారకాసురుని సంహరించిన శ్రీ సుబ్రమణ్య చరిత్ర ను ఈ విధంగా ప్రారంభించారు . 

*వల్లీశ దేవసేనేశ*
 *భక్తపాలన తత్పర*
 *దరహాస ముఖాంభోజ*
 *సుబ్రహ్మణ్య నమోస్తుతే*
******************

నందీశ్వరావతారం*

*👉ఒకానొక కల్పకాలంలో శిలాదుడనే మహర్షి సత్తముడు సంతాన లేమితో శివారాధన చేసి మరణం లేని, శివుడంత కొడుకు కావాలని శివుని కోరుకున్నాడు. మానవరూపంలో పుట్టవలసిందిగా బ్రహ్మాదులు కోరినందున, నీకు బిడ్డగా జన్మిస్తానని అభయం ఇచ్చాడు శివుడు.*
అటు తర్వాత శిలాదుడు యజ్ఞం చేస్తూవున్న తరుణంలో, యజ్ఞ గుండంలోంచి శివలాంచనాలన్నీ పుణికి పుచ్చుకున్న ఓ బాలుడు ఉదయించి శిలాదునికి ముదముచేకూర్చాడు. అ ఆనందపారవశ్యంలో ఆయన *'నంది'* అనే నామకరణం చేసి ముద్దుగా పెంచుకుంటూండగా, అతని జీవితం కేవలం ఒక్క సంవత్సరమే అని మైత్రావరుణులు ద్వారా తెల్సుకున్న శిలాదుడు దుఃఖితుడయ్యాడు.
నంది, శివారాధకుడినై చిరంజీవత్వం పొందుతానని తపస్సు చేయగా, శివుడు మెచ్చి *ఇకపై నీవు నందివికావు - నందీశ్వరుడివి - నాతో సమానంగా నీకు కైలాసవాసానికి అర్హుడ్ని చేస్తూ నిన్నూ - నీ తండ్రినీ కూడా నా చెంత ఉంచుకోగలను* అని అభయం ఇచ్చాడు. గణాధిపత్యం కూడా ఇచ్చి గౌరవించాడు.
సప్త మరుత్తులు తమకూతురైన *'సుయశ'* నామధేయురాలైన కన్యతో నందికి పెళ్లి జరిపించగా, ఆనాటినుంచి తనుండే ప్రతిచోటా నందీశ్వరుడు ఉండి తీరాలని శాసించి శివుడు, నందికి అపరిమిత గౌరవం అనుగ్రహించాడు.
భైరవావతారం:
ఒకానొక కల్పకాలంలో పరబ్రహ్మ ఎవరనే విషయమై బ్రహ్మ,విష్ణువుల మధ్య వాగ్వాదం చెలరేగి శివమాయాప్రభావాన అది అనంతంగా కొనసాగింది.
ఇంతలో వారి మధ్యనుంచి ఓ జ్యోతి బయల్దేరి, బ్రహ్మాండంగా ప్రజ్వరిల్లసాగింది. ఆ వెలుగులో రుద్రమూర్తి బయల్వెడలినాడు.
బ్రహ్మ ఆ దృశ్యం చూసి, *"ఇప్పటికే ఇక్కడ పరబ్రహ్మమెవరో తేలిక కొట్టుకుంటూంటే, నువ్వూ పోటీకి తయారయ్యావా!"* అంటూ ఎగతాళి చేశాడు.
బ్రహ్మ అహంకారానికి రుద్రుడు కోపించి ఓ మహాభీకర రూపాన్ని సృష్టించాడు. అతడే భైరవుడు. *'ఆమర్దకుడు'* అనే పేర వెలసే భైరవాకృతికే కాలభుడని, కాలరాజు అనీ పేర్లున్నాయి. అంతేకాక భక్తుల పాపాలను భక్షించడం వల్ల పాపక్షకుడనే పేర కూడా వర్ధిల్లుతున్నాడు. (కాశీ క్షేత్రానికి అధిపుడు)
కాలభైరవుడు రుద్రాజ్ఞప్రకారం బ్రహ్మ ఐదోముఖాన్ని త్రుంచాడు. సమయం చూసి, బ్రహ్మ స్త్రోత్రం చేసాడు. *"తమరే పరబ్రహ్మ స్వరూపం"* అని కీర్తించాడు. రుద్రుడు శాంతించాడు.
*'బ్రహ్మహత్య'* అనే కన్యను సృష్టించి, కాల భైరవుడి వెంట పంపాడు.
కాలభైరవుడైన వేళ..
కాలం ఎంతటి వారినైనా కడగండ్లపాలు చేయడం సహజం కదా! భైరవుడు బ్రహ్మ శిరస్సును త్రుంచి, విదిలించినా అది అతడి కొనగోటి నుంచి ఎంతకూ ఊడిపడలేదు. లోక సంచారంలో ఎవరి వల్లనైనా,ఈ కపాలానికి మోక్షమార్గం దొరుకుతుందేమో చుద్దామని అలాగే గోటికి అంటిన కపాలంతోనే ఊళ్ళు తిరగసాగాడు భైరవుడు.
కాశీలో అడుగిడగానే, అతడ్ని వెన్నంటిన బ్రహ్మహత్య పెద్దపెట్టున హాహాకారాలు చేస్తూ పాతాళానికి క్రుంగిపోయింది. భైరవుడి చేతినుండి ఆ కపాలం కూడా రాలిపోయింది. అక్కడ ఏర్పడినదే నేటి బ్రహ్మకపాల తీర్ధం! తదాదిగా కాలభైరవుడు కాశీవాసుడయ్యాడు.
శివసంకల్పరీత్యా, భైరవ జననం మార్గశిర కృష్ణపక్ష అష్టమియందు జరగడంతో అది పుణ్యతిథిగా పరిగణించారు. శివరాత్రితో సమానమైన ఉపవాస, జాగరణ ఫలాలను అందించే పర్వదినంగానూ కాలభైరవ జయంతిని కొందరు పాటిస్తారు.
***************

108 రూపాలలోని శ్రీ గణపతి


..!!💐శ్రీ ఓం గం గణపతియే నమః..!!🙏

1. ఏకాక్షర గణపతి.💐
 ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి.💐
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్

3. బాల గణపతి.💐
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి.💐
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి.💐
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి.💐
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి.💐
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి.💐
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో  దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి.💐
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10.  దుర్గా గణపతి.💐
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి.💐
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి.💐
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి.💐
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి.💐
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15.  నిధి గణపతి.💐
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16.  వక్రతుండ గణపతి.💐
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి.💐
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ || 

18. ఉచ్ఛిష్గ్ట గణపతి.💐
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19.  హరిద్రా గణపతి.💐
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి.💐
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.  మేధా గణపతి.💐
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం  మమ ఆత్మరక్ష వినాయకం

22. మోహన గణపతి.💐
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23. త్రైలోక్య మోహన గణపతి.💐
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి.💐
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి.💐
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి.💐
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి.💐
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి.💐
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి.💐
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి.💐
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి.💐
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి.💐
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి.💐
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి.💐
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి.💐
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి.💐
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి.💐
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి.💐
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||   

39. విద్యా గణపతి.💐
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి.💐
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి.💐
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి.💐
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి.💐
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి.💐
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి.💐
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి.💐
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47.  చింతామణి గణపతి.💐
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి.💐
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి.💐
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి.💐
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి.💐
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి.💐
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి.💐
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి.💐
హేరంబతే రత్నసువర్ణయుక్తే  సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి.💐
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి.💐
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి.💐
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి.💐
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి.💐
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి.💐
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి.💐
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి.💐
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి.💐
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి.💐
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి.💐
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66. ద్విముఖ గణపతి.💐
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి.💐
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి.💐
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి.💐
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి.💐
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి.💐
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి.💐
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి.💐
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి.💐
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి.💐
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి.💐
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి.💐
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి.💐
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి.💐
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80.  విషహర గణపతి.💐
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి.💐
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి.💐
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి.💐
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ

84. మాయావల్లభ గణపతి.💐
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి.💐
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86.  గౌరి గణపతి.💐
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి.💐
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి.💐
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి.💐
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి.💐
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి.💐
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92.  బ్రహ్మవిద్యా గణపతి.💐
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి.💐
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి.💐
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95.  జ్ఞాన గణపతి.💐
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి.💐
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి.💐
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి.💐
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి.💐
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి.💐
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి.💐
వందే గజేంద్రవదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం - క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి.💐
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి.💐
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి.💐
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి.💐
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై:
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి.💐
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి.💐
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి.💐
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో..

ఒకొక్క గణపతి..ఒకో కార్యానికి..ఫలితాలు ఇస్తాడు. మీకు నచ్చిన గణపతిని ఆరాధించి..శుభ ఫలితాలు పొందండి.
స్వస్తి..!!💐

ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా సుఖినో భవంతు..!!💐

                           💐శ్రీ మాత్రే నమః💐

◆ *మయూరధ్వజుని కథ* ◆

*ఇది ధ్వజస్తంభం కి సంబంధించినది..*

భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్టించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి, శత్రురాజులను జయించి, దేవ బ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేసుకొమ్మని సలహా ఇస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వమును నకుల సహదేవులు సైన్యంతో యాగశ్వరక్షకులై బయలుదేరాలు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూర ధ్వజుడు పాలించేవాడు. ఆయన మహా పరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజున్ని జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారున్ని పట్టుకుంది. బాలుని విడిచిపట్టవలసిందని పార్థించగా అందుకా సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అన్నాడు. అందుకు మహత్మా తమరు పొరపాటుపడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది; ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపి ఏదేని వరం కోరుకోమన్నాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుఉండేటట్లు దీవించండి" అని కోరుకోగా. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు పలికాడు. మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందునూ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారమయింది.

📚 సేకరణ...

*వెండే ఎం కుమార్ స్వామి*
(సంఖ్యా వాస్తు జ్యోతిర్విజ్ఞాని)
★🎓ట్రైనింగ్ సెంటర్🎓★

📞9989091369

శంబరాసురుడనే రాక్షసుడు

శంబరాసురుడనే రాక్షసుడు తెలుసుకదా. ఆతనికి ఇంకో పేరు *తిమిధ్వజుడు*.  అతనితో దేవతలు యుద్ధం చేసేటపుడు దశరధమహారాజు దేవతల కోరిక మీద సాయం కోసం వెళ్ళినప్పుడు ... ఆ యుద్దం లో గాయాలపాలై మూర్ఛిల్లిన దశరథుని కి(సారధిగా కైకమ్మ నడిపించింది ట) దూరంగా తీసుకెళ్ళి ఉపచారాలతో స్వస్థత కలిగించింది ఆమె. అందుకు కృతజ్ఞతగా (సత్త్వగుణ వంతులకు కృతజ్ఞత సహజ లక్షణం కదా) ఆమెను వరం కోరుకోమన్నాడు. అవే *అయోధ్యా కాండము* లో శ్రీరామ పట్టాభిషేకం సమయంలో ఆవిడ మంధర ప్రోద్బలంతో కోరింది. ఇంకా విశేషం ఏమిటంటే ఆ తిమిధ్వజ రాక్షస కుమారుని శ్రీరాముడు మట్టుబెట్టేడు. అందుకు చతుర్ముఖ బ్రహ్మ గారు శ్రీరామునికి దివ్యాస్త్రాలు ఇచ్చేరు. ఈ విషయం అయోధ్యా కాండము లో సుమిత్రా దేవి కౌసల్యాదేవి ని ఓదార్చతూ ఆమెకు గుర్తుచేసి శ్రీరాముడు వనవాసం విజయవంతంగా పూర్తి చేసుకున్న వస్తాడని తెలుపుతుంది.

ఈ కైకమ్మ కు పుట్టిన ఇంటి నుంచి అరణం గా వచ్చిన దాసి *మంథర* పూర్వ జనలో *దుందుభి* యనే పేరున్న గంధర్వ కాంత. ఇక రావణ వధ కోసం శ్రీమహావిష్ణువు శ్రీరాముని గా అవతారం ఎత్తే వేళ అనేక మంది నర, వానరు లను దేవతాంశలతో  .. కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వాది జాతుల స్త్రీల తో (కుమారసంభవ సమయం లో పార్వతీదేవి శాపం వల్ల దేవతలకెవరికీ తమ పత్నుల వల్ల సంతానం కలుగదని కదా)  అనేక మందిని భూలోకంలో సృష్టి చేశారు కదా. అలా దేవలోకం నుంచి రావణ వధార్ధమై *కుబ్జ*  మంధరగా ఆ గంధర్వకాంత దుందుభి వచ్చింది.

త్వమేవాహమ్‌*

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......

             *నేను =I*

*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ
*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

*ఈ "నేను"* లోంచే
*నాది* అనే భావన పుడుతుంది!

*ఈ *నాది* లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.

              *EGO అహం*

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.

*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య, 

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*

 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*

 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*

*1.నేనే*  శాసన కర్తను,

 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

*3.నేనే* జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ *నేను*
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.

*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!

   *అది శాశ్వతం కానే కాదు*

ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.

*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.

*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*

*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*

*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*

*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
*వేదాంతసారం*.

*అహం బ్రహ్మాస్మి* అంటే
*అన్నీ నేనే* అనే స్థితి నుంచి
*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత*
 *సేకరణ* : వాట్సాప్

ద్రౌపది గురించి :- - 2-


       శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి. అందరి మనోగతాలను తెలుసుకోగలడు. ఆయనను చూసేసరికి ద్రౌపది కి పోవుచున్న ప్రాణాలు లేచి వచ్చినట్లు అయింది. అప్పుడు ద్రౌపది సంగ్రహంగా ఆయనకు విషయం చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో తొందరను ప్రదర్శిస్తూ ఆమె తో అమ్మా! ఆ మాటలు తర్వాత చెప్పవచ్చును. ముందు నాకు తినడానికి ఏమైనా పెట్టమ్మా! నాకు ఆకలి బాధ ఎక్కువ గా ఉంది. నేను ఇప్పుడు ఎంత దూరం నుండి అలసి సొలసి వచ్చేనో నీకు తెలియదు. ఆ మాట విని ద్రౌపది సిగ్గుతో క్రుంగిపోయింది. ఆయనకు బదులు చెప్పలేక, ఇప్పుడే నేను భోజనం చేసి లేచాను, అక్చయ పాత్ర లో ఏమీ మిగుల లేదు. అని చెప్పింది. ఏదీ? ఆ పాత్ర ను నాకు ఒక్క సారి చూపించు అన్నాడు, పరమాత్ముడు. ద్రౌపది ఆ పాత్ర ను తెచ్చి ఆయనకు ఇచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పాత్రను చేతిలో ఉంచుకుని పరిశీలించగా, అందులో ఒక ప్రక్కన ఒక కూరాకు అంటుకుని కనపడింది. దానిని తన నోట్లో బెట్టుకొని ఆయన ఈ కూరాకుతో జగదాత్మస్వరూపుడు
యఙ్ఞభోక్త అయిన పరమేశ్వరుడు వెంటనే త్రుప్తి చెందుగాక! అని పలికాడు..తరువాత ఆయన సహదేవుడు ని పిలిచి అతని తో సహదేవా! నీవు పోయి మునీశ్వరులు ను భోజనానికి పిలుచుకుని రా! అని చెప్పాడు. అప్పుడు సహదేవుడు గంగాతీరానికి వెళ్లి చూడగా అక్కడ అతనికి ఒక్క ముని కూడా కనిపించలేదు. జరిగిన విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు కూరాకును నోటబెట్టుకొని ఆ సంకల్పం పఠించినవేళ ఆ మునీశ్వరులు అందరూ నీటిలో నిలిచి అఘమర్షణ మంత్రాలు పఠించుకొంటూ ఉన్నారు. ఆ సమయంలో వారికి అకస్మాత్తుగా తమ ఉదరాలు అన్నీ పీకలవరకూ భోజనాలు చేసినట్లు అనుభూతి కలిగింది. వారు పరస్పరమూ ఒకరి మొఖం ఒకరు చూసుకుని ఇక మనం అక్కడ కు పోయి ఏమి భోజనం చేయగలం అని చెప్పుకున్నారు. మారుమాట్లాడకుండా అటు నుండి అటే వెళ్లిపోవడం శ్రేయస్కరం అని దుర్వాసుడు భావించుకున్నాడు. కారణం ఏమిటంటే పాండవులు భగవద్భక్తులని అతనికి తెలుసును. తన విషయంలో అంబరీషుని ఇంట్లో జరిగిన సంఘటన అతనికి ఎన్నటికినీ మరపునకురాదు. ఆ సంఘటన జరిగింది మొదలు అతనికి భగవద్భక్తులు అంటే భయం కలగడం మొదలైంది. తోడనే అతడు శిష్యసమేతంగా అచ్చట నుంచి కదిలి వెళ్ళిపోయాడు. వారు వెళ్ళుతున్న సమాచారం అక్కడ ఉన్న ఇతర మహర్షుల వలన సహదేవునకు తెలిసింది. అతడు వెళ్లి వచ్చి ఆ విషయం ధర్మనందనకు చెప్పాడు. ఈ విధంగా శ్రీక్రుష్ణునియందు ద్రౌపది కి ఉన్న భక్తి కారణంగా పాండవుల నెత్తిమీదనుండి ఒక మహాభయంకరమైన ఆపద తొలగింది. ఈ విధంగా ఆ పరమ పురుషుడు తన శరణాగత వాత్సల్యము ను వెల్లడించాడు.

ప్పవాడు - కధనం

నాకు బ‌స్ డ్రైవ‌ర్ కు మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌.! అత‌డిని త‌క్కువ అంచ‌నా వేసి త‌ప్పుచేశాను! గొ
“Don’t judge a book by its cover” ఈ మధ్య ఒక యాడ్లో బాగా పాపులర్ అయింది కదా ఈ డైలాగ్.. మన నిత్య జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి సంధర్బం ఎదురవుతూ ఉంటుంది… చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో లాంటి సామెతలను కూడా మనమేగొప్పగా చెప్తూనే..ఎదుటి వ్యక్తి వేసుకున్నబట్టలను బట్టే తనేంటో డిసైడ్ చేస్తాం..ఇలాంటిదే ఒక సంధర్బాన్ని మీతో షేర్ చేస్తాను.. నన్నే కాదు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోయేలా చేస్తుంది..!
కాలేజ్ కి వెళ్లడానికి ఒక రోజు సిటిబస్  ఎక్కాను.. పావుగంటలో దిగిపోతాను కదా అని లోపలికి వెళ్లకుండా డ్రైవర్ సీట్ పక్కనే నిల్చున్నాను..డ్రైవర్ వైపు చూసా కొంచెం చినుగులు, మాసినట్టుగా ఉన్నాయి బట్టలు నాకు కొంచెం చిన్నచూపుగా అనిపించింది.. కాసేపటికి డ్రైవర్ కి నాకు మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది..మొదట ఏ కాలేజ్ చదువుతున్నావ్?? ఏం చదువుతున్నావ్ లాంటి క్యాజువల్ క్వశ్చన్స్ అడిగారు…నేను నా కాలేజ్ పేరు గర్వంగా చెప్పాను.. ఎందుకంటే ఆ సిటిలో పెద్ద కాలేజెస్ లో అది ఒకటి..

అవునా,ఎంత పర్సంటేజ్ వచ్చింది అని రెట్టించి అడిగారు.. ఈసారి మరింత గొంతు పెంచి 94% అని చెప్పాను.. అది ఆయనకు చాలా ఎక్కువ.. మాటల్లో అతనిది మా సొంతూరే అని తెలిసింది.. ఇంతలో మరి ఐఐటి-జెఇఇ ఎందుకు ప్రయత్నించలేదు??అతని నోటి నుండి వచ్చిన ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యం కలిగించింది.. క్యూరియాసిటితో మీకివన్ని ఎలా తెలుసు అని అడిగా..
నా కూతురు చెన్నై ఐఐటి నుండి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది ప్రస్తుతం USలో ఉంటుంది.. నా కొడుకు NITలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు..వారిద్దరికి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో 98% మార్క్స్ వచ్చాయి.. అని అతని మాటలు కంప్లీట్ అవుతండగానే నా స్టాప్ వచ్చింది.. విప్పారిన కళ్లతో బై చెప్పి బస్ దిగాను నా ముఖంలో ఆశ్చర్యం  అతనికి స్పష్టంగా కనపడే ఉంటుంది..
ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. ఐఐటి,ఎన్ఐటిలు లాంటివి మన వల్ల కాదు అని నాకు ఇంట్లో నూరిపోసేవాళ్లు.కానీ, కలలు కంటే వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడితే ఏదైనా జయించొచ్చు అని అర్దం అయింది..రెండోది ఏ వ్యక్తిని కూడా చూడగానే జడ్జ్ చేయకూడదు అని..తను కావాలనుకుంటే డ్రైవర్ గా చేయకుండా కూడా సంతోషంగా ఉండొచ్చు..కానీ తను తన వృత్తిని ప్రేమిస్తున్నారు..తన పిల్లలు సెటిల్ అయినా కూడా తన పనిని మర్చిపోకుండా కష్టపడుతున్నారు..నా కలల్ని నిజం చేసుకోవడానికి నాకు కావల్సినంత బలాన్నిచ్చారు..!

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చెయ్యండి

భగవద్గీత మానవుడి భవిత*.


గీత అంటే కేవలము కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు, ప్రతి హృదయములో నిరంతరము జరుగుతున్న సంఘర్షణ.
నిరాశా నిస్పృహలతో మునిగిన వారికి ఉత్సాహాన్ని కలిగించేది గీత. ఆపదలో ఉన్నవారి హృదయాలను ధైర్యముతో తట్టి లేపేది గీత. సంశయాలతో కొట్టుమిట్టాడుతున్న వారి శంకలన్ని పొడమార్చేది గీత. కన్నీరు కార్చే వారికి ఓదార్పు గీత.
అజ్ఞానమనే చీకట్లతో సహవాసము చేస్తున్న వారికి వెలుగు జ్యోతి గీత.
శ్రీ కృష్ణుని హృదయావిష్కారము గీత. గీత అంటే గానము చేయబడేది అని అర్థము.
ఆనందముగా ఉన్నప్పుడే గానము సాధ్యమవుతుంది, కావున భగవద్గీత లక్ష్యము ఆనందము.
మానవ జీవితములో శోకాన్ని తొలగించి ఆనందాన్ని అనుభవించేందుకు త్రోవను చూపించడమే శ్రీ మద్ భగవద్గీత ముఖ్యోద్దేశ్యము.
త్యాగమంటే అన్నిటినీ వదిలేయడం. త్యాగానికి నిదర్శనం సన్యాసం. అవుతే నేటి కాలంలో సన్యాస జీవితం అరుదైపోయింది/కనుమరుగై పోయింది. అందుకని ఇది మనకు సంబంధించింది కాదనే అభిప్రాయానికి తావులేకుండా త్యాగానికి నిర్వచనమిచ్చింది గీత.
*కర్మలను ఆచరించి, వాటి ఫలితాన్ని భగవంతునికి సమర్పించడమే త్యాగం* అని *యస్తు కర్మఫలత్యాగి స తాగీత్యభిధీ యతే* అంటోంది గీత...ఫలితాన్ని ఆశించక కర్మలను చేయడమే సన్యాసమని గీతా వచనము.
*ఎవరికి వారు,  వారి వారి విధులను చక్కగా నిర్వహిస్తూనే, దీనికి అర్హులు కావచ్చనేది దీని పరమార్థము*.
*సమత్వం యోగ ఉచ్చతే* మరియు *యోగ కర్మ సు కౌశలమ్*...తాను చేసే పని విజయవంతమైనా, విఫలమైనా సమానంగా స్వీకరించ గల్గే మానసిక స్థితినే యోగం అంటోంది గీత.
*మనిషిని భగవంతునితో ఏకం చేసే ప్రతి పని యోగమే*

*🪔 #మరణంలో_స్మరణo 🪔*



👌 పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణ తప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాల చేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు.

ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడి వద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించు కొనసాగారు... ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞాన గురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.

ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొని పోవడానికి నిశ్చయించుకొన్నారు.

గురువు గారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీ క్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు.

వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,దాన్లో చక్కని పరుపును, దిండు ను అమర్చి గురువు గారిని ఆసీనుణ్ణి చేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.

ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువు గారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడం చేత గురువు శిష్యులను, “మనం ఎంత దూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు.

అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేర లోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు.

 ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి.

 పూర్వ పుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.

ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన చేత అందరి పిల్లల వలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి.

ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమ కట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేక కాలం గడపసాగాడు.

ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పని మీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజు వద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.

ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!

రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని  ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు.  రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ  బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:

“కామం క్రోధంచ - లోభంచ -
దేహేతిష్ఠంతి తస్కరాః
 జ్ఞానరత్నా పహారాయ -
తస్మాత్ జాగృతః జాగృతః."

మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త!

 - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు;  నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.

మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:

“జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః ..
సంసార సాగరం దుఃఖం -
తస్మాత్ జాగృతః జాగృతః.”

పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:

“మాతానాస్తి - పితానాస్తి -
నాస్తి బంధు సహోదరః
అర్థం నాస్తి - గృహం నాస్తి -
తస్మాత్ జాగృతః జాగృతః”

తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు.
ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు,

“ఆశయా బధ్యతే లోకే -
కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి -
తస్మాత్ జాగృతః జాగృతః.”

అని చాటింపు వేశాడు.

ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త  జాగ్రత్త - అని చాటాడు.

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు.  కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికి పోయాడు.

మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను.

 నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.

తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.

అప్పుడు ఆ జీవన్ముక్తుడు,  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష  విధిస్తారు?” అని అడిగాడు.  అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.   నా చేతులమీద, నా కత్తితో  వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.

 రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు.

ఇలా కొంతకాలం గడిచింది.

దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.  “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు:

“ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”

బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది.  దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలు పరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే:

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్య మంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది.

అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..

మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామ మహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు.

అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని  ముందు ప్రత్యక్షమయ్యాడు.  బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో  నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని  అడిగాడు.
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు:

ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటం చేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది.

భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది.

కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. .. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం !🙏

సర్వేజనా సుఖినోభవంతు 

*శివం - శవం*

చిరిగి పోయిన సంచిలో బంగారం పెడితే ఆ సంచి చిరిగి వున్నా, సంచి కి విలువ ఉంటుంది.

సంచి నుండి బంగారాన్ని వేరు చేస్తే,

ఆ సంచికి విలువ లేదు.

దాని వలె, మన శరీరమనే చిరిగిన సంచిలో, ఆత్మ అనే భగవంతుడు ఉన్న వరకే  ఈ శరీరానికి విలువ.

శరీరంలోని ఆత్మ బైటికి వెళ్ళాక, ఈ శరీరాన్ని ముట్టటానికి కూడా ఆలోచిస్తారు.

అంటే  బంగారానికి విలువ ఉంది కానీ, సంచికి కాదు.

అలాగే చైతన్య స్వరూపుడైన భగవంతుడికి విలువ వుంది కానీ, మన శరీరానికి కాదు.

శరీరంలో జీవం ఉంటే శివం,

శరీరం నుండి జీవి వెళ్లిపోతే శవం.

ఈ శరీరంలో జీవం వున్నప్పుడే, నలుగురికి ఉపయోగపడాలి.

నిరంతరం భగవన్నామ స్మరణ చేయాలి.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

నారాయణ నారాయణ⚜️



#ఒక అవ్వ ఎప్పుడూ- కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది.
ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు.

"#నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ.

"#అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే.
రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు.

#మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు.
అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" #అన్నాడు.

#ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ! నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను.
#నీటితో నిండి, పదిమందికీ ఉపయోగపడాల్సిన ఆ చెరువు, ప్రతి సంవత్సరమూ తెగిపోయి, నిరుపయోగమయి పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగౌతుందో నారాయణుణ్ని అడిగి తెలుసుకురా" అని చెప్పాడు. "సరే" అని విష్ణు #ముందుకు సాగిపోయాడు.

#అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. "బాబూ! నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది.
అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా?" అని అడిగింది.

"#ఓ! సరేలే! దానిదేముంది? తప్పకుండా కనుక్కుని వస్తాను" అని ముందుకు సాగాడు విష్ణు.

#అలా చాలా దూరం నడిచిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకొని, విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు.
అది ఒక మామిడిచెట్టు.
ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్లు! 'ఒక్క పండు తిందాం' అనుకొని విష్ణు ఒక పండుని కోసి, #రుచిచూశాడు.
 కానీ ఆ పండు చేదుగా ఉన్నది! మరో పండును కోసి చూస్తే, అది కూడా చేదే! "ఏమిటిది! మామిడిపళ్ళు #చేదుగా ఉంటాయా?" అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు.

అప్పుడు ఆ మామిడిచెట్టు మాట్లాడింది:
"చూడు బాబూ! నువ్వు 'నారాయణ స్వామి' దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది.
నాకో సాయం చేసి పెట్టు.
ప్రతి సంవత్సరమూ నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటంలేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబూ!" అన్నదది. 'సరే' అని విష్ణు ముందుకు సాగాడు.

#ఇంకొంత ముందుకు పోయాక, అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది.
'ఎంత అందంగా ఉన్నది, ఈ మల్లెచెట్టు!' అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు.
అంతలో ఆ మల్లెచెట్టు అన్నది: "బాబూ! నేను ఇన్ని పూలు పూస్తాను కదా! ఎవ్వరూ నా పూలకోసం రావటమే లేదు.
ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను.
నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది.
ఏం చేస్తే నా యీ బాధ దూరమౌతుందో కాస్త ఆ నారాయణున్ని అడిగి కనుక్కుని రావా?" అని.
విష్ణు అందుకు ఒప్పుకుని ముందుకు నడిచాడు.

#ఆ తరువాత అతను "నారాయణ, నారాయణ" అనుకుంటూ ముందుకు సాగాడు.
ఎంతో అలసిపోయాడు- కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. వెనకడుగు వేయలేదు.
అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి

 "#బాబూ! నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా!" అని అడిగాడు.

#సరే' అని విష్ణు నీళ్లకోసం వెతికాడు.
దగ్గరలోనే ఒక చిన్న నీళ్లగుంత కనిపించింది అతనికి.
కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదే!?
కొంచెం ఆలోచించిన మీదట, విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి, తాత దగ్గరికి తీసుకెళ్ళి,
 "తాతా! దీన్ని పిండు.
నీళ్ళు వస్తాయి" అని చెప్పాడు.

 #విష్ణు తెలివితేటలను మెచ్చుకొన్న తాత "మనవడా! నువ్వెవరు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగాడు.

"#నారాయణుణ్ని చూసేందుకు" అన్నాడు విష్ణు.

"నారాయణుణ్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు?" అని అడిగాడు తాత.

"#మా అవ్వ ఎప్పుడూ 'నారాయణ, నారాయణ' అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను.,
ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను"
అని చెప్పాడు విష్ణు. 🌿🌸🌹

ఆపైన తను దారిలో కలిసిన వాళ్లందరి సమస్యల గురించి కూడా చెప్పాడు.
#తాత అన్నాడు: "నారాయణుని గురించైతే నేనేమీ చెప్పలేను;
కానీ మిగిలినవాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను.

#గత జన్మలో ఆ మల్లెచెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలనూ, పూతీగలనూ కాళ్లతో అదేపనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది" అని.

"#మరి, దానికి ఏమీ పరిష్కారం లేదా, తాతా?" అని అడిగాడు విష్ణు.🌿🍁🍀

"#లేకేమి? ఉంది! ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే, ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు" అన్నాడు తాత.

#తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు.

"#ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది.
దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే, ఆ మామిడి కాయలు తియ్యగా పండుతాయి" అన్నాడు తాత.

'సరే'నని పాము గురించి అడిగాడు విష్ణు.

"#ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది.
దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే, ఆ పాముకు పుండు మేలవుతుంది" అని చెప్పాడు తాత.

#ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు.
"రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి, ఇంట్లో పెట్టుకొని, చదివించి, రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది.
#సమస్యలన్నీ తీరిపోతాయి" అని చెప్పాడు తాత.

తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకూ పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు.

#తొలుత ఎదురైన మల్లెచెట్టుతో, దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు.
అప్పుడా మల్లెచెట్టు "వేరే ఎవరో ఎందుకుగాని, నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదూ?" అన్నది.🌻🌷🌹

"#సరే"నని, కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ, ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు.

అప్పుడా మామిడిచెట్టు "వేరే ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తీసుకో, ఆ బిందెడు బంగారాన్నీ!" అన్నది.

"సరే"నని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు.

ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు.
 ఆ పాము తన పుట్టలో పడిఉన్న రత్నాలహారాన్ని తెచ్చి, విష్ణుకే ఇచ్చింది.⚜️🌼🍂

#చివరకు రాజుని కలిసి అతని సమస్యకూ పరిష్కారం చెప్పాడు విష్ణు.

"ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు? నువ్వే ఉండు!" అని, రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి, విష్ణును, అవ్వనూ తనతోబాటే ఉంచుకున్నారు.

#అంతలోనే విష్ణుకు తను నారాయణుణ్ని కలుసుకోలేదని గుర్తుకువచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ #అన్నది: "దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు - ఎక్కడైనా ఉంటాడు విష్ణూ! కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, #కనికరిస్తాడు. ⚜️🍀🌹

#నువ్వు నారాయణుణ్ని చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు?

#ఇంకా అర్ధంకాలేదా? ఆ *నారాయణుడే!"* అని

⚜️🌼⚜️🌼⚜️🌼⚜️
              ఓం నమో శ్రీమన్నారాయణ 

మనకెంతమంది అమ్మలు.

నీకెంతమంది అమ్మలంటే ఏం చెబుతాం, ఒక్కరే అమ్మని కదా ! నిజమే కదా! ఎవరికైనా అమ్మ ఒక్కతే కదా! కానీ హిందూశాస్త్రప్రకారం మనకు ఏడుమంది అమ్మలున్నారట.
వారెవరో తెలుసుకొనేముందుగా

 సప్తమాతృకలంటే ఎవరో చూద్దాం. ఈ సప్తమాతృకలకే ఏడుమంది అక్కాచెల్లెల్లని,అక్కమ్మ గారని, ఏడు శక్తిస్వరూపాలని పిలుస్తారు.

 వారు.
(1) హంసవాహనంగా కల బ్రాహ్మణి.
(2) గరుడవాహనంగా గల వైష్ణవి
(3)  నెమలివాహనంపై కౌమారి.
(4) ఐరావతం మీదనున్న ఇంద్రాణి
(4) మహిష వాహనంగావున్న వారాహి.
(5) ఐరావతంను వాహనంగా కల ఇంద్రాణి.
(6) శవవాహనంగా గల చాముండి.
(7)  వృషభ
వాహనంగా కల మహేశ్వరి

ఇక శాస్త్రప్రకారం మనకు ఏడుమంది తల్లులున్నారు.
వారెవరంటే...
(1) తనను కన్నతల్లి
(2) అత్త (పెళ్ళాం తల్లి)
(3) వదిన (అన్నభార్య)
(4) మేనమామ భార్య
(5) తల్లి సోదరి
(6) గురుపత్ని
(7) తండ్రితల్లి

వీరినే కాకుండా హిందూసాంప్రదాయం
అన్నం పెట్టి ప్రాణాలు నిలిపిన స్త్రీ,
ఏ కారణం చేతనైనా సరే చనుబాలిచ్చిన స్త్రీ సహితం తల్లులేనని చెబుతోంది.

*శంకర నారాయణ డిక్షనరి* కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు.
చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు.
గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..
పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని
తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.
అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.
అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి అంటే అడ్వెంచరర్ అన్న మాట.
రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు.
తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!
ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.
కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.
పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే "శంకరనారాయణను తీసి by చూడు" అనుకుంటూ అప్రయత్నంగానే ఆయనను తలచుకుంటూనే ఉంటారు.

చివరి పలుకు: నా అనుభవంతో చెబుతున్నాను. మీరు మీ ఇంగ్లీష్, జ్ఞానాన్ని  అపారంగా పెంచుకోవాలి అంటే, ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ డిక్షనరీ నే వాడండి. ఇంగ్లీష్ పదాలకి తెలుగు అర్దాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

#మహోన్నతులు_కేరళ_ప్రజలు

ఇదే భారతదేశాన్ని గొప్పగా చేస్తుంది.  విమాన ప్రమాదంపై కేరళలోని ఒక స్నేహితుడు నుండి పంపబడిన సందేశం..

"వారు ప్రయాణీకుల సామాను దోచుకోలేదు.  గాయపడిన ప్రయాణికుల జేబుల నుండి వారు దొంగిలించలేదు.  పుర్రె టోపీ ధరించిన ప్రయాణీకులకు లేదా నుదిటిపై తిలక్ ఉన్నవారికి మధ్య వారు ఎటువంటి తేడా చూపించలేదు.  అధిక పెట్రోల్ ధర గురించి లేదా కోవిడ్ కారణంగా వారి కరువు కష్టకాలం గురించి వారు ఆలోచించలేదు.  వారు సురక్షితమైన దూరం ఉంచడానికి లేదా ముసుగులు ధరించని వారిని తాకడానికి నిరాకరించలేదు.  ఈ నెలల్లో చాలా జాగ్రత్తగా ఉన్న తరువాత వారు కోవిడ్‌కు భయపడలేదు.

 గాయపడిన ప్రయాణీకులకు వారి రక్తం ఇవ్వడానికి వేచి ఉన్న మెన్ & ఉమెన్ వాలంటీర్లతో హాస్పిటల్ బ్లడ్ బ్యాంకుల ముందు ఉన్న పొడవైన క్యూ, అర్ధరాత్రి దాటిందని మరియు వారి పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారని కూడా గ్రహించలేదు.  గాయపడిన ప్రయాణికులను తమ కార్లలో తీసుకెళ్లినప్పుడు, వారి కార్ల తోలు సీటు కవర్లు రక్తం మరియు మట్టితో తడిసినా వారు బాధపడలేదు.

 తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ వాహనాల్లో అధిక వేగంతో ఆసుపత్రికి తరలించిన ఆ ప్రయాణికుల పేరు, మతం లేదా జాతీయత వారికి తెలియదు.  విమానం కూలినట్లు విన్న వారు రాత్రిపూట కురుస్తున్న కుండపోత వర్షం గురించి వారు బాధపడలేదు.

 పోలీసులు లేదా అంబులెన్సులు వచ్చేవరకు గాయపడిన వారిని తీయటానికి వారు వేచి ఉండరు.  గాయపడిన ప్రయాణికుల్లో ఎక్కువ మందిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు స్థానికులు.  ఏమి జరిగిందో అర్థం చేసుకోకుండా వేరుచేయబడిన చిన్న పిల్లలు, వారి ఛాతీకి దగ్గరగా ఉంచబడ్డారు మరియు వారు మాట్లాడగలిగే భాషలలో ఓదార్చారు.  పిల్లల చిత్రాలతో వాట్సాప్ ఎంఎస్‌జిలు మరియు తల్లిదండ్రులు వారిని సంప్రదించే వరకు, పిల్లవాడిని కలిగి ఉన్న వ్యక్తి యొక్క కాంటాక్ట్ నంబర్‌తో తెలిసిన అన్ని నంబర్లు & గ్రూపులకు కేర్‌టేకర్ లకు పంపబడింది.

 ఇవన్నీ కేరళలోని మలపురం యొక్క ఆర్డినరీ పీపుల్ చేత చేయబడ్డాయి - ఈ పరిస్థితికి ప్రతిస్పందించడానికి అలాంటి దయ మరియు మనస్సు ఉనికిని కలిగి ఉన్నారు.

 ఈ రోజున సహాయం చేసిన మలపురం ప్రజలకు ఒక స్టాండింగ్ సాల్యూట్.

 వారే లేకపోతే, ప్రమాద మరణాలు ఇంకా ఎక్కువగా ఉండేవి.  భారతీయులుగా ఉన్నందుకు గర్వంగా ఉంది, కేరళలోని మలప్పురం ప్రజలకు ధన్యవాదాలు.🙏🙏🙏

బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా ?


అవును. కానీ కాదు.
అవును : బుద్ధ అనే పేరుతో శ్రీహరి అవతారం ఉంది.
కాదు : ఆ బుధ్ధ అవతారం కలియుగంలో గౌతమ బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు మాత్రం కాదు. అసలు ఆ అవతారం పేరునే బౌద్ధమతం స్థాపించేముందు బుద్ధుడు పెట్టుకున్నాడు. తెలియనివాళ్ళు 10అవతారాల్లో ఒకడు గౌతమబుద్ధుడు అని కలిపేస్తుంటారు. వాళ్లకు ఇది వివరంగా చెప్పండి.

అసలు శ్రీమహావిష్ణువు కేవలం 10 అవతారాల్లోనే వచ్చాడా ? కాదు. వివరణకై ఇది చదవండి.

ఏక వింశతి అంటే 21 శ్రీమహావిష్ణువు అవతారాలు :

దశావతారాలు ముఖ్యమైనవి అని మనకు పెద్దలు చెప్పారు కానీ పది అవతారాలు మాత్రమే అని కాదు. ఎన్నోసార్లు ఎన్నో యుగాల్లో శ్రీమహావిష్ణువు తాత్కాలికంగా కూడా లోకకళ్యాణార్ధకార్యాలకై భువిపైకి వేంచేశాడు.
వివరాలు చూద్దాం :

"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్..!!
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే"

ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును
(జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును.
సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.

భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రకారం భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతారాలు దాల్చాడు..
వాటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి ..
దశావతారాలతో ఏకవింశతి అవతారాలు కలవు వాటి గురించి తెలుసుకుందాం..!!

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

మత్స్యావతారము
కూర్మావతారము
వరాహావతారము
నృసింహావతారము లేదా నరసింహావతారము
వామనావతారము
పరశురామావతారము
రామావతారము
కృష్ణావతారము
వెంకటేశ్వరావతారము
కల్క్యావతారము

బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి.
ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.
(బుద్ధుడు అంటే బౌద్ధ మత ప్రబోదకుడైన బుద్ధుడు కాదు)

మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి.
అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి.
ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు.
ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

౧) బ్రహ్మ అవతారము:
దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.

౨) వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.

౩) నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.

౪)నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.

౫) కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.

౬) దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.

౭) యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.

౮) ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.

౯) పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.

౧౦) మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.

౧౧) కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.

౧౨) ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.

౧౩) మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.

౧౪) వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

౧౫) నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.

౧౬) వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.

౧౭) పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.

౧౮) వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.

౧౯) రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.

౨౦) కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.

౨౧) కల్కి అవతారము : కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.

భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.

వరాహావతారం - భూసముద్ధరణం.

సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం

కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం

దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం

సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం

నరనారాయణావతారం - కామజయం

ధ్రువావతారం - ధ్రువపదారోహం

పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం

ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం

హయగ్రీవావతారం - వేదజననం

మత్స్యావతారం - వేద సంగ్రహం

కూర్మావతారం - మందర ధారణం

ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం

వామనావతారం - బలిరాజ యశోరక్షణం

హంసావతారం - భాగవత యోగోపదేశం

మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం

పరశురామావతారం - దుష్టరాజ భంజనం

రామావతారం - రాక్షస సంహారం

కృష్ణావతారం - లోకకళ్యాణం

వ్యాసావతారం - వేద విభజనం

బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం

కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు.
అచిత్తు ప్రకృతి.
ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది.
శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు.

అవి

అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
అంతర్యామి - సకల జీవనాయకుడు.

జై శ్రీమన్నారాయణ ! ఓం నమః శివాయ !!

భారత దేశ తొలి ౼మహిళా ప్రధములు

★తొలి పట్టభద్రులు - కాదంబిని & చంద్రముఖి 1883

★తొలి హానర్స్ గ్రాడ్యుయేట్ - కామినీ రాయ్ 1886.

★తొలి న్యాయవాది ౼సోరబీ - 1892

★తొలి సైన్స్ డైరెక్టర్ - అసిమీ చటర్జీ- 1944

★తొలి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి - లీలాసేథ్

★తొలిసుప్రీంకోర్ట్ న్యాయమూర్తి - జస్టిస్ ఫాతిమా బీవి

★తొలి హోం మంత్రి ౼సబితా ఇంద్రారెడ్డి

★తొలి హైకోర్ట్ న్యాయమూర్తి - అన్నా చాందీ

★తొలి పైలెట్ -దుర్గా బెన

★ తొలి వైద్యురాలు - కాదంబినీ గంగూలీ

★అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళ కల్పన చావ్లా

★తొలి నోబెల్ గ్రహీత - మదర్ థెరిస్సా

★ఢిల్లీ రాజ్య వంశీయులలో తొలి రాణి -రజియా సుల్తానా

★ మొదటి మహిళా ప్రధాన మంతి ఇందిరా గాంధీ 1966

★ తొలి మహిళా ముఖ్య మంత్రి - సుచేతా కృపలాని(1963-67 ఉత్తర ప్రదేశ్ )

★ తొలి మహిళా గవర్నర్ -సరోజినీ నాయుడు -1947-49 ఉత్తర

★తొలి కేంద్ర మంత్రి - విజయలక్ష్మీ పండిట్ ఆరోగ్య శాఖ

★ తొలి లోక్ సభా స్పీకర్ - మీరా కుమార్ తొలి అసెంబ్లీ స్పీకర్ ౼షానోదేవి

★ తొలి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు -అనీబిసెంట్

★తొలి మహిళా రాష్ట్రపతి - ప్రతిభా పాటిల్

★ తొలి ఐపీఎస్ అధికారి - కిరణ్ బేడీ

★ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ - బచేంద్ర పాల్ , 1984


★ఏషియన్ గేంస్ లో బంగారు పతక విజేత:కమల్జీత్ సంధూ

★రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళ :ఉపిందర్ జిత్ కౌర్

★ఇంగ్లీష్ చానల్ ఈదిన తొలి మహిళ - ఆర్తి సాహా

*విక్రమ్ సారాభాయ్*

ఆగష్టు 12, 1919 న గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో సంపన్న పారిశ్రామికవేత్తలకు జన్మించిన విక్రమ్ సారాభాయ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. కేంబ్రిడ్జ్లో ఉన్న సమయంలో, అతను కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేశాడు మరియు దానిపై అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను 28 సంవత్సరాల వయస్సులో 1947 నవంబర్ 11 న అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్ఎల్) ను స్థాపించాడు. పిఆర్ఎల్ తరువాత, సారాభాయ్ అహ్మదాబాద్లో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి, ఇస్రో స్థాపనకు మార్గనిర్దేశం చేశారు. విక్రమ్ సారాభాయ్  ఇస్రోను కనుగొనటానికి

దారితీసింది  ?

రష్యాకు చెందిన స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తరువాత, భారతదేశానికి అంతరిక్ష సంస్థ కూడా అవసరమని సారాభాయ్ అభిప్రాయపడ్డారు. కింది కోట్‌తో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఇంకోస్పార్) కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని ఒప్పించారు:

"అభివృద్ధి చెందుతున్న దేశంలో అంతరిక్ష కార్యకలాపాల యొక్క ance చిత్యాన్ని ప్రశ్నించేవారు కొందరు ఉన్నారు. మాకు, ప్రయోజనం యొక్క అస్పష్టత లేదు. మేము. చంద్రుని లేదా గ్రహాల అన్వేషణలో లేదా మానవుల అంతరిక్ష విమానంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే ఫాంటసీ లేదు.అయితే మనం జాతీయంగా, మరియు దేశాల సమాజంలో అర్ధవంతమైన పాత్రను పోషిస్తే మనం తప్పక మనిషి మరియు సమాజం యొక్క నిజమైన సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఎవరికీ రెండవది కాదు. "

అతని దృష్టి మరియు నిబద్ధత నెహ్రూ ప్రభుత్వంలో ఇన్స్కోపర్ స్థాపనకు దారితీసింది. తరువాత దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గా తిరిగి నామకరణం చేశారు.

అంతరిక్షం మరియు విజ్ఞాన శాస్త్రంలో

విక్రమ్ సారాభాయ్ యొక్క ప్రధాన రచనలు విక్రమ్ సారాభాయ్ హోమి భాభా భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ప్రయోగ స్టేషన్‌ను స్థాపించడానికి సహాయపడింది, దీనిని తిరువనాథపురం సమీపంలోని సెయింట్ మేరీ మాగ్డలీన్ చర్చిలో నిర్మించారు. మొదటి విమానం సోడియం ఆవిరి పేలోడ్ మరియు 21 నవంబర్ 1963 న ప్రయోగించబడింది.

భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం భూమిని కక్ష్యలో నిర్మించడానికి దారితీసే ఒక ప్రాజెక్టును సారాభాయ్ ప్రారంభించారు. రష్యన్ రాకెట్ అయిన కపుస్టిన్ యార్‌పై సారాభాయ్ మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత జూలై 1976 లో ప్రారంభించిన ఆర్యభట్ట ప్రయోగించబడింది.

అతను ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి ఆధునిక విశ్లేషణాత్మక పరిశోధనలను వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశం యొక్క మొట్టమొదటి మార్కెట్ పరిశోధన సంస్థను స్థాపించాడు. ఈ సంస్థను ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ అని పిలిచేవారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు, అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ)

విక్రమ్ సారాభాయ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ) స్థాపనకు నాయకత్వం వహించారు.

డాన్స్ అకాడమీ

సారాభాయ్ 1942 లో ప్రపంచ ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ మృణాలిని సారాభాయ్‌ను వివాహం చేసుకున్నారు. క్లాసికల్ డాన్సర్ మరియు ఇన్నోవేటర్-శాస్త్రవేత్తలు కలిసి అహ్మదాబాద్‌లో దర్పన అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ను స్థాపించారు.

విక్రమ్ సారాభాయ్ స్థాపించిన అతి ముఖ్యమైన సంస్థలు
ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్ఎల్), అహ్మదాబాద్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్
కమ్యూనిటీ సైన్స్ సెంటర్, అహ్మదాబాద్
అహ్మదాబాద్లోని డర్పాన్ అకాడమీ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (అతని భార్యతో పాటు)
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, తిరువనంతపురం
స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, అహ్మదాబాద్ (సారాభాయ్ స్థాపించిన ఆరు సంస్థలను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది)
ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (ఎఫ్‌బిటిఆర్), కల్పక్కం
వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ ప్రాజెక్ట్, కలకత్తా
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్), హైదరాబాద్
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్), జడుగుడ, బీహార్
విక్రమ్ సారాభాయ్ మరణం

1971 డిసెంబర్ 30 న 52 సంవత్సరాల వయసులో సారాభాయ్ కన్నుమూశారు. రష్యన్ రాకెట్ ప్రయోగించి, అదే రోజు ముందు తుంబా రైల్వే స్టేషన్‌కు పునాదిరాయి వేయడంతో కేరళలోని ఒక హోటల్ గదిలో మరణించారు.

విక్రమ్ సారాభాయ్ యొక్క వారసత్వం

- 1973 లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అంతర్జాతీయ ఖగోళ యూనియన్ చేత అతని గౌరవార్థం చంద్రునిపై ఒక బిలం పేరు పెట్టబడింది.

- జూలై 22, 2019 న, ఇస్రో భారతదేశం నుండి మొట్టమొదటి లాండర్-రోవర్ మాడ్యూల్‌ను విడుదల చేసి, చంద్రునిపై ప్రయాణించి, అధ్యయనం చేసి అధ్యయనం చేసింది. రోవర్ మోస్తున్న ల్యాండర్‌కు విక్రమ్ అని పేరు పెట్టారు. విక్రమ్ ల్యాండర్ 2019 సెప్టెంబర్ 7 న చంద్రుని ఉపరితలంపై తాకనుంది.

- తిరువనంతపురం (త్రివేండ్రం) లో ఉన్న లాంచ్ వెహికల్ డెవలప్‌మెంట్ కోసం ఇస్రో ప్రధాన సదుపాయంగా ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి) అతని జ్ఞాపకార్థం పేరు పెట్టబడింది.

- భారత పోస్టల్ విభాగం అతని మొదటి మరణ వార్షికోత్సవం (30 డిసెంబర్ 1972) సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది

- ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న భారతదేశంలో అంతరిక్ష శాస్త్ర దినోత్సవం జరుపుకుంటారు

- అతను శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి గ్రహీత