8, నవంబర్ 2023, బుధవారం

 మహాభారత ప్రశస్తి 


సీ. ధర్మస్వభావమ్ము దర్శించువారలు 

               సమ్మతింతురు  ధర్మశాస్త్ర మనుచు 

     పరమాత్మ జీవాత్మ లెరిగిన వారలు 

              దర్శింతు రిద్ది వేదాంత మనుచు

     నీతివిషయమందు నేర్పున్నవారలు 

               సన్నుతింతురు  నీతిశాస్త్ర మనుచు

     కవనమున్ జెప్పెడి కవిముఖ్యు లందఱు 

              గణియింతు రిది మహాకావ్యమనుచు 

     లక్ష్యంబు లెఱిగిన లాక్షణికవరులు

              నేర్తృ సకలలక్ష్యనిధి యటంచు 

     నైతిహాసిక బుద్ధులమరిన పండితు

              లరయుదు రిది యితిహాస మనుచు 

     సకల పురాణముల్ చదివెడి వారలు

               రహి చూతురు బహుపురాణ మనుచు 

ఆ. ఇట్లు సర్వ జనుల యిష్టంబు కొఱకును 

     విష్ణుసన్నిభుండు విమలమౌని 

     వివిధ తత్త్వ విషయ వేద్యుండు వ్యాసుండు 

     భారతమును జేసె భాసురముగ


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

మహాలింగార్చన

 శ్రీరస్తు  శుభమస్తు అవిఘ్నమస్తు 


 శివాయవిష్ణురూపాయ శివరూపాయవిష్ణవే! శివస్యహృదయం విష్ణుర్విష్ణోశ్చహృదయగ్ంశివః!


*సమస్త ఆస్తికజనులారా*  ! 

శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తికమాసమున కార్తికదామోదర ప్రీతిగా సకల దేవతా స్వరూపముగా 365  మృణ్మయ లింగములను ఈశ్వర స్వరూపముగా అమర్చి అభిషేక. అర్చనాదులు జరుపుటకు కార్తిక దామోదరుని అనుగ్రహముతో  బ్రహ్మశ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజిగారి పర్యవేక్షణలో మాసదీక్షా పూర్వక మహాలింగార్చన చేయుటకు పరమేశ్వరుని యొక్క ప్రేరణ జరిగినది 


           కార్యక్రమ వివరాలు

తేదీ : 14.11.2023 మంగళవారం నుండి  12:12:2023 మంగళవారం వరకు

ప్రతీరోజూ ప్రదోష (సాయం) సమయమున గణపతి పూజ మహాలింగార్చన ఆవరణ పూజ పంచామృతసహిత సుగంధద్రవ్య పాశుపత ఏకాదశ రుద్రాభిషేకము జరుగును 

   *విశేష కార్యక్రమ వివరాలు*

*సోమవారములు* 4

*ఏకాదశిలు* 2

*కార్తిక పౌర్ణమి*

*ఆరుద్రా నక్షత్రము*

*మాసశివత్రి*

*ఈ యొక్క పర్వదినములలో సహస్ర లింగార్చన జరుగును*

పై జరుగు కార్యక్రములలో

 ఆసక్తి గల భక్తులు అందరూ ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ పాల్గొనవచ్చును

భక్తులు వారి వారి అభీష్టములు తీర్చుకొనుటకు  అనగా 1.కార్యసిద్ధి కొరకు--ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తి అగుటకు -- గణపతి హోమము

2.సర్వ శత్రుపీడా,నరఘోషా,సర్వ కార్య విజయము కొరకు-- సుదర్శన నారసింహ హోమము, మన్యుసూక్త హోమము

3.ఆరోగ్యము కొరకు సమస్త రోగపీడా పరిహారమునకు, సూర్యనమస్కారములు

4.ఐశ్వర్య ప్రాప్తి,సమస్త మనోభీష్టమైన కోర్కెలు తీరుటకు సమస్త గ్రహ బాధా నివృత్తికై చండీ సప్తశతీ హోమము

5.సకల పీడా పరిహారమునకు,అపమృత్యు దోష పరిహారము,వివాహ ప్రాప్తి, సంతానప్రాప్తి ఇత్యాదులకు పాశుపత రుద్రాభిషేకము జరపబడును కావున భక్తులు గమనించి వారి వారి అభీష్టములు సిద్ధించుటకు కార్యక్రమము జరిపించుకొనుటకు 

ఈ మహత్కార్యములో పాల్గోదలచిన‌‌ భక్తులు రూ 5556/ రుసుమును చెల్లించవలెను 

వివరముల‌ కొరకు మీరు తంగిరాల భార్గవ శర్మ గారిని సంప్రదించగలరు 9502925449


         *కార్యస్థలము*

*రాజమహేంద్రవరం. కొంతమూరు బ్రాహ్మణ అగ్రహారం అభీషగణపతి ఆలయమ్*

తాపత్రయం

 *తాపత్రయం..*


"నా కూతురి బిడ్డ..మనుమరాలు.. ఈ పిల్ల, దీని భర్త బెంగుళూరు లో వుంటారు..పెళ్లై ఆరేళ్ళు అయింది..ఇంకా సంతానం కలగలేదు..డాక్టర్లకు చూపించుకుంటున్నారట..మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు నాతో చెప్పింది..స్వామి దగ్గరకు తీసుకొని వచ్చాను..కానీ ఏం లాభమయ్యా..తనకు ఇటువంటి మొక్కుల మీద నమ్మకం లేదట..స్వామి సమాధి వద్దకు రమ్మని చెపుతుంటే వినటం లేదయ్యా..మీ దంపతులు నచ్చచెప్పి..దీనికి స్వామివారి సమాధి వద్దకు పంపించండి.." అని సుబ్బమ్మగారు మాతో చెప్పుకొని బాధపడుతున్నారు..ఆవిడ ప్రక్కనే ఆమె మనుమరాలు నిలబడి ఉన్నది..


"ఏమ్మా.. నీ పేరేంది?" అని మా ఆవిడ అడిగింది.."లావణ్య.." అని చెప్పింది.."మీ అమ్మమ్మ అంతగా బ్రతిమలాడుతోంది కదా..ఒకసారి స్వామివారి సమాధి ని దర్శించుకొని రాకూడదా?..నీ గురించే కదా ఆవిడ తాపత్రయం.." అని అడిగింది.." పిల్లలు పుట్టలేదని  నేనూ మావారు బాధపడుతున్నాము ఆంటీ..డాక్టర్లకూ చూపించుకుంటున్నాము..నాకెందుకో ఇటువంటి విషయాల మీద పెద్దగా నమ్మకం లేదు..ఏమీ అనుకోకండి.." అన్నది.."సరేనమ్మా నే ఇష్టం.." అని చెప్పేసాము..సుబ్బమ్మగారు నిట్టూర్చారు..మేమూ చేసేదేమీ లేక ఊరుకున్నాము..అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది.."సరేనయ్యా..దేనికైనా ప్రాప్తం ఉండాలి..ఎంతమందికో స్వామివారి దయవల్ల సంతానం కలిగారు..మీరూ చూస్తున్నారు..నేనూ చూసాను..నేనే మొక్కుకుంటాను..సత్రం దగ్గరకు వెళ్లి..భోజనం చేసి..నాలుగు గంటల బస్సుకు తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు సుబ్బమ్మగారు.."అలాగేనమ్మా.." అని చెప్పాము..


సుబ్బమ్మగారు, ఆమె మనుమరాలు ఇద్దరూ భోజనం చేసి..మళ్లీ మంటపం లోకి వచ్చారు..వాళ్ళు కందుకూరు వెళ్ళాలి..మరలా నాలుగు గంటలకే బస్సు ఉంది..అందుకని సుబ్బమ్మగారు మంటపం లో ఒక ప్రక్కగా పడుకున్నారు..ఆవిడ ప్రక్కనే లావణ్య కూర్చుంది..పదిహేను నిమిషాల తరువాత లావణ్య కూడా తన అమ్మమ్మ ప్రక్కనే పడుకొని నిద్రపోయింది..వాళ్ళిద్దరికీ మెలుకువ వచ్చేసరికి..నాలుగు గంటల బస్సు వచ్చి, వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది..మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు బస్సు ఉంది..లావణ్య ముభావంగా ఉంది..బస్సు తప్పిపోయినందుకు కోపంగా ఉందేమో అనుకున్నాము..ఐదు నిమిషాల తరువాత..సుబ్బమ్మగారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది.."ఏమైందమ్మా..అలా ఉన్నావు?" అని సుబ్బమ్మగారు అడిగారు.."అమ్మామ్మా..నాకు బాగా నిద్ర పట్టింది..నిద్రలో ఎవరో బాగా పొడుగ్గా ఉన్న సన్యాసి కనబడ్డాడు..ఒడి పట్టమన్నాడు..చీరచెంగు పట్టుకున్నాను..అందులో ఒక అరటిపండు వేసాడు..పో..పోయి..స్వామిని వేడుకో.. నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు..అంతా నిజం లాగే ఉంది..నాకు అయోమయంగా ఉంది..ఒక్కసారి స్వామివారి సమాధి దగ్గరకు వెళదాము.." అన్నది..


సుబ్బమ్మగారు పట్టరాని సంతోషంతో.."పద తల్లీ ..ఇప్పుడే దర్శించుకుందాము.." అని చెప్పి..మనుమరాలిని వెంటబెట్టుకొని మా దగ్గరకు వచ్చి..విషయం అంతా చెప్పి.."అయ్యా..నువ్వు ఒప్పుకుంటే..దీనిని ఒక్కసారి స్వామివారి సమాధి వద్దకు తీసుకెళ్తాను.." అని ప్రాధేయపూర్వకంగా అడిగారు.."లక్షణంగా తీసుకెళ్లు.." అని చెప్పాను..ఇద్దరూ లోపలికి వెళ్ళి వచ్చారు..లావణ్య లో ఇంటకుమునుపు ఉన్న నిర్లక్ష్యం లేదు..ఆ సాయంత్రం కందుకూరు వెళ్లాల్సిన ఆ ఇద్దరూ..ఏమి ఆలోచించుకున్నారో.. ఆరాత్రికి  స్వామివారి మందిరం లోనే వున్నారు..అక్కడే నిద్ర చేశారు..తెల్లవారి మొదటి బస్సులో కందుకూరు వెళ్లిపోయారు..


మరో నెల తరువాత..లావణ్య తన భర్తతో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది.."ఆరోజు అమ్మమ్మ తో వచ్చి వెళ్లిన తరువాత..స్వామివారి పై నమ్మకం ఏర్పడింది ఆంటీ..అందుకే ఈరోజు మావారిని తీసుకొచ్చాను..ఇక్కడ ఇద్దరమూ మూడు రోజులు ఉంటాము.." అన్నది.."సరేనమ్మా.." అని చెప్పాము..స్వామివారి సమాధి వద్దకే పోను అని మొండి కేసిన ఆ అమ్మాయి తన భర్తతో కలిసి మూడు రోజులు స్వామివారి మందిరం లో ప్రతిరోజూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొన్నది..అలా వరుసగా మూడు నెలల పాటు..ప్రతినెలా మూడురోజులు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చి నిష్ఠతో ప్రదక్షిణాలు చేసి వెళ్లారు..ఆ తరువాత ఆ దంపతులు రావడం ఆగిపోయింది..ఈలోపల సుబ్బమ్మగారు కాలం చేశారు..


మరో పదిహేను నెలల తరువాత..లావణ్య తనభర్తతో కలిసి బిడ్డను ఎత్తుకొని స్వామివారి మందిరానికి వచ్చింది.. "స్వామివారి ప్రసాదం అంకుల్.." అని బిడ్డను చూపిస్తూ లావణ్య భర్త చెప్పాడు..దంపతులిద్దరూ తమ బిడ్డతో సహా స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు.."అమ్మమ్మ మా గురించి చాలా తాపత్రయపడ్డారు..తీరా మాకు సంతానం కలిగాక..చూడటానికి ఆవిడ లేరు.. ఎవరికి ఏది ఎలా నిర్ణయించాలో స్వామివారికే తెలుసు.." అని కన్నీళ్ళతో లావణ్య చెప్పింది..


లావణ్య మనసులో ముందుగా తన మీద భక్తిని స్థిరపరచి..ఆపై సంతానయోగం కలుగచేశారు స్వామివారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

భగవంతుడిని చూడాలంటే..!* ➖➖➖✍️

 2001.  2-4.3️⃣1203C. 3-5.

061123-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



      *భగవంతుడిని చూడాలంటే..!*

                   ➖➖➖✍️



*ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది.*


*అతను ఎన్నోతీర్థయాత్రలు చేశాడు.*


*ఎన్నో పురాణాలు, గ్రంధాలు చదివాడు.*


*కానీ అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు. అతని కోరిక తీరలేదు.*


*భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.*


*ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూసాడు. అస్తమానూ ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తున్నది. ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది. ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ, వాటిపైన బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనించాడు. ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు.*


*మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు.” ఓ సూర్యుడా ! నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. దేవుడు ఎక్కడ దాక్కున్నాడు ? అన్నిచోట్లా ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు” అన్నాడు.*


*ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనబడకుండా చేసింది. కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది. సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు.*


*ఆ మనిషి నిట్టూరుస్తూ ”ఎప్పటికైనా నేను దేవుడిని చూడగలనా ?” అని అడిగాడు.*


*నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు.*


*కొంతమంది గ్రామస్థులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు. "ఈ మురికి నాచును చెరువులో ఎవరు వేశారు ?” అని ఆ వ్యక్తి గ్రామస్థులను అడిగాడు. “ఎవరూ వెయ్యలేదు. నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది. ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది.*


*ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా, శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు.*


*ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు.*


*నాచు నీటిలో నుండే వచ్చింది కాని అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తేగాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు.*


*అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి. గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు.*


*అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది. కాని ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తున్నది. బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది.*


*పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు, నిప్పు, సూర్యుడు ఇంతకు ముందే ఉన్నాయి. కొత్తగా ఏర్పడలేదు, కాని అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.*


*స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది..!*


*ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాడో మరచిపోతున్నాడు.*


*ప్రపంచం అనే దుప్పటిని పక్కకి తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాం..!*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఆలోచనాలోచనాలు

 ***** ఆలోచనాలోచనాలు ***** అవధాన మధురిమలు ***** శతావధానులు పల్నాటి సోదర కవులు 1*శ్రీ కన్నెగంటి ప్రభులింగాచార్యులు 2* శ్రీ కన్నెగంటి చినలింగాచార్యులు 3* శ్రీ కన్నెగంటి వీరభద్రాచార్యులు (పల్నాటి కవిత్రయము) *****                                   సమస్యాపూరణములు ;---- 1* "" పది రెంటిన్ గొని వంశధర్మమును నిల్పన్ జాలె మిత్రాగ్రణీ!""                 మ. ముదిఱేనిన్ గని నీ వరంబుల్ పెక్కు గైకొన్నచో / నది యోగ్యంబని మెత్తురే బుధులు మామా! నన్ను నా భర్తలన్ / వదలంగల్గితి వంతెచాలు నిదె నా వాంఛాద్వయంబంచు ద్రౌ / పది రెంటిన్ గొని వంశధర్మమును నిల్పన్ జాలె మిత్రాగ్రణీ!"                  2* "" ప్రాగ్ధిగ్రావము నందె క్రుంకె రవి శ్రీ లక్ష్మీ నృసింహప్రభూ!""                   శా. దగ్దృశ్య ప్రకృతిప్రపంచ మదరన్ దేవాధిపుల్ భీతిలన్/ దిగ్దంతిప్రతతుల్ చలింప , సుమతీదేవి ప్రభావంబు స / మ్యగ్దీక్షన్ బడనెట్టివేయ నబలుండై దాగి జీవింప నా / ప్రాగ్ధిగ్రావము నందె క్రుంకె రవి శ్రీ లక్ష్మీ నృసింహప్రభూ!      3* "" పిడికిలి క్రింద నాకుఁ గనిపించె సుధాకర సూర్యబింబముల్.""               "వడివడి భర్తతో నడచి వచ్చుచు భవ్యకళాలవాలయై / యొడిగల విత్తనాల సమయోచితపద్ధతి జడ్డిగంబులో / విడచుచు మేలుగూర్చు నరవిందదళేక్షణఁ జూడుమన్న యా / పిడికిలిక్రింద నాకుఁ గనిపించె సుధాకర సూర్యబింబముల్.              4* ""రాటము నందు పెద్దనిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్.""                      ఉ. ఏటికి రావణా? రఘు కులీనుడు, ధీరుడు, సీతసాధ్వి;నీ / ధాటి యడంగు; నీ తరుణి దక్కదు దక్కదునా, విభీషణా! / బోటిని నూరు మార్గముల బొందుదు ; పొందన, రాముచేతిపో / రాటమునందు పెద్ద నిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్.                       5* ""పెంకొక్కటి మింటికెగసి పెల్లుగ దిరిగెన్.""                              కం. జింకలపాలెము నందున / ఢంకా వాయించి మంత్రఢాకా యనగా / టెంకాయ విసిరి కొట్టగ / పెంకొక్కటి మింటికెగసి పెల్లుగ దిరిగెన్.                      6* "" గిలిలోపల హాయి తల్లక్రిందుల్ సేయున్.""         కం. నెలఁబోలు మోము లే వె / న్నెల మించిన నగవు హాళినిన్ గొల్పెడి చూ / పులు గల ప్రేయసి నును కౌ / గిలి లోపల హాయి తల్లక్రిందుల్ సేయున్.            7* ""స్త్రీల యుపస్థలందు మెఱసెన్ రతనంబులు చిత్రమందగన్.""                   ఉ. చాలుగ వ్రేతలెల్లరును స్నానము లాడెడివేళ బాలగో/ పాలుడు రాగ సిగ్గుపడి భామలు రత్నమయాంగుళీయముల్ / గ్రాలెడి హస్తపద్మము లెకాయెకి చాటున పెట్టుకోగ ఆ / స్త్రీల యుపస్థలందు మెఱసెన్ రతనంబులు చిత్రమందగన్.                      దత్తపదులు;--- "" ఎల్లి-- పిల్లి -- నల్లి -- మల్లి "" అను పదములతో "" తారాశశాంక ప్రణయం"" ఇతివృత్తంగా పద్యం.            ఉ. ఎల్లి మగండు వచ్చు నిదియే సమయంబిక దాళజాల గం / పిల్లి తొలంగిపోవలదు, ప్రేమ మనస్సుమజాల మాల నే / నల్లి భవద్గళంబున మహాముద మొప్పగ వేయుదాన మా/ మల్లియ తోటకుం గదలుమా! యని తార వచించెఁ జంద్రుతోన్.       2* "" ధర్మరాజు -- భీమార్జున -- నకుల -- సహదేవ "" పదములతో "" రామాయణార్థములో"" పద్యం.                                  తే.గీ. ధర్మరాజముఁ ద్రుంచి సీతను గ్రహించి / భీమబలమున భృగురాము పీచమణఁచి / అర్జున యశః ప్రభల విశ్వమందు నిల్పు / ఇనకులుని సహదేవుని నెన్నవశమె?                          (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యాసర్వస్వం సౌజన్యంతో)    తేది 8--11--2023, బుధవారం, శుభోదయం.

*రమా ఏకాదశి

 *రమా ఏకాదశి*


*ఏకాదశీ వ్రత మహిమ*



రమా ఏకాదశి మహిమను శ్రీకృష్ణధర్మరాజనంవాదరూపంలో బ్రహ్మవైవర్తపురాణంలో వర్ణించబడింది. "ఓ జనార్ధనా! కార్తీకమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని నాకు వివరించవలసినది" అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ "ఓ రాజసింహమా! ఆ ఏకాదశి పేరు


రమా ఏకాదశి, అది సమస్తపాపాలను హరిస్తుంది. అపుడు ఆ పవిత్ర


ఏకాదశి మహిమను విను" అని పలుకసాగాడు.


చాలాకాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాతరాజు ఉండేవాడు - అతడు స్వర్గరాజు, ఇంద్రునికి నుంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడ అతనికి స్నేహం. ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చద్యగా పాలించేవాడు.


కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమ నదియైన చంద్రభాగా పేరును ఆ అమ్మాయిక్ పెట్టారు. యుక్తవయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో వివాహం జరిగింది. ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను "ఓ దేవా! ఇప్పుడేమి. చేయాలి? నా భర్త దుర్బలుడు, ఆకలిని తట్టుకోలేదు. నా తండ్రి మరీ కఠినుడు, ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ. ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడ వేయిస్తారు" అని అనుకోసాగింది..


ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో "ఓ ప్రియపత్నీ! ఇప్పుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానికి, అలాగే రాజాజ ఉల్లంఘించకుండ ఉండడానికి ఏం చేయాలో చెప్పు" అని అన్నాడు.


అపుడు చంద్రభాగ తన భర్తతో "స్వామీ! మనుషుల మాట అటుంచండి. నా తండ్రిరాజ్యంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఇతర జంతువులకు కూడా ఈ రోజు ఆహారం ఉండదు. కనుక ప్రభూ! ఇక మనుషులెట్టా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండ తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసికోండి".


భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో "నీవు చెప్పింది అక్షరాల సత్యమే. కాని నారు ఈ ఏకాదశీ వ్రతపాలన చేయాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగే తీరుతుంది కదా!" అని అన్నాడు.


ఈ విధంగా ఆలోచించిన శోధనుడు పవిత్ర ఏకాదశివ్రతపాలనకు సిద్ధమయ్యాడు. కాని అతడు ఆకలిదప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా! ఆ రాత్రి వారంతా సంకీర్తన, అర్చనలతో గడిపివేశారు. కాని ఆ రేయి గడపడం శోధనునికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహనసంస్కారాలు చేశాడు. ముచుకుందుని ఆజ్ఞమేరకు చంద్రభాగ సతీసహగమనం మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తరువాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. "రాజా! అంతలో రమా ఏకాదశి.. వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. అది మందర పర్వతం పైన ఉన్నది. రత్నఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణిఖచితమగు గోడలు కలిగినదియైన ఐశ్వర్యయుత భవనంలో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లనిఛత్రం పట్టుబడియుండేది. కర్ణకుండలములతో, కంఠాభరణములతో, బంగారుభుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనమున కూర్చునేవారు. గంధర్వులచే, అప్సరసలదే సేవింపబడుచు అతడు స్వర్ణరాజు ఇంద్రుని వలె గోచరించెడివారు",


ఒకరోజు ముచుకుందపుర నివాసియైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు. శోధనుని రాజ్యానికి తీర్ధయాత్రలు చేస్తూ వచ్చాడు. శోధనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి, చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత అతడు బ్రాహ్మణుని కుశల మడిగాడు. తరువాత ముచుకుందుడు, తన భార్య చంద్రభాగ, ముచుకుందపుర జనుల గురించిన క్షేమసమాచారాలు కూడ అడిగాడు. అపుడు బ్రాహ్మణుడు అందరి క్షేమసమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతియొక్కరు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో "రాజా! ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడును చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది" ? అని అడిగాడు.


"కార్తికమాసం కృష్ణపక్షంలో వచ్చే రమ ఏకాదశిని పాటించిన ప్రభావం వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పవలసినది. నేను ఏకాదశీ వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థిరమొనర్చగలిగే సామర్ధ్యం కలిగినట్టిది" అని శోభనుడు అన్నాడు.


శోభనుని మాటలను వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించారు. ఆది వినిన చంద్రభాగ అమితానందభరితురాలు అయింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని -ఆమె పలికింది. అప్పుడు సోమకర్మ ఆమెతో "అమ్మా! నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను. ఆ పురం సూర్యప్రభలతో వెలిగిపోత

నవగ్రహా పురాణం🪐* . *71వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *71వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*కుజగ్రహ చరిత్ర - 1*


*"అమ్మా....నన్ను 'కుజుడు' అంటారు కదా ? ఆ మాటకు అర్థమేమిటమ్మా ?"* కుజుడు ఒకసారి ఉన్నట్టుండి భూమాతను అడిగాడు.


భూదేవి యుక్తవయస్కుడైన కుజుడిని చిరునవ్వుతో చూసింది. కుజుడు అందంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు ! మొక్కగా ఉన్నప్పట్నుంచీ , పాదు చేసి , నీళ్ళు పోసి , జాగ్రత్తగా పెంచిన వృక్షాన్ని చూస్తున్నట్టు తృప్తిగా చూసింది భూదేవి కుజుణ్ణి. కుజుడు సాధారణ వృక్షం కాదు. చేవ కలిగిన శైవ వృక్షం !


*"ఏమిటమ్మా , అర్ధం చెప్పకుండా అలా చూస్తున్నావు ?"* కుజుడు నవ్వుతూ అడిగాడు. భూదేవి చిరునవ్వు నవ్వింది. *"నిన్ను చూస్తూ ఉంటే  - ఇంకా , ఇంకా చూడాలనిపిస్తుంది. మంగళా !"*


*"అదిగో - మరొక పేరు !"* కుజుడు నవ్వుతూ అన్నాడు. *"మంగళుడు - ఈ ద్వితీయ నామధేయానికి నువ్వు అర్ధం చెప్పాలి !!*


*"అలాగే , అంగారకా !"* భూదేవి పకపక నవ్వింది. *"ఈ మూడో పేరుకు కూడా ముద్దైన అర్ధం ఉంది ! అది కూడా చెప్తాను !”*


కుజుడు భూదేవి దగ్గరగా కూర్చుని , తలను ఆమె వొడిలో పెట్టుకుని , విశ్రాంతిగా పడుకున్నాడు. చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూశాడు. *"ఎందుకో... ఎప్పుడూ నీ వొడిలో విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తూ ఉంటుందమ్మా !"*


భూదేవి కుజుడి తల నిమురుతూ , చిరునవ్వు నవ్వింది. *“అది నా అదృష్టం. నాయనా ! అలసిపోయే కోట్లాది ప్రాణులు ఎప్పుడూ , నా వొడిలో ఆదమరిచి పడుకుంటాయి ! తల్లిలాగా అందర్నీ , అన్నింటినీ వొడిలోకి చేరదీసి , విశ్రాంతి ఇచ్చే ఆనందం నాది !"*


*"మొదటి పేరు: కుజుడు !"* కుజుడు చిరునవ్వు నవ్వుతూ గుర్తుచేశాడు.


*"సరే... విను ! భూమి , అచల , అనంత , విశ్వంభర , స్థిర , ధర , ధరణి , ధరిత్రి , ధాత్రి , క్షోణి , క్షితి , వసుమతి , వసుంధర , వసుధ , ఉర్వి , విపుల , పృధ్వి , క్ష్మా , అవని , మహి , మేదిని , ఇల , జగతి , రత్నగర్భ , సర్వంసహ - ఇవన్నీ నా నామధేయాలు. వీటితో బాటు 'కు' అనే ఏకాక్షర నామధేయం కూడా వుంది. "కు" నుండి జన్మించినందుకు - నిన్ను పరమేశ్వరుడు "కు - జుడు" అన్నారు !*


*"ఓహో...' కుజుడు' అంటే 'భూమిజుడు' అనీ , భూపుత్రుడు అనీ అర్థమన్నమాట ! అయితే అమ్మా , నీకు ఎన్ని పేర్లున్నాయో అన్ని పేర్లూ నేను కూడా పెట్టుకోవచ్చు కుజుడు నవ్వుతూ అన్నాడు. *"ఇప్పుడు రెండో పేరు... మంగళుడు..." కదూ !"*


*"నువ్వు మంగళవారం నాడు జన్మించావు. ఆ కారణంతో అందరూ 'మంగళుడు' అన్నారు !!* భూదేవి చిరునవ్వుతో అంది. *"నీ మూడవ పేరు 'అంగారకుడు... ఆ పేరు రావడానికి కారణం నీ శరీర వర్ణం ! 'అంగారకం' అంటే నిప్పు ! అగ్ని వర్ణంలో ఉన్నావు. కాబట్టి నిన్ను 'అంగారకుడు' అన్నాం !"*


*“ఓహో ! అర్థంలేని నామధేయాలు నీ కుమారుడికి లేవన్న మాట !"* కుజుడు నవ్వాడు.


భూదేవి కుజుడి తలను ప్రేమగా నిమిరింది. ఆమె విశాల విలోచనాలు వొడిలో ఉన్న కుజుడి ముఖం మీద ప్రేమామృతాన్ని కురిపిస్తున్నాయి. *"అవును... నీవి అన్నీ సార్ధక నామధేయాలే ! ఒక ప్రశ్న అడుగుతాను , నిజం చెప్పు ! నీ పేర్లకున్న అర్థాలు నిజంగా నీకు తెలియవా ?"*


కుజుడు ఆమె కళ్ళలోకి నిదానించి చూసి , పక్కున నవ్వాడు. *“ఎందుకు తెలీదమ్మా ! తెలుసు...".*


*"అయితే ఎందుకడిగావు ?”* భూదేవి ప్రశ్నించింది.


*"ఎందుకంటే... నువ్వు వివరిస్తూ ఉంటే... నేను వింటూ ఉంటే... హాయిగా , ఆనందంగా ఉంటుంది ! అమ్మ మాట... అతి మధురం ! తెలుసా ?"* కుజుడు నవ్వాడు. భూదేవి శృతి కలిపింది.


*"అమ్మ మాట అతి మధురం..."* కుజుడన్న మాట ఆమెలో ఆలోచనలు రేపుతోంది. *"కుజా ! నీకో విషయం చెప్పాలి...”.*


*“ఓ ! చెప్పమ్మా ! చెప్పానుగా ! కన్నతల్లి మాట కర్ణామృతమే !"* కుజుడు భూదేవి కంఠం చుట్టూ చేతుల్ని వేస్తూ అన్నాడు.


*"నేను... నీ కన్నతల్లిని కాను , నాయనా ! 'చేకొన్న' తల్లిని !"* భూదేవి కుజుడి కనుబొమల్ని సున్నితంగా వేళ్ళతో సవరిస్తూ అంది.


*"అమ్మా..."* అంటూ కుజుడు ఆమె వొడిలోంచి లేవబోయాడు.


భూదేవి అతన్ని అదిమి , వొడిలోనే పడుకోబెట్టింది.


*"నువ్వు పరమశివుడి నుదుటి మీద నుంచి జారి పడిన స్వేదబిందువు నుండి ఆవిర్భవించావు ! ఆయన తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మహత్తర సమయంలో ఆ సంఘటన జరిగింది. స్వేదబిందువు నాలో ఉన్న ఆకర్షణ శక్తి వల్ల సహజంగా - ఇదిగో , ఇప్పుడు నువ్వు నా వొడిలో పడుకున్నావు చూడూ - అలా నా వొడిలో పడింది. తక్షణం ఆ స్వేద కణం అంతర్థానమై , ఆ స్థానంలో అగ్నివర్ణంలో అందమైన శిశువుగా నువ్వు ఆవిర్భవించావు. 'అమ్మా ! అవనీ , నీ వొడిలో పడిన బాలుడు , నీ బాలుడే ! నువ్వే పెంచి , పెద్దవాణ్ణి చేయి !' అన్నాడు పరమేశ్వరుడు. "*


*"పరమేశ్వరుడు అలా ఎందుకన్నారమ్మా ?"* కుజుడు ప్రశ్నించాడు.


*"ఆ సందర్భంలో ఆయనది భార్యలేని , భారమైన ఏకాంత జీవితం ! ఆయన సతి , సతీదేవి దక్షయజ్ఞంలో దగ్ధమైపోయింది. బిడ్డలు తల్లి పెంపకంలోనే లక్షణంగా , సవ్యంగా ఎదగగలరని శివుడికి తెలుసు..."* భూదేవి వివరించింది. *“నీకు మరొక విషయం తెలుసా ? నేను విష్ణుపత్నిని. పరమశివుడు నాకు సోదరుడు. సోదరుడి సంతానానికి తల్లి లేనప్పుడు - సోదరి పాలిచ్చిపెంచడం అపరాధం కాదు , నిషిద్ధం కాదు. నీకు నా చనుబాలు త్రాగిస్తూ , నేను ఎంత పులకించిపోయేదాన్నో !"* భూదేవి కనుగొనల నుండి ఆనందబాష్పాలు కుజుడి ముఖం మీద పడ్డాయి.


*"అమ్మా !"* కుజుడి కంఠంలో మమకారం బరువుగా పలికింది. *"పరమశివుడితో నీ సంబంధ బాంధవ్యం ఏదైనా సరే , నీతో నా బాంధవ్యం ఏదైనా సరే - నేను నిన్ను ఎన్నటికీ 'అమ్మా' అనే పిలుస్తాను !"*


*'అందుకు అభ్యన్తరం ఏముంది నాయనా !"* భూదేవి ఆనందంగా అంది. *"నువ్వెప్పుడూ నా బిడ్డడివే ! నువ్వు ఇష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ భూదేవి ఆస్తిగా దక్కుతుంది ! అది అలా ఉంచితే - నీకు యధార్ధ మాత ఉంది. ఆమె... నీ పితృదేవులైన పరమేశ్వరుల పత్ని. సతి , పార్వతిగా అవతరించి , ఆయన పత్ని అయ్యింది. ఆమెకు 'దుర్గ' అనీ , 'చండిక' అని నామధేయాలున్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి. నువ్వు  ఇప్పటి దాకా నీ 'తల్లి'ని చూడలేదు...”*


*"అమ్మా... ఆ తల్లి... నా జనకుల పత్ని... నీలాగా అందంగా ఉంటుందా ?"* కుజుడు అమాయకంగా అడిగాడు.


*“ఆమె సౌందర్యఖని ! సౌందర్యలహరి ! త్రిలోక సుందరి ! ఆ శివాని త్రిజగన్మోహిని ! నువ్వు ఆ జనయిత్రిని దర్శించాలి ! ప్రార్థించాలి ! కీర్తించాలి ! ఆశీస్సులు అందుకోవాలి ! వరాలు మూట కట్టుకోవాలి..."* భూదేవి చెప్పుకు పోతోంది.


*"అమ్మా....నువ్వుంటే అన్నీ ఉన్నట్టే...”*


*"అలా అనకు తండ్రీ ! నీకు శివపత్ని అయిన ఆ ఆదిపరాశక్తి కరుణ అవశ్యం. త్రిజగన్మాత అయిన ఆమె నీకు మాత కావడం నీ అదృష్టం. నీ విద్యాభ్యాసం పూర్తయింది. యువకుడివయ్యావు ! నువ్వు వివాహం చేసుకోవాలి. ఆ శుభకార్యానికి శుభసూచకంగా అద్రిసుతను ఆరాధించి , అనుగ్రహం సంపాదించు !”* భూదేవి ప్రోత్సహిస్తూ అంది.


*“సరే ! అయితే , రేపే కైలాసానికి వెళ్తాను !"* కుజుడు లేచి , కూర్చుంటూ అన్నాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 81*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 81*


నరేంద్రునికి ఇంకా సమాధి స్థితిలోనే లయించి ఉండిపోవాలనే తపన తగ్గలేదు. కనుక అతడు, "ఆహా! నేను ఆ స్థితిలో ఎంతో ఆనందం పొందాను. నన్ను ఆ స్థితిలోనే ఉండనివ్వండి" అని శ్రీరామకృష్ణులను అడిగాడు. శ్రీరామకృష్ణులు మళ్లీ అతణ్ణి చీవాట్లు పెట్టారు: "ఏమిటిది! జగజ్జనని అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతస్సిద్ధంగానే లభిస్తుంది. సకల ప్రాణికోటిలోను ఒకే భగవంతుడు నెలకొని ఉండడం మామూలు స్థితిలోనే నీకు అనుభూతమవుతుంది. 


లోకంలో నువ్వు మహోన్నత కార్యాలు ఎన్నో సాధిస్తావు. అసంఖ్యాకులలో నువ్వు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తావు. పేదసాదల కష్టాలను బాపుతావు" అన్నారు.నరేంద్రుడు వెళ్లిపోయిన తరువాత, తక్కిన శిష్యులతో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు:


 "స్వీయ సంకల్ప మాత్రాననే నరేన్ లోకం నుండి నిష్క్రమిస్తాడు. తాను ఎవరో గ్రహించిన మరుక్షణమే అతడు శరీరం త్యజిస్తాడు. తన మేధాశక్తితోను, ఆధ్యాత్మిక శక్తులతోను అతడు లోకపు పునాదులనే కదలించివేసే సమయం ఆసన్నమవుతుంది. అతడు పరమ సత్యాన్ని అనుభూతి పొందకుండా ఉండాలని నేను జగజ్జననిని ప్రార్ధించాను. 

 

ఎందుకంటే అతడు దానిని పొందితే, ఆ తరువాత లోకంలో జీవించడు. అతడు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. పరముసత్యాన్ని అతడు పొందడానికి అడ్డుగా ఒక తెర మాత్రమే ఉంది. ఆ తెర ఎంతో పలుచనిది, ఏ క్షణంలోనైనా తొలగిపోవచ్చు. '🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్లోకం - 71*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 71*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*నఖానా ముద్ద్యోతై ర్నవనళినరాగం విహసతాం*

*కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |*

*కయాచిద్వా సామ్యం భవతు కలయా హస్త కమలం*

*యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచణమ్ ||*

ఈ శ్లోకంలో అమ్మవారి అరచేతులను ధ్యానిస్తున్నారు శంకరులు. *కరాంగళి నఖోత్పన్న నారయణ దశాకృతిః*  అని శ్రీ లలితా సహస్ర నామాలలో స్తుతించారు. అంటే అమ్మవారు తన నఖములు (గోళ్ళు) స్పృశించగానే వాటినుంచి అసుర సంహారం కోసం ,ధర్మ పరిరక్షణ కొరకు , శ్రీమన్నారాయణమూర్తి దశావతారాలు ఉద్భవించాయిట.అంతటి మహిమ కల అరచేతులు గోళ్ళు అమ్మవారివి.ఇక్కడ శంకరులు అంటున్నారు..


అమ్మా ఉమా

నఖానా ముద్ద్యోతై ర్నవనళినరాగం విహసతాం = నీ నఖములు ఇప్పుడే వికసించిన పద్మముల కాంతిని పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయమ్మా.వాటి వర్ణము కన్నానీ నఖముల వర్ణము మరింత ఎర్రనిది.


కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే = ఇక నీ అరచేతుల ప్రకాశ వైభవమును గురించి ఏమని ఎంతని  వర్ణించగలనమ్మా.అట్టి వర్ణన దుర్లభమని భావము.


కయాచిద్వా సామ్యం భవతు కలయా హస్త కమలం = అయితే నీ నఖముల కాంతిని ఒక సందర్భంలో పద్మముల కాంతితో కొంతమేరకు పోల్చటానికి వీలవుతుంది. ఏమిటది?


యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచణమ్ = ఒకవేళ ఆ పద్మములోనుండే శ్రీమహాలక్ష్మి పాదములకు అలంకరించనున్న పారాణి (లాక్షారసం) ఆమె క్రీడగా తన పాదములను కదిలించినప్పుడు ఆ పద్మమునకు అంటిన పారాణితో కొంతమేరకు పోల్చవచ్చునేమో.

గౌరిదేవి ఎర్రనిది(గౌరవర్ణము కలది)ఆమె అరచేతులు మరింత ఎర్రనివి.గోళ్ళు మరింత ఎర్రనివి అని అంటున్నారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కాలభైరవుని

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం_*

*_దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్_*

*_అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం_*

*_కాశికాపురాధినాథకాలభైరవం భజే....._*


_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 07_* _


భావము:

బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడు,  సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమము, గరిమము, లఘిమము, మహిమము, ప్రాప్తి, ఈశిత్వము, వశిత్వము, ప్రాకామ్యము),  కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

రాశి ఫలితాలు* 08-11-2023

 *08-11-2023*

*సౌమ్య వాసరః* *బుధ వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

ధన వ్యవహారాలు కలసి వస్తాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

*వృషభం*

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.  ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన  వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.  ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

*మిధునం*

ఋణదాతల  ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు  మందకోడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున  అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

*కర్కాటకం*

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో  గృహమున సందడి వాతావరణం ఉంటుంది.  వృత్తి, వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి.

*సింహం*

నూతన వాహన యోగం ఉన్నది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో   సఖ్యతగా వ్యవహరిస్తారు.    సోదరులతో స్ధిరాస్తి  వివాదాలు  పరిష్కారమౌతాయి. వృత్తి   వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

*కన్య*

పాత ఋణాలు తీర్చడానికి  నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో  ఆకస్మిక మార్పులుంటాయి.  దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు.

*తుల*

ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట  విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని  వ్యవహారాలలో కుటుంబ సభ్యులు  సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

*వృశ్చికం*

ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో  కాని  పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు  మందగిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మికచింతన కలుగుతుంది. ఉద్యోగాలలో   శ్రమ తప్పదు.

*ధనస్సు*

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి.

*మకరం*

ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు.  గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతోవిందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు  పెట్టుబడులు అందుతాయి.

*కుంభం*

మీప్రవర్తన ఇతరులకు  ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

*మీనం*

ఇతరులకు మాటఇచ్చే   విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు  ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది.  దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

🕉️

బుధవారం, నవంబరు 8,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం, నవంబరు 8,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:దశమి ఉ7.28 వరకు

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:పుబ్బ రా7.20 వరకు

యోగం:ఐంద్రం సా5.08 వరకు

కరణం:విష్ఠి ఉ7.28 వరకు తదుపరి బవ రా8.30వరకు

వర్జ్యం:తె3.15 - 5.01

దుర్ముహూర్తము:ఉ11.21 - 12.07

అమృతకాలం:మ12.14 - 2.01

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి : తుల

చంద్రరాశి : సింహం 

సూర్యోదయం:6.05

సూర్యాస్తమయం: 5.24


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

ఆలోచనాలోచనాలు

 ***** ఆలోచనాలోచనాలు ***** అవధాన మధురిమలు ***** శతావధానులు పల్నాటి సోదర కవులు 1*శ్రీ కన్నెగంటి ప్రభులింగాచార్యులు 2* శ్రీ కన్నెగంటి చినలింగాచార్యులు 3* శ్రీ కన్నెగంటి వీరభద్రాచార్యులు (పల్నాటి కవిత్రయము) *****                                   సమస్యాపూరణములు ;---- 1* "" పది రెంటిన్ గొని వంశధర్మమును నిల్పన్ జాలె మిత్రాగ్రణీ!""                 మ. ముదిఱేనిన్ గని నీ వరంబుల్ పెక్కు గైకొన్నచో / నది యోగ్యంబని మెత్తురే బుధులు మామా! నన్ను నా భర్తలన్ / వదలంగల్గితి వంతెచాలు నిదె నా వాంఛాద్వయంబంచు ద్రౌ / పది రెంటిన్ గొని వంశధర్మమును నిల్పన్ జాలె మిత్రాగ్రణీ!"                  2* "" ప్రాగ్ధిగ్రావము నందె క్రుంకె రవి శ్రీ లక్ష్మీ నృసింహప్రభూ!""                   శా. దగ్దృశ్య ప్రకృతిప్రపంచ మదరన్ దేవాధిపుల్ భీతిలన్/ దిగ్దంతిప్రతతుల్ చలింప , సుమతీదేవి ప్రభావంబు స / మ్యగ్దీక్షన్ బడనెట్టివేయ నబలుండై దాగి జీవింప నా / ప్రాగ్ధిగ్రావము నందె క్రుంకె రవి శ్రీ లక్ష్మీ నృసింహప్రభూ!      3* "" పిడికిలి క్రింద నాకుఁ గనిపించె సుధాకర సూర్యబింబముల్.""               "వడివడి భర్తతో నడచి వచ్చుచు భవ్యకళాలవాలయై / యొడిగల విత్తనాల సమయోచితపద్ధతి జడ్డిగంబులో / విడచుచు మేలుగూర్చు నరవిందదళేక్షణఁ జూడుమన్న యా / పిడికిలిక్రింద నాకుఁ గనిపించె సుధాకర సూర్యబింబముల్.              4* ""రాటము నందు పెద్దనిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్.""                      ఉ. ఏటికి రావణా? రఘు కులీనుడు, ధీరుడు, సీతసాధ్వి;నీ / ధాటి యడంగు; నీ తరుణి దక్కదు దక్కదునా, విభీషణా! / బోటిని నూరు మార్గముల బొందుదు ; పొందన, రాముచేతిపో / రాటమునందు పెద్ద నిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్.                       5* ""పెంకొక్కటి మింటికెగసి పెల్లుగ దిరిగెన్.""                              కం. జింకలపాలెము నందున / ఢంకా వాయించి మంత్రఢాకా యనగా / టెంకాయ విసిరి కొట్టగ / పెంకొక్కటి మింటికెగసి పెల్లుగ దిరిగెన్.                      6* "" గిలిలోపల హాయి తల్లక్రిందుల్ సేయున్.""         కం. నెలఁబోలు మోము లే వె / న్నెల మించిన నగవు హాళినిన్ గొల్పెడి చూ / పులు గల ప్రేయసి నును కౌ / గిలి లోపల హాయి తల్లక్రిందుల్ సేయున్.            7* ""స్త్రీల యుపస్థలందు మెఱసెన్ రతనంబులు చిత్రమందగన్.""                   ఉ. చాలుగ వ్రేతలెల్లరును స్నానము లాడెడివేళ బాలగో/ పాలుడు రాగ సిగ్గుపడి భామలు రత్నమయాంగుళీయముల్ / గ్రాలెడి హస్తపద్మము లెకాయెకి చాటున పెట్టుకోగ ఆ / స్త్రీల యుపస్థలందు మెఱసెన్ రతనంబులు చిత్రమందగన్.                      దత్తపదులు;--- "" ఎల్లి-- పిల్లి -- నల్లి -- మల్లి "" అను పదములతో "" తారాశశాంక ప్రణయం"" ఇతివృత్తంగా పద్యం.            ఉ. ఎల్లి మగండు వచ్చు నిదియే సమయంబిక దాళజాల గం / పిల్లి తొలంగిపోవలదు, ప్రేమ మనస్సుమజాల మాల నే / నల్లి భవద్గళంబున మహాముద మొప్పగ వేయుదాన మా/ మల్లియ తోటకుం గదలుమా! యని తార వచించెఁ జంద్రుతోన్.       2* "" ధర్మరాజు -- భీమార్జున -- నకుల -- సహదేవ "" పదములతో "" రామాయణార్థములో"" పద్యం.                                  తే.గీ. ధర్మరాజముఁ ద్రుంచి సీతను గ్రహించి / భీమబలమున భృగురాము పీచమణఁచి / అర్జున యశః ప్రభల విశ్వమందు నిల్పు / ఇనకులుని సహదేవుని నెన్నవశమె?                          (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యాసర్వస్వం సౌజన్యంతో)    తేది 8--11--2023, బుధవారం, శుభోదయం.

 ఈ రోజు పంచాంగం 08.11.2023 Wednesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: దశమి తిధి సౌమ్య వాసర: పూర్వఫల్గుని నక్షత్రం ఇంద్ర యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


దశమి పగలు 10:22 వరకు.

పూర్వఫల్గుని రాత్రి 07:17 వరకు.

సూర్యోదయం : 06:21

సూర్యాస్తమయం : 05:38

వర్జ్యం : రాత్రి 03:16 నుండి 04:08 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:37 నుండి 12:22 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు 


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 08.11..2023

బుధ వారం (సౌమ్య వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే దశమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే దశమౌపరి ఏకాదశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.05

సూ.అ.5.24

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం దశమి ఉ. 7.27. 

బుధ వారం. 

నక్షత్రం పుబ్బ రా.7.23 వరకు. 

అమృతం  మ. 12.17 ల 2.03 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.22 ల 12.07 వరకు. 

వర్జ్యం రా.3.19 ల‌ 5.05 వరకు .

యోగం ఐంద్రం సా. 5.10 వరకు.

కరణం భద్ర ఉ.7.27 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ. 12.00 ల 1.30  వరకు. 

గుళిక కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ ఏకాదశి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

ముఖ్యమైనది

 

 USAలోని మెడికల్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి దీన్ని పంపారు.  దయచేసి చదవండి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ....... (డా. ఓకేరే.)


 యువత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రేటు చాలా ఆందోళనకరంగా ఉంది.  నేను మనకు సహాయపడే పోస్ట్‌ను తెలియ చేస్తున్నాను .


 దయచేసి క్రింది విషయాన్ని చదవండి:


 ముఖ్యమైనది - కిడ్నీ ఉత్తమమైన అవయవానికి అన్ని విధాల అర్హమైనది.


 కేవలం రెండు (2) రోజుల క్రితం, కిడ్నీ వ్యాధి కారణంగా నైజీరియన్ నటుడు మరణించారనే వార్త మనందరికీ తెలుసు

 అలాగే మా ప్రజాపనుల మంత్రి, గౌరవనీయులైన టెకో సరస్సు ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో లైఫ్ సపోర్టుపై ఆసుపత్రిలో ఉన్నారు.  ఈ కిడ్నీ వ్యాధిని ఎలా నివారించాలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.


 *కిడ్నీ వ్యాధికి సంబంధించిన టాప్ 6 కారణాలు ఇక్కడ ఉన్నాయి:*


 *1. టాయిలెట్‌కి వెళ్లడం ఆలస్యం : మీ మూత్రాన్ని మీ మూత్రాశయంలో ఎక్కువసేపు ఉంచడం ఒక చెడ్డ ఆలోచన.  పూర్తి మూత్రాశయం మూత్రాశయానికి హాని కలిగించవచ్చు.  మూత్రాశయంలో ఉండే మూత్రం బ్యాక్టీరియాను త్వరగా గుణిస్తుంది.  మూత్రం తిరిగి మూత్రనాళం మరియు మూత్రపిండాలకు తిరిగి వచ్చినప్పుడు, విషపూరిత పదార్థాలు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు, తరువాత మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, ఆపై నెఫ్రైటిస్ మరియు యురేమియాకు దారితీస్తాయి.  ప్రకృతి పిలిచినప్పుడు - వీలైనంత త్వరగా చేయండి.*


 2. ఉప్పు ఎక్కువగా తినరాదు : మీరు రోజుకు 5.8 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు.


 *3. మాంసం ఎక్కువగా తినడం :  మీ ఆహారంలో అధిక ప్రోటీన్ మీ మూత్రపిండాలకు హానికరం.  ప్రోటీన్ జీర్ణక్రియ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది - ఇది మీ మూత్రపిండాలకు చాలా వినాశకరమైన టాక్సిన్.  ఎక్కువ మాంసం కిడ్నీ దెబ్బతినడంతో సమానం.*


 *4. కెఫీన్ ఎక్కువగా తాగడం :కెఫిన్ అనేక సోడాలు మరియు శీతల పానీయాలలో ఒక భాగం.  ఇది మీ రక్తపోటును పెంచుతుంది మరియు మీ మూత్రపిండాలు బాధపడటం ప్రారంభిస్తాయి.  కాబట్టి మీరు రోజూ తాగే కోక్ మొత్తాన్ని బాగా తగ్గించుకోవాలి*.


 *5. నీరు త్రాగకపోవడం : మన కిడ్నీలు వాటి పనితీరును చక్కగా నిర్వహించడానికి సరిగ్గా హైడ్రేట్ చేయబడాలి.  మనం తగినంతగా తాగకపోతే, టాక్సిన్స్ రక్తంలో పేరుకుపోవడం ప్రారంభించవచ్చు, ఎందుకంటే వాటిని మూత్రపిండాల ద్వారా హరించడానికి తగినంత ద్రవం లేదు.  రోజూ 10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు త్రాగాలి.  మీరు మద్యపానం చేస్తున్నారో లేదో తనిఖీ చేయడానికి సులభమైన మార్గం ఉంది

 తగినంత నీరు: మీ మూత్రం యొక్క రంగును చూడండి;  తేలికైన రంగు, మంచిది.*


 6. ఆలస్యంగా చికిత్స :  మీ ఆరోగ్య సమస్యలన్నింటికీ సరిగ్గా చికిత్స చేయండి మరియు మీ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.  మనవంతు సహాయం చేద్దాం...ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రతి వ్యాధి నుండి కాపాడతాడు.


 (3) ఈ టాబ్లెట్‌లను నివారించండి, ఇవి చాలా ప్రమాదకరమైనవి :

 * విక్స్ యాక్షన్-500

 * కోల్డరిన్

 * కోసోమ్

 * నిములిద్

 * Cetrizet-D

 అవి ఫినైల్ ప్రొపనాల్-అమైడ్, PPA కలిగి ఉంటాయి

 స్ట్రోక్స్‌కు కారణమవుతుంది & USAలో నిషేధించబడ్డాయి.


 దయచేసి, ఈ మెసేజ్ నీ తొలగించే ముందు, పాస్ చేయడం ద్వారా మీ స్నేహితులకు సహాయం చేయండి..!  ఇది ఎవరికైనా సహాయపడవచ్చు.   వీలైనంత ఎక్కువ మందికి పంపండి.


 వాట్సాప్ ఉచితం,  ప్లీజ్..దయచేసి దీన్ని చదివి ఫార్వార్డ్ చేయండి.


 సిల్వర్ నైట్రో ఆక్సైడ్ వల్ల మానవులలో కొత్త క్యాన్సర్ వస్తుందని యునైటెడ్ స్టేట్స్ వైద్యులు కనుగొన్నారు.


 మీరు రీఛార్జ్ కార్డ్‌లను కొనుగోలు చేసినప్పుడల్లా, మీ గోళ్లతో స్క్రాచ్ చేయకండి, ఎందుకంటే ఇందులో సిల్వర్ నైట్రో ఆక్సైడ్ కోటింగ్ ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్‌కు కారణం కావచ్చు.


 ఈ సందేశాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోండి.


 *ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు:*


 1. ఎడమ చెవితో ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వండి.


 2. మీరు తీసుకొనే మందులను చల్లటి నీటితో తీసుకోకండి....


 3. సాయంత్రం 5 గంటల    తర్వాత భారీ భోజనం చేయవద్దు.


 4. ఉదయం ఎక్కువ నీరు, రాత్రి తక్కువ నీరు త్రాగాలి.


 5. ఉత్తమ నిద్ర సమయం రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు.


 6. ఔషధం తీసుకున్న వెంటనే లేదా భోజనం చేసిన వెంటనే పడుకోకండి.


 7. ఫోన్ బ్యాటరీ చివరి బార్ నుండి తక్కువగా ఉన్నప్పుడు, ఫోన్‌కి సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే రేడియేషన్ 1000 రెట్లు బలంగా ఉంటుంది.

గమనిక :

మీ యొక్క శ్రేయోభిాషులకూ అందరికి .ఫార్వర్డ్ చేయండి


 



 దయచేసి మీ స్నేహితులందరికీ పంపండి! ...


 

 ఈ సందేశాన్ని సేవ్ చేయవద్దు, ఇతర సమూహాలకు ఇప్పుడే పంపండి.  

 ఇది మీ మరియు ఇతరుల మేలు కోసం, ఎవరికైనా ఉపశమనాన్ని అందించడం ఎల్లప్పుడూ  మీరు వారికి ఇచ్చిన బహుమతిగా ఉంటుంది.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - దశమి/ ఏకాదశి - పూర్వాఫల్గని - సౌమ్య వాసరే* (08.11.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/uQcfamgSEfo?si=brYogm0CMbNPs4W8



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మంత్రోపదేశం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మంత్రోపదేశం ..ఆశ్రమ నిర్మాణ కర్త ఆగమనం..*


*(ఇరువై ఒకటవ రోజు)*


ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారనీ..మీరేమీ ఆలోచించవద్దనీ శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియచెప్పి..


"అమ్మా!..నీ దేవీపూజ కోటి పూర్తి అయిందా?.." అని ప్రభావతి గారిని అడిగారు..


"నాయనా..నా పదమూడో ఏట, మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను..అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవమంత్రమూ జపిస్తున్నాను..లెక్క పెట్టుకోలేదు.." అన్నారు ప్రభావతి గారు..


"అయితే..నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవమంత్రం ఉపదేశిస్తాను.. దీక్షతో చేయి  తల్లీ!..శ్రీధరరావు గారూ మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించనా?..లేక వైష్ణవమంత్రమా?.."అన్నారు నవ్వుతూ..


"స్వామీ!..నాకు ఏ మంత్రాలూ వద్దు..నేను ఈ దీక్షలు చేయలేను..అదేదో ఆవిడకు బోధించండి..తపనతో చేస్తూ ఉంటుంది..నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను...మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..మీ తపస్సు, దాని ఫలితాలు..నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను..అందుకు నేను దోహదకారిగా వుంటాను..అంతే కాని..ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు!.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామి వారు పక పకా నవ్వారు.."చూసావా అమ్మా!..శ్రీధరరావు గారు మంత్రోపదేశం వద్దన్నారు..పోనీలే అమ్మా..నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను..కొనసాగిద్దువు గానీ.." అని..మళ్లీ కూడా ఆ ఇద్దరికీ ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి, ఆశీర్వదించి పంపించివేశారు..దంపతులిద్దరూ తేలిక పడ్డ మనసుతో మొగలిచెర్ల చేరారు..


ప్రక్కరోజు ఆదివారం.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధరరావు గారింటికి వచ్చారు..రాగానే, శ్రీధరరావు గారికి నమస్కారం చేసి.."అయ్యా..నా పేరు బొగ్గవరపు చిన మీరా శెట్టి..ఇతను నా మిత్రుడు!..మాది, వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం.." అన్నాడు..


శ్రీధరరావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి..వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు..


"నేను..మాలకొండ లో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో వున్నాను..ఆ విషయమై మీతో మాట్లాడాలని వచ్చాను.." అన్నారు..శ్రీధరరావు గారికి ఒక్కక్షణం తాను ఏం వింటున్నానో అనే సందేహం కలిగింది..వెంటనే ప్రభావతి గారిని పిలిచారు..ఇద్దరూ కూర్చున్న తరువాత, చిన మీరాశెట్టి గారు మళ్లీ అదేవిషయం..తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలచానని చెప్పారు..


నిన్న శనివారం  సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు..ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు..దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు..


చిన మీరాశెట్టి గారిని..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు..


శ్రీ స్వామివారు  ఎర్రబల్లె గ్రామం లో ఉన్నప్పటి నుంచీ తెలుసుననీ.. శ్రీ స్వామివారు వ్యాసాశ్రమం వెళ్లి వచ్చిన తరువాత కూడా ఒకటి రెండు సార్లు తాను, తన భార్యా శ్రీ స్వామివారిని కలిసామని..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన కు వెళ్లిన తరువాత ఆయనతో కలవడం కుదరలేదనీ..మీరాశెట్టి గారు చెప్పారు..


నిన్నరాత్రి తనకు స్వప్నంలో కనిపించి..ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని..ముందుగా మిమ్మల్ని కలువమని కూడా ఆజ్ఞాపించారని కూడా మీరాశెట్టి గారు చెప్పారు..శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల చేరారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఇదంతా కలలా ఉంది..దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి..తాము నమ్మిన ఆ లక్ష్మీనృసింహుడే..ఇదంతా నడిపిస్తున్నాడనీ..లేకుంటే..ఒకానొక సాధకుడు, తన తపోసాధనకు తమ సహకారం కోరి..తమ జీవితాలకు ఒక అర్ధం కల్పించడం..లీల కాక మరేమిటి?..


మీరాశెట్టి గారిని, వారి స్నేహితుడిని..ఆ రాత్రికి తమ ఇంటిలోనే వుండమని చెప్పి, తెల్లవారగానే మాలకొండకు వెళ్లి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు శ్రీధరరావు గారు..మీరాశెట్టి గారూ అందుకు అంగీకరించారు..


అందరూ సోమవారం నాడు ఉదయాన్నే..మాలకొండకు బయలుదేరి వెళ్లారు..


ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..బావి లో జలకళ..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

Vanuva

 https://youtu.be/Q_GC81n9QuE?si=XGJzuLQEbcfy4bzF