8, నవంబర్ 2023, బుధవారం

శ్లోకం - 71*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 71*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*నఖానా ముద్ద్యోతై ర్నవనళినరాగం విహసతాం*

*కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |*

*కయాచిద్వా సామ్యం భవతు కలయా హస్త కమలం*

*యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచణమ్ ||*

ఈ శ్లోకంలో అమ్మవారి అరచేతులను ధ్యానిస్తున్నారు శంకరులు. *కరాంగళి నఖోత్పన్న నారయణ దశాకృతిః*  అని శ్రీ లలితా సహస్ర నామాలలో స్తుతించారు. అంటే అమ్మవారు తన నఖములు (గోళ్ళు) స్పృశించగానే వాటినుంచి అసుర సంహారం కోసం ,ధర్మ పరిరక్షణ కొరకు , శ్రీమన్నారాయణమూర్తి దశావతారాలు ఉద్భవించాయిట.అంతటి మహిమ కల అరచేతులు గోళ్ళు అమ్మవారివి.ఇక్కడ శంకరులు అంటున్నారు..


అమ్మా ఉమా

నఖానా ముద్ద్యోతై ర్నవనళినరాగం విహసతాం = నీ నఖములు ఇప్పుడే వికసించిన పద్మముల కాంతిని పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయమ్మా.వాటి వర్ణము కన్నానీ నఖముల వర్ణము మరింత ఎర్రనిది.


కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే = ఇక నీ అరచేతుల ప్రకాశ వైభవమును గురించి ఏమని ఎంతని  వర్ణించగలనమ్మా.అట్టి వర్ణన దుర్లభమని భావము.


కయాచిద్వా సామ్యం భవతు కలయా హస్త కమలం = అయితే నీ నఖముల కాంతిని ఒక సందర్భంలో పద్మముల కాంతితో కొంతమేరకు పోల్చటానికి వీలవుతుంది. ఏమిటది?


యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచణమ్ = ఒకవేళ ఆ పద్మములోనుండే శ్రీమహాలక్ష్మి పాదములకు అలంకరించనున్న పారాణి (లాక్షారసం) ఆమె క్రీడగా తన పాదములను కదిలించినప్పుడు ఆ పద్మమునకు అంటిన పారాణితో కొంతమేరకు పోల్చవచ్చునేమో.

గౌరిదేవి ఎర్రనిది(గౌరవర్ణము కలది)ఆమె అరచేతులు మరింత ఎర్రనివి.గోళ్ళు మరింత ఎర్రనివి అని అంటున్నారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: