🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 81*
నరేంద్రునికి ఇంకా సమాధి స్థితిలోనే లయించి ఉండిపోవాలనే తపన తగ్గలేదు. కనుక అతడు, "ఆహా! నేను ఆ స్థితిలో ఎంతో ఆనందం పొందాను. నన్ను ఆ స్థితిలోనే ఉండనివ్వండి" అని శ్రీరామకృష్ణులను అడిగాడు. శ్రీరామకృష్ణులు మళ్లీ అతణ్ణి చీవాట్లు పెట్టారు: "ఏమిటిది! జగజ్జనని అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతస్సిద్ధంగానే లభిస్తుంది. సకల ప్రాణికోటిలోను ఒకే భగవంతుడు నెలకొని ఉండడం మామూలు స్థితిలోనే నీకు అనుభూతమవుతుంది.
లోకంలో నువ్వు మహోన్నత కార్యాలు ఎన్నో సాధిస్తావు. అసంఖ్యాకులలో నువ్వు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తావు. పేదసాదల కష్టాలను బాపుతావు" అన్నారు.నరేంద్రుడు వెళ్లిపోయిన తరువాత, తక్కిన శిష్యులతో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు:
"స్వీయ సంకల్ప మాత్రాననే నరేన్ లోకం నుండి నిష్క్రమిస్తాడు. తాను ఎవరో గ్రహించిన మరుక్షణమే అతడు శరీరం త్యజిస్తాడు. తన మేధాశక్తితోను, ఆధ్యాత్మిక శక్తులతోను అతడు లోకపు పునాదులనే కదలించివేసే సమయం ఆసన్నమవుతుంది. అతడు పరమ సత్యాన్ని అనుభూతి పొందకుండా ఉండాలని నేను జగజ్జననిని ప్రార్ధించాను.
ఎందుకంటే అతడు దానిని పొందితే, ఆ తరువాత లోకంలో జీవించడు. అతడు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. పరముసత్యాన్ని అతడు పొందడానికి అడ్డుగా ఒక తెర మాత్రమే ఉంది. ఆ తెర ఎంతో పలుచనిది, ఏ క్షణంలోనైనా తొలగిపోవచ్చు. '🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి