27, సెప్టెంబర్ 2022, మంగళవారం

కూరిమి గల దినములలో

 కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగ నేరవు 

మఱి యా కూరిమి విరసంబైనను

నేరములే తోచు చుండు నిక్కము సుమతీ


మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్నీ ఒప్పులే కనిపిస్తాయి. ఒకవేళ వారు తప్పులు చేసినా కూడా మంచిగానే అనిపిస్తాయి. అదే వ్యక్తులు శత్రువులుగా మారినప్పుడు వారు చేసే మంచి పనులు కూడా చెడ్డవిగానే కనపడును

స్వర్గప్రాప్తి

 ప్రపంచ జనాభా ఇప్పుడు దాదాపు 800 కోట్లు పైబడట్టు అంచనా. అంటే రెండవ ప్రపంచ యుద్ధం దరిదాపుల్లో ఈ జనాభా లెక్కలు దాదాపు 150 నుండి 200 కోట్ల దాకా ఉండేవని. 


అంటే సుమారు 80 ఏళ్ళ తరువాత జనాభా నాలుగింతలైనట్టు. 


మనిషి సగటున 80 ఏళ్ళు బతుకుతాడు అని అనుకుంటే ఇప్పుడు ఉన్న జనాభా అంతా 1940 తరువాత పుట్టినవాళ్ళే కదా


పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం 1940 దాకా ఉన్నవారందరు మళ్ళీ పుట్టుంటే జనాభా లెక్కలు 200 కోట్లకు దాటకపోదును. కాని 800 కోట్లు ఎలా ఐనట్టు. 


అంటే మనుషులే కాకుండే ఇతర జీవులు కూడా మనుషులుగా పుట్టి తమ తమ మంచి కర్మల ద్వారా మోక్షం పొందగలరని కదా. 


కాని మనిషి కన్నా ఇతర జీవులకు మానవ జన్మ పొందడానికి అవకాశాలు తక్కువ అని విన్నాను. 


కాని ఆ ఇతర జీవులు ఏం చేసాయో గాని మనుషుల జనాభాను అతిక్రమించి మనుషులుగా జీవం పొంది స్వర్గప్రాప్తి సంపాదించుకుంటున్నాయి అని చెప్పడంలో సందేహము లేదు. 


పైన చెప్పిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్న యెడల మన్నించగలరు.

తాను సృష్టించిన మనిషి

 దేవుడు తాను సృష్టించిన మనిషి ఇంకా మంచివాడనే నమ్ముతున్నాడు. అలసి సొలసి పోతున్న మనిషి ముఖంలో చిరునవ్వు చూడాలని ఆశపడ్డాడు భగవంతుడు. నువ్వేం కావాలో కోరుకో అన్ని ఇస్తాను అని అన్నాడు. 


మనిషి డబ్బు బంగారం వజ్రాలు కావాలి అని అన్నాడు. దేవుడు ఎంత అమాయకుడో అవన్నీ ఇచ్చేస్తే మనిషి నవ్వుతాడని అనుకున్నాడు. తన చూపుడు వేలును ఇంట్లో వస్తువుల వైపు తిప్పాడు. అంతే,  అంతా బంగారంగా మారిపోయి మెరుస్తున్నది. 


అయినా మనిషి ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇంటినే బంగారు భవనంలా మార్చేసాడు. అయినా ఆ మనిషి ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇంకా ఏం కావాలి అని అడిగాడు భగవంతుడు.


మీ చూపుడు వేలు కావాలి అని అడిగాడు మనిషి. దేవుడు అప్పుడు తేరుకున్నాడు.


తాను సృష్టించిన మనిషి మనిషి కాడని *మనీ* షిగా మారిపోయాడని. అతడు ఆరోగ్యం కోరుకోలేదు. అందమైన కుటుంభం కోరుకోలేదు. వెలకట్టలేని సంతోషం కోరుకోలేదు. కోరుకున్న వాటిలోనూ తృప్తి చెందలేదు. సాయం చేయడానికి వస్తే ఆ చేతినే నరికేస్తున్నాడు.


మనిషి అమాయకుడు కాదు ఆ *మాయకుడు* అని. అతడిని నమ్మినందుకు తానే అమాయకుడని తలచి ఆ రోజూ నుండి మాటలు కట్టిపెట్టి మౌనంగా నల్లరాయిలో శిలలా మారి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాడు

పాపం అమాయకుడైన ఆ భగవంతుడు.


 🙏🙏🙏

భూతకోటిని పాలించు

 సర్వ భూతములను

 శ్లోకం:☝️సద్యోముక్తి

*పాలినీ సర్వభూతానాం*

  *తథా కామాంగహారిణీ l*

*సద్యోముక్తిప్రదా దేవీ*

  *వేదసారా పరాత్పరా ll*

భావం: సర్వ భూతములను శాసించే మూలప్రకృతి, నిటలాక్షుడు మన్మథుని భస్మము చేసినట్టు మనలోని అరిహడ్వర్గాలను నాశమొనర్చి తత్ క్షణమే ముక్తిని ప్రసాదించే తల్లి, వేదమంత్రములు (వాక్కులు) పరమేశ్వరుడైతే అర్థము అమ్మవారు ( *వాగర్థావివ సంపృక్తౌ* ). ఆమె అన్ని తత్త్వములకు అతీతము. అంటే పోతనగారు చెప్పినట్టు _"లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నేకాకృతిన వెలుగునని"_ భావం.🙏

భూతకోటిని పాలించు భువనవంద్య!

సకల కామాంగహారిణీ నిఖిల నిలయ!

ముక్తి తలచిన మాత్రానె మొగి నొసంగు 

వేదసారా ! పరాత్పరా ! వినుతి సేతు


గోపాలుని మధుసూదనరావు

9959536545

మాయం మాయం

 *అంతా మాయం మాయం మటుమాయం*


పనిలోకి వచ్చేవారు మాయం

కూలీలు మాయం

పోస్టుమాన్ మాయం,

ఆసాంతం వినే వైద్యుడు మాయం

ఫామిలీ డాక్టరు మాయం.

కోడళ్ళ పనితనం మాయం,

అత్తమామల మాటసాయం మాయం,

అల్లుళ్ళ గౌరవ హోదా  మాయం.

లంగా, ఓణీ మాయం,

చీర, రవిక, మాయం,

నల్లటి జడ మాయం,

జడలో పువ్వులు మాయం, 

గోచీ మాయం, 

పంచా గావంచా మాయం.

పుస్తక పఠనం మాయం

ఎక్కాలు మాయం,

గుణింతాలు మాయం,

పెద్దబాలశిక్ష మాయం,

చందమామ మాయం.

రేడియోకి శ్రోతలు మాయం

బాలానందం మాయం.

పెరడు, బావి అరటి మొక్కలు మాయం.

ఎండావకాయ మాయం 

కుంపటిపై దిబ్బరొట్టి మాయం 

మట్టివాసన మాయం 

పిడతకిందపప్పుబండి మాయం 

వందరోజులాడే సినిమాలు మాయం,

నాటకాలు బొత్తిగా మాయం. 

నిశ్శబ్దత లేని నిశిరాత్రులు మాయం 

ఉపాధ్యాయుడు మాయం 

కుంకుడుకాయ సీకాకాయ మాయం 

వాకిట ముందు కళ్లాపులు,ముగ్గులు మాయం ( అందరి విషయంలో కాదులే)

పిచ్చుక, సీతాకోకచిలుక మాయం 

సత్తుగిన్నె చారు మాయం 

స్కూల్లో మైదానం మాయం 

సంఘంలో నిదానం మాయం

తరవాణి దబ్బాకు వాము పప్పునూనె మాయం 

వానపాము మాయం 

చెరువుల్లో ఈతలు మాయం 

బిళ్ళా కర్రా మాయం,

కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం 

సైకిలు మాయం,

ఎద్దులబండి మాయం,

గుఱ్ఱపు బండి మాయం

రిక్షాలు మాయం చింతపిక్కలు మాయం,

గచ్చకాయలు మాయం

నేలబండాట మాయం 

గుడుగుడుగుంచం మాయం

వానా వానా చెల్లప్ప మాయం, 

వైకుంఠపాళి మాయం

తల్లులు పిల్లలకు లాలించి బువ్వ పెట్టడం మాయం

ఈ టెక్నాలజీ మయం

లో అంతా అయోమయం ఈ జీవినగమనం లో

ఇంకా ఇంకా చాలా చాలా మాయం మటుమాయం!

చివరికి మనమూ అవుతాం మాయం!!

శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి

 శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి 

పాడ్యమి 

1.

 శ్రీమచ్ఛంకరగేహినీం 

వినుతదృగ్దేదీప్యతేజోనిధిమ్

బ్రహ్మోపేంద్రహరాద్యనేకసురభృత్యాచారసంశోభినీమ్

చంద్రార్కానలలోచనత్రయముఖీం లోకత్రయారాధితామ్

శ్రీదేవీం ప్రణమామి తాం శుభకరీం శశ్వచ్ఛుభాకారిణీమ్

(భృత్యాచారము=సేవాభావము)


శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి 

2. కుమారి 

కౌమారీం భవదుఃఖనాశనకరీం దారిద్ర్యసంహారిణీమ్ 

ఆయుర్భాగ్యప్రదాయినీం గుణయుతాం సద్వీర్యదాత్రీం శుభామ్ 

విశ్వైకోన్నతశక్తిరూపవపుషీం లోకైకవంద్యాం శివామ్ 

వందే తాం నవకన్యకాంతరసఖీ మాద్యాం ద్వివర్షాత్మికామ్ 



విదియ

3.

శ్రీదేవీనవరాత్రపర్వవిలసద్దీవ్యత్ప్రభాశోభితామ్ 

భావాతీతగుణాన్వితాం బహువిధైః భక్త్యన్వితైర్భావితామ్ 

పూజాహోమవిభూషితాం సరభసాం సర్వాఘసంహారిణీమ్ 

శ్రీదేవీం ప్రణమామి నిత్యమతులాం సంస్తుత్యవార్తాకులామ్ 

4. త్రిమూర్తి 

ధనధాన్యప్రవివర్థినీం సురనుతాం వర్షత్రయీం విక్రమామ్ 

త్రిగుణాతీత గుణాన్వితాం సధవళాం విజ్ఞానరూపోజ్జ్వలామ్ 

శుభదాం సత్కులవృద్ధిదాం ధృతిమయీం త్రైలోక్యసంసేవితామ్ 

కరుణాపూరహృదంతరాళలసితాం వందే త్రిమూర్త్యాహ్వయామ్ 

*~శ్రీశర్మద*

సర్వ భూతములను

 శ్లోకం:☝️సద్యోముక్తి

*పాలినీ సర్వభూతానాం*

  *తథా కామాంగహారిణీ l*

*సద్యోముక్తిప్రదా దేవీ*

  *వేదసారా పరాత్పరా ll*


భావం: సర్వ భూతములను శాసించే మూలప్రకృతి, నిటలాక్షుడు మన్మథుని భస్మము చేసినట్టు మనలోని అరిహడ్వర్గాలను నాశమొనర్చి తత్ క్షణమే ముక్తిని ప్రసాదించే తల్లి, వేదమంత్రములు (వాక్కులు) పరమేశ్వరుడైతే అర్థము అమ్మవారు ( *వాగర్థావివ సంపృక్తౌ* ). ఆమె అన్ని తత్త్వములకు అతీతము. అంటే పోతనగారు చెప్పినట్టు _"లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నేకాకృతిన వెలుగునని"_ భావం.🙏

పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్

 PCOD ( పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ) - 


       స్త్రీలలో హార్మోన్ సమస్య వలన వచ్చే ప్రధాన సమస్య ఇది. ఈ వ్యాధి లో ప్రధాన కారణం అండాశయం లొ నీటిబుడగలు ఏర్పడటం . ఈ నీటిబుడగలని నీటితిత్తులు అని కూడా అంటారు. దీనివలన సంతానలేమి సమస్య ప్రధానంగా స్త్రీలలో ఏర్పడుతుంది.  


 దీని ప్రధాన లక్షణాలు  - 


 *  నెలసరి సరిగ్గా రాకపోవడం  . 


 *  రుతుస్రావం తక్కువ కావడం లేదా ఎక్కువ కావడం జరుగును. 


 *  ముఖం మీద మచ్చలు వస్తాయి . 


 * జుట్టు రాలిపోతుంది . 


  PCOD  సమస్య రావడానికి ప్రధాన కారణం - 


       ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం హార్మోన్స్ అసమతుల్యత అని చెప్పవచ్చు . సహజంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ హర్మోన్ తో పాటు ఆండ్రొజన్ అనే పురుష హర్మోన్ ఉత్పతి అవుతుంది . PCOD సమస్య వచ్చిన స్త్రీలలో ఆండ్రొజన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన హర్మోన్స్ అసమతుల్యత లోపించి బరువు పెరిగి పాంక్రియాస్ నుంచి ఉత్పతి అయ్యే ఇన్సులిన్ హర్మోన్ శరీరంలో నిలువ ఉండే గ్లూకోజ్ మీద ప్రభావం చూపించదు. దీనివల్ల రక్తంలో చక్కర నిలువలు పెరిగిపోతాయి. కాలక్రమేణా మదుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. 

 

 గమనిక - 


  ఈ PCOD సమస్యకు ఆయుర్వేదం నందు అత్యద్భుత పరిష్కారం కలదు . ఈ సమస్యతో ఇబ్బంది పడువారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు .


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .