27, సెప్టెంబర్ 2022, మంగళవారం

మాయం మాయం

 *అంతా మాయం మాయం మటుమాయం*


పనిలోకి వచ్చేవారు మాయం

కూలీలు మాయం

పోస్టుమాన్ మాయం,

ఆసాంతం వినే వైద్యుడు మాయం

ఫామిలీ డాక్టరు మాయం.

కోడళ్ళ పనితనం మాయం,

అత్తమామల మాటసాయం మాయం,

అల్లుళ్ళ గౌరవ హోదా  మాయం.

లంగా, ఓణీ మాయం,

చీర, రవిక, మాయం,

నల్లటి జడ మాయం,

జడలో పువ్వులు మాయం, 

గోచీ మాయం, 

పంచా గావంచా మాయం.

పుస్తక పఠనం మాయం

ఎక్కాలు మాయం,

గుణింతాలు మాయం,

పెద్దబాలశిక్ష మాయం,

చందమామ మాయం.

రేడియోకి శ్రోతలు మాయం

బాలానందం మాయం.

పెరడు, బావి అరటి మొక్కలు మాయం.

ఎండావకాయ మాయం 

కుంపటిపై దిబ్బరొట్టి మాయం 

మట్టివాసన మాయం 

పిడతకిందపప్పుబండి మాయం 

వందరోజులాడే సినిమాలు మాయం,

నాటకాలు బొత్తిగా మాయం. 

నిశ్శబ్దత లేని నిశిరాత్రులు మాయం 

ఉపాధ్యాయుడు మాయం 

కుంకుడుకాయ సీకాకాయ మాయం 

వాకిట ముందు కళ్లాపులు,ముగ్గులు మాయం ( అందరి విషయంలో కాదులే)

పిచ్చుక, సీతాకోకచిలుక మాయం 

సత్తుగిన్నె చారు మాయం 

స్కూల్లో మైదానం మాయం 

సంఘంలో నిదానం మాయం

తరవాణి దబ్బాకు వాము పప్పునూనె మాయం 

వానపాము మాయం 

చెరువుల్లో ఈతలు మాయం 

బిళ్ళా కర్రా మాయం,

కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం 

సైకిలు మాయం,

ఎద్దులబండి మాయం,

గుఱ్ఱపు బండి మాయం

రిక్షాలు మాయం చింతపిక్కలు మాయం,

గచ్చకాయలు మాయం

నేలబండాట మాయం 

గుడుగుడుగుంచం మాయం

వానా వానా చెల్లప్ప మాయం, 

వైకుంఠపాళి మాయం

తల్లులు పిల్లలకు లాలించి బువ్వ పెట్టడం మాయం

ఈ టెక్నాలజీ మయం

లో అంతా అయోమయం ఈ జీవినగమనం లో

ఇంకా ఇంకా చాలా చాలా మాయం మటుమాయం!

చివరికి మనమూ అవుతాం మాయం!!

కామెంట్‌లు లేవు: