దేవుడు తాను సృష్టించిన మనిషి ఇంకా మంచివాడనే నమ్ముతున్నాడు. అలసి సొలసి పోతున్న మనిషి ముఖంలో చిరునవ్వు చూడాలని ఆశపడ్డాడు భగవంతుడు. నువ్వేం కావాలో కోరుకో అన్ని ఇస్తాను అని అన్నాడు.
మనిషి డబ్బు బంగారం వజ్రాలు కావాలి అని అన్నాడు. దేవుడు ఎంత అమాయకుడో అవన్నీ ఇచ్చేస్తే మనిషి నవ్వుతాడని అనుకున్నాడు. తన చూపుడు వేలును ఇంట్లో వస్తువుల వైపు తిప్పాడు. అంతే, అంతా బంగారంగా మారిపోయి మెరుస్తున్నది.
అయినా మనిషి ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇంటినే బంగారు భవనంలా మార్చేసాడు. అయినా ఆ మనిషి ముఖంలో నవ్వు కనిపించలేదు. ఇంకా ఏం కావాలి అని అడిగాడు భగవంతుడు.
మీ చూపుడు వేలు కావాలి అని అడిగాడు మనిషి. దేవుడు అప్పుడు తేరుకున్నాడు.
తాను సృష్టించిన మనిషి మనిషి కాడని *మనీ* షిగా మారిపోయాడని. అతడు ఆరోగ్యం కోరుకోలేదు. అందమైన కుటుంభం కోరుకోలేదు. వెలకట్టలేని సంతోషం కోరుకోలేదు. కోరుకున్న వాటిలోనూ తృప్తి చెందలేదు. సాయం చేయడానికి వస్తే ఆ చేతినే నరికేస్తున్నాడు.
మనిషి అమాయకుడు కాదు ఆ *మాయకుడు* అని. అతడిని నమ్మినందుకు తానే అమాయకుడని తలచి ఆ రోజూ నుండి మాటలు కట్టిపెట్టి మౌనంగా నల్లరాయిలో శిలలా మారి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాడు
పాపం అమాయకుడైన ఆ భగవంతుడు.
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి