15, నవంబర్ 2024, శుక్రవారం

Panchang


 

మర్కట మార్జాల సూత్రం*

 వందేమాతరం 

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 


*భక్తికి మర్కట మార్జాల సూత్రం*


హిందుత్వం మతం అనేది ప్రపంచమిచ్చిన ఒక విశేషణం మాత్రమే. ఆచరణలో ఇది ధర్మ ఆధారమైన జీవన విధానం. ప్రపంచం మొత్తం సనాతన ధర్మంగా భావించేది హిందుత్వమే. ముఖ్యంగా మానవత్వం, భక్తి అనే రెండు సూత్రాలను సమాంతరంగా సూచించి వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పెంపొందించేది ప్రపంచంలో హిందూ ధర్మం ఒక్కటే.


హిందుత్వం  దైవాన్ని చేరుకునేందుకు మానవునికి కావలసిన అంతరదృష్టిని భక్తి మార్గంలో  అందింస్తున్నది.


ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రపంచ వినాశనానికి హైందవేతరములే ఎందుకు కారణం అవుతున్నాయి? హిందుత్వం ఎందుకు కాదు? అని ఆలోచిస్తే, ఇతరుల వినాశనాన్ని కోరుకునేది ముఖ్యంగా మనిషిలోని అహంకారము మరియు స్వార్థమే. మన సనాతన ధర్మంలో వేద కాలం నుంచి కూడా అహంకార నిర్మూలన స్పష్టంగా కనిపిస్తుంది. దాని స్వరూపమే యజ్ఞాలు. యజ్ఞకర్త యజ్ఞ నిర్వహణ సమయంలో తనకు ఉన్నదంతా దానం చేయవలసి ఉంటుంది. అంతేకాదు అసుర నిర్మూలన కూడా భగవంతుడు తన అవతారాలు అయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రూపాల్లో చూపించాడు. ప్రజలకి భగవద్గీత ద్వారా కర్మయోగాన్ని బోధించాడు. ఇలా నిరహంకార వ్యక్తిత్వాన్ని పెంపొందించే మార్గాలు ఇతర సాంప్రదాయాల్లో లేకపోవడమే హిందుత్వానికి భిన్నంగా ఆ మతాలు ఉండడానికి కారణం.


ఇక అసలు విషయానికి వస్తే, దైవాన్ని చేరుకునే మార్గంలో కూడా మర్కటమార్జాల సూత్రం అన్వయింపు చేసుకోవచ్చు. ఈ సూత్రంలోని మర్మాన్ని తెలుసుకొంటే  భక్తునికి భగవంతునిపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది.

 

మర్కటమంటే కోతి. మార్జాలమంటే పిల్లి. భక్తులు భగవంతునితో రెండు విధాలుగా వ్యవహరించవచ్చునని ఈ సూత్రం సూచిస్తుంది. మానవుడు భగవత్సాన్నిధ్యం పొందడానికి ప్రత్యేక  ప్రయత్నం చేయనక్కరలేదు. భగవంతునికి తన సమస్తములు అర్పించుకొని, ఆత్మనివేదనం చేసుకోంటే చాలు  భగవంతుడు సాయుజ్యం ప్రసాదిస్తాడు. పిల్లి తన పిల్లలను, తననోట కరచిపట్టుకొని, సురక్షిత ప్రాంతాలలోకి చేరుస్తుంటుంది. ఇందులో పిల్లి పిల్ల ఏ ప్రయత్నము చేయదు. తన భారమంతా తల్లికే అర్పించి నిశ్చింతగా ఉంటుంది. 


ఇక రెండవ విధానంలో భక్తుడు భగవంతుని ఆరాధించే ప్రయత్నం చేయాలి. అట్టి ఆరాధనలోనే అతడు భగవంతుని కృపను పొందుతాడు. తల్లి కోతి పొట్టను పిల్లకోతి గట్టిగా అతుక్కుని పట్టుకుంటుంది. అప్పుడు తల్లి కోతి, పిల్లకోతిని సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది. 


భక్తులు అనుసరించే ఈ రెండు మార్గాలు, వారిని భగవంతుని సన్నిధికి చేర్చేవే.  నిస్వార్థ పరుడు, నిష్కపటి అయిన  భక్తుడికే ఇది సాధ్యపడుతుంది. అటువంటి భక్తుడే పరిపూర్ణుడవుతాడు. అటువంటి నిరహంకార, ద్వేషరహిత మానసిక స్థితి కలవాడు మాత్రమే భగవంతుని సాన్నిద్యానికి అర్హుడు. ఇదే మనకు సనాతన ధర్మం బోధిస్తుంది.


సర్వేజనా సుఖినోభవంతు.


మృశి

దశిక ప్రభాకర శాస్త్రి 

15.11.2024

కార్తీక పౌర్ణమి విశిష్టత:-

 కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో.....


కార్తీక పౌర్ణమి విశిష్టత:- 


ఆగ్నేయంతు యదావృక్షం కార్తిక్వాం భవతి క్వచిత్‌

మహతి సా తిథి: జ్ఞేయా స్నాన దానేషు చోత్తమా

యదాతు యామ్యం భవతి ఋక్షం తస్యాం తిథౌ క్వచిత్‌

తిథి స్వాపి మహాపుణ్యా మునిబి: పరికీర్తితా

ప్రాజాపత్యం యదా ఋక్షం తిథౌ తస్యం నరాధిప

సా మహా కార్తీకీ ప్రోక్తా దేవానామపి దుర్లభా


*అనగా కార్తిక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర యోగమున్నచో ఈ పూర్ణిమను ‘మహాపూర్ణ’ లేదా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. 


*భరణి నక్షత్రం ఉన్నచో ‘మహాతిథి’ అని అంటారు. అలాగే రోహిణి ఉన్నా కూడా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. రోహిణి నక్షత్రంతో కూడిన పూర్ణిమ దేవతలకు కూడా లభించదని హేమాద్రి మరియు బ్రహ్మ పురాణాల ద్వారా తెలుస్తోంది.


*విశాఖాసు యదా భాను: కృత్తికాసుచ చంద్రమా:

సయోగ: పద్మకోనామ పుష్కరే స్వతి దుర్లభ:

పద్మకం పుష్కరే ప్రాప్య కపిలాం య: ప్రయచ్ఛతి

సహిత్వా సర్వపాపాని వైష్ణవం లభతే పదం


*అనగా సూర్యుడు విశాఖ నక్షత్రంలో చంద్రుడు కృత్తికలో ఉన్నచో పద్మక యోగమని, ఈ యోగమున పుష్కర తీర్థమున స్నానమాచరించి కపిల గోదానం చేసినచో పాపవిముక్తులై వైకుంఠమును చేరెదరని పద్మపురాణ వచనం.


*కార్తిక్యాం పుష్కరే స్నాత: సర్వపాపై: ప్రముచ్యతే

మాద్యం స్నాత: ప్రయాగేతు ముచ్యతే సర్వ కిల్బిషై:


*కార్తిక పూర్ణిమ నాడు పుష్కర తీర్థమున స్నానం ఆచరించినా మరియు మాఘపూర్ణిమ నాడు ప్రయాగలో స్నానమాచరించినా పాపవిముక్తులు అగుదురు. కార్తిక పూర్ణిమ నాడు శ్రీహరి మత్స్య రూపం ధరించాడని యమస్మృతి ద్వారా తెలుస్తోంది.


*వరాన్‌ దత్వా యతో విష్ణువు మత్స్య రూపీ భవేత్‌ తత:

తస్యాం దత్తం హుతం జప్తం తదక్షయ్య ఫలం స్మృతం


*పద్మపురాణంలోని కార్తిక మహాత్మ్యం ద్వారా కార్తిక పూర్ణిమనాడు శ్రీహరి బ్ర హ్మకు వరమిచ్చి మత్స్యరూపమును ధరించెను కావున ఈనాడు చేసిన దానం, హోమం, జపం అక్షయ ఫలాలను ఇచ్చునని శ్లోకార్థం.


*పౌర్ణమాస్యాంతు సంధ్యానాం కర్తవ్య: త్రిపురోత్స:

దద్యాత్‌ అనేన మంత్రేణ ప్రదీపాంశ్చ సురాలయే

కీకా: పతంగా: మశకా: వృక్షా: జలే స్థలేయే విచరంతి జీవా:

దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన: భవంతి నిత్యం స్వపచాహివిప్రా:


*కార్తిక పూర్ణిమ నాడు సంధ్యాసమయంలో త్రిపురోత్సవాన్ని జరిపి పై మంత్రాన్ని పఠిస్తూ దేవాలయంలో దీపాలను వెలిగించాలి. కీటకాలు, దోమలు మొదలైనవి మరియు చెట్లు, ఉభయచరాలు కూడా ఈ దీపమును దర్శించినచో పునర్జన్మ ఉండదు. ఈ దీపాన్ని దర్శించినవారికి కోరిన ఫలము దక్కును.


*కార్తిక్యాం యో వృషోత్సర్గమ్‌ కృత్వా నక్తం సమాచరేత్‌

శైవం పదమవాప్నోతి శివమ్‌ వ్రత మిదం స్మృతమ్‌


*కార్తిక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేసిన వారు కైలాసాన్ని పొందుతారని పై శ్లోకార్థం.


*కార్తిక్యాం య: నరోలోకే ధాత్రీ ఫల రసస్నాయి

తులసీ అర్చనం కృత్వా మహావిష్ణుం ప్రపూజ్యచ

బ్రాహ్మణాం పూజయిత్వాచ నపున ర్లభతే భవమ్‌


*అనగా కార్తికపూర్ణిమ నాడు ఉసిరి రసంతో స్నానమాచరించి తులసిని, శ్రీమహావిష్ణువును పూజించి బ్రాహ్మణులకు, బీదలకు వస్త్రదానం, సంతర్పణ చేసినచో పునర్జన్మ ఉండదు.


*పౌర్ణమి... ప్రతి నెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికీ ఉండదు.

* ఖగోళపరంగా చూస్తే... ఏడాది వెుత్తమ్మీదా జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. *అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్నుకుట్టేలా గుడిప్రాంగణాలూ జలాశయాలూ కార్తీకదీపాలతో శోభాయమానంగా వెలిగిపోతాయి ఈ రోజు.


*ముఖ్యమైన విధులు: ఈ రోజు చేసే ఉపవాసానికి విశేషఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.


*కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః

జలే స్థలే యే నివసంతి జీవాః |

దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః

భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||


*ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.

*ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. 

*కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. 

*వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.


*కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలుస్తారు...

*పూర్వం శివభక్తులైన ముగ్గురు రాక్షసులు ఉండేవారట. 

*వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదన్నా వరాన్ని కోరుకొనమని అడుగగా తమను బంగారం, వెండి, ఇనుము అనే మూడు పురాలకు అధిపతులుగా చేయమని కోరుకున్నారు. 

*అంతేకాదు! అంతరిక్షంలో సంచరించే ఈ మూడు పురాలూ ఎప్పుడైతే ఒకే రేఖ మీదకి వస్తాయో, ఆ రోజున ఒకే బాణంతో వాటిని ఛేదించగలిగినప్పుడే తమకు మరణం కలగాలని వేడుకున్నారు. 

*ఇలా అసాధ్యమైన వరాలను కోరుకున్న త్రిపురాసుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దాంతో ఆ పరమేశ్వరుడే వారిని సంహరించేందుకు పూనుకున్నాడు.

* వేయి సంవత్సరాల అనంతరం ఎప్పుడైతే ఆ మూడు పురాలూ ఒక్క తాటి మీదకు వచ్చాయో, అదను చూసి వాటిని తన బాణంతో ఛేదించి త్రిపురాంతకుడు అయ్యాడు....ఈ సంధర్భంగా పార్వతి దేవి పౌర్ణమి పూజ జరిపించారు అని పురాణం చెబుతుంది...


*కార్తీక పౌర్ణమి రోజు 🌹జ్వాలాతోరణం - 🌹  ప్రాముఖ్యత:-


*శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. *మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు.

* ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".


*కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. *ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు.

* దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు.


దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.


ఒకటి :- త్రిపురాసురలనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడుం కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.


రెండవ కధ :-  అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. *హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. 

*జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు.

* కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. 

*అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా  మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. 

*ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది.


*ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. 

*జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారా ప్రవేశం తొలుగుతుంది.

* మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భై అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసినా వాళ్ళు ఎవరు ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. *అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. 

*ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు.

* అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు. 

*అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు....


*శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. 

*జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. 

*కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి....

****ఓం కార్తీక దామోదరాయ నమః ****

శివమహిమ

 శు భో ద యం🙏


శివమహిమ!!


విశ్వనాధసత్యనారాయణ!


కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త

త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం

బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే

హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా!


ఇది విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షావతారికయందలి రెండవ పద్యం. కైలాసాచలసానువాసము అనగానే నాకు మొదట తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలోని పద్యం గుర్తొచ్చింది.


* * *


కైలాస-అచల-సాను-వాసము వృష-స్కంధ-అగ్ర-సంస్థాయి తత్-ప్రాలేయ-అచల-కన్యకా-కుచ-తటీ-పర్యంక-నిద్రా-ఆగతంబు ఆలోల-అగ్ర-జటా-తటీ-ఘటిత-నాక-ఓకస్-సరిత్కంబు దేహ-అలంకారిత-లేలిహానము వెలుంగు అర్చింతు విశ్వేశ్వరా


సం అంటే సమ్యక్, బాగుగా. స్థా గతినివృత్తౌ అని ధాతువు, అంటే గమనరహితమైన స్థితి. ప్రాలేయము మంచు. పర్యంకము మంచము. ఓకస్సు అంటే నివాసం. నాకౌకస్సు అంటే స్వర్గము నివాసముగా కల. "ఆలోల"లో లోల కంపిస్తున్న, ఆ స్వల్పత్వాన్ని సూచిస్తుంది. లేలిహానము అంటే పాము (లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా అని అమరకోశము).


వెలుంగు అన్న పదం ఇక్కడ కీలకం. నిరాకారస్వరూపంగా అర్చించడమన్నమాట. ఎప్పుడైతే ఇలా నిరాకారస్వరూపంగా తీసుకున్నామో అప్పుడు చెప్పేవన్నీ స్త్రీ-పురుష-నపుంసక-లింగాతీతమైన శివలింగానికి సంబంధించినవౌతాయి కదా.


కైలాస పర్వత సానువులందు నివాసమున్నట్టిది. నందీశ్వరునియొక్క భుజములపైన చక్కగా నుండినది. ఆ మంచుకొండ కూతురైన పార్వతీదేవియొక్క పాలిండ్ల ప్రదేశమనే మంచముపై నిద్రను పొందునది. స్వల్పంగా కదులుతున్న జటాజూటపు పైభాగంలో స్వర్గలోకపు నదిని కలిగినట్టిది. దేహాలంకారముగా పామును చేసికొన్నట్టిది.


కైలాసపర్వతసానువులలో నివాసముంటూ, పాముని గంగని ధరించి, నందీశ్వరుని అధిరోహించి, పార్వతీదేవిపాలిండ్లపై నిద్రపోయే స్వరూపంగా కనిపిస్తున్న వెలుగువైన విశ్వేశ్వరా! నిన్ను కొలుస్తాను అని తాత్పర్యం.🙏🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కార్తీక పురాణం - 15

 _*🚩కార్తీక పురాణం - 15 వ అధ్యాయము🚩*_


🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️


*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*


☘☘☘☘☘☘☘☘☘


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా ! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని , మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.


ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట , చేయుట , శివకేశవులవద్ద దీపారాధనను చేయుట , పురాణమును చదువుట , లేక , వినుట , సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల , విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి , చతుర్దశి , పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.


ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను , లేక , ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు , వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.


సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి , నీళ్లతో కడిగి , బొట్లుపెట్టి , ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులుజేసి , పండ్రెండు దీపములుంచి , స్వామిని పూజించుచు , నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి , నలుమూలలు వెదకి , తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను , శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.


ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా , ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి *"ఓయీ ! నీవెవ్వడవు ? ఎందుకిట్లు నిలబడియుంటివి ?"* అని ప్రశ్నించగా , *"ఆర్యా ! నేను మూషికమును , రాత్రి నేను ఆహారమును వెతుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ , నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని , ఓ మహానుభావా ! నేను ఎందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"* మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని , *"ఓయీ ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ , ధనాశపరుడై దేవపూజలు , నిత్యకర్మలు మరచి , నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు , మంచివారలను , యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు , సమస్త తినుబండారములను కడుచౌకగా కొని , తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి , అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన , నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి , ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"* మని అతనికి నీతులు చెప్పి పంపించెను.


*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*

76. " మహాదర్శనము

 76. " మహాదర్శనము " -- డెబ్భై ఆరవ భాగము-- సంభావనలు


76. డెబ్భై ఆరవ భాగము--  సంభావనలు


         మరుసటి దినము అపరాహ్ణపు దిగుపొద్దులో రాజసభ ,  రాజ భవనములో సమావేశమైనది. సర్వజ్ఞ కానుకను ఏమి చేయవలె ననునది ఆ దినపు పర్యాలోచన యొక్క విషయము. 


         " భగవానులకు వచ్చినది కాబట్టి , అదంతా వారికే ఇవ్వవలెను యని ఒక మతము. " " భగవానులు అప్పుడే దానిని మీకు తోచినట్లు వినియోగించండి అని చెప్పినారు. కాబట్టి మనమంతా కూర్చొని మనకు తోచిన రీతిలో వినియోగించవలెను. " అని ఇంకొక మతము. ఇద్దరికీ ఆమోదమగునట్లు చర్చ జరిగి  చివరికి , " దానిలో సగమును గురుకులమునకు కానుకగా అర్పించెదము. మిగిలినది బయటినుండీ వచ్చిన , మరియూ ఆస్థానపు విద్వాంసులకు యథోచితముగా పంచెదము " అని నిర్ణయించినారు. 


          ఇదంతా ముగుస్తుండగా మేస్త్రీ వచ్చి కనపడినాడు. " మహాస్వామి వారి ఆజ్ఞ అయినట్లు , సవత్సములైన సహస్ర గోవులను సర్వ సౌకర్యములతో ఉంచుకొనుటకు అనుకూల మగునట్లు ఆశ్రమములో  ఏర్పాట్లు చేసినాము. " అని నివేదించినాడు. 


" ఎంతమంది మనుషులను ఇచ్చినారు ? "


" గో సేవకనే నలభై కుటుంబములు నిర్ణయమైనవి. వారందరికీ నాయకుడై , సకుటుంబుడైన ఇంకొకడు. మొత్తం నలభై ఒక్క కుటుంబములు. "


" వారందరూ సుఖముగా ఉండునట్లు ఇళ్ళూ వాకిళ్ళూ కట్టించి ఇచ్చినారా ? "


" అయినది , మహాస్వామీ " 


" పశువులకు పాకలు,  కోష్టములు అయినాయా ? "


" అనుమతి అయితే వివరముల నన్నిటినీ ఇచ్చెదను. " 


" వివరములు వద్దు. మేము ఆశ్రమమునకు గోదానము చేసినందుకు ఆశ్రమవాసులకు దాని వలన ఇబ్బంది కాకూడదు , అంతే! "


         " సరే  , గోవులకు , దూడలకు , ఎడ్లు , ఆబోతులకూ అంతా వ్యవస్థ అయినది. ధాన్యాలు , గడ్డి , మేత, దాణాలు నింపి పెట్టుకొనుటకు గోదాములు , గాదెలూ అయినాయి. గోవులు మేసి వచ్చుటకు గోవనములను విభజించినాము. వాటికీ , గొల్లలకూ ఆహారమును , ధాన్యములనూ పెంచుటకు కావలసినంత భూమి కేటాయించినాము. "


         " సరే , సర్వ విధములా ఈ దానము సుఖకరముగా ఉండవలెను. భగవానులు అక్కడికి వచ్చువరకూ మనవైపు అధికారి యొకరు ఉండనీ. వారు వచ్చిన తరువాత , వారికి సర్వమునూ అప్పజెప్పి వారి అనుమతి పొంది రావచ్చును. "


" ఆజ్ఞ "


" భగవానులు ఆశ్రమమునకు ఎప్పుడు దయచేస్తారంట ! "


" అదింకా స్పష్టముగా తెలియదు. "


" భగవతివారు వెళతారేమో చూడండి "


’ లేదు , మహాస్వామీ , వారు ఇక్కడికే వస్తున్నారు. వెంట రాజపురోహితులు కుడా వచ్చినట్లుంది. 


భగవతికీ , అశ్వలులకు దారి ఇచ్చి మేస్త్రీ అటు జరిగినాడు. రాజు లేచి వారిని ఆహ్వానించినాడు. 


        రాజే మొదట మాట్లాడినాడు : " జ్ఞాన సత్రము ఆరంభమయిన దినము నుండీ తమరిద్దరిలో ఎవరినీ ప్రత్యేకముగా చూడలేదు , కోపము లేదు కదా ? "


        అశ్వలుడు అన్నాడు: " సన్నిధానము జ్ఞాన సత్రము జరిపించినది మా బుద్ధి పరివర్తన యగుటకు కారణమైనది. మేమంతా నోటితో ఏమేమో చెప్పుచుంటిమి. దానికి ప్రత్యేకమైన అర్థమున్నదని మా మనసుకు తోచి యుండలేదు. ఇప్పుడంతా వేరే అయిపోయినది. " 


          గార్గి అందుకున్నది , " మేమంతా బ్రహ్మవాదులము. అయినా అదేమయినదో ఏమో గానీ , బ్రహ్మము పరిపూర్ణము అని నోటితో చెప్పుచూ చెప్పుచూ కేవలము బహిర్ముఖులముగనే ఉంటున్నాము. మేము సరే , ఉద్ధాలక అరుణులు , ఉషస్తులు , కహోళులు , వీరందరూ ప్రఖ్యాతులైనవారు. వీరందరూ శరణాగతి అయినారు అంటే ఆ బ్రహ్మజ్ఞుని అంతస్తేమిటి ? ఎంతటిది ? ముఖ్యముగా మాకు ఏ జన్మలోదో పుణ్యము పరిపక్వమై ఈ జ్ఞాన సత్రములో భాగస్వాముల మైనాము. "


          రాజు అన్నాడు, " తామందరూ ఇలాగ పొగడుతున్నందు వలన , మాకు కూడా  ఈ జ్ఞాన సత్రము వలన కలిగిన లాభము చెప్పెదము. మేము మాకు కలిగిన స్వప్నముల విషయము చెప్పినాము కదా ? అక్కడ స్వయం దేవగురువులు అనుజ్ఞ ఇచ్చినందువల్లనే ఈ సర్వజ్ఞాభిషేకమును నిర్వహించినది. వారు , సర్వజ్ఞుడే గెలుచును అన్నారు. మనము దానిని ఇటు తిప్పి , గెలిచినవాడే సర్వజ్ఞుడు అన్నాము. ఆ దినము మీరు గంగా స్నానము సంగతి చెప్పిన దినము నుండీ భగవానులే సర్వజ్ఞ పీఠమును అధిరోహించే వారేమో యని యనిపించెడిది. ఇప్పుడు అది నిర్వివాదమై ధృవీకరించబడినది. "


          " నేనే కదా మొదట లేచి ప్రశ్నను అడిగినవాడిని , అప్పుడేమయిందో తెలుసా ? అక్కడ కూర్చున్నది మేము చూచిన దేవరాతుల కొడుకైన యాజ్ఞవల్క్యుడు కాదు. ఏదో ఒక తేజోరాశి అనిపించి మాట్లాడుటకే భయమైనది. ఇంటికి వచ్చి స్నానము చేసి మరలా అగ్నిహోత్రమును చేయువరకూ ప్రకృతస్థుడ నగుటకు కాలేదు. "


" మీరు చెప్పే దాంట్లో ఆవగింజంత కూడా అబద్ధము లేదు. అయినా నా మనసు విదగ్ధులు దగ్ధమైనపుడు కలచివేసింది. " 


         " తమరన్నది నిజము. మాకూ అటులే అయినది. ఎంతైనా గురువులు కదా ? మేము వారి పాద మూలలో కూర్చొని నేర్చుకోలేదా ? అయిపోయింది. ఇక చేసేదేముంది ? "


        " సన్నిధానము వేయి చెప్పండి , నాకైన దుఃఖములో నేను నేరుగా భగవానుల వద్దకు వెళ్ళి ఏడ్చేసినాను. విదగ్ధులకు ఉత్తమ గతి దొరకవలెను అని ప్రార్థించినాను. వారు కూడా పెద్దమనసుతో అటులే అగును అన్నారు. " అని వెనుకటి దినము భగవానులు చెప్పినదంతా చెప్పినది. 


అశ్వలుడన్నాడు. " అట్లయితే అది దేవతా కోపము వలన అయినది. నేను భగవానులే కోపించి అటుల చేసిరేమో అనుకున్నాను. " 


        గార్గి అన్నది :" ఏమో , అయినది అయినది. ఇప్పుడు వారి గురుకులమూ , వారి కుటుంబమూ వారు లేరని వ్యథ పడకుండా చేయుట మహాస్వామి వారి చేతిలో ఉంది "


       రాజు , వ్యథతో సంకోచించిన మనసుతో అన్నారు. " ఆ విషయములో మేమూ తమరి వలెనే చాలా వ్యథ చెందినాము. అందువలన తాము చెప్పినట్లే చేయుటకు సిద్ధముగా ఉన్నాము. " 


        " తమరు వారికి ఏమేమో ఇవ్వవలె ననుకున్నారు. ఈ దినము సర్వజ్ఞ కానుకలో సగమును విద్వాంసులకు పంచెదము అన్నారు. అదీ ఇదీ అంతా చేర్చి వారికోసమై ఒక లక్ష అట్టిపెట్టండి. దానిలో వారి కుటుంబమునకు సగము , గురుకులానికి సగము ఇప్పించండి. "


       " అటులనే. ఇంకొక సమాచారము విన్నారా ? కురు పాంచాల దేశపు విద్వత్సమూహమంతా నిన్ననే ఇక్కడినుండీ వెళ్ళిపోయినారంట!  వారిలో ఒక్కరు కూడా లేరు. "


        " పాపము , కొమ్ములు పోగొట్టుకున్న వృషభము వలెనే అయినవి వారి పాట్లు. ఏమి మహా విశేషము ? కాకపోతే , వారిలోని విద్వత్ప్రముఖులంతా కలిసి వచ్చి చెప్పి విదగ్ధులను ముందుకు తోసినారు పాపం. వారికి మాత్రమేమి తెలుసు ఇలాగవునని ! ఇట్లయిన తరువాత వారు యే ముఖముతో యింకా ఇక్కడే ఉంటారు ? ఏమైనా సరే , ఎవరెవరు వచ్చియున్నారు అన్నది తెలుసు. సన్నిధానమునకు సమ్మతమైతే , వారందరికీ ఒకటికి రెండుగా ఇవ్వవలెను. " 


" చాలా మంచి సలహా. అదీకాక, కురుపాంచాల విద్వాంసు లంతటి విద్వాంసులు ఈ పృథ్విలో ఎక్కడ వెదకిననూ దొరకరు. కాబట్టి వారికై ఇలాగ చేయుట సర్వథా సాధువైనది. "


మహారాజులే అన్నారు : " ఇదే కాక ,  వాదములో భాగులైన వారందరికీ విశేషమైన సంభావనలు ఇవ్వవలెననీ నిర్ణయించు కున్నాను. " 


     " మేమిద్దరం వాదములో భాగులైన వారము. కాబట్టి మేము మాట్లాడ కూడదు. అయినా తమరి యోచన సాధువైనది. అంత మాత్రమే చెప్పగలము. "


     " సరే, తమరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషమైనది. సర్వజ్ఞ కానుకగా వచ్చినదానితో పాటు మరికొంత చేర్చి వితరణ చేసెదము. " 


" అటులనే "


        గార్గి, " నాకొక సందేహమున్నది. చెప్పవచ్చును అంటే చెప్పేస్తాను. అయితే నానుండీ సమాధానము చెప్పించుట మాత్రము కారాదు. సన్నిధానము నాయంత స్పష్టము గానే తమ మనసులో నున్నది చెప్పవలెను " 


" అటులనే , అనుజ్ఞ ఇవ్వండి " 


     " వెనుక ఒకసారి అనుజ్ఞ ఇచ్చియుంటిరి. : భగవానులకు తమరిని శిష్యులుగా పరిగ్రహించవలెను అని అడిగినపుడు ’ గురు-శిష్య పరీక్షయైన తరువాత ఆ మాట ’ అన్నారని. ఇప్పుడు ఈ జ్ఞాన సత్రము జరిపినది ఆ గురు పరీక్షకేనా ? "


         మహారాజు నవ్వినాడు:  " తమరు అనుకున్నది చాలా సరిగ్గా ఉంది.  విద్వత్ప్రియులని ప్రఖ్యాతమైన, దానమునకు ప్రసిద్ధమైన ,  వంశములో పుట్టినవారు ఎలాగ చేయవలెనో అలాగ చేసినాను.   అన్నిటికన్నా మిన్నగా దైవ సహాయము కలిసి వచ్చింది. విదగ్ధుల మరణము ఒక్కటీ తప్ప , ఇక అన్నివిధములా జ్ఞాన సత్రము ససూత్రముగా , యథోచితముగా , జరిగినది యని నా నమ్మకము. అయితే , చూచినవారు మీరు  , ఈ విషయమును చెప్పవలెను. " 


         అశ్వలుడన్నాడు : " వెనుకటి మహారాజు ఇఛ్చ కూడా ఈడేరింది.  మన విదేహ రాజ్యములో కురు పాంచాలుల విద్వాంసులను మించగల విద్వాంసుడు పుట్టవలెనని వారి కల. వారుగనక ఈ జ్ఞాన సత్రములో ఉండి ఈ సర్వజ్ఞాభిషేకమును చూచి ఉంటే ఎంత సంతోషించెడి వారో ? అంతేనా ? సన్నిధానము ఆ కిరీటమును భగవానుల తలపైన పెట్టినపుడు నాకైతే ఒక ఘడియ వెనుకటి మహారాజులు తమలో ఆవాహన అయినట్లే కనబడు చుండినది. "  


      " భగవానులు సామాన్యులు కారు. వారి దగ్గర కూర్చుంటే ఏదో దివ్య తేజస్సు నొకదానిని పట్టి పురుష విగ్రహమై అచ్చుపోసినట్టుండినది. అబ్బా ! ఆ దృశ్యమును గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు ఝుమ్మంటుంది. "     


        అశ్వలుడు మరలా అన్నాడు: " వెనుక బుడిలులు అనేవారు, అతడు తపోలోకము నుండీ లోకోద్ధారమునకై వచ్చిన వాడయ్యా ! ముందు ముందు అతని వలన ఏమేమి కావలసి యున్నదో ! చూస్తూ ఉండండి’ అనేవారు. అంతేకాక , అతడు అతి పిత , అతి పితామహుడయ్యా , అనేవారు. అయితే మేమెవ్వరూ ఆ బాల యాజ్ఞవల్క్యుడు  ఇలాగ భగవానులై సర్వజ్ఞులవుతారని అనుకొని యుండ లేదు. ఇప్పుడు ఆ మహా పురుషుని ఆశ్రమము గంగా సాగరము వలె యాత్రాభూమి యైపోయినది "


        " ఇది దేశ విదేశముల అధిపతుల సమక్షములో , విద్వాంసుల సమ్ముఖములో జరిగినది ఇంకా మంచిదైంది. సరే , గురు పరీక్ష అయినది. ఇప్పుడు సన్నిధానము చేయవలె ననుకున్నది యేమి ? "


" యేమి ఏమిటి ? భగవతి ఏమి చెప్పితే అదే. ! "


        " మేమెంతయిననూ వచ్చిన నగకు  అలంకారము చేయువారము మాత్రమే! నగలను చేయించు వారము కాదు. సన్నిధానము యేమేమి చేయవలెనని ఉన్నదీ చెప్పితే , దాన్నే పట్టుకొని , ఇలాగ చేయండి , ఇలాగ చేయవద్దండి అని చెప్పేవారము. కాబట్టి , మొదట అక్కడి నుండీ అనుజ్ఞ కావలెను. " 


        " మేమూ దానినే ఆలోచిస్తున్నాము. ఇంకా దారి తోచలేదు. భగవానులను ఇంకా కొన్ని దినములు ఇక్కడే నిలిపి ఉంచుకొని, ఈ దేశ విదేశముల అధిపతుల సన్నిధానములో వారి సేవకు ఈ విదేహ రాజ్యమునూ , మమ్ములనూ అర్పించు కొనుటయని ఒక మనసు. అయితే , బ్రహ్మవిద్య ఏమైననూ గురు శిష్యులకు మాత్రమే సంబంధించినది. కాబట్టి భగవానులను ఏకాంతములో చూచి వారినుండీ ఉపదేశము పొందవలెను అని ఇంకొక మనసు. "


         గార్గి తలాడించినది . " మొదటిగా తమరు ఈ రాష్ట్రాధిపతుల సమ్ముఖములో రాజ్య దానము చేయుట మంచిది. అయితే , దానికి భగవానులు ఒప్పుకుంటారనే నమ్మకము నాకు లేదు. రాజ్యము తమరిది కాదు , అది తమ కుల ధనము. ఉన్నంత వరకూ రాజ్యాధికారమును సన్నిధానము అనుభవించవచ్చునే కానీ , తమరు దానము చేయవచ్చునని నాకు అనిపించుట లేదు. నా బుద్ధికి తోచిన విషయము భగవానుల బుద్ధికి తోచదను మాటే లేదు. కాబట్టి అది సాధ్యము కాదు. రెండవది సన్నిధానము క్షత్రియులు. బ్రాహ్మణులైతే అన్నిటినీ త్యాగము చేసి వైరాగ్యముతో వెళ్ళి పోవచ్చును. క్షత్రియుడు అటుల చేయుటకు లేదు. అతడు బహిర్వ్యాపారములో ధర్మమును వదలి పోవుటకు లేదు. ఏదున్ననూ , అభ్యంతర వ్యవహారములో బ్రహ్మారాధనను పెట్టుకోవచ్చునే గానీ బాహ్యాభ్యంతరములు రెండింటిలోనూ బ్రాహ్మణుని వలె బ్రహ్మ పరాయణుడగుటకు లేదు. చివరిగా ఉద్ధారమును ఆపేక్షించు సన్నిధానము భగవానులను వెదకికొని వెళ్ళునదే సరి. కాబట్టి , ఈ సారి తమరు దేశాధిపతుల నందరినీ పిలుచుకొని వెళ్ళి భగవానులను ఆశ్రమమునకు వదలి రండి. శుభమైన తిథి వారములను చూచుకొని , శాస్త్రములో చెప్పిన ప్రకారముగా , తమరు మిత్ర సమేతులై వారిని ఆశ్రయించండి. వారు తమరిని తప్పకుండా అనుగ్రహిస్తారు. "   "   


        " రాజు అశ్వలుల ముఖమును చూచినారు. అశ్వలుడు, " భగవతి అనుజ్ఞ ఇచ్చినది సరియని తోచుచున్నది. శాస్త్ర దృష్టితో అలాగ చేయుట శ్రేయస్కరము. బ్రహ్మబోధనమును పొందుట అనేది ఆత్మోద్ధారపు విషయము. రాజ్యపు విషయములో మాత్రము ఇది ఖచ్చితముగా స్వంత విషయము కాదు. దీనిని దానము చేయుటకు లేదు. ఈ ధర్మ బ్రహ్మల రెండింటిలోనూ భగవతి యొక్క అభిమతము సాధువైనది. " 


         రాజు భగవతి అభిప్రాయమును సంపూర్ణముగా ఆమోదించినారు. ఇంక రెండు దినముల తరువాత తిథి వార నక్షత్రములు బాగున్నవనీ , ఆ దినము ప్రయాణము చేసి వెళ్ళుట శుభమనీ నిర్ణయించబడినది. 


       మరుదినము భూరి భోజనము , విద్వత్సంభావనా వినియోగము , దాని మరుసటి దినము ప్రస్థానము అని నిర్ణయమైనది. 


       రాజభవనపు రాజపురుషుడొకడు సపరివారుడై వెళ్ళి భగవానులనూ , మిగిలిన విద్వాంసులనూ చూచి ఏమేమి చెప్పవలెనో అంతటినీ చెప్పి వచ్చినారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

Janardhana Sharma

*15, నవంబరు, 2024*🪷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌹 *శుక్రవారం*🌹

🪷 *15, నవంబరు, 2024*🪷    

       *దృగ్గణిత పంచాంగం*


           *ఈనాటి పర్వం* 

      🪔 *కార్తీక పౌర్ణమి* 🪔 

           *జ్వాలాతోరణం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి     : చతుర్దశి* ఉ 06.19 ఉపరి *పౌర్ణమి* రా 02.58 వరకు 

*వారం : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : భరణి* రా 09.55 వరకు ఉపరి *కృత్తిక*


*యోగం  : వ్యతీపాత* ఉ 07.30 *వరీయాన్* రా 03.33 వరకు

*కరణం  : వణజి* ఉ 06.19 *భద్ర* సా 04.37 ఉపరి 

*బవ* రా 02.58 వరకు ఆపైన *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 05.38 - 07.04*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.15*


*వర్జ్యం         : ఉ 09.06 - 10.31*

*దుర్ముహూర్తం  : ఉ 08.27 - 09.13 మ 12.15 - 01.00*

*రాహు కాలం   : ఉ 10.27 - 11.52*

గుళికకాళం      : *ఉ 07.36 - 09.02*

యమగండం  : *మ 02.42 - 04.08*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 06.11* 

సూర్యాస్తమయం :*సా 05.33*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.11 - 08.27*

సంగవ కాలం :*08.27 - 10.44*

మధ్యాహ్న కాలం  :*10.44 - 01.00*

అపరాహ్న కాలం:*మ 01.00 - 03.16*

*ఆబ్ధికం తిధి       : కార్తీక పౌర్ణమి*

సాయంకాలం  :  *సా 03.16 - 05.33*

ప్రదోష కాలం   :  *సా 05.33 - 08.05*

రాత్రి కాలం    :  *రా 08.05 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.30 - 05.21*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷

    

*యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /*

*గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //*


🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷   


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

🌹🍃🌿🌷🌷🌿🍃🌹

కార్తీక పురాణం*_🚩 _*14

 🕉️🌹🪔🛕🪔🌹🕉️

        🌹 *శుక్రవారం*🌹

🕉️ *నవంబరు 15, 2024*🕉️


🚩 _*కార్తీక పురాణం*_🚩    

   _*14 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*

*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*


☘☘☘☘☘☘☘☘☘


మరల వశిష్ఠులవారు , జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.


ఓ రాజా ! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట , శివలింగ సాలగ్రామములను దానముచేయుట , ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.


వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక , దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గుర్తుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు , సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.


*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు , తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన , సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి , అమావాస్య , సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు , విధవ వండినది తినరాదు. ఏకాదశీ , ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు. చేసిన,    కల్లుతో సమానమని  బ్రహ్మదేవుడు చెప్పెను. కావున , వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ , గోదావరి , సరస్వతి , యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని , చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.


*గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |*

*నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||*

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం , హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.


*కార్తీకమాస శివపూజాకల్పము*


ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి

ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి

ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి

ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి

ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి

ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము , వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన , తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల , వారికీ , వారివంశీయులకు , పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క , కుక్క , పంది , పిల్లి , ఎలుక   మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను , పురాణము చదివినను , విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.


*ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి చతుర్దశి అధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము.*


            🌷 *సేకరణ*🌷

          🌹🪔🕉️🕉️🪔🌹

                  *న్యాయపతి*

              *నరసింహా రావు*

           🙏🙏🕉️🕉️🙏🙏

Katyaayani


 

ధవుని సుతుని రతి వరించి తద్దయు మురిసెన్


*ధవుని సుతుని రతి వరించి తద్దయు మురిసెన్*

ఈ సమస్యకు నాపూరణ. 


కవులకు నవతను నింపును


చెవులకు విందౌను మరులు జీవిక నొందున్


భవములు రేపెడి దొర, మా


ధవుని సుతుని రతి  వరించి తద్దయు మురిసెన్.




 *విభవధ్వంస మొనర్పcగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్*

ఈ సమస్యకు నాపూరణ. 


అభయమ్మిమ్మని, రాక్షసాళి కృతమౌ యన్యాయముల్ బాధలున్ 


క్షభముల్ జీవన కంటకంబులగు ప్రక్షాళించగా, దర్పమౌ 


విభవ ధ్వంసమొనర్పగా - మురహరున్ వేడన్ వలెన్ మానవుల్ 


ఖభముల్ తారకలున్ లిఖించె నదిగో క్రాంతంబులన్ జూపుచున్. 

(క్షభములు =కలతలు 

ఖభములు =గ్రహాలు) 


అల్వాల లక్ష్మణ మూర్తి

ఉల్లిపాయ దరుగ

 ఉల్లిపాయ దరుగ నువిద యుపాయంబు


మెచ్చితీరవలయు మేదురముగ


ముసుగు నిండ వేసె ముఖమున కవచంబు


ముచ్చటైన విధమె మురియవలయు.



అల్వాల లక్ష్మణ మూర్తి

15.11.2024,శుక్రవారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

15.11.2024,శుక్రవారం



ఈ రోజు కార్తీక పూర్ణిమ


*ఆగ్నేయంతు యదావృక్షం కార్తిక్యాం భవతి క్వచిత్‌ మహతీ సా తిథి: జ్ఞేయా స్నాన దానేషు చోత్తమా యదాతు యామ్యం భవతి ఋక్షం తస్యాం తిథౌ క్వచిత్‌ తిథి స్సాపి మహాపుణ్యా మునిబి: పరికీర్తితా ప్రాజాపత్యం యదా ఋక్షం తిథౌ తస్యాం నరాధిప సా మహా కార్తీకీ ప్రోక్తా దేవానామపి దుర్లభా*


అనగా కార్తిక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర యోగమున్నచో ఈ పూర్ణిమను ‘మహాపూర్ణిమ’ లేదా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. భ రణి నక్షత్రం ఉన్నచో ‘మహాతిథి’ అని అంటారు. అలాగే రోహిణి ఉన్నా కూడా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. రోహిణి నక్షత్రంతో కూడిన పూర్ణిమ దేవతలకు కూడా లభించదని హేమాద్రి మరియు బ్రహ్మ పురాణాల ద్వారా తెలుస్తోంది.


*విశాఖాసు యదా భాను: కృత్తికాసుచ చంద్రమా: సయోగ: పద్మకోనామ పుష్కరే ష్వతి దుర్లభ: పద్మకం పుష్కరే ప్రాప్య కపిలాం య: ప్రయచ్ఛతి హిత్వా సర్వపాపాని వైష్ణవం లభతే పదం*


అనగా సూర్యుడు విశాఖ నక్షత్రంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నచో పద్మక యోగమని, ఈ యోగమున పుష్కర తీర్థమున స్నానమాచరించి కపిల గోదానం చేసినచో పాపవిముక్తులై వైకుంఠమును చేరెదరని పద్మపురాణ వచనం.


*కార్తిక్యాం పుష్కరే స్నాత: సర్వపాపై: ప్రముచ్యతే మాఘ్యాం స్నాత ప్రయాగేతు ముచ్యతే సర్వ కిల్బిషై:*


కార్తిక పూర్ణిమ నాడు పుష్కర తీర్థమున స్నానం ఆచరించినా మరియు మాఘపూర్ణిమ నాడు ప్రయాగలో స్నానం మాచరించినా పాపవిముక్తులు అగుదురు. కార్తిక పూర్ణిమ నాడు శ్రీహరి మత్స్య రూపం ధరించాడని యమస్మృతి ద్వారా తెలుస్తోంది.


 *వరాన్‌ దత్వా యతో విష్ణు: మత్స్య రూపీ భవేత్‌ తత: తస్యాం దత్తం హుతం జప్తం తదక్షయ్య ఫలం స్మృతం* 


పద్మపురాణంలోని కార్తిక మహాత్మ్యం ద్వారా కార్తిక పూర్ణిమనాడు శ్రీహరి బ్ర హ్మకు వరమిచ్చి మత్స్యరూపమును ధరించెను కావున ఈనాడు చేసిన దానం, హోమం, జపం అక్షయ ఫలాలను ఇచ్చునని శ్లోకార్థం.


*పౌర్ణమాస్యాంతు సంధ్యాయాం కర్తవ్య: త్రిపురోత్స:*

*దద్యాత్‌ అనేన మంత్రేణ ప్రదీపాంశ్చ సురాలయే కీకా: పతంగా: మశకా: వృక్షా: జలే స్థలేయే విచరంతి జీవా: దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన: భవంతి నిత్యం స్వపచాహివిప్రా:*


కార్తిక పూర్ణిమ నాడు సంధ్యాసమయంలో త్రిపురోత్సవాన్ని జరిపి పై మంత్రాన్ని పఠిస్తూ దేవాలయంలో దీపాలను వెలిగించాలి. కీటకాలు, దోమలు మొదలైనవి మరియు చెట్లు, ఉభయచరాలు కూడా ఈ దీపమును దర్శించినచో పునర్జన్మ ఉండదు. ఈ దీపాన్ని దర్శించినవారికి కోరిన ఫలము దక్కును.


*కార్తిక్యాం య: నరోలోకే ధాత్రీ ఫల రసస్నాయీ తులసీ అర్చనం కృత్వా మహావిష్ణుం ప్రపూజ్యచ బ్రాహ్మణాం పూజయిత్వాచ నపున ర్లభతే భవమ్‌*


అనగా కార్తికపూర్ణిమ నాడు ఉసిరి రసంతో స్నానమాచరించి తులసిని, శ్రీమహావిష్ణువును పూజించి బ్రాహ్మణులకు, బీదలకు వస్త్రదానం, సంతర్పణ చేసినచో పునర్జన్మ ఉండదు...

తులసి వివాహం

 _*తులసి వివాహం , ఈ పండుగ ప్రాముఖ్యం , పూజా విధులు*_


మన దేశంలో హిందువులకు తులసి పండుగ చాలా పవిత్ర మైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తిక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపు కుంటారు. 


ఈ రోజున హిందూ భక్తు లందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను జరుపు కుంటారో ఈ కథలో తెలుసుకుందాం.


*హిందూపురాణాల ప్రకారం*


హిందూపురాణాలలో తులసీదేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవు ళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తూ ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.


*పెళ్లి తర్వాత పెరిగిన శక్తి*


ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి , పవిత్రతల వల్ల జలంధరుడి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేక పోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్తవిశ్వానికీ అధిపతి కావాలని కలలు గంటాడు. ఈ సమయంలో దేవుశళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించు కుంటాడు.


*జలంధరుని రూపంలో విష్ణువు*


పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా , విష్ణువు వృంద వద్దకు జలంధరుని రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తు పట్టలేక అతడే జలంధరు డని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రతా నిష్ఠ భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజ రూపాన్ని చూడకోరుతుంది. ఆమె తాను పూజించిన దేవుడే తనను మాయ చేశా డని తెలుసుకుని బాధ పడుతుంది.


*వృంద శాపం*


శ్రీమహావిష్ణువు మారు రూపం తెలుసుకుని , తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువును రాయిగా మారి పోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద సాలగ్రామ శిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతు డవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ , తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.


*లక్ష్మీదేవి విజ్ఞప్తి*


మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆప మని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు సాలగ్రామరూపం, వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంత మవుతుం దని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. (ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ - ప్రేరణచర్య). ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిం దని పురాణాల ప్రకారం తెలిసింది.


*తులసి పూజావిధానం*


తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి.

మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును కూడా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు.

ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులను అలంకరించండి.

విఘ్నేశ్వరుడు, ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలగ్రామాన్ని కూడా ఆరాధించండి.

తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ, చక్కెర బొమ్మలు, ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి, సాలగ్రామాలను జపిస్తూ ప్రార్థించండి.


*పండుగ ప్రాముఖ్యం*


తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజ చేస్తే వారికి పరిష్కారం లభిస్తుం దని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుం దని చెబుతారు.


*ద్వాదశ దీపాలు*


క్షీరాబ్ధి ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంకాలవేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క, లేదా తులసి చెట్టు దగ్గర ధాత్రి (ఉసిరిక మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇల్లూ దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతుంది. 


*తులసి మొక్కను గౌరీదేవిగా*


తులసి మొక్కను గౌరీదేవిగా , ఉసిరిక మొక్కను శ్రీమహా విష్ణువుగా పూజించడం వల్ల , గౌరీపూజ చేయడం వ్లల ఆర్థికబాధలు తొలగి , సర్వ సంపదలూ కలుగుతాయి. ఉసిరిక మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి , స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటే కరవు అనేది ఉండదు , కార్తిక మాసంలో ఉసిరిక, తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది.


*తులసి స్తుతి మంత్రం*


*దేవత త్వం నిరితా పూర్వమర్చితసి మునీశ్వరయః నమో నమస్తే తులసీ పాపం హర హరిప్రియా.*


*తులసి పూజా మంత్రం*


*తులసీ శ్రీమహాలక్ష్మీ విద్యావిద్యా యశస్వినీ ।*

*ధర్మాయ ధర్మాననా దేవి దేవీదేవమాన్:* *ప్రియా లభతే సూత్రమాన్ భక్తిమన్తే విష్ణుపదం లభేత్ ।*

*తులసీ భూమ్హాలక్ష్మీః పద్మినీ శ్రీహరప్రియా ।* 


*తులసి ధ్యాన మంత్రం*


*తులసీ శ్రీమహాలక్ష్మీ విద్యావిద్యా యశస్వినీ ।*

*ధర్మాయ ధర్మాననా దేవి దేవీదేవమాన్:* *ప్రియా లభతే సూత్రమాన్ భక్తిమన్తే విష్ణుపదం లభేత్ ।*

*తులసీ భూమ్హాలక్ష్మీః పద్మినీ శ్రీహరప్రియా ।*


🌹👏🏽🌷

కార్తీక దీపాలు

 *🪔కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి?🪔*


*దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం.*


దైవ భక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయిన కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు.


కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలున్నాయి.


ఈ నెలరోజులూ ఇంట్లో దీపాల కన్నా చెరువులు, నదుల్లో దీపాలు వదులుతుంటారు. ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతుంటంది. సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. ఇంతకీ కార్తీకమాసం నెలరోజులూ నదుల్లో, చెవులుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు.

దీని  వెనుకున్న ఆంతర్యం ఏమిటి?

నమామీశ్వరం ప్రాణేశ్వరం

పంచభూతేశ్వరం

అనాదీశ్వరం ఆదీశ్వరం

సర్వకాలేశ్వరం

శివమ్ శివమ్ భవ హరం హరం

శివమ్ శివమ్ భవ హరం హరం


ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు.


శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం.


శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలున్నాయి. ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే.


పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు.


ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా.


ముందుగా శివం-పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది.


ఆత్మ జ్యోతి స్వరూపం.


ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు


జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని, పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలోని ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే.


ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు.


అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు.


అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.


విష్ణువును తులసి దళాలు, కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో.... శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు.


ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు.



ఓం నమో భగవతే దామోదరాయ


*🙏ఓం నమః శివాయ.

పంచాంగం 15.11.2024

 ఈ రోజు పంచాంగం 15.11.2024

Friday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి భృగు వాసర: భరణి నక్షత్రం వ్యతిపాత తదుపరి వరియాన్ యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


ఈరోజు జ్వాలాతోరణం


శుభోదయ:, నమస్కార: