28, మే 2021, శుక్రవారం

Aanandaiah medicine preparation

 https://drive.google.com/file/d/17JV1XGNYnryQ6KxgZa4k5rmVzN6ht7OT/view?usp=drivesdk

కుంభ్‌కు కోవిడ్‌కు సంబంధం లేదు

 కుంభ్‌కు కోవిడ్‌కు సంబంధం లేదు. సాక్ష్యాలతో, సశాస్త్రీయంగా ఋజువుచేసే పోస్ట్👇


సాక్ష్యాధారాలతో.. శాస్త్రీయ విశ్లేషణతో..


"కుంభ మేళా, 5 రాష్ట్రాల ఎన్నికలు" కోవిడ్ రెండో వేవ్ కు ఎంతమాత్రం కారణం కాదు అని నిరూపించి.. హిందువుల ధార్మిక కార్యక్రమాన్ని దోషిని చేసే దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి నగ్న సత్యాన్ని కళ్ల ముందు నిలబెట్టే వీడియో..


(క్రింది వీడియోకు తెలుగు అనువాదం)


2021 లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన కుంభమేళా దేశంలో  కోవిడ్ రెండో వేవ్ కు కారణమా? అలాగే ఎన్నికల ర్యాలీలు కరోనా రెండో వేవ్ కు కారణమా?  దేశంలో దుష్ప్రచారానికి టూల్ కిట్ వంటి సాధనాలను వినియోగించే దేశంలోని కొన్ని వర్గాలు కోవిడ్ రెండో వేవ్‌కు కుంభ్‌మేళాయే కారణమని కోడై కూశాయి.. కానీ అసలు నిజం ఏంటి? ఈ వీడియోలో డేటా అనలిటిక్స్ గ్రాఫులు, చార్టులు ఉపయోగించి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.. 


మొదట కుంభమేళా..


2021, జనవరి 26 న  దేశవ్యాప్తంగా 9102 కేసులు నమోదయ్యాయి.. వీటిలో ఆరు వేల కేసులు కేరళలోనే నమోదయ్యాయి.. ఇక మహారాష్ట్రలో 2400 కేసులు నమోదయ్యాయి.. అప్పుడు దేశవ్యాప్తంగా రోజుకు ఒందకు పైగా కేసులు నమోదు చేస్తున్న 20 జిల్లాలో అధిక శాతం జిల్లాలు కేరళ మహారాష్ట్రల్లోనే ఉన్నాయి.. దీనికి అనుగుణంగానే, దేశం మొత్తం మీద ఉన్న అన్ని కేసుల్లో దాదాపు 70% ఈ రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి..


అప్పటినుండి క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చాయి.. ఫిబ్రవరి 26 న దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 16577.. అదే సమయంలో రోజుకు ఒందకుపైగా కేసులు నమోదు చేస్తున్న మొత్తం జిల్లాలు 33 అయ్యాయి.. వీటిలో అధికభాగం జిల్లాలు మళ్ళీ కేరళ మహారాష్ట్రల్లోనే ఉన్నాయి.. ఇదే సమయంలో మొత్తం కేసుల్లో మహారాష్ట్ర కేరళను అధిగమించడం ప్రారంభించింది.. దేశం మొత్తం కేసుల్లో సగం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.. కేరళలో దేశం మొత్తం కేసులో 20 శాతం నమోదయ్యాయి.. ఈ రెండు రాష్ట్రాల కేసులు కలిపితే అవి దేశంలోని మొత్తం కేసుల్లో 72 శాతానికి చేరుకున్నాయి.. గమనించండి, అప్పటికి కుంభమేళా ఇంకా మొదలే కాలేదు.. కానీ కోవిడ్ రెండో వేవ్ దాదాపు మొదలైంది..


ఇక ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుకుంటే.. దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి 26న.. ఆసక్తికరంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడానికి దాదాపు పది రోజుల ముందు నుండే కేసుల్లో పెరుగుదల మొదలైంది.. ఫిబ్రవరి 25న తమిళనాడులో 467 కేసులు నమోదయ్యాయి.. తమిళనాడు కేరళతో సరిహద్దులను పంచుకుంటుంది అనే విషయం ఇక్కడ మనం గమనించాలి..


ఇక ఒక నెల తరువాత అంటే మార్చి నెలాఖరుకు గమనిస్తే దేశంలో ఒందకు పైగా కేసులు నమోదు చేస్తున్న జిల్లాలు 89 కి చేరాయి.. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కడా కోవిడ్ భారీగా పెరుగుతున్న జాడలు లేనేలేవు..  కానీ మహారాష్ట్ర కేరళలోని అన్ని జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి.. మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటకలో మార్చి 26 న 2566 కేసులు నమోదయ్యాయి.. గుర్తుంచుకోండి కుంభమేళా ఇంకా మొదలే కాలేదు..  అలాగే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలనేవి జరగడం లేదు.. కేసుల సంఖ్యలో పెరుగుదల రేటు ఈ రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది.. 2021 మార్చి 25 న మహారాష్ట్ర 35952 కేసులు నమోదు చేసింది.. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కేసుల సంఖ్య 59180.. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ-- ఈ నాలుగు రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కేసుల్లో 73% నమోదయ్యాయి.. ఈ నాలుగు రాష్ట్రాల్లో కుంభమేళా లేదు.. ఎన్నికలు జరగడం లేదు.. అవునా?


దేశంలో కోవిడ్ రెండో వేవ్ కు కుంభమేళా కారణం అనే వాదనను బద్దలు కొట్టడానికి ఈ సమాచారం చాలు.. కుంభమేళా మీద పెట్టిన కేసును కొట్టివేయడానికి.. మూసివేయడానికి.. 


మార్చ్ చివరి వారానికి వచ్చేసరికి రెండో వేవ్ దేశంలో ప్రవేశించేసింది.. కుంభమేళా అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు.. కానీ జనవరి నుండే మహారాష్ట్ర కేరళ పంజాబ్ చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కుతకుత ఉడుకుతున్న  కోవిడ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యా తీసుకోకపోవడంతో అక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.. డేటా పరిశీలిస్తే ఎవరికైనా అది అర్థం అవుతుంది.. ఇప్పుడు ఇంకొక విషయం గమనిద్దాం.. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ లో జరిగిన కుంభమేళా కోవిడ్ రెండో వేవ్‌కు కారణమైతే ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉండాలి కదా.. కానీ కుంభ్ జరిగిన సమయంలో.. మహారాష్ట్రలోని నాసిక్, నాగపూర్.. దక్షిణాదిన ఉన్న విశాఖపట్నం.. ఛత్తీస్గఢ్ లోని రాయ్‌పూర్‌ల పాజిటివ్ రేటు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది..

.


మరి ఎన్నికల సంగతేంటి? 


దేశంలో కోవిడ్ కేసుల పాజిటివ్ రేట్ ఫిబ్రవరిలో ఉన్న 2% నుండి ఏప్రిల్ మొదటి వారంలో 10% కి పెరిగిపోయింది.. ఇది కుంభమేళ మొదలు కావడానికి, ఎన్నికల సభలు ర్యాలీలు జరగడానికి చాలా ముందుగానే జరిగిపోయింది.. మహారాష్ట్ర కేరళలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అప్పటికే.. మార్చిలో ఎన్నికల సభలు జరిగిన అస్సాంలో కేసులు ఎంత మాత్రం లేవు..

.


రైతుల పేరుతో నిరసనలు..


కానీ దేశంలో ఒక వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది అదే రైతు నిరసనలు.. దాని గురించేంటి? దాని గురించి ఎవరూ మాట్లాడలేదు.. ఎవరూ పట్టించుకోలేదు.. ఢిల్లీలో కేసులు పెరిగిపోవడానికి కారణం పంజాబ్ హర్యానాల నుండి ఒచ్చి ఢిల్లీ బోర్డర్ లో 2020 నవంబర్ నుండి తిష్ట వేసిన రైతులే.. ఫిబ్రవరి చివరి నుండి మార్చి మొదటి వారం మధ్యలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కేసులు పెరిగిన విధానం చూడండి.. ఎలక్షన్స్ గాని కుంభమేళాగాని ఈ కేసుల్లో పెరుగుదలకు కారణం కాదుకదా..   


ఫిబ్రవరిలో పంజాబ్‌లో మొదలైన ఈ వేవ్ మార్చిలో హర్యానాలో ప్రవేశించింది.. అక్కడి నుండి ఏప్రిల్ నెలలో ఢిల్లీలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించడం మొదలు పెట్టింది.. ఏప్రిల్ నెలలో కొన్నిరోజులు ఢిల్లీలో కేసులు 25 వేలకు మించి నమోదయ్యాయి.. ఈ మూడు చోట్ల కుంభ్‌మేళా గానీ, ఎలక్షన్ ర్యాలీలు గానీ లేవు, గుర్తుంచుకోండి.. 


పంజాబ్ కేసుల సంఖ్య గమనిస్తే అవి మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి.... అక్టోబర్ 2020 కల్లా కేసులు తగ్గుముఖం పట్టాయి.. కానీ ఆ వెంటనే నవంబర్ 2020 లో ఎప్పుడైతే రైతుల పేరుతో ఆందోళనలు మొదలయ్యాయో  కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభమయ్యాయి.. దీనికి ఇంకొక పార్శ్వం కూడా ఉంది.. అదే.. టెస్టుల సంఖ్యలో తగ్గుదల కూడా చోటు చేసుకుంది.. ఈ ట్రెండ్ మార్చి మొదటి వారం వరకు కొనసాగింది.. ఎప్పుడైతే మార్చిలో టెస్టుల సంఖ్యను పెంచారో కేసుల పాజిటివిటీ రేటు విపరీతంగా పెరిగిపోయింది.. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే.. పంజాబ్‌లో పెరిగిన కేసులకు ఢిల్లీలో కేసుల పెరుగుదలకు అవినాభావ సంబంధం ఉంది.. వీటి మధ్య సంబంధాన్ని బలపరచే డేటా ఏంటంటే B.1.1.7 వేరియంట్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పంజాబ్‌లో ఈ వేరియంట్‌కు చెందిన కేసులు 516 నమోదైతే, ఢిల్లీలో 482 కేసులు నమోదయ్యాయి..


చివరిగా దేశవ్యాప్తంగా రోజుకు ఒంద కేసులు పైనే నమోదవుతున్న జిల్లాల వివరాలు ఇంకొకసారి పరిశీలిస్తే.. జనవరిలో చివరి వారంలో ఇలాంటి జిల్లాలు 20 ఉంటే వాటిలో ఎక్కువగా కేరళలో ఆ తరువాత మహారాష్ట్రలో కేంద్రీకృతమయ్యాయి.. అలాంటి జిల్లాలు ఈ రెండు రాష్ట్రాల్లోనే మరింత పెరిగి ఫిబ్రవరి ఆఖరుకు 33 అయ్యాయి.. ఆ తరువాత మార్చి ఆఖరు వారానికి ఒచ్చేసరికి ఇలా ఒందకు పైగా కేసులు నమోదయ్యే జిల్లాలు మరింత భారీగా పెరిగి ఈ రెండు రాష్ట్రాలకే కాకుండా చత్తీస్‌గఢ్ పంజాబ్ రాష్ట్రాలకు కూడా విస్తరించి మొత్తం 89 జిల్లాలు అయ్యాయి.. ఇక్కడే దేశంలో రెండో వేవ్ మొదలైపోయింది.. ఎక్కడెక్కడా కుంభ్ గానీ, ఎలెక్షన్ ర్యాలీలు గానీ లేవు అప్పటికి.. అసలు కుంభ్‌మేళా ఐతే మొదలే కాలేదు.. ఇక ఏప్రిల్ ఆఖరి వారానికి ఒచ్చేసరికి ఇలాంటి ఒందకు పైగా కేసులు నమోదయ్యే జిల్లాలు 471 అయ్యాయి..


ఇక్కడే విమర్శకుల నోళ్ళు మూయించే ఇంకొక విషయం చెప్పుకోవాలి.. కుంభ్ నిలిపివేసిన 20 రోజుల తరువాత కూడా మే 19 వరకు దేశవ్యాప్తంగా అధిక కేసులు కేంద్రీకృతమైన లేదా కేసుల వ్యాప్తి జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తే.. కుంభ్ జరిగిన ఉత్తరాఖండ్ లోని ప్రదేశాలు అలాంటి ప్రాంతాల జాబితాలోనే లేవు.. అవన్నీ ఇతర రాష్ట్రాలలోనే ఉన్నాయి.. గ్రాఫ్ చూడొచ్చు..


రాష్ట్ర ప్రభుత్వాల ఘోరవైఫల్యాన్ని కేంద్రం మీదకు, కుంభ్‌మేళా మీదకు నెట్టివేసే దుష్టపన్నాగం తప్ప ఇంకేమీ కాదు.. దీనికి తోడు దేశద్రోహుల అండతో ప్రోద్బలంతో విదేశీ మీడియా చేసిన నికృష్ఠ ప్రచారం దీనికి తోడైంది.. పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్స్, మరెన్నో నిబంధనలు పాటిస్తూ జరిపిన, ఎంతో ప్రశస్తి ఉన్న ధార్మిక కార్యక్రమాన్ని, కోవిడ్ సూపర్ స్ప్రేడర్ అని వార్తా పత్రికల హెడ్‌లైన్స్‌లోనూ, టీవీ ఛానెళ్ళ ప్రైమ్‌టైంలోనూ అపఖ్యాతి పాలు చేశారు.. ఇదంతా కేవలం కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్నే కాదు, దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకుని కొనసాగించిన దుష్టోన్మాద దుష్ప్రచారమే..


నమస్తే


మీ భారతీయుడు


జైహింద్!

భారత్ మాతాకీ జై!!

.

నోట్:


1. దయచేసి ఈ పోస్టును వీలైనంత ఎక్కువగా షేర్ చేసి వైరల్ చేయవలసిందిగా మిత్రులను కోరుతున్నాను..


2. ఈ వీడియోలో ప్రదర్శించిన గ్రాఫులు, ట్రెండులు, అనలిటిక్స్‌కు వినియోగించిన డేటా/సంఖ్యలన్నీ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక కోవిడ్ ఇండియా పోర్టల్‌కు అందించినవే..


#vbcovid

#VBKUMBH

సహాయపడాలి అంటే

 🙏👍*పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం*


*ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు..*


*నేను ఎందుకు పేదవాడను?*


*బుద్ధుడు సమాధానం చెప్పాడు:*


మీరు ఎందుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు,


*నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..*


అప్పుడు *బుద్ధుడు* ఈ విధంగా చెప్పాడు


మీరు ఇతరులతో పంచుకోగల *ఐదు* నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!...


*మొదట* మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ...ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ...

 

*రెండవది* మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. 

ఇది నిజం... మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు ... వాటిని మంచి అనుభూతితో చేయండి...


*మూడవది*  మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి ... వాటిని విలువైనదిగా భావించండి .. 

దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ...


*నాలుగవది* మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది.... మీ దయగల హృదయంతో , భగవంతున్ని ప్రార్థిస్తూ ... మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు ... ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు... వారి జీవితాలను తాకవచ్చు...


మీరు కలిగి ఉన్న *చివరి ఐదవ* సంపద మీ శరీరం ....  ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ... అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు....


ఒక చిన్న శ్రద్ధ , సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు... భగవంతుడు మనకిచ్చిన జీవితం.. కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !


*కావున ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ,  జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోండి.


🌹🙏🌹SYSA🌹🙏🌹

పద్నాలుగు లోకాలు!?

 *మనం "భ్రాంతి" లో బ్రతుకు తున్నామా?*

*వినీలాకాశంలో పద్నాలుగు లోకాలు!?  ఆ లోకాలతో పోల్చితే మనం "ఆవగింజంత"!*(బండారు రాం ప్రసాద్ రావు)😡😩🥺🥵😳😰😨😇మనం చూస్తుంది...అంతా భ్రాంతి...ఇది వేదాంతం కాదు...కానీ పద్నాలుగు భువన బండాలలో (లోకాలకు) పురాణ పురుషులు చెప్పిన "జీవం" ముందు...మన జీవితం దుర్భరం!! మనకు కళ్ళకు కనిపిస్తున్న "నిజాలు" అబద్ధాలా? సైన్స్ కు అందని ఆ "లోకాలు" నిజంగా ఉన్నాయా? వాటి కోసం                                 "శాస్త్రవేత్తలు" చేస్తున్న పరిశోధనలు ఫలప్రదమయ్యెనా? విశ్వం లో "ఏలీయన్స్" ఉన్న మాట నిజమేనా? అంతుపట్టని  అంతరిక్షాన "నిజాలు" తెలిసే సరికి మనం ఉంటామా? మన వారసులు, మానవ ఏమోషన్ ఆధిపత్య పోరాటంలో 'ప్రపంచ యుద్దాల" తో అంతు పట్టని ఆ లోకాల "అన్వేషణ" అర్ధాంతరంగా ఆగుతుందా? ఇవన్నీ ప్రశ్నలు కాదు...సైంటిస్ట్ లకు అంతుపట్టని ఆలోచన తరంగాలు!! ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే "ఆకాశం" దాన్ని రొదసి అంటారు.. నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ రంగునూ కలిగి ఉండదు...

మరి దూరపు కొండల నీలిమ సంగతి ఏమిటో తెలుసా? ఉదాహరణకి ‘నీలగిరులు అంటేనే నీలి కొండలు కదా! చెట్లు దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు గాలి పొరలగుండా చూస్తాం. “నీలి రంగు గాలి” అంటాం? గాలికి రంగు లేదని చదువుకున్నాం కదా! ఇక్కడ జవాబులో కొంచెం "వేదాంతం" పాలు కలపాలి. నిజానికి రోదసి రంగు నల్లటి నలుపు! మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది...కానీ కనిపించదు. అది మన "భ్రాంతి" అందుకోసమే దీనిని వేదాంతం అంటారు!😇🤗😨😰😳🥵😄🥺😩😡పాతాళంలో నాగలోకం ఉన్న మాట నిజమేనా? అంటే కేరళ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగకు     పాతాళానికి సంబంధం ఉందని  మాట వినిపిస్తోంది...ఆ నేలమాళిగకు ఎందుకింత ప్రాధాన్యం అంటే కొన్ని లక్షల కోట్ల బంగారం "నేల మాళిగ" లలో ఉందన్న రహస్యం తేలింది..అయితే "నేల మాళిగ"లలో భాగమైన 'బి' గది ని ఇంత వరకూ తెరవ లేదు! ఈ గదిలో మిగిలిన అన్ని గదులకంటే ఎక్కువ నిధులు ఉన్నాయని భావిస్తున్నారు. దీన్ని ఇంకా తెరవనందున ఇందులో ఏముందో ఎవరికీ తెలియదు.

ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం శతాబ్దాలుగా ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటున్నారు.... "నేల మాళిగ" లలో 'బి' గదిని తెరవకూడదని రాజకుటుంబీకులు మొదటి నుంచి వాదిస్తున్నారు. అలా చేయడం సంప్రదాయాలు, విశ్వాసాలకు విరుద్ధమని వారు నమ్ముతారు.

ఈ ఆలయం గురించి ప్రజలలలో కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ గదికి "నాగబంధం' ఉందని, దీనిని తెరిస్తే లోకానికే అరిష్టమని చాలామంది నమ్ముతారు. ఈ గదిని తెరవవద్దని 2011లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది..ఇంత సెంటిమెంట్ ఎందుకు అంటే భారతీయ "నమ్మకాలు" నిజం అవుతున్నాయి గనుక!! అంతు పట్టని రహస్యాలు        చేదించిన ఘనత మన ఋషులు, మునులకు ఉంది... సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు జన్మించిన పవిత్ర భారతదేశంలో నమ్మకాల ప్రకారం పద్నాలుగు లోకాలు ఉన్న మాట నిజమేనేమో?! ఎందుకంటే భూమి కన్నా అంతరిక్షనా అతి పెద్ద గోళంలు ఉన్నాయని నిర్ధారిస్థున్న శాస్త్రవేత్తలు మన పురాణాల సారాంశాన్ని "అవ లోకన" పట్టే ఆలోచన చేస్తున్నారు...😇😆😡😩🥺😄🥵😉😜😌😁😳హిందూ సంస్కృతిలో పురాణాలలోని అధర్వణ వేదంలో "లోక" అనే పదం వాడబడింది... లోక అనే పదం నుండి "లోకం" అనే భావన ఏర్పడింది.  కానీ వేద సంస్కృతి ప్రకారం లోక్ అంటే మానసిక స్థితి యొక్క స్థానము అంటే.. మన మనసే మరో లోకాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట..! మరి ఆ లోకాలు ఎన్ని అవి ఏవి అన్న విషయం చాలామందికీ  తెలియక పోవచ్చు..

ఇంతకీ అధర్వణ వేదం ప్రకారం

మొత్తం పదునాల్గు భువనాలు..అంటే పద్నాలుగు లోకాలన్నమాట.! మధ్య నుంచి పైకి ఏడు లోకాలు ఊర్ధ్వలోకలు అంటారు.. మధ్య నుంచి క్రిందకు అధో లోకాలు అంటారు. అవి ఏడు.. ఇవి ఏడన్నమాట. అంటే మనిషి మానసికం గా ఎదిగితే ఏడింతలు ఎదగొచ్చు.. మనసికంగా కృశించి పోవడం మొదలైతే ఏడింతలు తరిగిపోవచ్చని ఆ వేదఘోషలోని లోకాల "శబ్ధ భావన"!!

   లోకాల పేర్లు ఏమిటో తెలుసా?

ఊర్ధ్వలోకాలు

1. సత్య లోకం

2. తప లోకం

3. జన లోకం

4. మహర్లోకం

5. సువర్లోకం

6. భువర్లోకం

7. భుర్లోకం

అధో లోకాలు

8. అతల లోకం

9. వితల లోకం

10. సుతల లోకం

11. తలాతల లోకం

12. మహాతల లోకం

13. రసాతల లోకం

14. పాతాళ లోకం చెప్పిన మాట వినకపోతే పాతాళానికి జారిపోతావ్ అని అంటారు!! నిజానికి శ్రీ కృష్ణ విశ్వరూప దర్శనం లో ఈ లోకాల ప్రస్తావన వస్తుంది! శ్రీ కృష్ణ పరామాత్మ సప్త సముద్రాల లో అర్ఘ్యం విడిచే ఆయనకు సముద్రాలు చెలిమెల్లా అనిపించేవి అని పురాణాల కథనాలు...మనం ఆరడుగులు ఉంటే విర్రవీగిపొతామ్...దేవతలు అరవై అడుగులు ఉన్నా అణుకువ తో ఉండేవారు! అది ద్వాపరయుగం! ఇది కలి యుగం!!

మంత్రపుష్పంలో శక్తి

 మంత్రపుష్పంలో శక్తి పరిణామమును వివరించింది. అది వివరంగా భగవంతునికి నివేదించుట నిత్య జీవితంలో వక భాగం. మన మెుత్తం జీవంతో కూడిన దేహమునఅందులో వున్న శక్తికి మూలం అణువుల కలయిక. అయిన యిది దేహ ప్రవేశమునకు ఏమైనా మార్గము కలదా. దాని మార్గమునకు సూత్రమేమైనా యున్నదా. అణువు చైతన్యమువలననే తనువు ,దేహమును ఏర్పడినది. శక్తి పదార్థంగా మార్పు చెందినది. మార్పు యనునది వ్యాప్తమైనగాని దాని లక్షణము తెలియదు. అది అతి సూక్ష్మము , అనంతము కూడా. సూక్మమైనది అనంతమైన దేహము జీవిగా మారుటయు శక్తి లక్షణముగా గ్రహిం చుట దీని లక్షణము తెలియుట. పంచభూతతత్వమే జీవుడు దేవుడు కూడా. ఆశక్తిని ప్రకృతికి అనుగుణంగా ఆయనమని అణువు వ్యాప్తమైనగాని  ఆయతనమని, అణువులో శక్తి అది తత్ వ్యాప్తిని ఆయదనమని వ్యాప్తిని ఆయతన మని తెలియుచున్నది. ఉత్తరాయణ దక్షిణాయనమని ప్రకృతి ఫలమంత మగటకు జీవ సృష్టి ని ప్రత్యక్షంగా తెలియుటకు నిరూపణ కలుగుచున్నది.ఏదీ నీవు సృష్టించలేగు అన్న విషయం మనకు తెలుపుటకై. యిది ఙ్ఞానం సంబంధము. భూతలమును అనగా శక్తి గ్రహించి చలనమువలననే ప్రకృతిని తెలియుట యింత స్పష్టంగా ప్రకృతిని వేగము తెలుపుచున్నది. వీటి పరిణామ క్రమము జీవం. యిది ఆది అంతము లేనిది. దానికి ముఖ్యంగా. నీరు. దానికి ముఖ్య కారణము నీటికి అగ్ని కారణము అగ్ని వ్యాప్తమునకు వాయువు కారణము. వాయువుకు ఆకాశము కారణము. నీరు లక్షణము భూమి పైనే తెలియును. అది సస్యవృధ్ది అనగా జీవచైతన్యమునకు కూడా మూలముగా గ్రహించి ప్రకృతి మనకు అనంతమైన శక్తిని యిచ్చు చున్నది. దానిని ఎంత కావలెనో అంతవుపయెూగంచుట మానవుని కర్తవ్యం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూ నేను వుందాం.

ముక్కు తెగినప్పుడు

 ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 


      చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 


          ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి  సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.


       ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.


 

  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

ఇన్ని యాదృచ్చికములు

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*ఇన్ని  యాదృచ్చికములు ( Coincidences) ఒకేసారి  ఎలా సాధ్యమవుతుంది?*


_ఒక్కసారి ఆలోచించండి_  🤔


 1. చైనాలోని వుహాన్ లోని జీవ ప్రయోగశాల అమెరికన్ కంపెనీ అయిన "జిఎస్‌కె (గ్లాక్సోస్మిత్‌ క్లైన్)" కి చెందినది


 2. (యాదృచ్చికంగా) GSK ... Pfizr ఫైజర్‌ కంపెనీని  ను సొంతం చేసుకుంది. 


  3. ( యాదృచ్చికంగా ) ఫైజర్ వుహాన్ Lab లో లీక్ అయిన అదే వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుంది.


 4. ( యాదృచ్చికంగా )  డా.  ఫోస్సీ  ఈ పరిశోధన చేశారు.


  5. టీకాల వాడకాన్ని ప్రోత్సహించే డాక్టర్  ఫోస్సీ ( యాదృచ్చికంగా ) అమెరికా అధ్యక్షుని కి ముఖ్య సలహాదారు  .


 6. ( యాదృచ్చికంగా ) GSK కి "బ్లాక్ రాక్ ఫైనాన్స్" కంపెనీ   ద్వారా నిధులు సమకూరుతాయి.


  7. (యాదృచ్చికంగా ) బ్లాక్ రాక్ ఫైనాన్స్ ... 'ఓపెన్ ఫౌండేషన్' అనె కంపెనీని నిర్వహిస్తుంది ( సోరోస్ ఫౌండేషన్ ).


(యాదృచ్ఛికంగానే)  సోరోస్ ఫౌండేషన్  లోనే మన మన్మోహన్ సింగ్ గారి కుమార్తె పనిచేస్తున్నారు.


( యాదృచ్ఛికంగా )  పంజాబ్ రైతుల  ఉద్యమం కు వ్యతిరేకంగా టూల్ కిట్ విడుదల వెనుక షోరోస్ గారి హస్తం బయటికి వచ్చింది.  


  8. GSK...... (యాదృచ్చికంగా ) ఫ్రెంచ్ కంపెనీ అయినా   "AXA" కి సేవలు అందిస్తుంది.


  9. సోరోస్ ఫౌండేషన్ యొక్క జర్మన్ మాతృ   సంస్థ .... "వింటర్‌థుర్."


  10. జిన్ (* యాదృచ్చికంగా *) వుహాన్‌లో ఒక ప్రయోగశాలను నిర్మించారు.


  11. మరియు దీనిని జర్మన్ కంపెనీ " అల్లియన్స్" కొనుగోలు చేసింది.


  12. దీనికి అత్యధిక వాటాలు కలా వాటాదారు   ఉన్నాడు, అతను (యాదృచ్చికంగా) 'బ్లాక్ రాక్' యొక్క వాటాదారు.


 13. 'బ్లాక్ రాక్' కేంద్ర బ్యాంకులను నియంత్రిస్తుంది మరియు ప్రపంచ పెట్టుబడి మూలధనంలో మూడింట ఒక వంతును నిర్వహిస్తుంది.


  14.( యాదృచ్చికంగా )   బ్లాక్ రాక్.... బిల్ గేట్స్ యాజమాన్యంలోని మైక్రోసాఫ్ట్ యొక్క ప్రధాన వాటాదారు.


  15. మరియు ( యాదృచ్చికంగా ) మైక్రోసాఫ్ట్.... ఫైజర్ (Pfizer)  యొక్క వాటాదారు.


 16. ( యాదృచ్చికంగా ) ఇది WHO  యొక్క మొదటి స్పాన్సర్.


  17. (యాదృచ్చికంగా), వుహాన్ లోని 'వుహాన్ వైరస్' ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది.


▪️ఇక ప్రపంచ స్థాయి వ్యాక్సిన్   వ్యాపారం మొదలైంది!  వ్యాక్సిన్ పోటీదారుల శక్తిని అంచనా వేయడంలో  'ఫైజర్ కంపెనీ' విఫలం అయి  ఊహల్లో ఉండిపోయింది. 😴


▪️భారత దేశం మరియు దక్షిణ ఆసియా దేశాలు అధిక జనాభా   సాంద్రత కారణంగా ఎక్కువ వైరస్ ప్రభావిత ప్రాంతములు  కావున, అక్కడి మార్కెట్ పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది మరియు డాలర్ల సంపాదన పై కలలు కంటూ ఉండిపోయింది ఈ వ్యాక్సిన్ మాఫియా . ఒక్క భారత్ లో ఏడు లక్షల కోట్ల రూపాయల సంపాదన పై అంచనా వేసుకుంది.  


▪️కానీ! (యాదృచ్ఛికంగా ) కలలో కూడా ఊహించని విధంగా   భారతదేశం నుండి 'Covaxine వ్యాక్సిన్' మరియు 'Kovishield వ్యాక్సిన్లు'  పుట్టుకొచ్చాయి. సులభంగా భారత దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా చొచ్చుకుపోయాయి. 


▪️ఫైజర్ కంపెనీ.... మరియు దాని వెనక ఉన్న పైన తెలిపిన పెట్టుబడిదారుల కలలన్నీ కల్లలయ్యాయి.😢  


▪️ఇక  Covaxine మరియు Kovishieldల వాడకం మరియు పనితీరులపై   తప్పుడు ప్రచారం,   దుమ్మెత్తి పోయడం మొదలైంది. తయారీకి ప్రోత్సాహం ఇచ్చిన   నాయకత్వం పై కూడా పార్టీలు, కులాలు, మతాలు అంటగట్టారు దుష్ప్రచారం మొదలు పెట్టారు .    (ఇందులో భారత దేశానికి చెందిన నాయకులు , పత్రికలు , మేధావులు  పాలుపంచుకోవడం  యాదృచ్ఛికమా?) వీరి దుష్ప్రచారాన్ని నమ్మేన గుడ్డి ప్రజలు  వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకడుగు వేశారు. వారి పాచికలు పరాయి.  ఇంతలో కోవిద్   సెకండ్ వేవ్ డ్రామా మొదలైంది!  


 18.Covaxine and Kovishield వ్యాక్సిన్లు తగు జాగ్రత్తలు మధ్య తరలించి వెంటనే నేరుగా ప్రజలపై   వినియోగించవచ్చు . కానీ, దీనికి విరుద్ధంగా ' ఫైజర్ వ్యాక్సిన్' చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి తరలింపుల్లో మరియు నిల్వ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధర కూడా చాలా ఎక్కువ. ( ఫైజర్ యొక్క అనుబంధ సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది.)


 19. ఫైజర్ యొక్క అనుబంధ సంస్థ రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లకు బాధ్యత వహిస్తుంది.


  20. ఫైజర్ కంపెనీ తన వ్యాక్సిన్‌ను అమెరికాలో 1,100 రూపాయలకు, యూరప్‌లో 1,800 రూపాయలకు విక్రయిస్తుంది.


 - దీని ధర భారత్‌కు రూ .2,700.  గా నిర్ణయించింది   (వారి అంచనా ప్రకారం  130 కోట్ల మంది జనాభా  కి  ₹ 7 లక్షల కోట్ల మార్కెట్‌తో , ఒక్కొక్కరికి రెండు మోతాదు తో ).


ఫైజర్ వ్యాక్సీన్ ప్రయోగదశలో మనుషుల మీద ప్రయోగించినపుదు ఏడు మందిలో రక్తం గడ్డకట్టడం కనిపించింది . అందువలన భారత్ ఆ వ్యాక్సిన్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు  . 


 అంతేకాక ఆ   టీకా కంపెనీ పెట్టిన నిబంధనల వల్ల వాడకంలో ఏదైనా   రియాక్షన్ను వచ్చి  ఏ భారతీయ పౌరుడైనా నష్టపోతుంటే, అతను ఫైజర్‌పై కేసు పెట్టలేడు. (ఆ నిబంధనలను ఒప్పుకోకుండా   దీనికి భారత ప్రభుత్వం నిరాకరించింది. అందువలన   ఫైజర్ వ్యాక్సిన్  భారత్లో   గుర్తించబడలేదు).


 22. ఫైజర్  ను గుర్తించాలని రాహుల్ గాంధీ  ( యాదృచ్చికంగా ) ట్వీట్ చేశారు.


 23. భారత్లో   ఫైజర్ వ్యాక్సిన్   ఆమోదించబడకపోతే, (యాదృచ్చికంగా) భారత లో తయారయ్యే   వ్యాక్సిన్‌కు అవసరమైన ముడి పదార్థాలను అమెరికా ఆపివేస్తుంది. 


 భారతదేశం యొక్క ముక్కు  పగలు కొట్టవచ్చని   అతను( Biden) భావించాడు, కానీ దీనికి విరుద్ధంగా, అమెరికా యొక్క గోచీ   తొలగించబదె పరిస్థితి వచ్చింది, అప్పుడు బిడెన్ కి భారత తయారీ టీకాతో  చికిత్స చేయవలసి వచ్చింది.


  24.  థర్డ్ వేవ్  లొ, చిన్నపిల్లలకు వ్యాధి సోకుతుందని ప్రచారం ప్రారంభమైంది,  (యాదృచ్చికంగా ) మరియు.... ఒక వారంలోనే ఫైజర్ చిన్న పిల్లలకు వ్యాక్సిన్ తమ వద్ద   రెడీ గా  ఉందని ప్రకటించింది!. 


 మరి  చిన్న పిల్లలపై ఆ వ్యాక్సిన్ వాడకంపై   అన్ని క్లినికల్   పరీక్షలు మొదలై... ఒకే వారంలో జరిగాయా?


 ఈ కంపెనీల కుట్ర ఏమిటంటే......,


 1)ఒక అజ్ఞాన వైరస్ను సృష్టించడం,


 2) ప్రజలలో వ్యాప్తి చేయడం,


3) వారిని WHO లాగా మాట్లాడటం, 


4)మార్కెట్ టీకాలు వేయడం, 


5)భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం మరియు ,


6) ఒకే ప్రజలపై పాలన చేయడం, భూమి జనాభాను తగ్గించడం.


  25. జో బిడెన్ ఆ రోజు Mask ధరించి బయటకు వచ్చి ముసుగు తీసివేసి, రెండు టీకాలు తీసుకున్న   వారు Mask ధరించాల్సిన   అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు( యాదృచ్చికంగా ) .

  ఇది మార్కెటింగ్ యొక్క ఒక రూపం.  ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుంది అని ప్రపంచానికి తెలియ చెప్పే ఉద్దేశ్యం.


  "ఇన్ని ట్విస్టులు  ( యాదృచ్చికాలు) మన్మోహన్ దేశాయ్ చిత్రం లో కూడా లేవు.


 డాక్టర్  ఫోస్సీ ( అమెరికా అధ్యక్షుని సలహాదారు) + బిల్ గేట్స్ మరియు మిలిందా గేట్స్ ఫౌండేషన్  + Pfizer + జార్జ్ సోరోస్  + రాగా మరియు సొగా ల కుట్ర పూరిత  వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి  .


  దీనికి ఏకైక పరిష్కారం! దుష్ట పన్నాగాలుతొ,  రోగాలతో వ్యాపారాలు  చేసే ఇలాంటి దుర్మార్గులను దూరంగా పెట్టండి .


  అటువంటి సంస్థలకు వెన్నుదన్నుగా ఉండే క్రూర రాజకీయాలు  చేసె నేతలకు   అధికారాన్ని ఇవ్వద౦కాదు, వారి ఉత్పత్తులను ఉపయోగించకూడదు. 


 Traditional గా మన సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి బయటికి తె౦డి  మరియు మనల్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని రక్షించండి. 


ఈ పోస్ట్ యొక్క  రచయిత ఎవరో తెలియదు, కానీ ఇందులో వాస్తవాలు ( యాదృచ్చికంగా ) ఉన్నాయని గ్రహించి మీకు పంపాను .

 💐💐💐💐💐

మహాలక్ష్మ్యష్టకం

 MAHALAKSHMI ASHTAKAM* 


 *మహాలక్ష్మ్యష్టకం* 


ఇంద్ర ఉవాచ –


 నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||


మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారం


నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |

సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||


గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ, కోలుడు అనే రాక్షసుని కి భయాన్ని సృష్టించిన దానివై, సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము.


సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||


సర్వజ్ఞురాలా', సర్వ వరాలు ఇచ్చే దానా, సర్వ దుష్ట శక్తుల్నీ తొలగించే భయంకరీ, సర్వ దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము


సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||


అద్భుత శక్తి, జ్ఞానం కలగజేసేదానివీ, భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లీ! మంత్రమూర్తి, దివ్య కాంతిమాయీ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.


ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |

యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||


ఆది, అంతము లేని దానా, ఆదిశక్తీ,!మాహేశ్వరీ ! యోగ జ్ఞానంలో వుండేదానా! యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము


స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |

మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||


స్థూల, సూక్ష్మ రూపంలోనూ,మహారౌద్ర రూపంలోనూ కనిపించే దానా! మహాశక్తి స్వరూపిణీ,ప్రపంచాని తనలో ధరించిన,మహా పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము


పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |

పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||


పద్మాసనంలో కూర్చొని వుండే దానా! పరబ్రహ్మ స్వరూపిణీ, మాహేశ్వరీ! జగన్మాతా! మహాలక్ష్మీ నీకు నమస్కారము


శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |

జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||


తెల్లని వస్త్రములు ధరించిన దానా! అనేక అలంకారాలు దాల్చిన  దానా!జగత్ స్థితికి కారణమైనదానా! జగన్మాతా! మహాలక్ష్మీ నీకు నమస్కారము.


మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |

సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||


ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |

ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||


త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |

మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||


ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు.  అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది.  శుభాలు కల్గిస్తుంది.

వైశాఖ పురాణం - 18 వ

 _*వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*విష్ణువు యముని ఊరడించుట*



☘☘☘☘☘☘☘☘☘



నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయీ ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది ? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము.  వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా ! యమధర్మరాజా ! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా ! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి / సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా ! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా ! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


శ్రీహరియు వారిద్దరిని జూచి *"మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా ? యముని ముఖము వాడియున్నదేమి ? అతడు శిరము వంచుకొని యేల నుండెను ? బ్రహ్మ ! ఈ విషయమును చెప్పుమని"* యడిగెను.


అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని , బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను , నా ప్రాణములను , దేహమును , శ్రీవత్సమును , కౌస్తుభమును , వైజయంతీమాలను , శ్వేతద్వీపమును , వైకుంఠమును , క్షీరసాగరమును , శేషుని , గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను , జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను ?


యమధర్మరాజా ! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్దిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా ! అప్పుడు నీకు కావలసినంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా ! *(ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు ? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము)* వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను , గురువును పూజింపవలయును , తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు /పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు , పుత్రికలు , మనుమలు. , మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి ఇహలోక సుఖములు , సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే ఇది సాధ్యము సుమా అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


శ్రుతదేవుడును రాజా ! యుగములనుబట్టి , కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆ కథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము , గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం - 17 వ

 *వైశాఖ పురాణం - 17 వ అధ్యాయము*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 - యమదుఃఖ నిరూపణము


నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.


వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.


స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాటించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు,  తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము. అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.


కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడుకదా! ఇట్లు నా వ్రాత నెవరును యింతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.


వైశాఖ పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం