*మనం "భ్రాంతి" లో బ్రతుకు తున్నామా?*
*వినీలాకాశంలో పద్నాలుగు లోకాలు!? ఆ లోకాలతో పోల్చితే మనం "ఆవగింజంత"!*(బండారు రాం ప్రసాద్ రావు)😡😩🥺🥵😳😰😨😇మనం చూస్తుంది...అంతా భ్రాంతి...ఇది వేదాంతం కాదు...కానీ పద్నాలుగు భువన బండాలలో (లోకాలకు) పురాణ పురుషులు చెప్పిన "జీవం" ముందు...మన జీవితం దుర్భరం!! మనకు కళ్ళకు కనిపిస్తున్న "నిజాలు" అబద్ధాలా? సైన్స్ కు అందని ఆ "లోకాలు" నిజంగా ఉన్నాయా? వాటి కోసం "శాస్త్రవేత్తలు" చేస్తున్న పరిశోధనలు ఫలప్రదమయ్యెనా? విశ్వం లో "ఏలీయన్స్" ఉన్న మాట నిజమేనా? అంతుపట్టని అంతరిక్షాన "నిజాలు" తెలిసే సరికి మనం ఉంటామా? మన వారసులు, మానవ ఏమోషన్ ఆధిపత్య పోరాటంలో 'ప్రపంచ యుద్దాల" తో అంతు పట్టని ఆ లోకాల "అన్వేషణ" అర్ధాంతరంగా ఆగుతుందా? ఇవన్నీ ప్రశ్నలు కాదు...సైంటిస్ట్ లకు అంతుపట్టని ఆలోచన తరంగాలు!! ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే "ఆకాశం" దాన్ని రొదసి అంటారు.. నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ రంగునూ కలిగి ఉండదు...
మరి దూరపు కొండల నీలిమ సంగతి ఏమిటో తెలుసా? ఉదాహరణకి ‘నీలగిరులు అంటేనే నీలి కొండలు కదా! చెట్లు దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు గాలి పొరలగుండా చూస్తాం. “నీలి రంగు గాలి” అంటాం? గాలికి రంగు లేదని చదువుకున్నాం కదా! ఇక్కడ జవాబులో కొంచెం "వేదాంతం" పాలు కలపాలి. నిజానికి రోదసి రంగు నల్లటి నలుపు! మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది...కానీ కనిపించదు. అది మన "భ్రాంతి" అందుకోసమే దీనిని వేదాంతం అంటారు!😇🤗😨😰😳🥵😄🥺😩😡పాతాళంలో నాగలోకం ఉన్న మాట నిజమేనా? అంటే కేరళ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగకు పాతాళానికి సంబంధం ఉందని మాట వినిపిస్తోంది...ఆ నేలమాళిగకు ఎందుకింత ప్రాధాన్యం అంటే కొన్ని లక్షల కోట్ల బంగారం "నేల మాళిగ" లలో ఉందన్న రహస్యం తేలింది..అయితే "నేల మాళిగ"లలో భాగమైన 'బి' గది ని ఇంత వరకూ తెరవ లేదు! ఈ గదిలో మిగిలిన అన్ని గదులకంటే ఎక్కువ నిధులు ఉన్నాయని భావిస్తున్నారు. దీన్ని ఇంకా తెరవనందున ఇందులో ఏముందో ఎవరికీ తెలియదు.
ట్రావెన్‌కోర్ రాజకుటుంబం శతాబ్దాలుగా ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటున్నారు.... "నేల మాళిగ" లలో 'బి' గదిని తెరవకూడదని రాజకుటుంబీకులు మొదటి నుంచి వాదిస్తున్నారు. అలా చేయడం సంప్రదాయాలు, విశ్వాసాలకు విరుద్ధమని వారు నమ్ముతారు.
ఈ ఆలయం గురించి ప్రజలలలో కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ గదికి "నాగబంధం' ఉందని, దీనిని తెరిస్తే లోకానికే అరిష్టమని చాలామంది నమ్ముతారు. ఈ గదిని తెరవవద్దని 2011లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది..ఇంత సెంటిమెంట్ ఎందుకు అంటే భారతీయ "నమ్మకాలు" నిజం అవుతున్నాయి గనుక!! అంతు పట్టని రహస్యాలు చేదించిన ఘనత మన ఋషులు, మునులకు ఉంది... సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు జన్మించిన పవిత్ర భారతదేశంలో నమ్మకాల ప్రకారం పద్నాలుగు లోకాలు ఉన్న మాట నిజమేనేమో?! ఎందుకంటే భూమి కన్నా అంతరిక్షనా అతి పెద్ద గోళంలు ఉన్నాయని నిర్ధారిస్థున్న శాస్త్రవేత్తలు మన పురాణాల సారాంశాన్ని "అవ లోకన" పట్టే ఆలోచన చేస్తున్నారు...😇😆😡😩🥺😄🥵😉😜😌😁😳హిందూ సంస్కృతిలో పురాణాలలోని అధర్వణ వేదంలో "లోక" అనే పదం వాడబడింది... లోక అనే పదం నుండి "లోకం" అనే భావన ఏర్పడింది. కానీ వేద సంస్కృతి ప్రకారం లోక్ అంటే మానసిక స్థితి యొక్క స్థానము అంటే.. మన మనసే మరో లోకాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట..! మరి ఆ లోకాలు ఎన్ని అవి ఏవి అన్న విషయం చాలామందికీ తెలియక పోవచ్చు..
ఇంతకీ అధర్వణ వేదం ప్రకారం
మొత్తం పదునాల్గు భువనాలు..అంటే పద్నాలుగు లోకాలన్నమాట.! మధ్య నుంచి పైకి ఏడు లోకాలు ఊర్ధ్వలోకలు అంటారు.. మధ్య నుంచి క్రిందకు అధో లోకాలు అంటారు. అవి ఏడు.. ఇవి ఏడన్నమాట. అంటే మనిషి మానసికం గా ఎదిగితే ఏడింతలు ఎదగొచ్చు.. మనసికంగా కృశించి పోవడం మొదలైతే ఏడింతలు తరిగిపోవచ్చని ఆ వేదఘోషలోని లోకాల "శబ్ధ భావన"!!
లోకాల పేర్లు ఏమిటో తెలుసా?
ఊర్ధ్వలోకాలు
1. సత్య లోకం
2. తప లోకం
3. జన లోకం
4. మహర్లోకం
5. సువర్లోకం
6. భువర్లోకం
7. భుర్లోకం
అధో లోకాలు
8. అతల లోకం
9. వితల లోకం
10. సుతల లోకం
11. తలాతల లోకం
12. మహాతల లోకం
13. రసాతల లోకం
14. పాతాళ లోకం చెప్పిన మాట వినకపోతే పాతాళానికి జారిపోతావ్ అని అంటారు!! నిజానికి శ్రీ కృష్ణ విశ్వరూప దర్శనం లో ఈ లోకాల ప్రస్తావన వస్తుంది! శ్రీ కృష్ణ పరామాత్మ సప్త సముద్రాల లో అర్ఘ్యం విడిచే ఆయనకు సముద్రాలు చెలిమెల్లా అనిపించేవి అని పురాణాల కథనాలు...మనం ఆరడుగులు ఉంటే విర్రవీగిపొతామ్...దేవతలు అరవై అడుగులు ఉన్నా అణుకువ తో ఉండేవారు! అది ద్వాపరయుగం! ఇది కలి యుగం!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి