28, మే 2021, శుక్రవారం

కుంభ్‌కు కోవిడ్‌కు సంబంధం లేదు

 కుంభ్‌కు కోవిడ్‌కు సంబంధం లేదు. సాక్ష్యాలతో, సశాస్త్రీయంగా ఋజువుచేసే పోస్ట్👇


సాక్ష్యాధారాలతో.. శాస్త్రీయ విశ్లేషణతో..


"కుంభ మేళా, 5 రాష్ట్రాల ఎన్నికలు" కోవిడ్ రెండో వేవ్ కు ఎంతమాత్రం కారణం కాదు అని నిరూపించి.. హిందువుల ధార్మిక కార్యక్రమాన్ని దోషిని చేసే దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి నగ్న సత్యాన్ని కళ్ల ముందు నిలబెట్టే వీడియో..


(క్రింది వీడియోకు తెలుగు అనువాదం)


2021 లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన కుంభమేళా దేశంలో  కోవిడ్ రెండో వేవ్ కు కారణమా? అలాగే ఎన్నికల ర్యాలీలు కరోనా రెండో వేవ్ కు కారణమా?  దేశంలో దుష్ప్రచారానికి టూల్ కిట్ వంటి సాధనాలను వినియోగించే దేశంలోని కొన్ని వర్గాలు కోవిడ్ రెండో వేవ్‌కు కుంభ్‌మేళాయే కారణమని కోడై కూశాయి.. కానీ అసలు నిజం ఏంటి? ఈ వీడియోలో డేటా అనలిటిక్స్ గ్రాఫులు, చార్టులు ఉపయోగించి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.. 


మొదట కుంభమేళా..


2021, జనవరి 26 న  దేశవ్యాప్తంగా 9102 కేసులు నమోదయ్యాయి.. వీటిలో ఆరు వేల కేసులు కేరళలోనే నమోదయ్యాయి.. ఇక మహారాష్ట్రలో 2400 కేసులు నమోదయ్యాయి.. అప్పుడు దేశవ్యాప్తంగా రోజుకు ఒందకు పైగా కేసులు నమోదు చేస్తున్న 20 జిల్లాలో అధిక శాతం జిల్లాలు కేరళ మహారాష్ట్రల్లోనే ఉన్నాయి.. దీనికి అనుగుణంగానే, దేశం మొత్తం మీద ఉన్న అన్ని కేసుల్లో దాదాపు 70% ఈ రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి..


అప్పటినుండి క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చాయి.. ఫిబ్రవరి 26 న దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 16577.. అదే సమయంలో రోజుకు ఒందకుపైగా కేసులు నమోదు చేస్తున్న మొత్తం జిల్లాలు 33 అయ్యాయి.. వీటిలో అధికభాగం జిల్లాలు మళ్ళీ కేరళ మహారాష్ట్రల్లోనే ఉన్నాయి.. ఇదే సమయంలో మొత్తం కేసుల్లో మహారాష్ట్ర కేరళను అధిగమించడం ప్రారంభించింది.. దేశం మొత్తం కేసుల్లో సగం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.. కేరళలో దేశం మొత్తం కేసులో 20 శాతం నమోదయ్యాయి.. ఈ రెండు రాష్ట్రాల కేసులు కలిపితే అవి దేశంలోని మొత్తం కేసుల్లో 72 శాతానికి చేరుకున్నాయి.. గమనించండి, అప్పటికి కుంభమేళా ఇంకా మొదలే కాలేదు.. కానీ కోవిడ్ రెండో వేవ్ దాదాపు మొదలైంది..


ఇక ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుకుంటే.. దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి 26న.. ఆసక్తికరంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడానికి దాదాపు పది రోజుల ముందు నుండే కేసుల్లో పెరుగుదల మొదలైంది.. ఫిబ్రవరి 25న తమిళనాడులో 467 కేసులు నమోదయ్యాయి.. తమిళనాడు కేరళతో సరిహద్దులను పంచుకుంటుంది అనే విషయం ఇక్కడ మనం గమనించాలి..


ఇక ఒక నెల తరువాత అంటే మార్చి నెలాఖరుకు గమనిస్తే దేశంలో ఒందకు పైగా కేసులు నమోదు చేస్తున్న జిల్లాలు 89 కి చేరాయి.. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కడా కోవిడ్ భారీగా పెరుగుతున్న జాడలు లేనేలేవు..  కానీ మహారాష్ట్ర కేరళలోని అన్ని జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి.. మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటకలో మార్చి 26 న 2566 కేసులు నమోదయ్యాయి.. గుర్తుంచుకోండి కుంభమేళా ఇంకా మొదలే కాలేదు..  అలాగే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలనేవి జరగడం లేదు.. కేసుల సంఖ్యలో పెరుగుదల రేటు ఈ రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది.. 2021 మార్చి 25 న మహారాష్ట్ర 35952 కేసులు నమోదు చేసింది.. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కేసుల సంఖ్య 59180.. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ-- ఈ నాలుగు రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కేసుల్లో 73% నమోదయ్యాయి.. ఈ నాలుగు రాష్ట్రాల్లో కుంభమేళా లేదు.. ఎన్నికలు జరగడం లేదు.. అవునా?


దేశంలో కోవిడ్ రెండో వేవ్ కు కుంభమేళా కారణం అనే వాదనను బద్దలు కొట్టడానికి ఈ సమాచారం చాలు.. కుంభమేళా మీద పెట్టిన కేసును కొట్టివేయడానికి.. మూసివేయడానికి.. 


మార్చ్ చివరి వారానికి వచ్చేసరికి రెండో వేవ్ దేశంలో ప్రవేశించేసింది.. కుంభమేళా అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు.. కానీ జనవరి నుండే మహారాష్ట్ర కేరళ పంజాబ్ చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కుతకుత ఉడుకుతున్న  కోవిడ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యా తీసుకోకపోవడంతో అక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.. డేటా పరిశీలిస్తే ఎవరికైనా అది అర్థం అవుతుంది.. ఇప్పుడు ఇంకొక విషయం గమనిద్దాం.. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ లో జరిగిన కుంభమేళా కోవిడ్ రెండో వేవ్‌కు కారణమైతే ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉండాలి కదా.. కానీ కుంభ్ జరిగిన సమయంలో.. మహారాష్ట్రలోని నాసిక్, నాగపూర్.. దక్షిణాదిన ఉన్న విశాఖపట్నం.. ఛత్తీస్గఢ్ లోని రాయ్‌పూర్‌ల పాజిటివ్ రేటు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది..

.


మరి ఎన్నికల సంగతేంటి? 


దేశంలో కోవిడ్ కేసుల పాజిటివ్ రేట్ ఫిబ్రవరిలో ఉన్న 2% నుండి ఏప్రిల్ మొదటి వారంలో 10% కి పెరిగిపోయింది.. ఇది కుంభమేళ మొదలు కావడానికి, ఎన్నికల సభలు ర్యాలీలు జరగడానికి చాలా ముందుగానే జరిగిపోయింది.. మహారాష్ట్ర కేరళలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అప్పటికే.. మార్చిలో ఎన్నికల సభలు జరిగిన అస్సాంలో కేసులు ఎంత మాత్రం లేవు..

.


రైతుల పేరుతో నిరసనలు..


కానీ దేశంలో ఒక వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది అదే రైతు నిరసనలు.. దాని గురించేంటి? దాని గురించి ఎవరూ మాట్లాడలేదు.. ఎవరూ పట్టించుకోలేదు.. ఢిల్లీలో కేసులు పెరిగిపోవడానికి కారణం పంజాబ్ హర్యానాల నుండి ఒచ్చి ఢిల్లీ బోర్డర్ లో 2020 నవంబర్ నుండి తిష్ట వేసిన రైతులే.. ఫిబ్రవరి చివరి నుండి మార్చి మొదటి వారం మధ్యలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కేసులు పెరిగిన విధానం చూడండి.. ఎలక్షన్స్ గాని కుంభమేళాగాని ఈ కేసుల్లో పెరుగుదలకు కారణం కాదుకదా..   


ఫిబ్రవరిలో పంజాబ్‌లో మొదలైన ఈ వేవ్ మార్చిలో హర్యానాలో ప్రవేశించింది.. అక్కడి నుండి ఏప్రిల్ నెలలో ఢిల్లీలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించడం మొదలు పెట్టింది.. ఏప్రిల్ నెలలో కొన్నిరోజులు ఢిల్లీలో కేసులు 25 వేలకు మించి నమోదయ్యాయి.. ఈ మూడు చోట్ల కుంభ్‌మేళా గానీ, ఎలక్షన్ ర్యాలీలు గానీ లేవు, గుర్తుంచుకోండి.. 


పంజాబ్ కేసుల సంఖ్య గమనిస్తే అవి మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి.... అక్టోబర్ 2020 కల్లా కేసులు తగ్గుముఖం పట్టాయి.. కానీ ఆ వెంటనే నవంబర్ 2020 లో ఎప్పుడైతే రైతుల పేరుతో ఆందోళనలు మొదలయ్యాయో  కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభమయ్యాయి.. దీనికి ఇంకొక పార్శ్వం కూడా ఉంది.. అదే.. టెస్టుల సంఖ్యలో తగ్గుదల కూడా చోటు చేసుకుంది.. ఈ ట్రెండ్ మార్చి మొదటి వారం వరకు కొనసాగింది.. ఎప్పుడైతే మార్చిలో టెస్టుల సంఖ్యను పెంచారో కేసుల పాజిటివిటీ రేటు విపరీతంగా పెరిగిపోయింది.. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే.. పంజాబ్‌లో పెరిగిన కేసులకు ఢిల్లీలో కేసుల పెరుగుదలకు అవినాభావ సంబంధం ఉంది.. వీటి మధ్య సంబంధాన్ని బలపరచే డేటా ఏంటంటే B.1.1.7 వేరియంట్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పంజాబ్‌లో ఈ వేరియంట్‌కు చెందిన కేసులు 516 నమోదైతే, ఢిల్లీలో 482 కేసులు నమోదయ్యాయి..


చివరిగా దేశవ్యాప్తంగా రోజుకు ఒంద కేసులు పైనే నమోదవుతున్న జిల్లాల వివరాలు ఇంకొకసారి పరిశీలిస్తే.. జనవరిలో చివరి వారంలో ఇలాంటి జిల్లాలు 20 ఉంటే వాటిలో ఎక్కువగా కేరళలో ఆ తరువాత మహారాష్ట్రలో కేంద్రీకృతమయ్యాయి.. అలాంటి జిల్లాలు ఈ రెండు రాష్ట్రాల్లోనే మరింత పెరిగి ఫిబ్రవరి ఆఖరుకు 33 అయ్యాయి.. ఆ తరువాత మార్చి ఆఖరు వారానికి ఒచ్చేసరికి ఇలా ఒందకు పైగా కేసులు నమోదయ్యే జిల్లాలు మరింత భారీగా పెరిగి ఈ రెండు రాష్ట్రాలకే కాకుండా చత్తీస్‌గఢ్ పంజాబ్ రాష్ట్రాలకు కూడా విస్తరించి మొత్తం 89 జిల్లాలు అయ్యాయి.. ఇక్కడే దేశంలో రెండో వేవ్ మొదలైపోయింది.. ఎక్కడెక్కడా కుంభ్ గానీ, ఎలెక్షన్ ర్యాలీలు గానీ లేవు అప్పటికి.. అసలు కుంభ్‌మేళా ఐతే మొదలే కాలేదు.. ఇక ఏప్రిల్ ఆఖరి వారానికి ఒచ్చేసరికి ఇలాంటి ఒందకు పైగా కేసులు నమోదయ్యే జిల్లాలు 471 అయ్యాయి..


ఇక్కడే విమర్శకుల నోళ్ళు మూయించే ఇంకొక విషయం చెప్పుకోవాలి.. కుంభ్ నిలిపివేసిన 20 రోజుల తరువాత కూడా మే 19 వరకు దేశవ్యాప్తంగా అధిక కేసులు కేంద్రీకృతమైన లేదా కేసుల వ్యాప్తి జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తే.. కుంభ్ జరిగిన ఉత్తరాఖండ్ లోని ప్రదేశాలు అలాంటి ప్రాంతాల జాబితాలోనే లేవు.. అవన్నీ ఇతర రాష్ట్రాలలోనే ఉన్నాయి.. గ్రాఫ్ చూడొచ్చు..


రాష్ట్ర ప్రభుత్వాల ఘోరవైఫల్యాన్ని కేంద్రం మీదకు, కుంభ్‌మేళా మీదకు నెట్టివేసే దుష్టపన్నాగం తప్ప ఇంకేమీ కాదు.. దీనికి తోడు దేశద్రోహుల అండతో ప్రోద్బలంతో విదేశీ మీడియా చేసిన నికృష్ఠ ప్రచారం దీనికి తోడైంది.. పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్స్, మరెన్నో నిబంధనలు పాటిస్తూ జరిపిన, ఎంతో ప్రశస్తి ఉన్న ధార్మిక కార్యక్రమాన్ని, కోవిడ్ సూపర్ స్ప్రేడర్ అని వార్తా పత్రికల హెడ్‌లైన్స్‌లోనూ, టీవీ ఛానెళ్ళ ప్రైమ్‌టైంలోనూ అపఖ్యాతి పాలు చేశారు.. ఇదంతా కేవలం కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్నే కాదు, దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకుని కొనసాగించిన దుష్టోన్మాద దుష్ప్రచారమే..


నమస్తే


మీ భారతీయుడు


జైహింద్!

భారత్ మాతాకీ జై!!

.

నోట్:


1. దయచేసి ఈ పోస్టును వీలైనంత ఎక్కువగా షేర్ చేసి వైరల్ చేయవలసిందిగా మిత్రులను కోరుతున్నాను..


2. ఈ వీడియోలో ప్రదర్శించిన గ్రాఫులు, ట్రెండులు, అనలిటిక్స్‌కు వినియోగించిన డేటా/సంఖ్యలన్నీ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక కోవిడ్ ఇండియా పోర్టల్‌కు అందించినవే..


#vbcovid

#VBKUMBH

కామెంట్‌లు లేవు: