28, మే 2021, శుక్రవారం

మహాలక్ష్మ్యష్టకం

 MAHALAKSHMI ASHTAKAM* 


 *మహాలక్ష్మ్యష్టకం* 


ఇంద్ర ఉవాచ –


 నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||


మహామాయరూపినివై, శ్రీపీఠ నివాసినివై, దేవతలచే సేవించబడుతూ, శంఖ, చక్ర, గదలు ధరించిన ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారం


నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |

సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||


గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ, కోలుడు అనే రాక్షసుని కి భయాన్ని సృష్టించిన దానివై, సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము.


సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||


సర్వజ్ఞురాలా', సర్వ వరాలు ఇచ్చే దానా, సర్వ దుష్ట శక్తుల్నీ తొలగించే భయంకరీ, సర్వ దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము


సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||


అద్భుత శక్తి, జ్ఞానం కలగజేసేదానివీ, భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లీ! మంత్రమూర్తి, దివ్య కాంతిమాయీ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.


ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |

యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||


ఆది, అంతము లేని దానా, ఆదిశక్తీ,!మాహేశ్వరీ ! యోగ జ్ఞానంలో వుండేదానా! యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము


స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |

మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||


స్థూల, సూక్ష్మ రూపంలోనూ,మహారౌద్ర రూపంలోనూ కనిపించే దానా! మహాశక్తి స్వరూపిణీ,ప్రపంచాని తనలో ధరించిన,మహా పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ నీకు నమస్కారము


పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |

పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||


పద్మాసనంలో కూర్చొని వుండే దానా! పరబ్రహ్మ స్వరూపిణీ, మాహేశ్వరీ! జగన్మాతా! మహాలక్ష్మీ నీకు నమస్కారము


శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |

జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||


తెల్లని వస్త్రములు ధరించిన దానా! అనేక అలంకారాలు దాల్చిన  దానా!జగత్ స్థితికి కారణమైనదానా! జగన్మాతా! మహాలక్ష్మీ నీకు నమస్కారము.


మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |

సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||


ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |

ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||


త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |

మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||


ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు.  అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది.  శుభాలు కల్గిస్తుంది.

కామెంట్‌లు లేవు: