29, ఆగస్టు 2020, శనివారం

భాగవతం

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించారన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే  పండితులు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో  ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి.  మహా పురుషుల మూర్తులను సేవించాలి.  అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.  నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది  మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకోవాలి. దీనినుంచి దాటాలని  అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళాలి. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈశ్వర నామమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా ఇంద్రియ సుఖమనుభవించవచ్చు.
 సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును  తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొన్ననాడు  ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి  పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని, నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
 ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు  వాడు నాయందే చేరిపోతున్నాడు.  ఉద్ధవా! నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది.  కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తే  తలలోకి గుచ్చుకుంటుందనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ  పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయ్యాడో,  ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనము ఇచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు.  కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.
యాదవుల అంతమొందుట
ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన  ఇనప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటే  వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడు  గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉన్నది, పాశుపతాస్త్రం ఉన్నది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు.  ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.
ఫలశ్రుతి
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం ఇస్తున్నాను’ అన్నారు.
అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాట ప
ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
భ గతియు నీల వేణియు గృపారసదృష్టియు గల్గు వెన్ను డి
మ్ముగ బొడసూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.
‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు
ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండునరుడు లోకులు వొగడన్.
‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్న వాళ్ళకు, ఇది వ్రాసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.

భాగవత ప్రవచన పాఠం నేటితో సమాప్తం 
*******************

వేదం సూర్య గ్రహాన్ని

వేదం సూర్య గ్రహాన్ని అనేక రూప నామ బేధములతో పిలుచుచున్నది. కారణము వక పరిశీలన. వక్కొక్క నామరూపం వక్కొక్క గుణం గుణము లక్షణమైన లక్షణము పదార్ధమై, పదార్ధము ధాతు లక్షణము కలిగియున్నది. దానివలన ప్రకృతి నిరంతరాయంగా జీవ సృష్టికి మూలాధారమైన యున్నది. అది పంచభూతములుగా మారి భూమిని సస్యవంతం కలిగి జీవకోటికి ఆహ్లాదంగా మారుచున్నది. ఆదిత్య, సూర్య,మార్తాండ,హరణ్యగర్భ, స్వష్ట, భాస్కర... యిలా 12 నెలలకు ద్వాదశ ఆదిత్యులని గా తెలియుచున్నది. వరకే శక్తి వక్కొక్క నెలలో వక్కొక్క శక్తి లక్షణము కలిగియున్నది. కాని భౌతిక వాదులు ఉష్ణ మును పరిమిత పరిమాణం సంటీగ్రేడ్లలో నిత్యం కొలమానంగా చేయుచున్నారు. దాని లక్షణము చెప్పుట లేదు
అటులనే మన దేహంలో కూడా వక్కొక్క అగ్ని వక్కొక్క అందమునకు వక్కొక్క లక్షణము కలిగియున్నది. అన్నింటి మూలం దేహముయెుక్కదేహముయెుక్క ఉష్ణం  వకటే అయినప్పటికీ వక్కొక్క అవయవ శక్తిగా మారి ఆ అవయవం పనిచేయుటకు ఆధారమగు చున్నది. అందువలననే ప్రతీ రోజు ఉదయం సాయంకాలం తగు పరిమితిలో సూర్య అగ్ని తత్వమును ప్రకృతి ద్వారా స్వీకరించుట.దీని సమస్త విఙ్ఞానాన్ని ఋగ్వేదం సూర్యుని సంవత్సర మంతా మార్పులను చక్కగా వివరించుచున్నవి. వీటిని అవగాహన చేసుకొని ఆరోగ్యమైన జీవన లక్ష్యంగా మాత్రమే దీని ప్రధాన సూత్రం.మనకు ఖగోళంలో మార్పులను ప్రకృతి పరంగా జీవవునికికి సునిశితంగా గమనించిన చెప్పినదే వేద విజ్ఞానం. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం.
*********************

తెలుగు సంవ‌త్స‌రాలు

మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*

_*Know the Telugu Year you born*_

*( 1867, 1927,1987,)*: ప్రభవ
*(1868,1928,1988)*: విభవ
*(1869,1929,1989)*: శుక్ల
*(1870,1930,1990)*: ప్రమోదూత
*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి
*(1872,1932,1992)*: అంగీరస
*(1873,1933,1993)*శ్రీముఖ
*(1874,1934,1994)*: భావ
*(1875,1935,1995)*: యువ
*(1876,1936,1996)*: ధాత
*(1877,1937,1997)*:  ఈశ్వర
*(1878,1938,1998)*: బహుధాన్య
*(1879,1939,1999)*: ప్రమాది
*(1880,1940,2000)*: విక్రమ
*(1881,1941,2001)*: వృష
*(1882,1942,2002)*: చిత్రభాను
*(1883,1943,2003)*: స్వభాను
*(1884,1944,2004)*: తారణ
*(1885,1945,2005)*: పార్థివ
*(1886,1946,2006)*:  వ్యయ
*(1887,1947,2007)*: సర్వజిత్
*(1888,1948,2008)*: సర్వదారి
*(1889,1949,2009)*: విరోది
*(1890,1950,2010)*: వికృతి
*(1891,1951,2011)*: ఖర
*(1892,1952,2012)*:  నందన
*(1893,1953,2013)*: విజయ
*(1894,1954,2014)*: జయ
*(1895,1955,2015)*: మన్మద
*(1896,1956,2016)*: దుర్ముఖి
*(1897,1957,2017)*: హేవిళంబి
*(1898,1958,2018)*: విళంబి
*(1899,1959,2019)*: వికారి
*(1900,1960,2020)*: శార్వరి
*(1901,1961,2021)*: ప్లవ
*(1902,1962,2022)*: శుభకృత్
*(1903,1963,2023)*: శోభకృత్
*(1904,1964,2024)*: క్రోది
*(1905,1965,2025)*: విశ్వావసు
*(1906,1966,2026)*: పరాభవ
*(1907,1967,2027)*: ప్లవంగ
*(1908,1968,2028)*: కీలక
*(1909,1969,2029)*: సౌమ్య
*(1910,1970,2030)*:  సాదారణ
*(1911,1971,2031)*: విరోదికృత్
*(1912,1972,2032)*: పరీదావి
*(1913,1973,2033)*: ప్రమాది
*(1914,1974,2034)*: ఆనంద
*(1915,1975,2035)*: రాక్షస
*(1916,1976,2036)*: నల
*(1917,1977,2037)*: పింగళ
*(1918,1978,2038)*: కాళయుక్తి
*(1919,1979,2039)*: సిద్దార్థి
*(1920,1980,2040)*: రౌద్రి
*(1921,1981,2041)*: దుర్మతి
*(1922,1982,2042)*: దుందుభి
*(1923,1983,2043)*: రుదిరోద్గారి
*(1924,1984,2044)*: రక్తాక్షి
*(1925,1985,2045)*: క్రోదన
*(1926,1986,2046)*: అక్షయ

దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి
***********************

*బ్యాటరీతో నడిచే మాస్క్ సిద్ధం చేసిన ఎల్‌జీ*



ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మాస్క్ ను సిద్ధం చేసినట్లు ఎల్‌జీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్యూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్‌జీ కంపెనీ పేర్కొన్నది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఫిల్టర్లను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలుంటుంది. శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లను కలిగివుంటుంది. ఈ మాస్క్ ధరించినవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు లేదా వెలుపలికి వదిలేప్పుడు గుర్తించేందుకు సెన్సార్లను అమర్చారు. పూరికేర్ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు H13 HEPA ఫిల్టర్లను ఉపయోగిస్తుంది. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. మాస్క్ లోపల ఉండే రెండు ఫ్యాన్లు శ్వాసను మరింత సహజంగా చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిలోని బ్యాటరీ రెండు గంటలు హై మోడ్‌లో, ఎనిమిది గంటలు తక్కువ మోడ్‌లో పనిచేస్తాయి. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో ఆల్ట్రావయోలెట్ కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గుర్తించి మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్‌జీ పేర్కొన్నది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. పూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎల్జీ యొక్క వర్చువల్ ఐఎఫ్ఎ 2020 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనునన్నారు. దీని ధర ఎంతో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
*******************

రామాయణమ్.. 45


...
దశరధుడు బ్రతిమాలుతున్న కొద్దీ బెట్టు చేయడం ఎక్కువ అయ్యింది కైకకు ! .ఆవిడ ఆయనకు ప్రియసతి ! ఆవిడ మనసుకు కొంచెం కష్టం కలిగినా సహించి భరించలేడు ఆ రాజు ! .
.
మెల్లగా ఆవిడ కేశాలు తన చేతిలోకి తీసుకుని కైకా!  నీ కన్నా రాముడికన్నా! ప్రియమైన వారు ఎవరున్నారు నాకు ఈ లోకంలో ! .
.
నా రాముడి మీద ఒట్టు వేసి చెపుతున్నాను నీ కేమి కావాలో చెప్పు ,క్షణంలో తీరుస్తాను !.
.
నామీద నీకు ఎంత అధికారమున్నదో నీకు తెలుసు ,నేను చేసిన పుణ్యము మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను నీ కోరిక చెల్లిస్తాను!.
.
ఇన్ని రకాలుగా హామీలు తీసుకున్నతరువాత కైక తన మనసులో గల కోరిక వెల్లడించడానికి ఉద్యుక్తురాలయ్యింది !.
.
హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగ ఆవిడ నోట మాట బయల్పడింది !.
.
పంచభూతాలు  ,సూర్యచంద్రుల ,గంధర్వులు ,దేవతలు అందరూ కూడా నీవు పెట్టిన ఒట్లు విన్నారు ! మహారాజా నీవు నాకు మునుపు ఇచ్చిన రెండు వరములు ఇప్పుడు కోరుకో దలచుకొన్నాను . ...వాటిని సత్యసంధుడవైన నీవు ఇప్పుడు చెల్లించవలెను లేని పక్షమున నా ప్రాణములు విడువ గలదానను అని పలికింది ....అవి..
.
దశరధుడు కామముతో కప్పబడిన మనస్సుకలవాడై ,పాశములో చిక్కిన లేడిలాగ అయిపోయాడు.
.
రాముని అభిషిక్తుని చేయుటకు నీవు సకల సంభారములు సమకూర్చుకున్నావు కదా ! వాటితో రాముని బదులుగా భరతుని అభిషేకించు !
.
రెండవ వరము....రాముడు పదునాల్గు సంవత్సరములు నారచీరలు ,మృగాజినము ,జటలు ధరించి దండకారణ్యములోముని వృత్తి నవలంబించుచూ  నివసించవలె.
.
ఏ శత్రుబాధలేని రాజ్యము భరతునకు లభించుగాక!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*******************

కాశీ క్షేత్రములో

శ్రీ కంచి కామకోటి పీఠాధి శ్వర సనాతన సంస్కృతి సంరక్షణ ట్రస్ట్ ద్వారా కాశీ క్షేత్రములో నిర్వహించే వైదిక కార్యక్రమములు. భక్తుల సౌకర్యార్థం వారు సూచించబడిన రోజున గోత్రనామములతో రుద్ర చండి మన్యుసూక్తం నవగ్రహ మృత్యుంజయ జప హోమాదులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము వేద మూర్తులైన బ్రహ్మశ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యములో నిర్వహించబడును. భక్తుల సౌకర్యార్థం భారీ పిత్రు కార్యక్రమములు మాసికములు ఆబ్దికము లు సంవత్సరీకాలు. 12 రోజుల అపర కార్యక్రమములు నిర్వహించబడును. కాశీ క్షేత్రములో మాసమంతా వారి గోత్రనామాలతో అభిషేకము జరుపబడును.
ఒక జంట కి 1116 మాత్రమే మే వివరాలకు సంప్రదించగలరు
మా ఫోన్ నెంబర్ 9014411114,9014311113,9161234560.
www.kashirajapurohit.com.
ఈ కొరోనా కాలంలో కాశీ క్షేత్రమునకు భక్తులు రా లేనియెడల వీడియో కాల్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించబడును..
*************

TAKE CARE OF YOURSELF*

1. The *STOMACH* is injured when you do not have breakfast in the morning.

2. The *KIDNEYS* are injured when you do not even drink 10 glasses of water in 24 hours.

3. The *GALLBLADDER* is injured when you do not even sleep until 11 o'clock and do not wake up to the sunrise.

4. The *SMALL INTESTINE* is injured when you eat cold and stale food.

5. The *LARGE INTESTINES* are injured when you eat more fried and spicy food.

6. The *LUNGS* are injured when you breathe in smoke and stay in polluted environment of cigarettes.

7. The *LIVER* is injured when you eat heavy fried food, junk, and fast food.

8. The *HEART* is injured when you eat your meal with more salt and cholesterol.

9. The *PANCREAS* is injured when you eat sweet things because they are tasty and freely available.

10. The *Eyes* are injured when you work in the light of mobile phone and computer screen in the dark.

11. The *Brain* is injured when you start thinking negative thoughts.

12. The *SOUL* gets injured when you don't have family and friends to care and share with you in life their love, affection, happiness, sorrow and joy.

*All these parts are NOT easily available in the market*. So take good care and keep your body parts healthy.

*Happy 😊 Day*
****************

ఒక పిల్లన గ్రోవి కథ .🔻

✍🏿అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.
అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట.

*పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట.
ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా
ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు.

*ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట.
అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట.
*ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం. అలాగే గుచ్చుట ముల్లు లక్షణం. ఇంత పెద్ద శిక్షా ప్రభూ?" అని వాపోయిందట.

*మహాత్ముల కోపం తాటాకు మంట కదూ! చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదయిన ముల్లుని దయగా చూసాడు. కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే..
*మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి అయిందట. సంతోషంతో మధురంగా మ్రోగిందిట..
*****************

*విదేశీ ప్రయాణం - నివాసం*



ఒక జాతకుడు విదేశాలకు వెళతాడా? వెళ్లలేడా అనేది చూడాలంటే అతని రాహువు, లగ్న, తృతీయ, చతుర్థ, నవమ, ద్వాదశ స్థానాలు వాటి అధిపతుల స్థితియుతులను బట్టి నిర్ణయించాలి.

3  తక్కువ దూరపు లేదా తక్కువ కాలపు ప్రయాణం, దేశంలోపలి ప్రయాణాలు మాత్రమే ఉంటాయి.

4 స్వదేశం, జన్మ స్థలాన్ని సూచిస్తుంది

9 దూర ప్రయాణం

12 నష్టం అంటే తన వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని కోల్పోవడం ( దూర దేశాలలో స్థిరనివాసం )

లగ్నాధిపతి కనుక 9,12 లలో ఎక్కడ ఉన్నా అతనికి విదేశీ యాన యోగం ఉంటుందని చెప్పవచ్చు.

4 వ భావాధిపతి కనుక బలంగా ఉండి, శుభ సంబంధం ఉంటే స్వదేశంలో ఉండడం జరుగుతుంది, అది అతనికి క్షేమం కూడా. చతుర్థాధిపతి బలహీన పడి, 9  లేక 12 భావాలతో సంబంధం ఏర్పడితే ఆవ్యక్తి తప్పక విదేశాలకు వెళతాడు. 4వ భావాధిపతి 6,8 లలో ఉన్నా జన్మస్థలంతో సంబంధం దెబ్బతింటుంది.

లగ్న నవమాధి పతులు ఒకరి స్థానంలో ఒకరున్నా, పరివర్తన చెందినా తప్పక విదేశీయానం, అక్కడ ఎక్కువకాలం నివసించడం ఉంటుంది.

లగ్న ద్వాదశాధిపతులు ఒకరి స్థానంలో ఒకరున్నా, పరివర్తన చెందినా తప్పక విదేశీయానం, అక్కడే స్థిరపడడం ఉంటుంది.

తృతీయాధిపతి ఆ జాతకుని ప్రయాణాలను తెలియజేస్తాడు. తృతీయాధి పతి 9, 12 లలో ఉంటే అతనిక తప్పక విదేశీ యానం ఉంటుంది.

ఇవే నియమాలు కేపీ లో కూడా , కాకపోతే భావాధి పతి అని ఉన్న చోటల్లా, ఆభావ సబ్ లార్డ్ అని మార్చి చదువుకోవాలి.

ఉదాహరణకు లగ్న సబ్ లార్డ్ లేదా తృతీయ భావ సబ్ లార్డ్ కు కనుక 9,12 భావాలలో స్థితి గానీ, ఆభావాధిపతులతో యుతి గానీ, అభావాధి పతుల వీక్షణ గానీ కలిగితే ఆవ్యక్తి తప్పక విదేశీ యానం చేస్తాడు.

మీ
 *R VIJAY SHARMA*
9000532563
rvj.astropandit@gmail.com
*****************

*ధార్మికగీత - 4*

                             
* *శ్లో:- జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ:౹*
                     *జిహ్వాగ్రే మిత్ర బాంధవా:*౹
                     *జిహ్వాగ్రే బంధన ప్రాప్తి:౹*
                     *జిహ్వాగ్రే మరణం ధృవమ్*౹౹
                                         *****
*భా:- సమస్త మానవాళి విజ్ఞానానికి చక్కని కొలమానం నాలుక. ముప్పదిరెండు కత్తులవంటి దంతాలు, రెండుదవడల మధ్య నిరపాయ జీవనం దాని ప్రత్యేకత. మన మృదు మధుర భాషణమే ఎనలేని సిరిసంపదలు, భోగభాగ్యాలు సమకూరుస్తుంది.మన ప్రియమైన వాక్కులే స్నేహితుల్ని, చుట్టాలను హితం, సన్నిహితం చేస్తాయి. మన పరుష వాక్కులే రకరకాల చిక్కులలో, కష్టాలలో, సమస్యలలో పడవేస్తాయి. అంతెందుకు? మన కర్కశ వాక్కులే మరణానికి దారి తీయవచ్చును. హనుమ వాగ్విభవమే రామ సుగ్రీవ మైత్రికి కారకము. శిశుపాలుని వాక్పారుష్యమే అతని మరణానికి కారకము. కాలు జారితే తీసి కోవచ్చు. కాని నోరు జారితే తీసికోలేము. కాన "వాగ్భూషణం భూషణం " అని; "ముఖంబున సూనృతవాణి" అని; " వాణ్యేకా సమలంకరోతి పురుషమ్ " అని భర్తృహరి వివరించాడు. మన మూర్తిమత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి, పారదర్శకానికి ప్రతీక మన "జిహ్వ" అని గుర్తించి వర్తించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సూక్తి మరచిపోరాదు.*
                                  *****
                  *సమర్పణ : పీసపాటి*
****************

MIRACLE WITNESSED

MIRACLE WITNESSED By the Supreme Court Judge in the Court Hall during Sri Rama Janma Bhoomi Hearing
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
This interesting scene was in Supreme Court of India where the Bench was hearing the issue of Ram Janma Bhoomi.  There were counsels representing both the sides and each side had their own witnesses to provide evidences.  While Sri Parasaran was putting forth the justifications for Ayodhya As Rama Janma Bhoomi, the Honourable Judge intervened.

He asked “You quote from vedas and scriptures for proving that Rama existed and other relevant issues.  Is there any evidence in the scriptures that specify the place of birth of Sri Rama?”

An old gentleman rose from the group of witnesses.  He was one of the Pragyasakshi (Chief Witness) and his parents had named him Giridhar Mishra.  He said “Honourable Sir, I request you to refer to Rig Veda”

He specified the chapter and verse and said “There it is mentioned in Rig Veda, Gaiminiya Samhita.  These verses specify the directions and distances from a specific point on the banks of River Sarayu, to reach the birth place of Sri Rama.  If one follows those directions, one reaches a specific spot in Ayodhya”

The bench ordered for immediate verification and it was done to find that Sri Giridhar Mishra was right.  There it was glaring at them from Rig Veda. And this person was quoting the verse verbatim from memory.

The bench remarked “This is a Miracle I have witnessed today.” But the witness who was christened as Giridhar Mishra was very calm and serene as if it is a chore in the office on a normal working day.

To understand the wonder expressed by the Judge, one has to go back in Indian History, which needs overhauling at the earliest.

Year was 1950.  Month January. 14th day of the month. In the village Jaunpur in UP, Mishra couple - Pandit Rajdev Mishra and Shachidevi (It is nice to note that, that child became a main Sakshi later in life, to reclaim Rama Janma Bhoomi) – were waiting for the birth of their child.  A very hale and healthy child was born that day and they christened him Giridhar Mishra.

Giridhar Mishra was fine till a cruel hand of fate played with him when he was 2 months old.  That changed the life of the parents and the child.

Imagine a child who was eager to aquire and improve his knowledge but just could not read or write.  Pandit Rajdev would sit besides the child and recite Vedas explaining each word in each verse.  He was delighted to find that Giridhar had a great retaining capacity and could memorise every single word taught to him orally.

After imparting whatever knowledge he could,  Rajdev admitted his son in one of the Mutts of Ramanand Sampradaya.  He was taken in as a disciple and he was given a new name RAMA BHADHRA. And the child got a guru who could teach him and encourage him to expand his knowledge beyond the limits of any normal human being.

Ramabhadhra in his zeal to explore the universe of knowledge, learnt and mastered 22 languages including a few ancient ones.  He could not read or write and had to depend on his memory and its retention power. 

He learnt scriptures and modern verses too.  He became a fan of Thulsidas and explored the world of Rama Charitha Manas.

Imagine.  Somebody would read these epics and scriptures and he would store in his memory  for further analysis.  He excelled in his work often dictating to people and getting the feedback orally.

At the age of 38, in 1988, he was crowned as JAGADGURU RAMABHADHRACHARYA one of the four Jagadhgurus of Ramanandha Ashram.

You must have guessed by this time, why he could not read or write.  Yes. HE LOST HIS EYE SIGHT COMPLETELY WHEN HE WAS TWO MONTHS OLD.

It is really staggering to learn about his achievements.  The blind Jagadguru, in addition to mastering 22 languages is also famous as Spiritual Leader, Educator, Sanskrit Scholar, Polyglot, Poet, Author, Textual commentator, Philosopher, Composer, Singer, Playwright and Story Teller (Katha Artist)

He has authored more than 100 books such as Gita Ramayanam,  Sri Bharghava Raghaviyam,  Arundhathi, Ashtavakra, Kaka Vidhura and others.  He composed Sri Sitarama Suprabhatham.

As a poet he produced 28 famous set of poems (Sanskrit and Hindi) including four epics

Authored 19 famous commentaries on various scriptures, the popular one being on Rama Charitha Manas by Thulsidas.

Composer of 5 Music Albums

And 9 very popular discourses.

Founder of Jagadguru Ramabhadhracharyas University for Handicapped

Lifelong Chancellor of Tulsi Peeth ( named after Tulsidas)

He was decorated with PADMAVIBHUSHAN in the year 2015.

I was filled with amazement as I was collecting information about him.  A child who became blind and fought his way up to reach the pinnacle of knowledge and education and its propagation.  What a marvellous example to inspire one and all.  I felt very very small and insignificant,  I am sharing this with you all as it amazed me no end.

There is a niggling thought.  How many of us were aware of this great blind man.  While Helen Keller was propagated for her achievements as a blind person, and lessons are taught on her,  Jagadguru Ramabhadhracharya is a non entity in our education system.  Thats how we are.

No wonder the Judge remarked “I witnessed a miracle in my court”
*********************

సీస పద్యం

విశ్వ మందు జనులు వివిధ భాషలు పల్క
తెలివి నేర్పు మనది తెలుగు గొప్ప
పరభాష జ్ఞాన పాకులాటలుమాను
తెలుగు దనము లెస్స తెలుగు గొప్ప
అమ్మ భాష యిపుడు అధికమైతే చాలు
తెలుగు రాష్ట్రలలో తెగువ గొప్ప
భాష మరచిపోతె బతుకు దెరువు లేదు
తెలిసి మెలుగవయ్య తెలుగు గొప్ప

పలుకు తేనె భాష పతనమే కోరొద్దు
సంబరాల భాష సభలు మెచ్చు
తీపి లోన గుడుము తీయనైన తెలుగు
నీకు నాకు బలము నిజము గాను
****************

వామన దేముడు




వినాయకుడు గణాపదిత్యం సాధించుట:


ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
సమస్త గణములను పాలించేందుకు, నడిపించేందుకు మాకో అధిపతి కావాలి, అందుకు తగినవాడిని మీరే చూడాలి అని కోరారు. చాలా పుస్తకాల్లో విఘ్నాధిపత్యం అని ఉంది, కానీ వినాయకుడు దేవతాగణాలతో, రుద్రగణాలతో పొరాడి, శివుడి త్రిశూలానికి తలతెగి క్రింద పడిన తరువాత, ఆయన శక్తియుక్తుల్ని చూసి, దేవతలు వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. కనుక అప్పుడు ఉమాపుత్రుడు విఘ్నేశ్వరుడయ్యాడు. కానీ దేవతలు ఇక్కడ గణాధిపత్యం గురించి అడిగారు. సృష్టి, స్థితి, లయ కారకులు బ్రహ్మావిష్ణుమహేశ్వరులు. బ్రహ్మ పంచభూతాలకు, సృహ్స్టికి ఆధారమైన గణాలకు అధిపతి, విష్ణువు ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన అష్టదేవతలకు, వారి అనుచరులకు, ఆయా గణములకు అధిపతియై పోషణమును చేస్తున్నాడు, శివుడు లోకాలను సహరించు రుద్ర గణాలకు, భూతప్రేతపిశాచాది గణాలను నియంత్రిస్తూ విశ్వమును నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురి బాధ్యతను స్వీకరించి, సమస్త గణాలను అదుపాజ్ఞాల్లో ఉంచేవాడు గణాధిపతి కాగలడని చెప్పిన పరమశివుడు, మీలో ఎవరు సమర్ధులో చెప్పండి అన్నారు దేవతాగణాలతో. ఇంత పెద్ద బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడం కష్టమని ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో అక్కడికి కుమారస్వామి తన మయూరవాహనం మీద వేగంగా వచ్చి, వాహనం దిగి శివపార్వతులకు నమస్కరించి కూర్చున్నాడు. అక్కడున్న కొన్ని గణాలు కుమారస్వామికే గణాధిపత్యాన్ని ఇవ్వాలని జయజయధ్వానాలు చేశారు. ఇంతలో తన ఎలుక వాహనం మీద గణపతి చేరుకుని, సభాసదులందరికి నమస్కరించాడు. అంతే, అందరూ విఘ్ణేశ్వరుడే గణాధిపత్యానికి తగినవాడని జయము జయము అంటూ అరిచారు. కుమారస్వామి వైపునున్న సైన్యం 'మా స్వామిని జయించిన వారు ఆ ఆధిపత్యమును స్వీకరించవచ్చు' అని చెప్పగా, గణపతి వైపు ఉన్న శక్తులు గణపతిని సమర్ధిస్తూ, రుద్రగణాలను, దేవేంద్రాదిదేవతాగణాలను చితగొట్టిన ఘనులు మా ప్రభువైన విఘ్నేశ్వరుల వారే. ఎందరో రాక్షసుల పీచమణిచారు. వారికి సమానామైన వారు ఎవరైనా ఉన్నారా? అంటూ గణపతికే ఆధిపత్యం ఇవ్వమని చెప్పారు.

వారి వాదనలని విన్న శివుడు వారితో చిరునవ్వుతో ' పిల్లలారా! మీలో ఎవరూ ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని గణాధిపత్యానికి అర్హులుగా నిర్ణయించి, వారికా ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి' అని పలికాడు. ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. కూమారస్వామి వాహనం నెమలి, చాలా వేగంగా వెళుతుంది, ఎగరగలదు. గణపతి వాహనం చిన్న ఎలుక, ఎగరలేదు, గణపతి పెద్దవాడు. వెంటనే గణపతి ఏమాత్రం దిగులు చెందకుండా తాపీ
గా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి, చేతులు జోడించి నమస్కరించి "జననీజనకులారా ....... ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే, వారు ముల్లోకల్లోని మూడుకోట్ల యాభైలక్షల పుణ్యతీర్ధాల్లో స్నానం చేసిన పుణయం పిందుతారని వేదశాస్త్రాలు ఘోషితున్నాయి. కనుక వేదమూర్తులు, నా తల్లిదండ్రులైనమీ చుట్టు ప్రదక్షిణం చేస్తున్నానని మూడు ప్రదక్షిణలు చేశాడు. చెప్పి గణపతి మూడు ప్రదక్షిణలు చేయగా, కుమారస్వామి 3 లోకాల్లో నదికి వెళ్ళినా, ప్రతి నది దగ్గర గణపతి తనకంటే ముందు స్నానం చేసి, వెళ్ళిపోవడం చూశాడు.
                                                   
మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళినా, గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంగా కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళెసరికి గణపతి కనిపించాడు. అప్పుడు షణ్ముకుడు పశ్చాత్తాపంతో ' నాన్నగారూ! అన్నగారి మహిమనాకు తెలియలేదు. నన్ను అహం కమ్మేసింది. అందుకే అలా ప్రవర్తించాను. నాకు అన్నగారే ఒకప్పుడు మయూరవాహనం ఇచ్చారు. బుద్ధిలో అన్నయ్యే నాకంటే అధికం.. నా కన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు కనుక గజాననుడినే గణాధిపతిని చేయండి' అన్నాడు.

ఈ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి గణాధిపత్యం వేడుకని జరిపించాడు. ఈ వృత్తాంతం ద్వారా గణపతి లోకానికి తల్లిదండ్రుల విలువను చాటి చెప్పారు. తల్లిదండ్రులే సమస్త పుణ్యతీర్ధాలు, వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి, ఎవరు తీర్ధయాత్రలు చేస్తారో, వారు పుణ్యం పొందకపోగా, అతిమకాలంలో నరకానికి వెళతారని శాస్త్రం చెప్తోంది. మన ముందు కనిపించే దైవస్వరూపాలు తల్లిందండ్రులు. అందుకే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణంతో మహాగణపతి అయినాడు.

అట్లాగే ప్రతీసారీ కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలని చెప్తుందీ వృత్తాంతం. కొంతమంది Management నిపుణులు ఈ కధను Crisis Management లో భాగంగా చెప్తారు. కష్టాలను బుద్ధిబలంతో ఎదురుకున్నవాడే అసలైన ప్రజ్ఞావంతుడని చెప్తున్నదీ వృత్తాంతం.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
జై శ్రీమన్నారాయణ
******************

గురువు నుండి నేర్చుకునేది పావుభాగమే!

ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేథయా ।
 

గురువు నుండి నేర్చుకునేది పావుభాగమే!

ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।
పాదం సబ్రహ్మచారిభ్యః,
పాదం కాలక్రమేణ చ ॥

విద్యార్థి జ్ఞాన సముపార్జనా మార్గాలని లేదా విధానాలని గురించి తెలియ చెప్పే సుభాషితం.

ఆచార్యుడు లేదా గురువు లేదా teacher వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది ఒక నాలుగవ వంతు మాత్రమే. మరి ఒక నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు. మరి మూడవ భాగమైన నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారులతోనూ అనగా తోటి విద్యార్థులతోడి చర్చలద్వారా, discussions ద్వారానూ, interactions ద్వారానూ నేర్చుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు.

అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు. అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అని తాత్పర్యం.
పాదం సబ్రహ్మచారిభ్యః, పాదం కాలక్రమేణ చ ॥

విద్యార్థి జ్ఞాన సముపార్జనా మార్గాలని లేదా విధానాలని గురించి తెలియ చెప్పే సుభాషితం.

ఆచార్యుడు లేదా గురువు లేదా teacher వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది ఒక నాలుగవ వంతు మాత్రమే. మరి ఒక నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు. మరి మూడవ భాగమైన నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారులతోనూ అనగా తోటి విద్యార్థులతోడి చర్చలద్వారా, discussions ద్వారానూ, interactions ద్వారానూ నేర్చుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు.

అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు. అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అని తాత్పర్యం.
*****************

*అరసున్న [ఁ],*

*అరసున్న [ఁ],*
*బండి 'ఱ' లు ఎందుకు?*

*అరసున్న~బండి ‘ఱ‘ లు*
*నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.*

*ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.*

*ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి.*

*అంతేకాదు*
*కావ్యభాషలోను,*
*లక్షణశాస్త్రంలోను*
*వీటి ప్రాముఖ్యం చాలావుంది.*

*వాడకపోతే పరవాలేదు*
*కానీ*
*వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా!*

*మన భాషాసంపదలో*
*ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!*

*అరసున్న, ఱ ల వల్ల*
*అర్థభేదం ఏర్పడుతొంది.*

*పదసంపదకి ఇవి తోడ్పడతాయి.*

*ఎలాగో చూడండి:*
*ఉదా*:-

*అరుఁగు*
*= వీది అరుగు*

*అరుగు*
*= వెళ్ళు, పోవు*

*అఱుగు*
*= జీర్ణించు*

*ఏఁడు*
*= సంవత్సరం*

*ఏడు*
*= బాధ~7 సంఖ్య*

*కరి*
*= ఏనుగు*

*కఱి*
*= నల్లని*

*కాఁపు*
*= కులము*

*కాపు*
*= కావలి*

*కాఁచు*
*= వెచ్చచేయు*

*కాచు*
*= రక్షించు*

*కారు*
*= ఋతువుకాలము*

*కాఱు*
*= కారుట (స్రవించు)*
(కారు=వాహనం ఆంగ్ల పదము)

*చీఁకు*
*= చప్పరించు*

*చీకు*
*= నిస్సారము, గ్రుడ్డి*

*తఱుఁగు*
*= తగ్గుట*

*తఱుగు*
*= తరగటం(ఖండించటం)*

*తరి*
*= తరుచు*

*తఱి*
*= తఱచు*

*తీరు*
*= పద్ధతి*

*తీఱు*
*= నశించు*

*దాఁక*
*= వరకు*

*దాక*
*= కుండ, పాత్ర*

*నాఁడు*
*= కాలము*

*నాడు*
*= దేశము, ప్రాంతము*

*నెరి*
*= వక్రత*

*నెఱి*
*= అందమైన*

*నీరు*
*= పానీయం*

*నీఱు*
*= బూడిద*

*పేఁట*
*= నగరములో భాగము*

*పేట*
*= హారంలో వరుస*

*పోఁగు*
*= దారము పోఁగు*

*పోగు*
*= కుప్ప*

*బోటి*
*= స్త్రీ*

*బోఁటి*
*= వంటి [నీబోఁటి]*

*వాఁడి*
*= వాఁడిగాగల*

*వాడి*
*= ఉపయోగించి*

*వేరు*
*= చెట్టు వేరు*

*వేఋ*
*= మరొకవిధము*

*మన తల్లిదండ్రులు*
*మన మాతృభాష*
*ఎంతో విలువైనవి*

*గుర్తుంచుకుందాం*
*గౌరవించుకుందాం*

*ఇవి మన సంపద*
*తెలుసుకుని సంతోషపడదాం*
********************

ఆమె పేదల 'మదర్*

ఆమె పేదల 'మదర్*
*మనహిందువులకు కనిపించే దైవం*
పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మతప్రచారానికి..
వచ్చిన ధెరిసా కాదు. అందుకే ఆమెకు ప్రచారం లేదు..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్ భక్తి యాదవ్ (91) వయసు మీద పడ్డా 69ఏళ్లుగా వైద్య వృత్తినే  మానవ సేవగా భావిస్తున్నారు. ఆమె ధృఢ సంకల్పానికి వయస్సు అడ్డురాలేదు. డబ్బు కోసం ఆమె ఎప్పుడూ వెంపర్లాడలేదు. 1948నుంచి నేటి వరకు ఎన్నో వేల మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించిన గ్రేట్ డాక్టర్.
చిన్న గాయానికి చికిత్స చేసేందుకే.. వేలకొద్ది ఫీజులు వసూలు చేసే డాక్టర్లున్న నేటి సమాజంలో.. పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తూ వారి పాలిట నిజమైన దైవం అయ్యారు.

91ఏళ్ల వయసులో.. వణుకుతున్న చేతులతో ఆమె ఇప్పటికీ వైద్య చికిత్సల్లో తలమునకలై ఉన్నారంటే.. వృత్తి పట్ల ఆమె ఆరాధన, నిబద్దత ఎంత చిత్తశుద్దితో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు.

మరో విశేషమేంటంటే.. మన దేశంలో మొదటి మహిళా ఎంబీబీఎస్ డాక్టర్‌ భక్తి యాదవ్.  తన వద్దకు వైద్యం కోసం వచ్చిన గర్భిణులకు దాదాపుగా చాలా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేయడానికి కృషి చేస్తున్నది. మధ్యప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంత మహిళలకు కూడా భక్తి యాదవ్ వైద్య సేవలు అందిస్తున్నారు.  వైద్య చికిత్స్ కోసం ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వందల మంది తరలివస్తుంటారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అన్‌సంగ్‌ లీడర్స్‌ కేటగిరీలో భక్తి యాదవ్ కు 2017సంవత్సరానికి గాను #పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

ఏదేమైనా 60ఏళ్లు దాటగానే విశ్రాంత జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచనకు బదులు.. తుది శ్వాస వరకు వైద్య సేవలు అందించాలన్న భక్తి యాదవ్ తాపత్రయం.. అందునా పేదల కోసం ఇంకా చేయాలన్న ఆమె తపనకు #నమస్కారం చెప్పాల్సిందే.
**************

**సౌందర్య లహరి**

ప్రక్షిప్త శ్లోకము - 1

( **శ్రీ శంకర భగవత్పాద విరచితము**)

(శ్రీ లలితాంబికాయైనమః)

( సౌందర్య లహరి స్తోత్రం లో మూడు శ్లోకాలు ప్రక్షిప్త శ్లోకాలు గా
ప్రచారంలో ఉన్నాయి)

"సమానీతః పద్భ్యాం _ మణిముకురతా మమ్బరమణిః
భయాదన్తర్బద్ద _ స్తిమిత కిరణ శ్రేణి మసృణః !
 దధాతి త్వద్వక్త్రం _ ప్రతిఫలిత మశ్రాన్త వికచం
 నిరాతంకం చంద్రాన్నిజ హృదయ పంకేరుహ మివ !!

ఈ శ్లోకం లో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమ ను స్తుతించారు.

అమ్మా! భగవతీ!ఆకాశానికి మణివంటివాడైన సూర్యుడు నీ పాదసేవ
కుడుగానూ , నీవు పాదములుం చే మణిదర్పణం గానూ ఏర్పడినవాడై
యున్నాడు. అమిత ప్రకాశవంతమైన నీ ముఖాన్ని ౘూసి , అతడు భయపడి
తన వేయి సూర్యకిరణాలను పైకి ప్రసరింౘ నీయకుండా తన లోనే అణౘు
కుంటున్నాడు. నీ కిరీటమందున్న చంద్రుడి చేత, తన హృదయంలో ని తామర( నీ ముఖ ప్రతిబింబము ) ముడుౘుకొనకుండా వికాసము పొంది వెలుగు చుండగా దానిని ధరిస్తున్నాడు.

సూర్యుడు శ్రీదేవి ముఖ పద్మాన్ని ధ్యానిస్తూ దేవీ పాదసేవను చేస్తున్నాడని
భావము. సూర్యుడు దేవీ పాదపీఠ రూపమైన మణిదర్పణముగా స్వీకరింపబడ్డాడు. ఆ దర్పణంలో ప్రతిబింబించిన శ్రీదేవి ముఖ పద్మము, వికసించిన
సూర్యుని హృదయ పద్మము వలె ఉన్నది.

ఓం సర్వజ్ఞాయైనమః
ఓం సాంద్రకరుణాయైనమః
ఓం సమానాధికవర్జితాయైనమః
🙏🙏🙏

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

https://chat.whatsapp.com/BX9q7cjvzxzLGb99dapVRi
**************

మహా సంకల్పం

మహా సంకల్పం లో ఈ పేర్లు వస్తాయి.. చూడండి


భారత వర్షం, ఇంద్రద్వీపం, కసేరు, తామ్రపర్ణి, గభస్తిమంతం, నాగద్వీపం, సౌమ్యం, గంధర్వం, వారుణం అని తొమ్మిది భాగాలుగా ఉంది. దీని తూర్పున కిరాతులు, పడమటి వైపు యవనులూ ఉన్నారు. దీని పుణ్యనదుల ఒడ్డున పాఞ్చాల, మధ్యదేశ, పూర్వదేశ, కామరూప, పుండ్ర, కళింగ, మగధ, దాక్షిణాత్య, అపరాంత, సౌరాష్ట్ర, శూర, ఆభీర, అర్బుదగణ, కారూప, మాళవ, పారియాత్ర, సౌవీర, సైంధవ, హూణ, కోవల, మద్ర, అరామ, అంబష్ఠ, పారశీక దేశవాసులు నివసిస్తున్నారు. ఈ భారత దేశంలో సత్యా, త్రేతా, ద్వాపర, కలియుగాలని నాలుగు యుగాలు ఉన్నాయి. ఇవి మరెక్కడా లేవు. వెయ్యి జన్మలెత్తాక ఎంతో పుణ్యము చేసుకున్నందువలన ఈ దేశంలో మనిషి జన్మ లభిస్తుంది. 


శ్రీ విష్ణుపురాణంలో - భారత వర్షంలో పుట్టిన మనుషులు దేవతల కంటే కూడా భాగ్యవంతులని చెప్పబడింది. అందుకే ఇక్కడ పుట్టిన భారతీయుల ఖ్యాతి గురించి దేవతలు కూడా గానం చేస్తూ ఉంటారు. 


అతః పరం ప్లక్షాదీనాం ప్రమాణలక్షణసంస్థానతో వర్షవిభాగ ఉపవర్ణ్యతే
జమ్బూద్వీపోऽయం యావత్ప్రమాణవిస్తారస్తావతా
క్షారోదధినా పరివేష్టితో యథా మేరుర్జమ్బ్వాఖ్యేన
లవణోదధిరపి తతో ద్విగుణవిశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తో
యథా పరిఖా బాహ్యోపవనేన ప్లక్షో జమ్బూ
ప్రమాణో ద్వీపాఖ్యాకరో హిరణ్మయ ఉత్థితో యత్రాగ్నిరుపాస్తే
సప్తజిహ్వస్తస్యాధిపతిః ప్రియవ్రతాత్మజ
ఇధ్మజిహ్వః స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య
ఆత్మజేభ్య ఆకలయ్య స్వయమాత్మ యోగేనోపరరామ

జంబూ ద్వీపం ఎంత పొడవూ వెడల్పూ వైశాల్యమూ ఉన్నదో అంత కొలతా ఉన్న ఉప్పు సముద్రం జంబూ ద్వీపం చుట్టూ ఉంది. మేరు పర్వతం జంబూ ద్వీపముతో ఆవరించబడి ఉనట్లుగా ఉప్పు సముద్రం కూడా దాని కంటే రెండు రెట్లు వైశాల్యం ఉన్న ప్లక్ష ద్వీపముతో ఆవరించబడి ఉన్నది. జంబూ ద్వీపమూ దాని చుట్టూ లవణ సముద్రం, దాని చుట్టూ ప్లక్షం. ద్వీపమూ - సముద్రమూ - ద్వీపము. ద్వీపానికి సముద్రము హద్దు, సముద్రానికి ద్వీపం హద్దు. ప్లక్ష ద్వీపములో ఏడు నాలికలు గల అగ్ని ఆరాధించబడతాడు. జంబూద్వీపంలో ఎంత పెద్ద నేరేడు చెట్టు ఉందో అంతా పెద్ద ప్లక్ష వృక్షము (జువ్వి చెట్టు) ప్లక్ష ద్వీపములో ఉంది. బంగారపు చెట్టు అది. ఆ ప్లక్ష వృక్షం వలననే ఆద్వీపానికి ప్లక్ష ద్వీపం అని పేరు వచ్చింది. ప్రియవ్రతుని కుమారుడైన ఇద్మజిహ్వుడు ఈ ద్వీపానికి అధిపతిగా ఉండేవాడు. ప్లక్ష ద్వీపాన్ని ఏడూ వర్షాలుగా విభజించి, ఏడు కుమారుల పేర్లు వాటికి పెట్టి, వారికి అవి పంచి; పరమాత్మను ఆరాధించడానికి వెళ్ళిపోయాడు ఇద్మజిహ్వుడు.

శివం, యవనం, సుభుద్ర, శాంతం, క్షేమం, అమృతం, అభయం - ఈ ఏడు ప్లక్ష ద్వీపములోని వర్షాల పేర్లు. వీటిలో మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంత్రం, సువర్ణం, హిరణ్యష్ఠీవం, మేఘమాల అని ఏడు మహా పర్వతాలూ, అరుణ, నృమ్ణ, ఆంగీరసి, సావిత్రి, సప్రభాత, రుతుభర, నత్యంబర అని ఏడు నదులు ఉన్నాయి. ఈ నదుల జలమును స్పృశిస్తే అన్ని పాపాలూ తొలగిపోతాయి. ఈ ద్వీపములో నాలుగు జాతులున్నాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ అనే వర్ణాలున్నాయి.

ఇలా ఈ పంచమ స్కంధం లో చాల మంచి విలువైన సమాచారం ఉంటుంది..
ఇట్లు
శివ పరివారం

స్కూల్ టీచర్




పోత‌న క‌లంలో...వామ‌నావ‌తారం


              🌻🌻
(వామ‌న జ‌యంతి ప్ర‌త్యేకం)
(భాద్ర‌ప‌ద బ‌హుళ‌ ద్వాద‌శి)

వామానావ‌తారాన్ని పోత‌న
త‌న ప‌ద్యచిత్ర‌ణ ద్వారా
తెలుగు ప్ర‌జ‌ల క‌ళ్ల‌ముందు నిల‌బెట్టాడు.

ఒక్కొక్క ప‌ద్యం చ‌దువుతూ వామ‌నావ‌తార ఘ‌ట్టాన్ని
స్మ‌రించుకుంటే మీ కళ్లెదుటే విష్ణుమూర్తి ,
బ‌లిచ‌క్ర‌వ‌ర్తి గ‌ర్వాన్ని అణిచిన‌ దృశ్యం
క‌నిపించేలా వామ‌నావ‌తార ‌ఘ‌ట్టానికి
 ప్రాణం పోశాడు పోత‌న‌.

వామ‌న జ‌యంతి సంద‌ర్భంగా
పోత‌న ప‌ద్యాలు చ‌దివి త‌రించండి.
తెలుగువాడిగా గ‌ర్వించండి.
            ***
 శ్రవణ ద్వాదశి- (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు)నాడు వామ‌నావ‌తారంలో విష్ణుమూర్తి అవ‌త‌రించాడు.

వామనుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, మకరకుండల మండిత గండ భాగుడై,కపిల రంగు వస్త్రమూ, కదంబ వనమాల సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా, జ‌గ‌న్మోహ‌నుడిగా అదితి గ‌ర్భం నుంచి అవ‌త‌రించాడు.
వెంట‌నే,
తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, కపట వటుని వలె, ఉపనయన‌ వయస్కుండై వామన బాలకుడయ్యాడు.

వామనుడికి వడుగు చేయడంకోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్నీ; కశ్యపుడు ముంజ (దర్భల మొలత్రాడునూ); అదితి కౌపీనాన్నీ (గోచీని); భూదేవి నల్లని జింకచర్మాన్నీ; చంద్రుడు దండాన్నీ; ఆకాశం గొడుగునూ; బ్రహ్మ కమండలాన్ని; సరస్వతీదేవి జపమాలనూ; సప్తఋషులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చారు.
     **
భిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా!
   
యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి భిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణభిక్ష పెట్టింది.

హోమ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని భిక్ష కోసం ,
గ‌ర్వంతో విర్ర‌వీగుతున్న బ‌లిచ‌క్ర‌వ‌ర్తి వ‌ద్ద‌కు వెళ్లాడు వామ‌‌నుడు.
                 ***
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్

ఔరా! హృద‌యంపై లక్ష్మీదేవిని కలిగిన మహా సంపన్నుడు విష్ణుమూర్తి. అయినా, అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో.
                         ***
మనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు......


శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.

     అలా వేంచేసిన వామనుని చూసి, సభలోనివారు “శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందమూ ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు.” అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు.

                         ***
వటుని పాద శౌచవారి శిరంబునఁ
బరమ భద్ర మనుచు బలి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.

జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏనీళ్ళను తలపై ధరిస్తాడో, అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు.
                          ***
  ఆ త‌ర్వాత బ‌‌లి చ‌క్ర‌వ‌ర్తి , వామ‌నుడిని అడుగుతున్నాడు....

వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యది
య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్
కడు ధన్యాత్ముడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నా కోరికల్
కడ తేరెన్ సుహ్రుతంబులయ్యె సఖులున్ కళ్యాణ మిక్కాలమున్ !!

ఓ బ్రహ్మచారీ! నీపేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడంవల్ల నావంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది. అన్నాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి.
                 ****
 నీకేం కావాలో కోరుకో..అంటున్నాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి వామ‌నుడితో...

వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "

   ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?” అని అడిగాడు.
                                        ****
ఒంటి వాడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
కోర్కె దీర బ్రహ్మ కూకటి ముట్టెద
దాన కుతుక సాంద్ర దానవేంద్ర !!

ఓ దానవరాజా! దానం చేయలనే చిక్కని కుతూహలం కలవాడా! బలిచక్రవర్తీ! నేను ఒంటరివాడిని. నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను.
                          ***
అర్థించేవాడికి లేక పోయినా , దాత గొప్ప‌తనాన్నిచూసి అయినా గొప్ప‌గా అడ‌గాలి క‌దా అంటున్నాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి...
ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె. "

“ఓ బ్రాహ్మణుడా! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు దాత గొప్ప దనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా
                     ***

 ఎలాంటి దానం అడ‌గాలో వామ‌నుడికి చెబుతున్నాడు బ‌లి...

వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్
వెస నూహించితొ కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో
పసి బాలుండవు నేరవీవడుగ నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పద త్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే ?

 “భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుఱ్ఱాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను.” అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.
             ****

గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో
వడుగే నెక్కడ? భూములెక్కడ ?కరుల్ వామాక్షు లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితం బైన మూ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ !!

“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం..... అన్నాడు వామ‌నమూర్తి.
                ***
ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.

రాక్షస మహారాజా! ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృధుచక్రవర్తీ గయుడూ మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. వారు సైతం వృథాగా కష్టపడినవారే కానీ అర్థంమీదా కామంమీదా ఆశలను వదలుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా. అని బ‌లి చ‌క్ర‌వ‌ర్తితో వామ‌నుడు అన్నాడు.
              ***

సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు-
  సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు-
  సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ-
  తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును-
  జలధార ననలంబు సమయునట్లు
                      **
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు. "

తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషంవల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకూ తనంతతానుగా దొరికినదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ళ వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుఅడుగులూ కాదనకుండా ఇమ్ము. అంతే చాలు. అదే చాలు.”...అన్నాడు వామ‌నుడు.
                        ***
రాక్ష‌సుల గురువు శుక్రాచార్యుడు ,వామ‌నుడి తీరు గ‌మ‌నించి
వ‌చ్చిన‌వాడు విష్ణుమూర్తి అని గ్ర‌హించి ,
 దానం చేస్తాన‌ని ఇచ్చిన మాట వెన‌క్కి తీసుకోమ‌ని
 బ‌లిని హెచ్చ‌రించాడు.
ఇచ్చిన మాట త‌ప్ప‌డం ఎలా అన్నాడు బ‌లి.

దానికి శుక్రాచార్యులు.....బ‌లికి ధైర్యం చెబుతున్నాడు.

వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు నఘము వొంద దధిప !!

ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు. ఇది రాజ‌నీతి అన్నాడు.
                       *****
ఏవేవో కుంటిసాకులు చెప్పి మాట‌త‌ప్ప‌డం స‌రికాద‌ని అంటూ బ‌లి చ‌క్ర‌వ‌ర్తి , శుక్రాచార్యునితో అంటున్నాడు.....

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందిరే
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై
పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాయులై
ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా !!

శుక్రాచార్యా! పూర్వ కాలంలో కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా. అన్నాడు.
బలిచక్రవర్తి రాక్షసరాజైనా సత్యసంధుడు. సంప‌ద శాశ్వ‌తం కాద‌ని ఎరిగిన జ్ఙాని; కనుకనే ఆచార్యుడు శుక్రుడు చెప్పిన రాజనీతిని కాదని అంటూ దానం చేయాల్సిందేన‌ని తన నిర్ణయం చెప్పాడు.
                                   ***
స‌క‌ల జ‌గ‌త్తుకూ మూల‌మైన
వామన మూర్తి యాచనా హస్తం కింద‌,
 దాత‌గా త‌న హ‌స్తం పై న ఉండ‌డాన్ని
 ఆలోచించుకుని ఉప్పొంగి పోయాడు బ‌లి....

ఆదిన్ శ్రీసతి కొప్పు పై తనువు పై నంసోత్తరీయంబు పై
పాదాబ్జంబుల పై కపోల తటి పై పాలిండ్ల పై నూత్న మ
ర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !!

ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం దాత‌గా నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా. అనుకున్నాడు బ‌లిచ‌క్ర‌వ‌ర్తి..
                               ***
అంతేకాదు.....వంశ‌నిర్మూల‌నం అయినా స‌రే దానం చేయాల్సిందేన‌ని
మాట త‌ప్ప‌న‌ని శుక్రాచార్యుడితో బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అంటున్నాడు....

నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దు
ర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో
హరుడైనన్ హరియైన నీరజ భవుండభ్యాగతుండైన నౌ
తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్ !!
                                ***
మిగతా విష‌యాలు అన్నీ అనవసరమయ్యా! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, చివ‌ర‌కు నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్ధలవటం కాని, నిజంగానే వస్తే రానివ్వు; జరిగితే జర‌గ‌నివ్వు; ఏమైనా సరే నేను మాత్రం అస‌త్య‌మాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య! అన్నాడు.
                               ****
వెంట‌నే ప‌విత్ర‌జాలాల్ని అందుకుని.. బ‌లిచ‌క్ర‌వ‌ర్తి దానం చేస్తున్నాడు..
             
విప్రాయప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే
దప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి యంచున్ క్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వటువున్ చేసాచి కొమ్మంచు బ్ర
హ్మప్రీతమ్మని ధార వోసె భువనంబాశ్చర్యమున్ వొందగాన్ !!

బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. “బ్రాహ్మణుడవూ; ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు; విష్ణు స్వరూపుడవూ; వేదాల నియమాలు తెలిసినవాడవూ; అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక.” అంటూ వెనువెంటనే ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది.
                      ****
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే
చిట్టి పొట్టి బ్రహ్మచారి, ఇంతై, అంతై, దానికంతంతై...అలా అలా.... ఎదగటం మొదలు పెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం..దాన్ని కూడా దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
                               ****

రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై
శ్రవణాలంకృతి యై గళా భరణామై సౌవర్ణ కేయూర మై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠ మై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ !!

వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప శ్రీ మ‌హా విష్ణువు బ్రహ్మాండానికి ఎదిగాడు...
              ****
 ఆత‌ర్వాత‌....

ఒక పాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్టక బ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్.

విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు తన ఒక పాదముతో భూలోకాన్ని కప్పి, మొదటిఅడుగుగా స్వర్గలోకాన్ని దాటి రెండవ పాదముంచాడు. రెండవ అడుగుగా వేసిన పాదంతో పైలోకాలను అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడంవలన బ్రహ్మాండభాండం పైపెంకు పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై సంశోభించాడు
                                 ****
ఇస్తాన‌న్న మూడు అడుగుల‌లో రెండు అడుగులూ భూమి, ఆకాశం అయిపోయాయి. ఇక మిగిలిన మూడ‌వ అడుగుకు ఏం చేస్తావ‌న్నాడు విష్ణుమూర్తి, బ‌లి చ‌క్ర‌వ‌ర్తిని..
దానికి బ‌లి స‌మాధాన‌మిస్తూ మాట‌త‌ప్పేది లేదు నా త‌ల‌పై పెట్టు అన్నాడు.

సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!

ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా
అంటూ శిర‌స్సుచూపించాడు...

   ****
బ‌లిచ‌క్ర‌వ‌ర్తి భార్య వింధ్యావ‌ళి వామ‌నుడి పాదాల‌పై బ‌డి ప‌తి భిక్ష పెట్ట‌మని వేడుకుంటుంది.
బ‌లి శ‌ర‌ణువేడుకుంటాడు.. బ‌లికి తాత అయిన ప్ర‌హ్లాదుడు విచ్చేసి బ‌లి త‌ప్పుల‌ను క్ష‌మించ‌మ‌ని వేడుకుంటాడు. బ్ర‌హ్మ కూడా వ‌చ్చి బ‌లిని క‌రుణించ‌మ‌ని అంటాడు.
ఆ ర‌కంగా బ‌లిని సుత‌ల లోకానికి పంపుతాడు విష్ణుమూర్తి..

ప‌ర‌మాత్మ క‌రుణ పొందిన బ‌లి చక్ర‌వ‌ర్తి

ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
మన్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపద గల్గనేర్చునే?"

“ఓ శేషశాయిశయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా, ఈ మాటలు, మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు. అని బ‌లి చ‌క్ర‌వ‌ర్తి విష్ణుమూర్తికి న‌మ‌స్క‌రించి సుత‌ల లోకానికి వెళ్లిపోయాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి....
                                                      ***
వామ‌నావ‌తార ఘ‌ట్టాన్ని చ‌దివిన‌,విన్న‌వారంద‌రికీ స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.
                                                      ***

      🏵️ ‘పోత‌న పదం🏵️
  🏵️ భ‌క్తి ర‌సం ,ముక్తి ‌ప‌థం🏵️
*******************

452. తేజోవతీ

సూర్యుడు మొదలగు తేజోమూర్తులకు ఆధారభూతురాలు ఆ పరమేశ్వరి నుండి అనేక వేలకోట్ల కిరణాలు ప్రసరిస్తున్నాయి. అందులో అగ్ని 108 కిరణములు సూర్యుడు 116 కిరణములు చంద్రుడు 136 కిరణములు వెరసి 360 కిరణములను
గ్రహించగలిగారు. సూర్యుని ప్రకాశమువల్ల పగలు, చంద్రకాంతులవల్ల రాత్రి, అగ్ని
కాంతులవల్ల సంధ్యవేళలయందు ఈ జగత్తులోని వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. అని గతంలో వివరించాం. అయితే ఈ కిరణాలన్నీ శ్రీచక్రంలోని నవావరణల నుంచే ప్రసరిస్తున్నాయి అని కూడా అంటున్నారు.


త్రికోణంలో 3x5= 15 కిరణములు
అష్టకోణంలో 8x1= 8 కిరణములు
అంతర్దశారంలో 10X2 =20 కిరణములు
బహిర్ధశారంలో 10X6 =60 కిరణములు
చతుర్దశారంలో. 14x4=56 కిరణములు
అష్టదళపద్మములో 8x8 =64 కిరణములు
షోడశదళపద్మములో 16 x7=112 కిరణములు
భూపురంలో. 10X3 =30 కిరణములు

                         మొత్తం 365 కిరణములు

ఇవే సంవత్సరానికి రోజులు. లలితా సహస్రంలోని శ్లోకాల సంఖ్య 182 1/2 అంటే 365 పాదాలు. ఇవే కాంతి కిరణాలుగా భావించాలి అని చెప్పారు. అయితే వృత్తము లేక బిందువులో 360 కిరణాలు లేదా డిగ్రీలు ఉంటాయి. అంతేకాని 365 కాదు. అందుచేత ఈ లెక్క సరిగా అగుపించటం లేదు. అయినప్పటికీ
వారి మతాన్ని కూడా ప్రతిపాదించాం. ఈ రకంగా కాంతిని ఇచ్చే వాటికి మూలాధారమైనది కాబట్టి తేజోవతీ అనబడుతుంది.

శ్రీమాత్రే నమః

ధర్మ ప్రచారం

వెంకటేశ్వర ప్రసాదు
*****************

value of life

One day I went to market buy Grapes 🍇🍇😄

Me: How much for a kilo..??😀
Seller: kilo Rs. 80..sir😊

There were some loose grapes on the other corner of the cart.. 🍇🍇😀

Me: what's the price for these ..?? 🤔
Seller: kilo Rs. 30 only ..sir😀

He was selling the loose ones at very less price...😇
When asked the same he said;
they are also good but they have separated from the bunch..their life is less and also people don't like loose grapes😊🍇🍇

Similarly..,
When we are separated from our relations , friends and family our value and strength decreases too. 🍇🍇😞😟

Don't detach yourself from the bunch. 🍇🍇🍇
Be always in touch with your family, friends and relations.
*****************

#శివలింగాలు_రేడియోధార్మికత

#శివలింగాలు_రేడియోధార్మికతతో_ఉంటాయా??

అవును 100% నిజం !!#అదెలాగో_చూద్దాం..

 భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి, మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది.

శివ లింగం అణు రియాక్టర్లు తప్ప మరొకటి కాదు,అందుకోసం మాత్రమే లింగాలకు నీరు అందించబడుతుంది, తద్వారా అవి ప్రశాంతంగా ఉంటాయి.

#బిల్దేవా,
#అక్మద్,
#ధాతురా,
#గుధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు.

****ఎందుకంటే శివలింగం పై పొసే నీరు కూడా రియాక్టివ్‌గా మారుతుంది, అందుకే డ్రైనేజ్ ట్యూబ్ దాటదు.

భాభా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివ లింగం మాదిరిగానే ఉంటుంది.

నదిలో ప్రవహించే నీటితో కలిపినప్పుడు లింగం మీద పోసిన నీరు ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది.

****మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్‌కు కోపం వస్తే హోలోకాస్ట్ వస్తుందని మాకు చెప్పేవారు.

మన సంప్రదాయాల వెనుక #సైన్స్_ఎంత_లోతుగా దాగి ఉందో గమనించండి.

కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో నిర్మించిన ఇంత ముఖ్యమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మన పూర్వీకులు ఈ రోజు వరకు మనకు అర్థం చేసుకోలేని శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారా? #ఉత్తరాఖండ్‌లోని_కేదార్‌నాథ్,
#తెలంగాణలోని_కాలేశ్వరం,
#ఆంధ్రప్రదేశ్‌లోని_కాళహస్తి,
#ఏకాంబరేశ్వర్_లోని_చిదంబరం,
#తమిళనాడులోని_రామేశ్వరం
ఆలయాలు భౌగోళిక సరళ రేఖలో 79 ° E 41’54 ”రేఖాంశంలో నిర్మించబడ్డాయి.

ఈ దేవాలయాలన్నీ ప్రకృతి యొక్క 5 అంశాలలో లింగ వ్యక్తీకరణను సూచిస్తాయి, వీటిని మనం సాధారణ భాషలో పంచభూత అని పిలుస్తాము. పంచభూట్ అనగా భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షం. ఈ ఐదు అంశాల ఆధారంగా, ఈ ఐదు శివలింగాలు భర్తీ చేయబడ్డాయి.

 1)#తిరువనకవల్(జంబుకేశ్వర)ఆలయంలో నీరు ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని జల లింగం అంటారు
2)#తిరువన్నమలైలో (అరుణాచలేశ్వర)అగ్ని ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని అగ్నిలింగం అంటారు.
3)వాయువు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక #కాళహస్తి లింగాన్ని వాయులింగం అని అంటారు.
4) భూమి ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక దానిని #కాంచీపురంలో #పృథ్వి_లింగం అని అంటారు.
5)#చిదంబరం ఆలయంలో ఆకాశం ప్రాతినిధ్యం వహిస్తుంది!అందుకే దానిని ఆకాశ లింగం అంటారు.

 ఈ ఐదు దేవాలయాలు వాస్తు-విజ్ఞాన-వేదం యొక్క అద్భుతమైన అంతరాన్ని ప్రతిబింబిస్తాయి.

ఈ దేవాలయాలలో భౌగోళిక లక్షణాలు కూడా కనిపిస్తాయి.ఈ ఐదు దేవాలయాలు యోగ విజ్ఞానం ప్రకారం నిర్మించబడ్డాయి మరియు ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట భౌగోళిక అమరికలో ఉంచబడ్డాయి. దీని వెనుక ఖచ్చితంగా కొంత శాస్త్రం ఉంటుంది, ఇది మానవ శరీరంపై ప్రభావం చూపుతుంది.

ఈ దేవాలయాలు #ఐదువేల_సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి, ఆ ప్రదేశాల అక్షాంశం మరియు రేఖాంశాలను కొలవడానికి అప్పట్లో ఉపగ్రహ సాంకేతికత అందుబాటులో లేదు అయినప్పటికీ ఐదు దేవాలయాలు ఇంత ఖచ్చితంగా ఎలా స్థాపించబడ్డాయి?భగవంతుడికి మాత్రమే తెలుసు.

కేదార్‌నాథ్ మరియు రామేశ్వరం మధ్య 2383 కి.మీ దూరం ఉంది. కానీ ఈ దేవాలయాలన్నీ దాదాపు ఒకే సమాంతర రేఖలో వస్తాయి. ఏ టెక్నిక్‌ను సమాంతర రేఖలో నిర్మించారు, ఏ టెక్నిక్‌ను ఉపయోగించి వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అనేది ఈనాటికీ మిస్టరీగా మిగిలిపోయింది.

 శ్రీకాళహస్తి ఆలయంలో #మెరుస్తున్న_దీపం అది వాయు లింగమని చూపిస్తుంది.
 తిరువానిక్క ఆలయం లోపలి #పీఠభూమిలోని నీటి బుగ్గ అది జల లింగం అని సూచిస్తుంది.
 అన్నామలై కొండపై ఉన్న భారీ దీపం అది అగ్ని లింగమని చూపిస్తుంది.
 కాంచీపురం ఇసుక యొక్క స్వయం ప్రకటిత లింగా అది భూమి లింగా అని చూపిస్తుంది
 చిదంబరం యొక్క నిరాకార స్థితి నుండి, భగవంతుని యొక్క నిరాకారత అంటే ఆకాశ మూలకం అంటారు.

ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విశ్వంలోని ఐదు అంశాలను సూచించే ఐదు లింగాలు శతాబ్దాల క్రితం ఒకే వరుసలో పొందుపరచబడ్డాయి. మన పూర్వీకుల విజ్ఞానం మరియు జ్ఞానం గురించి మనం గర్వపడాలి, అలాంటి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గుర్తించలేకపోయాయి. ఈ ఐదు దేవాలయాలు మాత్రమే కాదు, ఈ వరుసలో కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు సరళ రేఖలో పడే అనేక దేవాలయాలు ఉంటాయని నమ్ముతారు. ఈ పంక్తిని "శివశక్తి ఆకాష్ రేఖ" అని కూడా పిలుస్తారు. బహుశా ఈ దేవాలయాలన్నీ 81.3119 ° E లో పడే కైలాష్‌ పర్వతంను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడ్డాయి.
అది ఆ ఈశ్వరుడికే తెలియాలి.

 "#మహాకాళేశ్వర్" నుండి శివ #జ్యోతిర్లింగాల మధ్య సంబంధాన్ని చూడటం ఆశ్చర్యంగా ఉంది.

 ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య దూరం కూడా ఆసక్తికరంగా ఉంటుంది-

ఉజ్జయిని నుండి సోమనాథ్ - 777 కి.మీ.

ఉజ్జయిని నుండి ఓంకరేశ్వర్ - 111 కి.మీ.

ఉజ్జయిని నుండి భీమాశంకర్ - 666 కి.మీ.

ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ - 999 కి.మీ.

ఉజ్జయిని నుండి మల్లికార్జున్ - 999 కి.మీ.

ఉజ్జయిని నుండి కేదార్‌నాథ్ - 888 కి.మీ.

ఉజ్జయిని త్రయంబకేశ్వర్ - 555 కి.మీ.

 ఉజ్జయిని నుండి బైజ్నాథ్ - 999 కి.మీ.

 ఉజ్జయిని టు రామేశ్వరం - 1999 కి.మీ.

 ఉజ్జయిని ఘ్రితేనేశ్వర్ - 555 కి.మీ.

హిందూ ధర్మంలో, కారణం లేకుండా ఏమీ జరగదు

 వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది.అందువల్ల, సుమారు 2050 సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు జ్యోతిషశాస్త్రం యొక్క లెక్కింపు కోసం ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు తయారు చేయబడ్డాయి.

 సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖ ను సృష్టించినప్పుడు, అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది.నేటికీ #శాస్త్రవేత్తలు #ఉజ్జయినికి_సూర్యుడు మరియు #అంతరిక్షం గురించి #సమాచారం కోసం వస్తారు.

 ఓం హర్ హర్ మహాదేవ్

పరశురామ్
*****************

శ్రీ దత్తాత్రేయాష్టకం


1) నమో భగవతే దత్తాత్రేయాయ 
   భూతప్రేతపిశాచసంఘభయనివారణాయ
   అక్షమాలాకమండలశూలఢమరుధారణాయ
   స్మరణమాత్రేణసర్వమంగళప్రదాయకాయ ||

2) నమో భగవతే దత్తాత్రేయాయ
   దుఃఖభాజనభవసాగరతారణాయ
   అత్ర్యనసూయాప్రియాత్మజాయ
   ద్రాంబీజత్మకసకలలోకశరణ్యాయ ||

3) నమో భగవతే దత్తాత్రేయాయ
   సంభ్రమాశ్చర్యజనకవిచిత్రవేషధరాయ 
   కార్తవీర్యార్జునవరప్రదాయకాయ
   సచ్చిదానందజ్యోతిర్మయస్వరూపాయ ||

4) నమో భగవతే దత్తాత్రేయాయ
   సంగీతసాహిత్యవిద్యాప్రదాయకాయ
   అవాఙ్మానసగోచరకారణకారణాయ
   భార్గవరామజ్ఞానామృతప్రదాయకాయ ||

5) నమో భగవతే దత్తాత్రేయాయ
   ఇంద్రాదిసురకోటిసేవితాంఘ్రియుగాయ
   యోగీశ్వరహృత్కమలనివాసాయ 
   విషజ్వరరోగపీడానివారణాయ ||

6) నమో భగవతే దత్తాత్రేయాయ
   సంశయవారకమనోనిశ్చయాత్మకస్థితిప్రదాయ
   కరవీరపురవాసత్రిమూర్త్యాత్మకస్వరూపాయ
   ఘోరకష్టనివారకఅనఘాప్రియవల్లభాయ ||
7) నమో భగవతే దత్తాత్రేయాయ
   శ్రీపాదవల్లభదిగంబరస్వరూపాయ
   కలికలుషాంతకబ్రహ్మానందప్రదాయ
   శమదమాదిషట్కసంపత్తిప్రదాయ ||

8) నమో భగవతే దత్తాత్రేయాయ
   శ్రీపీఠికాపురనివాసాయ
   శ్రీదూర్వాసశశాంకాగ్రజాయ
   ఔదుంబరవటమూలనివాసాయ ||
   సర్వం శ్రీదత్తాత్రేయదివ్యచరణారవిందార్పణమస్తు

వామన జయంతి*

వామనుడు శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. రాక్షసకులంలో పుట్టిన బలి గొప్ప విష్ణుభక్తుడు. ఆ గర్వంతో స్వర్గం మీదికి దండెత్తి ఇంద్రుణ్ని జయించి, స్వర్గాధిపతి అయ్యాడు. దేవతలను, మునులను హింసించసాగాడు. దేవతల తల్లి అదితి శ్రీహరిని ప్రార్థించింది. స్వామి అనుగ్రహించి, ‘తగిన సమయంలో నేను బిడ్డగా జన్మించి, నీ కష్టాలు తొలగిస్తాను’ అని వాగ్దానం చేశాడు. ఫలితంగా అదితికి వామనుడిగా జన్మించాడు. లోకకల్యాణార్థం అవతరించిన వామనుడికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సుతో వెలిగే వటుడు వామనుడు దండం, గొడుగు, కమండలం తీసుకుని, నర్మదా నదీ తీరాన ‘భృగుకచ్ఛ’ అనే ప్రదేశంలో అశ్వమేధయాగం చేస్తున్న బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు.
వామనమూర్తిని బలి స్వాగతించి, సత్కరించి, అంజలిబద్ధుడై, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘కేవలం మూడు అడుగుల నేల ఇస్తే నాకు చాలు’ అన్నాడు వామనుడు. ‘నేను త్రిలోకాధిపతిని. మీ కోరిక నాకు తగినట్టు గొప్పదిగా ఉండాలి’ అన్నాడు బలి. అందుకు వామనుడు- ‘నేను బ్రహ్మచారిని. నీ సంపదను నేనేం చేసుకోను? నా ఇంద్రియాలన్నీ నా వశంలోనే ఉన్నాయి. మూడు అడుగుల భూమి చాలు నాకు’ అన్నాడు మళ్లీ. వామనుడి ఆంతర్యం గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు ‘వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు. నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను అథఃపాతాళానికి తొక్కివేయడానికి వచ్చాడు. అతడి కోరికను అంగీకరించకు’ అని ఎంతగా హెచ్చరించినా, బలి వినలేదు. ఆడిన మాట తప్పనన్నాడు. దానం చేసేందుకు, నీరు వదలడానికి కమండలం అందుకున్నాడు. చివరి ప్రయత్నంగా శుక్రుడు శిష్యుణ్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబు కొమ్ముకు అడ్డుపడ్డాడు. శ్రీహరి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడి కన్ను పోయింది. బలి ఉదకాన్ని వామనుడి చేతిలో విడిచి దానం పూర్తి చేశాడు.
అనంతుడైన శ్రీహరి తన వామన రూపాన్ని విస్తరించి విశ్వరూపుడయ్యాడు. ఆ త్రివిక్రమ భగవానుడు ఒక పాదంతో భూమిని, రెండో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు బలి శిరస్సు మీద ఉంచి, రసాతలానికి అణగదొక్కాడు. బలి సమర్పణ భావానికి, దానశీలతకు సంతోషించిన శ్రీహరి- బలిని సుతల లోక రాజ్యానికి అధిపతిని చేశాడు. సాపర్ణి మనువు కాలంలో దేవేంద్రుడవవుతావని బలికి వరం ఇచ్చాడు.

ఆత్మతత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది వామనావతారం. దేహంలోని ఆత్మ, విశ్వపరివ్యాప్తమైన పరమాత్మ ఒక్కటేనన్న ఆత్మజ్ఞాన రహస్యానికి దర్పణం బలిదానగుణం. ‘నేను ప్రభువును, నేను దాతను’ అని గర్విస్తే ఫలితమిదేనని భగవద్గీత కూడా చెబుతుంది.
వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి, జాగారం చేసి, వామన విగ్రహాన్ని పూజిస్తారు. శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహా ద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి. ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి, వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయడమే వామనావతార రహస్యం.

*-:చిమ్మపూడి శ్రీరామమూర్తి*
*****************

తెలుగు వెలుగు



మడి - ఆచారాలు.

బ్రాహ్మణకులం లో ఆచరించే మడి, ఆచారాలు రాను రాను బయటవారిలోనే కాదు, ఆ కులం లోని యువతలోనూ, హాస్యాస్పదంగా, అర్థరహితంగా కనబడుతున్నవి. అందుకు కారణం ఏమిటంటే, అందులో వున్న అంతరార్ధం విడమరచి చెప్పలేక పోవడం.

ఇప్పటికే, గుడీ, దైవ సంబంధమైన సామూహిక కార్యక్రమాలలో, దైవ కార్యాలు చేసే/చేయించే బ్రాహ్మణులు కూడా మడి అంతగా పాటించడం లేదు, చాలాచోట్ల. మనముందే వాళ్ళు వేసుకున్న షర్టు విప్పేసి, మెడలో ఉత్తరీయం వేసుకుని ' ఓం ! ' అని పనులు మొదలు పెట్టిస్తున్నారు. 

అసలు, దీని కథా , కమామీషు యేమిటో చూద్దాం.

ఏదైనా దైవ కార్యం నిర్వర్తించేటప్పుడు, ముందుగా ఆ దేవతను ఆహ్వానించే పద్దతి మనకు వున్నది. ప్రాణాయామం చెయ్య
మనడానికి బదులు పురోహితుడు ' మీ ముక్కులు పట్టుకోండి. ' అంటాడు. మనం పట్టుకుంటాం. ఆచమనం, ప్రాణాయామం అంత: శుద్ధికని ఆయన చెప్పడు, మనకూ తెలీదు. ఇప్పటికీ మంత్రాల ద్వారా చెబుతూనే వున్నారు, అందులో మార్పు ఏమీలేదు. అర్ధమైన వారికి అర్ధం అవుతుంది. అర్ధం కాని వాళ్ళు పురోహితుడు ' చేతులను మీ వైపు తిప్పుకోండి ' అని చెప్పి ఆ దేవతని ' ఆవాహయామి ' అని మన చేత చెప్పిస్తారు. అలాగే కార్యక్రమం అయిన తరువాత, ' మంత్రహీనం, క్రియాహీనము.. ' చెప్పించి, ఆ దేవతకు ఉద్యాపన చేయించి ఈశాన్యం వైపుకు జరిపిస్తారు. ఇదంతా ' కార్యక్రమం మొదలు,తుది ' అని తెలుసు కానీ, ఆ దేవతలు మనతో అప్పటిదాకా వున్నారన్న భావం మనకు రాదు.

ఇవన్నీకూడా మనచేత చేయిస్తారు. అయినా మనకు అవేమీ పట్టవు. వచ్చిన బంధువులను చూస్తూ,' కాఫీలు తాగారా, టిపినీలు తిన్నారా ' అని వాళ్ళను నవ్వుతూ పలుకరిస్తూ, వచ్చిన వాళ్ళచేతనే, ' మీరు కార్యక్రమం చేసుకోండి. మేము మాకు కావలసినవి చూసుకుంటాము, ' అని చెప్పించు కుంటాము. మీ తమ్ముళ్లతోనే, కుటుంబసభ్యులతోనో వారు గడుపుతారు. 

ఈలోపు ఇంకొక చుట్టమో, స్నేహితుడో, మన ఆఫీసరో వస్తాడు. మళ్ళీ ఇదే తతంగం. ఇంతకుముందు రోజుల్లో, పురోహితులు మధ్యలో కర్తను ఎవరైనా మాట్లాడిస్తే, అభ్యంతరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆలా చేస్తే, ' మళ్ళీ పిలవరేమో ' అని వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్ లతో మధ్య మధ్యలో కాలక్షేపం చేస్తూ వుంటారు. 

అదే విధంగా సంధ్యావందనం సమయంలో ' ఆయాతు వరదా దేవీ... ' అని చెప్పినప్పటినుంచి, గాయత్రీ, సావిత్రి, సరస్వతి మొదలైన దేవతలను మనమీదకు ఆహ్వానించుకుంటాము. తిరిగి ' ఉత్తమే శిఖరే జాతే ' అనిచెబుతూ ' గచ్ఛదేవి యధా సుఖం ' అని చెప్పేదాకా అమ్మలంతా మనతోనే వున్నారన్న మాట. ఇంత విశద౦గా ఏ బ్రాహ్మలూ చెప్పరు. మనమూ తెలుసుకోవాలని అనుకోము. 

అలాగే, పూర్వం రోజుల్లో, ఇళ్లల్లో ఆడవారు కూడా, ఏటికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు, జలదేవతను ఆరాధించి నీళ్లు బిందెలతో నింపుకునేవారు. ఆ దేవత వారితో వున్నదనే భావనతో ఇంటికి వచ్చి, దానితో వంట కార్యక్రమాలు చేసేవారు. అలాగే అగ్ని. అగ్నిని ఆవాహన చేసి, జలం తో వంటచేస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో, బియ్యాన్ని వండుతూ, శాక0బరీ దేవతగా కూరగాయలను తయారు చేసుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి యజమాని పూజకు సహాయం చేస్తూ వుండేవారు. 

ఇప్పుడు చెప్పండి. అలాంటి వారికి, వారిని ఎవరైనా ముట్టుకున్నా, అపరిశుభ్రమైనవి ఏమైనా కనబడినా, తగిలినా, ఏదో అపరాధనా భావము కలిగి, వాటిపై శుద్ధి నిమిత్తం నీరు చల్లడము, విష్ణు,విష్ణు అనీ శివ శివా అనీ అనడమూ తిరిగి పనిలో మునిగిపోవడం ఆనవాయితీ.

జలం మానవుడికీ, దేవతలకూ అనుసంధానమైన పంచ భూతములలో ఒకటి. అందువలన నీటితో ఆ గిన్నెపైనో, బట్టపైనో సింబాలిక్ గా శుద్ధి కార్యక్రమం చేసేవారు, వీలయితే తిరిగి స్నానం చేసేవారు. ఇక్కడ ' నీళ్లు చల్లితే మైల, మడి అయిపోతుందా? ' అని ప్రశ్నలు యువతరం వేస్తారు.' నీళ్లు గుమ్మరించుకుంటే, శుద్ధి అయిపోతారా ? ' అని వితండవాదం చేస్తారు. ఆజలం ద్వారా, అప్పటికే వారు దేవతను ఆహ్వానించుకుని వుండడం వలన, ఆ దేవతను సంతృప్తి పరచే కార్యం శుద్ధి చేసుకోవడం. 

ఇదంతా ఎవరూ చెప్పరు. ఎంత సేపటికీ ' పసుపు వాడితే బ్యాక్తీరియా పోతుంది. ఇంకేదో చేస్తే క్రిమి కీటకాలు పోతాయి ' అని చెబుతారు కానీ.' మనది కర్మభూమి. దైవభూమి. మనము దేవతలను నమ్ముతాము. దేవతల ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నాము.' అని ఢంకా బజాయించి యెవరూ చెప్పరు. ఇంకా హేళన చేస్తారేమో అని భయం. ఉన్న విషయం చెప్పడానికి మనకూ తెలియాలి కదా ! 

పెద్దలు, పండితశ్రేష్ఠులు, అనేకమంది మిత్ర సమూహం లో వున్నారు. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వ్రాసాను. దీనిపై ఇంకా స్పందించి యువతలో మన మడి ఆచారాలమీద చులకన భావన పోయేటట్లు చేయగలరని మనవి. ముందు మన బ్రాహ్మణ యువతకు ఇవి అర్ధమైతే, మిగిలిన వారికీ చెప్పగల పరిస్థితిలో మనం వుంటాము. 

మనకే అర్ధంగాక, దైవకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా, మడి కట్టుకున్నవాళ్లకు దూరంగా వుండమని చెప్పలేకపోవడం మన దౌర్భాగ్యం. ' ఆయన అట్లాగే అంటాడు లేవయ్యా, అరవైలు దాటినాయి కదా ! చాదస్తం. ' అనే స్థితి మనకు రాకుండా మనలను మనం, కాపాడుకుందాం.

ప్రేమతో ,
ప్రభాకర్.fb
***************

వ్యవహారికం- ఆత్మా జ్ఞ్యానం

*పూర్వం ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. సాధుపురుషులు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకువెళ్లి విశేషమైన మర్యాదలు చేస్తుండేవాడు. ఒకసారి ఓ సాధువును ఇంటికి తీసుకొచ్చాడు శ్రీమంతుడు. తన స్థాయికి తగినట్టుగా అతిథి సత్కారాలు చేశాడు. భోజనం కోసం రకరకాలైన పిండి వంటలు చేయించాడు. ప్రత్యేకంగా పాయసం కూడా చేయించాడు.*
*

*పూర్వం ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. సాధుపురుషులు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకువెళ్లి విశేషమైన మర్యాదలు చేస్తుండేవాడు. ఒకసారి ఓ సాధువును ఇంటికి తీసుకొచ్చాడు శ్రీమంతుడు. తన స్థాయికి తగినట్టుగా అతిథి సత్కారాలు చేశాడు. భోజనం కోసం రకరకాలైన పిండి వంటలు చేయించాడు. ప్రత్యేకంగా పాయసం కూడా చేయించాడు.*


*సాధువుతో పాటు శ్రీమంతుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. సాధువుతో.. ‘‘స్వామి! మా ఇంట్లో పాయసం అమృత సమానంగా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి’’ అని అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. రెండు గ్లాసుల్లో పాయసం తెచ్చి అక్కడుంచారు. శ్రీమంతుడు ఒక గ్లాసు తీసుకుని అపురూపంగా పాయసం తాగాడు! ఇది గమనించిన సాధువు.. ‘‘పాయసం ఎలా ఉంది నాయనా!’’ అన్నాడు. ‘అమృత సమానంగా ఉంది’ అన్నాడు శ్రీమంతుడు. వంటవాడు రెండో దఫా పాయసం తెచ్చాడు. శ్రీమంతుడు మళ్లీ తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు సాధువు. ‘‘ఫర్వాలేదు’’ అన్నాడు.*


 *సాధువు వంటవాడిని పిలిచి మరో గ్లాసు పాయసం తేవాల్సిందిగా చెప్పాడు. శ్రీమంతుడితో దానిని కూడా తాగమన్నాడు. అయిష్టంగానే తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘విష తుల్యంగా’’ ఉందన్నాడు శ్రీమంతుడు. భోజనాలు పూర్తయిన తర్వాత సాధువు, శ్రీమంతుడు బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.*


*సాధువు ఆత్మ, జ్ఞానం తదితర అంశాల గురించి అనేక విషయాలు చెబుతున్నాడు.*


*శ్రీమంతుడు మాత్రం ఇందాక చేసిన భోజనంలోని వంటకాల విశేషాల గురించి చెప్పసాగాడు.*


 *సాధువు కల్పించుకొని.. ‘‘నాయనా! మొదట పాయసం తాగినపుడు అమృతంగా ఉందన్నావు. రెండోసారి ఫర్వాలేదన్నావు. మూడోసారి విషంగా ఉందన్నావు! పాయసం అమృతం అయితే.. ఎన్నిసార్లు తాగినా అమృతంగానే ఉండాలి కదా!*


 *కాబట్టి విషయం బాహ్య వస్తువులో లేదు. మన భావనే వస్తువులలో సుఖాన్ని కల్పిస్తోంది. ప్రాపంచిక విషయాలు ఒకసారి గొప్పగా కనిపిస్తాయి, మరోసారి వృథాగా అనిపిస్తాయి. జీవుడు బాహ్య వస్తువులపై విరాగం కలిగి ఉండి.. ఆత్మస్థితిలో ఆనందాన్ని కలిగి ఉండాలి’’ అని బోధించాడు.*

🕉🌞🌏🌙🌟🚩

*అందుకే ఆది శంకరులు తమ భజగోవిందం లో ఇలా అంటారు.....*

 *మాకురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |*

*మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||*

*ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.*
*సాధువు ఆత్మ, జ్ఞానం తదితర అంశాల గురించి అనేక విషయాలు చెబుతున్నాడు.
*******************

వరాహమిహిరుని గురించి

వరాహమిహిరుడు తన భార్య ప్రసవ సమయము నందు ప్రసూతి గృహమునందు ఉన్నప్పుడు మంత్రసానికి నిమ్మపండునిచ్చి
BLN మూర్తి కధలో చెప్పనట్లుగా సూచనలను చేసారు. మిగిలిన కధ అంతా వారు చెప్పి నట్లుగా జరిగినది. అప్పుడు జన్మించిన ఆడశిశువు జాతకం పరిశీలించి ఆమే వివాహం జరిగిన రాత్రే వైధవ్యం కలుగనని గ్రహించి ఆయన తన కుమార్తె కువివాహము జరిగిన రాత్రి మనఃశ్శాంతి కరువై పిచ్ఛివానివలే ఆ ఊరు వదిలి దేశసంచారము గావించేను.
ఆ తరువాత కొంత కాలమునకు తన గ్రామమునకు సంచారిగా వచ్చినపుడు తన కుమార్తె సుమంగళిగా ను సంతాన ముతో తన భర్తతో జీవించడము విని చూసి తను వ్రాసిన జ్యోతిష్య గ్రంధములన్నీ తప్పులుగా ఎంచి తన రచనల వలన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నానని భావించి ఆ గ్రంథములన్నింటిని కాల్చి వేయాలని భావించి వాటిని ఒక బండి పై ఊరి బయటికి తరలించుచుండగా ఆ బండి చక్రముక్రింద ఒక ముదుసలి స్త్రీ పడినది. ఆమె నుపరిశీలించగా ఆమెనే తన భార్య ప్రసవసమయమునందు పనిచేసిన మంత్రసానిగా గుర్తించి ఆమె ద్వారా అసలు విషయము తెలుసుకొనినాడు.
సరస్వతీ దేవి యే మంత్రసాని రూపం లో వచ్చి ఈయన రచనలను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడినట్లు తెలియజేసారు.

🙏వరాహమిహిరుడి గురించి🙏

ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

శాస్త్రాలే గాక, పత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం జేసినట్లు అక్కడకు వెళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.

(మిహిరుడు వరాహ మిహిరునిగాసవరించుకోండి)

అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారణంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారణముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిహిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!
🙏🙏🙏**************

Srimadhandhra Bhagavatham

-- 101 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించారన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే  పండితులు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో  ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి.  మహా పురుషుల మూర్తులను సేవించాలి.  అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.  నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది  మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకోవాలి. దీనినుంచి దాటాలని  అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళాలి. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈశ్వర నామమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా ఇంద్రియ సుఖమనుభవించవచ్చు.
 సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును  తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొన్ననాడు  ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి  పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని, నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
 ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు  వాడు నాయందే చేరిపోతున్నాడు.  ఉద్ధవా! నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది.  కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తే  తలలోకి గుచ్చుకుంటుందనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ  పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయ్యాడో,  ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనము ఇచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు.  కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.
యాదవుల అంతమొందుట
ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన  ఇనప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటే  వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడు  గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉన్నది, పాశుపతాస్త్రం ఉన్నది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు.  ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.
ఫలశ్రుతి
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం ఇస్తున్నాను’ అన్నారు.
అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాట ప
ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
భ గతియు నీల వేణియు గృపారసదృష్టియు గల్గు వెన్ను డి
మ్ముగ బొడసూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.
‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు
ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండునరుడు లోకులు వొగడన్.
‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్న వాళ్ళకు, ఇది వ్రాసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.

భాగవత ప్రవచన పాఠం నేటితో సమాప్తం
*****************

తెలుగు సంవ‌త్స‌రాలు

_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*

_*Know the Telugu Year you born*_

*( 1867, 1927,1987,)*: ప్రభవ
*(1868,1928,1988)*: విభవ
*(1869,1929,1989)*: శుక్ల
*(1870,1930,1990)*: ప్రమోదూత
*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి
*(1872,1932,1992)*: అంగీరస
*(1873,1933,1993)*శ్రీముఖ
*(1874,1934,1994)*: భావ
*(1875,1935,1995)*: యువ
*(1876,1936,1996)*: ధాత
*(1877,1937,1997)*:  ఈశ్వర
*(1878,1938,1998)*: బహుధాన్య
*(1879,1939,1999)*: ప్రమాది
*(1880,1940,2000)*: విక్రమ
*(1881,1941,2001)*: వృష
*(1882,1942,2002)*: చిత్రభాను
*(1883,1943,2003)*: స్వభాను
*(1884,1944,2004)*: తారణ
*(1885,1945,2005)*: పార్థివ
*(1886,1946,2006)*:  వ్యయ
*(1887,1947,2007)*: సర్వజిత్
*(1888,1948,2008)*: సర్వదారి
*(1889,1949,2009)*: విరోది
*(1890,1950,2010)*: వికృతి
*(1891,1951,2011)*: ఖర
*(1892,1952,2012)*:  నందన
*(1893,1953,2013)*: విజయ
*(1894,1954,2014)*: జయ
*(1895,1955,2015)*: మన్మద
*(1896,1956,2016)*: దుర్ముఖి
*(1897,1957,2017)*: హేవిళంబి
*(1898,1958,2018)*: విళంబి
*(1899,1959,2019)*: వికారి
*(1900,1960,2020)*: శార్వరి
*(1901,1961,2021)*: ప్లవ
*(1902,1962,2022)*: శుభకృత్
*(1903,1963,2023)*: శోభకృత్
*(1904,1964,2024)*: క్రోది
*(1905,1965,2025)*: విశ్వావసు
*(1906,1966,2026)*: పరాభవ
*(1907,1967,2027)*: ప్లవంగ
*(1908,1968,2028)*: కీలక
*(1909,1969,2029)*: సౌమ్య
*(1910,1970,2030)*:  సాదారణ
*(1911,1971,2031)*: విరోదికృత్
*(1912,1972,2032)*: పరీదావి
*(1913,1973,2033)*: ప్రమాది
*(1914,1974,2034)*: ఆనంద
*(1915,1975,2035)*: రాక్షస
*(1916,1976,2036)*: నల
*(1917,1977,2037)*: పింగళ
*(1918,1978,2038)*: కాళయుక్తి
*(1919,1979,2039)*: సిద్దార్థి
*(1920,1980,2040)*: రౌద్రి
*(1921,1981,2041)*: దుర్మతి
*(1922,1982,2042)*: దుందుభి
*(1923,1983,2043)*: రుదిరోద్గారి
*(1924,1984,2044)*: రక్తాక్షి
*(1925,1985,2045)*: క్రోదన
*(1926,1986,2046)*: అక్షయ

దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి

బ్యాటరీతో నడిచే మాస్క్ సిద్ధం చేసిన ఎల్‌జీ*



ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మాస్క్ ను సిద్ధం చేసినట్లు ఎల్‌జీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్యూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్‌జీ కంపెనీ పేర్కొన్నది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఫిల్టర్లను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలుంటుంది. శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లను కలిగివుంటుంది. ఈ మాస్క్ ధరించినవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు లేదా వెలుపలికి వదిలేప్పుడు గుర్తించేందుకు సెన్సార్లను అమర్చారు. పూరికేర్ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు H13 HEPA ఫిల్టర్లను ఉపయోగిస్తుంది. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. మాస్క్ లోపల ఉండే రెండు ఫ్యాన్లు శ్వాసను మరింత సహజంగా చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిలోని బ్యాటరీ రెండు గంటలు హై మోడ్‌లో, ఎనిమిది గంటలు తక్కువ మోడ్‌లో పనిచేస్తాయి. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో ఆల్ట్రావయోలెట్ కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గుర్తించి మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్‌జీ పేర్కొన్నది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. పూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎల్జీ యొక్క వర్చువల్ ఐఎఫ్ఎ 2020 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనునన్నారు. దీని ధర ఎంతో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
*******************

రామాయణమ్.. 45


...
దశరధుడు బ్రతిమాలుతున్న కొద్దీ బెట్టు చేయడం ఎక్కువ అయ్యింది కైకకు ! .ఆవిడ ఆయనకు ప్రియసతి ! ఆవిడ మనసుకు కొంచెం కష్టం కలిగినా సహించి భరించలేడు ఆ రాజు ! .
.
మెల్లగా ఆవిడ కేశాలు తన చేతిలోకి తీసుకుని కైకా!  నీ కన్నా రాముడికన్నా! ప్రియమైన వారు ఎవరున్నారు నాకు ఈ లోకంలో ! .
.
నా రాముడి మీద ఒట్టు వేసి చెపుతున్నాను నీ కేమి కావాలో చెప్పు ,క్షణంలో తీరుస్తాను !.
.
నామీద నీకు ఎంత అధికారమున్నదో నీకు తెలుసు ,నేను చేసిన పుణ్యము మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను నీ కోరిక చెల్లిస్తాను!.
.
ఇన్ని రకాలుగా హామీలు తీసుకున్నతరువాత కైక తన మనసులో గల కోరిక వెల్లడించడానికి ఉద్యుక్తురాలయ్యింది !.
.
హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగ ఆవిడ నోట మాట బయల్పడింది !.
.
పంచభూతాలు  ,సూర్యచంద్రుల ,గంధర్వులు ,దేవతలు అందరూ కూడా నీవు పెట్టిన ఒట్లు విన్నారు ! మహారాజా నీవు నాకు మునుపు ఇచ్చిన రెండు వరములు ఇప్పుడు కోరుకో దలచుకొన్నాను . ...వాటిని సత్యసంధుడవైన నీవు ఇప్పుడు చెల్లించవలెను లేని పక్షమున నా ప్రాణములు విడువ గలదానను అని పలికింది ....అవి..
.
దశరధుడు కామముతో కప్పబడిన మనస్సుకలవాడై ,పాశములో చిక్కిన లేడిలాగ అయిపోయాడు.
.
రాముని అభిషిక్తుని చేయుటకు నీవు సకల సంభారములు సమకూర్చుకున్నావు కదా ! వాటితో రాముని బదులుగా భరతుని అభిషేకించు !
.
రెండవ వరము....రాముడు పదునాల్గు సంవత్సరములు నారచీరలు ,మృగాజినము ,జటలు ధరించి దండకారణ్యములోముని వృత్తి నవలంబించుచూ  నివసించవలె.
.
ఏ శత్రుబాధలేని రాజ్యము భరతునకు లభించుగాక!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
********************

TAKE CARE OF YOURSELF*



1. The *STOMACH* is injured when you do not have breakfast in the morning.

2. The *KIDNEYS* are injured when you do not even drink 10 glasses of water in 24 hours.

3. The *GALLBLADDER* is injured when you do not even sleep until 11 o'clock and do not wake up to the sunrise.

4. The *SMALL INTESTINE* is injured when you eat cold and stale food.

5. The *LARGE INTESTINES* are injured when you eat more fried and spicy food.

6. The *LUNGS* are injured when you breathe in smoke and stay in polluted environment of cigarettes.

7. The *LIVER* is injured when you eat heavy fried food, junk, and fast food.

8. The *HEART* is injured when you eat your meal with more salt and cholesterol.

9. The *PANCREAS* is injured when you eat sweet things because they are tasty and freely available.

10. The *Eyes* are injured when you work in the light of mobile phone and computer screen in the dark.

11. The *Brain* is injured when you start thinking negative thoughts.

12. The *SOUL* gets injured when you don't have family and friends to care and share with you in life their love, affection, happiness, sorrow and joy.

*All these parts are NOT easily available in the market*. So take good care and keep your body parts healthy.

*Happy 😊 Day*
*********************