29, ఆగస్టు 2020, శనివారం

బ్యాటరీతో నడిచే మాస్క్ సిద్ధం చేసిన ఎల్‌జీ*



ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మాస్క్ ను సిద్ధం చేసినట్లు ఎల్‌జీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్యూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్‌జీ కంపెనీ పేర్కొన్నది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఫిల్టర్లను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలుంటుంది. శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లను కలిగివుంటుంది. ఈ మాస్క్ ధరించినవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు లేదా వెలుపలికి వదిలేప్పుడు గుర్తించేందుకు సెన్సార్లను అమర్చారు. పూరికేర్ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు H13 HEPA ఫిల్టర్లను ఉపయోగిస్తుంది. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. మాస్క్ లోపల ఉండే రెండు ఫ్యాన్లు శ్వాసను మరింత సహజంగా చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిలోని బ్యాటరీ రెండు గంటలు హై మోడ్‌లో, ఎనిమిది గంటలు తక్కువ మోడ్‌లో పనిచేస్తాయి. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో ఆల్ట్రావయోలెట్ కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గుర్తించి మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్‌జీ పేర్కొన్నది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. పూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎల్జీ యొక్క వర్చువల్ ఐఎఫ్ఎ 2020 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనునన్నారు. దీని ధర ఎంతో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
*******************

కామెంట్‌లు లేవు: