29, ఆగస్టు 2020, శనివారం

*విదేశీ ప్రయాణం - నివాసం* -

ఒక జాతకుడు విదేశాలకు వెళతాడా? వెళ్లలేడా అనేది చూడాలంటే అతని రాహువు, లగ్న, తృతీయ, చతుర్థ, నవమ, ద్వాదశ స్థానాలు వాటి అధిపతుల స్థితియుతులను బట్టి నిర్ణయించాలి. 

3 తక్కువ దూరపు లేదా తక్కువ కాలపు ప్రయాణం, దేశంలోపలి ప్రయాణాలు మాత్రమే ఉంటాయి.

4 స్వదేశం, జన్మ స్థలాన్ని సూచిస్తుంది

9 దూర ప్రయాణం

12 నష్టం అంటే తన వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని కోల్పోవడం ( దూర దేశాలలో స్థిరనివాసం )

లగ్నాధిపతి కనుక 9,12 లలో ఎక్కడ ఉన్నా అతనికి విదేశీ యాన యోగం ఉంటుందని చెప్పవచ్చు.

4 వ భావాధిపతి కనుక బలంగా ఉండి, శుభ సంబంధం ఉంటే స్వదేశంలో ఉండడం జరుగుతుంది, అది అతనికి క్షేమం కూడా. చతుర్థాధిపతి బలహీన పడి, 9 లేక 12 భావాలతో సంబంధం ఏర్పడితే ఆవ్యక్తి తప్పక విదేశాలకు వెళతాడు. 4వ భావాధిపతి 6,8 లలో ఉన్నా జన్మస్థలంతో సంబంధం దెబ్బతింటుంది.

లగ్న నవమాధి పతులు ఒకరి స్థానంలో ఒకరున్నా, పరివర్తన చెందినా తప్పక విదేశీయానం, అక్కడ ఎక్కువకాలం నివసించడం ఉంటుంది.

లగ్న ద్వాదశాధిపతులు ఒకరి స్థానంలో ఒకరున్నా, పరివర్తన చెందినా తప్పక విదేశీయానం, అక్కడే స్థిరపడడం ఉంటుంది. 

తృతీయాధిపతి ఆ జాతకుని ప్రయాణాలను తెలియజేస్తాడు. తృతీయాధి పతి 9, 12 లలో ఉంటే అతనిక తప్పక విదేశీ యానం ఉంటుంది.

ఇవే నియమాలు కేపీ లో కూడా , కాకపోతే భావాధి పతి అని ఉన్న చోటల్లా, ఆభావ సబ్ లార్డ్ అని మార్చి చదువుకోవాలి.

ఉదాహరణకు లగ్న సబ్ లార్డ్ లేదా తృతీయ భావ సబ్ లార్డ్ కు కనుక 9,12 భావాలలో స్థితి గానీ, ఆభావాధిపతులతో యుతి గానీ, అభావాధి పతుల వీక్షణ గానీ కలిగితే ఆవ్యక్తి తప్పక విదేశీ యానం చేస్తాడు.

మీ
 *R VIJAY SHARMA* 
9000532563
rvj.astropandit@gmail.com

కామెంట్‌లు లేవు: