29, ఆగస్టు 2020, శనివారం

**సౌందర్య లహరి**

ప్రక్షిప్త శ్లోకము - 1

( **శ్రీ శంకర భగవత్పాద విరచితము**)

(శ్రీ లలితాంబికాయైనమః)

( సౌందర్య లహరి స్తోత్రం లో మూడు శ్లోకాలు ప్రక్షిప్త శ్లోకాలు గా
ప్రచారంలో ఉన్నాయి)

"సమానీతః పద్భ్యాం _ మణిముకురతా మమ్బరమణిః
భయాదన్తర్బద్ద _ స్తిమిత కిరణ శ్రేణి మసృణః !
 దధాతి త్వద్వక్త్రం _ ప్రతిఫలిత మశ్రాన్త వికచం
 నిరాతంకం చంద్రాన్నిజ హృదయ పంకేరుహ మివ !!

ఈ శ్లోకం లో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమ ను స్తుతించారు.

అమ్మా! భగవతీ!ఆకాశానికి మణివంటివాడైన సూర్యుడు నీ పాదసేవ
కుడుగానూ , నీవు పాదములుం చే మణిదర్పణం గానూ ఏర్పడినవాడై
యున్నాడు. అమిత ప్రకాశవంతమైన నీ ముఖాన్ని ౘూసి , అతడు భయపడి
తన వేయి సూర్యకిరణాలను పైకి ప్రసరింౘ నీయకుండా తన లోనే అణౘు
కుంటున్నాడు. నీ కిరీటమందున్న చంద్రుడి చేత, తన హృదయంలో ని తామర( నీ ముఖ ప్రతిబింబము ) ముడుౘుకొనకుండా వికాసము పొంది వెలుగు చుండగా దానిని ధరిస్తున్నాడు.

సూర్యుడు శ్రీదేవి ముఖ పద్మాన్ని ధ్యానిస్తూ దేవీ పాదసేవను చేస్తున్నాడని
భావము. సూర్యుడు దేవీ పాదపీఠ రూపమైన మణిదర్పణముగా స్వీకరింపబడ్డాడు. ఆ దర్పణంలో ప్రతిబింబించిన శ్రీదేవి ముఖ పద్మము, వికసించిన
సూర్యుని హృదయ పద్మము వలె ఉన్నది.

ఓం సర్వజ్ఞాయైనమః
ఓం సాంద్రకరుణాయైనమః
ఓం సమానాధికవర్జితాయైనమః
🙏🙏🙏

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

https://chat.whatsapp.com/BX9q7cjvzxzLGb99dapVRi
**************

కామెంట్‌లు లేవు: