12, మే 2023, శుక్రవారం

ప్రవర యొక్క అర్ధం

 ప్రవర యొక్క అర్ధం 


 🕉️ప్రవర యొక్క అర్ధం.🕉️


🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️


చతుస్సాగర పర్యంతం


(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)... 




గో బ్రాహ్మణేభ్య శుభం భవతు


(సర్వాభీష్ట ప్రదాయిని అగు..గోవూ మరియు నిత్యం సంఘ హితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....




×××××××. ఋషేయ ప్రవరాన్విత..


(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..... 




{ త్యాగే నైకే అమృతత్త్వ మానసుః......


అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..} 




×××××× గోత్రః


(మా గోత్రమునకూ..)




ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....


(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)




శ్రీ * శర్మ నామధేయస్య


( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..


1. స్నానము


2. సంధ్య


3. జపము


4. హోమము


5. స్వాధ్యాయము


6. దేవ పూజ


7. ఆతిథ్యము


8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...


1.కామాగ్ని


2.క్రోధాగ్ని


3.క్షుద్రాగ్ని..


అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..


శ్రీ * *శర్మా అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రదాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రదాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..


అహంభో అభివాదయే..


( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న [అహంకారభావ రహితుడనై..] నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.

 

*ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్యచ*

*శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్టాపత్య కళత్రయో*

      తన పేరు, గురువు పేరు, అతి దుర్మార్గుడిపేరు, పెద్దకుమారుని పేరు, భార్య పేరు చెప్పకూడదని పెద్దలంటారు. ఎవరు చెప్పకూడదు అంటే శ్రేయస్కాములు అని సమాధానము.    శ్రేయస్కాములు అంటే శ్రేయస్సును కోరేవారు అని.  వినటానికి, అనటానికి, ఆచరించటానికీ కూడా సులభముగా ఉన్న ఈ చిన్న శ్లోకములోని విశేషాలను, పరమతాత్పర్యమును పరిశీలించే ప్రయత్నమే ఈ చిన్ని భావప్రకటన.  *ఈ శ్లోకములో “శ్రేయస్కామః” పదమే కీలకమైనది.* అది ముందు పరిశీలిద్దాం.

     శాస్త్రములో  ప్రతి పదమునకు నిర్దిష్టమైన అర్థము ప్రత్యేకముగా ఉంటుంది.  ఈ శ్రేయస్సు అన్న పదము దానితో పాటు ప్రేయస్సు అన్న పదము కలిపి *“శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్తా సంపరిత్య వివినక్తి ధీరః; శ్రేయోహి ధీరోభిప్రేయసోవృణీతే ప్రేయోమందో యోగక్షేమాత్ వృణీతే”*  అని మనము కఠోపనిషత్ లో చూడవచ్చు. సాధకుడి పుణ్యవిశేష ఫలముగా శుభకరములైనవి, సుఖకరమైనవి కూడా అనుభవానికి వస్తాయి.  *శుభకరమైనవి, శాశ్వతమైనవి శ్రేయస్సు సూచిస్తే,  లౌకికమైనవి, అశాశ్వతమైన సుఖమునిచ్చేవి ప్రేయస్సు సూచిస్తుంది.*  విచక్షణ కలిగిన బుద్ధిమంతుడు శాశ్వతమైన శ్రేయస్సునే కోరుకుంటాడు, తద్భిన్నుడు లోభ మోహాదులచే అశాశ్వత లౌకిక సుఖములనే కోరుకుంటాడు అని స్థూలతాత్పర్యము. ఉపనిషత్సారమైన భగవద్గీతలో కూడా ఈ శ్రేయస్సు వివరించబడినది.  అంటే శ్రేయస్సు శాశ్వతమైనది, శాశ్వతమైనది మోక్షమని, అదే కోరుకోవాలని స్పష్టము కదా. 

     *ఇంతకీ శ్రేయస్సుకీ, పేర్లు పలకకుండా ఉండటానికి సంబంధం ఏమిటి* అని ఆలోచిస్తే,  పెద్దలకు  మనయెడల కారుణ్యము ఎంతో తెలుస్తుంది.  చెప్పకూడనివేమిటి? తన పేరు. గురువు ఆత్మజ్ఞానము కలగజేసేవాడు.  అతడు తన స్వస్వరూపము తెలిసినవాడు, నామరూపాతీత సర్వాత్మ తత్త్వము. షడ్భావసమాధిలో తను గురువుకన్నా అభిన్నుడు. ఆత్మావై పుత్రనామాసి అని వేదవాక్యము. ధర్మసంతానము పెద్దకుమారుడు అంటారు. అందుకే పెద్దకుమారుని చెప్పారు.  భార్య తనలో సగభాగము. లౌకికముగు సుఖములకు కూడా తానే హేతువు. కనుక ఈ ముగ్గురు తనకన్నాఅభిన్నులు అని బోధ. అలా కాదంటే భార్యాపుత్రులు లౌకిక సుఖములకు హేతువులు. లౌకిక సుఖములు వలదనికదా ప్రయత్నము. ఇది బాగానే ఉంది మరి  అతి దుర్మార్గుడిపేరు ఎందుకు చెప్పకూడదు. వాడిని నామరూపాలతో గుర్తించగానే వాడి దుశ్చర్యలు గుర్తురావటం, తద్వారా కోపావేశాలు కలుగటం, దానిననుసరించి, అరిషడ్వర్గములోని మిగిలినవి వచ్చిచేరటం జరుగుతాయి. ఇది సాధకునికి పతనహేతువులు.  అందుకు వాడి స్మరణ నిషేధించారు. అంటే లౌకికమైన సుఖ, దుఃఖ హేతువులను పేరు కూడా చెప్పవద్దన్నమాట.

     మరి ఎలా చెప్పాలిట?   “నన్ను ఫలానా వారి కొడుకు *అంటారండి* ” “నన్ను ఫలానా వారి తండ్రి *అంటారండి* ” “నన్ను అనంతకృష్ణ *అంటారండీ* ” ఇలా చెప్పాలిట.  దీనివల్ల లాభం?  ఇలా *అంటారండీ* అని చెప్పినప్పుడు  తనకి ఆ భావన లేదు, ఇతరులు అలా పిలుస్తారని. అంటే తాను సచ్చిదానందమైన శుద్ధ చైతన్యమని,  ఈ నామ రూపాలు కేవలము అశాశ్వతమైనవని పదే పదే మనలని మనము హెచ్చరిక చేసుకుంటామని.  పదే పదే ఈ భావన ప్రకటించటం ద్వారా దేహభావము స్థానే ఆత్మతత్వ జ్ఞానము కలుగుతుంది, రూఢి అవుతుంది, అదృష్టము కొలది అనుభవములోకి వస్తుంది. 

     ఇలా ఆధ్యాత్మిక ప్రయాణములో అత్యంత ఆవశ్యకమైన భావసంపద ఈ ఒక్క శ్లోకమును ఆచరించటం ద్వారా కలుగుతున్నదని నాకనిపించింది.  పెద్దలు చర్చించి గుణదోష విచారణ చేయుదురు గాక. స్వస్తి.

సుభాషితమ్


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*అసారే ఖలు సంసారే*

*సుఖభ్రాన్తిః శరీరిణామ్।*

*లాలాపానమివాఙ్గుష్ఠే*

*బాలానాం స్తన్యవిభ్రమః॥*


*..._సుభాషితరత్నకోశః_…*


తా𝕝𝕝

సారం లేని ఈ సంసారంలో ఏదో సుఖం ఉందని మానవులు భ్రాంతి పడుతూ ఉంటారు..... ఇది బొటనవేలు నోటిలో పెట్టుకొని తన లాలాజలాన్నే చప్పరిస్తూ చనుపాలు తాగుతున్నాం అనుకొనే పసిపిల్లవాని వంటిది.

: శ్లోకం:

*ప్రమాణాదధికస్యాపి గండశ్యామమదచ్యుతేః l*

*పదం మూర్ధ్ని సమాధత్తే కేసరీ మత్తదంతినః ll*

*బాలస్యాపి రవేః పాదాః పతంత్యుపరి భూభృతాం l*

*తేజసా సహ జాతానాం వయః కుత్రోపయుజ్యతే ll*


భావం: 

సింహము తనకన్నా ఎంతో పెద్దదగు మదపుటేనుగు యొక్క కుంభస్థలంపై తన పాదాన్ని మోపుతుంది. బాలసూర్యుడు తన పాదములను అనగా కిరణములను పర్వతశిఖరాలపై ఉంచగలుగుచున్నాడు. కావున తేజోవంతులగువారి యెడల వయస్సును పరిగణనలోకి తీసుకోకూడదు.

దక్షిణామూర్తి శిష్యులందరూ వయోవృద్ధులే. సురేశ్వరాచార్యులు (పూర్వాశ్రమంలో మండనమిశ్రుడు) వారి గురువు శంకరాచార్యులు కన్నా వయసులో పెద్ద!

అనారోగ్యము - వైద్యము*

 



       *అనారోగ్యము - వైద్యము*

                ➖➖➖✍️️


         ఒకరోజు పరమాచార్య స్వామి వారి పాదాలు బాగా వాచిపోయి,   చూడ్డానికి బోదకాలు    వచ్చిందేమో     అనేలా ... వున్నాయి.  ఒక పెద్ద ముత్తైదువ స్వామి వారికి హారతి ఇచ్చింది.      స్వామి వారి పాదాలను చూసి చాలా ఖేదపడింది.


ఆవిడ అక్కడున్నవారితో “తన దగ్గరకు వచ్చిన భక్తుల బాగోగులు చూసే... మహా స్వామివారిని పట్టించుకునే వారేలేరా?" అని అడిగింది. 


     చాలా బాధపడుతూ,       కళ్ళనీళ్ళు కారుస్తూ      పరమాచార్య స్వామి వారిని వేడుకుంది. “పెరియవ    తమ ఆరోగ్యం గురించి కూడా కొంత పట్టించుకుంటే... బావుంటుంది....!     ఎవరైనా   మంచి వైద్యుణ్ణి సంప్రదించి మందులు    వేసు కొనవలసింది...” అని.


        మహాస్వామి వారు   నవ్వారు.... ఆ పెద్దావిడ    తమ పాదముల     గురించే దిగులు  పడుతోందని   వారికి తెలుసు. “అరగంట తరువాత వచ్చి నా పాదము లను చూడు”  అని   మహాస్వామి వారు ఆవిడతో అన్నారు.    ఆ పెద్దావిడ వెళ్ళి పోయిన తరువాత    మహాస్వామి వారు పదిహేను నిముషాలు     పద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళారు.


      కొద్దిసేపటి తరువాత    ఆ పెద్దావిడ మళ్ళా వచ్చింది.    పరమాచార్య స్వామి వారి పాదాలు    మామూలు స్థితికి వచ్చి వాపు తగ్గిపోయింది.  ఏ వైద్యమూ లేక, ఏమందులూ వాడకుండా  స్వామి వారి పాదాలు ఎలా బాగయ్యాయో   ఆవిడకు అర్థం కాలేదు.


     వారి దేహానికి అనారోగ్యం తెచ్చుకుని వారే దాన్ని నయం చేసుకోవడం  స్వామి వారికి ఒక లీల! భక్తులబాధలను తాను భరించి  శాస్త్ర బద్ధంగా    వారి కర్మలను తుడిచివేయడమే వారి లీల!      


           కాని  పరమాచార్య  స్వామి వారి విషయంలో   ఎటువంటి     తర్కానికి తావు లేదు. ఆయన ఆది వైద్యుడు!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

🙏

శ్రీ మహాభారతం

 


                శ్రీ మహాభారతం 

                 ➖➖➖✍️

                 349 వ భాగం

   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:


#మహాప్రస్థానిక_పర్వము


శ్రీకృష్ణుడు, బలరాముడు నిర్యాణము చెందారు. యాదవులు అందరూ మరణించారు. అర్జునుడిని వ్యాసుడు మహాప్రస్థానికి సిద్ధమవమని చెప్పాడు. అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో అర్జునా ! అన్నిభూతములను కాలుడు కాల్చకమానడు. మనము కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలము ఆసన్నము అయింది. మనము కూడా అన్ని కర్మలను త్యజించవలసిన కాలము సమీపించింది. నీ అభిప్రాయము అదేకదా ! అని అడిగాడు. అర్జునుడు అన్నయ్యా ! మీరు చెప్పినది నిజము. కాలానికి సాటి కాలమే. మనము కూడా కాలముతో పయనించక తప్పదు అన్నాడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల, సదేవులను పిలిపించాడు. వారికి అన్ని విషయములు చెప్పాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు అంగీకారము తెలిపారు. 


ధర్మరాజు కురుసామ్రాజ్య వారసులను నిర్ణయించుట:

ధృతరాష్ట్రుడి వారసులలో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురుసామ్రాజ్యానికి పట్టభిషిక్తుడిని చేసాడు. పరిక్షిత్తుని యువరాజుగా పట్టభిషిక్తుడిని చేసాడు. యుయుత్సుడికి రాజ్యపాలన గురించిన విషయములు అన్నీ వివరించాడు. తరువాత సుభద్రతో అమ్మా సుభద్రా ! ఈ భరత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడి మనమడు వజృడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. ఈ విధముగా కురువంశము, యాదవవంశము వర్ధిల్లుతాయి. ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తరువాత భారతయుద్ధములొ మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేసాడు. బ్రాహ్మణులకు గోదానములు, భూదానములు, సువర్ణ దానములు విరివిగా చేసాడు. పరిక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తరువాత హస్థినాపురప్రజలతో ఒక సభ ఏర్పాటు చేసాడు. 


పాండవులు మహాప్రస్థానికి తరలుట:

ధర్మరాజు హస్థినాపుర వాసులను పిలిచి ఏర్పాటు చేసిన సభలో హస్థినాపుర వాసులతో హస్థినాపుర వాసులారా ! మా అయిదుగురికి బదులుగా అభిమన్యుడి కుమారుడిని మహారాజుగా నియమించాను. అతడి మీద కూడా మీరు మీ ప్రేమ అభిమానము చూపండి అని చెప్పాడు. హస్థినపుర వాసులకు పాండవులు వెళ్లిపోతున్నారన్న విషయము అర్ధము అయింది. వారు మహారాజా ! ఏమిటిది ? మమ్ములను ఇలా వదిలి పెట్టి వెళ్ళడము మీకు ధర్మమా ! నీవు ప్రేమమూర్తివి, కరుణామూర్తివి అంటారే ఇదేనా మీ కరుణ. మేమంతా నిన్ను చూసుకుని కదా బ్రతుకుతున్నది. మీరు లేక మేము ఎలా బ్రతుకగలము. మమ్ము వదిలి వెళ్ళడము భావ్యమా అని ప్రార్ధించారు. వారిని ధర్మరాజు అనునయ వాక్యాలతో అనునయించాడు. తరువాత పాండవులు, ద్రౌపది తమ వస్త్రములను మార్చుకుని నారచీరలను, నారవస్త్రాలను, జింకచర్మాలను ధరించారు. ఆభరణములను తీసివేసారు. తరువాత అగ్ని కార్యములు నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనము చేసారు. అందరూ అంతఃపురమును విడిచి బయలుదేరారు. పాండవులు ముందు నడువగా ద్రౌపది వారిని వెంబడించింది. వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. హస్థినాపురవాసులు వీధులకు అటూ ఇటూ నిలబడి వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. పాండవులు అలా వెళుతున్నప్పుడు హస్థినాపురవాసులకు జూదములో ఓడి అడవులకు వెళుతున్న దృశ్యము గుర్తుకు వచ్చింది. వారి వెంట యుయుత్సుడు సైన్యముతో నడుస్తున్నాడు. అతడి వెంట విచారవదనముతో పరీక్షిత్తు నడుస్తున్నాడు. అందరూ హస్థినాపుర పొలిమేరలకు వచ్చారు. ధర్మరాజు హస్థినాపుర వాసులతో ఇక ఆగమని చెప్పాడు. వారంతా పాండవులకు ప్రదక్షిణలు చేసారు. పాండవులు ద్రౌపదితో ముందుకు సాగారు. యుయుత్సుడు, పరీక్షిత్తు వెనుదిరిగి హస్థినాపురము చేరుకున్నారు. అర్జునుడి భార్య ఉలూపి తన పుట్టిల్లు అయిన నాగలోకము చేరింది. చిత్రాంగధ తన కుమారుడు అయిన బభ్రువాహనుడి వద్దకు చేరింది. కృపాచార్యుడు, ధౌమ్యుడు ధర్మరాజు ఆదేశానుసారము హస్థినాపుర బాధ్యతలను స్వీకరించారు. 


అర్జునుడు గాండీవమును వరుణదేవుడికి ఇచ్చుట:

krishna

గాండీవమును విసర్జించుచున్న అర్జునుడు


పాండవులు ద్రౌపది అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగానదిని దాటి తూర్పు సముద్రతీరానికి చేరుకున్నారు. వారి వెంట కుక్క కూడా వారిని అనుసరించి పోసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జునా ! శ్రీకృష్ణుడి సుదర్శనచక్రము ఎప్పుడో వైకుంఠము చేరింది. నీవు ఇంకా ఈ గాండీవము వదలక ఉన్నావు. దుష్టసంహారణార్ధము నేను ఈ గాండీవాన్ని వరుణుడి వద్ద నుండి తీసుకువచ్చి నీకు ఇచ్చాను. ఇది నీకు ఇచ్చిన కార్యము నెరవేరింది కనుక దీనిని ఇక వరుణదేవుడికి అప్పగించు అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి గాండీవమునకు నమస్కరించి దానిని సముద్రపునీటిలో వదిలాడు. గాండీవము వరుణుడిని చేరింది. తరువాత అగ్నిదేవుడు అదృశ్యము అయ్యాడు. 


పాండవులు ఒకరి తరువాత ఒకరు పడిపోవుట:

krishna

నడవలేక పడిపోయిన ద్రౌపది


పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి అక్కడ నుండి పడమరగా ప్రయాణించి పడమర సముద్రతీరము చేరుకున్నారు. నీటిలో మునిగిన ద్వారక సమీపముకు వెళ్ళారు. తరువాత వారందరూ ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమవత్పర్వతము చేరుకున్నారు. అక్కడ నుండి ప్రయాణించి మేరుపర్వతము చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగసమాధిలో ఉన్నారు కనుక వారికి నడకశ్రమ తెలియడము లేదు. ముందుగా ద్రౌపదికి యోగసమాధి సడలింది. ద్రౌపది ఇక నడవలేక నేలమీద పడిపోయింది. అది భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు భీముడితో భీమా ! పాంచాలరాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్య యంత్రము కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడంటే అధికమైన ప్రేమ, అనురాగము. ఈమె ప్రేమలో పక్షపాతము ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలా పడి పోయింది అన్నాడు. భీముడు ద్రౌపది వంక చూసాడు. అప్పటికి ఆమె మరణంచింది. ధర్మరాజు నిర్వికారముగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు. మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు. సహదేవుడు పడి మరణించడము చూసిన భీముడు ధర్మరాజుతో అన్నయా ! సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడు అహంకారము అంటే ఏమిటో తెలియదు. నిన్ను సదా భక్తితో సేవించాడు. మా అందరిలో సన్మార్గచరితుడు. అతడిలా పడిపోవడానికి కారణము ఎమిటి ? అని అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు అతడికి తన కంటే ప్రాజ్ఞుడు ఈ లోకములోనే లేడన్న గర్వము ఉంది. ఆ గర్వాతిశయముతోనే అతడు కింద పడిపోయాడు అని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు సహదేవుడిని కూడ ద్రౌపదిలాగానే అక్కడే వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. నకులుడు, అర్జునుడు భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రము వారిని వదలకుండా వెన్నంటింది. మరి కొంత దూరము పోయాక నకులుడు కింద పడి మరణించాడు. అది చూసి భీముడు తట్టుకోలేక పోయాడు. ధర్మరాజుతో అన్నయ్యా ! నకులుడు కూడా పడిపోయాడు. అతిసుందరుడు, మంచితనముకు మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు, సుగుణాలఖని, ధైర్యవంతుడు ఇటువంటి మంచి గుణములు ఒక్కటిగా రాశిపోసినట్లు ఉండే వాడు. ఇతడిలో ఏ దుర్గుణము ఉందని ఇలా పడిపోయాడు ? అని అడిగాడు. ధర్మరాజు భీమా ! నువ్వు చెప్పినది నిజమే ఇతడికి లేని సుగుణములు లేవు. కానీ ఈ లోకములో తన కంటే అందగాడు లేడని గర్వము ఉంది. ఆ కారణముగా ఇతడిలా పడి పోయాడు అని చెప్పి తిరిగి ధర్మరాజు నిర్వికారముగా ముందుకు సాగాడు. కుక్క కూడా వారిని వదలక వెంబడిస్తుంది. అప్పటివరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనసు బాధతో మునిగిపోయింది. తరువాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకునేంతలో అర్జునుడు కూడా కిందపడి మరణించారు. అది చూసి భీముడు అన్నయ్యా ! అర్జునుడు కూడా పడి పోయాడు. ఎన్నడూ అబద్ధము ఆడి ఎరుగడు, అతడికి ఉన్న సుగుణములు, సౌర్యపరాక్రమములు ఎవరికి లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణము ఎమిటి ? అని అడిగాడు. ధర్మరాజు కొంచెము ఆలోచించి అవును ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. అదే అతడి గర్వముకు మూల కారణము. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చ లేదు. అది నెరవేర్చ లేదు. అందుకే ఆడినమాట తప్పిన వాడు అయ్యాడు. అందుకే అతడికీ దురవస్థ అని అర్జునుడిని అక్కడే మిగిలిన వారిలా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. అది చూసి భీముడికి కూడా భయము పట్టుకుంది. భయం భయంగా నడుస్తూనే నేలమీద కూలిపోతూ ధర్మరాజా ! నేనుకూడా పడిపోయాను. నాలో ఉన్నలోపము ఏమిటి ? నాకు తెలియచెప్పు అని అడిగాడు. ధర్మరాజు భీమసేనా నీవు అత్యుత్తమ గధాదారివి, పరాక్రమవంతుడవు కాని తిండి పోతువు. అనవరంగా మాట్లాడతావు. నికు అనవసరమైన విషయాలన్ని మాట్లాడతావు. అందుకే నీకు ఈ దురవస్థ అని నిర్వికారముగా భీముడిని వదిలి ముందుకు సాగాడు. కుక్క మాత్రము అతడిని వెన్నంటి వెళుతూనే ఉంది. 

✍️.          

            *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

🙏

భోజరాజు వితరణ*

 

             *భోజరాజు వితరణ*

                 ➖➖➖✍️


*అర్ధరాత్రి వేళ భోజరాజు తన శయనాగారం లో నిద్రిస్తున్నాడు. శయనాగారం క్రిందనే రాజుగారి కోశాగారం వుంది. ఒక దొంగ కావలి వాళ్ళ కన్ను గప్పి కోశాగారానికి కన్నం వేసి ప్రవేశించాడు. విలువైన మణులు, మాణిక్యాలూ మూట గట్టి భుజాన వేసుకొని బయట పదాడమని అనుకుంటూవుండగా ఎందుకో ఆ దొంగకు పాప భీతి, వైరాగ్యం కలిగాయి. ‘నేను పరుల సొమ్ము దొంగిలించి తప్పు చేస్తున్నానేమో పై జన్మకు యిదంతా ఋణభారమే కదా!’*


*యత్ వ్యంగాః కుష్టి న శ్చాంధాః పంగ వశ్చ, దరిద్రణః*

*పూర్వోపార్జిత పాపస్య ఫలమ స్నంతి దేహినః*


*అర్థము:--లోకం లో అంగ వైకల్యం గలవారు, కుష్టు వ్యాధితో బాధ పడే వారు, కుంటి వాళ్ళు, గ్రుడ్డి వాళ్ళు,  దరిద్రులూ వీరందరూ ఎప్పుడో చేసిన పాప ఫలం అనుభావిస్తున్నవారే కదా!’ అనే ఆలోచన వచ్చి ఆ మూట లన్నీ అక్కడే పడవేసి వెళ్లి పోదామనుకుంటుండగా పై భాగం లో పడుకున్న భోజ రాజు కు నిద్రా భంగ మైంది. ఆయన లేచి కిటికీ లోనుంచి ధారా నగరాన్ని, భవనాల్నీ వెన్నెల వెలుగులో చూస్తుంటే ఆయనకు గర్వం కలిగింది. యింత కంటే జీవితానికి ఏమి కావాలి? అని అప్రయత్నంగా ఒక శ్లోకం పైకే గట్టిగా చెప్పాడు..*


*చేతోహరా యువతయ, సుహృదోనుకూలాః*

*సద్భాంధ వా ప్రణయ గర్భ గిరశ్చ భ్రుత్యాః*

*వల్గంతి దంతి నివహా:తరళా తురంగాః*


*అర్థము:--(ఆహా! నాకేమి తక్కువ?)మనోహరమైన అందగత్తె లు, అనుకూలురైన మిత్రులు, సజ్జనులైన బంధువులు, యెంతో ప్రేమతో సేవించే సేవకులు, దూకుడు గల గజ సేనలు, ధాటీ అయిన గుర్రాలు వున్నాయి.* 


*ఈ శ్లోకం కింద వున్న దొంగకు వినిపించి  వాడు వెంటనే నాలుగో పాదం అప్రయత్నముగా గట్టిగా యిలా పూర్తీ చేశాడు "సమ్మీలనే నయనయోః నహి కించిదస్తి!" ఒక్కసారి కళ్ళు మూత పడగానే (చనిపోయిన తర్వాత) పైన చెప్పిన సౌభాగ్యాలేవీ వుండవు.* 


*యిలా గట్టిగా చెప్పగానే కావలి వాళ్లకు వాడు దొరికి పోయాడు. వాళ్ళు వాడిని రాజు గారి దగ్గరకు తీసుకొని వెళ్లారు. రాజు దొంగ చేయ బోయిన దొంగతనం గురించి పట్టించు కోకుండా అంత చక్కని సత్యంతో   తన శ్లోకం పూర్తి చేసి నందుకు తన బంగారు కడియాన్ని  బహుమతి గా యిచ్చి ‘యిక పై దొంగ తనాలు చేయకుండా బ్రతుకు’ అని మందలించి పంపేశాడు. అదీ భోజరాజు వితరణ.*


*ఆ దొంగ ఆ కడియం తీసుకొని తన మిత్రుడింటికి వెళ్ళాడు. ఆ మిత్రుడు నిరుపేద. ఇంట్లో నిద్రిస్తున్నాడు. అతడిని లేపి ‘మిత్రమా! రాజుగారు నాకు ఈ కడియం బహూకరించారు. దీనితో నా కంటే నీకే ఎక్కువ ఉపయోగం. తీసుకో! కానీ యిది రాజుగారి సొంత ఆభరణం! దీన్ని చౌకగా తెగనమ్మబోకు.’ అని ఆ కడియాన్ని అతనికిచ్చి వెళ్ళిపోయాడు.*


*ఆ మిత్రుడు కడియాన్ని పొద్దున్నే 

ఓ బంగారు దుకాణంలో అమ్మేశాడు. ఆ సొమ్ముతో బోలెడు ఖరీదైన బట్టలూ, ఆభరణాలు కొన్నాడు. అవన్నీ ధరించి వీధుల్లో తిరుగుతూంటే తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ‘నిన్నటివరకూ దరిద్రుడిగా ఉన్నవాడికి  అకస్మాత్తుగా యింత ధనం ఎలా వచ్చింది?’ అని అనుమానం వచ్చి రాజభటులకు వాడిని పట్టించారు.* 


*ఆరా తీసి  ఆబంగారు అంగడివాడి దగ్గరినుంచి ఆ కడియాన్నికూడా తీసుకొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు.*


*భోజరాజు వాడిని ‘నీకు ఈ కడియం ఎలా వచ్చింద’ని అడిగాడు.*


*వాడు ఈ శ్లోకం చెప్పాడు…*


*భేకైః కోటర శాయిభిః, మృతమివ క్ష్మా౦తర్గత౦ కఛ్ఛపైః *

*పాఠీనైః పృథు పంక పీఠ లుఠనాత్ - అస్మిన్ముహుర్మూర్చితం!*

*తస్మిన్  శుష్క సరస్యకాల జలదే నాగత్య తచ్చేష్టితం*

*యేనా కుంభ నిమగ్న వన్య కరిణాం యూధైఃపయః పీయతే*


*’రాజా! ఒక ఎండిపోయిన చెరువున్నది.అందులో నీరు లేక నేలబొరియల్లో పడుకున్న కప్పలున్నాయి. తాబేళ్లు భూమిలోకి వెళ్లి చచ్చిపోయినట్టు పడివున్నాయి. చేపలు నీరు చాలక ఆ ఎండిన బంకమట్టి పలకల మీద వెల్లకిలా పడి తరుచుగా మూర్ఛపోతున్నాయి. అలాంటి ఎండిన సరస్సులో అకాలంలో మేఘుడిచ్చిన వర్షంవల్ల పెద్ద అడవి యేనుగులే అకస్మాత్తుగా కుంభస్థలాల దాకా నీటిలో మునిగిపోయి యిప్పుడు హాయిగా నీళ్లు తాగుతున్నాయి. (నిత్య దరిద్రుడైన నాకు అకస్మాత్తుగా సిరి లభించింది. అని భావం) అతని కవిత్వం రాజు కు నచ్చింది. తన కడియాన్ని ఆ దొంగ ఇతనికి యిచ్చివుంటాడని అది ఇతను అమ్మి ఉంటాడని కూడా అర్థమైంది. అతనికి యింకో లక్ష యిచ్చి పంపించాడు.*✍️                   

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“group 🙏

ఋషి ఋణం*

 


             *ఋషి ఋణం*

             ➖➖➖✍️


*అంతగా కష్టపడుతున్నట్లు "కనబడని" వేద పండితులకు  సన్మానాలు, సత్కారాలు ఎందుకు చెయ్యాలి?*

-------------


*భరతభూమి వేదాలకు పుట్టినిల్లు! మనం నమ్మినా, నమ్మకపోయినా మనకి తెలిసినా తెలియకపోయినా వేదం సకలజ్ఞాన నిధి, సమస్త విజ్ఞానానికి నిలయం! మన వీపుమీద ఏముందో మనంతట మనం తెలుసుకోలేని మానవ మాత్రులం - మనకి తెలియనంత మాత్రాన ఒప్పుకోo, లేదు, కాదు చూసేక నమ్ముతాను అంటే అవివేకం తప్ప మరేమీ కాదు! వీటిమీద కూడా ఎంతో పరిశోధన, పరిశ్రమ చెయ్యాలి! చెయ్యాలంటే కనీసం మూలం వేదాల్ని కాపాడుకోవాలి! తరువాతి తరాలకు అందించాలి.*


*మన ఇళ్ళల్లో ఎంత చిన్న కార్యక్రమం అయినా అటువంటి వేదపురుషుల ఆశీర్వచనం కావాలని కోరుకుంటాం, ప్రయత్నిస్తాం! కానీ ఎక్కడినుంచి  వస్తారు? ఎలా అంత నిష్ణాతులైన పండితులుగా తయారవుతారు అనే విషయం చాలా మందికి తెలీదు. అందుకే ఎక్కువగా కష్టపడుతున్నట్లు కనబడని అలాంటి వారికి సభలు పెట్టి ఎందుకు సన్మానాలు, సత్కారాలు  చెయ్యాలి? మనం పిలిచినప్పుడు పిలిచినవారికి ఇస్తున్నాం కదా! అనుకుంటూ ఉంటారు ఇలాంటి వారుకూడా చాలామంది!*


*కానీ కనీసం 10-12 సంవత్సరాల పరిశ్రమ చేస్తే  కానీ ఒక ‘క్రమపాఠీ’ తయారు కారు. అది ప్రారంభ దశ! అర్హత! ఆపైన పదం, ‘జట’ ఇలా కొనసాగుతూ ‘ఘన’ వరకు కొనసాగుతుంది. ఆ స్థితికి చేరడానికి 18-20 సంవత్సరాల కృషి, పట్టుదల ఇంకా కఠోర పరిశ్రమ కావాలి. ఆపైన పరీక్ష ఇచ్చి ఉత్తీర్ణులు కావాలి!*


*పోనీ ఎలాగో అలాగ కష్టపడి అర్హత సాధించేక అయిపోయినట్లేనా? అంటే కాదు! ఆజన్మాంతం పొల్లు పోకుండా అపస్వరాలు రాకుండా గుర్తు పెట్టుకోవాలి!*


*మన లౌకిక విద్యలు పరీక్షల్లో క్లిష్టమైన IAS  చదివిన అధికారులైనా ఒకసారి నియమించబడ్డాక పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడమే తప్ప చదివినదంతా గుర్తు ఉంచుకోనక్కరలేదు, ఉంచుకోరు కూడా!*


*నేడు న్యాయ పట్టా తీసుకున్న వారు కూడా మూలంగా విషయం గుర్తుపెట్టుకుని మర్నాడు కాబోయే కేసుకు సంబంధించిన సెక్షన్లు మళ్లీమళ్లీ చదువుకుని కోర్టు కి వెళ్ళవచ్చు. అనుభవం కొద్దీ పదును తేరవవచ్చు.*


*ఇంక, డాక్టర్లు తప్ప చదివినది నిత్యం గుర్తు ఉంచుకునే వృత్తి ఎవరికీ లేదు. వారుకూడా సాధారణ లక్షణాలు, స్థూలంగా చికిత్స గుర్తుపెట్టుకోవడమే కానీ చదివింది మొత్తం ఒక్క అక్షరం పొల్లుపోకుండా కంఠతా పట్టి ఆజన్మాంతం గుర్తు పెట్టుకోరు, ఆ అవసరం కూడా ఉండదు. వీళ్ళకీ గూగుల్ మాత ఆపన్నహస్తం ఉండనే ఉంది!*


*ఇంక మామూలు చదువులు అయితే చెప్పనే అక్కరలేదు. అయిపోయిన పరీక్షకి సంబంధించిన పుస్తకాలు అమ్మేయడమే/విసిరేయడమే. మళ్ళీ ఉద్యోగానికి interview కి వెళ్లాల్సినప్పుడు ముఖ్య విషయాలు నెమరు వేసుకోవడమే! మొత్తం గుర్తు ఉంచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ మళ్ళీ మొత్తం చదివినా, ఉద్యోగం రాగానే వదిలేయడమే!*


*ఈ రోజుల్లో అయితే software coding తో సహా ఎక్కడ ఎవరికి ఏ అనుమానం  వచ్చినా   గూగుల్ మాతని అడగడమే!*


*కానీ అలా కాకుండా చిన్నప్పుడు చదువుకున్న వేదాన్ని 70, 80 సంవత్సరాలు నిండిన పండితులు కూడా కొత్తగా వచ్చిన     పిల్ల విద్వాంసులతోబాటు సమానంగా గుర్తు ఉంచుకుని చెప్పడం వంటి అసాధారణ ప్రక్రియ, అప్రమేయ జ్ఞాపక శక్తి ఇంక ఏ రంగంలోనూ,          ఏ వృత్తిలోనూ కనబడదు!*


*పోనీ ఇంత శ్రమపడి చదువుకుని పైకొచ్చిన పండితులకి కనబడితే నమస్కారం పెట్టేవాళ్ళే గానీ పిల్లనిచ్చే కన్యాదాతలు కూడా అరుదు అయిపోయారు. అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమెరికా సంబంధాలే కావాలి!*


*ఇలాంటప్పుడు అలాంటి మేధావుల్ని పెంచి, పోషించి కాపాడుకోవలసిన ధర్మం/బాధ్యత మనందరిమీదా ఉంది. వాళ్ళకి కూడా సంసారాలు, పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా! వారి పోషణ చెయ్యాలి కదా!*


*వీరు చేసే కఠోర పరిశ్రమ, వీరికి ఉన్న, ఉండవలసిన అసాధారణ జ్ఞాపక శక్తిని తెలుసుకున్నాక - మామూలు ఇంగ్లీష్ చదువులు, ఇంజనీరింగులు చదవలేని వారు ఇందులో చేరతారు అనుకోవడం భ్రమ! తప్పు! అకార్యం అవివేకం కూడా!*


*అందుకని మనం చదవలేకపోయిన, చదువుకోని చదువును మనందరికోసం చదువుకుని ఆ పరంపరను ఋషిప్రోక్త వచనాలను మనకి అందిస్తున్న అలాంటివారిని ఆదరించడం మన విధి, కర్తవ్యం కూడా!!!*


*పుట్టిన ప్రతివారికీ ప్రామిసరీనోటు లేని ఋణాలు మూడు - దేవఋణం, పితృఋణం, ఋషిఋణం. వీటిని మన జీవిత కాలంలో తీర్చుకోవల్సిన కర్తవ్యం మన అందరి మీదా ఉంది. ఋషులు అందించిన వేదాన్ని చదువుకుని             ఆ పరంపరను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూ వేదాధ్యయనం చెయ్యడం, చేయించడమే ఋషి ఋణం తీర్చుకోవడం అంటే.*


*అటువంటి ఋషిఋణం తీర్చుకోవడానికి మనవంతుగా పదిమంది వేద పండితులకు సహాయం అందించాలి!అందించేవారిని ప్రోత్సహించాలి! వారికి సహాయం అందించాలి! అన్నింటికంటే ముందు వారిని గౌరవించాలి, గౌరవించక పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నచూపు చూడటం మాత్రం కూడదు!*


*ఇకనుంచైనా విషయం తెలుసుకుని విలువ ఉన్నవారిని గౌరవిద్దాం, వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇద్దాం! మన వంతు ‘ఋషి ఋణం’ తీర్చుకుందాo!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*.🙏

సాధువు

 


                    *సాధువు*

                 ➖➖➖✍️

 

*ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు. ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికిలేరు. ఆయన ఒంటరిగా ఉండేవాడు.  జమీందారు వద్ద ఒక పాలేరుకుర్రాడు ఉండేవాడు. వాడికీ ఎవరూలేరు. వాడు పశువులను మేపేవాడు. ప్రతీరోజు ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్ళి, మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు.*


*జమీందారుగారి వంటమనిషి వాడికి అన్నం పెట్టేది. ఇది వారికి నిత్యకృత్యం. ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నమవుతుండగా తిరిగివచ్చాడు. ఆరోజు చాలా ఎండగా ఉంది. ఆకలితో నకనకలాడుతున్నాడు. రోజూలానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. వంటమనిషి ఎప్పట్లానే అతనికి చద్దిఅన్నం పెట్టింది. అతడు కొంచెం మజ్జిగగాని, జావగాని పొయ్యమన్నాడు. *


*దానికి ఆ పనిమనిషి - "నీకోసం నేను జావ కాచాలా? తింటే తిను. లేకపోతే పో" అని విసుక్కుంది.*


*వంటమనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది. తిరిగి తిరిగి, అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు.* 


*అలా నడుస్తూ నడుస్తూ, దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది. ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాణ్ణి చేరదీసి, అన్నం పెట్టి, ఏ ఊరినుంచి వచ్చావని అడిగారు. అతడు తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని బదులిచ్చాడు.*


*సాధువులు "నువ్వు కూడా సాధువుగా మారిపోయి యిక్కడే ఉండిపో" అన్నారు.*


*ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి, మఠం ఆశ్రయాన్ని పొందాడు. విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు. అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు. కొంత కాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు.*


*కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని, అతనికి ఆహ్వానం లభించింది. మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని అతడు గ్రామానికి బయలుదేరాడు.*


*పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు. ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం యిచ్చాడు.*


*సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడు గాని, వృద్ధుడైన జమీందారు తనవద్ద పనిచేసిన బాలుడే, ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు.*


*జమీందారు యింటిలో మఠాధిపతికి, అతని పరివారానికి భోజనాలు ఏర్పాటుచేయబడ్డాయి.*


*సాధువులందరూ భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని (పురుషోత్తమ ప్రాప్తి యోగము) పారాయణ చేసి, భోజనానికి ఉద్యుక్తులయ్యారు.*


*మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి.*


*ఇంతలో జమీందారు సాధువును సమీపించి - "స్వామీ! నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి. నామీద దయయుంచి నా చేతులతో యిస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి" అని ప్రార్థించసాగాడు.*


*ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది. అతడు చిరునవ్వు నవ్వసాగాడు.* 


*జమీందారు వినయంగా - "స్వామీ! మీరెందుకు నవ్వుతున్నారు?" అని అడిగాడు.*


*సాధువు చిరునవ్వుతో "ఏమీలేదు. ఏదో పాతసంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది" అన్నాడు.*


*జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు.*


*సాధువు తోటి సన్యాసులతో - "అందరూ ఒకసారి ఆగండి. ఈ జమీందారుగారు నేనెందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు. నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను" అని జమీందారుని యిలా అడిగాడు.*


*"మీ యింటిలో చాలాకాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడుకదా. అతడు ఏమయ్యాడు?" *


*"ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు. అతడు ఎప్పుడో యిల్లు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడకు వెళ్ళాడో, యిప్పుడెక్కడ ఉన్నాడో తెలియదు" అన్నాడు - జమీందారు.*


*ఆ కుర్రవాడిని నేనే. ఆ రోజు కోపంతో యిల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాను. తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్ళాను. వారు నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చారు. అక్కడనుండి కాశీకి వెళ్ళాను. అక్కడ చదువుకొని తిరిగివచ్చి మఠాధిపతి నయ్యాను.*

 

*ఇదే ఆ యిల్లు, అదే మీరు అదే నేను. ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజి పొయ్యాడానికి మీ వంటమనిషి నిరాకరించింది. ఈ రోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తానని నన్ను ప్రాధేయపడుతున్నారు. ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది.*


*సాధువుల ఆశ్రయం దొరకగానే, గంజినీళ్ళు కూడా దొరకనివాడికి రాజభోగాలు లభిస్తున్నాయి. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు. లక్షాధికారో, కోటీశ్వరుడో అవడంకంటే, భగవంతుడైన శ్రీహరికి శరణుజొచ్చి ఆయన భక్తుడయినవాడే  సంతోషం గా     జీవించగలడు. ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించినవారికి మాత్రమే లభిస్తుంది.’*✍️

 .          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

నేనోడిపోయాను

 


               *నేనోడిపోయాను!*

                   ➖➖➖✍️

       *(ఓ ఉపాధ్యాయడి ఆవేదన!)*

                



*నేను మాస్టారుగా ఓడిపోయాను. మరి నా సబ్జెక్టులో సగం మంది తప్పితే నేను ఓడిపోయినట్లేగా.*


*సంవత్సరంలో నేను చాలా సార్లు ఓడిపోయాను.* 


*మొదటి వారమే ఓ టీచర్ గారు వాడేమిటండి ఎటూ చూడకుండా నా వైపే చూస్తున్నాడు, బోర్డు వంకా పుస్తకం వంకా కూడా చూడడు, వాడలాచూస్తుంటే చిరాకుగా ఉందంటే, వాడిని ఏమీ మార్చలేక ఓడిపోయాను.*


*పదవ తరగతికి వచ్చినా తెలుగు చదవడం రాకపోతే, వాడికి అప్పుడు నేర్పే ఓర్పు లేక ఓడిపోయాను.*


*’ఒక్క ప్రశ్న చదువుకు రండి’ అంటే సగం మంది సమాధానం చెప్పకపోతే, నాలుగు లైన్ల సమాధానం నాలుగు సార్లు చెప్పి మరుసటి రోజు చెప్పమంటే సగం మంది చెప్పక నేను ఓడిపోయాను.* 


*కొందరు బడి మధ్యలోనే బడిలో ఉండకుండా ఎవరికీ చెప్పకుండా వెళుతుంటే, వారిని చాలా సార్లు ఆపి మందలించానని.... వారి తల్లిదండ్రులు ఒకరిద్దరు వచ్చి నన్ను బెదిరిస్తుంటే ఓడిపోయాను.*


*బాగా గోలచేస్తూ బడిలో ఫ్యాన్లు, స్విచ్లు, బల్లలు పాడుచేస్తున్నవారిని మందలించానని రాత్రులు బండ్లపై వేగంగా నా ఇంటిముందు బూతులు తిడుతూ వెళుతుంటే పోలిస్ కంప్లైంట్ ఇస్తే పిల్లలు ఇబ్బందిపడతారని నేనోడిపోయాను.* 


*పెద్దమనుషులకు చెప్పి వారి తల్లిదండ్రులకు చెప్పిద్దామంటే, కులాలగొడవలుగా మారుతుంది, మీ గురించి వింటున్నాము క్రమశిక్షణ కోసం కృషిచేస్తున్నారు మంచిదే,  మీరు ఇబ్బందులు పడకుండా వదిలేయండి వారే అనుభవిస్తారనే సమాధానంతో నేనోడిపోయాను.*


*ఉపాధ్యాయులందరూ మంచి మాటలు చెబుతున్నా, చివరి రెండు నెలలు బడి బయట, గుళ్ళల్లో, పొదల్లో బాలబాలికలు ఉన్నారంటే, వారికి మంచి బుద్ధి నేర్పలేక  నేనోడిపోయాను.*


*బాలికల తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే బడి మానిపిస్తారని దడిచి ఓడిపోయాను.*


*చివరి 4 నెలలలో విజిట్స్ గోలతో నేను, నా పిల్లలు నోట్సులు రాసుకునే హడావుడే గాని పిల్లల గురించి ఇదివరకులా పట్టించుకోలేదని గుర్తుకు వచ్చి నేను ఓడిపోయాను.*


*బడికి రావడం పిల్లాడి హక్కు అని నాకు తెలిసినా దానిని అధికారుల హూంకరింపుతో నాకు నేను దడిచి, వారిని బూట్లు లేవని యూనిఫారం లేదని ఇంటికి పంపిన నేరానికి నేను ఓడిపోయాను.*


*పిల్లలు... పెళ్లిళ్లు పండగలంటూ తక్కువ మంది హాజరైనా, ఆరోజు కూడా సిలబస్ అవ్వలేదని పాఠాలు చెప్పి నేనోడిపోయాను.*


*నిర్భయంగా బడికి వచ్చి పిల్లలకు ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అనే  ఆలోచనల్లో ఉండేవాడిని, అలా కాకుండా భయం భయంగా బడిలో గడుపుతూ నేనోడిపోయాను.*


*జీతాల గురించి, పని విధానం గురించి అనేక మచ్చలు ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు విమర్శిస్తుంటే మనసు నొచ్చుకొని నేనోడిపోయాను.* 


*30 ఏళ్ల క్రితం ఇంగ్లీషు, తెలుగు చదవడం వ్రాయడం, లెక్కలలో చతుర్విధ ప్రక్రియలు ఉంటే ఐదవ తరగతి బాగుందనే వారు. ఇప్పుడు అధికమైన ఇంగ్లీషు అంటూ ఏమీ రాని స్థితిలో ఉన్న పిల్లల్ని చూసి నేనోడిపోయాను.*


*పరీక్షలైన తెల్లారే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వమంటే, పరీక్షల విధానం గురించి తెలియకుండా ఆదేశాలు ఇచ్చే అధికారులను తలచుకొని  నేనోడిపోయాను.*


*ఊరిలో ఉన్న పిల్లల్లో శ్రద్ధ ఉన్న తల్లిదండ్రులు ఎక్కువమంది కాన్వెంట్లకు పంపుతుంటే, నా వద్ద ఉన్న పిల్లల తల్లిదండ్రులలో 10 శాతమే తమ పిల్లల గురించి శ్రద్ధగా ఉంటారని గమనించి, మిగిలిన పిల్లల స్థితి గురించి తలచుకొని నేను ఓడిపోయాను.*


*పిల్లల బూతులలో నీ యమ్మ అనేది చిన్న బూతు అనీ, పలకరింపులలోనూ అవే వాడుతున్నారని చెప్పటానికి నేను ఓడిపోయాను.*


*నెలల తరబడి పిల్లలు ఊరికి వెళ్లి బడికి రాకపోవడం చూసి నేను ఓడిపోతున్నాను.*


*నాతో పాటు మిగిలిన ఉపాధ్యాయులు భోదనేతర పనులు ఎక్కువ అవడంతో తరగతులకు పూర్తిగా న్యాయం చేయలేక పోవడం చూసి ఓడిపోతున్నాను.*


*మొదటి పిరియడ్ లోనే రకరకాల యాప్లతో విసిగిపోతూ హాజరులో భోజనం తినడం, గుడ్లు తినటం వంటి రకరకాల విషయాలతోనూ,  నెట్వర్క్ సమస్యతో విసుగుదల వచ్చి నేను ఓడిపోతున్నాను.*


*చివరిగా నాకు నేను ఇన్నిసార్లు ఓడిపోతుంటే పిల్లలకు జరగదా అన్యాయం. సగం మంది తప్పడం ఇందుకేనా. ఇది నిజమేనా?*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

🙏

అరవై లో ఇరవై*

 

             *అరవై  లో  ఇరవై*

                ➖➖➖✍️


*అరవై లో ఇరవై లా ఉండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు:*

 _యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్,ఆగ్రా.



*60 దాటారంటే, నిజంగా మీరు చాలా అదృష్టవంతులు.* 


 *ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 సంవత్సరాలు దాట గలుగుతున్నారు.*


 *ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.*


 *_మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు:*

*1. దప్పిక అనిపించినా, లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజూ కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.*


 *2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో... మీ ఇష్టం, కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి.*


*3. బ్రతకడానికి తినండి, తినటానికి బ్రతకకండి. పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి.*


 *4. వీలైనంత వరకూ నడవండి.. లేదా సైక్లింగ్ చేయండి. 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి.* 


*అపార్ట్ మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు. రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి.*


 *5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో "కోపనిషేధ స్థలం"  అని బోర్డు పెట్టండి. అది  మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.*


 *6. ధనంపై  వ్యామోహం వదిలిపెట్టండి. జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి. డబ్బువెంట మీరు పరిగెత్తకండి. డబ్బు మీ వెంట పరిగెత్తాలి.*


*7. మీరు కోరుకున్నది  దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూషించుకో వద్దు. దానిని మర్చిపోండి.*


 *8. డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది. దీనిని వదిలిపెట్టాలి. దీనికోసం పై వాటిపై  నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో  ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.*


 *9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి. ఆనందంగా ఉండండి. తెల్లజుట్టు వార్థక్యానికి సంకేతం కాదు.* 


*10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి. ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. నేను పెద్దవాణ్ణి, అందరూ నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌.* 


*నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.*


 *ఈ 10 చిట్కాలు పాటించండి.* 


*గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో.....*✍️

*=•=•=•=-=-=-=-=•=•==•=*

*సేకరణ:*

    *--వెలిశెట్టి నారాయణరావు.*

*విశ్రాంత సాంఘికశాస్త్ర* 

                   *ఉపాధ్యాయుడు.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

Group 🙏

ఆచార్య సద్బోధన:*

 110523a0139.   120523-1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀850. 

నేటి…


             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️



*వేయి సంవత్సరాల పాటు తలకిందులుగా తపస్సు చేయడం వలన కలిగే ఫలితం కన్నా, ఒకరికి మంచి చేయాలనే ఆలోచన చాలా గొప్పది.* 


*ఇట్లాంటి వేయి ఆలోచనలు కన్నా ఒక్క ఆచరణ ఇంకా గొప్పది.*


*కేవలం మంచి ఆలోచనలు ఉంటే సరిపోదు. వాటిని ఆచరణలోకి తీసుకురావాలి. అదీ కీలకం.*


*కేవలం ఆచరణ వలననే ఇటు ఆత్మోద్ధరణకు, అటు దైవానుగ్రహ ప్రాప్తికి  నోచుకోగలం.*


*ఆచరణ లేకుండా ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా  అన్నీ వృథాయే!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

ఆపరేషన్

 🪷🪷🙏 *శుభోదయం* 🙏🪷🪷


🫡🇮🇳🫡🇮🇳🫡🇮🇳🫡🇮🇳🫡🇮🇳🫡


*భారత్ సైన్యం జరిపిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్.. ' ఆపరేషన్ కావేరీ ' ..*


*భారత సైన్యం చేసిన  సాహసోపేతమైన రెండు-రోజుల ఆపరేషన్‌ కావేరీ కు అంతర్జాతీయ రక్షణ రంగం నివ్వెర పోయింది..*

*ఒకప్పుడు ఇజ్రాయెల్ ఉగాండా లో తన సైనిక చర్య జరిపినప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ సైన్యం వంక ఎలా చూసిందో అదే* *నివ్వెరపాటుతో భారత సైనిక పాటవాన్ని..*

*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేగాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది..*


*భారత్ యొక్క స్వర్ణ యుగం ప్రారంభమైందని ప్రపంచం గమనించింది..*


*సూడాన్ లో జరిగిన ఈ ఆపరేషన్ మొత్తం ప్రపంచానికి చాలా షాకింగ్ మరియు థ్రిల్లింగ్‌గా ఉంది..ఒక హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని సంఘటన ఇది..*


*ఉక్రెయిన్ మరియు కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయులను రక్షించడం పెద్ద విషయం కాదు.. ఎందుకంటే వారిని అక్కడనుంచి లిఫ్ట్ చేసింది పగటిపూట అది కూడా సాధారణ విమానాశ్రయాల్లో..*


*కానీ సుడాన్‌లో అలా కాదు.. సుడాన్ యొక్క గగనతలం మూసివేశారు..విమానాలు ఎగరడానికి అనుమతి లేదు..కేవలం US మాత్రమే తన రాయబారులను రక్షించడానికి ధైర్యంగా తన హెలికాప్టర్‌లను పంపింది..*


*పోరాటం విమానాశ్రయాల్లో కూడా జరుగుతున్నందున అలాగే అక్కడ అల్మోస్ట్ అన్నీ ఇతర దేశాల దౌత్యవేత్తలు అక్కడికే చేరుకున్నారు కనుక అక్కడనుంచీ మనవాళ్లను కాపాడడం దాదాపు అసాధ్యం..*


*దేశంలోని చాలా మంది ఇలా చిక్కుకుపోయారు.*

*అక్కడ చిక్కుకున్నవారిలో తొలివిడతలో గుర్తించింది 278 మంది భారతీయులను.. ఇప్పుడు వారిని రక్షించడం పెద్ద సవాలుగా మారింది.*


*ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి పూర్తి అధికారాన్ని ఇచ్చారు..*


*ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా రంగంలోకి దిగింది..మిలిటరీ ఇంటిలిజెన్స్ మానిటరింగ్ మొదలుపెట్టింది..*


*వీళ్ళకి తోడు డైనమిక్ విదేశాంగ శాఖామాత్యులు జైశంకర్ గారి నేతృత్వంలో  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ప్రపంచ వాయుసేన చరిత్రలో* *సువర్ణాక్షరాలతో భారత్ చరిత్రను లిఖించడానికి భారత వైమానిక దళం ఉత్సాహంతో రంగంలోకి దిగింది..*


*విదేశీ విమానాలు సుడాన్‌లో ఎగరలేవు..ఒకవేళ సూడాన్ కు రెండో వైపునుంచి భారత్ విమానాలు ఎగిరితే ఇంకోవైపు వారు భయంతో దాడి చేయవచ్చు..ప్రధాన విమానాశ్రయం శిధిలమై ఉంది.. ఈ పరిస్తితిలో  సూడాన్ అనుమతి లేకుండా భారతీయులను రక్షించాలి.*


*భారత ఇంటెలిజెన్స్ సూడాన్‌ లో రెక్కీ వేసింది.. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో మానవరహిత..ఒక పాడుబడిన విమానాశ్రయాన్ని కనుగొంది.*


*అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు కానీ సమస్య ఏమిటంటే*

*అన్నింటిలో మొదటిది..అక్కడ భూమిపై ఎవరూ లేరు..కరెంటు లేదు..జనరేటర్ కూడా శిధిలమైంది..ఇక లైట్లు వెలిగే అవకాశమే లేదు..*


*ఎయిర్ ట్రాఫిక్ గైడెన్స్ లేదు..ఇక్కడ విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ అయినా ప్రమాదాన్ని కావాలని కొనితెచ్చుకోవడమే..*


*విమానం వచ్చినా వారిని ధిక్కరించి రహస్యంగా రావడానికి సుడాన్ అనుమతించదు.*


*ఇక రక్షణ విషయానికి వస్తే భారతీయ విమానాలు ఎగరడానికి వాళ్ళ నిఘా లేని మార్గం లేదు.*


*ఇన్ని సమస్యలు!*

*అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఆపరేషన్ లో ముందుకే వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది..*


*మొదటగా భారత వైమానిక దళం తన కమాండోలతో కూడిన ఒక పెద్ద విమానాన్ని సౌదీ జెడ్డాకు పంపింది అక్కడ నుండి అది సూడాన్ వైపు వెళ్లడానికి కావలసిన ఇంధనం నింపుకుంది..*


*ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ముందుగా ఆ 278 మంది భారతీయులను ఆ పాడుపడిన విమానాశ్రయానికి చేర్చాయి..*


*ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన జీవితంలోనే అత్యంత* *ఉద్విగ్నభరితమైన ఆపరేషన్ మొదలుపెట్టింది..అప్పటిదాకా ఏ విమానాన్ని పంపాలో కూడా టీం అత్యంత రహస్యంగా ఉంచింది..*

*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ' హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ ' ను రంగంలోకి దించింది..ఇక సాహసోపేతమైన ఫీట్ మొదలైంది.*


*లైట్లు లేని చీకటిలో నైట్ విజన్ పరికరాల సాయంతో  విమానం ఎగిరింది.. లైట్లు లేకుండా ఎగరడంతో సూడానీస్ ఆర్మీ..పారా మిలటరీ దానిని చూడలేకపోయింది.*


*శ్రీహరి కోట షార్ సెంటర్ నుంచి లభించిన  ఉపగ్రహ మార్గదర్శకత్వంలో భారత విమానం సంపూర్ణంగా చీకటిలో ప్రయాణించింది.*


*పైలట్లు రాత్రికి రాత్రే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు..ఇంజన్ ను షట్ డౌన్ చేయలేదు..*


*విమానం డోర్ తెరుచుకోవడంతో భారత కమాండోలు పరుగున వెళ్లి విమానంలోకి 278 మందిని మెరుపు వేగంతో తీసుకెళ్లారు..*


*7 నిమిషాల పాటు విమానం సూడాన్ నేలపైనే ఉండిపోయింది..*

*నో లైట్స్..నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్..నో సైన్ బోర్డ్స్ నథింగ్..అందరూ కూచున్న* *తర్వాత*

*కేవలం శాటిలైట్ నావిగేషన్ సాయంతో అంతే మెరుపువేగంతో విమానం టేకాఫ్ తీసుకుంది..*


*సౌదీ అరేబియాలోని జెడ్డాలో విమానం లాండ్ అయిన తర్వాత జెడ్డా నుంచి డిల్లీకి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.*


*ఈ సంఘటన ప్రపంచ వేదికపై తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది..నిజానికి ప్రకంపనాలే పుట్టించింది..*

*ఇజ్రాయెల్ తప్ప మరే దేశం ఇలాంటి సవాలును తీసుకోలేదు కానీ భారతదేశం ధైర్యం చేసింది.*


*మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల శక్తి తెలిసి పాకిస్థాన్ వణికిపోతోంది..చైనా ఆర్మీ చీఫ్ డయపర్స్ కి ఆర్డర్ ఇచ్చాడు..*


*నిజానికి ఈ ఆపరేషన్ చాలా సవాలుతో..ప్రమాదంతో కూడుకున్నది..విమానం అక్కడ చిక్కుకుపోయినా లేదా అక్కడి ఫైటర్స్ విమానాన్ని గమనించి విమానాన్ని చుట్టుముట్టినా  అత్యంత ప్రమాదమే కాదు..భారత్ కు పరువుప్రతిష్టల సమస్య..*


*కానీ మోదీజీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప సాహసం చేసింది.*


*ఆశ్చర్యకరంగా ఇది ఏప్రిల్ 29, 2023 శనివారం నాడు జరిగింది..*


*ఏదో ఒకటో రెండో జాతీయవాద చానల్స్ తప్ప మిగిలిన భారత మీడియా*

*ఎందుకు మాట్లాడలేదు?*


*భారత సైన్యంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.. దేశప్రజల ప్రాణాలు కాపాడడంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రుల మాదిరిగా మోదీజీ కూడా చరిత్రలో నిలిచిపోయారు.*


*తమ ప్రజలను కాపాడుకునేందుకు మోదీజీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని నిరూపించింది.*

*ఈ ఘనత సాధించిన పైలట్‌, క్రూ చీఫ్‌ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.*

*వీరి పేర్లను అవార్డులకు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడే బహుశా వారి పేర్లు కచ్చితంగా తెలిసే అవకాశం  ఉంది.*


*భారత వైమానిక దళం ఒక గొప్ప విజయాన్ని సాధించింది..*

*ప్రతి భారతీయుడు తమ ఛాతీని పైకెత్తి గర్వంగా వారికి సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.*


*భారత ప్రభుత్వం తన పౌరులకు "భయం లేదు..భయం లేదు..భయం లేదని ' అభయం ఇచ్చిన క్షణం..*


*భారత్‌ సూపర్‌ పవర్‌ టైటిల్‌ను చేరిన క్షణం...*


*బెంగళూరు సమీపంలో రాజీవ్ హంతకులు మెరుపుదాడి చేసినప్పుడు ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి రెండు రోజులు పట్టింది..*


*ముంబై దాడి సమయంలో ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి ఒక రోజు పట్టింది..*


*మోడీ హయాంలో 7 నిమిషాల్లో సూడాన్ నుండి భారతీయులను రక్షించాం..*

*భారత్ మారుతుంది..భారత్ శక్తి మారుతుంది..*

*భారత్ వేగం మారుతుంది..*

*భారత్ ను ప్రపంచం చూసే దృష్టి మారుతుంది..*

*ఇది మోదీజీ నాయకత్వంలో దేశం సాధించిన అపురూప చారిత్రక విజయం..*

*( ఈ ఆపరేషన్ తర్వాత షుమారు 3 వేలమంది భారతీయులను సౌదీ అరేబియా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహాయంతో సీ పోర్ట్ మార్గం ద్వారా తరలించారు )*


*జైహింద్...*

*భారత్ మాతాకీ జై...*


🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏

కృత్తికాకార్తె / నిజకర్తరి ప్రారంభం

 *_నేటి విశేషం_*


*కృత్తికాకార్తె / నిజకర్తరి ప్రారంభం*

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని *“కర్తరీ”* అంటారు. 

అంటే భరణి నాలుగో పాదం , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు...

దీనినే *“కత్తెర”* అని కూడ అంటారు. 

కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. 


డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో (డిగ్రీల 23°-20' నిమిషాలు ) నుండి వృషభరాశిలో ( డిగ్రీల 26°-40' నిమిషాలు ).

సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే *“డొల్లు కర్తరీ”* ప్రారంభమవుతుంది.

దీనినే *"చిన్న కర్తరీ"* అని కూడా అంటారు. 

సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై *"నిజకర్తరి"* ప్రారంభమవుతుంది.

సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.


*కర్తరీలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి :-*

కర్తరిలో గృహసంబంధమయిన పనులు చేయవద్దన్నారు. 

నాటి రోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేది కాదు. వేసవి నుంచి వడగాలుపుల నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి , కర్ర , రాతి మొదలగు పనులను వద్దన్నారు. 

నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక , కార్మిక పంచాంగం అనవచ్చు. 

భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు డోల్లు కర్తరి , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం, కర్తరి అంటే కత్తెర అని అర్ధం , 

దేనికి కత్తెర ? ఎండలో పనికి కత్తెరన్నమాట. 

వేసవిలో మే నెలలో 4, 5 తారీకుల మొదలు మే 27, 28 దాకా కర్తరి ఉంటుంది. 

ఆ తరవాత చల్ల బడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. 

వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. 

ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.


కర్తరీలో చెట్లు నరకటం , నారతీయటం , వ్యవసాయం ఆరంభం , విత్తనాలు చల్లటం , భూమిని త్రవ్వటం , తోటలు వేయటం , చెఱువులు , బావులు , కొలనులు త్రవ్వటం , కొత్త బండి కొనటం , అదిరోహించటం , నూతన గృహ నిర్మాణం చేయటం , పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు , దేవాలయాలు కట్టుట చేయరాదు.


*కర్తరీలో చేసుకునే పనులు :-*

కర్తరీలో ఉపనయనం , వివాహం , ప్రవేశాలు , యజ్ఞం , మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును...


               *_✨శుభమస్తు✨_*

    🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

దురదలు

 దురదలు మరియు దద్దుర్లు హరించుటకు సులభ చిట్కాలు - 


 *  సైన్ధవ లవణము , నెయ్యి రెండూ సమాన భాగాలుగా తీసుకుని కలిపి నూరి వంటికి పట్టించుకుని కంబళి కప్పుకొని పడుకున్న యెడల దురదలు మరియు దద్దుర్లు హరించును . 


 *  ఆవనూనె ఒంటికి మర్దన చేసుకుని వేడినీళ్ల స్నానము చేసి కరక , తాడి , ఉశిరిక చూర్ణము కలిపి 3 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి తీసుకొనుచున్న దురదలు , దద్దురులు తగ్గును . 


 *  బెల్లము , వాము రెండూ సమాన భాగాలుగా కలిపి దంచి రేగు పండు అంత మాత్రలు చేసి పూటకొక్క మాత్ర చొప్పున రోజూ రెండు పూటలా ఆవనూనెలో ముంచుకొని లోపలికి తీసుకొనుచున్న దద్దురులు హరించును . 


 *  అల్లము రసము 36 గ్రాములలో పాతబెల్లం 12 గ్రాములు కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తీసుకొనుచున్న దురదలు , దద్దురులు తగ్గును . 


       పైన తెలిపిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్న దానిని ఎంచుకుని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


     దురదలు , దద్దురులు వంటి చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడువారు వంకాయ , గోంగూర , టీ , కాఫీ , పెరుగు , పాలు , మాంస పదార్ధాలు , చేపలు , ఫ్రిజ్ నీరు , మినప పదార్థాలు , పాత పచ్చళ్లు , మసాలా పదార్దాలు పూర్తిగా నిషేధించాలి . 


     మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .  


ఆర్య చాణక్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 57*


అవమాన భారంతో వేడెక్కిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాలసర్పపు బుసవలె విషజ్వాలలు గ్రక్కుతుంటే... ఆవేశంతో యెగసెగసి పడుతున్న వక్షస్థలాన్ని అరచేత అదిమిపట్టుకుంటూ..


"ఓరి ! నందా ! సుకల్పనందా ! నీచసద్వంశ సంజాతా...!" సింహగర్జన చేస్తూ... కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ, ప్రళయకాల రుద్రునిలా లేచాడు చాణక్యుడు. పరాభవ దావాగ్నికి దహించుకుపోతున్నవాడిలా నిలువెల్లా కంపించిపోతూ "నీ వంశమెలా పుట్టిందో మరిచి... అహంకారం మదోన్మత్తుడివై... సద్భ్రాహణజాతికి చెందిన వేద వేదాంగ వేత్తనైన నన్ను... ఈ చాణక్యుని సర్వపండిత సమక్షంలో శిఖ పట్టిలాగి... బ్రాహ్మణునికి శిరశ్ఛేదము కంటే శిఖమిన్న... అన్న సత్యాన్ని తెలిసీ... శిఖలాగి పరాభవించావు. రాజునన్న గర్వంతో... మదంతో... అవమానించావు... ప్రాణసమానమైన నా శిఖ పట్టి లాగి...." అంటున్నాడు ఆగ్రహావేషాలతో. 


సుకల్పనందుడు మరింతగా రెచ్చిపోతూ "లాగాను... నీ శిఖ పట్టిలాగా ... ఏం చేస్తావ్...?" హంకరించాడు.  


"నాశనం... చాణక్యుని శిఖ పట్టి లాగిన నందవంశ సర్వనాశనం... అధికార గర్వ మదోన్మత్తులైన నందులను సర్వనాశన మొనరించి... సర్వలక్షణ సమున్నతులైన సక్షత్రియుని ఈ మగధ సింహాసనంపై నిలిపేంతవరకూ.. నందుల చేత అవమానించబడి ముడి వీడిన ఈ శిఖని... ఈ చాణక్యుడు ముడివెయ్యడు. పంచభూతాల సాక్షిగా... యజ్ఞోపవీత రూపంలో తేజరిల్లుతున్న గాయత్రి సాక్షిగా... ఇది చణకుల వారి పుత్రుడైన చాణక్యుని శపథం... కుటల మహర్షి సాక్షిగా కౌటిల్యుని ప్రతిజ్ఞ..." అంటూ యజ్ఞోపవీతాన్ని పట్టుకొని భీకర ప్రతిజ్ఞ చేశాడు చాణక్యుడు ఆగ్రహావేషాలతో వూగిపోతూ. 


చాణక్యుని భీషణ ప్రతిజ్ఞని ఆలకించిన యావన్మందీ భీతితో, దిగ్భ్రాంతితో మ్రాన్పడిపోయారు. అది ప్రతిజ్ఞా లేక కాలయముని శాసనమా ? నందవంశ నాశనం చేస్తానని ప్రకటించిన చాణక్యుడు ఉన్నతుడా లేక ఉగ్రస్వరూపుడైన రుద్రుడా ? 


సుకల్పనందుడు మరింతగా ఆవేశపూరితడవుతూ "ఏమిటీ ... నందవంశాన్ని నాశనం చేస్తావా ? పదిమందిలో బోడి ప్రతిజ్ఞలు చేస్తావా ? నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే గదట్రా...?" అంటూ ఒరనించి చివాల్న ఖడ్గాన్ని లాగి చాణక్యుని మీదకు లంఘించబోయాడు. 


"సుకల్పా ! ఆగు.." హెచ్చరించాడు రాక్షసుడు చప్పున తేరుకుంటూ. సుకల్పనందుడు ఆగి అసహనంగా అతని వైపు చూసాడు. రాక్షసుడు నందులను వారిస్తూ "జరిగిన గోల చాలు... బ్రహ్మహత్యాపాతకం కూడా ఎందుకు ? చాణక్యుని వదిలిపెట్టండి" అని మందలించాడు. 


సుకల్పనందుడు అడుగు వెనక్కివేసి "రాక్షసామాత్యులు చెప్పారు కాబట్టి బ్రతికిపోయావు... ఫో... ఈ చోటు విడిచిపో..." అని ఆజ్ఞాపించాడు. 


చాణక్యుడు వికృతంగా భృకుటి ముడిచి "పోతానురాజా, పోతాను. నా ప్రతిజ్ఞా పాలన అనంతరమే మరల ఈ పాటలీపుత్రంలో అడుగుపెడతాను. అంతవరకూ... అనుక్షణమూ ఈ చాణక్యుడు నీ గుండెల్లో చిచ్చు రేపుతుంటాడు. జాగ్రత్త" అని హెచ్చరించి అడుగు ముందుకువేసి, రాక్షసుని వైపు అదోలా చూసి... "రాక్షసామాత్యా... నందుల ఆగ్రహావేశాలకి అడ్డుపడి నీకు తెలియకుండానే నందవంశ నిర్మూలనకు నాకు సహకరించావు. నందుల నాశనం తథ్యం. హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చి అడ్డుపడినా అప్రతిహతమైన చాణక్యుని ప్రతిజ్ఞా పాలనముని వారించలేరు. నందవంశ నిర్మూలనం తప్పదు. తప్పదు. ముమ్మాటికీ తప్పదు. అలాంటి విపత్కర సమయంలో కూడా నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని గుర్తుంచుకుంటాను రాక్షసా.. గుర్తుంచుకుంటాను.." అని చెప్పి చరచరా బయటికి వెళ్లిపోయాడు చాణక్యుడు. 


ఆతడి ఆఖరి హెచ్చరిక విన్న రాక్షసామాత్యుడు నోట మాట పెగలక స్థబ్దుడైపోయాడు. 


(ఇంకా ఉంది)...🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

హనుమజ్జయంతి ప్రత్యేకం - 1/11

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం -  1/11

       (ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి) 


I. హనుమ - శ్రీరాముడు 


1. మొదటిసారి వచ్చి చూసి,  హనుమ పలికిన మాటలు విన్న శ్రీరాముని వ్యాఖ్య : 


    ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, 

    ఆ రాజు కార్యములు ఆ దూతలచే నిర్వర్తించబడి సిద్ధిస్తాయి. 


ఏవం గుణగణైర్యుక్తా 

యస్య స్యుః కార్యసాధకాః I 

తస్య సిధ్యన్తి సర్వార్థా 

దూతవాక్యప్రచోదితాః ॥ 

             - కిష్కింధ 3/35 


2. సీతాన్వేషణకై వానర భల్లూక  సైన్యం నలుదిశలా పంపబడుతున్నప్పుడు,  హనుమగూర్చి శ్రీరాముడు : 


    మహాతేజశ్శాలియైన ఆ శ్రీరాముడు, 

    ఉద్యమము చేయడంలో చాల సమర్థుడైన ఆ హనుమంతుని చూచి, 

    ఇంద్రియములు మనస్సు ఆనందంతో నిండగా, 

    తన పని పూర్తి అయినట్లు భావించాడు. 

    పిమ్మట ఆ రాముడు సంతోషిస్తూ, 

    సీతకు ఆనవాలు కోసమై,    

    తన నామధేయం చెక్కిన ఉంగరాన్ని హనుమంతునకు ఇచ్చాడు.


తం సమీక్ష్య మహాతేజా 

వ్యవసాయోత్తరం హరిమ్ I 

కృతార్థ ఇవ సంవృత్తః 

ప్రహృష్టేన్ద్రియమానసః ৷৷ 

దదౌ తస్య తతః ప్రీత| స్వనామాఙ్కోపశోభితమ్ I 

అఙ్గులీయమభిజ్ఞానం 

రాజపుత్ర్యాః పరన్తపః ৷৷ 

          - కిష్కింధ 44/11,12 


3. సీతామాత జాడ తెలుసుకొనివచ్చిన హనుమ గూర్చి శ్రీరాముని ప్రశంస, సత్కారం : 


   "కార్యము చేయుటకై నియుక్తుడైన హనుమంతుడు ఆ పనిని సాధించినాడు. తనను ఏ మాత్రము తేలికపరచుకోలేదు. సుగ్రీవునకు సంతోషం కలిగించాడు. 

    హనుమంతుడు ఇప్పుడు సీతను చూచివచ్చి, నన్నూ రఘువంశమునూ, మహాబలుడైన లక్ష్మణునీ ధర్మానుసారము రక్షించినాడు. 

    కానీ నేను, ఈ ప్రియవార్తను చెప్పిన ఇతనికి తగు ప్రాయమును చేయజాలకున్నాను. 

    అదియే దీనుడనైన నా మనస్సును చాలా పీడిస్తోంది. 

    అట్టి మహాత్ముడైన హనుమంతునికి, ఈ సమయమున నేను, 

    నా సర్వస్వమైన ఆలింగనమును ఇస్తున్నాను."  


తన్నియోగే నియుక్తేన 

కృతం కృత్యం హనూమతా I 

న చాత్మా లఘుతాం నీతః 

సుగ్రీవశ్చాపి తోషితః ।। 

అహం చ రఘువంశశ్చ 

లక్ష్మణశ్చ మహాబలః I 

వైదేహ్యా దర్శనేనాద్య 

ధర్మతః పరిరక్షితాః ।। 

ఇదం తు మమ దీనస్య 

మనో భూయః ప్రకర్షతి I

యదిహాస్య ప్రియాఖ్యాతుః 

న కుర్మి సదృశం ప్రియమ్ ।।         

ఏష సర్వస్వభూతే 

పరిష్వఙ్గో హనూమతః I 

మయా కాలమిమం ప్రాప్య  

దత్తస్తస్య మహాత్మనః ।।

                   - యుద్ధ 1/10,11,12,13 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

హిందూ దర్మం

 ఒక్క చిన్న పసిపాపకు *బుర్కా/హిజాబ్* వేసింది వాళ్ల కన్నాతల్లి 👌👍👌. అంటే చిన్నతనం నుంచే వాళ్లకు వాళ్ళ *మతం* మత ఆచారాలను *మెదడు* లోనికి ఎక్కించి ఎంతో కఠినంగా తయారు చేస్తారు 👌🙏👌


*మనం హిందువులం మన పిల్లలకు కనీసం నుదుట *బొట్టు* పెట్టుకోవడం అహినా అలవాటు చేస్తున్నారా 😡


ఈ నిర్లక్యం వల్ల 😭

హిందూ ఆడబిడ్డలు ఎవడో *జిహాదీ* వేసే *లవ్ జిహాద్* ట్రాప్ కి బాలైపోతున్నారు 😭 కొత్త ప్యాషన్ మన హిందూ పిల్లలకు *డ్రెస్* పైన *చున్నిలు* బరువు అవుతున్నాయి ఇది మన *కర్మ*🙏🙏🚩


దయచేసి *ఆడ/మోగ* పిల్లలను *సనాతన హిందూ దర్మం* గురించి చెపుతూ హిందూ దర్మం *ఆచారాలు పద్ధతు* లలో పెంచండి *హిందూ దర్మం* ను కాపాడండి 🚩🚩🚩🙏🚩