12, మే 2023, శుక్రవారం

భోజరాజు వితరణ*

 

             *భోజరాజు వితరణ*

                 ➖➖➖✍️


*అర్ధరాత్రి వేళ భోజరాజు తన శయనాగారం లో నిద్రిస్తున్నాడు. శయనాగారం క్రిందనే రాజుగారి కోశాగారం వుంది. ఒక దొంగ కావలి వాళ్ళ కన్ను గప్పి కోశాగారానికి కన్నం వేసి ప్రవేశించాడు. విలువైన మణులు, మాణిక్యాలూ మూట గట్టి భుజాన వేసుకొని బయట పదాడమని అనుకుంటూవుండగా ఎందుకో ఆ దొంగకు పాప భీతి, వైరాగ్యం కలిగాయి. ‘నేను పరుల సొమ్ము దొంగిలించి తప్పు చేస్తున్నానేమో పై జన్మకు యిదంతా ఋణభారమే కదా!’*


*యత్ వ్యంగాః కుష్టి న శ్చాంధాః పంగ వశ్చ, దరిద్రణః*

*పూర్వోపార్జిత పాపస్య ఫలమ స్నంతి దేహినః*


*అర్థము:--లోకం లో అంగ వైకల్యం గలవారు, కుష్టు వ్యాధితో బాధ పడే వారు, కుంటి వాళ్ళు, గ్రుడ్డి వాళ్ళు,  దరిద్రులూ వీరందరూ ఎప్పుడో చేసిన పాప ఫలం అనుభావిస్తున్నవారే కదా!’ అనే ఆలోచన వచ్చి ఆ మూట లన్నీ అక్కడే పడవేసి వెళ్లి పోదామనుకుంటుండగా పై భాగం లో పడుకున్న భోజ రాజు కు నిద్రా భంగ మైంది. ఆయన లేచి కిటికీ లోనుంచి ధారా నగరాన్ని, భవనాల్నీ వెన్నెల వెలుగులో చూస్తుంటే ఆయనకు గర్వం కలిగింది. యింత కంటే జీవితానికి ఏమి కావాలి? అని అప్రయత్నంగా ఒక శ్లోకం పైకే గట్టిగా చెప్పాడు..*


*చేతోహరా యువతయ, సుహృదోనుకూలాః*

*సద్భాంధ వా ప్రణయ గర్భ గిరశ్చ భ్రుత్యాః*

*వల్గంతి దంతి నివహా:తరళా తురంగాః*


*అర్థము:--(ఆహా! నాకేమి తక్కువ?)మనోహరమైన అందగత్తె లు, అనుకూలురైన మిత్రులు, సజ్జనులైన బంధువులు, యెంతో ప్రేమతో సేవించే సేవకులు, దూకుడు గల గజ సేనలు, ధాటీ అయిన గుర్రాలు వున్నాయి.* 


*ఈ శ్లోకం కింద వున్న దొంగకు వినిపించి  వాడు వెంటనే నాలుగో పాదం అప్రయత్నముగా గట్టిగా యిలా పూర్తీ చేశాడు "సమ్మీలనే నయనయోః నహి కించిదస్తి!" ఒక్కసారి కళ్ళు మూత పడగానే (చనిపోయిన తర్వాత) పైన చెప్పిన సౌభాగ్యాలేవీ వుండవు.* 


*యిలా గట్టిగా చెప్పగానే కావలి వాళ్లకు వాడు దొరికి పోయాడు. వాళ్ళు వాడిని రాజు గారి దగ్గరకు తీసుకొని వెళ్లారు. రాజు దొంగ చేయ బోయిన దొంగతనం గురించి పట్టించు కోకుండా అంత చక్కని సత్యంతో   తన శ్లోకం పూర్తి చేసి నందుకు తన బంగారు కడియాన్ని  బహుమతి గా యిచ్చి ‘యిక పై దొంగ తనాలు చేయకుండా బ్రతుకు’ అని మందలించి పంపేశాడు. అదీ భోజరాజు వితరణ.*


*ఆ దొంగ ఆ కడియం తీసుకొని తన మిత్రుడింటికి వెళ్ళాడు. ఆ మిత్రుడు నిరుపేద. ఇంట్లో నిద్రిస్తున్నాడు. అతడిని లేపి ‘మిత్రమా! రాజుగారు నాకు ఈ కడియం బహూకరించారు. దీనితో నా కంటే నీకే ఎక్కువ ఉపయోగం. తీసుకో! కానీ యిది రాజుగారి సొంత ఆభరణం! దీన్ని చౌకగా తెగనమ్మబోకు.’ అని ఆ కడియాన్ని అతనికిచ్చి వెళ్ళిపోయాడు.*


*ఆ మిత్రుడు కడియాన్ని పొద్దున్నే 

ఓ బంగారు దుకాణంలో అమ్మేశాడు. ఆ సొమ్ముతో బోలెడు ఖరీదైన బట్టలూ, ఆభరణాలు కొన్నాడు. అవన్నీ ధరించి వీధుల్లో తిరుగుతూంటే తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ‘నిన్నటివరకూ దరిద్రుడిగా ఉన్నవాడికి  అకస్మాత్తుగా యింత ధనం ఎలా వచ్చింది?’ అని అనుమానం వచ్చి రాజభటులకు వాడిని పట్టించారు.* 


*ఆరా తీసి  ఆబంగారు అంగడివాడి దగ్గరినుంచి ఆ కడియాన్నికూడా తీసుకొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు.*


*భోజరాజు వాడిని ‘నీకు ఈ కడియం ఎలా వచ్చింద’ని అడిగాడు.*


*వాడు ఈ శ్లోకం చెప్పాడు…*


*భేకైః కోటర శాయిభిః, మృతమివ క్ష్మా౦తర్గత౦ కఛ్ఛపైః *

*పాఠీనైః పృథు పంక పీఠ లుఠనాత్ - అస్మిన్ముహుర్మూర్చితం!*

*తస్మిన్  శుష్క సరస్యకాల జలదే నాగత్య తచ్చేష్టితం*

*యేనా కుంభ నిమగ్న వన్య కరిణాం యూధైఃపయః పీయతే*


*’రాజా! ఒక ఎండిపోయిన చెరువున్నది.అందులో నీరు లేక నేలబొరియల్లో పడుకున్న కప్పలున్నాయి. తాబేళ్లు భూమిలోకి వెళ్లి చచ్చిపోయినట్టు పడివున్నాయి. చేపలు నీరు చాలక ఆ ఎండిన బంకమట్టి పలకల మీద వెల్లకిలా పడి తరుచుగా మూర్ఛపోతున్నాయి. అలాంటి ఎండిన సరస్సులో అకాలంలో మేఘుడిచ్చిన వర్షంవల్ల పెద్ద అడవి యేనుగులే అకస్మాత్తుగా కుంభస్థలాల దాకా నీటిలో మునిగిపోయి యిప్పుడు హాయిగా నీళ్లు తాగుతున్నాయి. (నిత్య దరిద్రుడైన నాకు అకస్మాత్తుగా సిరి లభించింది. అని భావం) అతని కవిత్వం రాజు కు నచ్చింది. తన కడియాన్ని ఆ దొంగ ఇతనికి యిచ్చివుంటాడని అది ఇతను అమ్మి ఉంటాడని కూడా అర్థమైంది. అతనికి యింకో లక్ష యిచ్చి పంపించాడు.*✍️                   

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“group 🙏

కామెంట్‌లు లేవు: