*అనారోగ్యము - వైద్యము*
➖➖➖✍️️
ఒకరోజు పరమాచార్య స్వామి వారి పాదాలు బాగా వాచిపోయి, చూడ్డానికి బోదకాలు వచ్చిందేమో అనేలా ... వున్నాయి. ఒక పెద్ద ముత్తైదువ స్వామి వారికి హారతి ఇచ్చింది. స్వామి వారి పాదాలను చూసి చాలా ఖేదపడింది.
ఆవిడ అక్కడున్నవారితో “తన దగ్గరకు వచ్చిన భక్తుల బాగోగులు చూసే... మహా స్వామివారిని పట్టించుకునే వారేలేరా?" అని అడిగింది.
చాలా బాధపడుతూ, కళ్ళనీళ్ళు కారుస్తూ పరమాచార్య స్వామి వారిని వేడుకుంది. “పెరియవ తమ ఆరోగ్యం గురించి కూడా కొంత పట్టించుకుంటే... బావుంటుంది....! ఎవరైనా మంచి వైద్యుణ్ణి సంప్రదించి మందులు వేసు కొనవలసింది...” అని.
మహాస్వామి వారు నవ్వారు.... ఆ పెద్దావిడ తమ పాదముల గురించే దిగులు పడుతోందని వారికి తెలుసు. “అరగంట తరువాత వచ్చి నా పాదము లను చూడు” అని మహాస్వామి వారు ఆవిడతో అన్నారు. ఆ పెద్దావిడ వెళ్ళి పోయిన తరువాత మహాస్వామి వారు పదిహేను నిముషాలు పద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళారు.
కొద్దిసేపటి తరువాత ఆ పెద్దావిడ మళ్ళా వచ్చింది. పరమాచార్య స్వామి వారి పాదాలు మామూలు స్థితికి వచ్చి వాపు తగ్గిపోయింది. ఏ వైద్యమూ లేక, ఏమందులూ వాడకుండా స్వామి వారి పాదాలు ఎలా బాగయ్యాయో ఆవిడకు అర్థం కాలేదు.
వారి దేహానికి అనారోగ్యం తెచ్చుకుని వారే దాన్ని నయం చేసుకోవడం స్వామి వారికి ఒక లీల! భక్తులబాధలను తాను భరించి శాస్త్ర బద్ధంగా వారి కర్మలను తుడిచివేయడమే వారి లీల!
కాని పరమాచార్య స్వామి వారి విషయంలో ఎటువంటి తర్కానికి తావు లేదు. ఆయన ఆది వైద్యుడు!
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి