12, మే 2023, శుక్రవారం

నేనోడిపోయాను

 


               *నేనోడిపోయాను!*

                   ➖➖➖✍️

       *(ఓ ఉపాధ్యాయడి ఆవేదన!)*

                



*నేను మాస్టారుగా ఓడిపోయాను. మరి నా సబ్జెక్టులో సగం మంది తప్పితే నేను ఓడిపోయినట్లేగా.*


*సంవత్సరంలో నేను చాలా సార్లు ఓడిపోయాను.* 


*మొదటి వారమే ఓ టీచర్ గారు వాడేమిటండి ఎటూ చూడకుండా నా వైపే చూస్తున్నాడు, బోర్డు వంకా పుస్తకం వంకా కూడా చూడడు, వాడలాచూస్తుంటే చిరాకుగా ఉందంటే, వాడిని ఏమీ మార్చలేక ఓడిపోయాను.*


*పదవ తరగతికి వచ్చినా తెలుగు చదవడం రాకపోతే, వాడికి అప్పుడు నేర్పే ఓర్పు లేక ఓడిపోయాను.*


*’ఒక్క ప్రశ్న చదువుకు రండి’ అంటే సగం మంది సమాధానం చెప్పకపోతే, నాలుగు లైన్ల సమాధానం నాలుగు సార్లు చెప్పి మరుసటి రోజు చెప్పమంటే సగం మంది చెప్పక నేను ఓడిపోయాను.* 


*కొందరు బడి మధ్యలోనే బడిలో ఉండకుండా ఎవరికీ చెప్పకుండా వెళుతుంటే, వారిని చాలా సార్లు ఆపి మందలించానని.... వారి తల్లిదండ్రులు ఒకరిద్దరు వచ్చి నన్ను బెదిరిస్తుంటే ఓడిపోయాను.*


*బాగా గోలచేస్తూ బడిలో ఫ్యాన్లు, స్విచ్లు, బల్లలు పాడుచేస్తున్నవారిని మందలించానని రాత్రులు బండ్లపై వేగంగా నా ఇంటిముందు బూతులు తిడుతూ వెళుతుంటే పోలిస్ కంప్లైంట్ ఇస్తే పిల్లలు ఇబ్బందిపడతారని నేనోడిపోయాను.* 


*పెద్దమనుషులకు చెప్పి వారి తల్లిదండ్రులకు చెప్పిద్దామంటే, కులాలగొడవలుగా మారుతుంది, మీ గురించి వింటున్నాము క్రమశిక్షణ కోసం కృషిచేస్తున్నారు మంచిదే,  మీరు ఇబ్బందులు పడకుండా వదిలేయండి వారే అనుభవిస్తారనే సమాధానంతో నేనోడిపోయాను.*


*ఉపాధ్యాయులందరూ మంచి మాటలు చెబుతున్నా, చివరి రెండు నెలలు బడి బయట, గుళ్ళల్లో, పొదల్లో బాలబాలికలు ఉన్నారంటే, వారికి మంచి బుద్ధి నేర్పలేక  నేనోడిపోయాను.*


*బాలికల తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే బడి మానిపిస్తారని దడిచి ఓడిపోయాను.*


*చివరి 4 నెలలలో విజిట్స్ గోలతో నేను, నా పిల్లలు నోట్సులు రాసుకునే హడావుడే గాని పిల్లల గురించి ఇదివరకులా పట్టించుకోలేదని గుర్తుకు వచ్చి నేను ఓడిపోయాను.*


*బడికి రావడం పిల్లాడి హక్కు అని నాకు తెలిసినా దానిని అధికారుల హూంకరింపుతో నాకు నేను దడిచి, వారిని బూట్లు లేవని యూనిఫారం లేదని ఇంటికి పంపిన నేరానికి నేను ఓడిపోయాను.*


*పిల్లలు... పెళ్లిళ్లు పండగలంటూ తక్కువ మంది హాజరైనా, ఆరోజు కూడా సిలబస్ అవ్వలేదని పాఠాలు చెప్పి నేనోడిపోయాను.*


*నిర్భయంగా బడికి వచ్చి పిల్లలకు ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అనే  ఆలోచనల్లో ఉండేవాడిని, అలా కాకుండా భయం భయంగా బడిలో గడుపుతూ నేనోడిపోయాను.*


*జీతాల గురించి, పని విధానం గురించి అనేక మచ్చలు ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు విమర్శిస్తుంటే మనసు నొచ్చుకొని నేనోడిపోయాను.* 


*30 ఏళ్ల క్రితం ఇంగ్లీషు, తెలుగు చదవడం వ్రాయడం, లెక్కలలో చతుర్విధ ప్రక్రియలు ఉంటే ఐదవ తరగతి బాగుందనే వారు. ఇప్పుడు అధికమైన ఇంగ్లీషు అంటూ ఏమీ రాని స్థితిలో ఉన్న పిల్లల్ని చూసి నేనోడిపోయాను.*


*పరీక్షలైన తెల్లారే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వమంటే, పరీక్షల విధానం గురించి తెలియకుండా ఆదేశాలు ఇచ్చే అధికారులను తలచుకొని  నేనోడిపోయాను.*


*ఊరిలో ఉన్న పిల్లల్లో శ్రద్ధ ఉన్న తల్లిదండ్రులు ఎక్కువమంది కాన్వెంట్లకు పంపుతుంటే, నా వద్ద ఉన్న పిల్లల తల్లిదండ్రులలో 10 శాతమే తమ పిల్లల గురించి శ్రద్ధగా ఉంటారని గమనించి, మిగిలిన పిల్లల స్థితి గురించి తలచుకొని నేను ఓడిపోయాను.*


*పిల్లల బూతులలో నీ యమ్మ అనేది చిన్న బూతు అనీ, పలకరింపులలోనూ అవే వాడుతున్నారని చెప్పటానికి నేను ఓడిపోయాను.*


*నెలల తరబడి పిల్లలు ఊరికి వెళ్లి బడికి రాకపోవడం చూసి నేను ఓడిపోతున్నాను.*


*నాతో పాటు మిగిలిన ఉపాధ్యాయులు భోదనేతర పనులు ఎక్కువ అవడంతో తరగతులకు పూర్తిగా న్యాయం చేయలేక పోవడం చూసి ఓడిపోతున్నాను.*


*మొదటి పిరియడ్ లోనే రకరకాల యాప్లతో విసిగిపోతూ హాజరులో భోజనం తినడం, గుడ్లు తినటం వంటి రకరకాల విషయాలతోనూ,  నెట్వర్క్ సమస్యతో విసుగుదల వచ్చి నేను ఓడిపోతున్నాను.*


*చివరిగా నాకు నేను ఇన్నిసార్లు ఓడిపోతుంటే పిల్లలకు జరగదా అన్యాయం. సగం మంది తప్పడం ఇందుకేనా. ఇది నిజమేనా?*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

🙏

కామెంట్‌లు లేవు: