12, మే 2023, శుక్రవారం

దురదలు

 దురదలు మరియు దద్దుర్లు హరించుటకు సులభ చిట్కాలు - 


 *  సైన్ధవ లవణము , నెయ్యి రెండూ సమాన భాగాలుగా తీసుకుని కలిపి నూరి వంటికి పట్టించుకుని కంబళి కప్పుకొని పడుకున్న యెడల దురదలు మరియు దద్దుర్లు హరించును . 


 *  ఆవనూనె ఒంటికి మర్దన చేసుకుని వేడినీళ్ల స్నానము చేసి కరక , తాడి , ఉశిరిక చూర్ణము కలిపి 3 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి తీసుకొనుచున్న దురదలు , దద్దురులు తగ్గును . 


 *  బెల్లము , వాము రెండూ సమాన భాగాలుగా కలిపి దంచి రేగు పండు అంత మాత్రలు చేసి పూటకొక్క మాత్ర చొప్పున రోజూ రెండు పూటలా ఆవనూనెలో ముంచుకొని లోపలికి తీసుకొనుచున్న దద్దురులు హరించును . 


 *  అల్లము రసము 36 గ్రాములలో పాతబెల్లం 12 గ్రాములు కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తీసుకొనుచున్న దురదలు , దద్దురులు తగ్గును . 


       పైన తెలిపిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్న దానిని ఎంచుకుని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


     దురదలు , దద్దురులు వంటి చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడువారు వంకాయ , గోంగూర , టీ , కాఫీ , పెరుగు , పాలు , మాంస పదార్ధాలు , చేపలు , ఫ్రిజ్ నీరు , మినప పదార్థాలు , పాత పచ్చళ్లు , మసాలా పదార్దాలు పూర్తిగా నిషేధించాలి . 


     మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .  


కామెంట్‌లు లేవు: