*అరవై లో ఇరవై*
➖➖➖✍️
*అరవై లో ఇరవై లా ఉండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు:*
_యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్,ఆగ్రా.
*60 దాటారంటే, నిజంగా మీరు చాలా అదృష్టవంతులు.*
*ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 సంవత్సరాలు దాట గలుగుతున్నారు.*
*ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.*
*_మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు:*
*1. దప్పిక అనిపించినా, లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజూ కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.*
*2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో... మీ ఇష్టం, కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి.*
*3. బ్రతకడానికి తినండి, తినటానికి బ్రతకకండి. పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి.*
*4. వీలైనంత వరకూ నడవండి.. లేదా సైక్లింగ్ చేయండి. 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి.*
*అపార్ట్ మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు. రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి.*
*5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో "కోపనిషేధ స్థలం" అని బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.*
*6. ధనంపై వ్యామోహం వదిలిపెట్టండి. జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి. డబ్బువెంట మీరు పరిగెత్తకండి. డబ్బు మీ వెంట పరిగెత్తాలి.*
*7. మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూషించుకో వద్దు. దానిని మర్చిపోండి.*
*8. డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది. దీనిని వదిలిపెట్టాలి. దీనికోసం పై వాటిపై నియంత్రణ సాధించాలి. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.*
*9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి. ఆనందంగా ఉండండి. తెల్లజుట్టు వార్థక్యానికి సంకేతం కాదు.*
*10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి. ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. నేను పెద్దవాణ్ణి, అందరూ నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి.*
*నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.*
*ఈ 10 చిట్కాలు పాటించండి.*
*గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో.....*✍️
*=•=•=•=-=-=-=-=•=•==•=*
*సేకరణ:*
*--వెలిశెట్టి నారాయణరావు.*
*విశ్రాంత సాంఘికశాస్త్ర*
*ఉపాధ్యాయుడు.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
Group 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి