12, మే 2023, శుక్రవారం

సుభాషితమ్


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*అసారే ఖలు సంసారే*

*సుఖభ్రాన్తిః శరీరిణామ్।*

*లాలాపానమివాఙ్గుష్ఠే*

*బాలానాం స్తన్యవిభ్రమః॥*


*..._సుభాషితరత్నకోశః_…*


తా𝕝𝕝

సారం లేని ఈ సంసారంలో ఏదో సుఖం ఉందని మానవులు భ్రాంతి పడుతూ ఉంటారు..... ఇది బొటనవేలు నోటిలో పెట్టుకొని తన లాలాజలాన్నే చప్పరిస్తూ చనుపాలు తాగుతున్నాం అనుకొనే పసిపిల్లవాని వంటిది.

: శ్లోకం:

*ప్రమాణాదధికస్యాపి గండశ్యామమదచ్యుతేః l*

*పదం మూర్ధ్ని సమాధత్తే కేసరీ మత్తదంతినః ll*

*బాలస్యాపి రవేః పాదాః పతంత్యుపరి భూభృతాం l*

*తేజసా సహ జాతానాం వయః కుత్రోపయుజ్యతే ll*


భావం: 

సింహము తనకన్నా ఎంతో పెద్దదగు మదపుటేనుగు యొక్క కుంభస్థలంపై తన పాదాన్ని మోపుతుంది. బాలసూర్యుడు తన పాదములను అనగా కిరణములను పర్వతశిఖరాలపై ఉంచగలుగుచున్నాడు. కావున తేజోవంతులగువారి యెడల వయస్సును పరిగణనలోకి తీసుకోకూడదు.

దక్షిణామూర్తి శిష్యులందరూ వయోవృద్ధులే. సురేశ్వరాచార్యులు (పూర్వాశ్రమంలో మండనమిశ్రుడు) వారి గురువు శంకరాచార్యులు కన్నా వయసులో పెద్ద!

కామెంట్‌లు లేవు: