10, ఏప్రిల్ 2022, ఆదివారం

రాముడు దేవుడు

 

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .


మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు


మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం - రాముడు.


ధర్మం పోత పోస్తే రాముడు

ఆదర్శాలు రూపుకడితే రాముడు.

అందం పోగుపోస్తే రాముడు 

ఆనందం నడిస్తే రాముడు


వేదోపనిషత్తులకు అర్థం రాముడు

మంత్రమూర్తి రాముడు.

పరబ్రహ్మం రాముడు.

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు


ఎప్పటి త్రేతా యుగ రాముడు ?

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?

అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

*శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.*


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -

*రామాలాలీ - మేఘశ్యామా లాలీ*


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా


వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ


భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం.*


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు


కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ*


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా


వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా!*


తిరుగులేని మాటకు - రామబాణం 


సకల సుఖశాంతులకు - *రామరాజ్యం*


ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన


ఆజానుబాహుడి పోలికకు - రాముడు


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 


రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;


Ravana was Killed by Rama .


ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు*


గొప్ప కొడుకు - రాముడు


అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు*


గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ).


మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).


మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).


సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు 

నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు 

చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు 

జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు.


*రామాయణం పలుకుబళ్లు*


మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది.


తెలుగులో కూడా అంతే .


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...


చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ.


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం


కబళించే చేతులు, చేష్టలు

కబంధ హస్తాలు .


వికారంగా ఉంటే - శూర్పణఖ


చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).


పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.


మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర


పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు .


ఎంగిలిచేసి పెడితే - శబరి


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు


అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే.


పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.


సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు - హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిణి


యుద్ధమంటే రామరావణ యుద్ధమే .


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే)


కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).


సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. ఒక ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు.


ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం


అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుత్వమనేది ఒక మతం కాదు .. అది ఒక జీవన విధానం


అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు


రామాయణకథలు మనకంటే చక్కగా ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు.


*|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||*


ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.


*మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు*


జై శ్రీరామ్

గృహము నందు ఉండదగిన మూలికలు

 ప్రతి గృహము నందు ఉండదగిన ఆయుర్వేద మూలికలు మరియు ఆవరణలో ఉండవలసిన చెట్లు  - 


    ఇప్పుడు నేను మీకు తెలియచేసే మూలికలు మరియు చెట్లు అందుబాటులో ఉండే విధముగా చూసుకోనవలెను . అలాగే మీ గృహావరణలో నేను చెప్పబోయే చెట్లను పెంచుకోవడం చాల మంచిది . ఒకవేళ మీ గృహవరణలో స్థలం లేకున్నచో మీకు దగ్గర ప్రదేశాలలో ఖాళీస్థలం ఉన్నచో ఈ చెట్లను పెంచడం మంచిది . వీటివల్ల ఎన్నో గొప్పగొప్ప ఔషధ యోగాలు ఉన్నాయి . 


  గృహము నందు ఉండదగిన మూలికలు  - 


    నిమ్మకాయ , అల్లం , జీలకర్ర , సైన్ధవ లవణం , ఉప్పు , వాము , కురసాని వాము , ఇంగువ , సున్నము , బెల్లము , తేనె , ఆవునెయ్యి , నువ్వులనూనె , కుంకుడు కాయలు , వాము పువ్వు , పుదీనాపువ్వు , పచ్చ కర్పూరం , కర్పూరం , తెల్ల ఆవాలు , ఆవాలు , ఆముదము , యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క , గసగసాలు , సీమగొబ్బి విత్తనాలు , మిరియాలు , ధనియాలు , సుగంధపాల , గంధపుచెక్క , కస్తూరి , దుప్పికొమ్ము , అక్కలకర్ర , అతిమధురము , యష్టిమధుకము , కరక్కాయ , పిప్పళ్లు , పెద్ద ఉశిరిక పప్పు , పటిక , శొంటి , పటికబెల్లము , నీరుల్లి , వెల్లుల్లి , దుంపరాష్ట్రము , మోడీ , మోదుగ మాడలు , రుద్రాక్షలు , అరటిపండ్లు , తమలపాకులు , పసుపు , వాము , తేనె మైనం మొదలైనవి . 


  గృహ అవరణలో పెంచదగిన చెట్లు - 


    నిమ్మ  , నారింజ , వేప , వెలగ , ములగ , ఉత్తరేణి , తెల్ల గురువింద , నందివర్దన , మందార , తెల్ల జిల్లేడు , నల్ల ఉమ్మెత్త , అవిశ , అరటి , పనస , తెల్ల ఈశ్వరి , మారేడు , ఉడుగ , దిరిశన , తుమ్మ , గరిక , తుమ్మి , చంద్రకాంత , గన్నేరు , తోటకూర , గోంగూర , బచ్చలి , చిత్రమూలం , సరస్వతి , చిర్రి , మోదుగ , నల్లేరు , కాడజెముడు , దూలగొండి , వెంపలి , పుదినా , వాము , తులసి , కొబ్బరి , జీడిమామిడి , కానుగ , పిప్పిలి , టేకు , వెదురు , జాజి , గులాబి , మల్లె , దానిమ్మ , పెద్ద ఉశిరిక , మేడి  మొదలైన ఔషధ చెట్లు గృహ ఆవరణలో లేక గృహానికి చుట్టుపక్కల ప్రదేశాలలో తప్పక పెంచవలెను .  


          పైన చెప్పినటువంటి ఔషధాలు మరియు ఔషధ చెట్ల గురించి నేను రాసిన మూడు  ఆయుర్వేద గ్రంథాలలో విపులంగా వివరించాను. 



   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

నిత్యజీవితంలో రామాయణం

 🚩మన నిత్యజీవితంలో రామాయణం🚩



చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

*శ్రీరామరక్ష సర్వజగద్రక్ష*.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -

*రామాలాలీ - మేఘశ్యామా లాలీ*


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - *శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష*.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా*


వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ*


భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం*


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు*


కష్టం గట్టెక్కే తారక మంత్రం - *శ్రీరామ*


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ*


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - *అన్నమో రామచంద్రా*


వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా* !


తిరుగులేని మాటకు - *రామబాణం* 


సకల సుఖశాంతులకు - *రామరాజ్యం*


ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన*


ఆజానుబాహుడి పోలికకు - *రాముడు*


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు - *రాముడు*


*రాముడు ఎప్పుడూ మంచి బాలుడే*...


ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు*


గొప్ప కొడుకు - *రాముడు*


అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు*


*గొప్ప విద్యార్ధి  --  రాముడు*

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు)


*మంచి మిత్రుడు  -- రాముడు*

(గుహుడు చెప్పాడు).


*మంచి స్వామి రాముడు*

(హనుమ చెప్పారు).


*సంగీత సారం రాముడు*

(రామదాసు, త్యాగయ్య చెప్పారు) 

నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

( *పిబరే రామరసం* )

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు "చూడాల్సిన రూపం" - *రాముడు* 

 నోరున్నందుకు "పలకాల్సిన నామం" - రాముడు*  చెవులున్నందుకు "వినాల్సిన కథ" - *రాముడు* చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు*

జన్మ తరించడానికి - *రాముడు , రాముడు, రాముడు*.



రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది.


 *తెలుగులో కూడా అంతే ....* 

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - *రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లు* ఉంటుంది ..


చెప్పడానికి వీలుకాకపోతే - *అబ్బో అదొక రామాయణం*


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - *సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ*


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - *అదొక పుష్పకవిమానం*


కబళించే చేతులు, చేష్టలు - *కబంధ హస్తాలు*


వికారంగా ఉంటే - *శూర్పణఖ*


*చూసిరమ్మంటే కాల్చిరావడం* (హనుమ )


పెద్ద పెద్ద అడుగులు వేస్తే - *అంగదుడి అంగలు*


మెలకువలేని నిద్ర - *కుంభకర్ణ నిద్ర*


పెద్ద ఇల్లు - *లంకంత ఇల్లు*


ఎంగిలిచేసి పెడితే - *శబరి*


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు*


అల్లరి మూకలకు నిలయం - *కిష్కింధ కాండ*


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - *అగ్ని పరీక్షలే*


పితూరీలు చెప్పేవారందరూ -

*మంథరలే* 


సాయం చేసినపుడు - *ఉడుత భక్తి*


కార్యాన్ని సాధించినపుడు - *హనుమ యుక్తి*


గొడవకు దిగే వాళ్ళ పేరు - *లంకిణి*


యుద్ధమంటే - *రామరావణ యుద్ధమే*


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - *రావణ కాష్టాలే* 


కొడితే "బుర్ర *రామకీర్తన* పాడుతుంది"

(ఇది విచిత్రమయిన ప్రయోగం).


*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.  ఒక ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు*


అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు  *"హిందుయిజమ్ ఒక మతం కాదు అది ఒక జీవన విధానం"* అన్నారు


|| *శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే* ||

 వ్

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.



           🙏 *అంతా రామమయం*🙏

                    🚩 *జై శ్రీరామ్* 🚩

శ్రీరామో లలితాంబికా

 శ్రీరామో లలితాంబికా...🙏


ముందుగా వసంత నవరాత్రులు.., దసరా నవరాత్రులు రెండూ వేరు వేరు అని తెలుసుకోండి.


తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకూ వసంత నవరాత్రులు... నవ అంటే తొమ్మిది.., కొత్త అని అర్థాలు.


తొమ్మిది రాత్రులు ఎందుకంటే భక్తి తొమ్మిది రకాలు ...

(1) శ్రవణం, (2) కీర్తనం, (3) విష్ణో:స్మరణం

 (4) పాదసేవనం (5) అర్చనం (6) వందనం

 (7) దాస్యం (8) సఖ్యం (9) ఆత్మ నివేదనం


నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకుని..  తొమ్మిది రోజులు తొమ్మది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికి ఈ నవరాత్రులు..


వసంత నవరాత్రులు : సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగ కారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మృత్యుముఖంలో పడకుండా తప్పించుకో దలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద నివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగభాధలను, మృత్యుభయాన్ని జయించ గలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.


సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి.


వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. "శ్రీరామో లలితాంబికా" అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.


వసంత నవరాత్రులలో కుమారీ పూజ విశిష్టమైనది. ఈ పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయస్సు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల వయస్సు గల కన్య వరకు ఆయా దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించాలి.


వసంత నవరాత్రి అవతారాలు :


 (1) పాడ్యమి నాడు రెండు సంవత్సరాల కన్య "కుమారిక !",

 (2) విదియనాడు మూడు సంవత్సరాల కన్య "త్రిమూర్తి ", 

(3) తదియ నాడు నాలుగు సంవత్సరాల కన్య "కల్యాణి",

 (4) చవితి నాడు ఐదు సంవత్సరాల కన్య "రోహిణి", 

(5) పంచమి నాడు ఆరు సంవత్సరాల కన్య"కాళిక ", 

(6) షష్ఠి నాడు ఏడు సంవత్సరాల కన్య "చండిక", 

(7) సప్తమి నాడు ఎనిమిది సంవత్సరాల కన్య "శాంభవి", 

(8) అష్టమి నాడు తొమ్మిది సంవత్సరాల కన్య "దుర్గ", 

(9) నవమి నాడు పది సంవత్సరాల కన్య "సుభద్ర". వసంత నవరాత్రి వ్రతం పాటించాలి..


దేవీ నవరాత్రుల అవతారాలు : 

(1) శైలపుత్రి, (2) బ్రహ్మచారిణి దేవి,

 (3) చంద్రఘంటాదేవి, (4) కూష్మాండ దేవి,

 (5) స్కందమాతాదేవి, (6) కాత్యాయని దేవి,

 (7) కాళరాత్రి దేవి, (8) మహాగౌరీ దేవి,

 (9)సిద్ధిదాత్రి దేవి


🙏శ్రీ మాత్రే నమః🙏

సీతమ్మ అంటే ఎవరు

 *సీతమ్మ అంటే ఎవరు??..!!*

                 ➖➖➖✍️



*జనకుడి కుమార్తే, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు!!*


*కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి!! జనకుడికి నాగేటిచాలులో దొరక్కముందు, రామయ్యను మనువాడక ముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే!!*


*ఐదు వేలమంది బలిష్టులైన సైనికుల చేత  తీసుకరాబడిన శివధనుస్సును సీతమ్మ ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుని ఆటలాడుకున్న తల్లి ఆమె!  మహామాయా స్వరూపిణి మహాశక్తి స్వరూపిణి సీతమ్మ!!*


*అంతే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది!*


*అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!!*


*సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహాత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది!!*


*"మూల ప్రకృతి రూపత్వాత్                                 సా సీతా ప్రకృతి స్మృతా " !*

*"ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి ఉచ్యతే " !*

*" సీతా" ఇతి త్రివర్ణాత్మా సాక్షాత్ "మహామాయా" భవేత్" !*


*సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ ప్రకృతి స్వరూరిణి!!*


*లక్ష్మీ అష్టోత్తర శత నామాలలో మొట్టమొదటి నామం ఓంప్రకృత్యైనమః!*


*సీతమ్మతల్లి మహాలక్ష్మీస్వరూపం!!*


*రామయ్య పురుషస్వరూపం!!        సీతమ్మ ప్రకృతిస్వరూపం!!*


*ప్రకృతిపురుషులకుప్రతిరూపాలుసీతారాములు!*


*అంతే కాదు ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే!! *


*సీత సత్వ రజ తమో గుణాత్మకమైంది! ఆమె మహామాయా స్వరూపిణి! సకార, ఇకార, తకారాల సంగమం!*

*సకారం ఆత్మ తత్త్వానికి సంకేతం! ఇకారం ఇచ్ఛా శక్తికి సంకేతం! తకారం తారా శక్తి! తరింప జేసేది! అంటే ఆత్మదర్శనం కలిగించి పరమాత్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసేది ఆ మహాశక్తి అని బ్రహ్మగారు వివరించారు!! ఆ కీట బ్రహ్మ పర్యంతం సమస్త సృష్ఠికీ, సమస్త జగత్తుకూ తల్లి సీతమ్మతల్లి!!*


*సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి రూపం అని కూడా అంటారు! అమ్మ జ్ఞాన స్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలుగజేస్తుంది!!*


*రెండోరూపం జనకుడు భూమిని  దున్ను తున్నప్పుడు బయటపడిన రూపం! జనకుని కోట్లజన్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ!!*


*మూడోరూపం  అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి!!*


*ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తుల రూపంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా    సాధకులు, ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు!!*


*రామభక్తులను  హనుమభక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది!!      అదే విధంగా అమ్మఉపాసకులకు రామకృప, హనుమకృప శీఘ్రంగా లభిస్తాయి!!*


*అందుకే భక్తరామదాసస్వామి భక్తితో పాడారు…*


*నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి!! నను బ్రోవుమని చెప్పవే! నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి! జనకుని కూతుర జననీ జానకమ్మా! నను బ్రోవుమని చెప్పవే!!*


*మనందరిపై సీతారామచంద్రస్వామి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

శ్రీరామ జననం

 శ్లోకం:☝ శ్రీరామ జననం

    *తతో యజ్ఞే సమాప్తేతు*

*ఋతూనాం షట్ సమత్యయుః |*

    *తతశ్చ ద్వాదశే మాసే*

*చైత్రే నావమికే తిథౌ |*

    *నక్షత్రేఽదితి దైవత్యే*

*స్వోచ్ఛసంస్థేషు పంచసు |*

    *గ్రహేషు కర్కటే లగ్నే*

*వాక్పతివిందునా సహ ||*

    *ప్రోద్యమానే జగన్నాథం*

*సర్వలోక నమస్కృతం |*

    *కౌసల్యాఽజనయద్రామం*

*సర్వలక్షణ సంయుతం ||*


భావం: యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను. పిమ్మట పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి గర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను. సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములో అనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మించెను. ఆయన జగన్నాధుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభలక్ష సంపన్నుడును మహాభాగ్యశాలియూ విష్ణ్వంశసంభూతుడును ఇక్ష్వాకువంశవర్ధనుడు.🙏

పంచ కట్టు

పంచ కట్టు 

బ్రాహ్మడు అయిన ప్రతివారు ప్రతి నిత్యం నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి. అంటే సంధ్యావందనం, దేవతార్చన మొదలగునవి. బ్రాహ్మడు తానూ చేసే కర్మలను విధిగా పంచ కట్టుకొని ఆచరించాలి, అది సాంప్రదాయం. కానీ ఈ ఆధునిక ప్రపంచ ప్రభావం ఏమిటో కాని బ్రాహ్మడు పంచ కట్టుకోవటానికి కూడా నామోషీ పడుతున్నాడు అని చెప్పటానికి మనం బాధపడవలసి వస్తున్నది. 

ఇప్పుడు వున్న సమాజంలో మనం బ్రహమణులను రెండు తరగతులుగా విభజించ వచ్చని నేను అనుకుంటాను ఈ విషయాన్నీ సర్వులు సమర్ధిస్తారని భావిస్తాను. అదేమిటంటే 1) వృత్తిలో వున్న  బ్రాహ్మలు 2)వృత్తిలో లేని బ్రాహ్మలు 

1) వృత్తిలో వున్న బ్రాహ్మలు: వీరు పురోహితులుగా, అర్చకులుగా వుంటూ సమాజానికి సేవలందిస్తున్నవారు. నిజానికి వీరినే సమాజం బ్రహ్మలుగా గుర్తిస్తున్నది అని కొంతవరకు అనుకోవచ్చు. వీరిలో చాలామటుకు చక్కగా సాంప్రదాయ బద్దంగా వుంటూ వేదపండితులుగా చెలామణి అయ్యే బ్రాహ్మణోత్తములు వున్నారు. తరువాత స్మార్తం నేర్చుకొని షోడశ కర్మలు ( షోడశకర్మలు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు.ఇవి ప్రతి మనిషి  యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి.స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోకశాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), 1 గర్భాదానం 2 పుంసవనం 3 సీమంతం జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత).4 జాతకర్మ 5 నామకరణం 6 నిష్క్రమణ 7 అన్నప్రాశన 8 చూడాకరణ 9 కర్ణవేధ 10 అక్షరాభ్యాసం 11 ఉపనయనం 12 వేదారంభం 13 కేశాంత 14 సమావర్తన 15 వివాహం 16 అంత్యేష్టి ఈ కర్మల వివరణ ఇంకొక పర్యాయం తెలుపుతాను. ) చేయించే సత్ బ్రాహ్మలు కూడా వున్నారు. ఈ పదహారు కర్మలను చేయించగల సమర్ధుడైన బ్రాహ్మణోత్తముడిని షోడశ కర్మాధికారి అని పిలుస్తారు.  కాగా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో చాల కర్మలను చేయటంలేదు, చేయించటంలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక చివరి కోవకు చెందినవారు అటు మంత్రపాఠం సరిగా నేర్చుకొనక, ఇటు సాధారణ విద్యను అభ్యసించక అటు ఇటుకాని స్థితిలో వుండి జీవనాధారం కొరకు పరి పరి ప్రయత్నాలు చేసి విఫలులై చివరకు కులవిద్య శరణ్యం అనుకోని పురోహిత్య వృత్తిలోకి ప్రవేశించే వారు.  వీరికి బ్రాహ్మణ కట్టు బొట్టు నచ్చవు, కానీ అన్యదా గతి లేదు కాబట్టి ఉదారపోషణార్ధం పురోహిత్య వృత్తి చేపడతారు. వీరికి పంచ కట్టుకోవటం నామోషీ, కొందరకు పంచ ధరించటం కూడా తెలియదు. కేశవ నామాలు (ప్రతి పూజ చేసే ముందు కేశవ నామాలు జపించాలి ఇవి మొత్తము 21 నామాలు ఇందులో మొదటి మూడు నామాలు జపించి ముమ్మారులు ఆచమన్యం (ఉద్ధరిణితో నీరు తీసుకొని కుడి చేతిలో పోసుకొని తీసుకోవాలి) తరువాత నామాలను పురోహితుడు జపిస్తారు. అవి కేశవ నామాలు 24 ఓం కేశవాయ స్వాహా ఓంనారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః) కూడా సరిగా రావు వీరు కొన్ని సందర్భాలలో బ్రాహ్మణ శ్రేష్టులుగా వ్యవహరిస్తున్నారు కూడా . 

వీరి కోవకు చెందినవారు కొందరు ఇటీవల ఒక కొత్త పద్దతి కనిపెట్టారు అదేమిటంటే ధవళ వస్త్రము, కాషాయ వస్త్రము, ఆకుపచ్చ వస్త్రము, పసుపుపచ్చ వస్త్రము ఇందులో ఏదో ఒకటి తీసుకొని మధ్యకు మడచి లుంగిలాగా కట్టుకొని పైన ఒక ఉత్తరీయాన్ని ధరించి కార్యక్రమాలు యదేశ్చగా  నిర్వహిస్తున్నారు. వీరిని చుస్తే బహుశా బ్రాహ్మలు ఇలానే వస్త్ర ధారణ చేయాలేమో అని అనిపించే రీతిలో వారి ప్రవర్తన వుంటున్నది. ఇటువంటి విషయాలు పెక్కు గమనించటం వలన ఈ వ్యాసం వ్రాయవలసి వస్తున్నది. (ఇది ఎవ్వరిని ఉద్దేశించి కానీ లేక ఎవరినో విమర్శించాలనో వ్రాసింది కాదు కేవలం బ్రాహ్మణ సమాజం సరైన మార్గంలో పయనించాలని దృక్పధం తప్ప మరొకటి కాదని గమనించగలరు) 

2)వృత్తిలో లేని బ్రాహ్మలు ఇక వీరి గూర్చి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు అవపోశన పట్టి భుజించని వారుకూడా అనేకులు మన సమాజంలో వుంటున్నారంటే అబద్దం కాదు. వీరిలో ఎంతమంది మన సంప్రదాయాలను గౌరవిస్తున్ నారనేది ప్రస్నార్ధకమే . ప్రతి బ్రాహ్మణుడు తన ధర్మాన్ని తెలుసుకొని విధిగా ఆచరించి ఇతరులకు వారి ధర్మాన్ని తెలుపుతూ అందరిని ధర్మాచరణకు పురికొల్పవలసిన సమయం ఆసన్నమైనదని నేను భావిస్తున్నాను.

కాబట్టి మిత్రులారా బ్రాహ్మడు తప్పనిసరిగా పంచ కట్టుకోవటం నేర్చుకోవాలి. బ్రాహ్మడు పంచ ధరించటం ఇతరులు ధరించటానికన్నా బిన్నంగా ఉంటుంది అదేమిటంటే కుచ్చిళ్ళు బైటకు కనపడకూడదు ఆలా కుచ్చిళ్ళు బైటకు కనపడే విధంగా పంచ కట్టడాన్ని రాజస  అంటారు. బ్రాహ్మడు సాత్వికుడు ఎప్పుడు మొఖంలో సత్వగుణం విరాజిల్లుతూ  కాబట్టి కుచ్చిళ్ళు దోపుకొని పంచ కట్టుకోవాలి. లుంగిలాగా ఎట్టి పరిస్థితిలో కట్టుకొని ఎలాంటి అర్చనలు చేయకూడదు చేయించకూడదు. ఆలా చేయటం దోషమని గమనించాలి 

సోదరులారా ఎన్నోవేల జన్మల తరువాత మనకు మానవ జన్మ లభించింది అందునా బ్రాహ్మణ జన్మ ఇంకా అందులో పురుష జన్మ (స్త్రీలు మోక్షానికి అర్హులు కారా అని మీరు అడుగవచ్చు మోక్ష సాధనకు స్త్రీ పురుష వత్యాసం లేదు ఇంకొక పర్యాయం ఈ విషయాన్నీ చేర్చిద్దాము) లభించింది కాబట్టి మనం మన లక్ష్యం బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జన మీదనే ఉండాలి కేవలము జీవనం సాధించటం కొరకు మాత్రమే ధర్మ బద్దంగా సంపాదించి మన అమూల్య కాలాన్ని మోక్ష సాధనకు మాత్రమే  వినియోగించాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః