10, ఏప్రిల్ 2022, ఆదివారం

శ్రీరామ జననం

 శ్లోకం:☝ శ్రీరామ జననం

    *తతో యజ్ఞే సమాప్తేతు*

*ఋతూనాం షట్ సమత్యయుః |*

    *తతశ్చ ద్వాదశే మాసే*

*చైత్రే నావమికే తిథౌ |*

    *నక్షత్రేఽదితి దైవత్యే*

*స్వోచ్ఛసంస్థేషు పంచసు |*

    *గ్రహేషు కర్కటే లగ్నే*

*వాక్పతివిందునా సహ ||*

    *ప్రోద్యమానే జగన్నాథం*

*సర్వలోక నమస్కృతం |*

    *కౌసల్యాఽజనయద్రామం*

*సర్వలక్షణ సంయుతం ||*


భావం: యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను. పిమ్మట పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి గర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను. సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములో అనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మించెను. ఆయన జగన్నాధుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభలక్ష సంపన్నుడును మహాభాగ్యశాలియూ విష్ణ్వంశసంభూతుడును ఇక్ష్వాకువంశవర్ధనుడు.🙏

కామెంట్‌లు లేవు: