*సీతమ్మ అంటే ఎవరు??..!!*
➖➖➖✍️
*జనకుడి కుమార్తే, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు!!*
*కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి!! జనకుడికి నాగేటిచాలులో దొరక్కముందు, రామయ్యను మనువాడక ముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే!!*
*ఐదు వేలమంది బలిష్టులైన సైనికుల చేత తీసుకరాబడిన శివధనుస్సును సీతమ్మ ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుని ఆటలాడుకున్న తల్లి ఆమె! మహామాయా స్వరూపిణి మహాశక్తి స్వరూపిణి సీతమ్మ!!*
*అంతే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది!*
*అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!!*
*సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహాత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది!!*
*"మూల ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి స్మృతా " !*
*"ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి ఉచ్యతే " !*
*" సీతా" ఇతి త్రివర్ణాత్మా సాక్షాత్ "మహామాయా" భవేత్" !*
*సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ ప్రకృతి స్వరూరిణి!!*
*లక్ష్మీ అష్టోత్తర శత నామాలలో మొట్టమొదటి నామం ఓంప్రకృత్యైనమః!*
*సీతమ్మతల్లి మహాలక్ష్మీస్వరూపం!!*
*రామయ్య పురుషస్వరూపం!! సీతమ్మ ప్రకృతిస్వరూపం!!*
*ప్రకృతిపురుషులకుప్రతిరూపాలుసీతారాములు!*
*అంతే కాదు ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే!! *
*సీత సత్వ రజ తమో గుణాత్మకమైంది! ఆమె మహామాయా స్వరూపిణి! సకార, ఇకార, తకారాల సంగమం!*
*సకారం ఆత్మ తత్త్వానికి సంకేతం! ఇకారం ఇచ్ఛా శక్తికి సంకేతం! తకారం తారా శక్తి! తరింప జేసేది! అంటే ఆత్మదర్శనం కలిగించి పరమాత్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసేది ఆ మహాశక్తి అని బ్రహ్మగారు వివరించారు!! ఆ కీట బ్రహ్మ పర్యంతం సమస్త సృష్ఠికీ, సమస్త జగత్తుకూ తల్లి సీతమ్మతల్లి!!*
*సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి రూపం అని కూడా అంటారు! అమ్మ జ్ఞాన స్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలుగజేస్తుంది!!*
*రెండోరూపం జనకుడు భూమిని దున్ను తున్నప్పుడు బయటపడిన రూపం! జనకుని కోట్లజన్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ!!*
*మూడోరూపం అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి!!*
*ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తుల రూపంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా సాధకులు, ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు!!*
*రామభక్తులను హనుమభక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది!! అదే విధంగా అమ్మఉపాసకులకు రామకృప, హనుమకృప శీఘ్రంగా లభిస్తాయి!!*
*అందుకే భక్తరామదాసస్వామి భక్తితో పాడారు…*
*నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి!! నను బ్రోవుమని చెప్పవే! నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి! జనకుని కూతుర జననీ జానకమ్మా! నను బ్రోవుమని చెప్పవే!!*
*మనందరిపై సీతారామచంద్రస్వామి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి