30, ఏప్రిల్ 2026, గురువారం

మా పరివారంమా పరివారం

 మా పరివారం


పచ్చని చెట్టును నేను

భూమికి మహారాణిని నేను

రంగురంగుల 

అందమైనదానను నేను

అందరి ఆకలి తీర్చేద నేను

కలుషితమైన గాలిని పీల్చుకొని

మంచి గాలిని ఇచ్చెదను నేను

అందరి ప్రాణాలను కాపాడడంలో

బాధ్యతను నేను

మీ బంధాన్ని నేను

ఓజోన్ పొరను రక్షించే

కాపలాదారున్ని నేను

మొదటి ప్రాణవాయువును

పుట్టించిన చెట్టును నేను

స్వయంవరంలో పర్యావరణ వరున్ని ఎన్నుకున్న

భూమికి చెట్టును నేను

ప్రకృతి మా పరివారం


               సునీతాప్రతాప్.

               ఉపాధ్యాయిని.

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 29 ఏప్రిల్ 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣1️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *210 వ రోజు*                   

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*సంజయుని రాయబారం*```


సంజయుడు ఉపప్లావ్యం చేరి అర్జునినితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో “ధర్మజా! నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగ క్షేమం కనుక్కు రమ్మని నన్ను పంపాడు" అన్నాడు. 


ధర్మరాజు "మా పెదనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు పెదనాన్న మిమ్ము పంపడం మా అదృష్టం. నిన్ను చూస్తూ వుంటే సాక్షాత్తూ మా పెదనాన్నను చుసినట్లున్నది. వారు క్షేమమా, వారి పుత్రులు క్షేమమా, మనుమలు క్షేమమా, భీష్మ ద్రోణ, కృప అశ్వథామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? వారికి మేమిచ్చిన గ్రామాలను దుర్యోధనుడు లాగుకొన లేదు గదా? గురు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మా విషయంగా దోషములను ఎంచడం లేదు కదా! ఒక్కసారిగా పిడుగులవంటి అరవై తీష్ణ బాణములను ప్రయోగింప గల అర్జునుడి బాహుబలమును స్మరిస్తున్నారా! గద చేత ధరించి దట్టమైన అడవులలో సంచరించే మదపుటేనుగులాగా యుద్ధరంగంలో సంచరించే భీమసేనుడిని స్మరిస్తున్నారు గదా! మునుపు రాజసూయ యాగ సందర్భంగా తనకెదురైన కళింగ రాజును జయించిన సహదేవుని, శిబిని, త్రిగర్త రాజులను జయించిన నకులుడిని స్మరిస్తున్నారా! దురాలోచనతో ద్వైత వనంలోకి ఘోషయాత్రకు వచ్చి బందీలైన ధృతరాష్ట్ర కుమారులను బంధ విముక్తి చేసిన భీమార్జునులను, ఆ సంగతిని స్మరిస్తున్నారా!" అన్నాడు. 


సంజయుడు దానిలోని అంతరార్ధం అర్ధం చేసుకుని తన వాదన వినిపించడం మొదలు పెట్టాడు.. 

“ధర్మజా! నీవు అడిగినట్లే అందరూ కుశలంగా వున్నారు. సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దూరంహంకారులు, నీతి మంతులు, సత్వసంపన్నులు ఇలా అనేక ప్రవృత్తులు కలవారు ఉన్నారు. వారు ఒకరి మాట ఒకరు వినరు. కౌరవులు యుద్ధ ప్రసంగంలో మీ గురుంచి, వీరాగ్రేసరులైన భీమార్జునుల గురుంచి స్మరిస్తున్నారు. ధర్మజా! నీవు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేసావు కాని వృద్ధుడైన దృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదన లేక పోతున్నాడు. మనసులో మధన పడుతున్నాడు. కనుక అజాత శత్రువైన నీవు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించడం ధర్మమా? హస్థినాపుర ప్రజలు శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజా! శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీతమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను” అనగానే ధర్మరాజు “సంజయా నీవు చెప్పదలచినది చెప్పవచ్చు” అన్నాడు.

```

*సంజయుడి దౌత్యం*```

సంజయుడు అందరిని ఒక్క సారి పరికించి “మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ సంధి చేయమని శాంతి సందేశంతో నన్ను పంపాడు. ఇది పాండవులకు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది. ఇది సంయమనం పాటించవలసిన సమయం. మీరు ధర్మస్వరూపులు, శాంత స్వభావులూ. మీరు ఓ చిన్న దోషం చేసినా అది తెల్లని వస్త్రం మీద నల్లని మరకలా స్పష్టంగా కనినిపిస్తుంది. మీకు సుయోధనుని వలన కష్టం కలిగింది.. దానిని నీవు తుడిచి వేయాలి. యుద్ధం వలన జన నష్టం జరుగుతుంది. జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరిని పోగొట్టుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు. మీకు శ్రీకృష్ణుడు పెట్టనికోట, దృపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు ఇక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించ లేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, శల్యులు అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములూ, కుమారులు అజేయులు. సోమదత్త, బాహ్లికులను శివుడు కూడా జయించ లేరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది. కృష్ణార్జునలారా! మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాండవులు వారి బంధు మిత్రులందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా! శాంతించండి. ఆగ్రహమును వీడండి. మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు" అని పలికి కూర్చున్నాడు.```


               *సశేషం* 

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

30ఏప్రిల్2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌷గురువారం🌷*

   *🌹30ఏప్రిల్2026🌹* 

   *దృగ్గణిత పంచాంగం*                 

         

          *ఈనాటి పర్వం*   

      *నరసింహ స్వామి*

            *జయంతి* 


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - శుక్లపక్షం* 


*తిథి : చతుర్దశి* రా 09.12 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : చిత్త* రా 02.16 వరకు ఉపరి *స్వాతి*

*యోగం : వజ్ర* రా 08.55 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : గరజి* ఉ 08.29 *వణజి* రా 09.12 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*           

అమృత కాలం  :*రా 07.20- 09.04*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.30*

*వర్జ్యం    : ఉ 08.56 - 10.40*

*దుర్ముహూర్తం  : ఉ 09.58 - 10.48 మ 03.03 - 03.54* 

*రాహు కాలం  :మ 01.4 - 03.16*

గుళికకాళం      : *ఉ 08.54 - 10.29*

యమగండం    : *ఉ 05.43 - 07.19*

సూర్యరాశి : *మేషం*                  

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 05.51*  

సూర్యాస్తమయం :*సా 06.36*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.43 - 08.16*

సంగవ కాలం    :*08.16 - 10.48*

మధ్యాహ్న కాలం :*10.48 - 01.21*

అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*

*ఆబ్ధికం తిధి :వైశాఖ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం :*సా 03.54 - 06.26*

ప్రదోష కాలం    :*సా 06.26 - 08.42*

రాత్రి కాలం       :*రా 08.42 - 11.42*

నిశీధి కాలం      :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.58*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


        *క్షరాక్షరస్వరూపాయ* 

       *పరాత్పరతరాయ చ*


      *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷*సేకరణ*🌷

       🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వైశాఖ పురాణం

  *🐚బుధవారం 29 ఏప్రిల్ 2026🐚*


_*🚩వైశాఖ పురాణం🚩*_

     *12వ అధ్యాయము*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*```


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుతు నిట్లనెను.. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును 

అనుభవించెనో వివరింపుమని కోరెను. 


శ్రుతదేవుడిట్లనెను..

“కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము..


‘శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిదప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. “అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు.” అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి “కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమ”ని పలికెను. 


ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి..

“కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవుట వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!```


*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

*శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 29 ఏప్రిల్ 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *72వ భాగం*``


*సూర్యవంశ రాజుల చరిత్ర*```


శ్రీమహావిష్ణువు తన యోగనిద్రను వీడి సృష్టి ఆరంభించాలి ఆని సంక ల్పించాడు. ఆయన నాభి నుండి పద్మము ఉద్భవించింది. పద్మము నుండి పద్మసంభవునిగా బ్రహ్మదేవుడు జన్మించాడు. నారాయణుడు సృష్టి కార్యం ప్రారంభించమని బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ కుడిచేతి బొటనవ్రేలు నుంచి దక్షుడు మానస పుత్రుడిగా జన్మించాడు.


దక్షుడు తన కుమార్తె అదితిని కశ్యపునికి ఇచ్చి వివాహంచేశాడు. కశ్యపునికి-అదితికి జగత్తుకి 

శక్తి,ప్రకాశము ఇచ్చే సూర్యుడు జన్మిం చాడు. సూర్యుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వైవస్వతుడు పుత్రుడిగా జన్మించాడు. వైవస్వతుడు ప్రస్తుత ఏడవ మన్వంతరానికి మనువుగా ఉన్నాడు.


వైవస్వతునికి ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, ప్రాంశుడు, నేదిష్ఠుడు, కరూషుడు, వృషధ్రుడు అనే పదిమంది కుమారులు జన్మించారు. ఈ పదిమందికి జన్మించిన సంతానం శాఖోప శాఖలుగా విస్తరించి సూర్యవంశం గా వృద్ధి చెందింది.


వైవస్వతుడి పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడి పేరుతో ఇక్ష్వాకు వంశం జగత్ ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశం లోనే జన్మించాడు. ఇక్ష్వాకుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వీరిలో యాభై మంది ఉత్తర భారతానికి రాజ్యాలు స్థాపించుకోగా, నలభై ఎనిమిది మంది దక్షిణ భారతానికి వెళ్లి రాజ్యాలు ఏర్పరచుకున్నారు.

పెద్దకుమారులు ఇద్దరు తండ్రి ఇక్ష్వాకుని వద్ద ఉండిపోయారు. 


ఒకసారి ఇక్ష్వాకుడు పితృదేవతలకు శ్రాద్దకర్మ చేయాలని నిశ్చయించి పెద్ద కుమారుడైన వికుక్షిని అడవికి వెళ్లి కుందేళ్ళ మాంసం తెమ్మన్నాడు. అడవికి వెళ్లి వేటాడి కుందేళ్ళ మాంసం తెస్తున్న వికుక్షికి బాగా ఆకలి వేసింది. ఆకలి బాధ ఎక్కువ సేపు ఓర్చుకోలేక తెస్తున్న కుందేళ్ళ మాంసంలో కొంత అగ్నితో వండుకుని తినేశాడు. మిగిలినమాంసాన్ని తండ్రి ఇక్ష్వాకునికి తెచ్చి ఇచ్చాడు.


శ్రాద్దకర్మలు చేయిస్తున్న కుల గురువు వసిష్టుడు వికుక్షి తెచ్చిన మాంసం చూసి అది వికుక్షి తినగా మిగిలిన మాంసమని గ్రహించాడు. 

ఎంగిలి చేయబడిన మాంసము శ్రాద్ధకర్మకు పనికిరాదని బయట పారవేయమన్నాడు. 


పితృ శ్రాద్ధ కర్మలో అపచారం కలిగినందుకు ప్రతి చర్యగా వికుక్షిని "అడవిలో కుందేలు మాంసం భక్షిస్తూ శశాదుడిగా జీవించమని" శపించాడు.


అడవికి వెళ్లి శశాదుడిగా మారిన వికుక్షి ప్రాయశ్చిత్తంగా అనేక పుణ్యకార్యాలు చేసి ధర్మనిరతుడు అయ్యాడు. ఆశ్రమ జీవితం గడుపుతూ యాగాలు చేసి రాజర్షి అయ్యాడు. దోషం నుండి విముక్తి పొందాడు. తెలుసుకున్న కులగురువు వసిష్టుడు వికుక్షిని అడవి నుంచి రప్పించి ఇక్ష్వాకుని తరువాత రాజుగా పట్టాభిషేకం చేశాడు. జనరంజక పాలన చేస్తూ శశాదుడు పేరు ప్రఖ్యాతులు పొందాడు.


శశాదుని తరువాత శశాదుని కుమారుడు పురంజయుడు రాజైనాడు. ఆ సమయంలో జరిగిన దేవదానవ యుద్దంలో దేవతలు పరాజితులైనారు. దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని తమకు సహాయం చేయమని ప్రార్ధించారు. శ్రీహరి వారితో "ఇక్ష్వాకు వంశంలో నా అంశతో పురంజయుడు అనే రాజు జన్మించి రాజ్యం చేస్తున్నాడు. అతనిని ప్రార్ధించి మీ తరపున దానవులతో యుద్దం చేయమని అర్ధించండి. తప్పక విజయం లభిస్తుంది" అని ఉపాయం చెప్పాడు.


దేవతలు పురంజయుడి దగ్గరకు వెళ్లి తమ తరపున దానవులతో యుద్దం చేయమని అర్ధించారు. 


పురంజయుడు "శత యాగాలు చేసి ఇంద్రపదవి పొందిన ఇంద్రుడు నన్ను భుజాల మీద మోసుకుని యుద్ద రంగానికి తీసుకు వెళ్లితే, నేను యుద్దంచేస్తాను" అనిషరతు పెట్టాడు. ఇంద్రుడు అంగీకరించి వృషభంగా మారాడు.


వృషభాన్ని అధిరోహించి పురంజయుడు దానవుల మీద యుద్ధానికి వెళ్లి వారిని జయించి సంహరించి దేవతలకు విజయం చేకూర్చాడు.  


వృషభ రూపం దాల్చిన ఇంద్రుని కకుత్థ్సాలాన్ని (వీపు) ఎక్కి పురంజయుడు యుద్దం చేసాడు కనుక అతనికి ‘కకుత్థ్సుడు’ అని పేరు వచ్చింది. ఇతని వంశం కాకుత్థ్స వంశము అయ్యింది.


కకుత్థ్సుడి మనవడు పృధు చక్రవరి. ఇతడు భూమిని గోవుగా చేసి క్షీరముగా భూసారాన్ని పిండి ప్రవహింప చేసి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేసాడు. భూమికి ఇతని నామంతో ‘పృధ్వి’ అని పేరు వచ్చింది. పృధు చక్రవర్తి మనవడు యవనాశ్వుడు. యవనాశ్వుడి ముని మనవడు కువలాశ్వుడు.


కువలాశ్వునికి ఇరవై ఒక్క వేలమంది పుత్రులు జన్మించారు. ఆ సమయంలో ధుంధుడు అనే రాక్షసుడు ఉత్తంక మహామునికి తపోభంగం చేసి మునులు ఆశ్రమాలలో చేసే యజ్ఞయాగాదులు భగ్నం చేస్తూ భూమి లోపల దాక్కునేవాడు. ఉత్తంక మహాముని విజ్ఞప్తి పై కువలాశ్వుడు తన ఇరవై ఒక్క వేల పుత్రులతో ధుంధుడు, అతని రాక్షస సేనలపై దండెత్తి యుద్దం చేసాడు. ధుంధుని సంహరించి ధుంధుమారుడు అనే పేరు పొందాడు.


కానీ ఆ యుద్దంలో ధృఢాశ్వుడు అనే కుమారుడు తప్ప కువలాశ్వుని ఇరవై ఒక్క వేల మంది పుత్రులు మరణించారు. ధృఢాశ్వుడు తండ్రి తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. ధృఢాశ్వునికి యవనాశ్వుడు అనే కుమారుడు జన్మించాడు. యవనాశ్వుడు మహావీరుడు. ధర్మ రక్షణ దుష్ట శిక్షణ చేసి ప్రజారంజకంగా పాలన చేసాడు.


చాలాకాలం యవనాశ్వుడికి సంతానం కలుగ పోవడంతో మునులు అతనిచేత పుత్రకామేష్టి యాగం చేయించారు. యాగం పరిసమాప్తికి ముందురోజు రాత్రి యాగమంత్ర జలాలను బంగారు కల శంలో వేదిక పై నుంచి యాగ శాలలోనే నిద్రించారు. యజ్ఞం పరిసమాప్తి అయిన తర్వాత ఆ మంత్ర జలాలను మహారాణి స్వీకరిస్తే పుత్రుడు జన్మిస్తాడు.


యవనాశ్వుడు కూడా మునులతో పాటు ఆ రాత్రి యాగశాలలో నిద్రించాడు. అర్ధరాత్రి యవనాశ్వుడికి దప్పిక కలిగి మెలుకువ వచ్చింది. నోరెండిపోతుండటంతో చీకటిలో మంచి నీరు అనుకుని వేదిక మీద ఉంచిన కలశంలోని మంత్రజలాలు త్రాగి దప్పిక తీర్చుకుని నిద్రపోయాడు.


మరుసటి రోజు ఉదయాన్నే కలశంలో మంత్రజలం లేకపోవడం గమనించి మునులు "ఈ మంత్రజలం మహారాణి గారు త్రాగితే పిల్లలు పుట్టి ఉండేవారు" అని చెప్పి యాగం వ్యర్ధం అయిందని బాధ పడ్డారు. యవనాశ్వుడికి రాత్రి తాను దప్పికతో అదే మంత్రజలం త్రాగి ఉంటాను అని జ్ఞప్తి తెచ్చుకుని మునులకు ఆ విషయం చెప్పాడు.


విన్న మునులు "రాజా! యాగ మంత్రజలం మహిమాన్వితమైనవి. మీరు త్రాగిన ఫలితంగా మీకు గర్భం వచ్చి పుత్రుడు పుడతాడు. కానీ జనన సమయంలో మీరు ప్రాణాలు కోల్పోవచ్చును" అని హెచ్చరించారు. 


పుత్రుడు పుడతాడన్న ఆనందంలో చనిపోతాడన్న విషయాన్ని యవనాశ్వుడు లెక్క చేయలేదు.


యవనాశ్వుడు గర్భం ధరించాడు. నవమాసాలు నిండిన తరువాత అతని ఉదరపు దక్షిణభాగాన్నీ చీల్చుకుని కుమారుడు బయటకు వచ్చాడు. యవనాశ్వుడు మరణించాడు. యవనాశ్వుడి భార్య భర్త దేహంతో చితిపై సహగమనం చేసింది. పుట్టిన పుత్రుడు తల్లితండ్రిలేనివాడయ్యాడు.


మునులు ఆ బాలుని పెంచడానికి తగిన దాది కోసం వెతుకుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై శిశు పోషణ భారాన్ని తాను స్వీకరిస్తానంటూ ‘మాం ధాస్యతి’ అని అన్నాడు. మునులు ఆ బాలునికి ‘మాంధాత’ అని పేరు పెట్టి ఇంద్రునికి అప్పగించారు.


ఇంద్రుడు బాలుని ఆకలి తీర్చడానికి తన చూపుడు వ్రేలు శిశువు నోటిలో ఉంచి అమృతాన్ని స్రవింప చేశాడు. అమృత పానం వలన మాంధాత మహా బలవంతుడై భూమిని పాలించి మాంధాత చక్రవర్తి అయ్యాడు. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అనే కుమారులు జన్మించారు. విష్ణు భక్తులైన వీరు ధర్మబద్దంగా పరిపాలన చేసి వైకుంఠం చేరి విష్ణు సన్నిధి పొందారు.


                *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శ్రీ గురుమూర్తయే నమ

 🙏*దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః|||*

*స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః!!!*

*మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణే|||*

*తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!!* 🙏


శుభ గురువారం 🕉️Happy Thursday

Mantra - 25

  Mantra - 25 ARUNAM 3 anuvaakam


వసంత ఋవుతు వర్ణన తర్వాత వచ్చే **గ్రీష్మ ఋతువు** (ఎండకాలం) యొక్క తీవ్రతను, దాని వెనుక ఉన్న రుద్రుని శక్తిని ఈ మంత్రం వివరిస్తుంది.


శుక్లవాసా రుద్రగణః| 

గ్రీష్మేణా వర్తతే సహ| 

నిజహన్ పృథీవీగ్ం సర్వామ్|

జ్యోతిషా ప్రతిఖ్యేన సః|| 


శుక్లవాసా రుద్రగణః: శుక్లవాసా అంటే తెల్లని వస్త్రములను ధరించినవాడు. రుద్రగణః అంటే రుద్రులతో (ఏకాదశ రుద్రులు) కూడినవాడు. గ్రీష్మ ఋతువులో ఎండ తీవ్రత వల్ల ఆకాశం లేదా వెలుగు తెల్లగా, ప్రచండంగా ఉంటుంది. ఆ వెలుగునే ఇక్కడ తెల్లని వస్త్రంగా వర్ణించారు.


గ్రీష్మేణా వర్తతే సహ: ఈ రుద్ర శక్తి గ్రీష్మ ఋతువుతో కలిసి సంచరిస్తుంది. వేద పరిభాషలో గ్రీష్మ ఋతువుకు అధిపతులు రుద్రులు.


నిజహన్ పృథీవీగ్ం సర్వామ్: నిజహన్ అంటే తపింపజేయడం లేదా దహించడం. ఆ తీవ్రమైన ఎండతో భూమినంతటినీ (సర్వామ్ పృథీవీమ్) వేడిక్కిస్తుంది. గ్రీష్మంలో ఎండలు మండిపోవడాన్ని ఇది సూచిస్తుంది.


జ్యోతిషా ప్రతిఖ్యేన సః: ప్రతిఖ్యేన జ్యోతిషా అంటే ప్రతి వస్తువును వెలిగించే లేదా కాల్చివేసే తేజస్సుతో అని అర్థం. సూర్యుడు తన ప్రచండమైన కాంతితో లోకాన్ని దహిస్తూ, ప్రతి అణువును వేడి చేస్తున్నాడని భావం.


అరుణప్రశ్న ప్రకారం, ఒక్కో ఋతువు ఒక్కో దేవతా శక్తికి ప్రతీక:

రుద్రుల ఆగమనం: వసంత కాలం 'వసువుల' (శాంత స్వభావం) తో కూడినదైతే, గ్రీష్మ కాలం 'రుద్రుల' (తీవ్ర స్వభావం) తో కూడినది. రుద్రుడు అంటే లయకారుడు. గ్రీష్మంలోని వేడి ప్రకృతిలోని జడత్వాన్ని, పాత తనాన్ని కాల్చివేసి వర్ష ఋతువుకు సిద్ధం చేస్తుంది.


శుక్ల వస్త్రం - ఎండ తీవ్రత: మండువేసవిలో సూర్యకాంతి ఎర్రగా కంటే ఎక్కువగా 'ధవళ వర్ణం'లో (తెల్లగా) కనిపిస్తుంది. అందుకే గ్రీష్మ ఋతువును తెల్లని వస్త్రాలు ధరించిన రుద్రునిగా వర్ణించారు.


ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భూమిలోని మలినాలు నశిస్తాయని, ఇది ఒక రకమైన శుద్ధి ప్రక్రియ అని వేద దృష్టి.


ప్రచండమైన వెలుగును వస్త్రంగా ధరించి, రుద్రులతో కలిసి వచ్చే గ్రీష్మ ఋతువు, తన తీక్షణమైన తేజస్సుతో భూమినంతటినీ తపింపజేస్తుందని ఈ మంత్రం చెబుతోంది.

మనం క్రమంగా వసంతం (వసువులు) నుండి గ్రీష్మం (రుద్రులు) వరకు వచ్చాము. దీని తర్వాత వచ్చే వర్ష ఋతువు (ఆదిత్యులు) గురించి కూడా తెలుసుకోవాలి.


అద్వైత తత్వార్థం

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ గ్రీష్మ వర్ణన జ్ఞానాగ్ని మరియు వైరాగ్యం అనే అంశాలను ప్రతిబింబిస్తుంది:

శుక్లవాసా - పరమ శుద్ధ చైతన్యం

'శుక్ల' అంటే తెల్లని లేదా స్వచ్ఛమైన అని అర్థం. మాయా కల్పితమైన రంగులు (రాగ ద్వేషాలు) లేని నిర్గుణ బ్రహ్మమునకు ఇది సంకేతం. రుద్రుడు అంటే భయపెట్టేవాడు మాత్రమే కాదు, రుతమ్ దుఃఖం ద్రావయతీతి రుద్రః - అంటే దుఃఖాన్ని హరించేవాడు అని అర్థం. అద్వైతంలో, అజ్ఞానమనే దుఃఖాన్ని అంతం చేసే పరమాత్మ స్వరూపమే ఈ రుద్రుడు.


నిజహన్ పృథీవీమ్ - సంసార దహనం

గ్రీష్మ తాపం భూమిపై ఉన్న నీటిని (తేమను) ఎలా పీల్చేస్తుందో, జ్ఞానాగ్ని కూడా సాధకుడిలో ఉన్న విషయ వాసనలను (Desires) అలా దహించి వేస్తుంది.

భూమి (పృథివి): ఇది మన దేహేంద్రియాలకు, ప్రాపంచిక ఆకర్షణలకు సంకేతం.

నిజహన్: జ్ఞానోదయం కలిగినప్పుడు, ప్రపంచం సత్యమనే భ్రమ (మాయ) నశించిపోతుంది. గ్రీష్మ సూర్యుడు భూమిని తపింపజేసినట్లు, ఆత్మజ్ఞానం సంసార భ్రమను శుష్కింపజేస్తుంది.


జ్యోతిషా ప్రతిఖ్యేన - స్వీయ ప్రకాశం (Self-Luminosity)

పరమాత్మను జ్యోతిషాం జ్యోతిః (జ్యోతులకే జ్యోతి) అని అంటారు. బయట కనిపించే సూర్యుడి కాంతి ఒక ప్రతీక మాత్రమే. నిజానికి ఆత్మ చైతన్యమనే వెలుగులోనే బుద్ధి, ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి. గ్రీష్మ సూర్యుడిని ఎవరూ నేరుగా చూడలేనట్లు, అపరిమితమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని మనస్సుతో గ్రహించలేము, కేవలం అనుభూతి చెందగలం.


రుద్రగణః - శక్తుల సమూహం

మాయా ప్రపంచంలో పరమాత్మ అనేక శక్తులుగా (గణములుగా) విడిపోయినట్లు కనిపిస్తాడు. కానీ అద్వైత దృష్టితో చూస్తే, ఆ గణాలన్నీ ఆ ఒక్క రుద్రుని (బ్రహ్మము) యొక్క విభూతులే. సృష్టి, స్థితి, లయ అనే మూడు కార్యాల్లో ఇక్కడ 'లయ' (సంహార) శక్తిని జ్ఞానానికి ప్రతీకగా చెప్పారు.


జ్ఞానమనే గ్రీష్మ సూర్యుడు ఉదయించినప్పుడు, అది తన ప్రచండమైన కాంతితో (జ్యోతిషా) అజ్ఞానమనే అంధకారాన్ని, దేహాభిమానమనే తేమను దహించివేస్తుంది. అప్పుడు మిగిలేది నిర్మలమైన, శుద్ధమైన శుక్ల (చైతన్యం) మాత్రమే.

వసంతంలో సృష్టి (చిగురించడం) ఉంటే, గ్రీష్మంలో 'తపస్సు' (పరిపక్వత కోసం దహించుకుపోవడం) ఉంది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - చతుర్దశి - చిత్ర -‌‌ గురు వాసరే* (30.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

29, ఏప్రిల్ 2026, బుధవారం

పంచాంగము

 


జీవిత సత్యాలు🤟

  *శుభ బుధవారం 🌹Happy Wednesday*


       *🤘జీవిత సత్యాలు🤟*

            బయట వ్యక్తులు వచ్చి ఒక ఇంట్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అర్థం చేసుకోండి. ఆ కుటుంబం కూలిపోయింది అని.

         *👌నిత్య సత్యాలు✍️*

           బాధాకరమైన నిజం ఏంటంటే ఈ రోజుల్లో బంధుత్వాలు అంటే కేవలం శుభకార్యాలకు, అశుభ కార్యాలకు హాజరు కావడానికే పరిమిత మయ్యాయి..

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

: ఆన్లైన్లో హోమియోపతి వైద్యం కొరకు సంప్రదించండి దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు పై నెంబర్ను  వాట్సాప్ केवल व्हाट्सएप में only WhatsApp ద్వారా సంప్రదించగలరు . 

WhatsApp number ::9035231905

మీ పేరు, వయస్సు, లింగము మీ చిరునామా ముందుగా తెలిపి, 


తరువాత మీ సమస్యను క్లుప్తంగా వివరించండి మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు కూడా పేర్కొనండి తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.



 డాక్టర్ సాయి అఖిల స్త్రీల రోగముల నిపుణురాలు

బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

29-04-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------


మిధునం


ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. 

---------------------------------------


కర్కాటకం


బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


సింహం


దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని తీరు అందరినీ ఆకట్టుకుంటారు.

---------------------------------------


తుల


ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. 

---------------------------------------


ధనస్సు


పాత ఋణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------


మకరం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికపరంగా ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కుంభం


నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.

---------------------------------------

Mantra - 24

 Mantra - 24 ARUNAM 3 anuvaakam


గత మంత్రాలలో కాలచక్రం యొక్క రూపాన్ని (ఋతువులు, పక్షాలు, రోజులు) వివరించిన తర్వాత, ఆ కాలాన్ని ఎలా గుర్తించాలి మరియు దాని విశేషాలేమిటో ఇక్కడ వివరిస్తున్నారు.


ఏతదేవ విజానీయాత్। 

ప్రమాణం కాలపర్యయే। 

విశేషణం తు వక్ష్యామః| 

ఋతూనాం తన్నిబోధత|| 


ఏతదేవ విజానీయాత్: దీనినే (క్రిందటి మంత్రం లో చెప్పబడిన కాలచక్రాన్ని) స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే సూర్యుని గమనం వల్ల కలిగే మార్పులను మనం జ్ఞానంతో అర్థం చేసుకోవాలి.


ప్రమాణం కాలపర్యయే: కాలపర్యయే అంటే కాలం మారుతున్నప్పుడు (ఋతువులు మారుతున్నప్పుడు), దానికి "ప్రమాణం" (సాక్ష్యం లేదా కొలమానం) ఇదే. అంటే సూర్యుని స్థితి, పగలు-రాత్రుల నిడివిలో వచ్చే మార్పులే కాలానికి కొలబద్దలు.


విశేషణం తు వక్ష్యామః: ఇకపై ఆయా కాలాల యొక్క ప్రత్యేకతలను (విశేషణాలను) వివరించబోతున్నాను.

 

ఋతూనాం తన్నిబోధత: ఆ ఋతువుల యొక్క లక్షణాలను జాగ్రత్తగా వినండి (గ్రహించండి).


ఈ మంత్రం ఒక పీఠిక (Introduction) వంటిది. దీని ద్వారా వేదం మనకు రెండు విషయాలను బోధిస్తోంది:


కాలాన్ని గుర్తించడం: కాలం కంటికి కనిపించదు, కానీ అది మారేటప్పుడు ప్రకృతిలో కొన్ని గుర్తులు (Signs) కనిపిస్తాయి. ఉదాహరణకు, ఎండ తీవ్రత పెరగడం, చెట్లు చిగురించడం, వానలు పడటం - ఇవన్నీ కాలం మారుతోందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే "ప్రమాణాలు".


శాస్త్రీయ అధ్యయనం: "విశేషణం తు వక్ష్యామః" అని చెప్పడం ద్వారా, వేదం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, శాస్త్రీయంగా ఒక్కో ఋతువులో ప్రకృతిలో ఎటువంటి మార్పులు వస్తాయో (వసంతంలో ఎలా ఉంటుంది, గ్రీష్మంలో ఎలా ఉంటుంది) వివరించడానికి సిద్ధమవుతోంది.


కాలం నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ మార్పును గుర్తించే పద్ధతిని, ఒక్కో ఋతువుకు ఉండే ప్రత్యేక లక్షణాలను ఇప్పుడు వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ మంత్రం చెబుతోంది. దీని తర్వాతే మీరు పైన అడిగిన "సారాగ వస్త్రైర్జరదక్షః..." (వసంత ఋతువు వర్ణన) వంటి మంత్రాలు వస్తాయి. ఈ మంత్రం ఒక అధ్యాయం నుండి మరొక అధ్యాయానికి (సాధారణ కాల గణన నుండి ఋతువుల ప్రత్యేక వర్ణనలోకి) వెళ్లే సంధి దశను సూచిస్తుంది.


*అద్వైత తత్వార్ధం*:

అద్వైత వేదాంతం ప్రకారం, కాలం అనేది మాయా శక్తి యొక్క ఒక విభాగం. ఈ మంత్రంలోని అంతరార్థం ఇలా ఉంటుంది:

విజానీయాత్ (Deep Realization)

కేవలం కాల గణన (నెలలు, రోజులు తెలుసుకోవడం) ముఖ్యం కాదు. కాలం ఎవరి మీద ఆధారపడి ఉందో, ఆ కాలాతీత (Timeless) తత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. "ఏతదేవ విజానీయాత్" అంటే - మారుతున్న ఈ జగత్తులో మార్పు లేని ఆ ఒక్క పరమాత్మనే గుర్తించాలి అని అర్థం.


కాలపర్యయే ప్రమాణమ్ (The Standard in Change)

లోకంలో అన్నీ మారుతుంటాయి (క్షణికం). కానీ ఈ మార్పులన్నింటినీ కొలవడానికి, గమనించడానికి ఒక స్థిరమైన 'ప్రమాణం' ఉండాలి.

ఉదాహరణకు: కదులుతున్న రైలును చూస్తున్నప్పుడు, మనం ప్లాట్‌ఫారమ్ మీద స్థిరంగా ఉంటేనే ఆ వేగం తెలుస్తుంది.

అలాగే, పుట్టుక-చావు, సుఖ-దుఃఖం అనే కాల గతులను గమనిస్తున్న మనలోని 'సాక్షి చైతన్యం' (Witness Consciousness) మాత్రమే స్థిరమైన ప్రమాణం. ఆ సాక్షియే బ్రహ్మ.


విశేషణం మరియు సామాన్యం (Special vs. General)

ఋతువులు వేర్వేరు విశేషణాలను (ఎండ, చలి, వాన) కలిగి ఉంటాయి. ఇవన్నీ 'విశేషాలు'. కానీ వీటన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న 'కాలము' అనేది 'సామాన్యం' (Universal). అద్వైతం ఏం చెబుతుందంటే - విశేషాలైన నామ-రూపాలను పక్కన పెట్టి, సామాన్యమైన సత్య తత్వాన్ని (Being/Existence) చూడమని బోధిస్తుంది.


నిబోధత (Awaken to the Truth)

'బోధ' అంటే మేల్కొనడం. ఋతువుల మార్పును గమనిస్తూ, "నేను ఈ మార్పులకు లోనయ్యే దేహాన్ని కాదు, వీటన్నింటినీ ప్రకాశింపజేసే ఆత్మను" అని తెలుసుకోవడమే ఈ మంత్రం ఇచ్చే అసలైన ఉపదేశం.


To summarise...

కాలం నిరంతరం మారుతూనే ఉంటుంది (ఋతువులు మారుతున్నట్లు). కానీ ఈ మార్పులన్నీ ఎవరి ప్రకాశం వల్ల జరుగుతున్నాయో, ఆ స్థిరమైన ఆత్మతత్వాన్ని 'ప్రమాణంగా' స్వీకరించి, దానిని తెలుసుకో (విజానీయాత్). అప్పుడే నీవు కాలానికి బానిసవు కాకుండా, కాలాన్ని జయించిన వాడివి అవుతావు.

ఈ మంత్రంతో కాల విజ్ఞానం గురించిన ఒక ముఖ్య ఘట్టం పూర్తవుతుంది. 

ఈ అరుణప్రశ్న మంత్రాలు కేవలం సూర్యుడి గురించి మాత్రమే కాదు, మన లోపల వెలిగే 'ఆత్మ సూర్యుడి' గురించి కూడా గొప్ప వివరణను ఇస్తాయి.

28, ఏప్రిల్ 2026, మంగళవారం

హరికధల్లో హాస్యం:

 హరికధల్లో హాస్యం:




ఓ హరిదాసుగారు ఆలస్యంగా 


హరికధ మొదలు పెట్టారు. ఆలస్యంగా ఎందుకు రావలసివచ్చిందో సభా


సదులకు సంజాయిషీ ఇచ్చుకుంటూ


ఓపిట్టకధ చెప్పారు. 




మీ ఊరుకి రవాణా సదుపాయాలు లేక


గుర్రంబండ్లు ఉన్నా ఎక్కడానికి భయం


వేసి.నడిచి వచ్చే టప్పటికి ఇంతఆలస్యం


అయింది.గుర్రంబండెందుకు ఎక్కలేదను


కుంటున్నా రా! ఆకధచెబుతావినండి


నాయనా!.శ్రీ మద్రరమారమణ గోవింద.




మీఊరికి రావడానికి బండి బేరం చేసా


తీరా సంచీ పుచ్చుకొనిబండిలో కాలు


మోపేలోపు గుర్రం ఫెఢీల్మని తన్నిందండి.




దానికి బండివాడు నవ్వుతూ కంగారు 


పడకండి దాసుగారు మాగుర్రం మూడు


సార్లు తన్నితేకాని నడవదండిఅన్నాడు.




అయతే ఓపనిచెయ్యరా!అబ్బీ.నేను


సంచీపుచ్చుకొని.ఆచెట్టు కింద నిలబడతా ఆ రెండు తాపులు కూడా


అయ్యాక.ఎక్కుతా అన్నా.




దానికి వాడు.నవ్వుతూ భలే వోరే అలా


కుదరండి మాగుర్రానికో తిక్కుంది దానికో


లెక్కుందండండి. ఎవరైనా ఎక్కితే కాని


తన్నదండి అన్నాడు.




ఎందుకు.రిస్కుతీసుకోవడం అని నడిచి


వచ్చే టప్పటికి ఇంత సమయం పట్టింది. 


ఇక కధలోకి వెడదాం.




శ్రీ మద్రరమారమణ గోవిందో హరి:


                         .......


జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్.

రామాయణం లో అత్యంత ముఖ్యమయిన

 *రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?*

             ➖➖➖✍️

```

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.

రాజ్యసభలో ఉన్న పండితులు అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.

ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.

ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.

విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.

అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.

అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది.

40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.

నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.

ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.

అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


*ఆ శ్లోకం ఇది...```


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్


```ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు..                           ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.```


ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?```


ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది...


రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ, తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం...


ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం...``` 


 *రామం దశరథం విద్ధి* 

 *మాం విద్ధి జనకాత్మజామ్।* 

 *అయోధ్యామటవీం విద్ధి* 

 *గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷* 


*మొదటి అర్ధం:```

రామ= రాముడు: దశరథం=దశరథుడు:  

విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;

విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; 

యథా సుఖమ్=సుఖంగా```


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!



*రెండవ అర్ధం:```

రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగినవాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకునికూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథాసుఖమ్=సుఖంగా.```


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు,  సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లిరా!



*మూడవ అర్ధం:```

రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీతల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ=వెళ్ళు; తాత=పుత్ర; యథాసుఖమ్= వీలయినంత సుఖంగా```


ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది.

కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.✍️


ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్పవారో వారు!  


వారసత్వంగా మనకు  అందించిన….         

ఆ అమూల్య రత్నాలు ఎంత విలువైనవో గదా!✍️```                             

          🙏*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🙏

Mantra

  Mantra - 23 ARUNAM 3 anuvaakam


అమూనాదయతేత్యన్యాన్। 

అమూగ్ శ్చ పరిరక్షతః। 

ఏతా వాచః ప్రయుజ్యన్తే|

యత్రై తదుపదృశ్యతే|| 


ఈ మంత్రం ఒక రకమైన హెచ్చరికను లేదా నిర్దేశాన్ని సూచిస్తుంది. 


అమూనాదయతేత్యన్యాన్: "అమూన్" (వారిని/వీరిని) "ఆదయత" (శిక్షించండి లేదా భయపెట్టండి) "ఇతి అన్యాన్" (అని ఇతరులను). అంటే ఒక వర్గం వారిని నియంత్రించమని లేదా శిక్షించమని చెప్పే మాటలు.


అమూగ్ శ్చ పరిరక్షతః: "మరికొందరిని (వీరిని) రక్షించండి" అని చెప్పే మాటలు.


ఏతా వాచః ప్రయుజ్యన్తే: ఇలాంటి మాటలు (శిక్షించమని లేదా రక్షించమని చెప్పే ఆజ్ఞలు) ఎక్కడ ప్రయోగించబడతాయో…


యత్రై తదుపదృశ్యతే: అక్కడ ఆ దైవిక శక్తి లేదా ఆ పరమాత్మ యొక్క ప్రభావం కనిపిస్తుంది.


ఈ మంత్రం యొక్క లోతైన అర్థం ధర్మ రక్షణ మరియు ప్రకృతి నియమాలకు సంబంధించింది:


సూర్యుడు లేదా పరమాత్మ ఈ సృష్టికి అధిపతి. శాసన కర్త. ఆయన పాలనలో ధర్మాన్ని పాటించే వారికి 'రక్షణ' (పరిరక్షతః), ధర్మాన్ని తప్పే వారికి 'శిక్ష' (ఆదయత) లభిస్తాయి. లోకంలో ఈ రెండు శక్తులూ (రక్షణ మరియు శిక్ష) నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి.


సూర్యుడు ఉదయించగానే లోకంలో పనులు మొదలవుతాయి. రాజులు లేదా పాలకులు తమ రాజ్యాలను ఏలేటప్పుడు ఇచ్చే ఆజ్ఞల వెనుక కూడా ఆ పరమాత్మ ప్రేరణే ఉంటుందని భావం. పరమాత్మ ఆజ్ఞా శక్తి (Power of Command)


యజ్ఞ సందర్భం కూడా అయిన అరుణకేతుక చయనంలో ఈ మంత్రాన్ని పఠిస్తూ, లోకంలోని దుష్ట శక్తులు నశించాలని, శిష్ట శక్తులు రక్షించబడాలని ప్రార్థిస్తారు.


లోకంలో రక్షణ మరియు శిక్షణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి. ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ధర్మం రక్షించబడుతుందో, అక్కడ ఆ పరమాత్మ యొక్క వాక్కు (ఆజ్ఞ) అమలవుతున్నట్లుగా మనం గుర్తించాలి.

ఇవన్నీ కేవలం సూర్యుని గురించి మాత్రమే కాదు, ఒక సామాజిక మరియు ధార్మిక జీవన విధానాన్ని కూడా బోధిస్తాయి. 


అద్వైత తత్వార్థం

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం ద్వైత ప్రపంచం మరియు పరమార్థ సత్యం మధ్య ఉన్న భేదాన్ని వివరిస్తుంది:


భోక్త-భోగ్య సంబంధం (The Eater and the Eaten)

లోకంలో ఒకరు భక్షించేవారు (Enjoyer), మరొకరు భక్షింపబడేవారు (Enjoyed) ఉంటారు. రక్షించేవారు, రక్షింపబడేవారు ఉంటారు. ఈ ద్వంద్వాలు (Dualities) ఉన్నంత కాలం సంసారం ఉంటుంది. అద్వైతం ప్రకారం, భోక్త (Subject) మరియు భోగ్యం (Object) రెండూ ఒకే పరమాత్మ యొక్క విభిన్న రూపాలే. "నేను రక్షకుడిని" లేదా "నేను భోక్తను" అనే అహంకారం అజ్ఞానం వల్ల కలుగుతుంది.


వాక్కు మరియు నామ-రూపాలు (The World of Speech) - 'ఏతా వాచః ప్రయుజ్యన్తే' (ఈ మాటలు ప్రయోగించబడుతున్నాయి) అనే భాగం చాలా లోతైనది. ఉపనిషత్తుల ప్రకారం (వాచారంభణం వికారో నామధేయం), జగత్తులో కనిపించే మార్పులన్నీ కేవలం పేర్లు మరియు మాటలు మాత్రమే. సత్యం ఒక్కటే, కానీ మనం దానిని రక్షకుడు, భక్షకుడు, సుఖం, దుఃఖం అని రకరకాల పేర్లతో (వాక్కులతో) పిలుస్తున్నాం.


జగత్తు - ఒక దృశ్యం (The Observed Universe)

యత్రై తదుపదృశ్యతే అని అనడంలోనే ఇది ఒక దృశ్యం (Appearance) అని అర్థమవుతోంది. ద్రష్ట (చూసేవాడు) ఉన్నంతవరకే దృశ్యం ఉంటుంది. నిద్రలో లేదా సమాధి స్థితిలో ఈ 'భక్షక-రక్షక' భేదాలు ఉండవు. ఎక్కడైతే మనస్సు బహిర్ముఖమై ప్రపంచాన్ని చూస్తుందో, అక్కడ మాత్రమే ఈ విభజనలు కనిపిస్తాయి.


సర్వమాత్మకత్వం (All is Self) - అద్వైత దృష్టితో చూస్తే, భక్షించేవాడు ఆత్మే, భక్షింపబడేది ఆత్మే. రక్షించేవాడు ఆత్మే, రక్షింపబడేది ఆత్మే. ఈ రహస్యాన్ని తెలుసుకున్న జ్ఞాని, లోకంలోని సంఘర్షణలను చూసి చలించడు. అంతా ఆ పరమాత్మ విలాసమేనని గ్రహిస్తాడు. “నాయం హంతి న హన్యతే (భగవద్గీత 2.19) & న హన్యతే హన్యమానే శరీరే (కఠోపనిషత్ 1.2.18)” భావనలు ఇక్కడ కనిపిస్తున్నాయి.



ఈ మంత్రం సారాంశం - "లోకంలో కనిపించే భేదాలు, పోరాటాలు, రక్షణలు అన్నీ మాయాజనితమైన మాటలు మాత్రమే. ఈ దృశ్య ప్రపంచం ఆవలికి వెళ్లి చూస్తే, అక్కడ భక్షించేవాడు లేడు, రక్షించేవాడు లేడు—కేవలం అద్వితీయమైన చైతన్యం మాత్రమే ఉంది.”

పంచాంగం 28.04.2026 Tuesday,

 ఈ రోజు పంచాంగం 28.04.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి భౌమ వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం వ్యాఘాత యోగః బవ తదువరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: ద్వాదశి 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।

ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ।। 14 ।।



ప్రతిపదార్థ:


న — కాదు; మాం — నన్ను; కర్మాణి — కర్మలు; లింపంతి — అంటవు; న — కాదు; మే — నేను; కర్మ-ఫలే — కర్మ ఫలములను; స్పృహా — కోరుట; ఇతి — ఈ విధంగా; మాం — నన్ను; యః — ఎవరైతే; అభిజానాతి — తెలుసుకుందురో; కర్మభిః — కర్మ ఫలితములయందు; న — కాదు; సః — ఆ వ్యక్తి; బధ్యతే — బద్ధుడగుట.



 తాత్పర్యము : 


కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈవిధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.



వివరణ:


భగవంతుడు సంపూర్ణ-పవిత్రుడు, ఆయన ఏది చేసినా అది మంగళప్రదమైనది మరియు పవిత్రమైనది అవుతుంది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:


సమరథ కహుఁ నహిం దోషు గోసాఈ,


రబి పావక సురసరి కీ నాఈఁ


 


‘అపవిత్రమైన వ్యక్తులు లేదా వస్తువుల సంపర్కం వలన కూడా, పరిశుద్ధమైన వ్యక్తిత్వములు దోషములచే ఎప్పుడూ కళంకితులు కారు. ఉదాహరణకి సూర్యుడు, అగ్ని, గంగా నది వంటివి.’ సూర్యరశ్మి, మూత్రపు నీటి కుంటపై పడితే సూర్యుడు కలుషితం కాడు. సూర్యుడు తన పరిశుద్ధ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఆ అశుద్ధమును కూడా శుద్ధి చేస్తాడు. అదే విధంగా, అగ్నిలో అపవిత్రమైన పదార్థములు సమర్పించినా, అది తన స్వచ్ఛత నిలుపుకుంటుంది – అగ్ని స్వచ్ఛమైనది, మనం ఏది దానిలో వేసినా అది కూడా శుద్ధమైపోతుంది. ఇదే విధంగా, ఎన్నో మురికి కాలువలు పవిత్ర గంగా నదిలో కలుస్తుంటాయి, కాని గంగా నది మురికి కాలువ అయిపోదు – గంగా నది పవిత్రమైనది, అంతేకాక, ఆ మురికి కాలువలన్నిటినీ గంగా నదిగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా తను చేసే కర్మల వలన కళంకితుడు కాడు.


చేసే పనుల వలన వచ్చే ఫలములను తన భోగం కోసం చేస్తే ఆ కర్మలు వ్యక్తిని కర్మబంధములలో పెనవేస్తాయి. కానీ, భగవంతుని చర్యలు స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు; ఆయన ప్రతిఒక్క చర్య కూడా జీవులపై కరుణతో చేసినదే. కాబట్టి, ఆయనే ఈ జగత్తునంతా ప్రత్యక్షంగానో, పరోక్షం గానో అజమాయిషీ చేస్తూ మరియు ఈ వ్యవహారంలో ఎన్నో పనులు చేసినా, ఆయనకి కర్మ ప్రతిచర్యలు అంటవు. తను ఈ కర్మ ఫల బంధాలకు అతీతుడనని శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు.


భగవత్-ప్రాప్తి నొందిన ఋషులు కూడా భౌతిక శక్తికి అతీతులుగా అవుతారు. వారి యొక్క అన్ని కార్యక్రమాలు, భగవత్ ప్రేమచే ప్రేరేపితమౌతాయి కనుక అటువంటి పరిశుద్ధ మనసున్న సత్పురుషులు కర్మ ఫల బంధములలో చిక్కుకోరు. శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది:


యత్పాదపంకజ పరాగ నిషేవ తృప్తాః

యోగ ప్రభావ విధుతాఽఖిల కర్మ బంధాః

స్వైరం చరంతి మునయో ఽపి న నహ్యమానాః

తస్యేఛ్చయాత్త వపుషః కుత ఏవ బంధః (10.33.35)


‘భగవంతుని పాదారవింద ధూళి సేవలోనే సంపూర్ణ తృప్తి పొందే భక్తులను ప్రాపంచిక క్రియాకలాపములు ఎన్నటికీ కళంకితం చేయవు. యోగబలముచే కర్మ-ఫల బంధముల నుండి తమను తాము విడిపించుకున్న వివేకవంతులైన మునులను కూడా ప్రాపంచిక క్రియాకలాపములు కళంకితం చేయవు. మరింక, తన స్వ-సంకల్పము చేతనే అలౌకిక రూపమును ధరించే భగవంతునికి ఈ బంధములు ఉండే ప్రశ్నేఎక్కడిది?’

మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

28-04-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు నుండి కొంత వరకు బయటపడగలుగుతారు.

---------------------------------------


వృషభం


బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.

---------------------------------------


మిధునం


ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. 

---------------------------------------


కర్కాటకం


ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు పనులు నిదానంగా సాగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. 

---------------------------------------


సింహం


వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------


కన్య


వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


వృశ్చికం


ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. 

---------------------------------------


ధనస్సు


చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగులకు అదనపు పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది.

---------------------------------------


మకరం


కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

---------------------------------------


కుంభం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది.

---------------------------------------


మీనం

 

మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

Mantra

 Mantra - 23 ARUNAM 3 anuvaakam


అమూనాదయతేత్యన్యాన్। 

అమూగ్ శ్చ పరిరక్షతః। 

ఏతా వాచః ప్రయుజ్యన్తే|

యత్రై తదుపదృశ్యతే|| 


ఈ మంత్రం ఒక రకమైన హెచ్చరికను లేదా నిర్దేశాన్ని సూచిస్తుంది. 


అమూనాదయతేత్యన్యాన్: "అమూన్" (వారిని/వీరిని) "ఆదయత" (శిక్షించండి లేదా భయపెట్టండి) "ఇతి అన్యాన్" (అని ఇతరులను). అంటే ఒక వర్గం వారిని నియంత్రించమని లేదా శిక్షించమని చెప్పే మాటలు.


అమూగ్ శ్చ పరిరక్షతః: "మరికొందరిని (వీరిని) రక్షించండి" అని చెప్పే మాటలు.


ఏతా వాచః ప్రయుజ్యన్తే: ఇలాంటి మాటలు (శిక్షించమని లేదా రక్షించమని చెప్పే ఆజ్ఞలు) ఎక్కడ ప్రయోగించబడతాయో…


యత్రై తదుపదృశ్యతే: అక్కడ ఆ దైవిక శక్తి లేదా ఆ పరమాత్మ యొక్క ప్రభావం కనిపిస్తుంది.


ఈ మంత్రం యొక్క లోతైన అర్థం ధర్మ రక్షణ మరియు ప్రకృతి నియమాలకు సంబంధించింది:


సూర్యుడు లేదా పరమాత్మ ఈ సృష్టికి అధిపతి. శాసన కర్త. ఆయన పాలనలో ధర్మాన్ని పాటించే వారికి 'రక్షణ' (పరిరక్షతః), ధర్మాన్ని తప్పే వారికి 'శిక్ష' (ఆదయత) లభిస్తాయి. లోకంలో ఈ రెండు శక్తులూ (రక్షణ మరియు శిక్ష) నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి.


సూర్యుడు ఉదయించగానే లోకంలో పనులు మొదలవుతాయి. రాజులు లేదా పాలకులు తమ రాజ్యాలను ఏలేటప్పుడు ఇచ్చే ఆజ్ఞల వెనుక కూడా ఆ పరమాత్మ ప్రేరణే ఉంటుందని భావం. పరమాత్మ ఆజ్ఞా శక్తి (Power of Command)


యజ్ఞ సందర్భం కూడా అయిన అరుణకేతుక చయనంలో ఈ మంత్రాన్ని పఠిస్తూ, లోకంలోని దుష్ట శక్తులు నశించాలని, శిష్ట శక్తులు రక్షించబడాలని ప్రార్థిస్తారు.


లోకంలో రక్షణ మరియు శిక్షణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి. ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ధర్మం రక్షించబడుతుందో, అక్కడ ఆ పరమాత్మ యొక్క వాక్కు (ఆజ్ఞ) అమలవుతున్నట్లుగా మనం గుర్తించాలి.

ఇవన్నీ కేవలం సూర్యుని గురించి మాత్రమే కాదు, ఒక సామాజిక మరియు ధార్మిక జీవన విధానాన్ని కూడా బోధిస్తాయి. 


అద్వైత తత్వార్థం

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం ద్వైత ప్రపంచం మరియు పరమార్థ సత్యం మధ్య ఉన్న భేదాన్ని వివరిస్తుంది:


భోక్త-భోగ్య సంబంధం (The Eater and the Eaten)

లోకంలో ఒకరు భక్షించేవారు (Enjoyer), మరొకరు భక్షింపబడేవారు (Enjoyed) ఉంటారు. రక్షించేవారు, రక్షింపబడేవారు ఉంటారు. ఈ ద్వంద్వాలు (Dualities) ఉన్నంత కాలం సంసారం ఉంటుంది. అద్వైతం ప్రకారం, భోక్త (Subject) మరియు భోగ్యం (Object) రెండూ ఒకే పరమాత్మ యొక్క విభిన్న రూపాలే. "నేను రక్షకుడిని" లేదా "నేను భోక్తను" అనే అహంకారం అజ్ఞానం వల్ల కలుగుతుంది.


వాక్కు మరియు నామ-రూపాలు (The World of Speech) - 'ఏతా వాచః ప్రయుజ్యన్తే' (ఈ మాటలు ప్రయోగించబడుతున్నాయి) అనే భాగం చాలా లోతైనది. ఉపనిషత్తుల ప్రకారం (వాచారంభణం వికారో నామధేయం), జగత్తులో కనిపించే మార్పులన్నీ కేవలం పేర్లు మరియు మాటలు మాత్రమే. సత్యం ఒక్కటే, కానీ మనం దానిని రక్షకుడు, భక్షకుడు, సుఖం, దుఃఖం అని రకరకాల పేర్లతో (వాక్కులతో) పిలుస్తున్నాం.


జగత్తు - ఒక దృశ్యం (The Observed Universe)

యత్రై తదుపదృశ్యతే అని అనడంలోనే ఇది ఒక దృశ్యం (Appearance) అని అర్థమవుతోంది. ద్రష్ట (చూసేవాడు) ఉన్నంతవరకే దృశ్యం ఉంటుంది. నిద్రలో లేదా సమాధి స్థితిలో ఈ 'భక్షక-రక్షక' భేదాలు ఉండవు. ఎక్కడైతే మనస్సు బహిర్ముఖమై ప్రపంచాన్ని చూస్తుందో, అక్కడ మాత్రమే ఈ విభజనలు కనిపిస్తాయి.


సర్వమాత్మకత్వం (All is Self) - అద్వైత దృష్టితో చూస్తే, భక్షించేవాడు ఆత్మే, భక్షింపబడేది ఆత్మే. రక్షించేవాడు ఆత్మే, రక్షింపబడేది ఆత్మే. ఈ రహస్యాన్ని తెలుసుకున్న జ్ఞాని, లోకంలోని సంఘర్షణలను చూసి చలించడు. అంతా ఆ పరమాత్మ విలాసమేనని గ్రహిస్తాడు. “నాయం హంతి న హన్యతే (భగవద్గీత 2.19) & న హన్యతే హన్యమానే శరీరే (కఠోపనిషత్ 1.2.18)” భావనలు ఇక్కడ కనిపిస్తున్నాయి.



ఈ మంత్రం సారాంశం - "లోకంలో కనిపించే భేదాలు, పోరాటాలు, రక్షణలు అన్నీ మాయాజనితమైన మాటలు మాత్రమే. ఈ దృశ్య ప్రపంచం ఆవలికి వెళ్లి చూస్తే, అక్కడ భక్షించేవాడు లేడు, రక్షించేవాడు లేడు—కేవలం అద్వితీయమైన చైతన్యం మాత్రమే ఉంది.”

ద్విరుక్తులు

  దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తెలుగులో కొన్ని ‘ద్విరుక్తులు’ (onomatopoeic double words) జాబితాను రూపొందించారు.


తెలుగు ద్విరుక్తులు (Telugu Onomatopoeic Words)


• అనగనగా:(Once upon a time-కథలు ప్రారంభించేప్పుడు)


• ఆవురు ఆవురు: (ఆకలిని సూచించడానికి)


• బరబర: (ఈడ్చుకెళ్లేటప్పుడు వచ్చే శబ్దం)


• బెకబెక: (కప్ప అరుపు - 'ribbit ribbit')


• బిక్కుబిక్కు: (ఆందోళన లేదా భయం సూచన)


• భగభగ: (మంటలు ఎగసిపడటానికి సూచన)


• చకచక: (వేగానికి సూచన)


• దడదడ: (గుండె కొట్టుకునే శబ్దం/వణుకు)


• గడగడ: (చలికి వణకడం లేదా గటగటా తాగడం)


• గిజగిజ: (కొట్టుకోవడం/వణకడం)


• గణగణ: (గంట శబ్దం)


• గబగబ: (తొందరను సూచించడానికి)


• గరగర: (గరుకుదనాన్ని సూచించడానికి)


• ఘుమఘుమ: (సువాసనను సూచించడానికి)


• గిలగిల: (దుఃఖంతో/ ప్రాణం పోయేటప్పుడు కొట్టుకోవడం)


• గిరగిర: (తిరగడాన్ని సూచించడానికి)


• గుసగుస: (రహస్యంగా మాట్లాడుకోవడం)


• గుడగుడ: (నీటి బుడగల శబ్దం)


• జరజర: (పాము పాకడం/ జారడాన్ని సూచించే శబ్దం)


• కిలకిల: (నవ్వును సూచించే ధ్వని)


• కళకళ: (కళాత్మకత లేదా వెలుగును సూచిస్తుంది)


• కరకర: (నమిలేటప్పుడు వచ్చే శబ్దం - crunchy)


• కిటకిట: (జనం ఎక్కువగా ఉన్నప్పుడు - రద్దీ సూచన)


• మలమల: ( ఆకలితో అలమటించడం)


• మిలమిల: (మెరుపును సూచించడానికి)


• నిగనిగ: (మెరుపు/మెరుగును సూచించడానికి)


• పకపక: (పెద్దగా నవ్వడం)


• పిటపిట: (యవ్వనాన్ని/ నిండుదనానికి సూచన)


• రెపరెప: (రెపరెపలాడటం - గాలికి జెండా ఊగినట్లు)


• టకటక: (తలుపు తట్టే శబ్దం)


• తళతళ: (మెరుపును సూచించడానికి)


• సలసల: (నీళ్లు మరిగేటప్పుడు వచ్చే శబ్దం)


• వెలవెల: (తెల్లబోవడం లేదా వెలవెలబోవడం)


• విలవిల: (గిలగిలలాడటం/తల్లడిల్లడం)


• బిలబిల: (జనసందోహం)


• గునగున: (నడకను సూచించటం)


• బడబడ: (మాట్లాడటం/పెద్దచినుకులతో వానపడటం)


• డబడబ: (పెద్దవాన)


• బుడిబుడి: (నడకలు)


• బుసబుస: (క్రోధము/పాలపొంగు/తొందరపాటుమాటలకు సూచన)


• విసవిస: (తొందరనడక)


• ౙలౙల: (రాలిపడటం)


• చిటచిట: (వేసవిలో వేడికి శరీరం చిన్నగా మంటపుట్టటం)


• పటపట: (కోపంతో పండ్లుకొరకటం)


• టపటప: (రాలిపడటం/చినుకుల శబ్దం)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - ఉత్తరాఫల్గుని -‌‌ భౌమ వాసరే* (28.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

27, ఏప్రిల్ 2026, సోమవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 21 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *202వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


ఉద్యోగ పర్వము,  మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము. 

ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. 

సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి.  సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు..


         *ప్రధమాశ్వాసం*

```

ఉత్తరాభిమన్యుల వివాహం గడిచి నాలుగు రోజుల తరువాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి “పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందరికీ తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింప చేయాలి. పాండవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు,శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం. వారి బలపరాక్రమాలను ప్రదర్శించ వలసిన సమయం ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుక హస్తినా పురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము” అన్నాడు. 


అప్పుడు బలరాముడు లేచి.. 

“తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితం. ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. జూదం ఆడటం సరిగా ఎరుగని ధర్మనందనుడు జూదానికి సిద్దంగావున్న కర్ణ దుర్యోధనాదులను వదిలి జూదంలో నిపుణుడైన శకునిని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోతూ, రోషావేశంతో జూదంను కొనసాగించి ఓడిపోయాడు. దానిలో శకుని తప్పేమీ లేదు. తన ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరంచేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళే దూత ధృతరాష్ట్రుడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి” అన్నాడు.```


         *సాత్యకి ఆవేశం*```


బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి "బలరామా! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. మనుష్యునికి ఎలాంటి హృదయం వుంటే వారు అటువంటి మాటలే మాట్లాడుతారు. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి, కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించారు. ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? నియమం ప్రకారం వనవాసం నుండి విముక్తుడు కాగానే వారి రాజ్యంను పొందడానికి ధర్మరాజు అర్హుడైనాడు. దీనుడై అతడు రాజ్యంను యాచించడం తగదు. పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్న పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునులను ఎదిరించి యుద్ధభూమిలో నిలువగల వాడెవడు. విరాటుని పరాక్రం తక్కువా? పాంచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి. అంతేగాని యాచన వలదు" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 23 ఏప్రిల్ 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *204 వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*సహాయార్ధియై దుర్యోధనుడు ద్వారకకేగుట*```


హస్థినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దుర్యోధనుడు మనసు మార్చుకుని తనే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. 


అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంపై కూర్చుచున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునిని వైపు చూసి తరువాత దుర్యోధనుని చూసాడు. ఇద్దరినీ తగురీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. 


సుయోధనుడు ముందుగా "కృష్ణా! పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే. పైగా నేను ముందు వచ్చాను ముందుగా వచ్చిన వారిని ఆదరించడం లోక నీతి కనుక నాకు నీ సహాయాన్ని అందించ కోరుతున్నాను.”అన్నాడు.


అందుకు శ్రీకృష్ణుడు "సుయోధనా నీవు ముందు ఏతెంచిన మాట వాస్తవం. కాని నేను ముందుగా అర్జునుని చూసాను కనుక మీ ఇద్దరికి సహాయాన్నందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన నాతో సమాన రూపం కల "నారాయణ" నామం గల పది లక్షల మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక వైపు ఉంటాను అయితే నేను మాత్రం యుద్ధం చేయను. ఆయుధం పట్టను. కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు కనుక అతడు ముందు కోరుకోవడం ధర్మం" అన్నాడు. 


వెంటనే అర్జునుడు "నాకు శ్రీకృష్ణుడు కావాలి" అన్నాడు. 


సుయోధనుడు మనసులో సంతోషించి పది లక్షల నారాయణ సైన్యంను తీసుకుని బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. 


బలరాముడు "సుయోధనా! అభిమన్యుని వివాహ సమయంలో నేను నిన్ను సమర్ధించాను.అందుకు కొందరు వ్యతిరేకించారు ఆ విషయం నీకు తెలిసే ఉంటుది. ఇరుపక్షాల్తోను మనకు సమాన బంధుత్వం వున్నదని గుర్తుచేశాను. నా మాటను కృష్ణుడు స్వీకరించ లేదు. నాకు కృష్ణుడంటే అభిమానం. అతడిని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. కనుక నేను ఎవరి పక్షం వహించక ఊరక ఉంటాను" అన్నాడు. 


సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్ధించాడు. కృతవర్మ ఒక అక్షౌహిణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకుని సుయోధనుడు హస్థినకు తిరిగి వెళ్ళాడు.```


*అర్జునుని అంతర్యం*```


శ్రీకృష్ణుడు "అర్జునా! అదేమిటి నన్ను కోరుకున్నావు. ఆయుధము పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకు మేలు ఏమిటి" అన్న్నాడు. 


అర్జునుడు "కృష్ణా! నీవు యుద్ధంలో వారందరిని సంహరించ గలవాడవు. వారిని చంపితే ఆ కీర్తి నీకు చెందుతుంది. నేనుకూడా వారిని సంహరించి ఆ కీర్తిని పొందాలనుకుంటున్నాను. నిన్ను ఎదిరించి నేను గెలువగలనా? పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది కనుక నీ తోడ్పాటు చాలు. దానితో నేను యుద్ధం చేసి రాజ్యం హస్థగతం చేసుకుని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నీవు గెలిచిన రాజ్యానికి ధర్మజుని రాజుని చేయడం ధర్మమా? నీవు మా వైపు ఉంటే చాలు. నా చిరకాల వాంఛ అయిన నీ సారథ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదేచాలు" అన్నాడు. 


శ్రీ కృష్ణుడు "అర్జునా! నీ కోరిక తప్పక తీరుతుంది. నీకు సారథ్యం వహించి విజయలక్ష్మిని నీకు స్వంతం చేస్తాను. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాము పద " అని అర్జునునితో ఉపప్లావ్యం చేరాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శివుడు ఉండమని అడిగినా

 శివుడు ఉండమని అడిగినా ఆదిశంకరులు ఎందుకు ఉండలేదు రెండు రోజులు:



శంకరాచార్యులు " శివానందలహరి " చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు:


అశనం గరళం ఫణీ కలాపో

వసనం చర్మచ వాహనం మహోక్షః

మమ దాస్యసి కిం కిమస్తి శంభో

తవ పాదాంబుజ భక్తిమేవ దేహి "


ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి " రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో " అన్నారు. 10 ని.లు అవగానే తను తిరిగి వెడతానన్నారు శంకరులు. " అదేమిటోయ్ రాకరాక వచ్చావు, రెండు రోజులు ఉండి వెడుదువుగాని " అన్నారు శివుడు.

అప్పుడు శంకరులు పై శ్లోకాన్ని చెబుతారు.

మనం వేరే ఊరిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళామనుకోండి. ఇంట్లోకి ఆహ్వానించి సామాను ప్రక్కరూములో పెట్టుకో అంటాడు. లుంగీ ఇచ్చి కట్టుకోమని కాఫీ ఇస్తాడు. స్నానంచేసి రమ్మని టిఫిన్ పెడతాడు. తన స్కూటర్ మీదో కారుమీదో ఊరంతా చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న జ్ఞాపిక ఇచ్చి సాగనంపుతాడు.

ఇదే విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా శివుడితో ఏమన్నారో చూద్దాం.

నువ్వు ఉండేదే శ్మశానంలో కనుక నన్నుకూడా ఓ ప్రక్కన సర్దుకోమంటావు. నువ్వు త్రాగేదే గరళం కనుక నాకు కూడా కొంచెం అదే త్రాగమని ఇస్తావు. నువ్వుకట్టుకునేదే జంతుచర్మం కనుక ఓ చిన్నముక్క నాకు కూడా ఇస్తావు కట్టుకోమని. నువ్వు తిరిగేదే ఎద్దుమీద కనుక దానిమీద ఎక్కించుకునే అటూ ఇటూ త్రిప్పుతావు నన్ను. నువ్వు ధరించేవే నాగుపాములు కనుక నేను వేళ్ళేటప్పుడు ఓ చిన్నపాముని జ్ఞాపికగా ఇస్తావు. " ఇవన్నీ భరించడం నావల్ల అవదు కానీ నీపాదాలను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి అనుగ్రహించు స్వామీ " అని వేడుకున్నారు అనుకోవాలి.

ఎంత అద్భుతంగా ఉంది శంకరుల వేడికోలు..


ఈ పవిత్రమైన "  సోమవారం ". "అవ్యాజకరుణామూర్తి" పరమేశ్వరుడి అశీస్సులు అందరికీ లభించాలని కోరుకుందాం.


శుభ సోమవారం 🔱Happy Monday

ఓ మధురమైన జ్ఞాపకం

 (ఓ మధురమైన జ్ఞాపకం)


శుభోదయం మిత్రులందరికి :


ఆచార్య సి.వి.బి.సుబ్రమణ్యంగారు జ్యోతిష నిపుణులు, శాస్త్ర బోధకులు

ముఖ్యంగా హాస్యప్రియులు.చాలా

జ్యోతిష సభలలో ''హాస్యం-బుధకార

కత్వము అనే విషయంపై నాకు మాట్లాడే

అవకాశాన్ని చ్చి.వివిధ సభలలో నేను

చెప్పిన హాస్యాన్ని''చురకసంహిత ''గా

జ్యోతిర్వాస్తు విజ్ఞానసంస్ద ద్వారా ముద్రించి నన్ను ప్రోత్సహించిన సహృదయులు.వారి వద్దనే ఎం.ఏ

జ్యోతిషం తెలుగువిశ్వవిద్యాలయంలో

చేసాను.


సప్తమభావం(భార్యచురుకైనదయితే)


ఒకాయన రోజూతెగపూజచేస్తున్నాట్ట.

భార్య అడిగింది ఎప్పుడూ లేనిది

ఈ మధ్య ఎక్కువగా పూజ చేస్తున్నా

రేమిటండి అని! (ఆశ్చర్యంగా )


నా శత్రువు నశించాలని చేస్తున్నానోయ్

అన్నాట్ట (కోపంగా ).


మీరెంత పూజలుచేసినా నేనిప్పట్లోపోను

అందిట భార్య (నవ్వుతూ ).


                         ........

జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్. (డా::సి.వి.బి.సుబ్రమణ్యంగారు సత్కరి

స్తున్న జ్ఞాపకం ఫోటోలోసాగికమలాకర

శర్మగారు కూడా ఉన్నారు. )

26, ఏప్రిల్ 2026, ఆదివారం

శ్రీ మహావిష్ణు పురాణం* `` *66వ భాగం*``

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 23 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *66వ భాగం*``


*పరశురామ అవతారం*


తండ్రి ఆదేశంతో చంపిన.. 

తల్లి సోదరులను..

తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకునుట: ```

కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు.  


కార్తవీర్యార్జునుడు బలపరాక్రములు ఎదిరించే వారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెఱసాలలో పెట్టాడు. రావణుడితాత పులస్త్యమహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలి పెట్టాడు.


చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకంలో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజా రక్షణ వదలి వేశారు. సుఖభోగాలలో మునిగిపోయారు. యజ్ఞయాగాదులు మానివేశారు. గర్వం అహంకారంతో తమకు మంచి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించ సాగారు.


క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్ధుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదై పోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమయిన లోకసంక్షోభం గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానిండమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు.


మహావిష్ణువు తాను భూలోకంలో అవతారం ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను మునులను పంపివేశాడు. ఋచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకుని ఋచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలచాడు. బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భంలో ప్రవేశించాడు.


జమదగ్ని మహర్షికి రేణుకకు అప్పటికే నలుగురు పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి ఐదవ పుత్రుడిగా రేణుకాదేవి గర్భం నుంచి నవమాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడం వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణం చేశారు.


తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమంలో ధనుర్విద్యాది యుద్ద విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యం లోకి వెళ్లి యుద్యవిద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు.


జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక అర్చన పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపంలో గల కౌశికి నదికి వెళ్లి స్నానం చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండను చేసి నదీజలాలలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేకార్చనలు చేసేవాడు.


ఒకరోజు నదీతీరంలో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయంలో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడ సాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగార భరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావం కలిగి మనస్సు నియంత్రణ తప్పడంతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేక పోయింది. సమయం చాలా వ్యర్థం అయ్యింది.


జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తల వంచుకుని నిలబడింది. 


జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో, నదీజలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. “మహర్షి పత్ని మనస్సు శృంగార భావంతో స్థిరత్వం కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమైంది. మరణమే దానికి దండన” అని ఆగ్రహించి పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి "మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది. తక్షణం ఈమె శిరస్సు ఖండించు" అని ఆదేశించాడు.


రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తల వంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహంతో సుషేణ, వసు, విశ్వావసు అనే ముగ్గురు కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు. 


వారు కూడా అన్న వలె తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు.


జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడైన పరశురాముని "పరశురామా! వెంటనే రా" అని గట్టిగా పిలిచాడు. "తండ్రీ! ఏమిటి మీ ఆజ్ఞ" అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమైనాడు.  


జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి "పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్లనను తక్షణమే సంహరించు!" అని ఆదేశించాడు.


తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు. 


జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు. 


పరశురాముడు తండ్రికి నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞ పాటించి తల్లిని సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశక్తితో వారికి పునఃప్రాణదానం చేసి బ్రతికించండి" అని వరం కోరాడు. 


భార్య, సోదరుల శిరస్సు మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. 


పునఃజీవితయై పాతివ్రత్య దోషం తొలగి పునీతయైన రేణుకను అర్థాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు.


పరశురాముడు తల్లికి నమస్కరించి "అమ్మా! తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడం వలన మాతృహత్యా మహాపాపం పొందాను. ఆ పావ పరిహార్థం నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరం అయినప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్దికై ఆశీర్వదించు" అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ

  శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు


నమో ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః


1080వ వారము


*అరుణ పారాయణము, సూర్య నమస్కారములు*


శ్రీ వరుణ సహిత సంజ్ఞా ఉషా ఛాయా పద్మినీ సువర్చలాంబా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కరుణా కటాక్షములతో, శ్రీ కాంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్యానుగ్రహముతో, శ్రీ పరాభవ నామ సంవత్సర, వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ దశమి భానువారము, అనగా *26-ఏప్రిల్-2026 తేదీన, ఉదయం 07:30 గంటల* నుండి అరుణ పారాయణము తో కూడిన సూర్య నమస్కారములు ఋత్విగ్వరేణ్యుల సత్సాంగత్యములో యథా శక్తి గా జరుపుటకు నిశ్చియించడమైనది. 

విశేషములు:

• గురు వందనం

• పరిషదనుజ్ఞ

• సభా నమస్కారము

• శ్రీమహాగణపతి పూజ

• పుణ్యహవచనం

• కలశ స్థాపన

• షోడశోపచార పూజ

• తృచ పారాయణ

• అరుణ ప్రశ్న తో కూడిన సూర్య నమస్కారములు

• నవగ్రహ సూక్త పారాయణ

• నక్షత్ర సూక్త పారాయణము

• పునః పూజ 

• అష్టోత్తర శత నామార్చన

• ఆదిత్య హృదయ పారాయణ

• వేద స్వస్తి

• మంగళ హారతి

• ప్రసాద స్వీకారం


ఈ కార్యక్రమములో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వారి అనుగ్రహముతో స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.


స్థలము

 Flat A-102, Isha Yara apartment, Vadakkupattu, Medavakkam, Chennai


జయతాచ్ఛంకరోగురుః

హర హర శంకర జయ జయ శంకర

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు

పంచాంగశుద్ధి

 *నేటి పంచాంగశుద్ధి* 

  ------------------------------------

     26---04--2026 ఆదివారం     -------------------------------------

🌞శ్రీ పరాభవ సంవత్సరం 

_--------------------------------------

🌸ఉత్తరాయణం 🌸

------------------------------

🌞 వసంత ఋతువు 🌻

------------------------------

 🌞 వైశాఖ  మాసము 🌞

--------------------------------------


🌻శుక్ల  పక్షం 🌻

----------------------------------------                    .                           🌸దశమి   ఈరోజు  రాత్రి  8----44  ని  ఉంది  తదుపరి  ఏకాదశి🌸

---------------------------------------        

 🌞మఖ   నక్షత్రము  ఈరోజు   రాత్రి   10----57 ని వరకు  ఉంది  తదుపరి  పుబ్బ నక్షత్రము  🌞

------------------------------------

🌚రాహుకాలం  ఈరోజు  సాయంత్రం  4-----30. ని   నుండి  6.  గం   వరకు ఉంది

---------------------------------------

🌑 యమ గండం ఈరోజు మధ్యాహ్నం  12. గం  నుండి   1----30. ని వరకు   ఉంది 🌑

------------------------------------

వర్జ్యం ఈరోజు  ఉదయం  11----15  ని  నుండి  12---49 ని  వరకు  ఉంది. --------------------------------------- 

నేటి వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - దశమి - మఘ -‌‌ భాను వాసరే* (26.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఋతుర్ ఋతునా నుద్యమానః।

 Mantra - 21 ARUNAM 3 anuvaakam


ఋతుర్ ఋతునా నుద్యమానః। 

విననాదాభిధావః |

షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః|

శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ|| 


ఇది కాల గమనాన్ని, ముఖ్యంగా రోజులు మరియు నెలల విభజనను ఒక అద్భుతమైన రూపకంతో (Metaphor) వర్ణిస్తుంది.


*ఋతుర్ ఋతునా నుద్యమానః*: 

ఒక ఋతువు మరొక ఋతువు చేత ముందుకు నెట్టబడుతోంది. అంటే కాల చక్రంలో వసంతం తర్వాత గ్రీష్మం, గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు.. ఇలా ఒకదాని వెనుక ఒకటి క్రమ పద్ధతిలో వస్తూ ఉంటాయి. 


*విననాదాభిధావః*: 

ఆ కాలం లేదా సూర్యుడు గొప్ప శబ్దము చేస్తూ (ప్రకృతిలో కలిగే మార్పుల ధ్వని) వేగంగా పరిగెడుతున్నాడు. కాలం ఆగకుండా ప్రవహిస్తోందని దీని భావం.


*షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః*: 

ఇక్కడ కాల గణన స్పష్టంగా కనిపిస్తుంది.

త్రిగ్ం శకాః: అంటే 30 కాల ప్రమాణాలు. ఇవి ఒక నెలలోని 30 రోజులు లేదా 30 ఘడియలు గల ఒక పగటి కాలం లేదా రాత్రి కాలం.

షష్టిశ్చ: అంటే 60 కాల ప్రమాణాలు. ఇవి ఒక రోజులో 60 ఘడియలు లేదా ఋతువు లో 60 రోజులు.  వీటిని "వల్గాః" (గుర్రపు కళ్లెములు) అని పిలిచారు. అంటే ఒక గుర్రం కళ్లెముల ద్వారా ఎలా నియంత్రించబడుతుందో, కాల చక్రం ఈ రోజులు, నెలల ద్వారా అలా నడపబడుతోంది.


Additional info:

వైదిక కాల విభజన క్రమం పరిశీలిద్దాం!

1 ఘడియ = 24 నిమిషములు

2 ఘడియలు = 48 నిమిషములు = 1 ముహూర్తం

2.5 ఘడియలు = 1 గంట

5 ఘడియలు = 2 గంటలు = 1 హోర 

30 ఘడియలు = 12 గంటలు = 1 పగలు / 1 రాత్రి

60 ఘడియలు = 24 గంటలు = 1 రోజు

60*60 ఘడియలు = 60 రోజులు = 1 ఋతువు 


ఒక రోజులో 60 ఘడియలు (షష్టి)

ఒక నెలలో 30 రోజులు (త్రింశక)


(వేదం జ్యోతిశ్శాస్త్రానికి బీజం అని పై లెక్కల ప్రకారం చెప్పవచ్చు)


షష్టిశ్చ (60): "షష్టిశ్చ" అంటే అరవై. దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:

కాల విభజన - ఒక కాల ప్రమాణంలో ఉండే 60 భాగాలు (ఉదాహరణకు, ఒక రోజులో 60 ఘడియలు

లేదా ఒక ఋతువులో 60 రోజులు)


శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ: 

"శుక్ల" (తెల్లని - వెలుగు) మరియు "కృష్ణ" (నల్లని - చీకటి). ఇక్కడ 60 పగుళ్లు 60 రాత్రుళ్ళు కలిపి 60 రోజులు ఒక ఋతు కాలం.


అరుణ కేతుక చయనంలో కాలాన్ని ఒక గుర్రంగా లేదా రథంగా ఊహిస్తారు. ఈ మంత్రం ఆ కాల చక్రంలోని విడి భాగాలను వివరిస్తోంది.

 

*కాల ప్రవాహం*: ఋతువులు ఒకదానినొకటి అనుసరిస్తూ రావడం అనేది సృష్టిలోని క్రమశిక్షణకు నిదర్శనం. భూమి తన చుట్టూ తాను గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, సూర్యుని చుట్టూ గంటకు సుమారు 1,07,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాలం తరుముకు రావటం అంటే ఇదే


*సంవత్సర విభజన*: ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక్కో నెలలో 30 రోజులు, ఒక్కో ఋతువు లో 60 రోజులు ఉంటాయని, ఒక్కో రోజులో 60 ఘడియలు ఉంటాయని, ఒక్కో నెలలో రెండు పక్షాలు (శుక్ల, కృష్ణ) ఉంటాయని వేద కాలం నాటి ఖగోళ విజ్ఞానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.


సూర్యుడే ఈ కాలాన్ని నియంత్రించే శక్తి. ఆయనే ఈ రోజులను, రాత్రులను తన కళ్లెములతో (వల్గాః) నడిపిస్తున్నాడు.


సూర్యుడు (అరుణుడు) కాల స్వరూపుడిగా మారి, ఈ సృష్టిని ఎలా పరిపాలిస్తున్నాడో, మనం ఆ కాలాన్ని ఎలా గౌరవించాలో ఈ మంత్రాలు బోధిస్తున్నాయి.


అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం 'మాయ' మరియు 'బ్రహ్మము' మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది:


*కాలము - ఒక మిథ్య* (Time as an Appearance)

కాలం నిరంతరం మారుతూ ఉంటుంది (ఋతువుల మార్పు). అద్వైతంలో మారుతున్న ప్రతిదీ 'మిథ్య' (Relative Truth). ఈ మంత్రం వర్ణించిన కాలప్రవాహం అంతా చైతన్యం మీద కదిలే ఒక చిత్రపటం వంటిది. కాలం కదులుతోంది అంటే, ఆ కదలికను గమనించే 'సాక్షి' (Observer) ఒకడు ఉండాలి. ఆ సాక్షియే కాలాతీతుడైన పరమాత్మ.


*విభజనలో అవిభజితత్వం* (Unity in Division)

మంత్రంలో అరవై, ముప్పై, శుక్ల, కృష్ణ అని కాలాన్ని ముక్కలుగా విభజించారు. కాల ప్రమాణాలు 1, 2, 2.5, 5, 30, 60… మొదలైనవి కానీ ఈ విభజనలన్నీ ఒకే సంవత్సరంలో (కాలచక్రంలో) అంతర్భాగాలు. అలాగే, జగత్తులో మనకు కనిపించే నామ-రూప భేదాలన్నీ ఆ ఒక్క బ్రహ్మము లోనివే. సముద్రంలో తరంగాలు వేరు వేరుగా ఉన్నా, అన్నీ నీరే అయినట్లుగా, కాలగతులు వేరైనా అవన్నీ ఒక్క సత్యం మీద ఆధారపడి ఉన్నాయి.


*నుద్యమానః* - నిరంతర పరిణామం

ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ఒక ఋతువు పోయి మరొకటి రావడం అనేది జగత్తు యొక్క అనిత్యత్వాన్ని (Impermanence) సూచిస్తుంది. అద్వైత సాధకుడు ఈ మార్పులను చూసి, వీటన్నింటికీ మూలమైన, మార్పు లేని (అవికారి) తత్వం వైపు దృష్టి సారించాలి.


*విననాదః* (The Cosmic Sound)

శబ్దం లేదా నాదం అనేది ఆకాశానికి గుణం. ‘శబ్ద గుణక మాకాశం’. వేదాంత పరంగా, ఈ సృష్టి అంతా ఓంకార నాదం నుండి వ్యక్తమైంది. కాలం వేగంగా పరిగెడుతూ చేసే ఈ 'విననాదం', సృష్టిలోని చైతన్య శక్తిని (Prana Shakti) సూచిస్తుంది.


Conclusion:

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ మంత్రం కాలం యొక్క భీకరమైన వేగాన్ని, క్రమశిక్షణను వర్ణిస్తుంది.

అద్వైత కోణంలో:

మారుతున్న నిమిషాలు, ఘడియలు, హోరలు, అహోరాత్రములు, మాసములు, ఋతువులు, సంవత్సరాలు అన్నీ కాల స్వరూపాలు. కానీ వీటన్నింటికీ ఆధారం, కాలానికి కూడా కాలమైన (కాలాకాలాయ), మార్పు లేని ఆ పరమాత్మ ఒక్కడే.

25, ఏప్రిల్ 2026, శనివారం

పంచాంగం

 


మూత్ర కృచ్చ వ్యాధి

 మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .


మూత్రం అతికష్టంగా బయటకి రావడమే మూత్రకృచ్చ వ్యాధి అంటారు. మూత్రం సాఫీగా ధారాళంగా బయటకి రాకుండా అగిఆగి కొద్దికొద్దిగా అది కూడా చాలా కష్టంగా వస్తుంది .


కారణాలు -


ముత్ర ద్వారంలో కొన్ని రకాల వాయువులు బిగబట్టడం లేదా ఏవైనా వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటం వలన మూత్రం కష్టంగా వెలువడుతుంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు . మనశరీరానికి విరుద్ధమైన ఆహారం సేవించడం వలన శరీరంలో ఎల్లప్పుడూ సమానంగా ఉండవలసిన వాత,పిత్త,కఫ దోషాలు చెడిపోయి అసమానమై ఈ మూడు దోషాలు విడివిడిగా కాని , ఏ రెండు కలిసి అయినా కాని లేక మూడు ఒకేసారి ప్రకోపించి మూత్రాశయంలో ను , మూత్రపిండాలలోను చేరి మూత్రప్రసరణకి ఆటంకం కలిగించడం వలన "మూత్రకృచ్చం " అనే వ్యాధి సంభవిస్తుంది.


నివారణ -


చిన్న ఏలకులు , కొండపిండి చెట్టు సమూలం , కర్పూర శిలాజిత్తు , పిప్పిళ్లు వీటిని సమభాగాలుగా దంచి చూర్ణం కొట్టి పూటకు 6 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా తాగిస్తూ ఉంటే మూత్రం బిగించడం వలన మృత్యుముఖానికి చేరిన రోగులకు కూడా మూత్రం ధారళంగా వెలువడి జీవించగలరు .


నా అనుభవ యోగం -


మూత్రం బిగించి క్షణక్షణంకి కడుపు ఉబ్బుతున్న ఒకరికి తమలపాకు కి ఆముదం పూసి క్యాండిల్ కి దగ్గరగా తమలపాకు పెట్టి వేడి చూపించి పొత్తి కడుపు భాగంపై వేశాను . 10 నిమిషాలలో మూత్రం ధారళంగా వెలువడినది.


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్

 భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్ ఎంటాన్గిల్మెంట్ (Quantum Entanglement) భావనలు మనకు కనిపిస్తాయి.


ఎలాగో చూద్దాం!


మొదటగా క్వాంటమ్ ఎంటాన్గిల్మెంట్ అంటే సరళంగా ..

క్వాంటం ఎంటాంగిల్మెంట్ (Quantum Entanglement) అనేది ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత విస్మయకరమైన అంశం. రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా (విశ్వం అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉన్నా), ఒక కణం యొక్క స్థితిని మార్చితే, రెండో కణం యొక్క స్థితి తక్షణమే మారుతుంది. ఈ మార్పు కాంతి కన్నా వేగంగా ఉంటుంది. అనగా కాంతి యూనివర్స్ లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడానికి కొన్ని కాంతి సంవత్సరాలు పడితే, క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం అంటే దూరం లో ఉన్న కణాల స్థితి మారటానికి ఎట్టి సమయమూ పట్టదు.



భగవద్గీతలోని శ్లోకాలు భౌతిక శాస్త్ర పరంగా రాకపోయినా, అందులో వివరించిన క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగం మరియు విభూతి యోగం క్వాంటం ఎంటాంగిల్మెంట్ (Quantum Entanglement) ఇచ్చే ఏకత్వ సందేశాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.


గీతలోని కొన్ని ముఖ్యమైన భావనలను ఎంటాంగిల్మెంట్‌తో పోల్చి చూద్దాం:


సర్వవ్యాపకత్వం (Interconnectedness)

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత (గీత 13.3) - అన్ని శరీరాల్లో (క్షేత్రాలలో) ఉన్న తెలుసుకొనే శక్తి (క్షేత్రజ్ఞుడు) నేనే అని తెలుసుకో అని భావన.

ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ - ఈ చరాచర జగత్తు అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు.



క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం, రెండు కణాలు ఎక్కడ ఉన్నా అవి ఒకే వ్యవస్థలో భాగమై ఉంటాయి. అలాగే, గీత ప్రకారం విశ్వంలోని ప్రతి అణువులోనూ ఒకే పరమాత్మ చైతన్యం ఉంది. అంటే, బాహ్యంగా మనం వేర్వేరుగా కనిపించినా, లోపల ఉన్న 'కనెక్టివిటీ' ఒక్కటే.


2. విభజన లేని ఏకత్వం (Unity in Diversity)

అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికమ్ (గీత - 18.20) - విడిపోయి ఉన్నట్లు కనిపించే ప్రాణులన్నింటిలోనూ విభజించలేని ఒకే తత్వాన్ని చూడటమే నిజమైన జ్ఞానం.


ఎంటాంగిల్డ్ కణాలు కూడా మనకు స్పేస్‌లో విడివిడిగా (Separated) కనిపిస్తాయి. కానీ ఒక దాని స్థితి మారగానే రెండోది వెంటనే మారుతుంది—దీని అర్థం అవి 'అవిభక్తం' (Non-separated). భౌతిక దూరం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని గీత మరియు క్వాంటం ఫిజిక్స్ రెండూ చెబుతున్నాయి.


3. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ (గీత - 7.7)

దారంలో గుచ్చిన పూసల వలె ఈ విశ్వమంతా నాలోనే పొదగబడి ఉంది.

ఒక దారాన్ని పట్టుకుని లాగితే అన్ని పూసలు కదిలినట్లే, క్వాంటం లెవల్‌లో విశ్వం ఒక 'క్వాంటమ్ ఫీల్డ్' (Quantum Field) తో అనుసంధానమై ఉంది. ఒక చోట జరిగే మార్పు విశ్వంలోని మరో మూల ప్రభావం చూపగలదు అనే నాన్-లోకాలిటీ (Non-locality) సిద్ధాంతానికి ఇది సరైన పోలిక.


4. కారణ-కార్య సంబంధం - ఎంటాంగిల్మెంట్‌లో ఒక కణం యొక్క 'స్పిన్' (Spin) మారితే రెండో దాని 'స్పిన్' తక్షణమే మారుతుంది. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం మరియు ప్రకృతి గుణాల ప్రభావం కూడా ఇలాగే వివరించబడ్డాయి. మనం చేసే ప్రతి ఆలోచన లేదా చర్య ఈ విశ్వవ్యాప్తమైన వలలో (Cosmic Web) ఒక ప్రకంపనను సృష్టిస్తుంది.


అద్వైత మరియు సర్వం ఖల్విదం బ్రహ్మ అనే తాత్విక భావనలు క్వాంటం ఎంటాంగిల్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటాయి.


క్వాంటం ఫీల్డ్ థియరీ ప్రకారం, విశ్వమంతా ఒక శక్తి క్షేత్రం (Field) ఆవరించి ఉంటుంది. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మ లేదా చైతన్యం కూడా ఒక నాన్-లోకల్ (Non-local) శక్తి. 


అంటే అది ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవడం అనేది ఉండదు. ఎంటాంగిల్మెంట్ కూడా ఈ నాన్-లోకాలిటీ సూత్రం మీదే పనిచేస్తుంది.


5. ఇంద్రజాలం (Indra's Net)

అధర్వణ వేదంలోని (8వ కాండ, 8వ సూక్తం, 8వ మంత్రం) ఇంద్రజలం అనే అద్భుతమైన భావన ఉంది. ఒక అనంతమైన వలలో ప్రతి సంధి వద్ద ఒక మణి ఉంటుంది. ఒక మణిని తాకితే, ఆ ప్రకంపనలు వలలోని అన్ని మణులకూ అందుతాయి.


వేదాంతం: సృష్టిలో ప్రతి అణువు ఇంకో దానితో ముడిపడి ఉంది, 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' (ఒకే మూలం), దేశ, కాలాలకు అతీతమైనది ఆత్మ అని చెపితే..


Quantum Entanglement అవే భావనలను కణాలు దూరంగా ఉన్నా స్పందిస్తాయి, ఒకే మూలం నుండి వచ్చిన కణాలు, దూరం అనేది ఒక భ్రమ (Non-locality) అని చెపుతాయి.

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - పంచమి - మృగశిర -‌‌ భౌమ వాసరే* (21.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భగవత్పాదులవారి రచనల గురించి

 శ్రీ రామ (128 )


(శ్రీ శంకర భగవత్పాదులవారి రచనల గురించి ఒక మిత్రుని సందేహం, నా సమాధానం, మరొక మిత్రుల అభిప్రాయం, చూద్దాం).


శ్లో //శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//

(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,

సమస్త జీవకోటియందు కరుణ కలవారై, అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,

జగద్గురువులై, సమస్త లోకములకు శుభము కలిగించే,

 శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).


                          --------------------

            


శ్రీ శంకర భగవత్పాదుల వారి రచనలను గురించి అనేకమంది ఆస్తిక మహాశయులకు తరచుగా వచ్చే సందేహాన్నే " శ్రీ బి. సోమయాజులుగారు" అనే మా మిత్రులు ఈ విధంగా వెలిబుచ్చారు.


సందేహం.


" 🙏 ఓం నమో నారాయణాయ! "


అద్వైత మతాన్ని స్థాపించిన శ్రీ శంకర భగవత్పాదులవారు జగద్గురువులు ఎలా అయ్యారు ?


" అహం బ్రహ్మాస్మి " అని అద్వైతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకరులు అనేక స్తోత్రాలు అనేక దేవతలను ఉద్దేశించి వ్రాయడంలో అంతరార్థం ఏమిటి ?


 "సోహమ్" అన్న ఆచార్యులవారు స్తోత్రాలలో "దాసోహం" అని ఎందుకు అన్నారు?  

ఇది నాకు వచ్చిన సందేహం.

 పెద్దలు వివరించమని ప్రార్థన! "

                             ------


ఆ సందేహానికి నా సమాధానం.


యూనివర్సిటీ " (విశ్వవిద్యాలయం) అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా ఇక్కడ విద్య లభిస్తుంది అని భావం.

ఏ తరగతి వారికి ఏ విద్య చెప్పాలో దానిని "సిలబస్" అంటాం.

ఆ "సిలబస్" తో కూడిన పుస్తకాన్ని "టెక్స్ట్ బుక్" అంటాం.

అలా ప్రపంచం లోని సమస్త మానవులకు వారి, వారి, తరగతులకు అనుకూలంగా "సిలబస్" మరియు

"టెక్స్ట్ బుక్స్" రచించిన విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ) శ్రీ శంకర భగవత్పాదులవారు.

ఆ విధంగా వారు విశ్వమంతకు గురువులు అయినారు.


రెండు వేల సంవత్సరముల క్రితం అవతరించి, 

"ఆధ్యాత్మిక అగాధాల్లో " కూరుకుపోయిన మానవజాతిని మేల్కొల్పి,

పిన్న వయస్సులోనే, సన్యసించి,  

ధర్మబోధ కోసం ఆశేతు శీతాచలం మూడుసార్లు భారతదేశమంతా పర్యటన చేసి, 

భక్తి, జ్ఞాన, యోగాది విషయములను ప్రజోపయోగం కొరకు గ్రంథస్థం చేసి,

ప్రజలకు జ్ఞానభిక్ష పెట్టిన "జగద్గురువులు"  

శ్రీ భగవత్పాదులవారు.


" సత్యం, జ్ఞాన, మనంతం బ్రహ్మ" (భగవంతుడు సత్య స్వరూపుడు. జ్ఞాన స్వరూపుడు. ఆద్యంతములు లేనివాడు), 

మరియు,

" ఆనందో బ్రహ్మ" (భగవంతుడు అంటే ఆనందమే),

అని వేదము ఉపదేశించిన పరతత్త్వమును "ఆత్మ " అనగా "తానే" అని తెలుసుకోవడమే, " అద్వైతం ".

ఇది పి.హెచ్.డి.

ఈ డాక్టరేటు (పి.హెచ్.డి) గమ్యంగా,

శ్రీ శంకర భగవత్పాదుల వారు,ఒకటవ తరగతి నుండి,

 పి. హెచ్.డి., దాకా పుస్తకాలు వ్రాసి ఉంచారు.

వారి వారి పూర్వజన్మ సంస్కారమునుబట్టి వివిధ దేవతల యందు ఏర్పడే భక్తి,

యోగ, జ్ఞానములయందు అనురక్తి,

పూర్వజన్మ వాసనలననుసరించి ఏర్పడే స్వభావము,

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, శివ స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు, దేవీ స్తోత్రాలు మొదలైన అనేక దేవతా స్తోత్రాలు,

యోగ తారావళి లాంటి యోగ శాస్త్రాలు,

జ్ఞాన బోధకములైన ఉపనిషత్తులకు, భగవద్గీతకు,బ్రహ్మసూత్రములకు భాష్యములు, 

మొదలైన అనేక రచనలు ఆచార్యులవారు చేశారు. 

సద్గురువులు ఆ యా తరగతి విద్యార్థులకు వారి వారి యోగ్యతానుసారంగా తగిన పాఠాలు చెబుతారు.

పదో తరగతి పాఠాలు ఒకటో తరగతి విద్యార్థికి అర్థం కావు.

పదోతరగతి విద్యార్థి ఒకటో తరగతి పాఠాలు చదువుతూ కాలం వ్యర్థం చేసుకోడు.

 శ్రీ శంకర భగవత్పాదుల వారు అన్ని తరగతుల విద్యార్థులకు, వారి వారి స్థాయికి తగినట్లు రచనలు చేసి మానవాళిని అనుగ్రహించారు అని మాత్రం అర్థం చేసుకుని,

వారు అనుగ్రహించిన గ్రంథములను మన స్థాయిని బట్టి అధ్యయనం చేస్తూ, 

గురువుల ద్వారా సందేహములు తీర్చుకుంటూ, ముందుకు పోవాలి.

క్రమంగా అన్ని సందేహములు తీరి డాక్టరేటు గమ్యం చేరుకుంటాము".


అద్వైతం లక్ష్యంగా సంస్కరింపబడి, ఇప్పుడున్న శైవ, వైష్ణవ,గాణపత్య,ద్వైత, విశిష్టాద్వైత,స్మార్తాది సమస్త సంప్రదాయములకు మూలం శ్రీ శంకరుల బోధలే.

సద్గురువులు ఆ యా కాలములలో అవతరించి ఈ బోధలను ప్రజల యోగ్యతానుసారం వివిధ రీతులలో ఉపదేశిస్తూ‌ ఉంటారు.

                                  -------


పై సమాధానమునకు శ్రీమతి మాలినీ శ్రీ గారు ఈ విధంగా స్పందించారు.


* నమామి భగవత్పాద శంకరం లోక శంకరం 🙏🙏 *


అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగులోకి, మృత్యువు నుంచి ముక్తి మార్గము వైపు నడిపించే వారు గురువులు 🙏🙏.


శంకరాచార్యుల వారు ఒక విశ్వవిద్యాలయం అని, ఆయన రచనలను పాఠ్యాంశాలు అని, ఎంతో చక్కగా సువిశాలమైన దృక్పథంతో కూడిన వివరణ అపూర్వం పెదనాన్న.


నిజమే కదా, అసలు శంకరాచార్యుల వారు లేక పోతే ఆధ్యాత్మిక చింతన, దేవాలయాలు, పూజలు, అనేవి ఉండేవి కావు. 

ధర్మం అట్టడుగున పడిపోయి ఇతర బౌద్ధం, జైనం, చార్వాక ధర్మాలు, కాపాలిక మతము మొదలైన ఆచరణలు విర్రవీగుతూ ఉన్న సమయంలో శివుడే స్వయంగా శ్రీ శంకరాచార్య స్వామి వారి రూపంలో అవతరించి ధర్మ సంరక్షణ చేశారు.


శంకరాచార్యులవారు సనాతన ధర్మాన్ని పదిలంగా నిలపడానికి జన్మించిన మహాపురుషుడు. 

ఈ వేదం, పురాణాలు, ఉపనిషత్తులు ఈరోజు ఇంకా నిలదొక్కుకొని ఉన్నాయంటే దానికి మూలం శ్రీ శంకరులు.


కొందరు అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉంటారు. 

కానీ అది అన్నిటికీ పునాది. 

ఒక ఆలయం నిలబడడానికి పునాది ఎలాగో అలాగే అద్వైతం. 

అద్వైతం పునాది అయితే దానిపై నిలబడిన ఆలయ గోపురాలు విశిష్టాద్వైత, ద్వైతములు.

 పునాది లేనిదే ప్రయోజనం లేదు.

ఇది చాలా మంది పెద్దల అభిప్రాయం.


గురువు అంటే శ్రేయస్సు కోరేవారు. శంకరులు సమస్త మానవాళికి, భూమికి శ్రేయస్సు కోరుతూ, దానికి అనువైన సనాతన ధర్మాన్ని కాపాడారు. అందుకే శంకరులు జగద్గురువు. 🙏


మీరు తరగతులు, దానికి తగినట్లుగా పాఠ్యాంశాలు, విద్యార్థుల అర్హత, పూర్వ జన్మ సుకృతం మేరకు ఆయన రచనలను అభ్యాసం చేస్తారు అన్నది అమోఘం. 

ఎంతో సత్యము, అంతరార్థము దాక్కుంది దానిలో 🙏


అద్వైతం నిజంగానే పి.హెచ్. డి.

అనంతమైన పాఠ్యాంశం ఉన్న పదవి. 

దానిని పొందడం కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం.


నేను కేవలం శంకరులు రచించిన స్తోత్రములు చదివే ఒకటో తరగతి విద్యార్థిని. 

ఇంతకే ధన్యురాలిని అనుకుంటా. 

ఇంకా కాస్త పై తరగతిలోకి ఉత్తీర్ణత సాధించగలిగితే అది తప్పకుండా శారదా మాత, గురువుల ఆశ్శీస్సులు. 🙏


శ్రీ శంకరులు పంచాయతన పూజా విధానం స్థాపించి సుబ్రహ్మణ్య స్వామిని అన్ని విధానాల్లో జ్యోతి స్వరూపంలో నిలిపారు.


 భారత దేశం మొత్తం నాలుగు దిక్కులా నాలుగు పీఠాలు స్థాపించి రక్షణా కవచాన్ని నిర్మించి ధర్మం నిలబెట్టారు. 🙏

అలా చేయడం వల్లే వైష్ణవ, మధ్వ, మరియు ఇతర మతాలు ఈనాడు మనగలుగుతున్నాయి.


శివ కేశవులకు అభేధం. అది గళస్య కంఠస్య బంధం. 


సోహం, దాసోహం వివరణ చాలా ఆలోచింప చేస్తుంది. సోహం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. 


అన్నీ నేనే, అన్నింటా నేనే అనేదే ఆత్మ తత్వము.

ఆ తత్త్వమును అలవరుచుకొని దానికి లోబడి ఉండడం దాసోహం, అని నేను అనుకుంటున్నాను.

ఇతర దేవతలకు దాసోహం అని పైకి తోస్తున్నా , వారిలో ఉన్న ఆత్మ తత్త్వానికి దాసోహం అని నేను అనుకుంటున్నాను.

అలా ఆ అద్వైత తత్వానికి శరణాగతి కావడం, ఆచరించడం మన కర్తవ్యం అని ఇంతమాత్రం నా చిన్న, పామర మెదడు అర్థం చేసుకుంది.


నా అభిప్రాయంలో తప్పులుంటే సరిదిద్దండి పెదనాన్న.


శంకరాచార్యుల వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.

 🙏. ఆయన అనంతం. 🙏

కేవలం నమస్కారం చేసే యోగ్యత మాత్రమే ఉంది.


నాకు చాలా చాలా నచ్చిన వ్యాసం ఇది పెదనాన్న. 

నాతో చాలా ఆలోచింప చేసి, నేను విన్న ఎన్నో విషయాలు స్ఫురణకు తెచ్చింది మీ వ్యాసం.

ధన్యవాదాలు పెదనాన్న.

మీరు మీ రచనలతో అందరికి ఎంతో జ్ఞానం పంచుతున్నారు 🙏


                            ------------

                 (25-4-'23 న పెట్టిన పోష్టు)

 

శుభమస్తు

తూములూరి మధుసూదనరావు,

25-4-'26