10, ఏప్రిల్ 2026, శుక్రవారం

పంచాంగం


 

ఈ ప్రశ్నకు బదులేది 18

 ఈ ప్రశ్నకు బదులేది 18



ఈరోజు మన ప్రశ్న  రామాయణం కు సంబంధించింది.

బాలకాండలో శ్రీరాముడిని షోడశ గుణములు (16) కలవాడిగా వర్ణించారు అవి ఏమిటి


రాము విగ్రహవాన్ ధర్మః అని ఎవరు ఎవరితో ఏ సందర్భంలో తెలిపారు


లక్ష్మణుని నవ్వు అంటే ఏమిటి ఎప్పుడు నవ్వాడు



ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక :: జవాబుని కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు

ఒక పెళ్లి..

  ఒక పెళ్లి... ఒక మహాకవి గుండెను రగిల్చిన మంట... అదే తెలుగు సాహిత్యంలో ఒక విప్లవం!]


మనం ఫొటోలో చూస్తున్నది సామాన్యమైన చిత్రం కాదు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక అరుదైన సాక్ష్యం!


పోలవరం జమీందారుకు, కేవలం 12 ఏళ్ళ బాలికతో జరిగిన వివాహ వేడుక ఇది. ఈ పెళ్లికి అప్పట్లో గురజాడ అప్పారావు గారు (నేలపై కుడి నుండి రెండవ స్థానంలో కూర్చున్న వ్యక్తి) తన తండ్రి గారితో కలిసి హాజరయ్యారు.


ఆ చిన్నారి వయసులో జరిగిన ఆ 'కన్యాశుల్కం' వివాహం గురజాడ గారిని ఎంతగానో కలిచివేసింది. ఒక సంఘ సంస్కర్తగా ఆయన లోపల రేగిన ఆవేదన నుండే, తెలుగు నాటక సాహిత్యంలో ఆల్-టైమ్ క్లాసిక్ అయిన 'కన్యాశుల్కం' పుట్టుకొచ్చింది.


కేవలం నాటకం కోసమే కాదు, సమాజంలో వేళ్ళూనుకున్న దురాచారాలను తుడిచిపెట్టడానికి ఆనాడే ఆయన కలాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. విజయనగరానికి చెందిన వెలుగు రాము నాయుడు గారు సేకరించిన ఈ అపురూప చిత్రం, మన చరిత్రను, గురజాడ గారి దార్శనికతను గుర్తుచేస్తుంది.


మీకు తెలుసా?


గిరీశం, మధురవాణి వంటి పాత్రల సృష్టి వెనుక ఉన్న ప్రేరణ ఇలాంటి నిశిత పరిశీలనలే! మన సాహితీ మూలాలను గౌరవిద్దాం

10-04-2026 శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

10-04-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------


వృషభం


భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


మిధునం


నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.  

---------------------------------------


కర్కాటకం


బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

---------------------------------------


సింహం


ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


కన్య


నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఋణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి.

---------------------------------------


తుల


నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


పేరు కలిగిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. 

---------------------------------------


ధనస్సు


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


మకరం


గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

---------------------------------------


కుంభం


వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. 

---------------------------------------


మీనం


మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

పంచాంగం 10.04.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 10.04.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష అష్టమి తిథి భృగు వాసర పూర్వాషాఢ నక్షత్రం శివ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: అష్టమి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 78*


*విద్యే విధాతృవిషయే కాత్యాయని కాళి కామకోటికలే ౹*

*భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీమ్||*


*భావము :*


*బ్రహ్మవిద్యా స్వరూపవు. పదహారు కళలతో ప్రకాశించే మాతవైన నిన్ను, కాత్యాయని, కాళీ, భారతీ, భైరవీ, భద్రా, శాకినీ, శాంభవీ, శివా అనే నామాలతో ఎల్లప్పుడు స్తుతిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 78*


*విద్యే విధాతృవిషయే కాత్యాయని కాళి కామకోటికలే ౹*

*భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీమ్||*


*భావము :*


*బ్రహ్మవిద్యా స్వరూపవు. పదహారు కళలతో ప్రకాశించే మాతవైన నిన్ను, కాత్యాయని, కాళీ, భారతీ, భైరవీ, భద్రా, శాకినీ, శాంభవీ, శివా అనే నామాలతో ఎల్లప్పుడు స్తుతిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


 

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।

జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ।। 43 ।।



ప్రతిపదార్థ:



ఏవం — ఈ విధంగా; బుద్ధేః — బుద్ధి కంటే; పరం — ఉన్నతమైనది; బుద్ధ్వా — తెలుసుకొని; సంస్తభ్య — వశపరుచుకొని; ఆత్మానం — నిమ్నస్థాయి అస్తిత్వాన్ని (ఇంద్రియ-మనస్సు-బుద్ధి లను); ఆత్మనా — ఉన్నత స్థాయి అస్తిత్వం చేత (ఆత్మ); జహి — సంహరింపుము (నిర్మూలింపుము); శత్రుం — శత్రువు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; కామ-రూపం — కోరికలనే రూపంలో; దురాసదమ్ — బలీయమైన.


తాత్పర్యము : 


ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని (ఇంద్రియమనోబుద్ధులను), నీ ఉన్నత అస్తిత్వంచే (ఆత్మ శక్తి ద్వారా) వశపరుచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము.



  వివరణ:


ముగింపుగా శ్రీ కృష్ణుడు, కామమనే (కోరికలు) శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నాడు. ఆత్మ అనేది భగవంతుని అంశము కాబట్టి, అది దివ్యమైనది. అంటే, అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమౌతుంది, ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే. ఈ భౌతిక వస్తు/విషయములు, ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనని తీర్చలేవు, కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం నిష్ప్రయోజనమైన పని. మనం ప్రయత్న పూర్వకంగా, మన బుద్ధికి ఈ ప్రకారంగా ఆలోచించటానికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ తరువాత దానిని మనస్సు, ఇంద్రియములను నియంత్రించటానికి వినియోగించాలి.


కఠోపనిషత్తులో ఈ విషయం, ఒక రథం ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడింది.


ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు

బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ

ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ ।

ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః (1.3.3-4)


ఐదు గుర్రాలచే గుంజబడే ఒక రథం ఉంది అని ఉపనిషత్తులలో చెప్పబడింది; ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి; ఆ పగ్గాలు రథ సారథి చేతిలో ఉన్నాయి; ఆ రథం వెనుక భాగంలో ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. అసలైతే, ఆ ప్రయాణికుడు, రథ సారధికి దిశానిర్దేశం చేయాలి; సారధి అప్పుడు పగ్గాలతో గుర్రాలకి దిశానిర్దేశం చేయాలి. కానీ, ఇక్కడ, ప్రయాణీకుడు నిద్రపోతున్నాడు, కావున గుర్రాలు తమ ఇష్టానుసారం ఉన్నాయి.


ఈ ఉపమానంలో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు; గుర్రాల నోటియందు ఉన్న పగ్గాలు, మనస్సు; రథ సారధి, బుద్ధి; వెనుక కూర్చున్న ప్రయాణీకుడు, శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియములు (గుర్రాలు) భోగాలని కోరతాయి. మనస్సు (పగ్గాలు) ఇంద్రియములపై (గుర్రాలపై) నియంత్రణ చేయటం లేదు. బుద్ధి (సారధి) పగ్గాల (మనస్సు) లాగుడుకి వశమైపోయింది. కాబట్టి భౌతికంగా బద్ధుడైఉన్న స్థితిలో, అయోమయానికి గురై ఉన్న జీవాత్మ, బుద్ధిని సరియైన దిశలో నడిపించలేదు. ఈ స్థితిలో, రథం ఎట్లా పోవాలి అన్న విషయాన్ని ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది, కానీ అవి దానికి సంతృప్తిని ఇవ్వలేవు. ఈ రథంలో కూర్చునిఉన్న జీవాత్మ (ప్రయాణికుడు) ఈ ప్రకారంగా అనాది నుండి భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు.


కానీ, ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావం పట్ల మేల్కొని, చురుగ్గా వ్యవహరిస్తే, అది బుద్ధిని సరైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి, తక్కువ స్థాయి అస్తిత్వాలైన మనస్సు, ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది - అప్పుడే రథం శాశ్వత సంక్షేమం దిశగా కదులుతుంది. ఈ విధంగా, తక్కువ స్థాయి అస్తిత్వాన్ని (ఇంద్రియములు, మనస్సు, బుద్ధి) నియంత్రించటానికి ఉన్నతమైన ఆత్మ (జీవాత్మ) ను తప్పకుండా వినియోగించాలి.

సమాజంలో విలువలు

  🙏*శుభోదయం*🙏


నేటి సమాజంలో విలువలు తగ్గుతున్నాయనే,

ఆవేదన తరచూ వినిపిస్తుంది!.

కానీ, విలువలు చట్టాలతో నిలబడవు,

శిక్షలతో పెరగవు. 

వ్యక్తి అంతర్గతంగా మారినప్పుడే,

సమాజమూ మారుతుంది!.


భయంతో కాక, ఆత్మసాక్షి పిలుపుతో,

మారే మనిషే నిజమైన సంస్కారవంతుడు.

అలాంటి వ్యక్తుల సంఖ్య పెరిగినప్పుడే,

సమాజంలో నమ్మకం, భద్రత,

మానవత్వం నిలుస్తాయి!.


రోజులో కొద్దిసేపైనా నిశ్శబ్దంగా,

మనసులోకి తొంగిచూసుకుంటే!,

మన ఆలోచనలను పరిశీలించుకుంటే!,

ఆ మౌన స్వరం మళ్లీ స్పష్టంగా వినిపిస్తుంది.

అప్పుడు నిర్ణయాలు వివేచనతో వస్తాయి!.

జీవితం భారంగా కాక,

అర్థవంతంగా అనిపిస్తుంది!.


బయట ప్రపంచం ఎంత కల్లోలంగా ఉన్నా,

లోపల ప్రశాంతత ఉంటే,

అదే నిజమైన సంపద!.

నేటి సమాజానికి అత్యవసరమైన,

ఆధ్యాత్మిక స్పృహ ఇదే!.

జయతాచ్ఛంకరోగురుః

 *జయతాచ్ఛంకరోగురుః-१६*


  మహాభాగవతములో లీలావతికై నారదుఁడు చేసిన భగవత్తత్త్వ బోధను లీలావతి గర్భగత స్థితిలోనున్న శిశువు (ప్రహ్లాదుఁడు) విన్నాడని వ్యాసమహర్షి పేర్కొన్నదానిని ఆధునిక వైజ్ఞానికులు తొలుత విశ్వసింపలేదు. కాని వైద్యశాస్త్రమున ఒక భాగమైన GYNAECOLOGY ఈనాడు Embryo Genesis అంశముగా గర్భస్థ శిశువునకు గ్రహణశక్తి ఉంటుందని పేర్కొనడముతో ఇప్పుడు వ్యాస వాక్యము సత్యమైనదిగా ప్రసిద్ధము. పుట్టనిండా నీరు నిండితే పుట్ట నిలవదని వైజ్ఞానిక అభిప్రాయము. కాని పుట్ట నీళ్ళు నిండినా నిలిచియుంటుందని "...యద్వల్మీకః అపా సంభారో భవతి...' అని వేదము పేర్కొన్నది. ఇందుకు నిదర్శనముగా మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గర్భాలయము కనిపిస్తుంది. అలాగే, హోమాగ్నుల మహిమ వలన వర్షాలు, సంతానము కలుగుతాయని మన ఋషులు పేర్కొన్నారు. అందుకు ఉద్గీథవిద్య - 'అగ్నౌ.... వృష్టేరన్నమ్ తతః ప్రజాః ' అని తెలిపింది. ఆధునిక వైజ్ఞానికులు ఈ విషయమున ఇంకా సాధించవలసినది చాలా ఉన్నది. ఆంజనేయస్వామి బాల్యమున సూర్యుని అందుకునే యత్నమను హనుమచ్చరితములో కనపడే ఘటన ఇంత కాలానికి ఆదిత్య L1 తో యథార్థమని నిరూపితము. ప్రకృతిగతమైన పరిజ్ఞానముతో ఉన్న వైజ్ఞానికులు ప్రకృతి మూలమైన మహాప్రకృతికి ఆధారమైన పరబ్రహ్మము నుంచి ఏర్పడు మహద్విషయాలను నిరాకరింౘుట అసమంజసము. పరిశోధనలతో ఎంత నిరూపింౘుకోగలిగితే అంత విషయము మాత్రమే నేటి వైజ్ఞానికులకు అవగతమగును. తక్కినదంతయు భవిష్యత్తు అన్వేషణలకు శేషముగా భావింౘుటయే తరుణోపాయము.

    నానారూప విలాస భరితమైన జగత్తులో మానవరూపమొకటి. సృష్టి నుంచి లయము వరకు జగత్తునకు పరిమితి. పుట్టుక నుండి మరణముదాక జీవితమునకు అవధి. జగత్తుకైనా జీవితానికైనా ఆరంభానికి ముందేమిటి? అంతము పిదప ఉండేదేమిటి? అను ప్రశ్న నేటి వైజ్ఞానికులకు ఇంకా కొఱుకుడుపడని విషయమే. ఇంతటి గహనమైన విషయాన్ని సులభంగా 'పునరపి జననమ్' అని వాక్రుచ్చినారు శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు. విశ్వాసమే ప్రధానముగా అనుష్ఠానమును అనుసరింౘుట వలన ఆధారము ద్యోతకమగునని మన ఆర్షగ్రంథముల బోధ. ఆధారము లభింపనిదే విశ్వసింపరాదని ఆధునిక వైజ్ఞానిక ప్రపంచమంటుంది. ఈ మాట భారతీయ సనాతన వారసుల మనస్సులను వ్యాకులమొనర్చినది. ఇందువలన భారతీయ సంస్కృతి ఆచారము విద్యా అలౌకిక యోగసాధన అనుష్ఠాన నైష్ఠికత అత్యద్భుత పారమార్థిక స్థితి దూరమై అజ్ఞానము నిస్పృహ నిర్వేదము క్రమ్మినాయి. జడతరమైన జటిల పరిస్థితిలో నిర్దేశనము లేని దుర్దశలో సమన్వయము లేని సమాజ గమనములో ఆత్మసంతృప్తి లేని ఆధ్యాత్మిక మార్గములలో సంశయాత్ములమై సంకటార్తులమై సారహీనులమై యున్న మనలకు లోకాతీతమును లోకగతమును ఏకీభావమున భావింపవలెనని జీవేశ భేద రహిత అద్వైతస్థితిని అనుగ్రహించి అనునయించి అనుసరించి అవధరింపఁజేసిన మహా మహితాత్ములు శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు. వారిని వారి సిద్ధాంతమును వారు ౘూపిన మార్గమునకు విశ్వసించి ఆచరింౘుటయే నేటి కాలమునకు నిశ్శ్రేయప్రదమైన కర్తవ్యము.


*వందే గురు పరంపరామ్*

*శ్రీ హరి స్తుతి 113*

  *శ్రీ హరి స్తుతి 113*


*కం. పరలోక చింత లేదట*

*పరమాత్ముని నమ్మలేక పరుగిడుచుండున్*

*పరమాత్మ పిలుపునందగ*

*పరులే చింతించు చుండు పంపించుటకై**శ్రీ హరి స్తుతి 314*


*కం. పరమాత్ముని ధ్యానించిన* 

*పరులే బాధపడుచుండు పగవారలుగా*

*నరకమున బాధలొందక*

*పరమాత్ముని చెంత చేరు భక్తుండై*శ్రీ హరి స్తుతి 312*


*కం. తలచుము నారాయణునే*

*కలవరమే లేకపోవు కార్యములందున్* 

*అలసత్వము చేయకెపుడు*

*ఫలితమ్ములనందజేయు పరమాత్ముం*శ్రీ హరి స్తుతి 311*


*కం. నీదైనదేది లేదట*

*బాధలు నీకున్నవనుచు భయపడుటేలా?* 

*బాధలు శాశ్వతమెట్లగు*

*నేదీ శాశ్వతము కాదు నీ లోకమునన్*డే*నన్*

కనువిప్పు

 కనువిప్పు:


కాంచీపురం దగ్గరలో ఉండే నాగలాపురంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. నగలు తయారు చేయడంలో అతన్ని మించిన వారు లేరు. ఆడవాళ్ళు ధరించే జుమికీలు, పాపిడి చేరు, గాజులు, చంద్రహారాలు అతను తయారు చేస్తే కళ్ళు చెదిరేలా ఉండేవి. 


ముఖ్యంగా నడుముకి పెట్టుకొనే వడ్డాణం శివయ్య తయారుచేస్తే అత్యద్భుతంగా ఉండేది. అయితే అతని పేరు ఎక్కువ మందికి తెలీకపోడానికి కారణం, అతనికి డబ్బు ఆశలేదు‌. దానికన్నా ఎక్కువ అతను శివభక్తుడు. శివభక్తులకి నగలు చేసిచ్చి సాదాగా బతికేవాడు.


ఇదిలా ఉంటే, కంచి రాజధానిలో మహారాణీ వైష్ణవీ దేవి, విష్ణుభక్తురాలు. ఆమె శ్రీ మహా విష్ణువుకి ఆలయం నిర్మించాలని అనుకుంది. ఆలయ నిర్మాణం పూర్తయింది. మూల విరాట్టుకి చాలా నగలు చేయించింది. అయినా నడుముకి పెట్టే వడ్ఢాణం బాగా రాలేదు. 


మహారాణికి ఇష్టసఖి ఒకామె రాణీకి శివయ్య గురించి చెప్పి, అతని చేత నడుముకి నగ చేయించమంది‌. తన స్నేహితురాలు ఆ ఊరి ఆడపిల్ల అని, ఆమె నగ చూసి ఈ మాట చెప్పేనని కూడా అంది. మర్నాడు తన స్నేహితురాలిని ఆ నగతో రప్పించి చూపించింది.


నగ చూడగానే మహారాణికి కళ్ళు చెదిరిపోయేయి. ఆ పనితనం, అందం ఆమె మనసుని దోచుకుంది.


నాగులాపుర వాసులయిన తన భటులని ఇద్దరిని వెంటనే శివయ్యని తెమ్మని పంపింది. తన దేవుడికి అతను నడుముకి‌ పెట్టే నగ చేయాలని చెప్పమంది.


ఈ భటులు శివయ్యని కలిసి, రాణీగారి ఆనతి చెప్పేరు. అయితే శివయ్య, విష్ణువుకి నగ చేయడానికి నిరాకరించేడు. అతని నియమం ప్రకారం అతను శివుడికి, శివ భక్తులకీ మాత్రమే నగలు చేస్తాడు.


భటులు మహారాణికి ఆగ్రహం వస్తుందని భయపెట్టేరు. అప్పుడు శివయ్య మేలుకోరే ఆ ఊరి పెద్దమనిషి ఒక సలహా ఇచ్చేడు.

“నువ్వు ఆ దేవాలయానికి వెళ్ళకు. రాజమందిరంలో కూచొని నగ తయారు చేసి ఇవ్వు” అన్నాడు.


శివయ్య అందుకు‌ మహారాణీ ఒప్పుకుంటే తను అలా నగ చేస్తాను అన్నాడు. భటులు అతన్నే ఆ మాట చెప్పమని తీసుకెళ్ళేరు.


మహారాణికి శివభక్తుల నియమాలు తెలుసు. సరే అని శివయ్యకి తమకి నగ ఎలా కావాలో చెప్పింది‌. కొలతలు ఆమె ఆస్థాన శిల్పులు ఇచ్చేరు. శివయ్య రెండే రోజుల్లో నగ తయారు చేసి ఆమెకి ఇచ్చేడు.

తనకి సెలవు ఇమ్మని కోరేడు.


మహారాణీకి నగ అందం చూస్తూ ఉంటే మతిపోయింది. విప్పారిన కళ్ళతో ‘నగ స్వామికి అలంకరించి, అప్పుడు శివయ్యని సత్కరించి, పల్లకీమీద పంపుతానని’ చెప్పింది.


ఆ రోజే ఆమె నగ తీసుకువెళ్ళి స్వామి విగ్రహానికి అలంకరించమని ప్రధాన పూజారికి ఇచ్చింది. నగ బెత్తెడు చిన్నదయింది. ఎంత చిన్నది అయిందో కొలిచి ఆ దారం శివయ్యకి ఇచ్చి మళ్ళా మార్చమంది. 


శివయ్య గంటలో ఆ మేరకి ఎక్కువ చేసి ఇచ్చేడు. మళ్ళా స్వామికి అలంకరించేసరికి మళ్ళా బెత్తెడు తక్కువ అయింది. శివయ్య మళ్ళా మార్చేడు. అయినా బెత్తెడు తక్కువ అయింది. ఇలా మూడు నాలుగుసార్లు జరిగింది.


“మీ వాళ్ళు కొలతలు సరిగా ఇవ్వలేదమ్మా!” అన్నాడు శివయ్య.


మహారాణీకి దిక్కు తోచలేదు. “పోనీ శివయ్యా! నువ్వే స్వయంగా కొలత తీసుకువచ్చు కదా! కళ్ళకి గంతలు కట్టుకో. నేను స్వయంగా చెయ్యి పట్టుకొని తీసుకెళతాను. కొలత తీసుకున్న మరు క్షణం బయటకి వచ్చేద్దాం. నగ తయారవగానే మీ ఊరు పంపుతాను” అంది‌ ప్రాధేయ పడుతూ.


శివయ్యకి ఇష్టం లేకపోయినా, మహారాణీ అంత దీనంగా ప్రాధేయపడుతూ అడగడం, నగ ఇచ్చేస్తే తనకి విముక్తి వస్తుందని ఒప్పుకున్నాడు.


మహారాణీ, శివయ్యా సేవకులూ రథం మీద దేవాలయానికి వెళ్ళేరు. శివయ్య కళ్ళకి గంతలు కట్టుకొని మరీ రథం ఎక్కేడు.


దేవాలయంలో మహారాణి అతని చెయ్యిపట్టుకొని మరీ గర్భగుడిలోకి తీసుకెళ్ళింది. శివయ్య కొలత కోసం స్వామి విగ్రహపు నడుము పట్టుకున్నాడు. అతని చేతికి విష్ణు ప్రతిమ కాక శివలింగంలా తగిలింది.


శివయ్య ఉలిక్కిపడి “శివా! నువ్వా?” అంటూ కళ్ళ గంతలు లాగేసేడు. ఎదురుగా విష్ణుమూర్తి విగ్రహం. 


“అయ్యో” అంటూ మళ్ళా కళ్ళకి గంతలు కట్టుకొని నడుం పట్టుకోబోతే మళ్ళా శివలింగమే చేతికి తగిలింది. “మహాదేవా! నువ్వా?” అంటూ కళ్ళ గంతలు తీసేసేడు. మళ్ళా నవ్వుతూ విష్ణుమూర్తి. ఇలా మరో రెండుసార్లు జరిగింది.


శివయ్య ఏడుస్తూ “స్వామీ! ‘శివకేశవులు ఒకటే’ అని నాకు చెప్పడానికా ఈ మాయ? అజ్ఞానినే కాదు అహంకారిని కూడా! అయినా నన్ను దీవించేవా?” అంటూ కాళ్ళమీద పడ్డాడు.


అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. మహారాణీ తేరుకొని

“శివయ్యా! నీలాటి భక్తుడిని చూడడం మా అదృష్టం. ఇహ‌మీదట అందరం శివకేశవులని ఒకేలా పూజిద్దాం.” అంది. శివయ్య తన కళ్ళతో చూస్తూ స్వామివారి నడుం కొలత తీసుకున్నాడు.


మహారాణీ, ఈసారి చేసిన నగ శివయ్యనే అలంకరించమంది.

శివయ్య నగ పెట్టగానే ఏ తేడా లేకుండా చక్కగా అమరిపోయింది.


ఆలయ ప్రారంభం దాకా శివయ్య అక్కడే ఉండి, తన వంతుగా స్వామివారికి మకర కుండలాలూ, కౌస్తుభ మణీ తయారు చేసి, సమర్పించి, ప్రత్యేక పూజలు చేయించేడు.


మహారాణీ అతనికి చాలా కానుకలు ఇచ్చి, గౌరవంగా అతని ఊరు పంపింది.


అటు పిమ్మట శివయ్య శివకేశవులని సమానంగా పూజించడం మొదలెట్టేడు.


సమాప్తం.


కథా, కథనం అందించిన MaMangu Krishna Kumariారికి ధన్యవాదాలు.

శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

10-04-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------


వృషభం


భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


మిధునం


నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.  

---------------------------------------


కర్కాటకం


బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

---------------------------------------


సింహం


ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


కన్య


నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఋణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి.

---------------------------------------


తుల


నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


పేరు కలిగిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. 

---------------------------------------


ధనస్సు


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


మకరం


గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

---------------------------------------


కుంభం


వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. 

---------------------------------------


మీనం


మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

ఉపనిషత్తుల ముఖ్య లక్ష్యం

 🌿 ఉపనిషత్తుల ముఖ్య లక్ష్యం

బ్రహ్మం (పరమాత్మ) ఏమిటి?

ఆత్మ (జీవాత్మ) స్వరూపం ఏమిటి?

జీవుడు – బ్రహ్మం సంబంధం

మోక్షం ఎలా పొందాలి?

👉 సారాంశంగా:

“తత్ త్వమ్ అసి” (నువ్వే ఆ బ్రహ్మం) అనే తత్వం బోధిస్తాయి.

📘 ప్రధాన ఉపనిషత్తులు (ముఖ్య 10 – దశోపనిషత్తులు)

ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానించిన ముఖ్యమైన 10 ఉపనిషత్తులు:

ఈశావాస్య ఉపనిషత్

కేన ఉపనిషత్

కఠ ఉపనిషత్

ప్రశ్న ఉపనిషత్

ముండక ఉపనిషత్

మాండూక్య ఉపనిషత్

తైత్తిరీయ ఉపనిషత్

ఐతరేయ ఉపనిషత్

ఛాందోగ్య ఉపనిషత్

బృహదారణ్యక ఉపనిషత్

🔹 ఇతర ముఖ్య ఉపనిషత్తులు

శ్వేతాశ్వతర ఉపనిషత్

కౌషీతకి ఉపనిషత్

మైత్రాయణీయ ఉపనిషత్

👉 మొత్తం ఉపనిషత్తులు సుమారు 108 ఉన్నాయి అని పరంపర.

🧘‍♂️ ఉపనిషత్తుల తత్వ సారాంశం

బ్రహ్మం – ఏకైక సత్యం

జగత్ – మాయ (అనిత్యం)

జీవుడు – బ్రహ్మ స్వరూపమే

మోక్షం – జ్ఞానం ద్వారా సాధ్యం

✨ ప్రసిద్ధ మహావాక్యాలు

“తత్ త్వమ్ అసి” – (ఛాందోగ్య)

“అహం బ్రహ్మాస్మి” – (బృహదారణ్యక)

“ప్రజ్ఞానం బ్రహ్మ” – (ఐతరేయ)

“అయం ఆత్మా బ్రహ్మ” – (మాండూక్య)

📌 సులభంగా గుర్తుంచుకోండి

👉 వేదాలు → కర్మ

👉 ఉపనిషత్తులు → జ్ఞానం

👉 గమ్యం → మోక్షం

నేను అనే అహం పోతే…”

 “నేను అనే అహం పోతే…” 

“నేను ఎవరు?” అనే ప్రశ్న. ఉదయిస్తుంది


ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నవాడే నిజమైన జీవితం అర్థం చేసుకున్నవాడు.


ఈ సందర్భంలో భోజ మహారాజు మరియు కాళిదాసు మధ్య జరిగిన సంఘటన ఒక గొప్ప సత్యాన్ని మన ముందుంచుతుంది.


భోజ మహారాజు 

తన ఆస్థానంలో ఉన్న పండితులను అడిగాడు:


“మోక్షానికి పోగలిగేది ఎవరు?” అని 


ప్రతి పండితుడు తన తన జ్ఞానం ప్రకారం సమాధానమిచ్చాడు:

యజ్ఞాలు చేస్తే మోక్షం లభిస్తుంది

జ్ఞానం సంపాదిస్తే మోక్షం లభిస్తుంది

భక్తి చేస్తే మోక్షం లభిస్తుంది

సత్సంగం చేస్తే మోక్షం లభిస్తుంది అని


కానీ కాళిదాసు మాత్రం లేచి ఇలా అన్నాడు:


“నేను పోతే మోక్షం వస్తుంది” అని


ఈ మాట మొదట అందరికీ అహంకారంగా అనిపించింది.

కానీ తరువాత ఆయన వివరణ ఇచ్చాడు:


“నేను అనే అహంకారం పోతే ఎవడైనా మోక్షానికి పోవచ్చు”


“నేను” అనే అహంకారం అంటే ఏమిటి?


మనమందరం రోజూ “నేను” అనే పదం ఉపయోగిస్తుంటాం.


కానీ ఆ “నేను” అంటే ఏమిటి?


నేను ఈ శరీరం

నేను ఈ స్థాయి ఉన్నవాడు

నేను ఈ స్థానం కలవాడు

నేను చేసాను, నాకు వచ్చింది

ఈ భావాలన్నీ కలిపితే అదే అహంకారం (Ego)

ఇది ఒక అజ్ఞానం

ఇది ఒక భ్రమ

ఇది ఒక అవరోధం

అహంకారం వల్ల కలిగే సమస్యలు

అహంకారం మనిషిని నశింపజేస్తుంది:

ఇతరులను చిన్నచూపు చూడటం

కోపం పెరగడం

అసూయ, ద్వేషం పెరగడం

మనశ్శాంతి పోవడం


అహంకారం ఉన్న చోట

ప్రేమ ఉండదు

శాంతి ఉండదు

దైవం ఉండదు

అహంకారం పోతే కలిగే మార్పు

అహంకారం పోయినప్పుడు మనిషిలో అద్భుతమైన మార్పులు వస్తాయి:


వినయం పెరుగుతుంది

ప్రేమ పెరుగుతుంది

సహనం పెరుగుతుంది

 కరుణ ఉద్భవిస్తుంది


“నేను” అనే భావం పోయి

“అందరూ ఒకటే” అనే భావం వస్తుంది ఇది నిజమైన జ్ఞానం


మోక్షం అంటే ఏమిటి?


చాలామంది మోక్షం అంటే

మరణం తర్వాత దొరికేది అనుకుంటారు.

కానీ నిజానికి:


మోక్షం అంటే మనసుకు విముక్తి

బాధల నుండి విముక్తి

జనన మరణ చక్రం నుండి విముక్తి

అది బయట కాదు…

మన లోపలే ఉంది


ఆచరణలో ఎలా సాధ్యం?

“నేను” అనే అహంకారం పోవాలంటే:


1. ధ్యానం 

మనసును గమనించడం

“నేను ఎవరు?” అని ప్రశ్నించుకోవడం

2. సేవ

ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయడం

3. వినయం 

తనకు తెలిసింది తక్కువ అని అంగీకరించడం

4. సత్సంగం 

మంచి ఆలోచనలు ఉన్న వారితో ఉండడం

5. భక్తి 

దైవంపై సంపూర్ణ విశ్వాసం పెట్టడం


ఒక అందమైన ఉదాహరణ


ఒక నది సముద్రంలో కలిసినప్పుడు

దానికి తన పేరూ ఉండదు, రూపం ఉండదు

అది సముద్రమే అవుతుంది


అలాగే


మనిషి అహంకారం పోతే

అతడు పరమాత్మతో ఏకమవుతాడు


కాళిదాసు చెప్పిన చిన్న మాటలోనే గొప్ప సత్యం ఉంది:

“నేను పోతే మోక్షం వస్తుంది”


అంటే:


శరీరం పోవడం కాదు

అహంకారం పోవడం


అహంకారం లేని మనసే

శాంతి పొందుతుంది

ఆనందం పొందుతుంది

మోక్షం పొందుతుంది


“నీ లోపల ఉన్న ‘నేను’ అనే అహంగోడ కూలితే

నీకు ఆత్మ దర్శనం అవుతుంది.

.🙏🙏

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 *ప్రాణా యథా ఆత్మనో అభీష్టా* 

         *భూతానామపి తే తథా।*

         *ఆత్మౌపమ్యేన భూతానాం* 

         *దయాం కుర్వంతి సాధవః ।।*


తా𝕝𝕝 *ఏ విధంగా తన ప్రాణాలు తనకి ప్రియంగా ఉండునో, అదే విధంగా అన్ని ప్రాణులకూ వాటి వాటి ప్రాణాలు ప్రియంగా ఉండును. ఆ కారణంగా సజ్జనులు ఆత్మ తుల్యముగా భావించి అన్ని ప్రాణుల యెడ దయ కలిగి ఉంటారు.*


✍️💐🌹🪷🙏

భాగవతం వింటే బాగవుతాం'*

 *'భాగవతం వింటే బాగవుతాం'*

శ్రీ పోతన భాగవత మధురిమలు


(7-353-క)

కావున నల్పుఁడ సంస్తుతి

గావించెద వెఱపు లేక కలనేరుపునన్;

నీ వర్ణనమున ముక్తికిఁ

బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!


*భావము:-* శాశ్వతుడా! శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు కదా. కనుక, నేను అల్పుడను. కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా, బెదరకుండా నా నేర్పుకొలది స్తుతిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు.


(ప్రహ్లాదుని నారసింహ స్తుతి....)


శ్రీ శంకరాచార్య కృత శ్రీ మహిషాసుర మర్ధిని స్తోత్రంతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

సరస్వతీ స్తుతి🙏🙏

 🌸సరస్వతీ స్తుతి🙏🙏

         సీస పద్యము        

              

 సీ౹౹వాణిపుస్తకపాణి వాగ్దేవి శారద

    నీకువందనములు నీలవేణి!   

   ఆశ్రిత సురభూజ! హంసవాహిని! దేవి!

             నిలచి నా రసనపై పలుకునిమ్ము!

   నలువరాణివి తల్లి!నాదస్వరూపిణి!

             సకలశాస్త్రవినుత!శరణు శరణు!

   విశ్వసంరక్షణి!వేదస్వరూపిణి!

                     సత్కళాశోభిత సంప్రతీత!

తే౹౹భారతి!మహాసరస్వతి! భవ్యనేత్ర 

     నాద బిందు కళాధరి! నాదరూప!

     భగవతీ! సత్య రూపిణి! నిగమవేద్య!

  శాబ్ది పావకి శ్రుతదేవి జయము జయము🙏🙏


సాహితీ శ్రీ జయలక్ష్మి

ఆరోగ్యం

 *🪴మీ ఆరోగ్యం మీ చేతుల్లో*🪴


*🍧డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్...*🍧


ప్రస్తుతం నూటికి 70 శాతం మందికిపైగా ప్రజలు బీపీ, షుగర్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అనారోగ్య సమస్య ఉన్న వారు క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. దీంతో బీపీ, షుగర్ స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పాడతాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా.. అరోగ్య పరిస్థితి తలకిందులవుతుంది. 

ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది షుగర్ సమస్య ఉన్న వారికి అత్యంత ప్రమాదం. దీని వల్ల మూత్రపిండాల సమస్యతోపాటు గుండె జబ్బుల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్ ఉన్న వారు వేసవిలోనే కాదు.. ఇతర సమయాల్లో సైతం ఈ డైట్ అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


ఆహారం, జీవనశైలిలో మార్పులు.. 

వేసవిలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి వైద్య నిపుణులు కొన్ని ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. 


సరైన డైట్ తీసుకోవాలి.. (షుగర్ వ్యాధిగ్రస్తులకు 1800 కె కేలరీల డైట్ ప్లాన్ )

(ఉదయం 8.00 నుంచి 8.30 AM గంటల మధ్య..)

ఇడ్లీతోపాటు కార్న్ ఫ్లాక్స్ (ఒక కప్పు), 6 బాదం పప్పులు


సోయా పాలు (1 కప్పు), బ్రడ్ ముక్కలు (whole grain Sandwich) 


వెజిటేబుల్ దాలియా (Vegetable daliya), పెరుగు


రెండు పన్నీరు పరోట, ఒక కప్పు పెరుగు.


Mid Morning (11.00 నుంచి 11.30 AM)

దానిమ్మ గింజలు (ఒక కప్పు), జామ కాయ


ఒక నారింజ, యాపిల్ కాయ తీసుకోవాలి


బొప్పాయకాయ పండు ముక్కలు (ఒక కప్పు)


మధ్యాహ్నం భోజనం ( 2.00 నుంచి 2.30 గంటల మధ్య)..

అన్నం (Paraboiled Rice) ఒక కప్పు / బ్రోన్ రైస్ (ఒక కప్పు)/ మూడు చపాతీలు, పప్పు (ఒక కప్పు), వెజ్ కర్రీ (ఒక కప్పు), సలాడ్. 


సాయంత్రం (4.00 నుంచి 4.30 గంటల మధ్య..)

గ్రీన్ టీ (ఒక కప్పు), వెజిటేబుల్ ఓట్స్ (ఒక కప్పు).


టీ (Using Skimmed Milk) (అర కప్పు), వేయించిన శనగలు ( Roasted Chana).


గ్రీన్ టీ (ఒక కప్పు), నట్స్ (Nuts).


కాఫీ (Using Skimmed Milk).


రాత్రి భోజనం Dinner.. (8.00 నుంచి 8.30 PM).


రెండు చపాతీలు, వెజ్ కర్రీ (ఒక కప్పు), సలాడ్.


వేసవిలో చేయకూడనవి.. ఇవి..


బాగా ఎండ ఉన్న సమయంలో లేదా మధ్యాహ్నం వేళ వ్యాయాయం చేయకూడదు. చల్లని వేళలో వ్యాయామం చేయాలి. 


దాహం వేస్తే కూల్ డ్రింక్స్, సోడా లేదా బయట దొరికే పండ్ల రసాలు తాగవద్దు. వీటిలో ఉండే అధిక షుగర్ నేరుగా రక్తంలో కలుస్తుంది. వీటి బదులు.. కొబ్బరి నీళ్లు పరిమితంగా తాగాలి. మజ్జిగ లేదా నిమ్మరసం (చక్కెర లేకుండా) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 


దాహం వేసిన వేయక పోయినా.. గంటకు ఒకసారి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో తేమ ఉంటేనే చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. 


వేసవిలో మధుమేహాన్ని నియంత్రించడం కష్టమేమీ కాదు, కానీ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరం. మీ షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ఎండల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

🙏జై శ్రీ సాయి మాస్టర్🙏

మన ఆరోగ్యం…

 *మన ఆరోగ్యం…!



*వేసవి కాలంలో శరీరాన్ని కాపాడే సహజ ఆరోగ్య చిట్కాలు..*

          


*# 1. ధనియాల నీరు :*```

*రాత్రి ఒక చెంచా ధనియాలు నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీరు తాగితే..

*శరీర వేడి తగ్గుతుంది.

*మూత్ర సమస్యలు తగ్గుతాయి.

*జీర్ణక్రియ మెరుగుపడుతుంది.```



*#2. ఉసిరి – శరీరానికి సహజ కూలింగ్:*```

*ప్రతిరోజూ ఒక ఉసిరికాయ లేదా ఉసిరి రసం తీసుకుంటే..

*శరీర వేడి తగ్గుతుంది.

*రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.```



*#3. కొబ్బరి నీరు :*```

*రోజుకు ఒక గ్లాస్ కొబ్బరి నీరు తాగితే..

*శరీరంలో నీటి లోపం రాదు.

*అలసట త్వరగా తగ్గుతుంది.

*శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయి.```



*#4. మజ్జిగ :*```

*వేసవిలో ప్రతిరోజూ మజ్జిగ తాగడం చాలా మంచిది..

*జీర్ణక్రియ మెరుగవుతుంది.

*శరీరానికి చల్లదనం ఇస్తుంది.

*డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.```



*5. పుచ్చకాయ :*```

*వేసవిలో ఎక్కువగా పుచ్చకాయ తినడం వల్ల..

*శరీరం హైడ్రేట్ అవుతుంది.

*శరీర వేడి తగ్గుతుంది.

*మూత్రపిండాలు శుభ్రంగా పనిచేస్తాయి.```



*6. తాటి ముంజలు :*```

*వేసవి కాలంలో తాటి ముంజలు తింటే..

*శరీరానికి చల్లదనం కలుగుతుంది.

*అలసట తగ్గుతుంది.

*శరీర వేడి తగ్గుతుంది.