16, మే 2026, శనివారం

పంచాంగ

 


Mantra - 41

 Mantra - 41 ARUNAM 5 anuvaakam


నిన్నటి మంత్రం లో మనకు కనిపిస్తున్న రంగురంగుల ప్రపంచం (ఇంద్రధనుస్సు), వెనుక ఉన్న ఒకే ఒక్క కాంతిని (బ్రహ్మని), దర్శించమని చెపితే, ఈ రోజు మంత్రం రుద్రుని ధనుస్సు యొక్క నారి తెగిపోవడం వల్ల యజ్ఞ పురుషుడి శిరస్సును కోల్పోవడం, ఆ శిరస్సే ప్రవర్గ్య రూపంగా మారడం అనే వైదిక గాథను వివరిస్తుంది. అద్వైత పరంగా దీని అంతరార్థం చాలా లోతైనది.


“రుద్రస్య త్వేవ ధనురార్త్నిః | 

శిర ఉత్పిపేష |  

స ప్రవర్గ్యో భవత్ । 

తస్మాద్య స్సప్రవర్గ్యేణ యజ్ఞేన యజతే।” 


భౌతిక అర్ధం:

‘రుద్రస్య త్వేవ ధనురార్త్నిః శిర ఉత్పిపేష’ - రుద్రుని ధనుస్సు (పినాకం) యొక్క చివర (ఆర్త్ని ) నారి తెగిపోవడం వల్ల ఎగిరి పడి, యజ్ఞ పురుషుని శిరస్సును ఖండించింది.


‘స ప్రవర్గ్యో భవత్’ - ఆ విడదీయబడిన శిరస్సే ప్రవర్గ్య. యజ్ఞంలో ఒక ముఖ్యమైన భాగం అయ్యింది.


‘తస్మాద్యస్స ప్రవర్గ్యేణ యజ్ఞేన యజతే’ - అందుకే ఎవరైతే ఈ ప్రవర్గ్యంతో కూడిన యజ్ఞాన్ని చేస్తారో, వారు సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు.


ప్రవర్గ్యం అంటే ఏంటో కొంత వివరణ చూద్దాం! యజ్ఞంలో ఒక మట్టి పాత్రను అగ్నిలో ఎర్రగా కాల్చుతారు. అందులో నెయ్యి, ఆవు పాలు, మేక పాలను పోస్తారు. అప్పుడు ఆ వేడికి పాలు ఒక్కసారిగా పైకి పొంగి, అగ్నిశిఖలా ఆకాశంలోకి ఎగసిపడుతుంది. ఇలా పైకి ఎగసిన ఆ తేజస్సునే 'ప్రవర్గ్యము' అంటారు.


ఈ భీకరమైన వర్ణన వెనుక ఉన్న వేదాంత సత్యం ఏమిటంటే:


రుద్రస్య త్వేవ ధనురార్త్నిః - రుద్రుడు అంటే అజ్ఞానాన్ని హరించేవాడు (సంహారకర్త). 


శిర ఉత్పిపేష - శిరస్సు తెగిపోవడం అనేది భౌతిక మరణం కాదు, అది 'అహంకార నాశనం'. ‘తల తీసేసినట్లు’ ఉంది అనే లౌకిక ప్రయోగం సంఘం లో ఉంది. అహంకారం తొలగినప్పుడే 'నేను బ్రహ్మమును' (అహం బ్రహ్మాऽస్మి) అనే సత్యం వెలుగులోకి వస్తుంది. 


‘స ప్రవర్గ్యో భవత్’ - ప్రవర్గ్య అంటే అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం. అజ్ఞానం అనే శిరస్సు (లింగ శరీరం లేదా అహంకారం) తొలగిపోయినప్పుడు, జీవుడు తన పరిమిత రూపాన్ని కోల్పోయి, అనంతమైన బ్రహ్మ తేజస్సుగా మిగిలిపోతాడు.

ఆ తెగిపోయిన శిరస్సే ఆదిత్యుడు లేదా సూర్యుడు అయ్యాడని వేదం చెబుతుంది. అంటే, అజ్ఞాన అంధకారం వీడి జ్ఞాన సూర్యుడు ఉదయించాడని అద్వైతార్థం.


"తస్మాద్య స్సప్రవర్గ్యేణ యజ్ఞేన యజతే" - ఎవరైతే ఈ ప్రవర్గ్య రహస్యాన్ని తెలిసి యజ్ఞం చేస్తారో, వారు పూర్ణత్వాన్ని పొందుతారు.


శిరస్సు - అహంకారానికి సంకేతం - 

అద్వైతంలో 'శిరస్సు' అంటే కేవలం శరీర భాగం కాదు, అది అహంకారం (Ego) లేదా వ్యక్తిత్వానికి కేంద్రం. శిరస్సును ఆశ్రయించే కేశ అలంకరణములు, కిరీట, నాసిక, కర్ణ కంఠాభరణములు ఉంటాయి. ఇవి దేహాభిమానానికి, అహంకారానికి చిహ్నములు.


ధనుస్సు నారి తెగి శిరస్సు ఖండించబడటం: అంటే—జ్ఞానాగ్ని ద్వారా జీవుడిలో ఉన్న 'నేను' (దేహాభిమానం) అనే అహంకారం ఛేదించబడటం.


ప్రవర్గ్య యజ్ఞం - ఆత్మ విచారణ

ఎవరైతే ప్రవర్గ్యంతో యజ్ఞం చేస్తారో అంటే అర్థం—కేవలం బాహ్యమైన క్రతువులు చేయడం అని కాదు. తనలోని అహంకారాన్ని (శిరస్సును) ఈశ్వరార్పణం చేసి, సర్వం బ్రహ్మమయం అని గుర్తించే ఆత్మ విచారణ చేసేవాడే నిజమైన యజ్ఞకర్త.

అహంకారాన్ని త్యాగం (న మమ) చేయకుండా చేసే ఏ కార్యమైనా అసంపూర్ణమే. అహంకారం తొలగినప్పుడే యజ్ఞం (జీవితం) సంపూర్ణమవుతుంది. 


‘రుద్రుని ధనుస్సు - కాలం మరియు జ్ఞానం’

రుద్రుడు లయకారుడు. ఇక్కడ లయం అంటే నాశనం కాదు, పరిమితులను తొలగించడం.

రుద్రుని ధనుస్సు కాలానికి లేదా జ్ఞానబలానికి సంకేతం. కాలక్రమేణా లేదా గురువు ఉపదేశించిన జ్ఞానము చేత జీవుడికి తన పరిమితులు తొలగిపోతాయని, ఆ తర్వాతే అతడు అద్వైత స్థితిని (ప్రవర్గ్య/పూర్ణత్వం) పొందుతాడని ఈ మంత్రం బోధిస్తోంది.


ఈ మంత్రం ఒక భౌతికమైన ఘటనను వర్ణిస్తున్నట్లు ఉన్నా, అంతరార్థంలో ఇది అహంకార వినాశనాన్ని, తద్వారా కలిగే బ్రహ్మజ్ఞానాన్ని సూచిస్తోంది. అహంకారం అనే శిరస్సు తెగిపోయినప్పుడే, జీవుడు పరమాత్మ అనే సంపూర్ణ యజ్ఞ స్వరూపాన్ని పొందుతాడు అని భావము. 

ప్రతీ ఆదివారం చెన్నై మేడవాక్కం, హైదరాబాద్, USA, కెనడా లలో మనం చేసే సూర్య నమస్కారము లలో ఈ మంత్ర పారాయణ చేస్తున్నపుడు పై భావం స్పురణకు వస్తే మన అహంకారములు తొలగి పరిపూర్ణత్వం అనుభవంలోకి వస్తుంది.

రమణ మహర్షి

 *రమణ మహర్షి అద్భుతమైన వచనాలు*


రమణ మహర్షి మాటలు సరళంగా ఉంటాయి, కానీ మనసులోతుల్లోకి దిగుతాయి. ఆయన మౌనం ద్వారా ఎక్కువ బోధించాడు.


*1. ఆత్మ గురించి*


నీవు వెతుకుతున్నది నీవే. వెతుకుతున్నవాడు కూడా నీవే.  

శరీరం చచ్చినా నేను చావను. ఎందుకంటే నేను శరీరం కాదు, ఆత్మను.


*2. మనసు గురించి*


ఆలోచనలు ఆగిపోతే మిగిలేదే ఆత్మ. ఆత్మే నీ నిజ స్వరూపం.  

మనసును గమనిస్తే అది కనిపించదు. అది కనిపించకుండా పోతే, నువ్వు నీవుగా ఉంటావు.


*3. భక్తి + శరణాగతి గురించి*


నీ భారం ఈశ్వరుడి మీద వేయి. ఆయన నీ భారాన్ని మోస్తాడు. నువ్వు నిశ్చింతగా ఉండు.  

నీవు దేవుడిని వెతకక్కరలేదు. నీవు ఎవరో తెలుసుకుంటే చాలు, దేవుడు నీలోనే ఉన్నాడు.


*4. సుఖం + దుఃఖం గురించి*


సుఖం బయట లేదు. నీలోనే ఉంది. నీవు నీవుగా ఉంటే సుఖమే.  

దుఃఖానికి కారణం నీవు నీ నిజ స్వరూపాన్ని మరచిపోవడమే.


*5. జీవితం గురించి*


జరిగినది జరిగిపోయింది. జరగబోయేది నీ చేతిలో లేదు. ఇప్పుడు ఉన్నది మాత్రమే నీది.  

ప్రపంచం నీ మనసు సృష్టి. మనసు శాంతిస్తే ప్రపంచం కూడా శాంతిస్తుంది.


*6. అరుణాచలం గురించి*


అరుణాచలం అనేది కేవలం కొండ కాదు. అది శివుడి అగ్ని రూపం. ఆ కొండను చూసినా, తలచుకున్నా ముక్తి కలుగుతుంది.  

నేను అరుణాచలంలో ఉండటం లేదు. అరుణాచలమే నాలో ఉంది.


*7. మౌనం గురించి*


మాటలతో చెప్పలేనిదే నిజమైన బోధన. మౌనమే గురువు.  

నీ ప్రశ్నకు జవాబు నీలోనే ఉంది. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అది వినిపిస్తుంది.


*రమణ మహర్షి సారాంశం ఒక్క మాటలో:* నేను ఎవరు? అని ప్రశ్నించుకో. 


ఈ ప్రశ్నకే సమాధానం దొ రికితే, మిగతా అన్నీ అర్థమవుతాయి.

మహాభారతంలోని పర్వాలకు

 ఆయా

 పేర్లు పెట్టడంలో గల ఔచిత్యం గురించి తెలుపగలరు.

మహాభారతంలోని పర్వాలకు ఆయా పేర్లు పెట్టడంలో వ్యాస మహర్షి అత్యంత లోతైన అంతరార్థాన్ని, ఔచిత్యాన్ని పాటించారు. ఆయా పర్వాల్లో ప్రధానంగా జరిగే కథాంశం, ఆ కథకు మూలమైన సంఘటన లేదా వ్యక్తి ఆధారంగా ఈ పేర్లు నిర్ణయించబడ్డాయి.మహాభారతంలోని 18 పర్వాల నామకరణం వెనుక ఉన్న ఔచిత్యాన్ని పరిశీలిద్దాం:

01. ఆది పర్వం"

ఆది" అంటే మొదలు. చంద్రవంశం పుట్టుక, భరతుడు, శంతనుడు వంటి పూర్వీకుల చరిత్ర, కౌరవ పాండవుల జననం, వారి విద్యాభ్యాసం వంటి ప్రారంభ విశేషాలు ఇందులో ఉండటం వల్ల దీనికి ఆది పర్వం అని పేరు వచ్చింది.

02. సభా పర్వం

ఈ పర్వంలో మయసభ నిర్మాణం, రాజసూయ యాగం కోసం ధర్మరాజు సభను తీర్చడం, ప్రధానంగా మాయా జూదం జరిగిన "సభ" కేంద్రంగా కథ నడుస్తుంది. సభలోనే ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి కీలక ఘట్టాలు జరగడం వల్ల దీనికి సభా పర్వం అని పేరు.

03. వన పర్వం (అరణ్య పర్వం)

పాండవులు జూదంలో ఓడిపోయి 12 ఏళ్లు అడవుల్లో (వనవాసం) గడిపిన వృత్తాంతం ఇందులో ఉంటుంది. అందుకే దీనికి అరణ్య లేదా వన పర్వం అని పేరు.

04. విరాట పర్వం

పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విరాట రాజు కొలువులో మారువేషాల్లో గడిపారు. ఈ పర్వం మొత్తం విరాట నగరంలోనే సాగుతుంది కాబట్టి ఈ పేరు వచ్చింది.

05. ఉద్యోగ పర్వం"

ఉద్యోగం" అంటే ఇక్కడ 'ప్రయత్నం' అని అర్థం. యుద్ధాన్ని నివారించడానికి రాయబారాలు పంపడం, యుద్ధానికి సన్నద్ధం కావడం వంటి యుద్ధ ప్రయత్నాలు (War efforts) ఇందులో ఉండటం వల్ల ఈ పేరు పెట్టారు.

06 -09. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలు

ఈ నాలుగు పర్వాలకు ఆయా సమయాల్లో కౌరవ సేనలకు నాయకత్వం వహించిన సేనాపతుల పేర్లు పెట్టారు.భీష్మ పర్వం: భీష్ముడు సేనాపతిగా ఉన్న 10 రోజుల యుద్ధం. (ఇందులోనే భగవద్గీత వస్తుంది).ద్రోణ పర్వం: ద్రోణాచార్యుడు సేనాపతిగా ఉన్న 5 రోజుల యుద్ధం.కర్ణ పర్వం: కర్ణుడు సేనాపతిగా ఉన్న 2 రోజుల యుద్ధం.శల్య పర్వం: శల్యుడు సేనాపతిగా ఉన్న చివరి రోజు యుద్ధం.

10. సౌప్తిక పర్వం

"సుప్తి" అంటే నిద్ర. నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని అశ్వత్థామ అర్ధరాత్రి పూట సంహరించిన ఘట్టం ఇందులో ఉండటం వల్ల దీనికి సౌప్తిక పర్వం అని పేరు.

11. స్త్రీ పర్వం

యుద్ధం ముగిసిన తర్వాత మరణించిన వీరుల భార్యలు, తల్లులు (గాంధారి, కుంతి మొదలైన స్త్రీలు) రణరంగానికి వచ్చి విలపించడం, వారి ఆవేదన చుట్టూ ఈ పర్వం తిరుగుతుంది.

12. శాంతి పర్వం

యుద్ధానంతరం చింతాక్రాంతుడైన ధర్మరాజుకు, భీష్ముడు అంపశయ్యపై నుండి రాజ్యధర్మాలు, మోక్షధర్మాలను బోధించి మనశ్శాంతిని కలిగించడం వల్ల దీనికి శాంతి పర్వం అని పేరు.

13. అనుశాసనిక పర్వం

"అనుశాసనం" అంటే ఉపదేశం లేదా శిక్షణ. భీష్ముడు ధర్మరాజుకు పరిపాలనా పరమైన నీతులను, ధర్మాలను వివరణాత్మకంగా బోధించిన పర్వం ఇది.

14. ఆశ్వమేధిక పర్వం

ధర్మరాజు తన పాప పరిహారార్థం, సామ్రాజ్య విస్తరణ కోసం అశ్వమేధ యాగం చేసిన వృత్తాంతం ఇందులో ప్రధానం.

15. ఆశ్రమవాస పర్వం

ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి రాజ్య సుఖాలను వదిలి ఆశ్రమ జీవితం గడపడానికి అడవులకు వెళ్లిన సందర్భం కాబట్టి ఈ పేరు.

16. మౌసల పర్వం

"ముసలం" అంటే రోకలి. యాదవ కులంలో పుట్టిన ఒక రోకలి కారణంగా యదువంశం మొత్తం అంతరించిన ఘట్టం ఇందులో ఉంటుంది.

17. మహాప్రస్థానిక పర్వం

పాండవులు తమ అవతారాన్ని చాలించి, ఉత్తర దిశగా చివరి ప్రయాణం (మహాప్రస్థానం) సాగించిన తీరును ఇందులో వర్ణించారు.

18. స్వర్గారోహణ పర్వం

ధర్మరాజు తన భౌతిక దేహంతో స్వర్గానికి వెళ్లడం, అక్కడ తన సోదరులను కలవడంతో భారతం ముగుస్తుంది. అందుకే దీనికి స్వర్గారోహణ పర్వం అని పేరు.

ఇలా ప్రతి పర్వం దానిలోని ప్రధాన ఇతివృత్తానికి అద్దం పట్టేలా నామకరణం చేయబడింది.

హితోపదేశము

  शुचिर्भव त्याजिते शौर्यं समानसुखदुःखता । 

दाक्षिण्यंचानुरक्तिश्च सत्यता च सुहृद्गुणाः।।  


పవిత్రత, త్యాగం, ధైర్యం, సుఖదుఃఖాలలో సమచిత్తత, దయ, ప్రేమ మరియు సత్యసంధత అనేవి మంచి మనసున్న వ్యక్తి యొక్క గుణాలు.


...హితోపదేశము.

అధిక మాసము

  *అధిక మాసము - వేదమూలము*

భూమి సూర్యుని ౘుట్టూ ఒక్కసారి తిరిగి వౘ్చుటకు పట్టునట్టి కాలము 365రోజుల 6గంటలు. ఈ యవధికి సౌరవత్సరమని సంజ్ఞ. చంద్రుఁడు భూమి ౘుట్టూ ఒకసారి తిరిగి వౘ్చుటకు పట్టే కాలము సుమారు 29.5 రోజులు. ఈ యవధికి మాసమని పేరు. 12×29.5 =354 రోజులకు చాంద్రమాన సంవత్సరము. సౌర, చాంద్రమానముల నడుమన 11రో.6గం. లో వ్యత్యాసమున్నది. ఋతువుల మితులను సంరక్షింౘుటకై రమారమి మూడేండ్లకొక యధికమాసమును చేర్చుకుని పంచాంగకర్తలైన సిద్ధాంతులు సౌర, చాంద్ర మానముల వ్యత్యాసమును సరిచేస్తుంటారు. ఈ యధికమాసమును గుఱించి అఋగ్వేదమున ప్రస్తావింపబడినది. అఋ.1-25-8. "వేదమాసో ధృతవ్రతో ద్వాదశః ప్రజావతః వేదాయ ఉపజాయతే" అని అధిక మాసము ఉపజాతమైనట్లు ప్రశంసింపబడినది. 

   శాస్త్ర విజ్ఞానమునకు నిర్దిష్టమైన కొలతలు అవసరము. 'మాన' శబ్దము కొలతకు సంకేతము. చంద్రునికి 'నెల'యను పేరు కూడా తెలుగునాట ప్రసిద్ధము. కొలతకు సంకేతమైన మాన (MON) నుంచి ఆంగ్లమున MONTH ఏర్పడినది. 


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

అరుంధతి నక్షత్ర జన్మ వృత్తాంతం.*

 *అరుంధతి నక్షత్ర జన్మ వృత్తాంతం.*

⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐


👉 అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.


అరుంధత్యననసూయా చ సావిత్రీ జానకీసతి

తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం


👉 అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది – ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.


👉 అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి


*అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా*

*నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా*


👉 అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే అయిదు బాణాలను ఇచ్చాడు. 


👉 మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా, ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, పరిస్థితిని చక్కదిద్దాడు.


👉 రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య , చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు.


👉 వశిష్టుడు ఆమెకు శివ మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు.


👉 ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, 'మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు అని అంతేగాక నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ'ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.


👉 సంస్కృత భాషలో 'అరుం' అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. 'ధతీ' అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె 'అరుంధతి' అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి, వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది.


👉 అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం అన్యోన్యనురాగాలతో సుఖమయమవుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు.


👉 మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు.


👉 రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.


👉 అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

*దోసె అవతారములు

  *దోసె అవతారములు*

(ఎవరు వ్రాసారో తెలియదు)


కం//

దోసెలముక్కలు గిన్నెన

పోసిన సాంబారునందు బుడబుడ తేలన్

చూసిన మీనము బోలెడి

దోసది 'మత్స్యావతార' తీరుర శ్యామా!


2 కం//

గర్మాగరమ్ము దోసెను

కూర్మాలోనంచుకొనుచు కూరిమి తినగన్

'కూర్మావతార' దోసని

ధర్మముగద దీనిఁ బిలువ ధరణిని శ్యామా!


3 కం//

కుడుమంత వెన్నముద్దను

మడచిన దోసందు నిల్పి మమకారముతో

పడకుండ నోట బెట్టిన

పుడమిని నిల్పిన 'వరాహ' మొప్పును శ్యామా!


4 కం//

గుంటూరు మిర్చి అల్లము

జంటగ కారంపుపొడిని చక్కగ జల్లన్

మంటలు రేగును నోటన

తింటే 'నరసింహ' దోస తిప్పలు శ్యామా!


5 కం//

కొద్దిగ మిగిలిన పిండిని

నొద్దికనొక చిన్నదోసె నోరిమి చేయన్

అద్దిర 'వామన' దోసన

ముద్దుగ పిల్లలకు ప్రీతి పుల్లెల శ్యామా!


6 కం//

చక్కగ చేతితొ దోసెను

ముక్కలుగా జేసి తినక స్పూనులు కత్తుల్

తక్కడు ఫోర్కులు వాడుట

తిక్కేగద 'పరశురామ' తీరున శ్యామా!


7 కం//

అల్లపుపచ్చడి మాత్రమె

చెల్లును దోసెకని యేకచెట్నీవ్రతమున్

ఎల్లప్పుడు పాటించిన

పిల్లా! యది 'రామ' దోసె పేర్కొన శ్యామా!


8 కం//

పుట్నాలల్లము వంటివి

చట్నీలొక యెనిమిదేసి చక్కగ దానిన్

'కిట్నుడి' దోసని పిలుతురు

పట్నమునొక హోటలందు భళిరా శ్యామ!

(కిట్నుడు is vernacular for కృష్ణుడు)


9 కం//

ఉప్పూ కారము వలదని

చప్పగ దోసెలను జేయ చచ్చును జిహ్వల్

చెప్పగ 'బుద్ధుని' దోసది

నప్పదు గద యట్లు తినుట నరులకు శ్యామా!


10 కం//

గుర్రపుదినుసులు జొన్నలు

కొర్రలతో దోసె చేసి కూరిమి తినగన్

హర్రీ కలియుగమున బల

మర్రా ఈ 'కల్కి' దోసె అవనిని శ్యామా!

(గుర్రపు దినుసులు = Horse Gram = ఉలవలు)

*3. రాజా విక్రమాదిత్యుడు మరియు శనీశ్వరుడు

 💐💐💐💐💐💐

**3. రాజా విక్రమాదిత్యుడు మరియు శనీశ్వరుడు**

💐💐💐💐💐💐


ఒకసారి గ్రహాల మహిమ గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రాజా విక్రమాదిత్యుడు శనీశ్వరుడికి సరైన గౌరవం ఇవ్వలేదని ఒక కథ చెబుతుంది. దాంతో శనీశ్వరుడు విక్రమాదిత్యునికి తన ప్రభావాన్ని అనుభవింపజేశాడు.


ఆ రాజు తన రాజ్యం, గౌరవం, సౌఖ్యాలు కోల్పోయి అనేక కష్టాలు అనుభవించాడు. కానీ అతను ధైర్యం, నిజాయితీ, సహనం కోల్పోలేదు.


చివరికి శనీశ్వరుడు ప్రత్యక్షమై, “కష్టాలలో కూడా నీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నీకు మళ్లీ గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయి” అని అనుగ్రహించాడని కథ చెబుతుంది.


**కథ భావం:**

శని కాలం వచ్చినప్పుడు మనిషి పరీక్షించబడతాడు. కానీ నిజాయితీ, సహనం, ధర్మం విడవకపోతే చివరికి మంచి ఫలితం వస్తుందని ఈ కథ చెబుతుంది.

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*906393956💐💐💐💐💐💐

**3. రాజా విక్రమాదిత్యుడు మరియు శనీశ్వరుడు**

💐💐💐💐💐💐


ఒకసారి గ్రహాల మహిమ గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రాజా విక్రమాదిత్యుడు శనీశ్వరుడికి సరైన గౌరవం ఇవ్వలేదని ఒక కథ చెబుతుంది. దాంతో శనీశ్వరుడు విక్రమాదిత్యునికి తన ప్రభావాన్ని అనుభవింపజేశాడు.


ఆ రాజు తన రాజ్యం, గౌరవం, సౌఖ్యాలు కోల్పోయి అనేక కష్టాలు అనుభవించాడు. కానీ అతను ధైర్యం, నిజాయితీ, సహనం కోల్పోలేదు.


చివరికి శనీశ్వరుడు ప్రత్యక్షమై, “కష్టాలలో కూడా నీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నీకు మళ్లీ గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయి” అని అనుగ్రహించాడని కథ చెబుతుంది.


**కథ భావం:**

శని కాలం వచ్చినప్పుడు మనిషి పరీక్షించబడతాడు. కానీ నిజాయితీ, సహనం, ధర్మం విడవకపోతే చివరికి మంచి ఫలితం వస్తుందని ఈ కథ చెబుతుంది.

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*9063939567*

💐💐💐💐💐💐7*

💐💐💐💐💐💐

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।



ప్రతిపదార్థ:



యది — ఒకవేళ; హి — నిజముగా; అహం — నేను; న — కాదు; వర్తేయం — ప్రవర్తించు; జాతు — ఎప్పటికీ; కర్మణి — విహిత కర్మలు ఆచరించటంలో; అతంద్రితః — జాగ్రత్తగా; మమ — నా యొక్క; వర్త్మ — దారిని; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — అందరు మనుష్యులు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సర్వశః — అన్ని విధములుగా.



తాత్పర్యము : 



నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థా, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు.

   


వివరణ:


భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకొంటూ, ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

16-05-2026 శనివారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

16-05-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  

---------------------------------------  


వృషభం


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


మిధునం


నూతన ఋణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

---------------------------------------


కన్య


ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.  

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


మకరం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


కుంభం


కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------

‘శని జయంతి

 **✨ అత్యంత అరుదైన ‘శని జయంతి’ & ‘శని అమావాస్య’ శుభాకాంక్షలు! ✨**

చరిత్రలో ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు! శని భగవంతుని జన్మదినమైన **శని జయంతి**, శని దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన **శనివారం** రోజే రావడం... దానితో పాటు **శని అమావాస్య** కూడా కలిసి రావడం ఒక మహా అద్భుతమైన యోగం. 🙏🌑

ఇలాంటి పవిత్రమైన రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకాలు, పూజలు చేసి, ఈ క్రింది మంత్రాన్ని జపిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి:

*“నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం”*

మన కర్మఫలాలను ఇచ్చే శని దేవుడు, ఈ రోజున ఆయనను భక్తితో కొలిచే వారిని కష్టకాలంలో ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి కాపాడతాడు. కాబట్టి ఈ అరుదైన రోజున అందరూ వీలైనంత వరకు పూజలు చేసుకుని, దానధర్మాలు చేసి, ఆ శ్రీ మహా శని మహాదేవుని కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను.

**శ్రీ మహా శని మహదేవాయ నమః!** 🕉️🙏

 *భూపతి లక్ష్మీ నవీన్* *కుమార్*