18, ఏప్రిల్ 2026, శనివారం

పురాణవైరాగ్యం

  పురాణవైరాగ్యం:


అది పరమపవిత్రమైన ''కాశీ'' క్షేత్రం.గంగా నది ఒడ్డున ఓ సత్రంలో డా..సర్వజ్ఞ గారి ప్రవచనం జోరుగా సాగుతోంది. . అందరూ ఆ మహేశ్వరుడి గురించి ఆయన చెపుతుంటే ఆనంద పారవశ్యంలో వింటున్నా రు.


వారిని చూసి మహేశ్వరుడి కి ఆనందం కలిగి పార్వతి తో చూశావా దేవి నాభక్తుల పారవశ్యం నేనంటే వారికి ఎంత ఇష్టమో! అనగానే అమ్మవారు నవ్వుతూ వారంతా భక్తులు గా నటిస్తున్న వారే కాని నిజమైన వారు కారు.కావాలంటే చూసుకోండి అంది అమ్మవారు.

అయితే చూడు పార్వతీ అన్నారు స్వామి. 


కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని సర్వజ్ఞ గారు చెబుతుంటే భక్తులంతా పారవశ్యంతో శివా మమ్మల్ని నీలో కలుపుకో మోక్షం ఇవ్వు మహేశ్వరా అనగానే టక్కున 

శివుడు ప్రత్యక్ష మయ్యాడు.


నా ప్రియ భక్తులారా మీ మొర ఆలకించా మోక్షం కావలసిన వారు

నాతో రావచ్చు రేపు ఇదే సమయానికి వస్తా సిద్ధంగా ఉండమని శివుడు అదృశ్యమైపోయాడు. 


మర్నాడు ప్రవచన సమయానికి శివుడు వచ్చాడు. ఆపాటికే భక్తులంతా సర్వజ్ఞ గారి తో సహా

అలహాబాద్ దాటిపోయారు.


కైలాసం చేరిన శివుడ్ని చూసి అమ్మవారు నవ్వింది ఎగతాళి గా

అప్పుడే అక్కడకు చేరుకున్న నారద

మునీంద్రుడు కి విషయం అర్దమయ్యింది.


అమ్మా జననీ ఇది మహేశ్వర లీల

ఆయనకి తెలియదా నిజ భక్తులు

ఎవ్వరో? పందెంలో నిన్ను గెలిపించాలనే స్వామి వారి లీల.


అది మానవనైజమైన పురాణ వైరాగ్యం.


మానవుడు ధర్మాచరణం చేస్తూ నిర్వహించే నిర్దేశిత కర్మమే మోక్ష సోపానం.


నారాయణ నారాయణ అంటూ ఆది దంపతుల దర్శనానందంతో వెనుతిరిగాడు నారదమునీంద్రుడు.


                            ***

జయంతి లక్ష్మీ నరసింహం

వైశాఖమాసమ్

 *వైశాఖమాసమ్/మాధవమాసమ్(18.04.26 నుండి 16.05.26)* 

వైశాఖమాసం అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన మాసం. దీనిని 'మాధవమాసం' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువుకు (మాధవుడు) అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఏప్రిల్-మే నెలల మధ్య వచ్చే ఈ మాసం ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు దాన ధర్మాల పరంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

 *వైశాఖమాసం/మాధవమాసం విశిష్టతలు:* 

 *మాధవ స్మరణ* - *విష్ణు పూజ* : వైశాఖమాసంలో శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శ్రేష్ఠం. ఈ మాసంలో తులసీ దళాలతో పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 *ప్రాతః స్నాన విశిష్టత* : ఈ మాసంలో సూర్యోదయానికి ముందే (ప్రాతఃకాలాన) నదులు, తీర్థాదులలో స్నానం చేయడం, మధుసూదనుని స్మరించడం వల్ల పాపాలు నశించి, దివ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

 *దాన ధర్మాలు (చలివేంద్రాలు):* ఎండలు మండిపోయే కాలం కావడంతో, వైశాఖంలో నీటి దానం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పళ్ళరసాలు, మజ్జిగ దానం చేయడం చాలా పుణ్యప్రదం. అలాగే, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు, మంచం, పరుపు దానం చేయడం వల్ల అఖండ మోక్ష సామ్రాజ్యం, ఆరోగ్య సిద్ధి లభిస్తాయని చెబుతారు.

 *ఆరోగ్య నియమాలు* : వైశాఖమాసంలో ఒంటిపూట భోజనం (ఏకభుక్తం) లేదా రాత్రిపూట మాత్రమే భోజనం (నక్తం) చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 *పవిత్రమైన దినాలు:* 

 *వైశాఖ పౌర్ణమి (బుద్ధ పూర్ణిమ):* విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

 *అక్షయ తృతీయ:* వైశాఖ శుద్ధ తదియ నాడు ఏ దానం చేసినా, ఏ జపం చేసినా అది అక్షయం (అక్షయం - తరగనిది) అవుతుంది.

 *నృసింహ జయంతి* : వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహస్వామి అవతరించారు.

 *శంకర జయంతి* : ఆదిశంకరాచార్యుల జన్మదినం వైశాఖ శుద్ధ పంచమి.

కలశ స్థాపన సమయంలో

 కలశ స్థాపన సమయంలో లేదా కొబ్బరికాయను కలశంపై ఉంచేటప్పుడు పఠించే ఈ శ్లోకం యొక్క అర్థం మరియు అంతరార్థం చాలా గొప్పవి

ఆ శ్లోకం ఏమిటంటే..


> **నారికేళ సముద్భూత త్రినేత్ర హర సమ్మితా |**

> **శిఖయా దురితం సర్వం పాప పీడాంచ మే నుద ||**



 * **నారికేళ సముద్భూత:** కొబ్బరి చెట్టు నుండి ఉద్భవించిన ఓ ఫలమా!

 * **త్రినేత్ర హర సమ్మితా:** మూడు కన్నులు కలిగి ఉండటం వల్ల (కొబ్బరికాయకు ఉండే మూడు కన్నులు), నువ్వు ముక్కంటి అయిన ఆ పరమశివునితో సమానమైనదానివి.

 * **శిఖయా:** నీపై ఉన్న పీచు (శిఖ/జుట్టు) ద్వారా...

 * **దురితం సర్వం:** నాలో ఉన్న సమస్త దుర్గుణాలను, కష్టాలను...

 * **పాప పీడాంచ మే నుద:** నా పాప ఫలాల వల్ల కలిగే పీడను తొలగించు (నుద - తొలగించు/నశింపజేయు).


శాస్త్రం ప్రకారం, కొబ్బరికాయ కేవలం ఒక ఫలం మాత్రమే కాదు. అది మనిషి అహంకారానికి చిహ్నం. పైన ఉన్న పీచు మన అజ్ఞానానికి, లోపల ఉన్న గట్టి పెంకు మన అహంకారానికి, లోపల ఉండే తెల్లని కొబ్బరి నిర్మలమైన మనసుకి సంకేతం.

కలశం మీద కొబ్బరికాయను ఉంచేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం: **"ఓ దైవ స్వరూపమా! శివునితో సమానమైన శక్తి కలిగిన ఈ ఫలం ద్వారా నా పాపాలను, కష్టాలను హరించి నాకు ప్రశాంతతను ప్రసాదించు"** అని వేడుకోవడం.

ఈ శ్లోకాన్ని పఠిస్తూ కలశాన్ని పూజించడం వల్ల ఆ కలశంలో దైవ శక్తి పరిపూర్ణంగా ఆవాహన అవుతుందని భక్తుల నమ్మకం. 


మండప దానంతో పాటు ఈ కలశ మీద కొబ్బరికాయ బ్రహ్మ గారికి చెందుతుంది. అయితే ఇంట్లో స్వయంగా పూజ చేసుకుంటే కొబ్బరికాయను  ప్రసాదంగా యజమాని తీసుకోవాలి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - రేవతి -‌‌ భృగు వాసరే* (17.04.2026)

https://youtube.com/watch?v=eEIcUKjd7KE&feature=shared

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఇదీ సంగతి

  ఇదీ సంగతి 


సుబ్బారావు దంపతులు కాకినాడలోని

బంధువుల ఇంటికి పెళ్ళి కి వెళ్ళి నాలుగు 

రోజులు తర్వాత తిరిగి ‌హైద్రాబాదు వచ్చారు.


తలుపులు తీద్దామనుకునేసరికి తాళంకప్ప 

పగిలి ఉంది.


ఆందోళన తో లోపలికి అడుగు పెట్టారు.

ఎక్కవస్తువులక్కడే ఉన్నాయి.బీరువాకూడా

క్షేమం గా ఉంది.ఏ వస్తువు పోలేదు.


హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దంపతులు.


పళ్ళు తోముకుని రండి కాఫీ పెడతానంది

భార్య.సుబ్బారావు పళ్ళు తోముకుని 

టీవీ ఆన్ చేశాడు.


ఇంతలో‌వంటింట్లోంచి భార్య‌ ఏవండీ 

అంటూ కెవ్వుకేక.


ఏమయిందే అంటూ పరుగెట్టాడు ‌సుబ్బారావు.

భార్య‌సంజ్జ్న‌ తో కిచిన్‌ గట్టు చూసీ నిర్ఘాంతపోయాడు.


కారణం


గేసుసిలెండరు మరియు స్పేరు సిలీండర్ 

ఎత్తుకు పోయారు దొంగలు.


అయ్యా! అదీ‌సంగతి.

                         ******

జయంతి లక్ష్మీ నరసింహం

18-04-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

18-04-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


వృషభం


మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు. కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------


సింహం


అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

---------------------------------------


కన్య


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


తుల


ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. 

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


మకరం


కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కుంభం


ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం

 

వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

---------------------------------------